Adivi Sesh Major Movie First Week Collections - Sakshi
Sakshi News home page

Major Collections: తొలి వారం మంచి కలెక్షన్స్‌ రాబట్టిన మేజర్‌

Published Fri, Jun 10 2022 6:58 PM | Last Updated on Fri, Jun 10 2022 7:57 PM

Adivi Sesh Major Movie First Week Collections - Sakshi

ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాన్ని అడ్డేసిన హీరో మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన ఈ రియల్‌ హీరో జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్‌. యువ కథానాయకుడు అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు శశికిరణ్‌ తిక్క దర్శకుడు.  సయీ మంజ్రేకర్‌, శోభిత ధూళిపాళ హీరోయిన్స్‌గా నటించగా, ప్రకాశ్‌ రాజ్‌, రేవతి కీలక పాత్రలు పోషించారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించారు.  అనురాగ్‌, శరత్‌ నిర్మించిన ఈ మూవీ జూన్‌ 3న విడుదలవగా సూపర్‌ హిట్‌ టాక్‌ సంపాదించుకుంది. 

తొలి రోజే రూ.13.10 కోట్ల గ్రాస్‌ సాధించిన ఈ చిత్రం వారం రోజుల్లోనే రూ.50.7 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ రిలీజ్‌ చేసిన అడివి శేష్‌.. ఇది తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అని రాసుకొచ్చాడు. తన గత సినిమాల కంటే మేజర్‌ మూడు రెట్లు ఎక్కువ కలెక్షన్స్‌ రాబట్టిందని సంతోషం వ్యక్తం చేశాడు.

చదవండి: కిన్నెరసాని రివ్యూ
సీక్రెట్‌గా సింగర్‌ పెళ్లి, ఆపేందుకు ప్రయత్నించిన భర్త

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement