sriramanavami
-
వైజాగ్ లో ఘనంగా శ్రీ రామ నవమి వేడుకలు
-
భద్రాద్రిలో ఘనంగా జరగనున్న శ్రీరామ నవమి వేడుకలు
-
ఇలా చేస్తే ఊరు విడిచి వెళ్లిపోతా...
సాక్షి, కోల్‌కతా : ‘నా కొడుకు చనిపోయాడు.. అలాగని మరో వ్యక్తి కొడుకు చనిపోవాలని నేను కోరుకోను. ఇంకోసారి ఇలాంటి రక్తపాతం జరిగితే నేను ఊరు విడిచి వెళ్లిపోతా’ . ఇది పశ్చిమ బెంగాల్లో శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా జరిగిన మారణకాండలో కుమారుడిని పోగొట్టుకున్న ఓ తండ్రి ఆవేదన. అసన్సోల్ పట్టణంలోని మసీదు ఇమామ్ మౌలానా ఇందాదుల్ రషీదీ కుమారుడు షిబ్‌తుల్లా రషీదీ గత ఆదివారం చోటుచేసుకున్న మత ఘర్షణల్లో మరణించాడు. తాను అసన్సోల్లో శాంతిని మాత్రమే కోరుకుంటున్నానని, అందరూ శాంతంగా ఉండాలని గురువారం కొడుకు అంత్యక్రియలకు వచ్చిన వారిని ఆయన కోరారు. అధికార పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ.. ఇందాదుల్ వ్యాఖ్యలతో అక్కడ శాంతి నెలకొనే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆయన కుమారుడు షిబ్‌తుల్లా మరణానికి గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. పోలీసులు నిర్లక్ష్యం కారణంగానే మత ఘర్షణలు జరిగాయని, పోలీసులు సరైన సమయంలో జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే ఇలా జరిగేది కాదని విశ్వహిందూ పరిషత్ నాయకులు అభిప్రాయపడ్డారు. -
పూలలో కన్నీరు
మూర పూలకు జానెడు పొట్టకు లంకె. నాలుగు రెక్కలకు నాలుగు వేళ్లకు ముడి. బుట్టనిండా సువాసనే. ఇంట్లో గంజి వాసన కూడా రాదు. పూలమ్మే వాళ్ల జీవితాలు రాళ్లు మోసే వారి కంటే ఘోరంగా ఉన్నాయి. శ్రీరామనవమి పండుగ... ఇళ్లు, గుళ్లు కోలాహలంగా ఉన్నాయి. పూలదండలు వేళ్లాడుతున్నాయి. చుట్టిన దండలు బుట్టల్లో ఉన్నాయి. మరో పక్క విడిపూల గంపలు. గుళ్లో పూజారి మంత్రాలకంటే పూల బుట్టల దగ్గర బేరాలే గట్టిగా వినిపిస్తున్నాయి. ‘‘అవ్వా! రెండు మూరల బంతిపూల దండ ఇస్తావా’’ అన్నాడు వివేక్ ప్యాంట్ బ్యాక్ పాకెట్లో నుంచి పర్సు తీస్తూ. వెంకటమ్మ పూలు మూర కొలిచి వేలిని మెలిపెట్టి తుంచబోతూ ఆగి, ‘‘రెండు మూరలు చాలా నాయనా! దేవుడికా, వాకిలికా’’ అడిగింది. అప్పటికే వివేక్కీ అదే సందేహం... రెండు మూరల బారును చూస్తూ ద్వారబంధానికి సరిపోతుందా, అమ్మను ఎన్ని మూరలని అడగలేదే... అన్నట్లు చూస్తున్నాడు. ‘‘వాకిలికి వేయడానికే’’ అన్నాడు. ‘‘వాకిలికి మూడు మూరలు పడతాయి’’ అని వివేక్ ముఖంలోకి చూస్తూ ఆగింది. ‘‘అలాగే మూడు మూరలివ్వు... ఎంత’’ అడిగాడు వివేక్. ‘‘పాతిక... మూర’’ పాతిక పెద్దగా అంటూ... మూర చిన్నగా పలికింది. మూడు మూరలకూ కలిపి ఏకంగా డెబ్బై అయిదు అంటే పర్సులో డబ్బు పర్సులోనే పెట్టుకుని వెళ్లిపోతాడేమోనని బెరుకు. ‘‘డెబ్బై అయిదు రూపాయలా! బంతిపూలు’’ బంతిపూలు పదాన్ని నొక్కి పలికాడు వివేక్. ‘‘బంతిపువ్వయినా గులాప్పువ్వయినా నా తోటలో పూస్తుందా నాయనా? మార్కెట్లో కొనాలె, దండల్లి అమ్మాలె. అక్కడే కేజీ బంతిపూలు వంద రూపాయిలు పలుకుతున్నాయీరోజు. పండగ గిరాకీ అట్లుంది మరి’’ కన్విన్స్ చేసి కొనిపించాలనే ప్రయత్నం ఆమె మాటల్లో. ‘‘సరే ఇవ్వవ్వా’’ అన్నాడే కానీ వివేక్కి ‘అంత ధర పెట్టి తెచ్చావా, బేరమాడలేదా’ అని అమ్మ కోప్పడుతుందేమోనని భయంగానే ఉంది. ‘‘గులాబీలు ఇవ్వనా’’ వాకిలికి బంతిపూలు వేస్తే దేవుడికి గులాబీలు పెట్టవా? అన్నట్లుందా మాట. ‘‘పది రూపాయలకివ్వు’’ అన్నాడు తనతో తెచ్చిన పెద్ద షాపింగ్ బ్యాగ్ ఓపెన్ చేస్తూ. ‘‘ఈ రోజు పదిరూపాయలకి రావు నాయనా, ఇరవై రూపాయలు, రేపట్నుండి మార్కెట్ అగ్వవుంటది గప్పుడు పదిరూపాయలకిస్తా’’ అంటూ చిన్న పాలిథిన్ కవర్లో గులాబీలు వేసింది. పిల్లాడు గీచి బేరం చేయట్లేదులే అనుకుంటూ మరో గుప్పెడు గులాబీలను అదే కవర్లో కుక్కినట్లు పెట్టింది. ‘‘పూలతోనే బిల్డింగులు కట్టేట్లున్నారు’’ చిరాగ్గా అన్నది ఆ పక్కనే ఉన్న వసంత ఏ బుట్ట దగ్గర ఆగాలో తేల్చుకోలేక అటూ ఇటూ తిరుగుతూ. ‘‘ఈ ఒక్కరోజే వేలాదిరూపాయల వ్యాపారం చేస్తారు. రూపాయి కూడా తగ్గించరు. పండక్కి కొనక చస్తారా అని వాళ్ల ధీమా’’ మరింత విసుగ్గా బదులిచ్చింది మాలతి. వాకిలికి పూలదండ వేసి దేవుడి పటాలన్నింటికీ పూలు అలంకరించాలి, తలలోకి మల్లెలు కొనాలంటే రెండొందలైనా అయ్యేట్లుంది. నిన్న ఆఫీస్ నుంచొస్తూ తెమ్మంటే ఆయనకి పట్టనేలేదు. ఉడికిపోతోంది వసంత. ‘‘అంతేసి మాటెందుకు బిడ్డా! మాకు గిట్టేది మా కష్టమేనమ్మా. ఈ రోజు మార్కెట్లోనే మస్తు గిరాకుంటది. గిట్ల బేరం అడుగుతానికి కూడా ఉండదక్కడ. ఎన్ని కిలోల పూలు కావాలో చెప్పాలె, వాళ్లు చెప్పిన ధరకు తెచ్చుకోవాలె’’ నొచ్చుకుంది వెంకటమ్మ. తమ మాటలు ఆమెను నొప్పించాయని అర్థమైంది మాలతికి. వసంతను మాట్లాడవద్దని గిల్లుతూ ‘‘బంతిపూలు మూర ఇరవైకిస్తావా’’ అన్నది వెంకటమ్మ దృష్టి పూల వైపు మరలడానికి. వసంత మరొక పూల బుట్ట దగ్గరకు నడిచింది. ‘‘అత్తా! ఓ సారి బస్తీలో తిరిగొస్తా, అన్నం పెట్టుకు తిను. పిల్లలొచ్చాక వాళ్లకీ పెట్టు’’ పూల బుట్ట సర్దుకుంటూ అన్నది సుజాత. వెంకటమ్మ గుడి దగ్గర అమ్మగా మిగిలిపోయిన పూలను ఇంటికి తెచ్చింది. ఆ పూలను మళ్లీ వేటికి వాటిని విడిగా సర్దుతోంది సుజాత. ‘‘సర్లేవే సుజాతా, మరీ పొద్దుపోయే దాకా ఉండొద్దు. ఎన్ని అమ్మితే అంతే అమ్మి తొందరగా ఇంటికొచ్చెయ్. బస్తీలో మూలలకెళ్లకు’’ వెంకటమ్మ మాటల్లో భయం. ఆ భయం సుజాతకూ అర్థమవుతోంది. ‘‘అలాగేలే’’ అని బుట్ట చంకన పెట్టుకుని కాలు బయటపెట్టింది. ఎలాగైనా మిగిలిన పూలను రాత్రికి అమ్మకపోతే రేపు కొనేవాళ్లుండరు. గులాబీల రెక్కలు రాలిపోతాయి. బంతిపూలు వాడి ముడుచుకుంటాయి. మూర పదికైనా సరే ఇచ్చేయాలి... అనుకుంటూ వీథిలో నడుస్తూంది. ‘‘అమ్మా! అన్నం తిన్నావా! పిల్లలు తిన్నారా? సుజాత కనిపించదే ఎటెళ్లింది’’ అంటూనే మంచం మీద వాలిపోయాడు యాదగిరి. ‘‘పిల్లలు, నేనూ తిన్నాం కొడకా, సుజాత మిగిలిన పూలు అమ్ముకొత్తానని బస్తీలకెళ్లింది. నువ్వు తిందువు రా మల్లా పొద్దుగాలే మార్కెట్కెళ్లాలె, నీకు నిద్దరుండట్లేదసలే’’ వెంకటమ్మ తల్లి మనసు పడుతున్న తపన. ‘‘సుజాతకు ఎన్ని అమ్ముడుపోతయ్యో ? ఎన్ని పూలు మిగిలి తెస్తదో? రేప్పొద్దున మార్కెట్కెళ్లడానికి ఎన్ని డబ్బులున్నాయమ్మా’’ అంటూ కళ్లు మూసుకున్నాడు. ఇంట్లోకి సుజాత వస్తున్న ఆనవాలుగా పూలవాసన వచ్చింది. యాదగిరిని పూల వాసన తాకింది. అతడి ముక్కుపుటాలు పూల వాసనను గుర్తించడం మానేసి ఎన్నో ఏళ్లయింది. పూలు అందరికీ సువాసననిస్తాయి, పూలతో బతికే వాళ్లకు ఆ వాసనే తెలియదు. ‘‘అమ్మా! ఈ పూలు నేను పెట్టుకుంటా’’ సుజాత తెచ్చిన బుట్టలో నుంచి మల్లెపూల దండ తీసుకున్నది పదేళ్ల లావణ్య. ‘‘పెట్టుకో’’ అంటూ లోపలికెళ్లింది సుజాత. భర్తకు తనకు భోజనాలు వడ్డించుకోవడానికి. కూతురి జడలో పూలు చూస్తే ముచ్చటగానే ఉంది. కానీ ఆ మూర కూడా అమ్ముడైతే పూలు కొన్న డబ్బయినా వచ్చేది. తల్లి ముఖం అభావంగా ఉందని తెలిసే వయసు కాదు లావణ్యది. జడ పొడవునా చుట్టుకున్న మల్లెల దండను జడతోపాటు ముందుకు వేసి బుగ్గకు రాసుకుంటూ సంతోషపడుతోంది. కూతురి సంతోషం చూస్తుంటే... యాదగిరికి నిండుగా విరిసిన పూలతోటను చూసినట్లుంది. ‘‘బిడ్డకు నాలాగ పూలమ్మేవాడు వద్దే సుజాతా, భార్యకు తల నిండా పూలు కొనిపెట్టగలిగినోడితో పెళ్లి చేస్తా’’ అంటూ భోజనానికి కూర్చున్నాడు. సుజాత భోజనం వడ్డిస్తూ యాదగిరి ముఖంలోకి చూసింది ‘మా నాన్న కూడా ఇలాగే అనుకుని ఉంటాడు’ అనుకుందామె మనసులో. పది తిండికి... పది ఇంటికి! మాది మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్. అక్కడ చారెడు పొలం ఉండేది. ఆ తిండి గింజలతో ఏడాదంతా వెళ్లబారేది కాదు. పొలం పనులు చేయడానికి నా మొగునికి ఒంట్లో బలం లేదు. దాంతో హైద్రాబాద్ సిటీకొస్తే తేలిక పనులు చేసుకుని బతకొచ్చనుకున్నాం. మేము సిటీకొచ్చేనాటికి కొడుకు, కూతురు చిన్నపిల్లలు. మేమొచ్చి నలభై ఏళ్లయింది. నా పెనిమిటి మార్కెట్ నుంచి పూలు తెస్తే నేను దండలు కట్టేదాన్ని. రోజూ పొద్దున్నే గుడిమల్కాపూర్ మార్కెట్‌కో, జాంబాగ్ మార్కెట్‌కో పోయి పూలు తెచ్చేటోడు. అప్పట్లో దినాలు బాగానే వెళ్లబారినాయి. ఇప్పుడున్నన్ని ఇంగ్లిష్ పూలు అప్పట్లో లేవు. ఏ పండుగయినా, వేడుకైనా ఈ బంతిపూలు, చేమంతులు, మల్లెలే. ఇప్పుడు అరచెయ్యంత పూలు అక్కడెక్కడో సీమదేశాల్లో పూస్తాయట. మరీ డబ్బున్నోళ్లు ఆ పూలతోనే డెకరేషన్ చేస్తున్రు. మా పూలు పండగలప్పుడే కొంటున్రు. ఈ పూల మీదనే కొడుకుని పదో తరగతి వరకు చదివించినం. కూతురికి పెళ్లి చేసినం. బతుకైతే వెళ్లబారుతోంది. ఇంటద్దెలు కట్టుకుని, నలుగురూ తినాలంటే జరిగే పని కాదని తెలిసింది. ఊర్లో ఉన్న పొలం అమ్మి బోరబండలో 120 గజాల జాగా కొనుక్కున్నాం. అందులో గోడలు లేపి రేకులు దించింనం. ఆ గోడలు లేపి రేకులు వేయడానికి పడిన పాట్లు చిన్నవి కాదు. పూలమ్మిన డబ్బుల్లో పది రూపాయలు ఇంటి కోసం పక్కన పెట్టి, పది రూపాయలు తినడానికి ఖర్చు చేసుకున్నం. కాస్త నిమ్మళించాం అనుకునేంతలో నా పెనిమిటి రాములుకి జబ్బు చేసింది. నాలుగేళ్లయింది క్యాన్సర్‌తో పోయాడు. ఇప్పుడు నా కొడుకు, కోడలు, నేను ముగ్గురం పూలతోనే బతుకుతున్న. రోజుకు మూడు వందలు మిగిలితే ఆ రోజు గుండె నిండినట్లవుతాది. – వెంకటమ్మ, పూలమ్మే మహిళ – వాకా మంజులారెడ్డి -
హనుమంత వాహనంపై శ్రీవారి ఊరేగింపు
సాక్షి, తిరుపతి : తిరుమలలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం శ్రీరామస్వామి వారు హనుమంత వాహనంపై ఊరేగుతున్నారు. స్వామి వారి ఊరేగింపును తిలకించేందుకు భక్తులు అశేషంగా తిరుమలకు చేరుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఉభయ తెలుగురాష్ట్రాల్లోని ఒంటిమిట్ట, భద్రాచల దేవస్థానాల్లో సీతారామ కళ్యాణం కన్నులపండువగా జరగనుంది. -
వేములవాడకు పోటెత్తిన భక్త జనం
-
పెసరే రామరసం
శ్రీరామనవమి వస్తే చలువ పందిళ్లు చల్లటి నీడనిస్తాయి. మల్లెలు రాముని పాదాల చెంతకు చేరటానికి వికసిస్తాయి. జగతి ఆ దివ్య జంట కల్యాణం కోసం సిద్ధమవుతుంది. శుభ ఘడియలలో శుచితో నిండిన రుచికరమైన పదార్థాలు పండగ శోభను తెస్తాయి... పెసర ప్రసాదం... పెసర చలువ చేసే పదార్థం... రాముడి కోసం రామభక్తుల కోసం ఇవిగో నైవేద్యాలు... పెసర పాయసం కావలసినవి: పెసర పప్పు – అర కప్పు; నీళ్లు – ఒక కప్పు + ఒకటిన్నర కప్పులు; పల్చటి కొబ్బరి పాలు – అర కప్పు; బెల్లం పొడి – ముప్పావు కప్పు; కొబ్బరి నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి∙– అర టీ స్పూను; జీడిపప్పు – 25 గ్రా; కిస్మిస్ – ఒక టేబుల్ స్పూను తయారీ: కుకర్‌లో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోయాలి ∙ ఒక గిన్నెలో పెసరపప్పు పోసి శుభ్రంగా కడిగి, ఒక