పాఠశాలలకు ‘మేజర్‌’ మూవీ టీం స్పెషల్‌ ఆఫర్‌! | Major Movie Team Offers 50 Percent Discount to School On Ticket Rates | Sakshi
Sakshi News home page

Major Movie: పాఠశాలలకు ‘మేజర్‌’ మూవీ టీం స్పెషల్‌ ఆఫర్‌!

Jun 15 2022 8:51 AM | Updated on Jun 15 2022 9:12 AM

Major Movie Team Offers 50 Percent Discount to School On Ticket Rates - Sakshi

ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నీకృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్‌’. యంగ్‌ హీరో అడివి శేష్‌ లీడ్‌ రోల్‌ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్‌ తిక్క దర్శకత్వం వహించారు. జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా చూసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మేజర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటూ కితాబిస్తున్నారు.

చదవండి: అదే విషయాన్ని ‘గాడ్సే’తో సీరియస్‌గా చెప్పే ప్రయత్నం చేశాం: డైరెక్టర్‌

ఇక ఈ సినిమా చూసిన మెగాస్టార్‌ చిరంజీవి సైతం మేజర్‌ సినిమా మాత్రమే కాదని.. ఒక ఎమోషనల్‌ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మేజర్‌ చిత్ర బృందం పాఠశాలకు ఓ స్పెషల్‌ ఆఫర్‌ ఇచ్చింది. మేజర్‌ సందీప్‌ ఉన్నిఒకృష్ణన్‌ జీవితం గురించి ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాలనే ఉద్దేశంతో పాఠశాలల యాజమాన్యాలకు టీకెట్‌ ధరపై 50 శాతం రాయితి ఇస్తున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. పాఠశాలల యాజమాన్యాల కోసం ప్రత్యేకంగా షో వేస్తామని, ఇందుకోసం majorscreening@gmail.comకి మెయిల్‌ చేసి అవకాశాన్ని పొందాలని మేజర్‌ టీం తెలిపింది. 

చదవండి: ఆ విషయంలో వెన్నెల.. నేనూ ఒకటే: సాయి పల్లవి 

ఇదిలా ఉంటే దీనిపై మేజర్‌ హీరో అడివి శేష్‌ తన ట్వీటర్‌లో ఓ వీడియో రిలీజ్‌ చేశారు. ఈ వీడియో అడివి శేష్‌ మాట్లాడుతూ.. ‘మేజర్ సినిమాను సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. చాలామంది చిన్నారులు నాకు ఫోన్ చేసి తాము కూడా మేజర్ సందీప్‌లా దేశం కోసం పోరాడతామని చెబుతున్నారు. చిన్నారుల నుంచి వస్తున్న స్పందన చూసి నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను వారి కోసం రాయితీపై ప్రదర్శించాలని నిర్ణయించాం. గ్రూప్ టికెట్లపై పాఠశాలలకు రాయితీ కల్పిస్తున్నాం. ‘మేజర్’ గురించి రేపటి తరానికి తెలియాలనేదే మా లక్ష్యం’ అని అడవి శేష్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement