ticket rates
-
తెలంగాణలో టికెట్ రేట్లపై దిల్ రాజు హాట్ కామెంట్స్
-
బెనిఫిట్ షో లేదు.. రేట్ల పెంపు లేదు.. తేల్చేసిన సీఎం రేవంత్..
-
సీఎం సీరియస్ సినీ పెద్దలకు షాక్..
-
వైఎస్ జగన్ నిర్ణయం అద్భుతం: విజయేందర్ రెడ్డి
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. సామాన్యుడికి అందుబాటులో సినిమా టికెట్ ధరలు ఉండాలని ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం అద్భుతమని ఆ రోజే తాను చెప్పానని అన్నారు. థియేటర్స్, టిక్కెట్ రేట్ల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం ముమ్మాటికి సరైందేనని తెలిపారు.కానీ అప్పుడు సినీ ఇండస్ట్రీ అంతా భయపడిందని విజయేందర్ రెడ్డి గుర్తు చేశారు. కానీ అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ఇపుడు తెలంగాణలో అమలు చెయ్యాలని అందరూ కోరుకుంటున్నారని విజయేందర్ వెల్లడించారు.అయితే ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. పుష్ప-2 సినిమా ఘటన తర్వాత బెనిఫిట్ షోలు, టికెట్స్ రేట్ల పెంచుకునేందుకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైందేనంటూ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి కొనియాడారు. -
సినిమా టికెట్లు ఎందుకంత ఖరీదు..?
సినిమాకు వెళితే పిల్లలు, తల్లిదండ్రులు, ప్రేమికులు, స్నేహితులు, తెలిసినవారు, బంధువులు.. ఇలా చాలామందిని గమనించవచ్చు. నిత్యం ఏదో పనుల్లో బిజీగా ఉండేవారికి సినిమాలు ఆటవిడుపుగా మారి వినోదాన్ని అందిస్తుంటాయి. కొన్నేళ్ల కొందట సినిమా నిర్మించడానికి రూ.లక్షల్లో ఖర్చయ్యేది. డిస్ట్రిబ్యూటర్లకు కూడా అదే తరహాలో రాబడి ఉండేది. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. చిత్ర నిర్మాణానికి రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నారు. వాటిని రాబట్టేందుకు ప్రమోషన్లు, టికెట్ రేట్లు పెంచడం వంటి విభిన్న మార్గాలను అనుసరిస్తున్నారు. ఫక్తు వినోదాన్ని అందించాల్సిన సినీ పరిశ్రమలో క్రమంగా వ్యాపార ధోరణి పేరుకుపోతుంది. క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించిన రోజు నుంచి ఇంటర్వెల్లో ప్రేక్షకులు పాప్‌కార్న్ కొనుగోలు చేసేంత వరకు వివిధ స్థాయుల్లో వ్యాపారం ఏ విధంగా సాగుతుందో తెలుసుకుందాం.ప్రీ ప్రొడక్షన్ ఖర్చులు: సినిమా ప్రారంభానికి ముందు ప్రీ ప్రొడక్షన్ ఖర్చులుంటాయి. ఇందులో స్క్రిప్ట్ డెవలప్ మెంట్, లొకేషన్ సెలక్షన్.. వంటి వాటికోసం కొంత డబ్బు అవసరం అవుతుంది.ప్రొడక్షన్ ఖర్చులు: ఈ ఖర్చు చాలా కీలకం. నటీనటులు, సిబ్బంది జీతాలు, పరికరాల అద్దె, సెట్ నిర్మాణం, దుస్తులు, ప్రత్యేక ఖర్చులు దీని కిందకు వస్తాయి.పోస్ట్ ప్రొడక్షన్ ఖర్చులు: ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్, మ్యూజిక్ లైసెన్సింగ్ వంటి వాటి కోసం కొంతక ఖర్చు చేయాల్సి ఉంటుంది.మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్: సినిమాను ప్రమోట్ చేయడం, డిస్ట్రిబ్యూషన్ డీల్స్ కుదుర్చుకోవడం దీని కిందకు వస్తాయి.సౌకర్యాలకు పెద్దపీటగతంలో వీటన్నింటికి తక్కువగానే ఖర్చు అయ్యేది. ఇటీవల కాలంలో వీటి వ్యయం రూ.కోట్లల్లోనే ఉంది. కొన్నేళ్ల కిందట టౌన్‌లోని చిన్న థియేటర్లో ఫ్యాన్ సౌండ్‌ను భరిస్తూ సినిమా చూసేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఏసీ థియేటర్, ప్రీమియం సీటింగ్, లగ్జరీ సౌకర్యాలతో సినిమాను ఆస్వాదిస్తున్నారు. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా సినిమా థియేటర్ యాజమాన్యాలు కూడా మౌలిక సదుపాయాలను అప్డేట్ చేస్తున్నాయి. ఆ ఆర్థిక భారాన్ని తుదకు ప్రేక్షకులే భరించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.పాన్ ఇండియా మార్కుఒకప్పుడు స్థానిక భాషలో సినిమా నిర్మించి అదే రాష్ట్రంలో విడుదల చేసేవారు. కానీ ప్రస్తుతం ఏ భాషలో సినిమా తీసినా ‘పాన్ ఇండియా’ మార్కుతో విభిన్న భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. దాంతో అక్కడి భాషల్లో విడుదల చేయాలంటే అదనంగా ఖర్చు చేయాల్సిందే. ఫలితంగా సినిమా కాస్ట్ పెరిగిపోతుంది. దాంతో టికెట్ రేట్లు పెంచుతున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్లో చేయాల్సినవి.. చేయకూడనివి!లిస్టెడ్ కంపెనీల జోరుపీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ వంటి లిస్టెడ్ కంపెనీలు దేశవ్యాప్తంగా చాలా మల్టిప్లెక్స్ థియేటర్లను నిర్వహిస్తున్నాయి. సినిమా టికెట్ కాస్ట్ కంటే యాడ్ఆన్ సర్వీసులుగా ఉండే స్నాక్స్, ఐస్‌క్రీమ్స్, వాటర్ బాటిల్.. వంటివి విక్రయించడంతోనే అధిక మార్జిన్లు సంపాదిస్తాయి. ఒకవేళ టికెట్ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటిస్తే అదనంగా ఆదాయం సమకూరినట్లే. థియేటర్లలో విభిన్న కంపెనీలు యాడ్లు ఇస్తుంటాయి. దానివల్ల ఆదాయం సమకూరుతుంది. మల్టిప్లెక్స్‌లు ప్రైవేట్ ఈవెంట్లకు స్కీన్లను రెంట్‌కు ఇస్తూంటాయి. అది కూడా ఒక ఆదాయ వనరుగా ఉంది. -
తెలంగాణలో 'కల్కి' టికెట్ ధరలు పెంపు.. ఒక్కొక్కటి ఏకంగా?
