Major Movie
-
'మేజర్' బ్యూటీ.. మైండ్ బ్లోయింగ్ పోజులు! (ఫోటోలు)
-
ఆ సమయంలో కన్నీళ్లను ఆపుకోలేక ఏడ్చేశా: అడివి శేష్
ఈ ఏడాది టాలీవుడ్ చిత్రాల్లో భారీ హిట్ చిత్రాల్లో యంగ్ హీరో అడివి శేష్ మూవీ 'మేజర్' ఒకటి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అడివి శేష్ మేజర్ సినిమాలోని క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నారు. బాలీవుడ్ సినిమా షూటింగ్ కోసం 'మేజర్' సెట్ తొలగించాలని చెప్పగానే చాలా బాధపడ్డానని చెప్పారు. అడివి శేష్ మాట్లాడుతూ.. 'మా సినిమా షూటింగ్ జరుగుతున్న స్టూడియోను ఓ బాలీవుడ్ చిత్రయూనిట్ బుక్ చేసుకుంది. మేజర్ సినిమాలో అగ్నిప్రమాదానికి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించడంతో నేను అస్వస్థతకు గురయ్యా. అందువల్ల షూటింగ్ కాస్త ఆలస్యమైంది. స్టూడియో వాళ్లు మా సెట్‌ను కూల్చేయడానికి రెడీ అయ్యారు. వాళ్లని కాస్త టైం ఇవ్వాలని అడిగినా ఒప్పుకోలేదు. క్లైమాక్స్‌లో దాదాపు ఎనిమిది సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. కేవలం 30 నిమిషాలు మాత్రమే టైం ఉంది. దీంతో ఏం చేయాలో అర్థం కాక ఏడ్చేశా.' అని అన్నారు. ఆ సమయంలో దర్శకుడు శశికిరణ్ నా దగ్గరకు వచ్చి ఇప్పుడు మీరు ఏ భావోద్వేగానికి లోనవుతున్నారో అదే కెమెరా ముందు చూపించమని సూచించారని తెలిపారు. రెండు కెమెరాలతో సన్నివేశాలను అనుకున్న సమయానికే పూర్తిచేశామని వెల్లడించారు. ఈ ఏడాది అడివి శేష్ నటించిన హిట్-2 సినిమా కూడా బాక్సాఫీసు వద్ద సక్సెస్ సాధించింది. -
'మేజర్' అరుదైన రికార్డు.. పాక్‌తో సహా 14 దేశాల్లో ట్రెండింగ్
Major Trends At Top 10 On Netflix Across 14 Countries: 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అడివి శేష్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అడివి శేష్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. అలాగే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో జులై 3 నుంచి స్ట్రీమింగ్ అవుతూ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా సత్తా చాటుతోంది. అడవి శేష్ నటన, యాక్షన్ సీక్వెన్స్, శశి కిరణ్ తిక్క దర్శకత్వం వివిధ దేశాల్లోని ప్రజలను ఆకట్టుకుంటోంది. 'మేజర్' చిత్రం ఒకటి, రెండు కాదు ఏకంగా 14 దేశాల్లో ట్రెండింగ్‌లో ఉంది. తెలుగు, హిందీ భాషలతోపాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉండగా.. బంగ్లాదేశ్, బహ్రెయిన్, కువైట్, మలేషియా, ఒమన్, మాల్దీవులు, పాకిస్థాన్, శ్రీలంక, యూఏఈ, ఖతార్, సింగపూర్ సహా 14 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్స్ టాప్-10లో నిలిచింది. ఇండియా, మారిషస్, నైజీరియాలో టాప్-1లో ఉన్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ విషయంపై హీరో అడవి శేష్ సంతోషం వ్యక్తం చేశాడు. 'నాకు చాలా సంతోషంగా ఉంది. సినిమాపై ఆడియెన్స్ చూపిస్తున్న ప్రేమకు రుణపడి ఉంటాను. నిజంగా మేము గర్వపడే సందర్భమిది. ఈ సినిమా ఎప్పటికీ ప్రత్యేకమే' అని తెలిపాడు. India's hero is being celebrated worldwide 💥💥#MajorTheFilm is trending in Top 10 films on @NetflixIndia across 14 countries ❤️🔥❤️🔥@AdiviSesh #SobhitaDhulipala @saieemmanjrekar @GMBents @urstrulyMahesh @AplusSMovies @SashiTikka @sonypicsindia pic.twitter.com/sKv0jQ3IGr — Major (@MajorTheFilm) July 14, 2022 -
పాకిస్తాన్లో చరిత్ర సృష్టించిన ‘మేజర్’
26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అడివి శేష్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అడివి శేష్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. (చదవండి: మేజర్ మూవీ రివ్యూ) తాజాగా ఈ చిత్రం ఓటీటీలోనూ రికార్డులను సృష్టిస్తోంది. జులై 3 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ ప్రేక్షకులు కూడా ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ టాప్ 1, 2 పొజిషన్లలో మేజర్ కొనసాగుతుంది. ‘మేజర్’ హిందీ వెర్షన్ టాప్ 1లో ట్రెండ్ అవుతుండగా, తెలుగు వెర్షన్ రెండో స్థానంలో ఉంది. (చదవండి: చిరంజీవి కీలక నిర్ణయం.. ఇక అక్కడ కూడా రికార్డులు బద్దలే!) ఇండియాలోనే కాకుండా పాకిస్తాన్లో కూడా ‘మేజర్’ చరిత్ర సృష్టిస్తున్నాడు. అక్కడ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన సినిమాల్లో మేజర్ మొదటి స్థానంలో ఉంది. బంగ్లాదేశ్, శ్రీలంకలో కూడా ఈ చిత్రం టాప్ 1లో ఉండడం గమనార్షం. మహేశ్‌బాబు జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఏస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ హీరోయిన్స్‌గా నటించగా, ప్రకాశ్ రాజ్, రేవతి ఇతర కీలక పాత్రలు పోషించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. #India #Pakistan #Bangladesh #SriLanka NUMBER 1 #MAJOR 🇮🇳❤️ pic.twitter.com/R1G6tIWPTG — Adivi Sesh (@AdiviSesh) July 8, 2022 -
ఓటీటీలో మేజర్, ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే?
యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మేజర్. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్నీకృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రం అడివి శేష్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. మేజర్ సందీప్ తల్లిదండ్రులుగా ప్రకాశ్ రాశ్, సీనియర్ నటి రేవతిలు కనిపించారు. శోభితా ధూళిపాళ, సయూ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. జూన్ 3న విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీలో రిలీజయ్యేందుకు రెడీ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 3 నుంచి మేజర్ అందుబాటులోకి రానుంది. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ప్రసారం కానుంది. ఈమేరకు అధికారిక ప్రకటన వెలువడింది. The untold story of a son. The untold story of a father. The untold story of a SOLDIER. 🇮🇳🪖 Major is coming to Netflix on 3rd July in Telugu, Hindi and Malayalam! #MajorOnNetflix pic.twitter.com/1ngxcOciuQ — Netflix India South (@Netflix_INSouth) June 30, 2022 చదవండి: మిస్ ఇండియా పోటీ నుంచి వైదొలిగిన శివానీ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్ వచ్చేసింది! -
మాట నిలబెట్టుకున్నాను: అడివి శేష్ ఆసక్తికర ట్వీట్
యంగ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం మేజర్ మూవీ సక్సెస్ జోష్‌లో ఉన్నాడు. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి రోజు నుంచే ఈ మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్నీకృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మేజర్ సందీప్ పాత్రలో అడివి శేష్ ఒదిగిపోయి ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించాడు. ఇక ఈ సినిమాపై సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు జల్లు కురిపించాడు. ఇక ఈ మూవీ విడుదలై నాలుగో వారంలోకి అడుగు పెట్టింది. చదవండి: ఫిలిం జర్నలిస్ట్‌తో స్టార్ డైరెక్టర్ నిశ్చితార్థం, ఫొటోలు వైరల్ ఇప్పటికీ మేజర్ చిత్రం థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా అడివి శేష్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘మేజర్ చిత్రాన్ని థియేటర్లోకి తీసుకువస్తానని కరోనా సంక్షోభంలో మాట ఇచ్చాను. నా మాట నిలబెట్టుకున్నాను కూడా. మేజర్ సినిమా రిలీజై ఇది నాలుగవ వారం. ఈ నాలుగో వారం కూడా మేజర్ థియేటర్లో సందడి చేస్తుంది’ అంటూ రాసుకొచ్చాడు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ బాలీవుడ్ సాయి ముంజ్రేకర్ నటించగా మేజర్ సందీప్ తల్లిదండ్రులుగా ప్రకాశ్ రాశ్, సీనియర్ నటి రేవతిలు కనిపించారు. ఇక శోభితా ధూలిపాళ్ల, మురళీ వర్మ, అనీస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. చదవండి: 7/G బృందావన్ కాలనీ హీరోయిన్‌తో ఎస్పీ చరణ్ పెళ్లా?, ఫొటో వైరల్ In the Pandemic, I promised #Major is a big screen experience. I kept my promise. FOURTH week in theaters ! Let’s do this 🇮🇳 #JaiHind #MajorTheFilm pic.twitter.com/9Wo0EZf1hO — Adivi Sesh (@AdiviSesh) June 24, 2022 -
‘మేజర్’ పై వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలు
26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అడివి శేష్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా చూసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మేజర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటూ కితాబిస్తున్నారు. (చదవండి: 'మేజర్' టీమ్‌కు వెండి నాణేన్ని బహుకరించిన సీఎం) తాజాగా ఈచిత్రంపై టీమిండియా మాజీ ఆటగాడు, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చైర్మన్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ‘ఇప్పుడే మేజర్ సినిమాను చూశాను. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు.. ఒక ఎమోషన్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ నిజమైన స్ఫూర్తిదాయకమైన కథ ఇది. మీకు బాగా నచ్చుతుంది. అడివి శేష్ అద్భుతంగా నటించి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. కచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది’అని లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. Just finished watching #Major and I have to say it's not just a film but an emotion. A really inspiring story of Major Sandeep Unnikrishnan that hits you right in the feels. Great job by @AdiviSesh to take it to another level. A must-watch! 👌🏻 pic.twitter.com/0nOxIwJCvL — VVS Laxman (@VVSLaxman281) June 21, 2022 -
‘మేజర్’ నుంచి ఎమోషనల్ వీడియో సాంగ్, ఆకట్టుకుంటున్న అమ్మ పాట
ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నీకృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. యంగ్ హీరో అడివి శేష్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా చూసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మేజర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటూ కితాబిస్తున్నారు. ఇక ఈ సినిమా చూస్తూ ప్రేక్షకులు ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకుంటున్నారు. చదవండి: పూజాకు నిర్మాతలు షాక్, ఆ బిల్లులు కట్టమని చేతులెత్తేశారట! మేజర్‌కు వస్తున్న విశేష స్పందనకు కానుకగా తాజాగా చిత్రం బృందం ఈ మూవీ నుంచి ఓ ఎమోషనల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘కన్నా కన్నా’ అంటూ సాగే ఈ పాటలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బాల్యం నుంచి సైన్యంలో చేరేందుకు బయలుదేరే పలు సన్నివేశాలను చూపించారు. ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. రామజోగయ్య శాస్త్రీ రచించిన ఈ పాటకు శ్రీ చరణ్ పాకాల స్వరాలు సమకుర్చగా.. ప్రముఖ గాయనీ చిత్ర ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట నెటిజన్లకు బాగా ఆకట్టుకుంటోంది. -
'మేజర్' టీమ్‌కు వెండి నాణేన్ని బహుకరించిన సీఎం
UP CM Yogi Adityanath Meets And Blesses Team Major: ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. యంగ్ హీరో అడివి శేష్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా చూసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మేజర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటూ కితాబిస్తున్నారు. తాజాగా ఇలాంటి గొప్ప సినిమాను రూపొందించినందుకు చిత్రబృందాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యా నాథ్ అభినందించారు. 'మేజర్' మంచి విజయం సాధించిన సందర్భంగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ తల్లిదండ్రులతోపాటు మూవీ యూనిట్‌ను కలిసి ప్రశంసించారు. తర్వాత సినిమాలో 10 నిమిషాలను సీఎంకు చూపించి పూర్తి చిత్రాన్ని వీక్షించాలని వారు కోరారు. చిత్ర విశేషాలను సుధీర్ఘంగా చర్చించిన తర్వాత మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ పేరును ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రయత్నిస్తాని సీఎం హామీ ఇచ్చారు. అనంతరం చిత్రబృందానికి, మేజర్ సందీప్ తల్లిదండ్రులకు శాలువ కప్పి, వెండి నాణేన్ని జ్ఞాపికగా బహుకరించారు. ఈ కార్యక్రమంలో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ తల్లిదండ్రులతోపాటు హీరో అడవి శేష్, నిర్మాత శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. (చదవండి: బుల్లితెర నటి ఆత్మహత్య.. అతడే కారణమని తండ్రి ఆరోపణ) ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అడవి శేష్ పంచుకున్నారు. కాగా ఇటీవల మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ ఫండ్‌కు సంబంధించిన విషయం గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో చిత్ర యూనిట్ సమావేశమైంది. దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే సీడీఎస్, ఎన్డీఏ ఆశావహులకు శిక్షణ కోసం ఉపయోగిస్తామని తెలిపింది. దీంతో దేశానికి సేవ చేయాలనే వారి కలలు సాకారం అవుతాయని చిత్రబృందం పేర్కొంది. చదవండి:కాపీ కొట్టి ఆ సినిమా తీశారు.. స్క్రీన్‌షాట్స్ వైరల్ స్టూడెంట్స్‌గా హీరోలు.. బాక్సాఫీస్ వద్ద పరీక్షలు View this post on Instagram A post shared by Sesh Adivi (@adivisesh) -
థియేటర్లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్
Sadha Cried In Theater While Watching Major Movie: 'జయం' సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్‌కు పరిచయం అయింది ముద్దుగుమ్మ సదా. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సొంతం చేసుకుని వెళ్లవయ్యా వెళ్లు అంటూ యూత్ హృదయాలను కొల్లగొట్టింది. తర్వాత దొంగ దొంగది, అవునన్నా కాదన్నా, అపరిచితుడు, ప్రియసఖి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సదా యూట్యూబ్, సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ థియేటర్లో కన్నీళ్లు పెట్టుకుంది. తన మనసుకు ఆ సినిమా ఎంతగానో చేరువైందని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకి ఆ సినిమా ఏంటంటే ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్‌గా తెరకెక్కిన 'మేజర్'. అడవి శేష్ హీరోగా నటించిన ఈ మూవీకి ప్రతి ఒక్కరు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. ఈ విధంగానే తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన సదా ఎమోషనల్ అయింది. ఫస్ట్ ఆఫ్‌లోనే భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక కంటతడి పెట్టుకుంది. ఉగ్రదాడి జరిగిన సమయంలో తను ముంబయిలోనే ఉన్నాని, ఇప్పుడు ఆ మూవీ చూస్తుంటే ఆనాటి రోజులు గుర్తుకువచ్చాయని తెలిపింది. అంతేకాకుండా కొన్ని సన్నివేశాల్లో రోమాలు నిక్కబొడుచుకున్నాయని పేర్కొంది. శశి కిరణ్ కథను తెరకెక్కించిన విధానం, అడవి శేష్ నటన అద్భుతంగా ఉన్నాయని ప్రశంసిచింది. View this post on Instagram A post shared by Major (@majorthefilm) -
ఆ హీరోలా ఎఫైర్స్ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్
Major Actor Adivi Sesh Reveals His Love In Latest Interview: ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నీకృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. యంగ్ హీరో అడవి శేష్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా చూసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మేజర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటూ కితాబిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు అడవి శేష్. ఈ క్రమంలోనే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి, ఎఫైర్స్ వంటి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు శేష్. 'పెళ్లి చేసుకోమంటూ ఇంట్లో అనట్లేదా' అని యాంకర్ అడిగిన ప్రశ్నకు 'పెళ్లి చేసుకోమంటూ ఇంట్లో ఒకే ఒత్తిడి ఉండేది. ఇప్పుడు అమ్మాయి అయితే చాలు అనే స్టేజ్‌కు వచ్చేసింది. పెళ్లి విషయం వచ్చిన ప్రతిసారి ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ వంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారని చెబుతుంటాను.' అని చెప్పాడు శేష్. తర్వాత 'మరి ఆయనకు లవ్ ఎఫైర్స్ ఉన్నాయి అలా ఉన్నాయా' అని అడిగిన ప్రశ్నకు 'ఆయనలా నాకు మాత్రం ఎవరితో ఎఫైర్స్ లేవు. అమెరికాలో ఉన్నప్పుడు ప్రేమలో కాస్త దెబ్బతిన్నా. నా పుట్టినరోజు నాడే ఆమెకు పెళ్లి అయింది.' అంటూ తదితర ఆసక్తికర విషయాలను అడవి శేష్ పంచుకున్నాడు. చదవండి: డేటింగ్ సైట్లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్‌లు సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. ఇంకా ఆ ఇంటర్వ్యూలో 'మా తెలుగు వాడు హిందీకి వెళ్లి సాధించాడని అంతా అంటుంటే చాలా గర్వంగా ఉంది. ఓవర్‌నైట్ సక్సెస్ రావడానికి పదేళ్లు పట్టింది. చిరంజీవి, మహేశ్‌బాబుకు అభిమానులు ఎలా ఉంటారో నేను మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్‌కు అభిమానిని. అక్కడ చెడుల ఉంది అంటే.. ఆ పరిసరాల్లో నేను కనిపించను. నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. నాకు ఏదైనా నచ్చిందంటే దానిని ఎక్కువగా చేసేందుకు ఇష్టపడతాను. తగిలించుకుంటే వదిలించుకోవడం కష్టం' అంటూ పేర్కొన్నాడు అడవి శేష్. చదవండి: బిజినెస్‌మేన్ కిడ్నాపర్‌గా మారితే.. ఆ వీధుల్లో ఫ్యామిలీతో మహేశ్ బాబు సెల్ఫీ.. 'రోజులో ఒకసారి' అంటూ పోస్ట్ -
పాఠశాలలకు ‘మేజర్’ మూవీ టీం స్పెషల్ ఆఫర్!
ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నీకృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. యంగ్ హీరో అడివి శేష్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా చూసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మేజర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటూ కితాబిస్తున్నారు. చదవండి: అదే విషయాన్ని ‘గాడ్సే’తో సీరియస్‌గా చెప్పే ప్రయత్నం చేశాం: డైరెక్టర్ ఇక ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి సైతం మేజర్ సినిమా మాత్రమే కాదని.. ఒక ఎమోషనల్ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మేజర్ చిత్ర బృందం పాఠశాలకు ఓ స్పెషల్ ఆఫర్ ఇచ్చింది. మేజర్ సందీప్ ఉన్నిఒకృష్ణన్ జీవితం గురించి ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాలనే ఉద్దేశంతో పాఠశాలల యాజమాన్యాలకు టీకెట్ ధరపై 50 శాతం రాయితి ఇస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. పాఠశాలల యాజమాన్యాల కోసం ప్రత్యేకంగా షో వేస్తామని, ఇందుకోసం majorscreening@gmail.comకి మెయిల్ చేసి అవకాశాన్ని పొందాలని మేజర్ టీం తెలిపింది. చదవండి: ఆ విషయంలో వెన్నెల.. నేనూ ఒకటే: సాయి పల్లవి ఇదిలా ఉంటే దీనిపై మేజర్ హీరో అడివి శేష్ తన ట్వీటర్లో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో అడివి శేష్ మాట్లాడుతూ.. ‘మేజర్ సినిమాను సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. చాలామంది చిన్నారులు నాకు ఫోన్ చేసి తాము కూడా మేజర్ సందీప్‌లా దేశం కోసం పోరాడతామని చెబుతున్నారు. చిన్నారుల నుంచి వస్తున్న స్పందన చూసి నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను వారి కోసం రాయితీపై ప్రదర్శించాలని నిర్ణయించాం. గ్రూప్ టికెట్లపై పాఠశాలలకు రాయితీ కల్పిస్తున్నాం. ‘మేజర్’ గురించి రేపటి తరానికి తెలియాలనేదే మా లక్ష్యం’ అని అడవి శేష్ అన్నారు. Team #MajorTheFilm 🇮🇳 has some exciting news for all the children and schools ❤️ Witness the Life of Major Sandeep Unnikrishnan on Big Screens with 50% discount on tickets 💥💥 School management can write to majorscreening@gmail.com and register yourself for the special show. pic.twitter.com/VOmKYhgZXd — GMB Entertainment - MajorTheFilm In CINEMAS NOW (@GMBents) June 14, 2022 -
'మేజర్' సినిమా మాత్రమే కాదు.. ఒక ఎమోషన్: చిరంజీవి
Chiranjeevi Appreciates Adivi Sesh Major Movie Team: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మేజర్'. అడివి శేష్, సాయి మంజ్రేకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు. అనురాగ్, శరత్ నిర్మించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు మంచి కలెక్షన్లతో పాటు ప్రశంసలు సైతం లభిస్తున్నాయి. మేజర్ మూవీ అద్భుతంగా తీశారంటూ చిత్రయూనిట్‌పై అభినందనల వర్షం కురిపిస్తున్నారు జనాలు. తాజాగా ఈ మూవీపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఈ సినిమాను చూసిన చిరంజీవి 'మేజర్' చిత్రబృందాన్ని సోషల్ మీడియా వేదికగా అభినందించారు. మేజర్ ఒక సినిమా మాత్రమే కాదు. అదొక నిజమైన ఎమోషన్. అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని హత్తుకునేలా సినిమాను తెరకెక్కించారు. తప్పకుండా చూడాల్సిన సినిమా. ఇలాంటి మూవీని మహేశ్‌బాబు నిర్మించినందుకు గర్వంగా ఉంది. చిత్రబృందానికి శుభాకాంక్షలు. అని ట్వీట్ చేశారు చిరంజీవి. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. మంచి సినిమాల గురించి చిరంజీవి ఎప్పుడూ మాట్లాడుతుంటారని, మేకర్స్‌ను ప్రోత్సహిస్తారని అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల 'విక్రమ్' మూవీ విజయం సందర్భంగా కమల్ హాసన్‌ను చిరంజీవి సత్కరించిన విషయం తెలిసిందే. చదవండి: కొడుకు ఫొటోను షేర్ చేసిన కాజల్.. ఈసారి ముఖం కనిపించేలా రెండేళ్ల తర్వాత తల్లిని కలుసుకున్న హీరోయిన్.. #Major is not a film.Its truly an Emotion Story of a great Hero & Martyr#MajorSandeepUnnikrishnan told in the most poignant way.A must-watch Proud of @urstrulyMahesh for backing such a purposeful film HeartyCongrats to @AdiviSesh @saieemmanjrekar #Sobhita @SashiTikka & Team pic.twitter.com/1lW1m3xmFO — Chiranjeevi Konidela (@KChiruTweets) June 13, 2022 -
మేజర్ సినిమాపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రశంసలు
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్. అడివి శేష్, సాయి మంజ్రేకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు. అనురాగ్, శరత్ నిర్మించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు మంచి కలెక్షన్లతో పాటు ప్రశంసలు సైతం లభిస్తున్నాయి. మేజర్ మూవీ అద్భుతంగా తీశారంటూ చిత్రయూనిట్‌పై అభినందనల వర్షం కురిపిస్తున్నారు జనాలు. తాజాగా మేజర్ యూనిట్ సభ్యులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను కలిశారు. ఈ సందర్భంగా సీఎం ఉద్ధవ్ ఠాక్రే మేజర్ సినిమాను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. మేజర్ ఒక మామూలు సినిమా కాదన్నారు. ఉగ్రదాడుల్లో ప్రజలను కాపాడేందుకు తన ప్రాణాన్ని అడ్డేసిన మేజర్ జీవిత కథను వెండితెరపై తెరకెక్కించిన విధానానికి చప్పట్లు కొట్టాల్సిందేనన్నారు. We will be showing the film to the entire family in the next few days. Was an absolute delight to meet Shri @AUThackeray as well. Thank you #MaheshManjrekar ji for being the bridge for our efforts :) @CMOMaharashtra #MajorTheFilm🇮🇳❤️ — Adivi Sesh (@AdiviSesh) June 13, 2022 చదవండి: మాజీ భర్త మోసం చేస్తే సల్మాన్ సాయం చేశాడు హీరోయిన్ సురభి ధరించిన లెహంగా ధరెంతో తెలుసా? -
పాన్ ఇండియా చిత్రాలకు ఎందుకన్ని వందల కోట్లు?: తమ్మారెడ్డి భరద్వాజ్
Tammareddy Bharadwaja Shocking Comments On Pan India Movies: అడివి శేష్ నటించిన మేజర్ మూవీపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ప్రశంసలు కురిపించాడు. మేజర్ సినిమా చూసిన ఆయన ఓ వీడియో విడుదల చేశాడు. ‘‘నిన్ననే మేజర్ సినిమా చూశాను. సినిమా చాలా బాగా తీశారు. నటీనటులందరూ చక్కగా నటించారు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. చిత్రబృందం మొత్తానికి నా అభినందనలు’ అని చెప్పుకొచ్చారు. అనంతరం పాన్ ఇండియా చిత్రాలపై స్పందించారు. ‘‘ఈ మధ్య మనం ఎక్కువగా పాన్ ఇండియా ప్రాజెక్ట్, పాన్ ఇండియా సినిమా అని చెబుతున్నాం. నిజంగా చెప్పాలంటే మేజర్ పాన్ ఇండియా కథ. అయితే కొంతమంది ‘మాది పాన్ ఇండియా ప్రాజెక్ట్. బడ్జెట్ భారీగా అయ్యింది, లాస్‌లు వస్తున్నాయి కాబట్టి మేము సినిమా టికెట్ రేట్లు పెంచుకునేలా అవకాశం కల్పించండి’ అని ముఖ్యమంత్రులను కోరారు. అలాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లకు మేజర్ సినిమా ఏమాత్రం తీసిపోదు. చదవండి: పక్షవాతం బారిన స్టార్ సింగర్.., లైవ్ వీడియో వైరల్ టెక్నికల్, క్వాలిటీపరంగా సినిమా చాలా బాగుంది. ఈ చిత్రాన్ని కేవలం రూ. 25 కోట్లలోపే పూర్తి చేశారు. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేసి మంచి విజయం సాధించారు. మరి మిగిలిన ప్రాజెక్ట్‌లకు ఎందుకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. మేజర్ లాంటి చిత్రానికి ఖర్చు అవ్వలేదు మీకు ఎందుకు అవుతుంది? నిర్మాతలు, హీరోలు ఆలోచించాలి. షూటింగ్ అని చెప్పి క్యారవాన్‌లో కూర్చుంటున్నారా? సినిమా చేస్తే ప్యాషన్‌తో చేయాలి. సమయాన్ని వేస్ట్ చేసి డబ్బులని వృథా చేస్తున్నారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. చదవండి: Vignesh Shivan-Nayanthara: ‘ఆ కంగారులో చూసుకోలేదు క్షమించండి’ -
మేజర్.. వారం రోజుల్లో ఎంత రాబట్టిందంటే?
ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాన్ని అడ్డేసిన హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన ఈ రియల్ హీరో జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్. యువ కథానాయకుడు అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకుడు. సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ హీరోయిన్స్‌గా నటించగా, ప్రకాశ్ రాజ్, రేవతి కీలక పాత్రలు పోషించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. అనురాగ్, శరత్ నిర్మించిన ఈ మూవీ జూన్ 3న విడుదలవగా సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. తొలి రోజే రూ.13.10 కోట్ల గ్రాస్ సాధించిన ఈ చిత్రం వారం రోజుల్లోనే రూ.50.7 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసిన అడివి శేష్.. ఇది తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అని రాసుకొచ్చాడు. తన గత సినిమాల కంటే మేజర్ మూడు రెట్లు ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిందని సంతోషం వ్యక్తం చేశాడు. Our film inspired by #MajorSandeepUnnikrishnan has touched so many hearts. #Major has become the biggest blockbuster of my career x 3. And the journey to touch more hearts has just begun ❤️🇮🇳#IndiaLovesMAJOR My gratitude to god, the audience, the team and my producers. pic.twitter.com/blsYrmBBvx — Adivi Sesh (@AdiviSesh) June 10, 2022 A heartfelt note penned by the colleague of the great man 'Major Sandeep Unnikrishnan' after watching #MajorTheFilm 🇮🇳#IndiaLovesMAJOR 🇮🇳❤️@AdiviSesh @SashiTikka @urstrulyMahesh @sonypicsfilmsin @AplusSMovies @ZeeMusicCompany pic.twitter.com/ljWmoKd5nu — GMB Entertainment - MajorTheFilm In CINEMAS NOW (@GMBents) June 10, 2022 చదవండి: కిన్నెరసాని రివ్యూ సీక్రెట్‌గా సింగర్ పెళ్లి, ఆపేందుకు ప్రయత్నించిన భర్త -
అవన్నీ మర్చిపోలేని జ్ఞాపకాలు: ‘మేజర్’ దర్శకుడు శశికిరణ్ తిక్క
‘‘మేజర్’కి తెలుగులో అద్భుతమైన ఆదరణ వస్తోంది. బాలీవుడ్‌లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. కమల్‌గారి ‘విక్రమ్, అక్షయ్ కుమార్ ‘సామ్రాట్ పృథ్విరాజ్’ చిత్రాలతో పోలిస్తే మాది చిన్న చిత్రం.. అయినా వాటితో పాటే ఆదరణ పొందడం హ్యాపీ. ‘మేజర్’కి వస్తున్న స్పందన ఎంతో సంతృప్తి ఇచ్చింది’అని అన్నారు దర్శకుడు శశికిరణ్ తిక్క. ఆయన దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్. అనురాగ్, శరత్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా శశికిరణ్ మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు.. ►మేజర్ సినిమా వాస్తవానికి 2020 లోనే విడుదల అవ్వాలి. 40 పర్సెంట్ షూటింగ్ కేవలం 3 నెలల్లో పూర్తి చేశాం. అదే వేగంతో చేసుకుంటూ వెళ్తే సినిమా వేగంగా ఫినిష్ అయ్యేది. ఇంతలో లాక్ డౌన్ వచ్చి పడటం వల్ల సినిమా ఆపేయాల్సి వచ్చింది. తిరిగి షూటింగ్ మొదలుపెట్టే టైమ్ కు ప్రకాష్ రాజ్, రేవతి వంటి పెద్ద ఆర్టిస్టుల డేట్స్ దొరకలేదు. డబ్బింగ్ సహా మొత్తం పనులన్నీ అలా స్ట్రగుల్ పడి కంప్లీట్ చేశాం. ►ఈ చిత్రాన్ని మేము నిజాయితీగా తెరకెక్కించాం. కమర్షియాలిటీ కోసం కావాలంటే పాటలు, ఫైట్స్ పెట్టొచ్చు. కానీ మేము ఎక్కడా ఆ లైన్ క్రాస్ కాలేదు. కథను ఎంత హుందాగా, సహజంగా తెరకెక్కించాలో అదే పద్ధతిలో రూపొందిస్తూ వెళ్లాం. ►నాకు పేరు కంటే సంతృప్తి, గొప్ప సినిమా చేశామనే సంతోషం ముఖ్యం. ‘మేజర్’తో ఆ రెండూ నాకు దక్కాయి. నాకే పేరు రావాలనుకోను. నా సినిమాకు మంచి పేరొస్తే నాకు వచ్చినట్లే. ‘మేజర్’ చిత్రాన్ని నిజాయితీగా తెరకెక్కించాం. ►మంచి సినిమా చేస్తామని మేజర్ సందీప్ తల్లిదండ్రులకు మేమిచ్చిన మాటను నిలబెట్టుకున్నామనే సంతోషం మిగిలింది. బాలీవుడ్ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా అప్రిసియేషన్స్ వస్తున్నాయి. అల్లు అర్జున్, రానా వంటి హీరోలు ఫోన్స్ చేసి సినిమా చాలా బాగా చేశారు అని మెచ్చుకుంటున్నారు. ఇవన్నీ నేను మర్చిపోలేని జ్ఞాపకాలు. మేజర్ సినిమా ప్రివ్యూ చూశాక సందీప్ వాళ్ల మదర్ నన్ను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. మేము ఎంత నిజాయితీగా పనిచేశామో ఆమె స్పందన ద్వారా తెలిసింది. ►ఇవాళ కొత్త దర్శకులకు ఇండస్ట్రీలో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. సినిమా మీద ప్యాషన్ ఉండి, ఏదైనా మంచి కథ ఉంటే ఓటీటీల నుంచి, ప్రొడక్షన్ హౌస్ ల నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. మీ దగ్గరకు అవకాశాలు రావు మీరే సృష్టించుకోవాలి. యంగ్ ఫిలింమేకర్స్ కు నేను ఇదే చెప్పాలనకుంటున్నా. మా టైమ్ లో ఇంత టెక్నాలజీ లేదు, ఓటీటీ వేదికలు లేవు, స్క్రిప్టు పట్టుకుని తిరగాల్సి వచ్చేది. ఇప్పటి వారికి ఎన్నో వేదికలు వస్తున్నాయి. ► ‘మేజర్’కు వచ్చిన పేరు, నాకు వచ్చిన గుర్తింపుతో ఇక నేను చేయబోయే సినిమాలు కూడా ఇంతే జాగ్రత్తగా చేయా లనుకుంటున్నాను. బ్రిటీష్ కాలపు నేపథ్యంతో ఓ సినిమా తీయాలని ఉంది. నా తర్వాతి సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్లో ఉంటుంది. నా వద్ద అసిస్టెంట్‌గా చేసిన ఒకర్ని ‘గూఢచారి 2’ ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నాం. అయితే ‘గూఢచారి’ ఫ్రాంచైజీలో ఓ సినిమాకు నేను దర్శకత్వం వహిస్తాను. (చదవండి: బిగ్‌బాస్ విన్నర్ సన్నీపై దాడి, పోలీసులకు ఫిర్యాదు) -
అలా అన్నందుకు సందీప్ తండ్రి చాలా సీరియస్ అయ్యారు : ‘మేజర్’ నిర్మాతలు
ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నీకృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అడివి శేష్ హీరోగా నటించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. మహేశ్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదలై ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులు, విమర్శకులు ఇండియన్ సినిమా చరిత్రలో 'మేజర్' చిత్రం ఒక మైలురాయని కితాబిచ్చారు. (చదవండి: సాయి పల్లవికి పెద్ద ఫ్యాన్‌ని: బాలీవుడ్ డైరెక్టర్) అయితే ఇది సందీప్ బయోపిక్ కాబట్టి.. ఆయన తల్లిదండ్రులు రాయల్టీ కింద డబ్బులు తీసుకొవచ్చని చాలా మంది అనుకుంటున్నారు. దీనిపై తాజాగా చిత్ర నిర్మాతలు అనురాగ్, శరత్ క్లారిటీ ఇచ్చారు. రాయల్టీ ఇస్తామని అంటే.. తన కొడుకు జీవితాన్ని వెలకట్టుకునే దీనస్థితిలో లేమని వారు చెప్పారన్నారు. ‘సాధారణంగా ఇలాంటి బయోపిక్‌లు తీస్తే..రాయల్టీ ఇవ్వాల్సి వస్తుంది. మేము కూడా సందీప్ పేరెంట్స్‌కు రాయల్టీ ఇస్తామని ముందుగానే చెప్పాం.అది వినగానే ‘గెటౌట్ ఫ్రమ్ మై హౌస్’ అంటూ సందీప్ తండ్రి మాపై ఫైర్ అయ్యారు. కొడుకు జీవితానికి వెలకట్టుకునే దీనస్థితిలో లేమని చెప్పారు. సందీప్ తల్లిదండ్రులు చాలా నిజాయితీ మనుషులు.సందీప్ చనిపోయాక..వచ్చిన ఎల్ఐసీ డబ్బులను కూడా వారు తీసుకోలేదు. సన్నిహితులకు ఆ డబ్బును పంచేశారు. అంత నిజాయితీపరులు వాళ్లు. అందుకే వారితో ఓ విషయం చెప్పాం. సైన్యంలో చేరాలనుకునే యువతకు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పౌండేషన్ ద్వారా సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం. అదే మేం సందీప్ తల్లిదండ్రుకు ఇచ్చే రాయల్టీ’అని నిర్మాతలు చెప్పుకొచ్చారు. -
మేజర్ తీసినందుకు గర్వంగా ఉంది: నిర్మాతలు అనురాగ్, శరత్
‘‘మేజర్’లాంటి గౌరవప్రదమైన సినిమా తీశాం. దేశమంతా మంచి పేరు వచి్చంది. ఈ సినిమాకు టైటిల్స్ చివర్లో పడతాయి. అప్పటివరకు ప్రేక్షకులు కూర్చొని ఉన్నారంటేనే సినిమా సక్సెస్ అయినట్లు లెక్క’’ అన్నారు నిర్మాతలు అనురాగ్, శరత్. అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన చిత్రం ‘మేజర్’. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్‌గా రూపొందిన ఈ సినిమా ఈ నెల 3న విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు అనురాగ్, శరత్ మాట్లాడుతూ– ‘‘మాకు ఛాయ్ బిస్కట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ అనే నిర్మాణ సంస్థలు ఉన్నాయి. ఫస్ట్ షో మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా 200 సినిమాలు మార్కెటింగ్ చేశాం. ‘మేజర్’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని అడివి శేష్ చెప్పాడు. నమ్రతగారికి కూడా ఈ కథ నచ్చడంతో మాతో భాగమయ్యారు. ‘మేజర్’ని తెలుగు, హిందీలోనే తీద్దామనుకున్నాం. కేరళలో ఉండే సందీప్ తల్లిదండ్రులను కలిశాక మలయాళంలోనూ డబ్ చేశాం. సందీప్ తల్లిదండ్రులకు రాయల్టీ ఇవ్వడానికి మేం రెడీగా ఉన్నా వారు తిరస్కరించారు. ఆర్మీలో చేరాలనుకున్నవారికి తగిన సపోర్ట్‌గా నిలిచేలా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఫౌండేషన్ అనే సోషల్ మీడియా వేదిక నెలకొల్పాలనుకున్నాం. అదే మేం వారి తల్లిదండ్రులకు ఇచ్చే రాయలీ్ట. ‘రైటర్ పద్మభూషణ్, మేం ఫేమస్’ సినిమాలు నిర్మించాం. తొట్టెంపూడి వేణు లీడ్ రోల్లో ఓ సినిమా, సూర్య అనే కొత్త కుర్రాడితో ఓ సినిమా చేస్తున్నాం’’ అన్నారు. -
అడివి శేష్ ‘మేజర్’ మూవీ చూసిన విజయ్ ఏమన్నాడంటే
Vijay Devarakonda Tweet On Adivi Sesh Major Movie: శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివిశేష్ హీరోగా నటించిన చిత్రం ‘మేజర్’. 26\ 11ముంబై దాడుదల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణణ్ జీవిత ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. మహేశ్‌బాబు జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఏస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ మూవీపై అల్లు అర్జున్ వంటి స్టార్స్ ప్రశంసలు గురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన మరో యంగ్ హీరో మేజర్ మూవీపై రివ్యూ ఇచ్చాడు. చదవండి: అర్జున్ కపూర్ బాడీ షేప్‌పై ట్రోల్స్, ఘాటుగా స్పందించిన లవ్‌బర్డ్స్ హైదరాబాద్‌లో ఈ చిత్రాన్ని చూసిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ మేజర్ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశాడు. ‘మేజర్ సందీప్ జీవితం ఆదర్శవంతం. దేశభక్తి విషయంలో ఆయనను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. నిజంగా ఇలాంటి వీర పుత్రుడిని కన్న మేజర్ సందీప్ తల్లిదండ్రులు గొప్పవారు. ఈ సినిమాలో చిత్ర బృందం ప్యాషన్, ప్రేమ, సిన్సియారిటీ కనిపించించాయి. హీరో అడివి శేష్ సహా టీమ్ మెంబర్స్ అందరికీ శుభాకాంక్షలు’ అంటూ విజయ్ రాసుకొచ్చాడు. కాగా విజయ్ ప్రస్తుతం జనగనమన, ఖుషి చిత్రాలతో బిజీగా ఉన్నాడు. దీనితో పాటు అతడు నటించిన పాన్ ఇండియా చిత్రం లైగర్ అగష్టులో విడుదలకు సిద్ధమవుతోంది. చదవండి: భారీ భద్రత నడుమ హైదరాబాద్‌లో ల్యాండయిన సల్మాన్ #MajorTheFilm A film filled with passion, love & sincerity. A man to look upto. A man we can all learn from. A true Idol. Definitely watch this one to know about our hero. Congratulations to the entire team! And my warmest respect and love to the parents of Major Sandeep! pic.twitter.com/1XWPAaJkbi — Vijay Deverakonda (@TheDeverakonda) June 7, 2022 -
అల్లు అర్జున్‌కి మహేశ్ బాబు థ్యాంక్స్.. చాలా హ్యాపీగా ఉందంటూ ట్వీట్
శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివిశేష్ హీరోగా నటించిన చిత్రం ‘మేజర్’. 26\ 11ముంబై దాడుదల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణణ్ జీవిత ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. మహేశ్‌బాబు జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఏస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. తాజాగా ఈ చిత్రంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. (చదవండి: ప్రతి భారతీయుడి మనసును తాకే గొప్ప సినిమా: అల్లు అర్జున్) ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకునేలా సినిమా ఉందని, మ్యాన్ ఆఫ్ ద షో అడివిశేష్ వెండితెరపై మరోసారి మ్యాజిక్ చేశాడంటూ ‘మేజర్’టీమ్‌కు అభినందనలు తెలిపారు. గుండెల్ని పిండేసే సినిమాను అందించిన నిర్మాత మహేశ్‌బాబుగారికి ప్రత్యేక గౌరవాభినందనలు. ప్రతి భారతీయుడి గుండెను తాకే గొప్ప సినిమా మేజర్' అంటూ బన్నీ ట్వీట్ చేశాడు. తాజాగా బన్నీ ట్వీట్‌పై మహేశ్ బాబు స్పందించాడు.అల్లు అర్జున్‌కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు. ‘థ్యాంక్స్ అల్లు అర్జున్. మీ మాటలు మేజర్ టీమ్‌కు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ‘మేజర్’ మూవీ మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’అని మహేశ్ ట్వీట్ చేశాడు.ప్రస్తుతం మహేశ్ బాబు ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. -
మేకింగ్ ఆఫ్ మూవీ - మేజర్
-
బాక్సాఫీస్‌పై ‘మేజర్’ అటాక్.. రెండు రోజుల్లోనే అన్ని కోట్లా?
విభిన్న చిత్రాలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్. హీరోగా చేసినవి తక్కువ సినిమాలే అయినా.. ఎక్కువ గుర్తింపును సంపాదించిపెట్టాయి. తాజాగా అడివి శేష్ హీరోగా నటించిన చిత్రం మేజర్. 26\11 ముంబై దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణణ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. మహేశ్‌బాబు జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఏస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన ఈ చిత్రం జూన్ 3న విడుదలైంది. తొలి రోజు నుంచి ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దూసుకెళ్తోంది. (చదవండి: మేజర్ మూవీ రివ్యూ) తొలి రోజు ఈ చిత్రం రూ.7.12 కోట్ల షేర్, 13.10 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించగా.. రెండో రోజు అంతకంటే ఎక్కువ వసూళ్లను రాబట్టి రికార్డు స్థాయిలో దూసుకెళ్తోంది. రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.24.5 కోట్ల గ్రాస్, రూ.13.48 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇది అడివి శేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్. ఈ చిత్రానికి నార్త్‌లో కలెక్షన్స్ రెండో రోజు 50 శాతం పెరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ ఈ చిత్రం వసూలు రెండో రోజు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. అమెరికాలో త్వరలోనే 1 మిలియన్ క్లబ్బులో చేరేందుకు సిద్ధంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి రూ.14.93 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే..రూ.15 కోట్ల షేర్ రాబట్టాలి. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈచిత్రంలో సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ హీరోయిన్స్‌గా నటించగా, ప్రకాశ్ రాజ్, రేవతి ఇతర కీలక పాత్రలు పోషించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. #Major sees a huge 50% jump in Hindi circuits today (Day 2), compared to yesterday (Day 1).. Good content always prevails.. 👌 @AdiviSesh — Ramesh Bala (@rameshlaus) June 4, 2022 -
అడవి శేష్ 'మేజర్' ప్రామిస్.. అలాంటి వారికి సపోర్ట్..
Adivi Sesh Major Promise To Those Who Wants To Join In Army: ‘‘ఎమోషనల్‌గా, కలెక్షన్స్ పరంగా ఇప్పటివరకూ నా సినిమాలన్నిటి కంటే ‘మేజర్’ ఐదు రెట్లు పెద్దది. ఈ సినిమా చూసిన చాలామంది ఫోర్స్‌లో జాయిన్ అవ్వాలని ఉందని మెసేజ్ పెడుతున్నారు. ఈ వేదికపై నేనొక మేజర్ ప్రామిస్ చేస్తున్నాను. సీడీఎస్, ఎన్డీఏలో చేరాలనుకుని సరైన వనరులు లేక కష్టపడుతున్నవారికి సపోర్ట్ చేయాలని మా టీమ్ నిర్ణయించింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరుతో ఈ మూమెంట్‌ని లాంచ్ చేస్తాం’’ అన్నారు అడివి శేష్. 26/11 ముంబై దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మేజర్’. సందీప్ పాత్రలో అడివి శేష్ నటించగా, శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. మహేశ్‌బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్ ఇండియా నిర్మించిన ఈ చిత్రం జూన్ 3న విడుదలైంది. ఈ నేపథ్యంలో శనివారం ‘ఇండియా లవ్స్ మేజర్’ ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. దర్శకుడు శశికిరణ్ మాట్లాడుతూ– ‘‘సందీప్ రియల్ హీరో అని తెలుసు కానీ ఈ సినిమాకి నన్ను డైరెక్టర్‌గా చేయమని శేష్ అన్నప్పుడు నేను పెద్దగా స్పందించలేదు. ఆ తర్వాత ఒక టీమ్‌ని ఏర్పాటు చేసుకుని, సందీప్ గురించి చాలా విషయాలు తెలుసుకుంటూ ఈ సినిమా చేశాం. శేష్‌కి స్పెషల్ థాంక్స్. అలాగే రచయిత అబ్బూరి రవిగారి సపోర్ట్‌ని మర్చిపోలేం’’ అని తెలిపారు. చదవండి: 'మేజర్'పై సందీప్ తండ్రి రియాక్షన్.. కన్నీళ్లు పెట్టుకున్న తల్లి ‘‘మా మొదటి సినిమా ‘మేజర్’ గొప్ప విజయాన్ని సాధించడం ఆనందంగా ఉంది. అడివి శేష్ మేజర్ సందీప్ కథ చెప్పడం, నమ్రత మేడమ్ గారిని కలవడం, తర్వాత సోనీ పిక్చర్స్ రావడం.. ఇలా యూనిట్ అంతా నమ్మకంగా పని చేశాం. ఆ నమ్మకమే ఇప్పుడు తెరపై అంత అద్భుతంగా కనిపిస్తోంది. ‘మేజర్’ లాంటి క్లాసిక్ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ప్రేక్షకులు ఒక ఎమోషనల్ లెవల్ దాటి మనసుతో స్పందిస్తున్నారు’’ అని నిర్మాతలు శరత్, అనురాగ్ పేర్కొన్నారు. చిత్రకథానాయిక సయీ మంజ్రేకర్, సినిమాటోగ్రాఫర్ వంశీ పచ్చిపులుసు, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల, నటుడు అనీష్ కురువిల్లా ‘మేజర్’ విజయం పట్ల తమ ఆనందం వ్యక్తం చేశారు. చదవండి: మేజర్ గుండెల్ని పిండేసే సినిమా: అల్లు అర్జున్ -
మేజర్ గుండెల్ని పిండేసే సినిమా: అల్లు అర్జున్
Allu Arjun about 'Major Movie': 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన ఆర్మీ అధికారి సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్. సందీప్ పాత్రలో యంగ్ హీరో అడివి శేష్ నటించాడు. సయూ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ కథానాయికలు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ మూవీని మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ మూవీతో కలిసి సోనీ పిక్చర్స్ ఫిలిం ఇండియా నిర్మించింది. జూన్ 3న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ లభించింది. తాజాగా ఈ సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించాడు. 'మేజర్ టీమ్‌కు శుభాకాంక్షలు. సినిమా మనసు హత్తుకునేలా ఉంది. మ్యాన్ ఆఫ్ ద షో అడివిశేష్ వెండితెరపై మరోసారి మ్యాజిక్ చేశాడు. ప్రకాశ్‌రాజ్, రేవతి, సయూ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ, ఇతర నటీనటులు ప్రతిభావంతంగా నటించారు. శ్రీచరణ్ పాకాల అందించిన బీజీఎమ్ అయితే మతి పోగొడుతోంది. డైరెక్టర్ శశికిరణ్ సినిమాను చాలా అద్భుతంగా, అందంగా మలిచాడు. గుండెల్ని పిండేసే సినిమాను అందించిన నిర్మాత మహేశ్‌బాబుగారికి ప్రత్యేక గౌరవాభినందనలు. ప్రతి భారతీయుడి గుండెను తాకే గొప్ప సినిమా మేజర్' అంటూ ట్వీట్ చేశాడు బన్నీ. దీనిపై అడివి శేష్ స్పందిస్తూ.. 'క్షణం నుంచి మేజర్ వరకు మీరు చూపించిన ప్రేమ, అందించిన సపోర్ట్‌కు కృతజ్ఞతలు. నా పుట్టినరోజు(డిసెంబర్ 17) పుష్ప గిఫ్టిచ్చారు. ఇప్పుడు మేజర్ విజయాన్ని మరింత అందంగా మలిచారు' అని రిప్లై ఇచ్చాడు. Big man! Thank you so much for “AA”LL the love ❤️From #Kshanam to #Major Your support, grace and kindness has been incredible. It means a lot to me personally. You gifted #Pushpa on my birthday (Dec 17) :) and now you have made the success of #Major even sweeter #MajorTheFilm https://t.co/5xVh8ZTooC — Adivi Sesh (@AdiviSesh) June 4, 2022 Excellent work by director @SashiTikka. Beautifully crafted . Big congratulations & my personal respect to the producer @urstrulyMahesh garu for giving the audience such a heartwarming experience & @AplusSMovies . Major : A story that touches every Indian heart. — Allu Arjun (@alluarjun) June 4, 2022 చదవండి: హోటల్లో పని చేశాను, అది తెలిసి చిరంజీవి బాధపడ్డాడు, అంతేకాదు.. ‘మేజర్’ తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే... -
‘మేజర్’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..
అడివి శేష్ హీరోగా,సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ హీరోయిన్స్‌గా శశి కిరణ్ తిక్క తెరకెక్కించిన చిత్రం ‘మేజర్’. 26\ 11ముంబై దాడుదల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణణ్ జీవిత ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. మహేశ్‌బాబు జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఏస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన ఈ చిత్రం జూన్ 3న విడుదలైంది. (చదవండి: మేజర్ మూవీ రివ్యూ) ఈ మూవీకి తొలి షో నుంచే పాజిటివ్ టాక్ లభించింది. అడివి శేష్ నటన, శశికిరణ్ టేకింగ్‌పై విమర్శకులు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దీంతో ఈ చిత్రం తొలిరోజు బాక్సాపీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 7.12 కోట్ల షేర్, 13.10 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణాలో మొత్తంగా రూ.4 కోట్లను వసూలు చేసింది. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.14.93 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే..రూ.15 కోట్ల షేర్ రాబట్టాలి. ‘మేజర్’ తొలిరోజు కలెక్షన్స్ ► నైజాం - రూ.1.75 కోట్లు ► సీడెడ్ - రూ.46 లక్షలు ► ఈస్ట్ - 24 లక్షలు ► వెస్ట్ - రూ.24 లక్షలు ► ఉత్తరాంధ్ర - రూ.51 లక్షలు ► గుంటూరు- 30 లక్షలు ► కృష్ణా - రూ.28లక్షలు ► నెల్లూరు - రూ.19లక్షలు ► కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- 0.35కోట్లు ►ఓవర్సీస్-2.35 కోట్లు ►మొత్తం- రూ.7.12 కోట్లు(రూ.13.10కోట్ల గ్రాస్) -
మేజర్ మూవీ పబ్లిక్ టాక్
-
'మేజర్'పై సందీప్ తండ్రి రియాక్షన్.. కన్నీళ్లు పెట్టుకున్న తల్లి
K Unni Krishnan About Major Movie And Sandeep Mother Get Emotional: 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్’. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ మూవీలో సందీప్ ఉన్ని కృష్ణన్ పాత్రలో యంగ్ హీరో అడవి శేష్ నటించిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాణంలో వచ్చిన ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అత్యంత భారీ అంచనాల మధ్య ఎట్టకేలకు జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది మేజర్. ఈ సినిమా చూసి రియల్ హీరో సందీప్ ఉన్ని కృష్ణన్ తండ్రి కె. ఉన్ని కృష్ణన్ తన అభిప్రాయం తెలిపారు. 'సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితాన్ని ప్రతిబింబించేలా చాలా బాగా చూపించారు. చాలా మంచి సినిమా తెరకెక్కించారు. చిత్రబృందానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నటీనటుల నటన, సినిమాటోగ్రఫీ, కెమెరా వర్క్ ఎంతో బాగుంది. మా దుఃఖాన్ని మరిచేలా చేసింది. ఒక మాట చెబుతాను. సందీప్ చనిపోయాడని చాలామంది అనుకుంటున్నారు. కానీ కాదు. అతని తుదిశ్వాస వరకు ప్రజల ప్రాణాల్ని కాపాడే ప్రయత్నం చేశాడు. అది ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. నా కెరీర్‌ను హైదరాబాద్‌లోనే ప్రారంభించాను. నేను సందీప్‌తో కలిసి హైదరాబాద్‌లో జీవించాను, అతనితో మంచి సమయం గడిపాను. ఇప్పుడు మై బాయ్స్‌తో ( సినిమా టీమ్) మంచి సమయం గడుపుతున్నాను. నేను హైదరాబాద్‌లో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. హైదరాబాద్‌కు మళ్లీ మళ్లీ వస్తాను.' అని సందీప్ తండ్రి కె. ఉన్ని కృష్ణన్ పేర్కొన్నారు. 'Sandeep has fought till his last breath & beyond. He continues to motivate all of us' Mr. Unnikrishnan at the special premieres in Hyderabad.#MajorTheFilm 🇮🇳@AdiviSesh @saieemmanjrekar #SobhitaD @SashiTikka @urstrulyMahesh @SonyPicsIndia @GMBents @AplusSMovies pic.twitter.com/GIuN5w4uFO — Major (@MajorTheFilm) June 3, 2022 మేజర్ సినిమా గురించి కే. ఉన్ని కృష్ణన్ తన అభిప్రాయాన్ని చెబుతున్న సమయంలో ఆ మాటలు విని సందీప్ తల్లి ధనలక్ష్మీ ఉన్ని కృష్ణన్ కన్నిటీపర్యంతమయ్యారు. కాగా సినిమా విడుదలకు ముందు రోజు సందీప్ తల్లిని అడవి శేష్ ఆత్మీయంగా ఆలీంగనం చేసుకున్నాడు. ఈ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. 'అంకుల్, అమ్మ మీ ఇద్దరి కోసం రేపు మేజర్ సినిమా విడుదల కాబోతుంది' అని రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Sesh Adivi (@adivisesh) -
Major Review: మేజర్ మూవీ రివ్యూ
టైటిల్ : మేజర్ నటీనటులు : అడివి శేష్, సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీ శర్మ, తదితరులు నిర్మాణ సంస్థలు: జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఏస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ నిర్మాత: మహేశ్‌బాబు, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర దర్శకుడు: శశి కిరణ్ తిక్క సంగీతం: శ్రీచరణ్ పాకాల సినిమాటోగ్రఫి: వంశీ పచ్చిపులుసు ఎడిటర్ : పవన్ కల్యాణ్ విడుదల తేది: జూన్ 3, 2022 క్షణం, గుడాచారి,ఎవరు వంటి చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు అడివి శేష్. హీరోగా చేసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రతీ మూవీ సూపర్ హిట్టే. తాజాగా ఈ యంగ్ హీరో నటించిన చిత్రం ‘మేజర్’. 26/11 రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా ఢిపరెంట్‌గా, గ్రాండ్‌గా చేయడంతో ‘మేజర్’పై అంచనాలు పెరిగాయి. పైపెచ్చు ఈ సినిమా నిర్మాణంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా పాలుపంచుకోవడంతో ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జూన్3) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మేజర్’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. సందీప్ ఉన్ని కృష్ణన్(అడివి శేష్).. ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి భారత సైన్యంలో పనిచేయాలనే తపనతో జీవిస్తుంటాడు. కానీ అతని తండ్రికి (ప్రకాశ్ రాజ్) కొడుకుని డాక్టర్ చేయాలని, తల్లికి (రేవతి) ఇంజినీరింగ్ చదివించాలని ఉంటుంది. చివరికి కొడుకు ఆశయాలకు, ఆలోచనకు వాళ్ల ఇష్టాన్ని చంపుకుంటారు. సోల్జర్ అవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్న సందీప్.. ఆ దిశగా కష్టపడి ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవుతాడు. స్కూల్ డేస్‌లో ఇష్టపడిన ఇషా(సయీ మంజ్రేకర్)ని పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆమెతో ఎక్కువ సమయం గడపలేకపోతాడు. దీంతో వీరిమధ్య విభేదాలు వస్తాయి. చివరకు విడాకుల వరకు వెళతారు. మరోవైపు ఇల్లు, కుటుంబం కంటే దేశమే ఎక్కువ అని భావించే సందీప్.. అంచెలంచెలుగా ఎదిగి భారత సైన్యంలో ముఖ్యమైన ఎన్ఎస్జీ (NSG) కమాండోలకు శిక్షణ ఇచ్చే స్థాయికి చేరుతాడు. ఓసారి తను ఇంటికి వెళ్లేందుకు పై అధికారి(మురళీ శర్మ) దగ్గర అనుమతి తీసుకొని బెంగళూరు బయలుదేరుతాడు సందీప్. అదే సమయంలో ముంబై తాజ్ హోటల్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడతారు. ఆ సమయంలో తన ప్రయాణాన్ని రద్దు చేసుకొని ‘51 ఎస్ఎస్ జీ’ బృందంతో కలిసి ముంబైకి వెళతాడు. తాజ్ హోటల్లో దాగి ఉన్న ఉగ్రవాదులను సందీప్ ఎలా మట్టుపెట్టాడు? హోటల్లో బందీగా ఉన్న సామాన్య ప్రజలను ఎలా కాపాడాడు? ప్రజల ప్రాణాలను రక్షించేందుకు తన ప్రాణాలను ఎలా పణంగా పెట్టాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. బయోపిక్ మూవీ అంటే.. దర్శకుడికి రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. కచ్చితంగా ఉన్నది ఉన్నట్లు చూపిస్తే.. అది డాక్యుమెంటరీ అవుతుంది. లేదా చొరవ తీసుకొని కమర్షియల్ హంగులను జోడిస్తే.. మొదటికే మోసం వస్తుంది. కథతో పాటు అందులోని ఆత్మనూ తీసుకుని తెరకెక్కిస్తే.. ఆ చిత్రాలను ప్రేక్షకులను ఆదరిస్తారు. ఈ విషయంలో దర్శకుడు శశి కిరణ్ తిక్క సఫలమయ్యాడు. 26/11 ఉగ్రదాడిలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ గురించి తెలియని విషయాలను భారతీయ ప్రేక్షకులకు తెరపై చూపించాడు. ముంబై దాడుల్లో మేజర్ ఉన్ని కృష్ణ ఎలా వీరమరణం పొందారో అందరికి తెలుసు. కానీ ఆయన ఎలా జీవించాడో ఈ సినిమాలో చూపించారు. ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి? బాల్యం ఎలా సాగింది? తల్లిదండ్రులపై ఆయనకు ఉన్న ప్రేమ, యవ్వనంలో ఉన్న లవ్‌స్టోరీ.. ప్రాణాలకు తెగించి ఉగ్రమూకలను మట్టుబెట్టడం.. ప్రతీదీ కళ్లకు కట్టినట్లు చూపించారు. ఫస్టాఫ్ అంతా ఆయన బాల్యం, లవ్‌స్టోరీతో పాటు దేశం పట్ల ఆయనకు ఉన్న ప్రేమను, ఆర్మీలో చేరిన తర్వాత ఉన్నత స్థాయికి ఎదగడానికి పడిన కష్టాన్ని చూపించారు. ఆర్మీలో చేరుతా అని సందీప్ అన్నప్పుడు.. ‘నీకేమైనా అయితే ఎలా?’ అని తల్లి అడిగితే..‘ప్రతి అమ్మ ఇలానే అనుకుంటే...?’అని సందీప్ చెప్పిన డైలాగ్ ఆందరికి ఆకట్టుకుంది. ఇషాతో ప్రేమాయణం చాలా రొమాంటిక్‌గా సాగుతుంది. ఇక ఆర్మీలో చేరిన తర్వా త ‘సోల్జర్’అంటే ఏంటి అని పై అధికారి అడిగినప్పుడు.. సందీప్ చెప్పే సమాధానం ప్రేక్షకుడిలో ఉద్వేగాన్ని కలిగిస్తాయి. అలాగే ట్రైనింగ్ సమయంలో సందీప్‌తో పాటు మిగిలిన జవాన్లు పడే కష్టాలను కూడా తెరపై కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు. ఇవన్నీ చూస్తున్నా.. ముంబై దాడిలో ఉగ్రవాదులను ఉన్ని కృష్ణ ఎలా మట్టుపెట్టాడు? దాన్ని తెరపై ఎలా చూపించారు? అనేదే ప్రేక్షకుడికి ఆసక్తికరమైన అంశం. తాజ్ హోటల్‌పై ఉగ్రదాడితో ఫస్టాఫ్కి బ్రేక్ ఇచ్చాడు. ఇక సెకండాఫ్‌లో మొత్తం 26\11 ఉగ్రదాడినే చూపించాడు. తాజ్ హోటల్లో ఉగ్రవాదులు చేసిన అరాచకాలు.. వారిని మట్టుపెట్టేందుకు మేజర్ ఉన్నికృష్ణన్ పన్నిన వ్యూహాలు.. ప్రాణాలకు తెగించి సామాన్య ప్రజలను కాపాడిన తీరు.. ప్రతీదీ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. మీడియా వల్ల జరిగిన నష్టం ఏంటో ధైర్యంగా తెరపై చూపించారు. అలాగే అదే మీడియాను మభ్యపెట్టి, ఉగ్రవాదులను ఎలా మట్టుపెట్టిన తీరును కూడా అద్భుతంగా చూపించారు. హోటల్లో దాగి ఉన్న సాధారణ యువతి ప్రమోదరెడ్డి( శోభిత ధూళిపాళ), ఓ చిన్న పిల్లను కాపాడడం కోసం పడిన పాట్లు ఆకట్టుకుంటాయి. ఇక చివరి 20 నిమిషాలు మాత్రం ప్రేక్షకులు కుర్చీలకు అతుక్కుని కూర్చునే ఉత్కంఠను కల్పించారు. ప్రాణాలు పోతాయని తెలిసినా.. సందీప్ ఒక్కడే ఉగ్రవాదులు ఉన్న చోటుకు వెళ్లడం.. అక్కడ వారితో జరిపిన వార్... ఒంటినిండా బుల్లెట్లు, కత్తిపోట్లు ఉన్నా.. చివరి క్షణం వరకు దేశరక్షణ కోసమే పాటుపడడం.. క్లైమాక్స్‌లో ప్రకాశ్ రాజ్ స్పీచ్.. ప్రేక్షకులను కంటతడిపెట్టిస్తాయి. మొత్తంగా ‘మేజర్’ అందరూ చూడాల్సిన సినిమా. ఎవరెలా చేశారంటే.. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ పాత్రలో అడివి శేష్ నటించడం కంటే జీవించాడు అనే చెప్పాలి. ఆ పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. ఎమోషన్స్ పలికిస్తూనే.. హీరోయిజాన్ని తెరపై ఆవిష్కరించాడు. నిజమైన సైనికుడి మాదిరి తన శరీరాన్ని మార్చుకున్నాడు. ఈ పాత్ర కోసం శేష్ పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. ఇక పేరెంట్స్ ప్రేమను నోచుకొని ఉన్నత కుటుంబానికి చెందిన ఇషా పాత్రలో సయీ మంజ్రేకర్ ఒదిగిపోయింది. శెష్, సయీల రొమాంటిక్ తెరపై వర్కౌట్ అయింది. ఇక సందీప్ తండ్రిగా ప్రకాశ్ రాజ్ అద్భుతంగా నటించాడు. ఆయన చెప్పే డైలాగ్స్ కంటతడి పెట్టిస్తాయి. హీరో తల్లిగా రేవతి మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించారు. హోటల్లో చిక్కుకున్న హైదరాబాద్ యువతి ప్రమోదారెడ్డిగా శోభిత ధూళిపాళ మంచి నటనను కనబరిచింది. ముఖ్యంగా చిన్న పిల్లను కాపాడడం కోసం ఆమె చేసిన ప్రయత్నాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో కీలకమైన పాత్రల్లో ఆమెది కూడా ఒక్కటి. ఇక మేజర్ సందీప్ పై అధికారిగా మురళీ శర్మతో మిగిలన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధానమైన బలం శ్రీచరణ్ పాకాల సంగీతం. తనదైన నేపథ్య సంగీతంతో సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ఫైట్ సీన్స్‌కి తనదైన బీజీఎంతో గూస్ బంప్స్ తెప్పించాడు. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. పవన్ కల్యాణ్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
అడివి శేష్ అందంగా ఓ గిఫ్ట్ ప్యాక్ చేసిచ్చారు: హీరోయిన్
హీరో అడివి శేష్ నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 'మేజర్'. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేశ్‌బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా 'మేజర్' చిత్ర కథానాయిక సయీ మంజ్రేకర్ మీడియాతో ముచ్చటించారు. సయీ పంచుకున్న మేజర్ చిత్ర విశేషాలివి.. 'మేజర్' చిత్రంలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? మేజర్ చిత్రంలో ఇషా పాత్రలో కనిపిస్తా. మేజర్ సందీప్‌కు చిన్ననాటి ప్రేమికురాలిగా, అలాగే సందీప్ భార్యగా కనిపిస్తా. చిన్ననాటి సన్నివేశాల్లో చాలా ప్యూరిటీ వుంటుంది. ఒక సాధారణ కుర్రాడు అసాధారణ పనులు ఎలా చేశారనేది మేజర్‌లో చూస్తారు. నాది నార్త్ ఇండియన్ అమ్మాయి పాత్ర. ఫస్ట్ డే షూటింగ్ లో చాలా కంగారు పడ్డా. తెలుగు సరిగ్గా అర్ధమేయ్యేది కాదు. అయితే ఫస్ట్ షెడ్యుల్ పూర్తయిన తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎంతలా అంటే మేజర్ లో నా పాత్రకి తెలుగు డబ్బింగ్ కూడా నేనే చెప్పా. సూపర్ స్టార్ మహేశ్‌బాబు సినిమాలో చేయడం ఎలా అనిపించింది ? మహేశ్‌బాబు గారి నిర్మాణంలో చేయడం చాలా ఆనందంగా వుంది. ఇప్పటివరకు మూడు సినిమాలు చేశాను. సల్మాన్ ఖాన్, అల్లు బాబీ, ఇప్పుడు మహేశ్‌బాబు గారి నిర్మాణంలో చేశాను. కెరీర్ బిగినింగ్ లోనే పెద్ద నిర్మాణ సంస్థలలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నా. మేజర్ సందీప్ తల్లిదండ్రులని కలిశారా? తాజ్‌లో జరిగిన మేజర్ సందీప్ స్మారక కార్యక్రమంలో ఒకసారి వారి పేరెంట్స్‌ను కలిశాను. దీని తర్వాత రెండు రోజుల క్రితం బెంగళూర్‌లో జరిగిన మేజర్ ప్రివ్యూలో మళ్ళీ వారిని కలిశాను. చాలా గొప్ప వ్యక్తులు. మేజర్ సందీప్ తల్లి గారిని చూస్తే నా మదర్‌ను చూసినట్లే అనిపించింది. గొప్ప ప్రేమ, ఆప్యాయత వున్న వ్యక్తులు. మేజర్ చూసిన తర్వాత మేజర్ సందీప్ తల్లితండ్రుల నుండి ఎలాంటి స్పందన వచ్చింది? మేజర్ సినిమా గురించి మేజర్ సందీప్ కజిన్ ఒకరు ఇన్‌స్టాగ్రామ్‌లో స్టొరీ పోస్ట్ చేశారు. అందులో నా పనితీరు సందీప్ తల్లి ధనలక్ష్మీ గారికి చాలా నచ్చిందని మెచ్చుకున్నారు. చాలా ఆనందంగా అనిపించింది. నా పనితీరు వారికి నచ్చింది. ఇంతకంటే ఏం కోరుకోను. కథ ప్రకారం మీరు సందీప్ కి ప్రపోజ్ చేస్తారా? సందీప్ మీకు ప్రపోజ్ చేస్తారా ? ఇద్దరూ( నవ్వుతూ) చాలా క్యూట్ అండ్ స్వీట్ లవ్ స్టొరీ అది. మేజర్ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు? నమ్రత మేడమ్ గారు మా పేరెంట్స్ కి తెలుసు. నమ్రత గారు కాల్ చేసి మేజర్ లో రోల్ గురించి అమ్మకి చెప్పారు. మా నాన్నగారు ఈ సినిమా ఎలా అయినా నువ్వు చేయాలని చెప్పారు. తర్వాత శేష్ గారిని కలిశాం. ఆయన కథ చెప్పినపుడు మా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. సినిమా చూసినప్పుడు దాని కంటే పది రెట్ల ఎమోషనల్ అయ్యాం. మేజర్ ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన చిత్రం. మేజర్ సినిమాలో మీకు నచ్చిన పాత్ర? మేజర్ సందీప్ రియల్ హీరో. ఆయన పాత్ర అందరికీ నచ్చుతుంది. మేజర్ సందీప్ తల్లి పాత్ర చేసిన రేవతి గారికి నేను ఫిదా అయిపోయాను. రేవతి గారు అద్భుతంగా చేశారు. 'మేజర్' సినిమాకి మేజర్ సందీప్ ఆత్మలాంటి వారైతే మేజర్ తల్లి ధనలక్ష్మీ పాత్ర పోషించిన రేవతి గారు సందీప్‌కి ఆత్మలాంటి పాత్ర. చాలా గొప్పగా ఉంటుంది. అడివి శేష్ గారితో పని చేయడం ఎలా అనిపించింది ? అడవి శేష్ గారు గ్రేట్ డెడికేషన్ పర్సన్. అన్ని విషయాల్లో సహాయం చేస్తారు. ఎన్ని ప్రశ్నలు అడిగినా ఎలాంటి విసుగు లేకుండా చాలా కూల్ గా సమాధానం ఇస్తుంటారు. చాలా మంచి విషయాలు చెబుతుంటారు. ఆయన ప్రాంక్ లు కూడా చేస్తారు ( నవ్వుతూ) నాకు బల్లులు అంటే భయం. చాలా అందంగా ఒక గిఫ్ట్ ని ప్యాక్ చేసి ఇచ్చారు. ఓపెన్ చేస్తే అందులో రెండు బల్లులు వున్నాయి( నవ్వుతూ). దర్శకుడు శశి కిరణ్ తిక్కా తో పని చేయడం ఎలా అనిపించింది ? శశి గారు చాలా కూల్‌గా వుంటారు. ఆయన విజన్ చాలా క్లియర్ వుంటుంది. మేజర్ జరుగుతున్నపుడే శశిగారి ఫాదర్ చనిపోయారు. అయినా ఆయన ఎంతో ధైర్యంగా సెట్స్‌కు వచ్చారు. శశి చాలా అద్భుతమైన డైరెక్టర్. ఆయనతో పని చేయడం చాలా ఆనందంగా వుంది. మీ పాత్ర తెలుగులో డబ్బింగ్ చెప్పారు కదా.. తెరపై చూసినప్పుడు ఎలా అనిపించింది ? తెలుగు వెర్షన్ వైజాగ్ లో చూశా. అసలు డబ్బింగ్ చెప్పింది నేనేనా అని నమ్మలేకపోయా. చాలా రోజుల క్రితమే డబ్బింగ్ పూర్తి చేశాను. మాట పలకడం, డిక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని చెప్పాను. ఒక్కసారిగా తెరపై చూసేసరికి చాలా సర్ప్రైజ్ అనిపించింది. చాలా చక్కగా వచ్చింది. చిత్ర యూనిట్ తో పాటు మా పేరెంట్స్, ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఇకపై డబ్బింగ్ చెప్పడానికే ప్రయత్నిస్తా. తెలుగులో రెండు సినిమాలు చేశారు కదా.. తెలుగు పరిశ్రమ ఎలా అనిపించింది ? తెలుగు చిత్రపరిశ్రమ చాలా గొప్పది. ఇక్కడ అంతా చాలా ఆప్యాయంగా వుంటారు. అందరూ డెడికేట్ గా వర్క్ చేస్తారు. చాలా కష్టపడతారు. హైదరాబాద్ కల్చర్ నాకు చాలా నచ్చింది. మీ కొత్త సినిమాలు ? కొన్ని కథలు విన్నాను. హిందీలో ఓ సినిమా చేస్తున్నా. త్వరలోనే సెట్స్ పైకి వెళుతుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయాలని ఉంది. చదవండి: కేకే పడిపోయిన వెంటనే సీపీఆర్ చేసుంటే బతికేవారు: డాక్టర్ బన్నీతో అక్షయ్ సినిమా? నిజంగా హింటిచ్చాడా! లేక మామూలుగానే.. -
‘మేజర్’ చూసి వాళ్లు హ్యాపీగా ఫీలయ్యారు :శశికిరణ్ తిక్క
‘‘ఏ దర్శకుడైనా తన సినిమాను ఎక్కువమంది ప్రేక్షకులు చూడాలనే ఆశపడతాడు. భాషాపరమైన హద్దులను బ్రేక్ చేసే కథను మన దేశంలో ఎవరూ తీసినా అది ఇండియన్ సినిమాయే. అయితే కొన్నిసార్లు ఇది ఆ సినిమాను నిర్మించే నిర్మాతపై కూడా ఆధారపడి ఉంటుంది’’ అన్నారు దర్శకుడు శశికిరణ్ తిక్క. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మేజర్’. అడివి శేష్ టైటిల్ రోల్ చేశారు. మహేశ్‌బాబు జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఏస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు శశికిరణ్ తిక్క చెప్పిన విశేషాలు. ► ‘మేజర్’ కంటెంట్‌కు దర్శకుడిగా నేనైతే న్యాయం చేయగలనని శేష్ అడిగారు. దీంతో సందీప్‌గారి గురించి పరిశోధన చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు సందీప్‌గారి క్యారెక్టర్ బాగా నచ్చింది. ఆయన మంచి మానవతావాది అని కూడా తెలుసుకున్నాను. సందీప్‌లాంటి వ్యక్తి గురించి అందరికీ తెలియాలని ‘మేజర్’ చేయడానికి అంగీకరించాను. ► అడివి శేష్ మంచి యాక్టర్ మాత్రమే కాదు. రైటర్, దర్శకుడు కూడా. అయితే ‘మేజర్’ సినిమా విషయంలో ఎవరి క్రాఫ్ట్స్ వాళ్లం చూసుకున్నాం. ‘మేజర్’ బడ్జెట్ పెరిగింది. చాలెంజ్ అంతకంటే పెరిగింది.‘మేజర్’లో సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాం. ముఖ్యంగా మేం యాక్షన్‌లో కాస్త లిబర్టీ తీసుకున్నాం. ►‘మా దగ్గర్నుంచి ‘మేజర్’ టీమ్ చాలా సమాచారాన్ని తీసుకున్నారు. వీరు ఏం చేస్తున్నారు’ అనే సందేహం సందీప్‌గారి తల్లిదండ్రులకు వచ్చి ఉండొచ్చు. సో.. వారిని మెప్పించడం అనేది మాకు ఓ అగ్నిపరీక్ష. బెంగళూరులో సందీప్‌గారి అమ్మ నాన్నలకు సినిమా చూపించాం. వారు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ► నా దగ్గర రెండు కథలు ఉన్నాయి. నా నెక్ట్స్ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఉంటుంది. పూర్తి వివరాలను త్వరలోనే చెబుతాను. -
అప్పటి హిట్ టైటిల్.. ఇప్పుడు రిపీట్..
ఒక సినిమాకి కథ ఎంత ముఖ్యమో టైటిల్ కూడా అంతే ముఖ్యం. పేరు ఎంత క్యాచీగా ఉంటే ప్రేక్షకుల దృష్టిని అంతగా ఆకట్టుకుంటుంది. అందుకే ఒక్కొక్కసారి హిట్ అయిన పాత సినిమాల పేర్లను టైటిల్‌గా పెడుతుంటారు. అఫ్కోర్స్ కథకు తగ్గట్టుగా ఉందా అని కూడా చూస్తారనుకోండి. ఇంకో విషయం ఏంటంటే.. ఇలా పాత సినిమాల టైటిల్స్ వాడాలంటే ఆ సినిమా విడుదలై ఐదేళ్లయినా అయ్యుండాలి లేదా ఆ నిర్మాత అనుమతి ఇస్తే పెట్టుకోవచ్చు. ప్రస్తుతం తెలుగులో 5 టైటిల్స్ రిపీట్ అయ్యాయి. పాత చిత్రాల హిట్ టైటిల్స్‌తో రూపొందుతున్న తాజా చిత్రాలపై ఓ లుక్కేద్దాం.. అప్పుడు రొమాంటిక్.. ఇప్పుడు యాక్షన్ 'విక్రమ్' నాగార్జున హీరోగా పరిచయమైన తొలి చిత్రం ‘విక్రమ్’. వి. మధుసూదన్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నాగేశ్వరరావు పెద్ద కుమారుడు అక్కినేని వెంకట్ నిర్మించారు. రొమాంటిక్ యాక్షన్‌గా రూపొందిన ఈ సినిమా 1986లో విడుదలై మంచి విజయం సాధించింది. ఆ సినిమా విడుదలైన 36 ఏళ్లకు మరోసారి ‘విక్రమ్’ పేరు తెరపైకి వస్తోంది. కమల్‌హాసన్ హీరోగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘విక్రమ్’. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలు చేసిన ఈ చిత్రంలో హీరో సూర్య అతిథిగా చేశారు. అప్పటి ‘విక్రమ్’ రొమాంటిక్ యాక్షన్ అయితే ఈ ‘విక్రమ్’ యాక్షన్ థ్రిల్లర్. తెలుగు, తమిళంలో ఈ నెల 3న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ 'మేజర్' వేరు రవిచంద్రన్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన కన్నడ చిత్రం ‘సిపాయి’. ఇందులో సౌందర్య కథానాయికగా నటించగా హీరో చిరంజీవి ముఖ్య పాత్ర చే శారు. 1996లో విడుదలై కన్నడంలో మంచి విజయం సాధించిన ఈ సినిమాని 1998లో ‘మేజర్’ పేరుతో తెలుగులో డబ్ చేసి, విడుదల చేశారు. ఈ చిత్రంలో మేజర్ చంద్రకాంత్ పాత్రను చిరంజీవి చేశారు. ఇది రొమాంటిక్, యాక్షన్ ఓరియంటెడ్ మూవీ అయితే అడివి శేష్ హీరోగా నటించిన తాజా ‘మేజర్’ కథ వేరు. ఇది బయోపిక్. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంతో ఈ సినిమా రూపొందింది. తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొం దిన ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమ 'ఖుషి' ‘నువ్వు గుడుంబా సత్తి అయితే నేను సిద్ధు.. సిద్ధార్థ్ రాయ్’ అంటూ ‘ఖుషి’లో పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. ఎస్.జె. సూర్య దర్శకత్వంలో పవన్ కల్యాణ్, భూమిక జంటగా నటించిన ఈ చిత్రం 2001లో విడుదలైంది. లవ్, కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందింది. తాజాగా విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి ‘ఖుషి’ టైటిల్‌ని అనౌన్స్ చేశారు. ఆ ‘ఖుషి’లానే ఈ ‘ఖుషి’ కూడా లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ ఏడాది డిసెంబర్ 23న విడదల కానుంది. చారిత్రక 'కంచుకోట' ఎన్టీఆర్, కాంతారావు హీరోలుగా, సావిత్రి, దేవిక హీరోయిన్లుగా నటించిన జానపద చిత్రం ‘కంచుకోట’. సీఎస్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1967లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ‘కంచుకోట’ పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. మదన్ హీరోగా, ఆశ, దివ్య హీరోయిన్లు. ప్రతాని రామకృష్ణ గౌడ్ ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఎమ్.ఏ చౌదరి, వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హిస్టారికల్ నేపథ్యంలో ఉంటుంది. రివెంజ్ 'రుద్రవీణ' చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘రుద్రవీణ’. కె.బాలచందర్ దర్శకత్వంలో 1988లో విడుదలైన ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. అప్పటివరకూ మాస్ యాక్షన్ రోల్స్ చేస్తూ వచ్చిన చిరంజీవి ఈ చిత్రంలో అందుకు భిన్నంగా కనిపించారు. కాగా ‘రుద్రవీణ’ పేరుతో తాజాగా ఓ సినిమా రూపొందింది. శ్రీరామ్ నిమ్మల హీరోగా, ఎల్సా, శుభశ్రీ హీరోయిన్లుగా మధుసూదన్ రెడ్డి దర్శకత్వం వహించారు. రివెంజ్ డ్రామాతో వస్తున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. -
ఈవారం అలరించే సినిమాలు, సిరీస్‌లు ఇవే..