కప్పు నీళ్లు జత చేసి ఉడికించి దింపేసి, చల్లారాక కొద్దిగా మెత్తగా అయ్యేలా మెదపాలి ∙ముప్పావు కప్పు బెల్లం పొడి జత చేసి స్టౌ మీద ఉంచి బాగా కలపాలి ∙ అర కప్పు కొబ్బరి పాలు జత చేసి మరో మారు బాగా కలపాలి ∙ చిన్న బాణలిలో కొబ్బరి నూనె వేసి కాగాక జీడిపప్పులు వేయించి తీసేయాలి ∙ అదే బాణలిలో కిస్మిస్ వేసి వేయించి తీసేయాలి ∙ ఉడికిన పెసరపప్పు పాయసంలో వేయించిన జీడిపప్పులు, కిస్మిస్, ఏలకుల పొడి వేసి బాగా కలిపి అందించాలి. పెసర ఢోక్లా కావలసినవి: పెసర పప్పు – ఒక కప్పు; అల్లం + పచ్చి మిర్చి ముద్ద – టేబుల్ స్పూను; నీళ్లు – అర కప్పు; కొత్తిమీర – టేబుల్ స్పూను; నూనె – ఒక టేబుల్ స్పూను; నిమ్మరసం – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; నిమ్మ ఉప్పు – టీ స్పూను. పోపు కోసం.. నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఇంగువ – చిటికెడు; వేయించిన నువ్వులు – టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు గార్నిషింగ్ కోసం... కొత్తిమీర తరుగు – పావు కప్పు; పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు తయారీ: ∙పెసరపప్పుకి తగినన్ని నీళ్లు జత చేసి రెండుమూడు సార్లు బాగా కడిగి, నాలుగు గంటల పాటు నాన»ñ ట్టి, నీళ్లు ఒంపేయాలి ∙కొత్తిమీర, అర కప్పు నీళ్లు జత చేసి, మిక్సీలో వేసి కొద్దిగా పలుకులా ఉండేలా మిక్సీ పట్టాలి. (మరీ ముద్దలా అవ్వకూడదు. మరీ పల్చగాను, మరీ గట్టిగానూ కూడా ఉండకూడదు) ∙ఒక పాత్రలో రెండున్నర కప్పుల నీళ్లు పోసి, మరిగించాలి ∙ఒక వెడల్పాటి పళ్లానికి కొద్దిగా నూనె పూసి పక్కన ఉంచాలి ∙ఒక పాత్రలో అల్లం + పచ్చిమిర్చి ముద్ద, నూనె, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలిపి, తయారుచేసి ఉంచుకున్న పెసరపిండి మిశ్రమాన్ని జత చేయాలి ∙చివరగా నిమ్మ ఉప్పు జత చేసి బాగా కలిపి, నూనె రాసి ఉంచుకున్న పాత్రలో పోసి సమానంగా పరవాలి ∙స్టౌ మీద మరుగుతున్న నీళ్ల పాత్రలో ఈ పళ్లెం ఉంచి, మూత పెట్టి, సుమారు పావుగంట అయ్యాక దింపేయాలి ∙బాగా చల్లారాక బయటకు తీయాలి ∙చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి ∙నువ్వులు జత చేసి మరోమారు కలియబెట్టాలి ∙ఇంగువ, కరివేపాకు వేసి వేయించి బాగా కలపాలి ∙రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు జత చేసి పోపు మిశ్రమాన్ని బాగా కలపాలి. ∙ఈ మిశ్రమాన్ని తయారుచేసి ఉంచుకున్న ఢోక్లా మీద వేయాలి ∙కొత్తిమీర, కొబ్బరి తురుములతో అలంకరించి అందించాలి. పెసరపప్పు తడ్కా కావలసినవి: పెసర పప్పు – ముప్పావు కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; అల్లం తురుము – అర టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; నీళ్లు – మూడు కప్పులు; ఉప్పు – తగినంత; జీలకర్ర – ఒక టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 5; గరం మసాలా – అర టీ స్పూను; పచ్చి మిర్చి – 2 (నిలువుగా మధ్యకు చీల్చాలి); ఇంగువ – చిటికెడు; కొత్తిమీర – కొద్దిగా; నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు తయారీ: ∙ఒక పాత్రలో పెసర పప్పు, ఉల్లి తరుగు, టొమాటో తరుగు, మూడు కప్పుల నీళ్లు పోసి కుకర్‌లో ఉంచి మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి ∙విజిల్ తీసి, మిశ్రమం మరీ గట్టిగా ఉంటే, కొద్దిగా నీళ్లు, ఉప్పు జత చేసి పక్కన ఉంచాలి ∙చిన్న బాణలిలో నెయ్యి వేసి స్టౌ మీద ఉంచి, కరిగాక జీలకర్ర వేసి వేయించాలి ∙వెల్లుల్లి రెబ్బలు, పచ్చి మిర్చి, అల్లం తురుము, పసుపు జత చేసి, కొద్దిగా వేయించాలి ∙గరం మసాలా పొడి, మిరప కారం, ఇంగువ జత చేసి కలిపి వెంటనే పెసరపప్పు తడ్కాలో వేసి కలపాలి ∙కొత్తిమీరతో అలంకరించి అందించాలి. పెసర బూరెలు కావలసినవి: పెసర పప్పు – ఒక కప్పు; బెల్లం పొడి – ఒక కప్పు; బియ్యం – అర కప్పు; మినప్పప్పు – ఒక కప్పు; నెయ్యి – 2 టీ స్పూన్లు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; ఉప్పు – చిటికెడు; ఎండు కొబ్బరి తురుము – అర కప్పు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ∙ముందుగా ఒక పాత్రలో మినప్పప్పు, బియ్యం, వేసి సుమారు నాలుగు గంటలు నానబెట్టి, నీరు ఒంపేసి, మిక్సీలో వేసి, ఉప్పు జతచేసి మెత్తగా దోసెల పిండి మాదిరిగా రుబ్బి పక్కన ఉంచాలి ∙పెసర పప్పుకి తగినన్ని నీళ్లు జత చేసి సుమారు గంటసేపు నానబెట్టి, నీళ్లు ఒంపేయాలి ∙బాణలిలో తగినన్ని నీళ్లు పోసి మరిగించాక, పెసరపప్పు జత చేసి ఉడికించాక రంధ్రాలున్న గిన్నెలో పోసి నీళ్లు పోయేవరకు సుమారు ఐదు నిమిషాలు పక్కన ఉంచి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, బెల్లం పొడి, పావు కప్పు నీళ్లు పోసి తీగ పాకం వచ్చేవరకు కలుపుతుండాలి ∙కొద్దిగా నెయ్యి వేసి బాగా కలిపి, ఉడికించి ఉంచుకున్న పెసర పప్పు ముద్ద, యాలకుల పొడి, కొబ్బరి తురుము వేసి కలిపి, గడ్డ కట్టిన తరవాత దింపేయాలి ∙కొద్దిగా చల్లారాక ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙బాణలిలో నూనె కాగాక, తయారుచేసి ఉంచుకున్న పెసర పూర్ణాలను మినప్పప్పు మిశ్రమంలో ముంచి బూరెల మాదిరిగా నూనెలో వేసి వేయించాలి ∙దోరగా వేగిన తరవాత పేపర్ న్యాప్కిన్ మీదకు తీసుకోవాలి ∙కొద్దిగా చల్లారాక మధ్యకు కట్ చేసి, కాచిన నెయ్యి వేసి అందించాలి. -
అంతా రామయం!