డార్లింగ్ ప్రభాస్ 'కల్కి' సినిమా థియేటర్లలోకి రావడానికి మరో నాలుగు రోజులే ఉంది. ఈ క్రమంలోనే సినిమాపై హైప్ రోజురోజుకి మెల్లగా పెరుగుతోంది. మరోవైపు టికెట్ బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని అభిమానులు వెయిటింగ్. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం నుంచి టికెట్ ధరల పెంపుతో పాటు అదనపు షోలకు అనుమతి వచ్చేసింది. కాకపోతే ఆ రేట్స్ చూస్తుంటేనే మైండ్ బ్లాంక్ అవుతోంది.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఎవరెవరికీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు?)ఈనెల 27 నుంచి జూలై 4 వరకు అంటే 8 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులు బాటు కల్పించారు. అలానే 27న ఉదయం 5:30 గంటలకు బెన్ఫిట్ షో వేసుకోవడానికి అనుమతిచ్చారు. ఐదురోజుల పాటు రోజుకి ఐదు షోలు వేసుకునేలా ఉత్వర్తులు జారీ చేశారు. అలానే ఒక్కో టికెట్‌పై గరిష్టంగా రూ.200 పెంచుకోవచ్చని పేర్కొన్నారు.సాధారణ థియేటర్లలో రూ.70, మల్టీఫ్లెక్స్‌ల్లో రూ.100 పెంచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. దీనిబట్టి చూస్తే బెన్ఫిట్ షో కోసం సింగిల్ స్క్రీన్ థియేటర్లో రూ.377, మల్టీఫ్లెక్స్‌ల్లో రూ.495 రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మిగతా రోజుల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.265, మల్టీఫ్లెక్స్‌ల్లో రూ.413 రూపాయలు ఉంటాయి. ఆన్లైన్లో బుకింగ్, త్రీడీ గ్లాస్ ఛార్జీలు అదనం. దీనిబట్టి చూస్తే ఒక్కో టికెట్ ధర రూ.500కి మించే ఉంటుంది!(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఈ లాజిక్ ఎలా మిస్సవుతున్నారు?) -
చవక రేటుకు పఠాన్ టికెట్.. ఒక్కరోజే ఛాన్స్!
షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ పఠాన్. దీపికా పదుకొణె కథానాయికగా నటించగా జాన్ అబ్రహం విలన్‌గా మెప్పించాడు. ఈ సినిమా ఊహించని స్థాయిలో ఘన విజయం సాధించింది. ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో ఏకంగా రూ.600 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఈ సందర్భంగా యశ్ రాజ్ ఫిలింస్ ప్రొడక్షన్స్ సినీ ప్రేమికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి 17వ తేదీని పఠాన్ సినిమా రూ.110కే అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. సాధారణ థియేటర్లతోపాటు పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్ వంటి అన్ని మల్టీప్లెక్స్‌లోనూ 110 రూపాయలకే పఠాన్ చూడవచ్చని తెలిపింది. మరింకే.. పఠాన్‌ను ఫ్రెండ్స్‌తో లేదా ఫ్యామిలీతో మరోసారి చూసేయాలనుకుంటే రేపే దగ్గర్లోని థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి ఆస్వాదించండి. ఇక పఠాన్ విషయానికి వస్తే జనవరి 25న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజైంది. ప్రపంచవ్యాప్తంగా రూ.970 కోట్లు రాబట్టింది. అందులో ఒక్క ఇండియాలోనే రూ.605 కోట్లు కాగా ఓవర్సీస్లో రూ.365 కోట్లు రాబట్టడం విశేషం. Join the festivities of #Pathaan party, as it continues to get immense love all over! ❤️ Book your tickets now for #Pathaan NOW - https://t.co/SD17p6x9HI | https://t.co/VkhFng6vBj Celebrate #Pathaan with #YRF50 only at a big screen near you, in Hindi, Tamil and Telugu. pic.twitter.com/9VyUVEztPS — Yash Raj Films (@yrf) February 16, 2023 #PathaanDay incoming! 💥 #Pathaan crosses 500 crores NBOC. Come celebrate with us this Friday. Book tickets at ₹ 110/- flat across all shows in India at @_PVRCinemas | @INOXMovies | @IndiaCinepolis and other participating cinemas! pic.twitter.com/7fuM0nU51c — Yash Raj Films (@yrf) February 16, 2023 చదవండి: అమ్మకు క్యాన్సర్.. అనాధాశ్రమంలో వదిలేశా -
అవతార్-2 ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన టికెట్ రేట్స్
హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ విజువల్ వండర్ మూవీ ‘అవతార్-2’. డిసెంబర్ 16న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. ఇండియాలోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోందీ చిత్రం. పండోరా అనే సరికొత్త గ్రహాన్ని సృష్టించి.. వింతలు, అద్భుతాలతో ఆద్యంతం విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు ఈ సినిమా టికెట్ రేట్స్ మరీ ఎక్కువగా ఉన్నాయంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవతార్ మూవీ లవర్స్‌కు గుడ్‌న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అవతార్-2 త్రీడీ వెర్షన్ టికెట్ ధరలు భారీగా తగ్గాయి. IMAX, 4DX వెర్షన్లు కాకుండా 3డీ వెర్షన్ టికెట్ ధరను రూ.150కి తగ్గించారు. ప్రేక్షకుల సంఖ్యను మరింత పెంచేందుకు తాజాగా తీసుకున్న టికెట్ తగ్గింపు నిర్ణయం కలెక్షన్లు పెరిగేందుకు బాగా ఉపయోగపడుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో అవతార్-2 ఇంకెన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి మరి. -
పాఠశాలలకు ‘మేజర్’ మూవీ టీం స్పెషల్ ఆఫర్!
ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నీకృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. యంగ్ హీరో అడివి శేష్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా చూసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మేజర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటూ కితాబిస్తున్నారు. చదవండి: అదే విషయాన్ని ‘గాడ్సే’తో సీరియస్‌గా చెప్పే ప్రయత్నం చేశాం: డైరెక్టర్ ఇక ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి సైతం మేజర్ సినిమా మాత్రమే కాదని.. ఒక ఎమోషనల్ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మేజర్ చిత్ర బృందం పాఠశాలకు ఓ స్పెషల్ ఆఫర్ ఇచ్చింది. మేజర్ సందీప్ ఉన్నిఒకృష్ణన్ జీవితం గురించి ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాలనే ఉద్దేశంతో పాఠశాలల యాజమాన్యాలకు టీకెట్ ధరపై 50 శాతం రాయితి ఇస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. పాఠశాలల యాజమాన్యాల కోసం ప్రత్యేకంగా షో వేస్తామని, ఇందుకోసం majorscreening@gmail.comకి మెయిల్ చేసి అవకాశాన్ని పొందాలని మేజర్ టీం తెలిపింది. చదవండి: ఆ విషయంలో వెన్నెల.. నేనూ ఒకటే: సాయి పల్లవి ఇదిలా ఉంటే దీనిపై మేజర్ హీరో అడివి శేష్ తన ట్వీటర్లో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో అడివి శేష్ మాట్లాడుతూ.. ‘మేజర్ సినిమాను సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. చాలామంది చిన్నారులు నాకు ఫోన్ చేసి తాము కూడా మేజర్ సందీప్‌లా దేశం కోసం పోరాడతామని చెబుతున్నారు. చిన్నారుల నుంచి వస్తున్న స్పందన చూసి నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను వారి కోసం రాయితీపై ప్రదర్శించాలని నిర్ణయించాం. గ్రూప్ టికెట్లపై పాఠశాలలకు రాయితీ కల్పిస్తున్నాం. ‘మేజర్’ గురించి రేపటి తరానికి తెలియాలనేదే మా లక్ష్యం’ అని అడవి శేష్ అన్నారు. Team #MajorTheFilm 🇮🇳 has some exciting news for all the children and schools ❤️ Witness the Life of Major Sandeep Unnikrishnan on Big Screens with 50% discount on tickets 💥💥 School management can write to majorscreening@gmail.com and register yourself for the special show. pic.twitter.com/VOmKYhgZXd — GMB Entertainment - MajorTheFilm In CINEMAS NOW (@GMBents) June 14, 2022 -
తెలుగు రాష్ట్రాల్లో మేజర్ టికెట్ రేట్స్‌పై అడివి శేష్ క్లారిటీ
దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో ‘మేజర్ సందీప్ కృష్ణన్’ ఒకరు. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్’. సందీప్ పాత్రను యంగ్ హీరో అడివి శేష్ పోషించాడు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న విషయం తెలిసిందే. మేజర్ రిలీజ్ డేట్ దగ్గరపడుతుంటంతో హీరో అడివి శేష్ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్ అందించాడు. చదవండి: ఒటీటీకి ‘సర్కారు వారి పాట’, అంతకు ముందే స్ట్రీమింగ్? ఇది మన సినిమా అని అందుకే అందరికి అందుబాటు ధరల్లో మేజర్‌ను తీసుకువస్తున్నట్లు అప్డేట్ ఇస్తూ.. టికెట్ ధరల పట్టికను షేర్ చేశాడు. ఈ మేరకు శుక్రవారం అడివి శేష్ ట్వీట్ చేస్తూ ‘ఇది మన సినిమా. అందుకే అందరికీ అందుబాటులో ఉండేలా ఈ సినిమా టికెట్ ధరలను నిర్ణయించాం’అని పేర్కొన్నాడు. కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మేజర్ టికెట్ రేట్స్ ఇలా ఉండనున్నాయి. సింగిల్ స్క్రీన్: తెలంగాణ-రూ. 