Upcoming Theater OTT Movies Web Series In June 1st Week 2022: థియేటర్ల వద్ద సినిమాల సందడి కొనసాగుతూనే ఉంది. బాలకృష్ణ 'అఖండ'తో మొదలైన మూవీ పండుగ మే 27న విడుదలైన 'ఎఫ్ 3' (F3)తో కంటిన్యూ అవుతోంది. ఈ నెలలో 'సర్కారు వారి పాట', 'ఎఫ్3' విజయంగా దూసుకుపోతున్నాయి. ప్రతి వారం ఓ కొత్త సినిమా ప్రేక్షకులను కచ్చితంగా పలకిస్తుండంగా.. జూన్ మొదటి వారంలో అలరించే సినిమాలు, సిరీస్‌లు ఏంటో లుక్కేద్దామా ! 1. మేజర్ డిఫరెంట్ కథలు, సినిమాలతో అలరించే అడవి శేష్ మేజర్ మూవీతో సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. 36/11 ఉగ్రదాడుల్లో ప్రజల ప్రాణాలు కాపాడి అమరుడైన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 9 ప్రధాన నగరాల్లో ప్రివ్యూలు వేసిన విషయం తెలిసిందే. 2. విక్రమ్ ముగ్గురు విలక్షణ నటులందరు కలిసి ఉర్రూతలూగించేందుకు వస్తుంది 'విక్రమ్'. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలుగా నటిస్తున్న ఈ సినిమాలో సూర్య అతిథిగా మెరవబోతున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన 'విక్రమ్' జూన్ 3న తమిళ, తెలుగు భాషల్లో సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. 3. పృథ్వీరాజ్ బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రాజ్‌పుత్ యోధుడు పృథ్వీరాజ్ చౌహాన్ వీరగాథ ఆధారంగా రూపొందిన చిత్రం 'పృథ్వీరాజ్'. ఇందులో 2017 మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్గా నటించింది. చంద్రప్రకాష్ ద్వివేది తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతోపాటు పలు దక్షిణాది భాషల్లో రిలీజవనుంది. ఓటీటీలో వచ్చే సినిమాలు, సిరీస్‌లు ఇవే.. 1. 9 అవర్స్ (వెబ్ సిరీస్)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జూన్ 2 2. జనగణమన (మలయాళం)- నెట్‌ఫ్లిక్స్, జూన్ 2 3. అశోకవనంలో అర్జున కల్యాణం- ఆహా, జూన్ 3 4. ది పర్ఫెక్ట్ మదర్ (వెబ్ సిరీస్)- నెట్‌ఫ్లిక్స్, జూన్ 3 5. సర్వైవింగ్ సమ్మర్ (వెబ్ సిరీస్)- నెట్‌ఫ్లిక్స్, జూన్ 3 6. ది బాయ్స్ (వెబ్ సిరీస్)- అమెజాన్ ప్రైమ్ వీడియో, జూన్ 3 7. ఆశ్రమ్ (హిందీ వెబ్ సిరీస్-సీజన్ 3)- ఎంఎక్స్ ప్లేయర్, జూన్ 3 8. బెల్ఫాస్ట్ (హాలీవుడ్)- బుక్ మై షో, జూన్ 3 చదవండి: రీల్స్‌తో 3 కోట్లు గెలవాలనుకుని చివరికీ ఏమయ్యారు.. -
సినిమా టికెట్ల కోసం క్యూలో మహేశ్ బాబు.. వీడియో వైరల్
Mahesh Babu Waits For Major Tickets In Queue With Adivi Sesh Niharika NM: యంగ్ హీరో అడివి శేష్ తాజాగా నటించిన చిత్రం మేజర్. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్’. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాను పది రోజుల ముందుగానే దేశవ్యాప్తంగా ఉన్న (హైదరాబాద్ ఏఎమ్‌బీ సహా) 9 ప్రధాన నగరాల్లో మేజర్ ప్రివ్యూ ప్రదర్శించనున్న సంగతి తెలిసిందే. మే 24 నుంచి రోజులో సెంటర్లో మేజర్ మూవీ ప్రివ్యూలను ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌ను డిఫరెంట్‌గా నిర్వహిస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా మేజర్ సినిమా టికెట్స్ కోసం మహేశ్ బాబు క్యూలో నిలబడి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమాకు నిర్మాత అయిన మహేశ్ బాబు, ప్రముఖ యూట్యూబర్ నిహారిక ఎన్ఎమ్తో కలిసి వినూత్నంగా ఓ వీడియోను రూపొందించారు. ఇందులో అడవి శేష్ కూడా పాల్గొన్నాడు. ఈ వీడియోలో ''ఇది మేజర్ సినిమా లైనేనా అని టికెట్ కౌంటర్ వద్ద నిలబడి ఉన్న వ్యక్తిని అడుగుతుంది నిహారిక. అతను అవును అనేసరికి క్యూలో నిలుచుంటుంది. తర్వాత వచ్చిన వారంతా ఆమె కుంటే ముందు నిలబడుతుంటారు. అలా అడవి శేష్ కూడా వచ్చి తన ముందు నిలుచుండేసరికి అతనితో గొడవపడుతుంది. తర్వాత క్యూ లైన్లోకి వచ్చిన మహేశ్ బాబును చూసి ఆశ్చర్యపోతుంది. అనంతరం మహేశ్ బాబు వెనక్కి తిరిగి తన ఫ్రెండ్స్‌ను కూడా పిలవచ్చా అని నిహారికను అడుగుతాడు. ఆమె ఓకే అంటుంది. అప్పుడే మహేశ్ బాబు ఫోన్ నెంబర్ అడుగుతుంది. అంతలోనే మహేశ్ బాబు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.'' ఫన్నీగా సాగిన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చదవండి:👇 'సర్కారు వారి పాట'పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్.. ఆంటీ అవసరమా.. కూతురు పెళ్లయ్యేదాకా ఇవి తగ్గించుకో.. సురేఖ వాణిపై ట్రోలింగ్ Queues are so much fun with @AdiviSesh and @urstrulyMahesh 🙂#MajorTheFilm #MajorOnJune3rd #Adivisesh #MaheshBabu𓃵 pic.twitter.com/lsUk0tRs9F — Niharika Nm (@JustNiharikaNm) May 29, 2022 -
‘ఆ సంఘటనలు గురించి చెబితే నమ్మరేమోనని సినిమాలో పెట్టలేదు’
యంగ్ హీరో అడివి శేష్ తాజాగా నటించిన చిత్రం మేజర్. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ రూపొందింది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లో భాగంగా హీరో అడివి శేస్ దేశమంతా పర్యటిస్తున్నాడు. తాజాగా తెలుగు మీడియాకు ఇచ్చిన ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో మేజర్ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం చెప్పాడు.ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. మేజర్ సందీప్ గురించి ఎవరికీ తెలియని ఓ సంఘటనని షేర్ చేసుకున్నాడు. చదవండి: మంచు లక్ష్మిపై ట్రోల్స్.. స్మగ్లర్ అంటూ కామెంట్స్ ‘మేజర్ మూవీ కోసం ఆయన గురించి చాలా లోతుగా తెలుసుకుంటుండగా సందీప్‌కు సంబంధించి ఎన్నో ఓ షాకింగ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. కార్గిల్ వార్‌లో ఆయన భజానికి దెబ్బ తగిలింది.. అంత బాధలో కూడా ఆయన ఓ వ్యక్తిని గాయపడిన భుజంపైనే ఎత్తుకుని మంచులో 10 కిలోమిటర్లు నడిచారు. ఇది మాత్రమే కాదు ఓసారి ఇండియన్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుని తిరిగి ట్రైన్లో ఇంటికి వెళుతుండగా సందీప్ ఫ్రెండ్ కూడా అతనితో ఉన్నారు. తను అస్సాం వెళుతున్నాడు. సందీప్ బెంగుళూరు వెళ్లాలి. ఆ సమయంలో ఆయన ఫ్రెండ్ నా దగ్గర డబ్బులు లేవు అని అడగడంతో తన జేబులో ఉన్న మొత్తం డబ్బులు ఇచ్చేశారు సందీప్’ అని చెప్పాడు. చదవండి: తల్లి ఓ స్టార్ నటి, తండ్రి ఓ స్టార్ ఆటగాడు.. కూతురు ఏమో ఇలా.. ‘ఆ తర్వాత సందీప్ బెంగుళూరు వచ్చేవరకు ప్రయాణంలో ఏమీ తినలేదు. తాగలేదు. మిలటరీకి చెందిన వ్యక్తి కాబట్టి ఎవరినీ ఏమీ అడగకూడదు అనే రూల్ ఉంటుంది. ఆయనకు సంబంధి ఇలా ఎన్నో కదిలిచించే సంఘటనలు ఉన్నాయి. కానీ అందరు ఇవి నమ్ముతారో లేదో, భజన అనుకుంటారని ఇలాంటి ఇన్సిడెంట్స్ను సినిమాల్లో పెట్టలేదు’ అని అడివి శేష్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ సినిమాను మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇందులో అడవి శేష్ జోడిగా సయూ మంజ్రేకర్ నటించగా.. శోభితా ధూళిపాళ్ల, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. -
‘మేజర్’ విషయంలో అదే మాకు పెద్ద సవాల్ : అడివి శేష్
‘‘ఆల్ ఇండియా పర్సన్ మేజర్ సందీప్‌గారి బయోపిక్ చేశాను కాబట్టి నా కెరీర్ కూడా ఆ స్థాయికి వెళ్లిందని భావిస్తున్నాను. సందీప్‌గారు కేరళలో పుట్టి, బెంగళూరులో పెరిగారు. హైదరాబాద్ కంటోన్మెంట్లో కెప్టెన్.. కార్గిల్, కశ్మీర్లో పోరాడారు. హర్యానాలో ట్రైనింగ్ ఆఫీసర్.. ముంబైలో వందల మందిని కాపాడారు. అందుకే ‘మేజర్’ ఆల్ ఇండియా సినిమా’’ అన్నారు అడివి శేష్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మేజర్’. సందీప్‌గా అడివి శేష్ నటించారు. మహేశ్‌బాబు జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, ఎ ఫ్లస్ ఎస్ మూవీస్‌లతో కలిసి సోనీ పిక్చర్స్ ఫిలింస్ ఇండియా నిర్మించింది. శశికిరణ్ తిక్క దర్శకుడు. జూన్ 3న ఈ చిత్రం రిలీజ్ కానున్న సందర్భంగా అడివి శేష్ చెప్పిన విశేషాలు. ముంబైలో 26/11 దాడులు జరిగాయి. ఆ తర్వాతి రోజు 27న సందీప్‌గారి ఫోటో టీవీలో కనిపించింది. ఎవరీయన? మా కజిన్ పవన్ అన్నయ్యలా ఉన్నారే అనుకున్నాను. ఆ తర్వాత సందీప్‌గారి గురించి తెలుసుకోవడం ప్రారంభించాను. ఈ క్రమంలో ఆయనకు అభిమానిగా మారిపోయాను. యాక్టర్‌గా నాకంటూ ఓ గుర్తింపు వచ్చిన తర్వాత సందీప్‌గారి జీవితం గురించి నేను ఎందుకు చెప్పకూడదనే ఫీలింగ్ నాలో మొదలైంది. ‘క్షణం’ టైమ్‌లో బాగా ఆలోచించాను. ‘గూఢచారి’ టైమ్‌లో వేడి వచ్చింది. ‘ఎవరు’ సినిమా అప్పుడు సందీప్‌గారి బయోపిక్ చేయాలని నిర్ణయించుకున్నాను. మనకు గాంధీ, భగత్ సింగ్గార్ల గురించి తెలుసు. ఇప్పుడు సందీప్‌గారి జీవితం గురించి పాఠ్యాంశాల్లో కూడా బోధిస్తున్నారు. అదే మాకు సవాల్ సందీప్‌గారి జీవితాన్ని ఓ బయోపిక్‌గా రెండున్నర గంటల్లో చెప్పడం కష్టమే. అయితే కశ్మీర్, కార్గిల్ యుద్ధం, ముంబై తాజ్ ఇన్సిడెంట్, ఆయన బెంగళూరు స్కూల్ డేస్.. ఇలాంటి అన్ని ముఖ్యమైన సీన్స్ సినిమాలో ఉంటాయి. ఓ సందర్భంలో తన స్నేహితుడికి తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసి రెండు రోజుల పాటు సందీప్‌గారు ఏమీ తినకుండా ఉండిపోయారు. ఇలాంటి సినిమాటిక్ అంశాలు ఆయన జీవితంలో ఉన్నాయి. ఇంకా సందీప్‌గారి లైఫ్‌లో మ్యాజికల్ మూమెంట్స్ ఉన్నాయి. సందీప్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు బాలీవుడ్, మాలీవుడ్ ఫిల్మ్‌మేకర్స్ సందీప్ బయోపిక్ తీయడానికి ప్రయత్నించారు. అయితే ఫలానా హీరోలు మా కొడుకులా లేరు అని సందీప్‌గారి తల్లిదండ్రులు ఒప్పుకోలేదట. మేం అప్రోచ్ అయినప్పుడు నాలోని నిజాయితీ, వారి కొడుకు పోలికలకు దగ్గరగా నావి ఉండటంతో ఒప్పుకున్నారు. ‘మేజర్’ సినిమాకు ఓ ఇంటర్నేషనల్ లుక్ ఇచ్చి నా కెరీర్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకుని వెళ్లాడు డైరెక్టర్ శశి. శ్రీచరణ్ పాకాల ఇంటర్నేషనల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ప్రస్తుతం ‘హిట్ 2’, ‘గూఢచారి’ సినిమాలు చేస్తున్నాను. అంతా మహేశ్‌గారి సపోర్ట్ వల్లే.. మేం ముందడుగు వేయాలనుకున్న ప్రతిసారీ మహేశ్‌బాబుగారు మమ్మల్ని ప్రోత్సహించారు. ఇప్పుడు దర్జాగా దేశవ్యాప్తంగా ప్రీమియర్స్ వేస్తున్నాం. ఆడియన్స్‌కు సినిమా చూపించి, ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం మనం ఎక్కడా చూడలేదు. ఇది మహేశ్‌గారి సపోర్టే వల్లే. ప్రొడక్షన్ పరంగా నమ్రతగారు కూడా హెల్ప్ చేశారు. -
మేజర్ మూవీ చూస్తూ కంటతడి పెట్టుకున్న ఆడియన్స్, వీడియో వైరల్
యంగ్ హీరో అడివి శేష్ తాజాగా నటించిన చిత్రం మేజర్. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్’. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాను పది రోజుల ముందుగానే దేశవ్యాప్తంగా ఉన్న (హైదరాబాద్ ఏఎమ్‌బీ సహా) 9 ప్రధాన నగరాల్లో మేజర్ ప్రివ్యూ ప్రదర్శించనున్న సంగతి తెలిసిందే. మే 24 నుంచి రోజులో సెంటర్లో మేజర్ మూవీ ప్రివ్యూలను ప్రదర్శిస్తున్నారు. చదవండి: ఓటీటీకి ‘సర్కారు వారి పాట’, అంతకు ముందే స్ట్రీమింగ్? ఈ క్రమంలో శనివారం జైపూర్‌లో మేజర్ మూవీ ప్రివ్యూ చూసిన ప్రేక్షకులు కన్నీరు పెట్టుకున్న వీడియో వైరల్‌గా మారింది. అలాగే సినిమాలో మేజర్ సందీప్‌ను చూసి ప్రేక్షకుల్లో కొందరు చప్పట్లు కోడుతూ ఆయనకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను హీరో అడివి శేష్ తాజాగా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. ‘జైపూర్.. థియేటర్లో సినిమా చూస్తూ స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం తొలిసారి చూస్తున్నాం. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అమర్ రహై! నా కెరీర్లో ఇదో గొప్ప క్షణం’ అంటూ అడివి శేష్ రాసుకొచ్చాడు. కాగా జైపూర్‌లో జరిగిన మేజర్ ప్రత్యేక స్క్రీనింగ్‌కు చూసేందుకు 100 మందికి పైగా జవాన్లు థియేటర్‌కు వచ్చారు. చదవండి: అలా అడిగేసరికి మహేశ్ స్టూడియో అంతా పరిగెత్తించాడు: కృష్ణ ఈ సందర్భంగా అక్కడి వచ్చిన మేజర్ మూవీ టీం జవాళ్లకు ధన్యవాదాలు తెలిపింది. అనంతరం నటి శోభితా ధూళిపాళ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. ‘మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌కి మా బృందం పెద్ద ఫ్యాన్. అతని కథ ప్రజలకు చేరువ కావాలని మేం కోరుకుంటున్నాము. ఆయన అద్భుతమైన వ్యక్తి’ అంటూ కన్నీటి పర్యంతరం అయ్యింది. కాగా ఈ సినిమాను మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇందులో అడవి శేష్ జోడిగా సయూ మంజ్రేకర్ నటించగా.. శోభితా ధూళిపాళ్ల, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. #Jaipur First time we saw people in the theater scream along with the film. #MajorSandeepUnnukrishnan AMAR RAHE! Massive moment in my career. Watch this! #MajorOnJune3rd pic.twitter.com/5W81GHm6jX — Adivi Sesh (@AdiviSesh) May 28, 2022 -
వచ్చే 3 నెలల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే..