శ్రీరామనవి వేడుకలు బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రముఖ ఆలయాల్లో సీతారాముల కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. రామాయణంలో ఆసక్తికర ఘట్టాలను అర్చకులు వివరించారు. నీలమేఘశ్యాముడి ఏకపత్నీవ్రతాన్ని పాటలతో కీర్తించారు. పల్లెలో గ్రామోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. రామనామ జపంలో రామాలయాలు మార్మోగాయి. గ్రామాల్లో ఎద్దుల పందేలు, పొట్టేళ్ల పోటీలు నిర్వహించారు. - సాక్షి నెట్వర్క్ -
ఒంటిమిట్టలో వైభవంగా ధ్వజారోహణ
కడప(ఒంటిమిట్ట): వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగబోయే సీతారాముల కల్యాణోత్సవాన్ని బుధవారం ఉదయం 9.18 నిముషాలకు ధ్వజారోహణ చేశారు. ఇందులో భాగంగా వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం పర్యవేక్షించింది. ఈ నెల 10న స్వామి కల్యాణం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే కల్యాణోత్సవానికి ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వచ్చేందుకు వీలుగా ఆర్టీసీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దాదాపు 110 ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది. -
ఒంటిమిట్టలో వైభవంగా ధ్వజారోహణ.
-
శ్రీరామ గానం.
-
భద్రాద్రిని తలపించేలా నవమి ఉత్సవాలు
-
శ్రీరాముడికి సంప్రదాయ ప్రసాదాలు కనుమరుగు
-
రామదాసు స్వస్థలంలో కళ్యాణానికి నగదు లేదు
-
ప్రజలందరికీ శుభాలు కలగాలి: వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీలోని ఒంటిమిట్ట, తెలంగాణలోని భద్రాద్రి పుణ్యక్షేత్రాలతోపాటు రెండు రాష్ట్రాల్లోని గ్రామాల్లో ప్రజలు ఈ పర్వదినాన్ని వైభవంగా జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలందరికీ శుభాలు కలిగేలా సీతారాముల ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు. -
కనగ కనగ కమనీయం
భద్రాచలం పరమపవిత్ర గోదావరి నది తీరాన శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై స్వయంభువుగా కొలువైనదే పావన భద్రాద్రి క్షేత్రం. ఇక్కడ స్వామివారు ధనుర్బాణ శంఖుచక్రాలను ధరించి చతుర్భుజుడిగా దర్శనమిస్తున్నాడు. ఓవైపు గోదావరి గలగలలు... మరోవైపు పాపికొండల సోయగాలు... ప్రకృతి రమణీయత మనసును దోచేస్తుండగా శ్రీరామచంద్రుడి దర్శనభాగ్యానికి భక్తజనం తహతహలాడుతుంటారు. జీవిత కాలంలో ఒక్కసారైనా స్వామి వారి కల్యాణాన్ని చూసి తరించాలని అనుకోని వారుండరు. గోదావరిలో స్నానం ఆచరించి రామయ్య పాదాల చెంత సేదతీరితే సర్వపాపాలు తొలగిపోయినట్లేనని భక్తజనం నమ్మిక. దక్షిణ అయోధ్యగా, సాకేతపురిగా పేరుగాంచిన భద్రాచలం... ఖమ్మం పట్టణానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీరామనవమి సందర్భంగా నేడు ఇక్కడ శ్రీ సీతారాముల వారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరుగనుంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన క్షేత్రంగా భాసిల్లుతున్న భద్రగిరిలో రాములోరి పెళ్లి అంగరంగవైభవంగా జరగనుంది. వైకుంఠ నారాయణుడు త్రేతాయుగంలో దండకారణ్యంలోని పర్ణశాల ప్రాంతంలో వనవాసం చేస్తున్న సీతారాముల అనుగ్రహానికి పాత్రమైన ఒక శిల బ్రహ్మదేవుని వరప్రసాదంగా మేరు దేవి, మేరు పర్వత రాజదంపతులకు భద్రుడు పేరిట పుత్రుడై జన్మించాడు. బాల్యం నుంచి శ్రీరామ భక్తుడైన భద్రుడు నారద మహర్షి ద్వారా శ్రీరామ తారక మంత్రాన్ని ఉపదేశంగా పొంది శ్రీరామ సాక్షాత్కారానికై దండకారణ్యంలో ఘోరతపస్సు చేశాడు. ఆ తపప్రభావంతో శ్రీమన్నారాయణుడు మరలా శ్రీరామ రూపం దాల్చి చతుర్భుజ రామునిగా శంఖచక్ర ధనుర్భాణాలను ధరించి, ఒకవైపు సీత, మరోవైపు లక్ష్మణుడు ఉండగా, పద్మాసనస్థితిలో ఆసీనుడై ప్రత్యక్షమయ్యాడు. భద్ర మహర్షి కోరికపై పర్వత రూపంగా మారిన అతని శిఖరాగ్రంపై పవిత్ర గోదావరి నదికి అభిముఖంగా ఆ భద్రుని హృదయ స్థానాన వెలిశాడు. భద్రుని కొండ అయినందునే ఈ క్షేత్రానికి భద్రాచలం అని పేరు వచ్చింది. కోటి నామాల రాముడు స్వామికి భద్రాద్రి రాముడని, సాక్షాత్తు వైకుంఠం నుండి అవతరించడం వల్ల వైకుంఠ రాముడని, ఇక్కడ సీతారామ లక్ష్మణుల దివ్యమూర్తులు ‘అ’కార, ‘ఉ’కార, ‘మ’కార స్వరూపాలు అయినందువల్ల ఓంకార రాముడని, శంఖు చక్ర ధనుర్బాణాలు ధరించడంతో రామ నారాయణుడు అని కూడా పేర్లు వచ్చాయి. మహాభక్తులైన శ్రీ తిరుమంగై అళ్వార్లు, శంకర భగత్పాదులు మొదలగు మహాత్ములెందరో ఈ స్వామిని సేవించి తరించారు. ముఖ్యంగా 16వ శతాబ్దికి చెందిన పోకల దమ్మక్క అనే భక్తురాలు స్వామికి తాటి ఆకుల పందిరి వేసి పూజలు చేసి అపర శబరిగా తరించింది. అనంతరం భక్తరామదాసుగా ప్రసిద్ధుడైన కంచెర్ల గోపన్న రామునికి ఆలయ గోపుర ప్రాకార మండపాదులను, అమూల్యమైన ఎన్నో ఆభరణాలను సమర్పించి అనేక కీర్తనలతో గానంచేసి వాగ్గేయకారుడై భద్రాద్రిరాముని సేవలో తరించాడు. భక్తరామదాసు సీతమ్మవారికి చేయించిన మాంగల్యంతోనే నేటికీ మాంగల్యధారణ కార్యక్రమం జరగడం విశేషం. అశ్వమేధయాగ ఫలం పావన గౌతమి నదీ తీరాన ప్రముఖ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న భద్రాచల క్షేత్రం కలియుగ వైకుంఠాన్ని మరిపిస్తుంది. ప్రతి యేటా శ్రీరామ నవమి నాటి కల్యాణ మహోత్సవం వీక్షిం^è డానికి, రాములవారిని సేవించడానికి భద్రాచల క్షేత్రానికి ఎవరు వస్తారో... వారు అక్షయమైన అశ్వమేధ యాగ ఫలాన్ని పొందుతారని బ్రహ్మపురాణం చెబుతోంది. ప్రతి ఏటా చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రంలో అభిజిత్ లగ్నాన పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం శ్రీ సీతారామచంద్రస్వామి వారి తిరు కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలో జరిగే కల్యాణాన్ని తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. అలనాడు రామదాసు చేయించిన సీతారామ కల్యాణానికి గోల్కొండ నవాబు తానీషా... పట్టువస్త్రాలు, తలంబ్రాలు పంపించారు. ఆ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. భద్రాద్రిలో జరిగే శ్రీసీతారామచంద్ర స్వామి కల్యాణానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకురావడం ఆనవాయితీగా మారింది. రాములోరి కళ్యాణాన్ని తిలకించిన భక్తులు చుట్టుపక్కల సీతారాములు అలనాడు నడయాడిన ప్రదేశాలను చుట్టిరావచ్చు. అవన్నీ భద్రాద్రికి 9 నుంచి 35 కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉన్నాయి. – కె. విశ్వనాథ్, సాక్షి ప్రతినిధి, భద్రాచలం, ఖమ్మం -
గోటి తలంబ్రాల ప్రత్యేకత
-
శ్రీరామనవమి శోభాయాత్రకి భారీ భద్రత
-
5న తిరుమలలో శ్రీరామనవమి ఆస్థానం
చిత్తూరు: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 5వ తేదీన శ్రీరామ నవమిని పురస్కరించుకుని రాత్రి 10 గంటలకు ఆస్థానం నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి హనుమంత వాహన సేవ నిర్వహించనున్నారు. మలయప్పస్వామి శ్రీరామచంద్రమూర్తి రూపంలో తన భక్తాగ్రేసరుడు ఆంజనేయుని వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. 6వ తేదీ రాత్రి 8 గంటలకు ఆలయంలో శ్రీరామపట్టాభిషేకం నిర్వహించనున్నారు. కాగా, శ్రీవారి ఆలయంలో ఈనెల 8 నుండి 10వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు నిర్వహించనున్నారు. ఆలయానికి నైరుతి దిశలోని వసంత మంటపంలో చైత్ర శుద్ధ త్రయోదశి మొదలు పూర్ణిమ వరకు మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, ఇతర పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించి. రెండో రోజు 9వ తేదీ ఉదయం 8 గంటలకు శ్రీవారి రథోత్సవం ఉంటుంది. మూడో రోజు 10వ తేదీ స్నపన తిరుమంజనం కార్యక్రమాలతోపాటు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప, సీతారామ లక్ష్మణ, ఆంజనేయుడు, రుక్మిణీ సమేత శ్రీ కృష్ణ స్వామి ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతాయి. ఈ మూడు రోజులూ కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు చేశారు. 9వ తేదీన సహస్ర కలశాభిషేకం, 10వ తేదీన తిరుప్పావడ సేవను కూడా రద్దు చేశారు. -