150 కాగా ఏపీ- రూ. 147; మల్టీప్లెక్స్: తెలంగాణ-రూ. 195, ఏపీ-రూ. 177గా ఉండనున్నాయి. చదవండి: ‘సమంత అలా ఒంటరిగా చనిపోవాలి’ కామెంట్‌పై సామ్ ఏమన్నదంటే.. ఇదిలా ఉంటే తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో రానున్న ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ప్రివ్యూలు ఉండబోతున్నాయి. ఈ సినిమాను పది రోజుల ముందుగానే దేశవ్యాప్తంగా ఉన్న (హైదరాబాద్ ఏఎమ్‌బీ సహా) 9 ప్రధాన నగరాల్లో మేజర్ ప్రివ్యూ ప్రదర్శించనున్నారు. మే 24 నుంచి రోజుకో సెంటర్లో మేజర్ రిలీజ్ కానుంది. కాగా మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇందులో అడవి శేష్ జోడిగా సయూ మంజ్రేకర్ నటించగా.. శోభితా ధూళిపాళ్ల, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. #MajorTheFilm MANA cinema. So, we decided to give you the LOWEST PRICES for ANY film post pandemic. https://t.co/aAUhmKEO9u Sharing my love ❤️ Sharing my heart. pic.twitter.com/wWPHLD4GOK — Adivi Sesh (@AdiviSesh) May 27, 2022 -
‘ఎఫ్ 3’ మూవీ టికెట్ రేట్స్‌పై దిల్ రాజు క్లారిటీ
Dil Raju Clarifies On F3 Movie Ticket Rates Hike: విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా త్రిబుల్ ఫన్‌తో సందడి చేయనున్న చిత్రం 'ఎఫ్ 3'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మూడేళ్ల క్రితం వచ్చిన పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎఫ్ 2 చిత్రానికి ఇది సీక్వెల్ అనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో మిల్క్ బ్యూటీ తమన్నా, మెహ్రీన్, హీరోయిన్లుగా నటించారు. ఇప్పుడు ఎఫ్ 3లో కూడా వారే హీరోయిన్లు కాగా సోనాల్ చౌహన్ ఓ ప్రధాన పాత్ర పోషించనుంది. చదవండి: నార్త్ వాళ్లకు ఇప్పుడు ఆ భయం మొదలైంది: అలీ ఎప్పుడో షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ ఎన్నో వాయిదాల అనంతరం మే 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రెడీ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ ఇంకా కొద్ది రోజులే మిగిలున్నాయి. ఈ నేపథ్యంలో ఎఫ్ 3 మూవీ టికెట్ ధరల పెంపుపై ఆసక్తి నెలకొంది. అయితే ఇటీవల స్టార్ హీరోల సినిమాలకు కొద్ది రోజుల పాటు టికెట్ ధరలు పెంచిన విషయం విధితమే. దీంతో తాజాగా ఎఫ్ 3కి కూడా టికెట్ ధరలు పెంచుతారా? అని అంతా చర్చించుకుంటున్న నేపథ్యంలో టికెట్ రేట్స్ పెంపుపై క్లారిటీ ఇచ్చాడు మూవీ నిర్మాత దిల్ రాజు. చదవండి: జై భీమ్ వివాదం, హీరో సూర్య, జ్యోతికలపై ఎఫ్ఐఆర్ ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన ఇచ్చారు. ‘ఎఫ్ 3 చిత్రానికి టికెట్ ధరలు పెంచడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మా సినిమాను మీ ముందుకు తెస్తున్నాం’ అని ఆయన వెల్లడించారు. కాగా డబ్బు వల్ల వచ్చే అనర్థాలు అనే కథనంతో 'ఎఫ్-3' సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కాగా త్వరలోనే ఎఫ్ 3 మూవీ టీం ప్రచార కార్యక్రమాలతో ప్రారంభించనుంది. -
త్వరలో టికెట్ రేట్ల హేతుబద్ధీకరణ
సాక్షి, అమరావతి: ఏపీ రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్ల హేతుబద్ధీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోందని ఏపీ ఫిల్మ్ చాంబర్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రాందాస్ అన్నారు. ప్రభుత్వ నిర్ణయం కోసం సినీ పరిశ్రమ ఎంతగానో ఎదురుచూస్తోందన్నారు. హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ బుధవారం సచివాలయంలో సమావేశ మైంది. ఇందులో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, సినీ గోయర్స్, థియేటర్లు, ఫిల్మ్ చాంబర్ అసోసియేషన్ సభ్యుల నుంచి లిఖితపూర్వకంగా అభిప్రాయాలను స్వీకరించారు. మున్సిపాలిటీలు, నగర, గ్రామ పంచాయతీల్లో రేట్లు తక్కువగా ఉండటంతో వాటిని పెంచాలని పలువురు సభ్యులు కమిటీకి విజ్ఞప్తి చేశారు. సుమారు మూడు గంటలపాటు జరిగిన చర్చలో టికెట్ రేట్లను ప్రాంతాల వారీగా నిర్ణయిం చాలా?, థియేటర్లను బట్టి ఉండాలా? అనే అంశా లపై కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా సచివాలయంలో రాందాస్ మీడియాతో మాట్లాడు తూ.. ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందన్నా రు. తదుపరి సమావేశంలో అన్ని అంశాలపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయన్నారు. పలు సిని మాలు విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ప్రక్రి యను వేగంగా పూర్తిచేయాలని కోరామన్నారు. మల్టిప్లెక్స్‌లో కూడా సామాన్యులకు వినోదం దొరికేలా ఉండాలన్నారు. ఎగ్జిబిటర్ వేమూరి బాలరత్నం మాట్లాడుతూ.. అన్ని తరగతుల టికెట్ రేట్లను పెంచాలని కమిటీకి నివేదించామన్నారు. కొత్తగా ప్రభుత్వం నిర్ణయించిన రేట్లు.. కమిటీ సభ్యులు సూచించిన రేట్లు చాలావరకు దగ్గరగానే ఉన్నట్లు చెప్పారు. అలాగే, సెన్సార్ బోర్డు సభ్యుడు, సినీ విమర్శకుడు ఓంప్రకాశ్ మాట్లాడుతూ.. కరోనా తగ్గుముఖం పడుతున్న క్రమంలో సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని, ప్రభుత్వం కూడా అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా టికెట్ రేట్లు నిర్ణయిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. సౌత్ ఇండియా ఫిల్మ్ చాంబర్ ఉపాధ్యక్షుడు సీతారాం ప్రసాద్ మాట్లాడుతూ.. పంచాయతీలు, నగర పంచాయతీల్లో టికెట్ రేట్లు పెంచాలని విజ్ఞప్తి చేశామన్నారు. ప్రాంతాలను బట్టి కాకుండా ఏసీ, నాన్ ఏసీ థియేటర్ల వారీగా రేట్లు నిర్ణయించాలన్నారు. -
‘యాదాద్రి’లో కైంకర్యాల ధరలు పెంపు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తులు జరిపించే శ్రీస్వామి వారి కైంకర్యాలు, శాశ్వత పూజలు, భోగాలతో పాటు ప్రసాదం ధరలను పెంచుతున్నట్లు ఈవో గీతారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. యాదాద్రి దేవస్థానంతో కొండపైన గల శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి, అనుబంధ పూర్వగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సైతం ధరలు పెంచినట్లు తెలిపారు. పెంచిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. యాదాద్రిలో పెంచిన ధరలివి నిజాభిషేకం (ఇద్దరికి) గతంలో రూ.500 ఉండగా ప్రస్తుతం రూ.800 చేశారు. ఒక్కరికి రూ.250 ఉంటే ప్రస్తుతం రూ.400లకు పెంచారు. సహస్ర నామార్చనకు రూ.216 ఉంటే రూ.300, సుదర్శన నారసింహ హోమానికి రూ.1,116 ఉంటే రూ.1,250, నిత్య కల్యాణోత్సవానికి రూ.1,250 ఉంటే రూ,1,500, స్వాతి నక్షత్రం రోజున నిర్వహించే శత ఘటాభిషేకానికి (ఇద్దరికి) రూ.750 ఉంటే రూ.1,000, లక్ష పుష్పార్చనకు రూ.2,116 ఉంటే రూ.2,500, వెండి మొక్కు జోడు సేవలకు రూ.500 ఉంటే రూ.700, సువర్ణ పుష్పార్చనకు రూ.516 ఉంటే రూ.600, వేదాశీర్వచనం రూ.516 ఉంటే రూ.600, ఆండాల్ అమ్మవారి ఊంజల్ సేవకు రూ.750 ఉంటే రూ.1000, సత్యనారాయణస్వామి వ్రతాలు (సామగ్రితో కలిపి) రూ.500 ఉంటే రూ.800, గో పూజకు రూ.50 ఉంటే రూ.100, శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలకు వీఐపీల కోసం ప్రత్యేకంగా రూ.1,500, ఉపనయనం రూ.50 ఉంటే రూ.500, అక్షరాభ్యాసం రూ.51 ఉంటే రూ.200, అష్టోత్తర పూజకు రూ.100 ఉంటే రూ.200, అన్నప్రాశన (ఐదుగురికి) రూ.500 ఉంటే రూ.1000కి పెంచారు. ప్రసాదం ధరల వివరాలివి స్వామివారి లడ్డూ ప్రసాదం ధరలను సైతం అధికారులు పెంచారు. వంద గ్రాముల లడ్డూ గతంలో రూ.20 ఉంటే రూ.30కి పెంచారు. 500 గ్రాముల లడ్డూ రూ.100 ఉంటే రూ.150, 250 గ్రాముల పులిహోర రూ.15 ఉంటే రూ.20, 250 గ్రాముల వడ రూ.15 ఉంటే రూ.20కి పెంచారు. శివాలయంలో, పాతగుట్ట ఆలయంలోనూ పూజల ధరలను పెంచారు. శాశ్వత పూజల ధరలు కూడా పెరిగాయి. -
'వకీల్‌సాబ్'కు వ్యతిరేకంగా చేసిన జీవో కాదు