Upcoming Telugu Movies 2022: New Films Coming In 3 Months Theater: థియేటర్లలో మళ్లీ సినిమా సందడి మొదలైంది. పుష్పతో ప్రారంభమైన ఈ మూవీ ఫెస్టివల్ మే 27న విడుదలైన ఎఫ్3 (F3) కొనసాగుతోంది. పుష్ప, శ్యామ్‌సింగరాయ్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, సర్కారు వారి పాట థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. మే రెండోవారంలో సర్కారు వారి పాట ఘనంగా విడుదల కాగా చివరి వారంలో ఎఫ్3 రిలీజైంది. సర్కారు వారి పాటకు సూపర్బ్ రెస్పాన్స్ రాగా అదే తరహాలో నవ్వులు పంచే సినిమాగా ఎఫ్3 విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. మే నెల ఎఫ్3తో శుభం కార్డు పడగా.. తర్వాతి నెలల్లో వచ్చే సినిమాలకు ఆహ్వానం పలికేందుకు మరింత ఆసక్తితో ఉన్నారు ప్రేక్షకులు. కేవలం వచ్చే జూన్ నెల మాత్రమే కాకుండా 3 నెలల్లో అనేక సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో అలరించేందుకు రెడీ అయినా ఆ మూవీస్ ఏంటో చూద్దామా ! జూన్: విక్రమ్- జూన్ 3 మేజర్- జూన్ 3 అంటే.. సుందరానికి- జూన్ 10 రామారావు ఆన్ డ్యూటీ-జూన్ 17 (ప్రస్తుతానికి వాయిదా పడింది) గాడ్సే- జూన్ 17 సమ్మతమే- జూన్ 24 జూలై: పక్కా కమర్షియల్- జూలై 1 విరాటపర్వం- జూలై 1 రంగ రంగ వైభవంగా- జూలై 1 థ్యాంక్ యూ- జూలై 8 ది వారియర్- జూలై 14 కార్తికేయ 2- జూలై 22 విక్రాంత్ రోణ- జూలై 28 హిట్ 2- జూలై 29 ఆగస్టు: బింబిసార- ఆగస్టు 5 యశోద- ఆగస్టు 12 ఏజెంట్- ఆగస్టు 12 మాచర్ల నియోజకవర్గం- ఆగస్టు 12 లైగర్- ఆగస్టు 25 వచ్చే మూడు నెలల్లో మొత్తంగా 19 సినిమాలు సందడి చేయనున్నాయి. అయితే జూన్ 17న రావాల్సిన రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' ఇప్పటికే వాయిదా పడింది. రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటిస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది. ఒక వేళ ఈ సినిమా ఈ మూడు నెలల్లోనే రిలీజయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాతో కలిపి వచ్చే 3 నెలల్లో మొత్తంగా 20 సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అలాగే పైన ఉన్న సినిమా విడుదల తేదీల్లో మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదు. చదండి: చిన్నతనంలోనే వేశ్యగా మారిన యువతి బయోపిక్.. త్వరలో ఓటీటీలోకి.. -
తెలుగు రాష్ట్రాల్లో మేజర్ టికెట్ రేట్స్‌పై అడివి శేష్ క్లారిటీ
దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో ‘మేజర్ సందీప్ కృష్ణన్’ ఒకరు. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్’. సందీప్ పాత్రను యంగ్ హీరో అడివి శేష్ పోషించాడు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న విషయం తెలిసిందే. మేజర్ రిలీజ్ డేట్ దగ్గరపడుతుంటంతో హీరో అడివి శేష్ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్ అందించాడు. చదవండి: ఒటీటీకి ‘సర్కారు వారి పాట’, అంతకు ముందే స్ట్రీమింగ్? ఇది మన సినిమా అని అందుకే అందరికి అందుబాటు ధరల్లో మేజర్‌ను తీసుకువస్తున్నట్లు అప్డేట్ ఇస్తూ.. టికెట్ ధరల పట్టికను షేర్ చేశాడు. ఈ మేరకు శుక్రవారం అడివి శేష్ ట్వీట్ చేస్తూ ‘ఇది మన సినిమా. అందుకే అందరికీ అందుబాటులో ఉండేలా ఈ సినిమా టికెట్ ధరలను నిర్ణయించాం’అని పేర్కొన్నాడు. కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మేజర్ టికెట్ రేట్స్ ఇలా ఉండనున్నాయి. సింగిల్ స్క్రీన్: తెలంగాణ-రూ. 150 కాగా ఏపీ- రూ. 147; మల్టీప్లెక్స్: తెలంగాణ-రూ. 195, ఏపీ-రూ. 177గా ఉండనున్నాయి. చదవండి: ‘సమంత అలా ఒంటరిగా చనిపోవాలి’ కామెంట్‌పై సామ్ ఏమన్నదంటే.. ఇదిలా ఉంటే తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో రానున్న ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ప్రివ్యూలు ఉండబోతున్నాయి. ఈ సినిమాను పది రోజుల ముందుగానే దేశవ్యాప్తంగా ఉన్న (హైదరాబాద్ ఏఎమ్‌బీ సహా) 9 ప్రధాన నగరాల్లో మేజర్ ప్రివ్యూ ప్రదర్శించనున్నారు. మే 24 నుంచి రోజుకో సెంటర్లో మేజర్ రిలీజ్ కానుంది. కాగా మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇందులో అడవి శేష్ జోడిగా సయూ మంజ్రేకర్ నటించగా.. శోభితా ధూళిపాళ్ల, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. #MajorTheFilm MANA cinema. So, we decided to give you the LOWEST PRICES for ANY film post pandemic. https://t.co/aAUhmKEO9u Sharing my love ❤️ Sharing my heart. pic.twitter.com/wWPHLD4GOK — Adivi Sesh (@AdiviSesh) May 27, 2022 -
నా కల నేరవేరింది: శ్రీ చరణ్ పాకాల
‘‘ఓ మ్యూజిక్ డైరెక్టర్‌గా నా కెరీర్లో ఇంత తొందరగా ఓ బయోపిక్కు పని చేస్తానని నేను అనుకోలేదు. ‘మేజర్’కి సంగీతం అందించడంతో నా కలల్లో ఒక కల నిజమైనట్లుగా భావిస్తున్నా’’ అన్నారు శ్రీ చరణ్ పాకాల. అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మేజర్’. ఈ చిత్రంలో సందీప్‌గా అడివి శేష్ నటించారు. సయీ మంజ్రేకర్ హీరోయిన్గా, శోభితా ధూళిపాళ్ల కీలక పాత్రలో కనిపిస్తారు. మహేశ్‌బాబు జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌లతో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన ఈ చిత్రం జూన్ 3న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ – ‘‘అడివి శేష్ దర్శకత్వంలో వచ్చిన ‘కిస్’ మ్యూజిక్ డైరెక్టర్‌గా నా తొలి సినిమా. ఆ తర్వాత ‘క్షణం, గూఢచారి, ఎవరు’ చిత్రాలు చేశాను. థ్రిల్లింగ్, యాక్షన్, ఎమోషన్, లవ్‌స్టోరీ.. ఇలా అన్ని అంశాలు ‘మేజర్’లో ఉన్నాయి. 26/11 దాడుల గురించి నాకు అవగాహన ఉంది. బయోపిక్ కావడంతో జాగ్రత్తగా మ్యూజిక్ కంపోజ్ చేశాను. ఈ చిత్రంలో నాలుగు పాటలు ఉన్నాయి. అన్నీ డిఫరెంట్. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయడంలో కిక్ ఉంటుంది. ‘ఇట్లు... మారేడుమిల్లి ప్రజానీకం’, ‘క్షణం’, ‘గూఢచారి 2’, ‘తెలిసినవాళ్ళు’, కన్నడ ‘ఎవరు’ రీమేక్, దర్శకుడు విజయ్ కనకమేడల సినిమా.. ఇలా ఆరేడు చిత్రాలకు సంగీతం అందిస్తున్నాను’’ అన్నారు. చదవండి 👇 బిగ్‌బాస్ షో ద్వారా బిందు ఎంత వెనకేసిందంటే? పుష్ప మూవీ సమంత వల్లే హిట్ అయ్యింది -
‘మేజర్’ నుంచి మరో మెలోడీ సాంగ్, ఆకట్టుకుంటున్న పాట
యంగ్ హీరో అడవి శేష్ తాజాగా నటించిన చిత్రం మేజర్. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రం ఇది. దీంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న విషయం తెలిసిందే. చదవండి: 'డెడ్' అని సమంత పోస్ట్.. ఆ వెంటనే డిలీట్ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది చిత్రం బృందం. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మరో మెలోడీ సాంగ్‌ను వదిలారు మేకర్స్. ‘హృదయమా’ అంటూ సాగే ఈ పాటను సంగీత ప్రియులను బాగా ఆకట్టుకుంటుంది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటకు కృష్ణకాంత్, రమేశ్ కుమార్‌లు సాహిత్యం అందించారు. చదవండి: Pushpa 2: రూ.400 కోట్ల బడ్జెట్.. పుష్ప 2కు ఆ సీన్ హైలైట్ అట ఇదిలా ఉంటే ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ప్రివ్యూలు ఉండబోతున్నాయి. ఈ సినిమాను పది రోజుల ముందుగానే దేశవ్యాప్తంగా ఉన్న (హైదరాబాద్ ఏఎమ్‌బీ సహా) 9 ప్రధాన నగరాల్లో మేజర్ ప్రివ్యూ ప్రదర్శించనున్నారు. మే 24 నుంచి రోజుకో సెంటర్లో మేజర్ రిలీజ్ కానుంది. కాగా మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇందులో అడవి శేష్ జోడిగా సయూ మంజ్రేకర్ నటించగా.. శోభితా ధూళిపాళ్ల, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. -
సెన్సార్ పూర్తి చేసుకున్న మేజర్, మూవీ టీంపై ప్రశంసలు
దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో ‘మేజర్ సందీప్ కృష్ణన్’ ఒకరు. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్’. సందీప్ పాత్రను యంగ్ హీరో అడివి శేష్ పోషించాడు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న విషయం తెలిసిందే. చదవండి: ఆఫర్ల కోసం చాలామంది హీరోయిన్లు కమిట్మెంట్ ఇస్తారు: డైరెక్టర్ ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉందని చిత్ర యూనిట్‌ను సెన్సార్ బోర్డ్ ప్రశంసిచినట్లుగా చిత్ర బృందం పేర్కొంది. అంతేకాదు ఈ సినిమా చివరిలో సెన్సార్ బోర్డు సభ్యులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి సందీప్ ఉన్నికృష్ణన్‌కు సెల్యూట్ చేసినట్లు సమాచారం. అనంతరం ఈ సినిమాలో అడివి శేష్ యాక్టింగ్‌కు ప్రత్యేక అభినందనులు తెలిపారట సెన్సార్ బోర్డ్ సభ్యులు. చదవండి: ‘నా భర్త వల్ల ప్రాణహాని ఉంది’.. పోలీసులను ఆశ్రయించిన నటి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని వారు కితాబిచ్చినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. సెన్సార్ బోర్డ్ సభ్యులు మేజర్ చిత్రానికి మంచి ఫీడ్‌బ్యాక్ ఇవ్వడంతో చిత్ర యూనిట్ సంతోషంలో మునిగితేలుతోంది. ఇక ఈ సినిమాను రిలీజ్ కంటే ముందుగా తొలిసారి పలు నగరాల్లో ప్రీమియర్ షోలు వేయనుండటం విశేషం. కాగా ఈ చిత్రంలో సాయీ మంజ్రేకర్, శోభితా ధూలిపాల, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళి శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
హాలీవుడ్ స్ట్రాటజీతో 'మేజర్'.. సాధారణ రేట్లకే సినిమా
Adivi Sesh Plans Major Movie Nationwide Preview Before Release: దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో ‘మేజర్ సందీప్ కృష్ణన్’ ఒకరు. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్’. సందీప్ పాత్రను యంగ్ హీరో అడివి శేష్ పోషించాడు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను పది రోజుల ముందుగానే విడుదల కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న (హైదరాబాద్ ఏఎమ్‌బీ సహా) 9 ప్రధాన నగరాల్లో మేజర్ ప్రివ్యూ ప్రదర్శించనున్నారు. మే 24 నుంచి రోజుకో సెంటర్లలో రిలీజ్ కానుంది. ఈ ప్రివ్యూలను హైదరాబాద్, ఢిల్లీ, లక్నో, జైపూర్, బెంగళూరు, ముంబై, పూణె, అహ్మదాబాద్, కొచ్చి నగరాల్లో ప్రదర్శిస్తారు. ఇందుకోసం బుక్ మై షోతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రివ్యూస్ చూడాలనుకునేవారు బుక్ మై షో లో టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. ఈ తరహా ప్రివ్యూలను హాలీవుడ్లో విడుదల చేస్తారు. సినిమా రిలీజ్‌కు ముందు పలు ప్రధాన నగరాల్లో పది లేదా నెల రోజుల గ్యాప్‌తో ప్రదర్శిస్తారు. తమ సినిమాలకు మరింత పాపులారిటీ తెచ్చుకునేందుకే ఈ తరహా స్ట్రాటజీని వాడతారు. ఇప్పుడు ఇదే టెక్నిక్‌ను తన సినిమా కోసం అడవి శేష్ అనుసరిస్తున్నాడు. దేశవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకే ఈ ప్రివ్యూస్ వేస్తున్నట్లు సమాచారం. అయితే ఇలా రిలీజ్‌కు ముందే ప్రివ్యూస్ వేయడం దేశంలోనే ఇదే తొలిసారి. చదవండి: నాలుగేళ్లుగా నేను ఏది పట్టుకున్నా బ్లాక్‌బ్లస్టరే: మహేశ్ బాబు అలాగే ఈ సినిమా టికెట్ రేట్లపై అడవి శేష్ ఇటీవల స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా 'ఆస్క్ శేష్' సెషన్లో ఈ విషయం గురించి ప్రస్తావన వచ్చింది. 'టికెట్ రేట్లను తగ్గించండి. రిపీటెడ్‌గా సినిమా చూసేందుకు వీలుంటుంది. ఫలింతగా ఇండస్ట్రీని కాపాడొచ్చు.' అని ఓ ఫ్యాన్ చేసిన ట్వీట్‌కు శేష్ బదులిచ్చాడు. తమ సినిమా టికెట్లు సాధారణ రేట్లతో అందుబాటులో ఉంటాయని క్లారిటీ ఇచ్చాడు. 'ఇది సాధారణ ప్రేక్షకులు చూడాల్సిన అసాధారణ సినిమా' అని పేర్కొన్నాడు. దీంతో 'ఎఫ్ 3' మూవీ తర్వాత సాధారణ రేట్లకే టికెట్ రేట్లను కేటాయించిన సినిమాగా 'మేజర్' నిలిచింది. చదవండి: ‘మేజర్’ ట్రైలర్‌ను చూసిన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ -
ఆ తర్వాత ప్రేమలో పడిపోయా, ఇంతకంటే ఏం కావాలి?
‘‘నా కెరీర్లో నేను ఎక్కువగా ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేయడం వల్లనేమో నన్ను అందరూ సీరియస్‌గానే చూస్తున్నారు. కానీ నేను చాలా హ్యాపీ గాళ్‌ని. నాకు సరదాగా, ఫన్నీగా ఉండే అమ్మాయి పాత్రలు కూడా చేయాలని ఉంది’’ అన్నారు శోభితా ధూళిపాళ్ల. అమరవీరుడు సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మేజర్’. ఇందులో సందీప్‌గా అడివి శేష్ నటించారు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ సినిమాను మహేశ్‌బాబు జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌లతో కలిసి సోనీ పిక్చర్ ఫిలింస్ నిర్మించింది. ‘మేజర్’ చిత్రం జూన్ 3న విడుదల కానుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన శోభితా ధూళిపాళ్ల చెప్పిన విశేషాలు. ► మా ఫ్యామిలీలో సినిమా వాతావరణం లేదు. కాలేజీ తర్వాత మిస్ ఇండియా గెలిచాను. ఉత్సాహంగా మోడలింగ్ చేశాను. మోడలింగ్ నచ్చింది కానీ ఆ వర్క్ ఇస్తున్న తృప్తి నా మనసుకు సరిపోలేదు. నటన అంటే నాకు ఇష్టం అని ఆడిషన్స్ వల్ల తెలుసుకున్నాను. ఆ తర్వాత యాక్టింగ్‌తో ప్రేమలో పడిపోయా. నాకు నచ్చిన పని చేస్తూ అందరితో మెప్పు పొందగలుగుతున్నాను. లైఫ్‌లో ఇంతకంటే ఏం కావాలి! ఇక గ్లిజరిన్ అవసరం లేదు ‘మేజర్’లో బందీ అయిన ఎన్ఆర్ఐ యువతి ప్రమోద పాత్ర చేశాను. 26/11 దాడులు జరిగినప్పుడు ఎంతో భయాన్ని, బాధను బందీలు అనుభవించి ఉంటారు. వారిలా ఆలోచించి ఈ సినిమా చేశా. నా కెరీర్లో ఇప్పటివరకు కన్నీళ్ల కోసం గ్లిజరిన్ వాడలేదు. ప్రమోద పాత్ర చేశాక ఇక యాక్టర్‌గా లైఫ్‌లో నాకు గ్లిజరిన్ అవసరం ఉండదేమో అనిపిస్తోంది. ఇది అంత బరువైన, భావోద్వేగంతో కూడిన పాత్ర. మహేశ్‌గారు ఆ భరోసా ఇచ్చారు మేజర్ సందీప్ తల్లిదండ్రులు తమ కొడుకు జీవితం ఆధారంగా తీసిన ‘మేజర్’ను చూసి గర్వపడాలని అడివి శేష్ కష్టపడి చేశారు. దర్శకుడు శశి కాన్ఫిడెంట్ అండ్ ఎమోషనల్ పర్సన్. కరోనా టైమ్‌లో ‘మేజర్’ ఓటీటీకి వెళ్తుందా? అనే భయం కలిగింది కానీ నిర్మాత మహేశ్‌బాబుగారు ఇది థియేట్రికల్ ఫిల్మ్.. థియేటర్స్‌లోనే రిలీజ్ చేద్దామని భరోసా ఇచ్చారు. అది నేరవేరినందుకు హ్యాపీ ఒక హిస్టారికల్ ఫిల్మ్ చేయాలనే నా ఆకాంక్ష ‘పొన్నియిన్ సెల్వన్’తో నెరవేరింది. ఈ సినిమా వల్ల మణిరత్నంగారితో వర్క్ చేయగలిగే అదృష్టం కలిగింది నాకు. హాలీవుడ్లో నేను చేసిన ‘మంకీ మాన్’ సినిమా షూటింగ్ పూర్తయింది. ఓటీటీలో ‘మేడిన్ ఇన్ హెవెన్’ సెకండ్ సీజన్, బ్రిటిష్ సిరీస్ ‘ది నైట్ మేనేజర్’ హిందీ అడాప్షన్ వెబ్ సిరీస్ చేస్తున్నాను. చదవండి 👉🏾 ఆస్కార్ కొత్త రూల్స్.. ఈ థియేటర్స్‌లో బొమ్మ పడాల్సిందేనట! టీజర్: సక్సెస్ అయితే నీ లవర్‌తో, ఫెయిల్ అయితే పక్కోడి లవర్‌తో పెళ్లి! -
సెకండ్ సింగిల్: మేజర్ మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్
యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. ముంబై 26/11 దాడుల్లో వీరమరణం పొందిన ఎన్ఎస్జీ కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈమూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాష్లో రిలీజ్‌కు రెడీ అయ్యింది. చదవండి: బిగ్‌బాస్ తెలుగు నాన్‌స్టాప్‌లో పాయల్ సపోర్ట్ ఎవరికో తెలుసా? ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన మేజర్ ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న మేజర్ విడుదలవుతున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన చిత్రం బృందం తాజాగా మేజర్ నుంచి రొమాంటిక్ సాంగ్‌ను విడుదల చేసింది. సెకండ్ సింగిల్ పేరుతో విడుదల చేసిన ఈ పాట సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుంది. చదవండి: హీరో పెళ్లి వేడుకలు షురూ.. స్టెప్పేసిన నాని, సందీప్ కిషన్ ‘ఓ ఇషా’ అంటూ సాగే ఈ పాటలో హీరో హీరోయిన్ల మధ్య పరిచయం, ప్రేమ, పెళ్లి.. ఆ తర్వాత హీరో ఆర్మీలో చేరడం అక్కడ ఒకరిని గురించిన ఆలోచనలతో ఒకరు ఉండటం వంటి రొమాంటి సన్నివేశాలను చూపించారు. కాగా మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇందులో అడవి శేష్ జోడిగా సయూ మంజ్రేకర్ నటించగా.. శోభితా ధూళిపాళ్ల, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. ‘ శశికిరణ్ తిక్క దర్శకత్వంలో ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కింది. -
చందమామ సినిమాలో ఒరిజినల్ హీరో నేను, కానీ తీసేశారు
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్‌గా తెరకెక్కుతున్న చిత్రం మేజర్. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించాడు. మహేశ్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన ఈ మూవీ జూన్ 3న రిలీజ్ కానుంది. ఇటీవలే (మే 9న) మేజర్ ట్రైలర్ రిలీజవగా దానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అడివి శేష్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 'నా అసలు పేరు అడివి సన్నీ కృష్ణ.. కానీ అమెరికాలో ఉన్నప్పుడు అందరూ సన్నీలియోన్ అని ఆటపట్టిస్తుండటంతో అడివి శేష్‌గా మారాను' అని తెలిపాడు. అమెరికాలో హీరోగా ఎందుకు ప్రయత్నించలేదన్న ప్రశ్నకు అడివి శేష్ స్పందిస్తూ.. 'అక్కడ భారతీయులకు టెర్రరిస్ట్, పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తి.. ఇలాంటి పాత్రలే ఇచ్చేవారు. అక్కడ ఇండియన్ హీరో అవలేడు. ఇప్పుడు కూడా హాలీవుడ్లో బాగా పాపులర్ అయిన ఇండియన్స్ కమెడియన్ రోల్స్‌లోనే కనిపిస్తారు' అని తెలిపాడు. 'చందమామ సినిమాలో ఒరిజినల్ హీరో నేను. నవదీప్ స్థానంలో నేను ఉండాల్సింది. రెండు రోజుల షూటింగ్ తర్వాత సినిమా క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత సొంతంలో పెద్ద రోల్ ఉందన్నారు. కట్ చేస్తే సినిమాలో ఐదు సెకన్లున్నానంతే!' అని చెప్పుకొచ్చాడు. మేజర్ సినిమా గురించి చెప్తూ అందరికీ సందీప్ ఉన్నికృష్ణన్ ఎలా చనిపోయాడో తెలుసు, కానీ ఎలా బతికాడనేది తెలియదని, అదే తమ సినిమా తెలియజేస్తుందన్నాడు. ఈ సినిమాకు మహేశ్‌బాబు బ్యాక్‌బోన్ అని, ఆయన వల్లే సినిమా సాధ్యమైందని పేర్కొన్నాడు. చదవండి: సౌత్ డైరెక్టర్ అలా ప్రవర్తించడంతో ఏడుస్తూనే ఉండిపోయా డ్యాన్స్ షో విన్నర్ టీనా మృతిపై అనుమానాలు, లిక్కర్ ఎక్కువవడం వల్లే.. -
బాలీవుడ్ నన్ను భరించలేదు: మహేశ్ బాబు షాకింగ్ కామెంట్స్
Mahesh Babu Comments On Bollywood: బాలీవుడ్ పరిశ్రమపై సూపర్ స్టార్ మహేశ్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం జరిగిన మేజర్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మహేశ్‌కు బాలీవుడ్ ఎంట్రీపై ప్రశ్న ఎదురైంది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బాలీవుడ్ తనని భరించలేదని, అక్కడ సినిమాలు చేసి టైం వెస్ట్ చేయనంటూ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చాడు. సౌత్ సూపర్ స్టార్ అయిన మహేశ్ బాబు బాలీవుడ్ ఎంట్రీపై ఎప్పటినుంచో ఆసక్తి నెలకొంది. ఆయన హిందీలో ఓ సినిమా చేయాలని అటూ నార్త్‌తో పాటూ సౌత్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే ఈ క్రమంలో ఆయన తన హిందీ డెబ్యుపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ‘హిందీ పరిశ్రమ నుంచి నాకు ఆఫర్లు బాగానే వచ్చాయి. కానీ నన్ను వారు భరించగలరని అనుకోవడం లేదు. నన్ను భరించలేని పరిశ్రమలో పనిచేయడం టైం వేస్ట్ చేసుకోవమే అవుతుంది. ఇక్కడ నాకు బాగానే ఆఫర్స్ వస్తున్నాయి. అంతేగాక టాలీవుడ్ నాకు మంచి గుర్తింపు, గౌరవం, స్టార్ డమ్ ఇచ్చింది. దీనిపట్ల చాలా సంతోషంగా ఉన్నాను. అందుకే, నా పరిశ్రమను విడిచి మరేదో ఇండస్ట్రీకి పని చేయాలనే ఆలోచన నాకు లేదు. సినిమాలు చేయాలని, మరింత ఎత్తుకు ఎదగాలని ఎప్పుడూ అనుకుంటాను. నా కల ఇప్పుడు నెరవేరుతోంది’ అంటూ మహేశ్ వివరణ ఇచ్చాడు. చదవండి: తల్లి కాబోతున్న మరో హీరోయిన్.. కొత్త ఫీలింగ్స్ అంటూ ఎమోషనల్ పోస్ట్ కాగా మహేశ్ బాబు నిర్మాతగా వ్యవహరించిన మేజర్ మూవీ జూన్ 3న విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే ఆయన తాజాగా నటించిన ‘సర్కారు వారి పాట’ ఈ నెల 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేశ్ కథానాయికగా చేసింది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, కళావతి, ఎవ్రీ పెన్ని సాంగ్స్ వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్, ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
నాన్న బయోపిక్‌లో నేను నటించలేను: మహేశ్ బాబు
Mahesh Babu about Father Krishna Biopic: ‘‘కొన్ని సినిమాలు కొందరే చేయాలి. ‘మేజర్’లో అమరవీరుడు సందీప్‌గా శేష్ బాగా సూటయ్యాడు. సందీప్ పాత్ర నేను చేసుంటే బాగుండేదేమోనని ఆలోచించే అంత సెల్ఫిష్ కాదు నేను. నా సినిమాలు నేనే చేయాలి. మిగతా సినిమాలు చూసి ఎంజాయ్ చేయాలి’’ అన్నారు హీరో, నిర్మాత మహేశ్‌బాబు. అడివి శేష్ హీరోగా నటించిన చిత్రం ‘మేజర్’. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్లు సయీ మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ల నటించారు. చదవండి: ఎఫ్ 3 ఒక మంచి ట్రీట్‌లా ఉంటుంది: వెంకటేశ్ అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో సందీప్‌గా అడివి శేష్ నటించారు. జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌లతో కలిసి సోనీ పిక్చర్స్ ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 3న తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మహేశ్‌బాబు మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ తీస్తారనే ప్రశ్న ఎదురైంది. చదవండి: సింగర్స్‌గా మారిన మంచు విష్ణు కుమార్తెలు దీనికి మహేశ్ బాబు స్పందిస్తూ.. ‘నాన్నగారి (సూపర్‌స్టార్ కృష్ణ) బయోపిక్ ఎవరైనా చేస్తే ఫస్ట్ నేనే హ్యాపీగా చూస్తాను. నేనైతే చేయలేను. ఎందుకంటే ఆయన నా దేవుడు. నాన్నగారి బయోపిక్‌కి ఎవరైనా దర్శకత్వం వహిస్తే నా బ్యానర్లో నిర్మించడానికి రెడీగా ఉన్నాను’ అని సమాధానం ఇచ్చారు. అలాగే మేజర్ మూవీ గురించి మాట్లాడుతూ.. ‘‘బయోపిక్ తీసేటప్పుడు బాధ్యతగా ఉండాలి. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ తీస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా తీయాలి. ‘మేజర్’ చూశాను. చాలా సీక్వెన్సెస్ గూస్బంప్స్ ఇచ్చాయి. చివరి 30 నిమిషాలయితే నా గొంతు ఎండిపోయింది. సినిమా చూశాక రెండు నిమిషాలు మౌనంగా ఉండి, ఆ తర్వాత శేష్‌ను హగ్ చేసుకున్నాను’ అని చెప్పారు. -
'మేజర్' సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
నాలుగేళ్లుగా నేను ఏది పట్టుకున్నా బ్లాక్‌బ్లస్టరే: మహేశ్ బాబు
''మై సన్ .. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ .. వెనకడుగు వేసే అవకాశం వుంది.. తప్పించుకునే దారి వుంది.. ముందు వెళితే చనిపోతాడని తెలుసు .. అయినా వెళ్లాడు. చావు కళ్లల్లో చూసి.. 'నీవు నా జీవితాన్ని తీసుకోవచ్చు కానీ దేశాన్ని కాదు' అన్నాడు''.. ప్రకాష్ రాజ్ చెప్పిన ఈ డైలాగ్, దాని తగ్గటు చూపించిన సందీప్ పోరాటానికి చప్పట్లు కొట్టాల్సిందే. సినిమా పై భారీ అంచనాలు పెంచిన 'మేజర్' ట్రైలర్ .. సినిమాని ఎప్పుడు చూస్తామా ? అనే ఆసక్తిని పెంచింది. యంగ్ హీరో అడివి శేష్ పాన్ ఇండియా మూవీ 'మేజర్'. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. 2.28 నిమిషాలు గా ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ సాగింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా వుంది. మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, లవ్ లైఫ్, వార్ .. ఇలా ప్రతీదీ ట్రైలర్ లో గూస్ బంప్స్ మూమెంట్ గా వుంది. ట్రైలర్ లో 26/11 ఎటాక్ విజువల్స్ నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. అడివి శేష్ మేజర్ సందీప్ గా పరకాయ ప్రవేశం చేశారు. ప్రకాష్ రాజ్ వాయిస్, డైలాగ్స్, ఆయన నటన అద్భుతంగా వుంది. అభిమానుల సమక్షంలో విడుదల చేసిన ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబు మాట్లాడుతూ.. మేజర్ టీమ్ ని చూస్తే గర్వంగా వుంది. మేజర్ ట్రైలర్ చూసినప్పుడు ప్రేక్షకుల రియాక్షన్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా చూశాను. కొన్ని సీన్లు చూస్తున్నపుడు గూస్ బంప్స్ వచ్చాయి. చివరి 30 నిమిషాలు నా గొంతు తడారిపోయింది. సినిమా పూర్తయిన తరవాత ఏం మాట్లాడలేకపోయాను. రెండు నిమషాల మౌనం తర్వాత శేష్ ని హాగ్ చేసుకున్నాను. బయోపిక్ తీయడం చాలా బాధ్యత కూడుకున్నది, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లాంటి వీరుడి కథ చెప్పినపుడు ఆ బాధ్యత ఇంకా పెరుగుతుంది. మేజర్ టీం మొత్తం ఆ భాద్యతని చక్కగా నిర్వహించారు. రెండేళ్లుగా మేజర్ టీమ్ నాకు థ్యాంక్స్ చెబుతున్నారు. కానీ ఇంత గొప్ప సినిమాని ఇచ్చిన మేజర్ టీమ్ కి నేను థ్యాంక్స్ చెప్పాలి. జూన్ 3న మేజర్ వస్తుంది. తప్పకుండా మీరు ప్రేమించే సినిమా అవుతుంది. అనురాగ్ మాట్లాడుతూ నేను రిస్క్ చేస్తానని చెప్పారు. కానీ నేను రిస్క్ చేయను. నాలుగేళ్లుగా నేను ఏది పట్టుకున్నా బ్లాక్ బస్టరే. అడవి శేష్ చేసే సినిమాలు నాకు చాలా ఇష్టం. మేజర్ సినిమా కూడా అద్భుతంగా ఉండబోతుంది.'' అన్నారు. హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సింపుల్ మ్యాన్. అమ్మనాన్న, స్నేహితులు, చైల్డ్ హుడ్ క్రష్, గర్ల్ ఫ్రెండ్ ఇలా మనందరిలానే అతని జీవితం కూడా సాధారణం. ఐతే అంత సాధారణమైన మేజర్ సందీప్ ఒక అసాధారణ వ్యక్తిగా ఎలా అయ్యారనేది మేజర్ లో చూస్తారు. మహేశ్ గారు మేజర్ సినిమాకి బ్యాక్ బోన్. ఏం జరిగినా మహేశ్ గారు ఉన్నారనే ఒక నమ్మకం. కొవిడ్ లాంటి కష్టకాలంలో మహేశ్, నమ్రతగారే మమ్మల్ని నిలబెట్టారు. అబ్బూరి రవి గారి కి కూడా స్పెషల్ థ్యాంక్స్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరెంట్స్ కోరిక ఒక్కటే. మేజర్ సందీప్ జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోవాలని కోరుకున్నారు. మేజర్ చిత్రం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గొప్ప జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఈ సినిమా మొదలుపెట్టినపుడు పాన్ ఇండియా సినిమా, మార్కెట్ పెంచుకోవడానికి చేస్తున్నారని కొందరు అన్నారు. కానీ అది అసలు విషయం కాదు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఈ దేశం ముద్దు బిడ్డ. ఆయన మాతృ భాష మలయాళం కాబట్టి మలయాళంలో డబ్ చేశాం, మన తెలుగు వాళ్లం కాబట్టి తెలుగులో చేశాం, దేశం మొత్తం చూడాలి కాబట్టి హిందీ చేశాం. ప్రతి సీన్, షాట్‌ని తెలుగు, హిందీలో షూట్ చేశాం. మన ఉద్దేశం సరైనప్పుడు విశ్వమే మనకు సహకరిస్తుంది. సోనీ పిక్చర్స్ ఈ సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది. అనురాగ్, శరత్ అన్నదమ్ముల్లా తోడున్నారు. ఈ సినిమాని చాలా మందికి చూపించాం. మహేశ్ బాబు ఫ్యాన్స్ కోసం కూడా ఒక స్పెషల్ షోని ప్లాన్ చేస్తాం. ట్రైలర్ తో దిమ్మతిరిగింది. సినిమా హృదయాన్ని తాకేలా ఉంటుంది'' అన్నారు. దర్శకుడు శశి కిరణ్ తిక్క మాట్లాడుతూ.. 2018లో అడవి శేష్ ఈ కథ చెప్పారు. నేను కూడా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంపై రీసెర్చ్ చేశాను. ఇలాంటి గొప్ప కథ ఎలాగైనా చెప్పాలని నిర్ణయించుకున్నాను. మహేశ్ గారు మా వెనుక ఉండటం ఒక ప్రత్యేకమైన బలం. నమ్రత గారు గ్రేట్ సపోర్ట్ ఇచ్చారు. అడివి శేష్‌తో రెండు సినిమాలు చేశాను. అతని గురించి ఒక పుస్తకం రాయొచ్చు. కష్టపడటంలో శేష్ తో పోటిపడితే చాలు మనం విజయం సాధించినట్లే. ప్రకాష్ రాజ్, రేవతి అద్భుతంగా చేశారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరెంట్స్ ని కలిసినప్పుడు ఎంత ఎమోషనల్ అయ్యానో.. మానిటర్ లో ప్రకాష్ రాజ్, రేవతి గార్ల నటన చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. నా యూనిట్ మొత్తానికి స్పెషల్ థ్యాంక్స్'' అన్నారు ''మేజర్ సినిమాలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను. మహేశ్ బాబు గారికి నమ్రత మేడమ్ కి స్పెషల్ థ్యాంక్స్. అలాగే సోనీ పిక్చర్స్ కి కూడా ధన్యవాదాలు . హీరో అడివి శేష్, దర్శకుడు శశి గారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నా. మేజర్ ట్రైలర్ చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు జూన్ 3న థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలని కోరుకుంటున్నాను'' అని హీరోయిన్ సాయి మంజ్రేకర్ తెలిపారు. 'అడవి శేష్ ఈ సినిమా కోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడ్డారు. సోనీ పిక్చర్స్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. నమ్రత చాలా సపోర్ట్ చేశారు. మహేశ్ ఒక్క మాట మాలో గొప్ప ఎనర్జీని నింపుతుంది. మహేశ్ చేసిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేం. యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు.' అని కో ప్రొడ్యుసర్ శరత్ పేర్కొన్నారు. కో ప్రొడ్యుసర్ అనురాగ్ మాట్లాడుతూ.. మహేశ్ బాబు 'మేజర్' ట్రైలర్ లాంచ్ కి రావడం ఆనందంగా ఉంది. బొమ్మరిల్లు సినిమాకి మా నాన్నతో వెళ్లాను. అప్పుడే నిర్మాత అవుతానని నాన్నతో చెప్పా. ఇన్నాళ్ల తర్వాత మహేశ్ బాబుగారి లాంటి పెద్ద స్టార్ తో సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం కావడం ఆనందాన్ని ఇచ్చింది. జీఎంబీ లాంటి స్టార్ బ్యానర్ ఇచ్చి మమ్మల్ని మొదటి నుంచి ఇప్పటివరకూ మహేశ్ బాబుగారి చేసిన సపోర్ట్ మర్చిపోలేం. మహేశ్ గారు కెరీర్ మొత్తం రిస్కులు తీసుకునే జర్నీ చేశారు. మేము అంతా కొత్తవాళ్లం. మాతో కూడా రిస్క్ తీసుకుంటారనే నమ్మకంతో ఆయన దగ్గర కి వెళ్లాం. మా నమ్మకం నిజమైంది. ఆయన ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. సోనీ పిక్చర్స్ కు థ్యాంక్స్. బ్లడ్ పెట్టి పనిచేయడం అంటే ఏమిటో అడవి శేష్ దగ్గర నేర్చుకున్నా. దర్శకుడు శశి చాలా కూల్. ఆతని బ్యాలన్స్ అద్భుతంగా వుంటుంది. హీరోయిన్ సాయి అద్భుతమైన పాత్ర చేసింది. శోభిత ధూళిపాళ్ల నటన కూడా ఆకట్టుకుంటుంది. సినిమా యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు. మహేశ్ గారు ఈ సినిమా చూశారు. జూన్ 3న వస్తున్నాం. ఈ సినిమా ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కి ఈ చిత్రం ఘనమైన నివాళిగా ఉండబోతుంది'' అన్నారు. -
మేజర్ ట్రైలర్: ఒక్క ప్రాణం పోయిన నన్ను నేను సోల్జర్ అనుకోలేను..
Mahesh Babu To Launch The Adivi Sesh Major Trailer: దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో ‘మేజర్ సందీప్ కృష్ణన్’ ఒకరు. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్’. సందీప్ పాత్రను యంగ్ హీరో అడివి శేష్ పోషించాడు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం జూన్ 3న మేజర్ విడుదలవుతున్నట్లు ఇటీవల చిత్రయూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను సోమవారం (మే 9) రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ను ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరోతో విడుదల చేయించారు మేకర్స్. తెలుగు ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు రిలీజ్ చేయగా, హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విడుదల చేశారు. ఆద్యంతం ఎమోషనల్‌గా సాగిన ఈ ట్రైలర్లో మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం, ఉగ్రవాదులతో పోరాటం తదితర సంఘటనలను చాలా బాగా చూపించారు. 'ఒక్క ప్రాణం పోయిన నన్ను నేను సోల్జర్ అనుకోలేను', 'ప్రతి అమ్మ ఇలానే ఆలోచిస్తుంది' వంటి తదితర డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. చదవండి: ‘మేజర్’ ట్రైలర్‌ను చూసిన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ -
‘మేజర్’ ట్రైలర్‌ను చూసిన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
Minister Rajnath Singh Watch Adivi Sesh Major Movie Trailer: దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో ‘మేజర్ సందీప్ కృష్ణన్’ ఒకరు. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. సందీప్ పాత్రను యంగ్ హీరో అడివి శేష్ పోషించాడు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం జూన్ 3న విడుదలవుతున్నట్లు ఇటీవల చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: బాక్సాఫీసు వద్ద తలపడబోతున్న సమంత, నాగచైతన్య అయితే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇదిలా ఉంటే నేడు 'మేజర్' ట్రైలర్ విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. ఓ వీడియో రూపంలో మే 9న ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే తాజాగా ఈమూవీ ట్రైలర్‌ను భారత డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ వీక్షించారు. ఈ ట్రైలర్ చూసిన ఆయన మూవీ టీంను అభినందించడమే కాక ఈ చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా మేజర్ స్టోగన్ను విడుదల చేయించింది మూవీ టీం. చదవండి: రూ. 400 కోట్ల క్లబ్‌లోకి కేజీయఫ్ 2, హిందీలో ఈ 2 దక్షిణాది సినిమాలే టాప్ ఇక ఈ సినిమాలో మేజర్ ఉన్నికృష్ణన్ పాత్రలో యంగ్ హీరో అడివి శేష్ ప్రాణం పెట్టి నటించినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. దేశభక్తిని చాటిచెప్పే సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. చిత్రంలో హీరోయిన్లుగా సయూ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ కనిపించనున్నారు. ఓ ప్రత్యేకమైన పాత్రలో రేవతి అలరించనున్నారు. Jaan Doonga Desh Nahi - जान दूँगा देश नहीं 🇮🇳#Major squad with Shri Rajnath Singh, Minister of Defence of India.#MajorTrailer on May 9 💥#MajorTheFilm#MajorOnJune3rd @AdiviSesh @sobhitaD @saieemmanjrekar @GMBents @urstrulyMahesh @AplusSMovies @SashiTikka @majorthefilm pic.twitter.com/PfmDMUGSnf — Sony Pictures Films India (@sonypicsfilmsin) May 6, 2022 -
అడవి శేష్ 'మేజర్' ట్రైలర్ వచ్చేది అప్పుడే..
Adivi Sesh Major Movie Trailer Release Date Announced: దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో ‘మేజర్ సందీప్ కృష్ణన్’ ఒకరు. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్’. సందీప్ పాత్రను యంగ్ హీరో అడివి శేష్ పోషించాడు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం జూన్ 3న మేజర్ విడుదలవుతున్నట్లు ఇటీవల చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ క్రమంలో 'మేజర్' సినిమా ట్రైలర్ విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. ఓ వీడియో రూపంలో మే 9న ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. చిత్రంలో హీరోయిన్లుగా సయూ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ కనిపించనున్నారు. ఓ ప్రత్యేకమైన పాత్రలో రేవతి అలరించనున్నారు. చదవండి: ప్రజలను ప్రేమించడమే దేశభక్తి! -
'మేజర్' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది!
యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. ముంబై 26/11 దాడుల్లో వీరమరణం పొందిన ఎన్ఎస్జీ కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన మేజర్ ఎట్టకేలకు రిలీజ్‌కు రెడీ అయింది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న మేజర్ విడుదలవుతున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మించాయి. శోభితా ధూళిపాళ్ల, సయీ మంజ్రేకర్, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. ‘ శశికిరణ్ తిక్క దర్శకత్వంలో ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కింది. Slight change in date 🔥 SUMMER HEAT wave hits theatres one week later 🇮🇳 JUNE 3 it is! #MajorTheFilm worldwide #Telugu :: #Hindi :: #Malayalam #MajorOnJune3rd #MajorSandeepUnnikrishnan pic.twitter.com/4hmDShZFhd — Adivi Sesh (@AdiviSesh) April 27, 2022 చదవండి: యంగ్ హీరోపై వరుస కేసులు వ్యభిచారం చేయాలని నిర్మాత ఒత్తిడి.. నటి ఆత్మహత్యాయత్నం -
అడివి శేష్ 'మేజర్' మూవీ ఫస్ట్ గ్లింప్స్ చూశారా?
యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం మేజర్ ( 26/11 ముంబై ఉగ్ర దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతుంది ఈ చిత్రం. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను లాక్ చేస్తూ స్పెషల్ గ్లింప్స్ వీడియోను హీరో అడివి శేష్ ట్విట్టర్లో షేర్ చేశారు. కాగా ఈ చిత్రంలో శోభితా ధూళిపాళతోపాటు బాలీవుడ్ హీరోయిన్ సయీ మంజ్రేకర్ మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీ శర్మ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. The Teaser was just a glimpse of the RAMPAGE in #MajorTheFilm AIM. SET. LOCK. MAY 27th. 2022. This Summer. Worldwide. Theaters Only. pic.twitter.com/UEVa92j5Q3 — Adivi Sesh (@AdiviSesh) February 22, 2022 -
‘మేజర్’ వచ్చేస్తున్నాడు
దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో ‘మేజర్ సందీప్ కృష్ణన్’ ఒకరు. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్’. సందీప్ పాత్రను యంగ్ హీరో అడివి శేష్ పోషించాడు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కావాల్సింది. అయితే కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ని ప్రకటించింది చిత్ర యూనిట్. మే 27వ తేదీన థియేటర్లలో విడుదల చేసినట్టు తాజాగా ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్ర బృందం. మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మించాయి. శోభితా ధూళిపాళ్ల, సయీ మంజ్రేకర్, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. Witness the Might of Major on Big Screens 💪#MajorTheFilm worldwide release on 27 May, 2022 🔥🔥#MajorOnMAY27 @AdiviSesh @saieemmanjrekar @SashiTikka #SriCharanPakala @sonypicsindia @urstrulyMahesh @GMBents @AplusSMovies @ZeeMusicsouth pic.twitter.com/JpAqhhSFLI — GMB Entertainment (@GMBents) February 4, 2022 -
'మేజర్' చిత్రంపై సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు
26/11 ఉగ్రదాడుల సమయంలో ముంబైని రక్షించడంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన ధైర్యవంతులలో దివంగత మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఒకరు. మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం నుంచి ప్రేరణ పొంది తీసిన బయెపిక్ 'మేజర్' సినిమాతో టాలీవుడ్ హీరో అడవి శేష్ బాలీవుడ్లో అరంగ్రేటం చేయనున్నారు. నవంబర్ 26, 2008 (26/11) ముంబైలో జరిగిన ఉగ్రదాడితో ప్రపంచం మొత్తం వణికిపోయిన సంగతి విదితమే. భారత్‌తో పాటు 14 దేశాలకు చెందిన మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మారణ హోమం జరిగి గురువారానికి 13 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా మేజర్ సందీప్ తల్లిదండ్రులైన ఇస్రో రిటైర్డ్ అధికారి కె. ఉన్ని కృష్ణన్, ధనలక్ష్మీ ఉన్ని కృష్ణన్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సందీప్‌లా చిత్రీకరించలేరు.. 'తమ కుమారుడిపై బయోపిక్ తీస్తామని చాలా మంది వాగ్దానాలు చేశారు. కానీ ఎవరు తీయలేదు. మొదట్లో అడవి శేష్ మా వద్దకు వచ్చినప్పుడు బయోపిక్ తీస్తామంటే ఒప్పుకోలేదు. మేజర్ చిత్రంలో తమ కుమారుడి పాత్రను అడవి శేష్ పోషిస్తామనడంతో ఒప్పుకున్నాం. ఇంకా చిత్రంపై ఎలాంటి అభిప్రాయం లేదు. సినిమా చూసిన తర్వాతే అభిప్రాయాన్ని చెప్పగలను. నేను వారి పనితీరు చూశాను. అడవి శేష్ కంటే శశికిరణ్ మీదే నాకు నమ్మకం ఎక్కువ. అతను ఇక్కడ ఉంటే బాగుండేది. సినిమా చూశాక 100 శాతం సర్టిఫికేట్ ఇస్తా. షూటింగ్ పూర్తయింది. విడుదల తేది కూడా ఖరారైంది. నేను సందీప్ తండ్రిని. సందీప్‌ను చూశాను. అతని విమర్శకుడిని నేను. నాకు సందీప్ గురువు. సందీప్‌ను అతనిలా చిత్రీకరించలేరని అనుకుంటున్నాను. అది సాధ్యం కాదు. ఆ విషయానికొస్తే ఏ బయోపిక్ అయినా 100 శాతం పూర్తిగా చూపించలేరు. ఎంతవరకూ చూపించారనేదే మనం ఆలోచించాలి. నేను వారి ప్రయత్నాన్ని విమర్శించడం లేదు. శేష్ చాలా నిజాయితీపరుడు. కానీ సందీప్‌ను ప్రతిబింబించేలా నటించగలడో లేదో తెలియదు.' అని సందీప్ తండ్రి ఉన్ని కృష్ణన్ తెలిపారు. వారు కూడా నా కుటుంబమే.. మేజర్ సినిమా 26/11 ఘటన గురించి మాత్రమే కాదు, మేజర్ ఉన్న కృష్ణన్ జీవితం, అతని వ్యక్తితం గురించి అని హీరో అడవి శేష్ పేర్కొన్నారు. 'ఈ దాడి జరిగినప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. ఈ ఘటన గురించి టీవీలో చూశాను. అప్పుడు మేజర్ సందీప్ ఫొటోలు చూసి, అతను ఎవరా అని షాక్ అయ్యాను. 31 ఏళ్ల వయసులో తన ప్రాణాలను త్యాగం చేసినందుకు నేను చాలా ఆశ్చర్యపోయాను. అతను మన కుటుంబంలో వ్యక్తిలా కనిపించాడు. కరోనా మహమ్మారి కారణంగా సినిమా చిత్రీకరణకు చాలా సమయం పట్టింది. ఈ సమయాన్ని మేజర్ పాత్రను బాగా అర్థం చేసుకునేందుకు ఉపయోగపడింది. మేజర్ సందీప్ తల్లిదండ్రులతో మంచి బంధం ఏర్పడింది. మేము ఏదో షూటింగ్ కోసం కలిశామన్న సంగతి మర్చిపోయాం. మేము ఇప్పుడు సొంత బంధువులం అయ్యాం.' అని అడవి శేష్ చెప్పుకొచ్చారు. 'సినిమా తర్వాత ఏం జరుగుతుంది. విడుదల తర్వాత మమ్మల్ని మర్చిపోతావు' అని అంకుల్ తనను తరచుగా అడిగేవాడని అడవి శేష్ తెలిపారు. వారికి తాను ఎప్పుడు అండగా ఉంటానని, అది కుడా తన కుటుంబమే అని, ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు. మేజర్ సినిమా ఫిబ్రవరి 11, 2022న తెలుగు, మళయాలం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇందులో సాయి మంజ్రేకర్, శోభితా ధూలిపాళ, రేవతి, ప్రకాశ్ రాజ్ తదితరులు నటించారు. -
ప్రజలను ప్రేమించడమే దేశభక్తి!
అడివి శేష్ పెరిగింది అమెరికాలో. కానీ ఆలోచనలన్నీ తన మాతృదేశం ఇండియా చుట్టే. అమెరికాలో ‘వందేమాతరం’ వినబడినా లేచి నిలబడేంత ప్రేమ తన దేశం మీద శేష్‌కి ఉంది. ఇప్పుడు ‘మేజర్’లో నటించాక దేశ సైనికులపై ప్రేమ, గౌరవం పెరిగాయి. 26/11 ముంబై దాడుల్లో వీరమరణం పొందిన ఎన్ఎస్జీ కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్‌గా ‘మేజర్’ తెరకెక్కుతోంది. సందీప్ పాత్రను అడివి శేష్ చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ టీవీకి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో అడివి శేష్ చెప్పిన విశేషాల్లో ముఖ్యమైనవి ఈ విధంగా... ►నా భవిష్యత్ కోసం అమ్మానాన్న అమెరికా షిఫ్ట్ అయ్యారు. నేను చిన్నప్పుడు అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్ స్కూల్లో చదువుతున్నప్పుడే ఇండియా గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. ఏఆర్ రెహమాన్‌గారి ‘వందేమాతరం’ పాట వచ్చినప్పుడు నిలబడేవాడిని. మా తాతగారు స్వాతంత్య్ర సమరయోధులు. అందువల్లే దేశభక్తి గీతాలు వచ్చినప్పుడు నిలబడుతుంటానేమో. ►సైనికులు మన రక్షణ కోసం దేశ సరిహద్దుల్లో ఎంతో కష్టపడుతున్నారు. ‘మేజర్’ సినిమా కోసం కొంత పరిశోధన చేశాను. దేశ సైనికులపై నాకు ఉన్న గౌరవం, ప్రేమ, అభిమానం ఇప్పుడు మరింత పెరిగాయి. ‘మేజర్’ సినిమా కోసం నేను కొన్ని బోర్డ్ క్యాంపస్‌లలో పాల్గొన్నాను.. శిక్షణ తీసుకున్నాను. అతి వేడి, అతి చలిలో ఉండాలి. కొన్నిసార్లు ఆహారం కూడా లభించని పరిస్థితులు ఉంటాయి. అలా ఓ సైనికుడిలా ఉండగల పట్టుదల, శక్తి నాలో ఉన్నాయో? లేవో కూడా నాకు తెలియదు. ►26/11 ముంబై దాడుల్లో చనిపోయిన అమరవీరుల్లో సందీప్ ఉన్నికృష్ణన్గారు ఉన్నారు. ఆర్మీ సైడ్ నుంచి మనం కోల్పోయిన వీరజవాన్ ఆయన. అందుకే ఆయన జీవితం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నాను. ఆ తర్వాత సందీప్‌గారి జీవితం గురించి తెలుసుకుని ఆయనకు అభిమాని అయిపోయాను. ఫాలోయర్ అయ్యాను. ►సూపర్‌స్టార్ మహేశ్‌బాబుగారి ‘సరిలేరు నీకెవ్వరు’, సై్టలిష్స్టార్ అల్లు అర్జున్‌గారి ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలు ‘బయోపిక్’లు కాదు. ఆ కథలోని ఆర్మీ ఆఫీసర్ పాత్రకు జస్టిస్ చేసే ఒక స్టార్‌ని ప్రేక్షకులు చూడాలనుకుంటారు. కానీ ‘మేజర్’ విషయానికొస్తే.. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ను వెండితెరపై చూడాలనుకుంటారు. ఎందుకంటే ఇది రియల్ స్టోరీ.అలాగే ‘మహానటి’ చూస్తున్నప్పుడు, ఆ సినిమాను ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ చేసినప్పటికీ మనం వెండితెరపై సావిత్రిగారినే చూడాలనుకుంటాం. అలాగే ఎంత పెద్ద స్టార్ ప్లే చేసినా మనం మేజర్ సందీప్‌నే చూడాలనుకుంటాం. ‘మేజర్’లో సందీప్‌నే చూస్తారు. ►ఆర్టికల్స్, బుక్స్‌లలో మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం గురించి కొన్ని విషయాలు, విశేషాలను తెలుసుకున్నాను. కానీ ఆయన కుటుంబసభ్యుల వల్ల, వారు ఇచ్చిన గైడెన్స్ వల్ల ఆయన గురించి నాకు కొత్త సంగతులు తెలిశాయి. ‘మేజర్’ చిత్రానికి డెప్త్ ఇచ్చిందే వాళ్లు. ►‘మేజర్’ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ...‘ఇండియన్ అంటే ఏంటి’? సాటి మనిషికి మనం సాయం చేయడం అంటే ఏంటి?, ‘సోషల్ మీడియాలో మనం యాష్‌ట్యాగ్‌తో జైహింద్ అని పెట్టేస్తే సరిపోతుందా? ఇలాంటి అంశాల గురించి ప్రేక్షకులు ఆలోచిస్తారు. అయితే ఒక సినిమా ఒక మనిషిని ఎంత మారుస్తుంది? అనేది నాకు తెలియదు. ►నేనొక మంచి రైటర్, మంచి యాక్టర్.. కానీ బ్యాడ్ డైరెక్టర్ (సరదాగా). నా ఫస్ట్ ఫిల్మ్‌కు నేనే దర్శకత్వం వహించాను. కానీ డైరెక్షన్ అనేది నాకు సూట్ కాదని అర్థమైంది. ‘గూఢచారి’ సినిమాకు నేను కథ రాసుకున్నట్లే స్క్రీన్‌పై దర్శకుడిగా శశికిరణ్ చూపించారు. కానీ విజువల్‌గా బాగా చూపించడం గ్రేట్. అయితే ఇప్పుడు ‘మేజర్’ బిగ్ బడ్జెట్ ఫిల్మ్. సో.. ఈ సినిమాను మరింత గ్రాండియర్‌గా తీయాలంటే శశికిరణే కరెక్ట్ అనిపించింది. ►ప్రస్తుతానికి సినిమాలనే పెళ్లి చేసు కున్నాను. సినిమాలు కాకుండా ఆలోచించాలంటే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో నేను దేశభక్తిని ఎక్కువగా ఫీలయ్యాను. చాలామందికి సహాయం చేశాను. ప్రజలను ప్రేమించడం దేశభక్తే అవుతుందని నమ్ముతాను. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి నీరు తాగే సౌకర్యం లేకపోవడం ఏంటి? నాకు తెలిసిన వాళ్లలో వారికి కరోనా టైమ్‌లో బెడ్స్ దొరక్కపోవడం ఏంటి? ఇంట్లో పేరెంట్స్‌కు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లేకపోవడం ఏంటి? కాస్త ఎమోషనల్‌గా ఫీలయ్యాను. కరోనా టైమ్‌లో ఎవరికో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అంటే డబ్బులు పంపించాను. సాయం చేసిన మనిషిని కూడ నేను చూడలేదు. ఆయన నాకు థ్యాంక్స్ చెప్పలేదు. కానీ మనం ఒకరికొకరం సాయం చేసుకోవాలి. కెరీర్ సక్సెస్‌లో, నా సంపాదనలో ప్రజలు ఉన్నప్పుడు మనం కాకపోతే ఇంకెవరు సాయం చేస్తారు? -
Major Movie: ఆపరేషన్ రీ స్టార్ట్!
‘మేజర్’ ఆపరేషన్‌ను అడివి శేష్ రీ స్టార్ట్ చేయనున్నారు. అడివి శేష్ హీరోగా నటిస్తున్న తొలి ప్యాన్ ఇండియన్ మూవీ ‘మేజర్’. అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ‘గుఢచారి’ ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే 90 శాతం పూర్తయిన ఈ సినిమా షూటింగ్ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. షూటింగ్‌ను వచ్చే నెల జూలైలో తిరిగి ఆరంభించనున్నట్లు అడివి శేష్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ‘‘హిమాచల్ ప్రదేశ్‌లోని చిట్కుల్ ప్రాంతంలో ఏడాది క్రితం ‘మేజర్’ షూటింగ్‌ను మొదలుపెట్టాం. అక్కడి విజువల్స్, అక్కడి వారితో నాకు ఉన్న అనుభవాలు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. వచ్చె నెలలో చిత్రీకరణను తిరిగి మొదలు పెట్టనున్నాం’’ అంటూ ఈ చిత్రనిర్మాతల్లో ఒకరైన శరత్‌తో తాను లాక్‌డౌన్‌కి ముందు ‘మేజర్’ లొకేషన్లో దిగిన స్టిల్‌ను కూడా షేర్ చేశారు అడివి శేష్. -
Major: అనుకున్న సమయానికి రావడం లేదట!
26/11 ముంబై ఉగ్రదాడుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "మేజర్". అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సయూ మంజ్రేకర్, శోభితా దూళిపాల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ చేయడం లేదట. కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల జూలై 2న థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రాన్ని మరికొన్నాళ్లపాటు వాయిదా వేయనున్నారట. #ReleaseDay of #MajorTheFilm will be my PROUDEST moment. So Let's celebrate when times get better. Safer. Maamulga undadhu. I Promise #JaiHind @saieemmanjrekar @sobhitaD @SonyPicsIndia @GMBents @urstrulyMahesh @AplusSMovies @SashiTikka @MajorTheFilm#MajorSandeepUnnikrishnan pic.twitter.com/888UYLTZD3 — Adivi Sesh (@AdiviSesh) May 26, 2021 ఈ మేరకు అడివి శేష్ సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశాడు. పరిస్థితులు సాధారణమైన తర్వాత కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని వెల్లడించాడు. కచ్చితంగా దీన్ని తొలుత థియేటర్లలోనే విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చాడు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మహేశ్‌బాబు ఏఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏప్లస్ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా వైడ్ రిలీజవుతోంది. చదవండి: ఉగ్రదాడుల్లో చిక్కుకున్న శోభితా దూళిపాల మేజర్ కోసం అదిరిపోయే ఆరు సెట్లు! -
ఎవరూ రాకండి, వాళ్ల అంతు నేను చూస్తా: అడివి శేష్
గూఢచారి తర్వాత హీరో అడివి శేష్, దర్శకుడు శశికిరణ్ తిక్క కాంబినేషన్లో వస్తున్న సినిమా మేజర్. శోభితా ధూళిపాళ, సయీ మంజ్రేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముంబై 26/11 ఉగ్ర దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సోమవారం మేజర్ టీజర్ రిలీజైంది. తెలుగులో మహేశ్‌బాబు, హిందీలో సల్మాన్‌ఖాన్, మలయాళం వర్షన్‌ను పృథ్వీరాజ్ రిలీజ్ చేశారు. ఇందులో అగ్నికీలల్లో కాలిపోతున్న హోటల్లో అమాయకులను కాపాడేందుకొచ్చిన వీరుడిలా అడివి శేష్ కనిపిస్తున్న సీన్‌తో టీజర్ మొదలవుతుంది. 'బార్డర్లో ఆర్మీలా ఫైట్ చేయాలి, ఇండియా క్రికెట్ మ్యాచ్ అయినా గెలవాలి.. అందరూ ఇదే ఆలోచిస్తారు. అదీ దేశభక్తే. దేశాన్ని ప్రేమించడం అందరి పని, వాళ్లను కాపాడటం సోల్జర్ పని', 'డోంట్ కమ్ అప్.. ఐ విల్ హ్యాండిల్ దెమ్(ఎవరూ రాకండి. వాళ్ల సంగతి నేను చూసుకుంటాను)' అని హీరో చెప్పిన డైలాగులు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. బీజీఎమ్ మాత్రం అదరగొడుతోంది. ఈ టీజర్ చూసిన నెటిజన్లు గూస్బంప్స్ వస్తున్నాయ్.. దీని గురించి చెప్పడానికి మాటల్లేవ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. హీరో నాని సైతం ఈ మధ్యకాలంలో ఇంత మంచి టీజర్‌ను చూడలేదని ప్రశంసిస్తూ ట్వీట్ చేయడం విశేషం. ‘మేజర్’ను ఈ జూలై 2న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు హీరో మహేశ్‌బాబు నిర్మాణ భాగస్వామి కావడం విశేషం. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. I have watched #MajorTeaser And I think it’s the BEST teaser I have watched in a very long time 🔥@AdiviSesh — Nani (@NameisNani) April 11, 2021 చదవండి: మేజర్: ఉగ్రవాదులతో పోరాడిన ధీర వనిత.. అమెరికన్లు ఈ హీరోను అధ్యక్షుడిగా కావాలనుకుంటున్నారంట -
మేజర్: ఉగ్రవాదులతో పోరాడిన ధీర వనిత..
26/11 ముంబై టెర్రరిస్ట్ దాడుల్లో మృతి చెందిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "మేజర్". ఉన్నికృష్ణన్ పాత్రలో అడివి శేష్ నటిస్తున్నాడు. ఇందులో శోభిత దూళిపాళ్ల హీరోయిన్. సయీ మంజ్రేకర్‌ది కీలక పాత్ర. ఇటీవలే ఆమె లుక్ రిలీజ్ చేయగా తాజాగా తెలుగమ్మాయి శోభితా దూళిపాళ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. "ఉగ్రవాదులు హోటల్లోకి చొరబడ్డారు. ఆమె కోసం లోపలకు వచ్చారు. కానీ ఆమె ఎదురు తిరిగి వారితో పోరాడింది" అంటూ ఈ పోస్టర్‌ను ట్వీట్ చేశాడు. అందులో ఆ యువతి పడ్డ వేదనను కళ్లకు కట్టినట్లు చూపించారు. పోస్టర్ చూస్తుంటే ఇది సినిమాలోని అతి ముఖ్యమైన సన్నివేశాల్లో ఒకటి అని తెలుస్తోంది. జీఎంబీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మహేశ్‌బాబు, సోనీ పిక్చర్స్, ఏప్లస్ ఎస్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నాడు. ఏప్రిల్ 12న టీజర్ రిలీజ్ కానుండగా జూలై 2న సినిమా విడుదల అవుతోంది. ఇదిలా వుంటే ‘గూఢచారి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన శోభితా చివరగా ‘ఘోస్ట్ స్టోరీస్’లో కనిపించింది. ఆ మధ్య వచ్చిన ‘మేడ్ ఇన్ హెవెన్’ వెబ్‌సిరీస్ ఆమెకు మంచి గుర్తింపునిచ్చింది. Introducing a new dimension in the #PeopleOfMajor The Terrorists came into the hotel. Then they came for her. She fought back. @sobhitaD IS PRAMODA#MajorTheFilm#MajorTeaserOnApril12 pic.twitter.com/PgEmDy5JhL — Adivi Sesh (@AdiviSesh) April 9, 2021 చదవండి: హాలీవుడ్ సినిమాలో శోభితా దూళిపాళ్ల.. ‘మేజర్’ అప్డేట్ : అడివి శేష్, సయీ మంజ్రేకర్ లుక్ వైరల్ -
‘మేజర్’ అప్డేట్ : అడివి శేష్, సయీ మంజ్రేకర్ లుక్ వైరల్
ఫ్రాంక్ ఆంథోనీ పబ్లిక్ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నారు హీరో అడివి శేష్, హీరోయిన్ సయీ మంజ్రేకర్. వీరిద్దరూ స్కూల్లో చేరింది ‘మేజర్’ సినిమా కోసమే. వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఇది. సందీప్ చిన్ననాటి విశేషాలను కూడా సినిమాలో చూపించనున్నారు. ‘గూఢచారి’ ఫేమ్ శశికిరణ్ తిక్క ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాలోని శేష్, సయీల క్యారెక్టర్ పోస్టర్‌ను విడుదల చేశారు. అలాగే ‘మేజర్’ టీజర్‌ను ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ‘‘శౌర్యం, ధైర్యానికి పేరుగాంచిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వీరమరణం పొందిన ఘటనలను మాత్రమే కాకుండా, ఆయన వ్యక్తిగత జీవితంలోని ఇతర సంఘటనలను కూడా ఈ సినిమాలో చూపించనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. మహేశ్‌బాబు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘మేజర్’ సినిమా జూలై 2న విడుదల కానుంది. A letter MEANS something. Every word sounds simple...but is worth so much more. She met him in school She dreamt of a life with him She felt much more than she could write... The First Look of @saieemmanjrekar In #MajorTheFilm You will see her in the #MajorTeaserOnApril12 pic.twitter.com/n3cK673y3q — Adivi Sesh (@AdiviSesh) April 3, 2021 -
మేజర్ టీజర్ రిలీజ్ అయ్యేది అప్పుడే!
‘గూఢచారి’ తర్వాత హీరో అడివి శేష్, దర్శకుడు శశికిరణ్ తిక్క కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘మేజర్’. శోభితా ధూళిపాళ, సయీ మంజ్రేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముంబై 26/11 దాడుల్లో వీరమరణం పొందిన ఎన్ ఎస్జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డు ) కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. సోమవారం ఉన్నికృష్ణన్ జయంతి సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. టీజర్‌ను మార్చి 28న విడుదల చేయనున్నట్లు చిత్రబందం వెల్లడించింది. తెలుగు, ఇంగ్లీషుల్లో తెరకెక్కుతోన్న ‘మేజర్’ను ఈ జూలై 2న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు హీరో మహేశ్‌బాబు నిర్మాణ భాగస్వామి కావడం విశేషం. చదవండి: ‘జాతి రత్నాలు’ హీరోయిన్‌కు బంపర్ ఆఫర్.. ఏకంగా..!