భద్రాద్రిలో అంకురారోహణ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణోత్సవానికి శనివారం అంకురారోహణ వేడుక అత్యంత వైభవోపేతంగా జరిగింది. స్వామి వారికి ఆలయం చుట్టు సేవ నిర్వహించిన అనంతరం బేడా మండపంలోకి తీసుకొచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు పొడిచేటి జగన్నాధాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు, వేదపండితులు స్వామి వారికి వేదస్వస్తి, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు. అనంతరం మూలవరుల వద్ద ఉత్సవాలకు అనుజ్ఞ తీసుకున్నారు. బేడా మండపంలో స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం, స్నపన తిరుమంజనాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. సాయంత్రం రామాలయంలోని యాగశాలలో మృత్సంగ్రహణం, వాస్తు హోమం వంటివి నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా జరిపే బ్రహ్మోత్సవాలలో పూజా కార్యక్రమాలను నిర్వహించే అర్చక స్వాములకు ఆలయ ఈవో రమేష్‌బాబు దీక్షా వస్త్రాలను అందజేశారు. వేడుకలో భాగంగా ఆదివారం ఆలయంలో ధ్వజపట భద్రక మండల లేఖన పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీరామనవమి నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం దేవస్ధానం ఆధ్వర్యంలో స్ధానిక జీయర్ స్వామి మఠంలో ధ్వజపట భద్రక మండల లేఖన(గరుడ చిత్రం) పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం గరుడాదివాసం, రాత్రికి స్వామి వారికి తిరువీధి సేవ నిర్వహించిస్తారు. -
ఊపందుకున్న రాములోరి బ్రహ్మోత్సవాల సన్నాహాలు
► ఆలయం సమీపంలో గార్డెనింగ్ ► కళ్యాణవేదిక వద్ద ఏర్పాట్లు ముమ్మరం ఒంటిమిట్ట రామాలయం(రాజంపేట): రెండవ అయోధ్యగా ప్రసిద్ధిచెందిన ఒంటిమిట్ట కోదండరామాలయంలో బ్రహోత్సవాల సన్నాహాలు ఊపందుకున్నాయి. పనులను వేగవంతం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్ధానం అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు సంబంధిచి తాత్కాలిక పనులే అధికంగా ఉండటం వల్ల పనులు పకడ్బందీగా సకాలంలో పూర్తి చేయాలని ఈఓ సాంబశివరావు ఆదేశించారు. ఉత్సవాలకు ఆలయంతోపాటు కళ్యాణవేదికను ముస్తాబు చేస్తున్నారు. ఆలయం సమీపంలో గార్డెనింగ్: రామాలయం సమీపంలో గార్డెనింగ్ పనులు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో కడియం, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి వివిధ రకాల పూలమొక్కలను 11రకాల తెప్పించారు. 8,452 మొక్కల నాటి, గార్డెన్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ రూ.లక్షలను వ్యయం చేస్తోంది. ఒకొక్కరకం పూలమొక్కలను 500 నుంచి 2500 లోపు తీసుకొచ్చి నాటించే పనిలో పడ్డారు. కళ్యావేదిక సమీపంలో రూ.52లక్షలతో మొక్కలు నాటింపు: కడప రేణిగుంట రహదారిలో తిరుమల తిరుపతి దేవస్ధానం రూ.52లక్షలతో మొక్కలు నాటింపు కార్యక్రమం పూర్తికావచ్చింది. ఈ మొక్కలను మూడు సంవత్సరాల పాటు రక్షించేలా టీటీడీ ప్రణాళికలను రూపొందించుకుంది. ఈ మొక్కలను కళ్యాణవేదిక ప్రాంతంలో కూడా నాటించారు. దీంతో భవిష్యత్తులో కళ్యాణవేదిక పచ్చదనం పరుచుకోనుంది. ఆలయంలో తాత్కలిక షెల్డర్లు..: రామాలయంలోఖాళీగా ఉన్న ప్రాంతంలో తాత్కలిక షెల్డర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ షెల్డరు వల్ల భక్తులకు నీడ సౌకర్యంతో పాటు ఆలయ నిర్వహణకు సౌకర్యంగా ఉంటుందని భావించి ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే భక్తులు స్వామివారిని సులభంగా దర్శించుకునేలా ప్రత్యేక క్యూలైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. రూ.34లక్షలతో ముఖద్వారం, ప్రహారీగోడను నిర్మిస్తున్నారు. అలాగే అలంకారమండపం పనులను చేపట్టారు. రథానికి మరమ్మత్తులు..: స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రధోత్సవం నాడు సీతారామలక్ష్మణ స్వామివార్లను ఊరేగించేందుకు రథంను టీటీడీ సిద్ధం చేస్తోంది. గతంలో రథోత్సవం నాడు తలెత్తిన లోపాలను సరిద్దుకునేందుకు ఈసారి రథాన్ని సిద్ధం చేస్తున్నారు. రథోత్సవంను మాఢవీధుల్లో తిరిగేందుకు వీలుగా చర్యలను తీసుకుంటున్నారు. -
భక్తాగ్రేసరుడిపై శ్రీరామచంద్రుడి విహారం
సాక్షి,తిరుమల: శ్రీరామనవమిని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి 7గంటల నుండి 8.30 గంటల వరకు మలయప్పస్వామి శ్రీరామచంద్రుని రూపంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయంలోని బంగారు వాకిలిలో రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు ప్రత్యేకంగా ఆస్థాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయుడు వేర్వేరుగా ఆశీనులై ఆస్థానపూజలందుకున్నారు. అంతకుముందు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఆలయంలోని రంగనాయక మండపంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శనివారం రాత్రి 8 గంటలకు ఆలయంలో శ్రీరామపట్టాభిషేకం నిర్వహించనున్నారు. -
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శుక్రవారం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు 46,635 మంది భక్తులు దర్శించుకున్నారు. 19 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న సర్వదర్శనం భక్తులకు 8 గంటలు, 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న కాలిబాట భక్తులకు 3 గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది. గదులు ఖాళీ లేవు. హుండీ కానుకలు రూ.2.36 కోట్లు లభించాయి. -
సీఎంను కలిసిన రాయపాటి సోదరులు
గుంటూరు (తాడేపల్లి రూరల్): శ్రీరామనవమి సందర్భంగా ఎంపీ రాయపాటి సాంబ శివరావు, ఆయన సోదరుడు శ్రీనివాస్ శుక్రవారం సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఉండవల్లి కరకట్ట మార్గంలో ఉన్న ముఖ్యమంత్రి నివాసానికి వచ్చిన రాయపాటి సోదరులు సీఎంకు కోదండరామస్వామి వారి శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. మాచర్ల పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కోరారు. మాచర్ల వైద్యశాలకు అంబులెన్స్‌ను కేటాయించాలని విన్నవించారు. మాచర్లలోని చెన్నకేశవస్వామి దేవాలయానికి కృష్ణపుష్కర నిధులు కేటాయించి అభివృద్ధి పర్చాలని కోరారు. -
ఉత్సవాలకు ఒంటిమిట్ట ముస్తాబు
♦ నేటి నుంచి కోదండరామునికి బ్రహ్మోత్సవాలు ♦ ధ్వజారోహణం, పోతన జయంతి, కవి సమ్మేళనం ♦ 20న సీతారాముల కల్యాణోత్సవం ఒంటిమిట్ట: వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామాలయంలో శ్రీరామనవమి నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి అంకురార్పణ గావించారు. శుక్రవారం ఉదయం ధ్వజారోహణం చేయనున్నారు. స్వామివారికి జిల్లా ఇన్చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నెల 20న సీతారాముల కల్యాణోత్సవ నిర్వహణకు 70 ఎకరాల ప్రాంగణంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 40 ఎకరాల మేర చలువ పందిళ్లు వేయనున్నారు. ఏటా శ్రీరామనవమి రోజునే పోతనామాత్యుని జయంతిని నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవులతో శుక్రవారం సాయంత్రం కవి సమ్మేళనం నిర్వహిస్తారు. రాత్రికి స్వామి వారు శేషవాహనంపై ఊరేగుతారు. రాముడు ఆదర్శం కావాలి: సీఎం చంద్రబాబు సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర ప్రజలకుముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. కడప జిల్లా ఒంటిమిట్టలో అధికారికంగా రెండోసారి నవమి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు సీఎం తెలి పారు. ఆడిన మాట తప్పని శ్రీరామచంద్రుడే ఆదర్శం కావాలన్నారు. -
కనగ కనగ కమనీయం...