సినిమా టిక్కెట్ రేట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవో సామాన్యులకూ, చిన్న నిర్మాతలకూ మేలు చేసేలా ఉందని అన్నారు దర్శక – నిర్మాత నట్టి కుమార్. ఈ విషయంపై గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ – ‘‘ఏప్రిల్ 8న ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 35 జారీ చేసింది. టిక్కెట్ల రేట్ల సవరణకు సంబంధించి కొత్త జీవో పాస్ చేయాలని టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే ఫిల్మ్ ఛాంబర్ తరఫున మేము అడుగుతూ వచ్చాం. ఏపీ సీయం జగన్ మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి, చిన్న సినిమాల నిర్మాతలకు ఉద్దేశించి ఇప్పుడు జీవోను పాస్ చేశారు. ‘వకీల్‌సాబ్’ సినిమా 9న రిలీజ్ అయితే, ఆ జీవో 8న పాస్ అయ్యింది. ‘వకీల్‌సాబ్’కు వ్యతిరేకంగా ఈ జీవో పాస్ చేశారంటూ ప్రచారం సాగింది. అది వాస్తవం కాదు. నిజానికి, ఇలాంటి జీవో కోసం ఫిల్మ్ ఛాంబర్ నుంచి చాలా సార్లు సంప్రదించాం. ‘వకీల్‌సాబ్’ టికెట్ రేట్లలో తేడాల వల్లే బెనిఫిట్ షోలు రద్దు అయ్యాయి. అంతేకానీ ప్రభుత్వం ఆ బెనిఫిట్ షోలను రద్దు చేసిందనేది అవాస్తవం. నిర్మాత డి. సురేశ్‌బాబు మీటింగులు పెట్టి, థియేటర్స్ బంద్ అంటున్నారని తెలిసింది. ‘వకీల్‌సాబ్’ నడిచేవరకు థియేటర్లు ఉంచి, తరువాత బంద్ చేస్తారట. ఈ నెల 16న నా సినిమా (‘ఆర్జీవీ దెయ్యం’) విడుదల ఉంది. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే కోర్టుకు వెళతాను. థియేటర్లను మూసివేస్తామని బెదిరిస్తుంటే, వారి లైసెన్సులను రద్దు చేయాలి’’ అన్నారు. ‘‘కరోనా సమయంలోని మూడు నెలల ఫిక్స్డ్ కరెంట్ ఛార్జీలను రద్దు చేస్తూ, మరో ఆరు నెలల ఛార్జీలను వాయిదా వేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషదాయకం. అలాగే, టిక్కెట్ రేట్ల అడ్డగోలు పెంపును అడ్డుకుంటూ, సామాన్యుడికి ప్రభుత్వం మేలు చేసింది’’ అన్నారు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రెటరీ జె.వి. మోహన్ గౌడ్. -
ప్రభుత్వంపై థియేటర్ల న్యాయపోరాటం
సాక్షి, హైదరాబాద్: టికెట్ ధరలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని సినిమా థియేటర్లు న్యాయ పోరాటానికి దిగాయి. ఆన్లైన్ టికెటింగ్ అమలు చేసే దిశగా ఒక్కో టికెట్‌పై పోర్టల్, ఎఫ్డీసీ కింద 1.98 శాతం చార్జీ వసూలు చేసుకోడానికి తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎఫ్డీసీ)కి అనుమతిస్తూ జారీ చేసిన జీవోపై హైకోర్టును ఆశ్రయించాయి. సెంచురీ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ టికెటింగ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని ఆదేశిస్తూ జారీ చేసిన సర్కులర్‌ను కూడా కోర్టులో సవాలు చేశాయి. జీవో, సర్కులర్లను కొట్టేయాలంటూ పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలు చేశాయి. వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్.. జీవో, సర్కులర్‌పై ప్రభుత్వాన్ని వివరణ కోరారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ టీఎస్ఎఫ్డీసీ ఎండీ, సమాచార, ప్రజా సంబంధాల శాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, సెంచురీ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేశారు. అప్పటి వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు. సెంచురీ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పోర్టల్‌లో థియేటర్లు నమోదు చేసుకోవాలని, లేదంటే ప్రతీ షో హౌస్‌ఫుల్ అయినట్లు భావించి పన్నులు విధిస్తామని ప్రభుత్వం సర్కులర్లో పేర్కొందని పిటిషనర్ల తరఫు న్యాయవాది కంచర్ల దుర్గాప్రసాద్ కోర్టుకు నివేదించారు. తమ పోర్టల్ ద్వారానే టికెట్లు అమ్మేలా ప్రభుత్వాన్ని, పోలీస్ కమిషనర్‌ను సెంచురీ టెక్ ప్రభావితం చేసిందన్నారు. ఇప్పటి వరకు టిక్కెట్లు అమ్ముకున్నందుకు ఆయా సంస్థలు ఆయా థియేటర్లకు చార్జీలు ఇచ్చేవని, ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం వల్ల థియేటర్లే ఎదురు చార్జీలు ఇవ్వాల్సి వస్తోందన్నారు. -
టికెట్ ధర పెంచితే సినిమా చూపిస్తాం
