భద్రాచలం : ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే శ్రీ రామనవమి ఉత్సవాల టికెట్ల రేట్లను పెంచుతున్నట్లుగా దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది మార్చి 28న జరిగే ‘స్వామివారి వసంత పక్ష తిరు కల్యాణమహోత్సవం’ ఉభయదాతల టికెట్ల ధర గతంలో రూ.3,016 ఉండగా ప్రస్తుతం రూ.5 వేలుగా నిర్ణయించారు. వీవీఐపీ సెక్టార్ టికెట్ల ధరను రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచినట్లుగా తెలిపారు. భక్తులు ఈ మార్పును గమనించాలని కోరారు. శ్రీ సీతారామచంద్రస్వామివారి కల్యాణోత్సవ ఉభయదాతల టికెట్లను 23వ తేదీ నుంచి అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. కావాల్సిన భక్తులు కార్యాలయ రిసెప్షన్ నంబర్ 08743-232428, ఆలయ పర్యవేక్షకులు 76600 07679, ఆలయ పరిశీలకులు 76600 07681, 76600 07682 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
శ్రీ రామనవమి టికెట్ల ధరలు పెంపు
Published Fri, Feb 20 2015 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM
Advertisement
Advertisement