పరమపవిత్ర గోదావరి నది తీరాన శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై స్వయంభువుగా కొలువైనదే పావన భద్రాద్రి క్షేత్రం. ఇక్కడ స్వామివారు ధనుర్బాణ శంఖుచక్రాలను ధరించి చతుర్భుజుడిగా భద్ర మహర్షికి ఏవిధంగా దర్శనమిచ్చాడో నేటికీ భక్తులకు అదే విధంగా దర్శనమిస్తున్నాడు. ఓవైపు గోదావరి గలగలలు.. మరోవైపు పాపికొండల సోయగాలు.. ప్రకృతి రమణీయత మనసును దోచేస్తుండగా శ్రీరామచంద్రుడి దర్శనభాగ్యానికి భక్తజనం తహతహలాడుతుంటారు. జీవిత కాలంలో ఒక్కసారైనా స్వామి వారి కళ్యాణాన్ని చూసి తరించాల్సిందేనని అనుకోని వారుండరు. గోదావరిలో స్నానం ఆచరించి రామయ్య పాదాల చెంద సేదతీరితే సర్వపాపాలు తొలగిపోయినట్లేనని భక్తజనం నమ్మిక. దక్షిణ అయోధ్యగా, సాకేతపురిగా పేరుగాంచిన భద్రాచలం ఖమ్మం జిల్లాకు 120కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 15న శ్రీ సీతారాముల వారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరుగనుంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన క్షేత్రంగా భాసిల్లుతున్న భద్రగిరిలో రాములోరి పెళ్లి అంగరంగవైభవంగా జరగనుంది. వైకుంఠ నారాయణుడు త్రేతాయుగమున దండకారణ్యంలోని పర్ణశాల ప్రాంతంలో వనవాసం చేస్తున్న సీతారాముల అనుగ్రహానికి పాత్రమైన ఒక శిల బ్రహ్మదేవుని వరప్రసాదంగా మేరు దేవి, మేరు పర్వత రాజదంపతులకు భద్రుడు పేరిట పుత్రుడై జన్మించాడు. బాల్యం నుంచి శ్రీరామ భక్తుడైన భద్రుడు నారద మహర్షి ద్వారా శ్రీరామ తారక మంత్రాన్ని ఉపదేశంగా పొంది శ్రీరామ సాక్షాత్కారానికై దండకారణ్యంలో ఘోరతపస్సు చేశాడు. ఆ తపప్రభావంతో శ్రీమన్నారాయణుడు మరలా శ్రీ రామ రూపం దాల్చి చతుర్భుజ రామునిగా శంఖ చక్ర ధనుర్భాణాలను ధరించి, వామాంకమున(ఎడమ తొడపై) సీతతో, వామ పార్శ్వాన (ఎడమ ప్రక్కన) లక్ష్మణునితో కూడి పద్మాసనస్థితిలో ఆసీనుడై ప్రత్యక్షమయ్యాడు. భద్ర మహర్షి కోరికపై పర్వత రూపంగా మారిన అతని శిఖరాగ్రంపై శ్రీ పాదాల నుంచి పవిత్ర గోదావరి నదికి అభిముఖంగా ఆ భద్రుని హృదయ స్థానాన వెలిశాడు. భద్రుని కొండ అయినందునే ఈ క్షేత్రానికి భద్రాచలం అని పేరు వచ్చింది. కోటి నామాల రాముడు స్వామికి భద్రాద్రి రాముడని, సాక్షాత్తు వైకుంఠం నుండి అవతరించడం వల్ల వైకుంఠ రాముడని, ఇక్కడ సీతారామ లక్ష్మణుల దివ్యమూర్తులు ‘అ’కార, ‘ఉ’కార, ‘మ’కార స్వరూపాలు అయినందువల్ల ఓంకార రాముడని, శంఖు చక్ర ధనుర్బాణాలు ధరించడంతో రామ నారాయణుడు అని కూడా పేర్లు వచ్చాయి. మహాభక్తులైన శ్రీ తిరుమంగై అళ్వార్లు, శంకర భగత్పాదులు మొదలగు మహాత్ములెందరో ఈ స్వామిని సేవించి తరించారు. ముఖ్యంగా 16వ శతాబ్దికి చెందిన పోకల దమ్మక్క అనే భక్తురాలు స్వామికి తాటి ఆకుల పందిరి వేసి పూజలు చేసి అపర శబరిగా తరించింది. అనంతరం భక్తరామదాసుగా ప్రసిద్ధుడైన కంచెర్ల గోపన్న రామునికి ఆలయ గోపుర ప్రాకార మండపాదులను, అమూల్యమైన ఎన్నో ఆభరణాలను సమర్పించి అనేక కీర్తనలతో గానంచేసి వాగ్గేయకారుడై భద్రాద్రిరాముని సేవలో తరించాడు. అశ్వమేధయాగ ఫలం పావన గౌతమి నదీ తీరాన ప్రముఖ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న భద్రాచల క్షేత్రం కలియుగ వైకుంఠాన్ని మరిపిస్తుంది. ప్రతి యేటా శ్రీరామ నవమి నాటి కల్యాణ మహోత్సవం వీక్షించ డానికి, రాములవారిని సేవించడానికి భద్రాచల క్షేత్రానికి ఎవరు వస్తారో... వారు అక్షయమైన అశ్వమేధ యాగ ఫలమును పొందెదరని బ్రహ్మపురాణం చెబుతున్నది. శ్రీభక్తరామదాసు సీతమ్మవారికి చేయించిన మాంగల్యంతోనే మాంగల్యధారణ కార్యక్రమం నేటికీ జరుగుతుంది. ప్రతి ఏటా చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రంలో అభిజిత్ లగ్నాన పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం శ్రీసీతారామచంద్రస్వామి వారి తిరు కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలో జరిగే కల్యాణాన్ని తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. తానీషా గోల్కొండ నవాబుగా ఉన్న కాలంలో తానీషా నవాబు సీతారాముల కల్యాణానికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు పంపడం జరిగింది. నాటి సాంప్రదాయం ప్రకారం భద్రాద్రిలో జరిగే శ్రీసీతారామ చంద్ర స్వామి కల్యాణానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకురావడం ఆనవాయితీగా మారింది. రాములోరి కళ్యాణాన్ని తిలకించిన భక్తులు చుట్టుపక్కల 9 నుంచి 35 కిలోమీటర్ల దూరంలో గల సీతారాములు అలనాడు నడయాడిన ప్రదేశాలను చుట్టిరావచ్చు. సీతమ్మవాగు సీతారామలక్ష్మణులు మొదటిసారి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడి సుందరవనాలను చూసి అమ్మవారు సంతోషపడి లక్ష్ష్మణుడితో ‘అంతా బాగుంది కానీ నీరు లేదు, అలాగే పూజ చేసుకునేందుకు పసుపు, కుంకుమ కావాలి’ అందిట. అప్పుడు లక్ష్మణుడు ఒక కొండపైన 70 అడుగుల నల్లటి బండను చూసి, బాణం సంధిస్తే అది పగిలి పసుపు కుంకుమ రాళ్లు కలిసిన నీళ్లు ధారగా వచ్చాయట. నాడు అమ్మవారు అడిగిన నీరే సీతమ్మవాగుగా ప్రసిద్ధి చెందింది. అలాగే భద్రాచలానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో పర్ణశాల ఉంది. వనవాస సమయంలో సీతారాముడు లక్ష్మణ సమేతుడై ఇక్కడే పర్ణశాల ఏర్పాటుచేసుకొని ఉన్నాడట. అప్పుడు జరిగిన సన్నివేశాలను ఇక్కడ శిల్పాలుగా చెక్కి పర్యాటకుల కోసం ఏర్పాటు చేశారు. - కె.