తమిళసినిమా: ఎంత పెద్ద నటుడి చిత్రం అయినా సరే నిర్ణయించిన టిక్కెట్ ధర కంటే అధికంగా ఒక్క రూపాయి కూడా వసూలు చేయకూడదు అని రాష్ట్ర సమాచార, సినిమాటోగ్రఫీ మంత్రి కడంబూర్ రాజా పేర్కొన్నారు. అలా వసూలు చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. తాజా వినోదపు పన్ను విధానం ప్రకారం మల్టీప్లెక్స్ థియేటర్లలో టిక్కెట్ ధరను గరిష్టంగా రూ.204గా, కనిష్టంగా రూ.63 రూపాయలుగా నిర్ణయించారు. అదేవిధంగా ఏసీ థియేటర్లలో గరిష్టంగా రూ.126, కనిష్టంగా రూ.40–50 గా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై శనివారం పుదుకోట్టైలో ఎంజీఆర్ శతాబ్ది వేడుకల సందర్భంగా ఆయన చిత్ర పటాలను ఆవిష్కరించిన అనంతరం కడంబూర్ రాజా మాట్లాడుతూ థియేటర్ల టిక్కెట్ల ధర విషయంలో విధివిధానాలను మీరితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అది ఎంత పెద్ద నటుడి చిత్రం అయినా సరే అని అన్నారు. ఇక నటీనటుల పారితోషికం వంటి విషయాలను వారు చర్చించి పరిష్కరించుకోవాలని, అది నిర్మాతల మండలి, నడిగర్ సంఘం సమస్య అనీ పేర్కొన్నారు. కాగా నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ థియేటర్ల యాజమాన్యానికి టిక్కెట్లపై అధిక ధరలను విధించకూడదని, థియేటర్ క్యాంటీన్‌ల్లో ఎంఆర్పీ ధరలకే విక్రయించాలని, పార్కింగ్ రుసుం వసూలు చేయకూడదని, అమ్మ వాటర్‌నే విక్రయించాలి లాంటి కొన్ని షరతులను విధించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తాము పర్యవేక్షిస్తామని ఆయన ప్రకటించారు. విశాల్ ఎవరు? నిర్మాతల మండలి నిబంధనలు, మంత్రి కడంబూర్ రాజా ప్రకటనలపై చెన్నైలో శనివారం థియేటర్ల యాజమాన్యం సమావేశం అయ్యి చర్చించారు. అనంతరం చెన్నై థియేటర్ల అసోషియేషన్ అధ్యక్షుడు రామనాథన్ మాట్లాడుతూ చిన్న చిత్రాల విడుదల సమయంలో టిక్కెట్ ధరను కాస్త తగ్గిస్తామన్నారు. తినుబండారాలను బయట ఏ ధరకు విక్రయిస్తున్నారో అదే ధరకు తామూ విక్రయిస్తామని తెలిపారు. ఇక వాహనాల పార్కింగ్ వ్యవహారం కోర్టులో ఉంది గనుక ఆ విషయం గురించి ప్రస్తుతం మాట్లాడనన్నారు. టిక్కెట్లను అధిక ధరలకు విక్రయించమని చెప్పారు. అదేవిధంగా బయటి తినుబండారాలను అనుమతించే విషయమై థియేటర్ల యాజమాన్యంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే ఈ విషయాల్లో నిబంధనలు విధించడానికి విశాల్ ఎవరని ప్రశ్నించారు. తమకంటూ సంఘం ఉందని, అదేవిధంగా వారికి సంఘం ఉందని అన్నారు. ఈ విషయంలో వారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకూడదనీ, తమతో చర్చిస్తే బాగుండేదని అభిరామి రామనాథన్ అభిప్రాయపడ్డారు. -
సినిమా టికెట్ ధరలపై సీఎస్ సమీక్ష
అమరావతి: సినిమా థియేటర్లలో తినుబండారాలు, శీతల పానియాలను అధిక ధరలకు విక్రయించే అంశంపై కఠినంగా వ్యవహరించాలని జాయింట్ కలెక్టర్లకు చీఫ్ సెక్రటరీ దినేష్‌కుమార్ ఆదేశాలు జారీచేశారు. సినిమా థియేటర్లలో టికెట్ ధరల పెంపు అంశంపై గురువారం అధికారులతో సీఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల థియేటర్లు, ఏసీ, నాన్ ఏసీ సౌకర్యాలను అనుసరించి ధరల పెంపు అంశంపై చర్చించారు. టికెట్ ధరల పెంపు అంశంపై నివేదిక ఇవ్వాలని హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. -
జీఎస్టీతో సినిమా టికెట్ ధరల మోత
తమిళసినిమా: తమిళనాట జీఎస్టీ పన్ను విధానం అమల్లోకి రావడంతో సినిమా టికెట్ ధరలు మోతమోగుతున్నాయి. జీఎస్టీ పన్నును కేంద్రప్రభుత్వం అమల్లోకి తీసుకురావడం, దానికి తోడు రాష్ట్రప్రభుత్వం అదనంగా మరో 30 శాతం వినోదపు పన్నును విధించడానికి సిద్ధం అవడంతో చిత్ర వర్గాలు బెంబేలెత్తిపోయారు. దీంతో రాష్ట్రప్రభుత్వం విధించే పన్నును రద్దు చేయాలంటూ తమిళనాడు థియేటర్ల యాజమాన్యం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో సోమవారం నుంచి థియేటర్ల బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మొత్తం మీద ప్రభుత్వం చర్చలకు సిద్ధమవడంతో థియేటర్ల యాజమాన్యం గురువారం సమ్మెను విరమించుకుంది. శుక్రవారం నుంచి థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి.అయితే మధ్యతరగతి ప్రేక్షకుడు మాత్రం టికెట్ ధర చూసి భయపడిపోతున్నాడు. ఇప్పటి వరకూ రూ.120 టికెట్ ధర ఉండగా అది 28శాతం జీఎస్టీ పన్నుతో కలిపి రూ. 153కు పెరిగింది. ఇక 18 శాతం జీఎస్టీ పన్ను పరిధిలో ఉన్న రూ.100 టికెట్ ఇప్పుడు రూ.118కు పెరిగింది. అదే విధంగా రూ. 90 టికెట్ ధర 106కు, రూ.50 టికెట్ ధర రూ.59కు పెరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా వినోదపు పన్ను విధించడానికి సిద్ధం అయితే ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. -
సీయం కేసీఆర్‌గారికి ధన్యవాదాలు!
‘‘పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా టికెట్ల రేట్లు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేసి సగటు ప్రేక్షకుడికి, సగటు సినిమాకు మేలు చేసిన తెలంగాణ సీయం కేసీఆర్‌గారికి హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ – ‘‘సార్ (కేసీఆర్)... కోట్ల రూపాయలు పబ్లిసిటీకి ఖర్చు పెట్టలేక పరిమిత బడ్జెట్‌తో నిర్మించే చిన్న చిత్రాల మనుగడకు నూన్ షో ఇచ్చి పరిశ్రమను కాపాడవలసిందిగా కోరుతున్నా’’ అన్నారు. -
.కేసీఆర్‌గారూ... ఓ విజ్ఞప్తి
‘‘సినిమా థియేటర్లలో టికెట్ రేట్లు పెంచడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు సగటు ప్రేక్షకుడికి వినోదం (సినిమా) దూరమైపోతుంది’’ అని నటుడు–దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 23న సినిమా టికెట్ రేట్లు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. దీని వల్ల చిత్ర పరిశ్రమకు నష్టం చేకూరుతుందని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు.ఇంకా ఆయన మాట్లాడుతూ – ‘‘భారతీయుల జీవన ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి థియేటర్లో 60 శాతం నేల–బెంచీలు, 40 శాతం కుర్చీలు ఏర్పాటు చేయాలని గతంలో ప్రభుత్వాలు నిర్ణయించాయి. ప్రస్తుత పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. థియేటర్లలో 90 శాతం కుర్చీలు ఉంటే... నేల–బెంచీలు 10 శాతం మాత్రమే ఉంటున్నాయి. కొన్ని థియేటర్లలో ఆ 10 శాతం కూడా కనిపించడం లేదు. రెండు మూడు లైన్లు ఉంటున్నాయంతే. దీని వల్ల సగటు ప్రేక్షకుడు, పేద–మధ్య తరగతి ప్రజలు ఆత్మనూన్యతకు లోనయి అప్పో సొప్పో చేసి అప్పర్ క్లాస్‌కి వెళ్తున్నారు.ఇప్పుడు టికెట్ రేట్లు పెంచడం వల్ల వాళ్లంతా థియేటర్లకు రావడం మానేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఎగ్జిబిటర్లు ఆడింది ఆట, పాడింది పాటగా ఉంది. ఆల్రెడీ స్టార్ హీరోల సినిమాలు విడుదలైనప్పుడు ఫ్లాట్ రేటుకు టికెట్లను అమ్ముతున్నారు. ఇప్పుడు జీఎస్టీ (వస్తు సేవల పన్ను) సాకు చూపిస్తూ, టికెట్ రేట్లు పెంచితే సగటు ప్రేక్షకుడి పరిస్థితి ఏంటి? కనీసం చిన్న సినిమాకు అయినా రాగలడా? మంచి సినిమా అని టాక్ వచ్చి, ప్రేక్షకుడు చూడాలనుకునే లోపే సినిమాను థియేటర్ల నుంచి తీసేస్తారు. దీని వల్ల ప్రేక్షకుడికి వినోదం దూరమవుతుంది. అయినా... రూ. 100 పై ఉన్నవాటికే పెంచమన్నది ఆదేశం కదా. అలాంటప్పుడు నగర పరిధి (మున్సిపాలిటీ, పంచాయతీ) లోకి రాని థియేటర్లలో రూ. 100లోపు ఉన్న బాల్కనీ టికెట్ రేటును పెంచడం ఎంతవరకు సమంజసం? అందువల్ల, టికెట్ రేట్లను పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాల్సిందిగా గౌరవనీయులైన తెలంగాణ సీయం కేసీఆర్‌గారికి విజ్ఞప్తి చేస్తున్నాను’’ అన్నారు. -
వ్యాపార కేంద్రంగా మారిన దుర్గ గుడి
-
శ్రీ రామనవమి టికెట్ల ధరలు పెంపు
భద్రాచలం : ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే శ్రీ రామనవమి ఉత్సవాల టికెట్ల రేట్లను పెంచుతున్నట్లుగా దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది మార్చి 28న జరిగే ‘స్వామివారి వసంత పక్ష తిరు కల్యాణమహోత్సవం’ ఉభయదాతల టికెట్ల ధర గతంలో రూ.3,016 ఉండగా ప్రస్తుతం రూ.5 వేలుగా నిర్ణయించారు. వీవీఐపీ సెక్టార్ టికెట్ల ధరను రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచినట్లుగా తెలిపారు. భక్తులు ఈ మార్పును గమనించాలని కోరారు. శ్రీ సీతారామచంద్రస్వామివారి కల్యాణోత్సవ ఉభయదాతల టికెట్లను 23వ తేదీ నుంచి అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. కావాల్సిన భక్తులు కార్యాలయ రిసెప్షన్ నంబర్ 08743-232428, ఆలయ పర్యవేక్షకులు 76600 07679, ఆలయ పరిశీలకులు 76600 07681, 76600 07682 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.