విశ్వనాథ్, సాక్షి ప్రతినిధి, భద్రాచలం, ఖమ్మం ఇలా చేరుకోవచ్చు హైదరాబాద్ నుంచి వచ్చేవారు సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం నుంచి భద్రాచలం చేరుకోవచ్చు. ఖమ్మం నుంచి భద్రాచలం 120 కి.మీ. కొత్తగూడెం నుంచి 40 కి.మీ. కొత్తగూడెంలో రైల్వేస్టేషన్ ఉంది. రాజమండ్రి నుంచి వచ్చేవారు జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట, కుకునూరు నుంచి భద్రాచలం చేరుకోవచ్చు. రాజమండ్రి నుంచి 180 కిలోమీటర్లు. భద్రాచలంలో వసతి సదుపాయాలు ఉన్నాయి. -
పరిపూర్ణ మానవుడు... శ్రీరాముడు!
స్పెషల్ స్టోరీ ఏప్రిల్ 15 శ్రీరామనవమి మానవ సంబంధాలు గతి తప్పి, వికృత, విశృంఖల ప్రవర్తన వెర్రితలలు వేస్తున్న ఈ రోజుల్లో మనిషి మనిషిలా ఎలా జీవించాలన్న విషయాన్ని తెలుసుకోవడానికి శ్రీరాముని జీవితాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం మునుపటి కంటే చాలా ఎక్కువగా ఉంది. ఈ రోజుల్లోనే, రామ కథాశ్రవణం, రాముని గుణగణాల అధ్యయనం, రాముని అనుసరించే ప్రయత్నం చేయడం ఎక్కువ అవసరం. బ్రహ్మ ఇచ్చిన వరాలబలం వల్ల రావణ వధ అనేది దేవ, దానవ, యక్ష, సిద్ధ, సాధ్య, కిన్నెర, కింపురుషాదులు ఎవరికీ సాధ్యం కాని పని. నర వానరుల పట్ల రావణునికి ఉన్న తేలిక భావం కారణంగా వారి చేతిలో మరణం లేకుండా ఉండాలని వరంలో భాగంగా బ్రహ్మను కోరనూ లేదు, బ్రహ్మ ఇవ్వనూ లేదు. అందువల్ల నరుడుగా జన్మించి, నరుడుగా వ్యవహ రించినపుడు మాత్రమే శ్రీమహావిష్ణువుకైనా రావణుని చంపడం సాధ్యమౌతుంది. ఇందుకొరకు వానర రూపంలో జన్మించిన దేవతాగణాల సహాయం తీసుకొని రావణుని వధించవలసి వచ్చింది. ఒక పరిపూర్ణ మానవుడు, ఒక ఆదర్శ మానవుడు ఎలా ప్రవర్తించాలి? నరుల పట్ల ఉన్న తేలిక భావం తొలగించాలన్నా, ఆదర్శ మానవ సంబంధాలు, ఆదర్శ కుటుంబ సంబంధాలు ఎలా ఉండాన్న విషయాన్ని నా జీవితమే నా సందేశం అన్నట్లుగా జీవించి చూపాలన్నా ఇది అవసరం అవుతుంది. అలా జీవించి చూపిన అవతారమే శ్రీరామావతారం. మానవ సంబంధాలు గతి తప్పి, వికృత, విశృంఖల ప్రవర్తన వెర్రితలలు వేస్తున్న ఈ రోజుల్లో మనిషి మనిషిలా ఎలా జీవించాలన్న విషయాన్ని తెలుసుకోవడానికి శ్రీరాముని జీవితాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం మునుపటి కంటే చాలా ఎక్కువగా ఉంది. ఈ రోజుల్లోనే, రామ కథాశ్రవణం, రాముని గుణగణాల అధ్యయనం, రాముని అనుసరించే ప్రయత్నం చేయడం ఎక్కువ అవసరం. రాముడిని దేవుడిగా కొలవడం ముమ్మాటికీ తప్పు కాదు. కానీ రాముడిని దేవుడిగా ఆరాధిస్తూనే, రాముడి జీవితం నుంచి మనం ఎలా జీవించాలి అన్న అంశాన్ని నేర్చుకోవడం అంతకంటే ముఖ్యం. రామాయణ రచనా ప్రారంభంలోనే వాల్మీకి మహర్షి... తన ఆశ్రమానికి వచ్చిన బ్రహ్మ మానస పుత్రుడైన నారద మహర్షిని ఏమడిగాడంటే... ఈ లోకంలో ఇప్పుడే, ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞత భావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్ధుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు, ఎవరి కోపం దేవతలను కూడ భయపెడుతుందో అట్టి వ్యక్తి ఉంటే నాకు చెప్పండి అని అడిగాడు. వాల్మీకి మహర్షిలో జాగృతమైన బ్రహ్మజిజ్ఞాసే ఈ ప్రశ్న అన్నది ఇందులో ఉన్న నిగూఢార్థం. వాల్మీకి మహర్షి నారదులవారిని షోడశ గుణాత్మకమైన భగవత్ తత్వాన్ని గురించి ప్రశ్నించగా నారదుడు ఈ లక్షణాలన్నీ నర రూపంలో భూమిపై నడయాడుతున్న నారాయణుడైన శ్రీరామునివేనని వివరిస్తాడు. అలా ఈ లక్షణాలు పరిపూర్ణ మానవుని లక్షణాలుగా కూడా స్వీకరించదగినవి. చాలా చిన్న కారణాలకే కుంగి పోయి నిస్పృహకు గురయ్యే నేటి తరం శ్రీరాముని వద్ద నేర్చుకో వలసిన అతి గొప్ప లక్షణం స్థిత ప్రఙ్ఞత్వం. ఈ రోజు ఉదయం తండ్రి పిలిచి ‘‘రామా రేపే నీ పట్టాభిషేకం. నీవు, నీ భార్య అవసరమైన దీక్షను చేపట్టండి’’ అన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండిపోయాడో ఆ రోజే రాత్రి కైకేయి పిలిపించి, ‘రామా! మీ నాన్న చెప్పలేక పోతున్నారు. నీకు పట్టాభిషేకం చేయడం లేదు, రేపటి నుంచీ నీవు జటాధారివై, ముని వృత్తి స్వీకరించి 14 సంవత్సరాల పాటు వనవాసం చేయాలి’ అని చెప్పినప్పుడూ అంతే సహజంగా స్వీకరించాడు. ఆవేశపడిపోయి, తల్లిదండ్రులను శాపనార్థాలు పెట్టకుండా ఉండడమే కాక, ఆవేశపడుతున్న లక్ష్మణుడిని మందలించి అరణ్యవాసానికి చాలా హాయిగా సిద్ధపడిపోయాడు. దేశభక్తి మాతృభక్తి కూడా రాముని చూసి నేర్చుకోవాలి. రావణ సంహారం తరువాత లంకా నగరంలో సంచరిస్తూ ఆ నగర సౌందర్యానికి ముగ్ధుడైన లక్ష్మణునితో ‘బంగారంతో నిండినదైనా నాకు లంకా నగరం రుచించదు లక్ష్మణా, జననీ జన్మ భూములు స్వర్గం కంటే గొప్పవి’ అన్నాడు. ఇంతకుమించిన దేశభక్తి, జాతీయతా భావన మరెక్కడ కనిపిస్తాయి? కృతజ్ఞతా గుణం మానవునికి ఉండవలసిన ఉత్తమ గుణాలలో ప్రధానమైనది. ఈ గుణం రామునిలో పుష్కలంగా దర్శనమిస్తుంది. పరిస్థితుల ప్రభావం వల్ల తండ్రికి దహన సంస్కారం కూడా చేయలేకపోతాడు రాముడు. సీతను రక్షించడం కోసం రావణునితో పోరాడి కొన ప్రాణాలతో మిగిలి ఉన్న జటాయువు పట్ల కృతజ్ఞతాభావంతో రాముడు, జటాయువుకు అంత్యక్రియలు నిర్వహిస్తాడు. ఇదీ కృతజ్ఞతా గుణం అంటే. మనకు చిన్న ఉపకారం చేసినవారిని కూడా మరచిపోకుండా వారికి అవసరమైనప్పుడు ప్రతి సహాయం చేయగలిగే సంస్కారం రాముని దగ్గరే నేర్చుకోవాలి. మనలను ఆశ్రయించి శరణు కోరిన వారిని పరిత్యజించకుండా శరణు ప్రసాదించడాన్ని వ్రతంగా కొనసాగించినవాడు రాముడు. చంపదగినట్టి శత్రువు రావణుని సోదరుడైన విభీషణుడు తనను శరణు కోరి అర్ధించినపుడు, (హనుమంతుడు తప్ప మిగిలిన) వానర ప్రముఖులు అవమానించినా, ఎట్లాంటి సంశయం లేకుండా అతనికి శరణు ప్రసాదించి, రావణుడే కోరినా శరణమిస్తానని అంటాడు. ఒక పాలకుడుగా ప్రజారంజకమైన పాలన అందివ్వడమే కాదు. ప్రజలకు తాను ఆదర్శంగా నిలవగలగాలి. ఉత్తముడైన పాలకుని లక్షణం అది. నా వ్యక్తిగత జీవితం, నా ఇష్టం అనడానికి పాలకునికి హక్కు లేదు. అందుకే తను రావణ వధానంతరం సీతను చేపట్టడాన్ని గురించి విమర్శ రాగానే, ఆమెను పరిత్యజించడానికి సిద్ధపడ్డాడు. రాముడు కేవలం సీతారాముడే కాదు రాజా రాముడు కూడా. తన మీద విమర్శలు వెల్లువెత్తుతున్నా, ప్రజలు చీదరించుకొంటున్నా, నీ చేష్ఠలు భరించ లేకుండా ఉన్నాం, దిగిపోవయ్యా మహానుభావా అని ప్రజలు నెత్తీ నోరూ మొత్తుకొంటున్నా కుర్చీని పట్టుకొని వేలాడుతున్న నేటి రాజకీయ నాయకులు రాముని చూచి నేర్చుకోవలసినది ఎంతైనా ఉంది. ఇతర ఆభరణాలన్నీ నశించిపోయేవే శాశ్వతమైన భూషణం వాగ్భూషణమే. శ్రీరాముడిని వచస్విగా, ‘వాగ్మి’ (చక్కని వక్త)గా వాల్మీకి వర్ణించాడు. రామచంద్రుడు మృదుభాషి, మితభాషి, మధురభాషి, పూర్వభాషి, స్మితపూర్వభాషి అని ప్రశంసించాడు. తానే ముందుగా పలకరించడం, నెమ్మదిగా, ప్రశాంతంగా ఆవేశానికి లోను కాకుండా మాట్లాడగలగడం రాముని ప్రధాన లక్షణాలు. రాముడు చిరునవ్వుతో పలకరించి, తరువాత మధురమైన మాటలతో మనసు చల్లబరచేవాడు. అంతేకాదు. కొద్ది నిముషాలు ఎదుటి వ్యక్తితో మాట్లాడగానే అతని వ్యక్తిత్వాన్నీ, సామర్థ్యాన్నీ అంచనా వేయగలిగే సామర్థ్యం రాముని సొత్తు. కిష్కింధకాండలో హనుమంతుడు రాముని తొలిసారిగా యతి వేషంలో కలిసి రామునితో పరిచయ వాక్యాలుగా నాలుగు మాటలు మాట్లాడుతాడు. హనుమంతుని సామర్థ్యాన్ని గురించి రాముడు కచ్చితమైన అంచనా వేస్తాడు. ఈ వ్యక్తి వేదవేత్త అని, వ్యాకరణ నిపుణుడనీ, మాట్లాడే సమయంలో ఇతని శరీర భంగిమలూ (బాడీ లాంగ్వేజ్) మాట్లాడే విధానమూ ఇతనిని ఒక అసాధారణ ప్రతిభాసంపన్నుడిగా తెలియ జేస్తున్నాయని, ఇట్టి మంత్రివర్యుని కలిగిన రాజుకు అసాధ్యమైనది ఉండదనీ లక్ష్మణునితో చెబుతాడు రాముడు. దీన్నిబట్టే రాముని సూక్ష్మబుద్ధి ఎలాంటిదో తెలుసుకోవచ్చు. రాముని సోదర ప్రేమ, సోదరుల పట్ల అతనికి ఉన్న తాపత్రయం వారి పట్ల అతనికి ఉన్న విశ్వాసం అసాధారణమైనవి. రాముని మరలా తీసుకువెళ్లి రాజ్యాభిషేకం చేయడానికి భరతుడు సైన్యంతో సహా బయలుదేరాడు. దూరం నుంచీ సైన్య సమేతంగా వస్తున్న భరతుని చూచి మనలను చంపి రాజ్యాధి కారాన్ని శాశ్వతం చేసుకోవడానికి భరతుడు వస్తున్నాడు. అతడిని నేను తుదముట్టిస్తానని ఆవేశపడతాడు లక్ష్మణుడు. అప్పుడు రాముడు భరతుని సోదర ప్రేమనూ, తనపట్ల అతనికి ఉన్న భక్తి భావాన్ని లక్ష్మణునికి వివరిస్తాడు. వ్యక్తుల పట్ల లోతైన అవగాహనతో కూడిన రాముని వ్యక్తిత్వం అచ్చెరువు కొలుపుతుంది. తండ్రి నేరుగా అడవులకు వెళ్లమని చెప్ప లేదు, పెపైచ్చు వెళ్లవద్దని బతిమాలు తున్నాడు. అయినా తండ్రి ఏనాడో ఇచ్చిన మాట వ్యర్థం కారాదనీ తద్వారా తండ్రికి అసత్యదోషం అంటరాదన్న రాముని తపన ఎంత విశేషమైంది! తండ్రి మరణించాక అతని అప్పులతో మాకు సంబంధం లేదు ఏం చేసు కొంటారో చేసుకోండి అని అప్పులవాళ్లను బుకాయిస్తున్న నేటి సంతానం రాముని నుంచి ఎంతో నేర్చుకోవాలి. తల్లిదండ్రులను అనాథాశ్ర మాలలో చేర్చి వదిలించుకొనే ప్రయత్నాలు చేయడం, ఆస్తిపాస్తుల కోసం అవసరమైతే తల్లిదండ్రులనూ, సోదరులనూ తుదముట్టించడానికి వెనుకాడని నేటి యువత రాముని పితృప్రేమ నుంచీ, సోదర ప్రేమ నుంచీ ఎన్ని గుణపాఠాలను నేర్చుకోవాలి! వికృత, అసహజ సంబంధాలు అనే భూతమ్ జడలు విప్పి నృత్యం చేస్తున్న ఈ రోజుల్లో రాముని ధర్మబద్ధమైన వైవాహిక జీవిత నిష్ఠ, ఏక పత్నీవ్రత నియమం, సుందరాంగి తనంత తాను వలచి వచ్చి వారించినా కన్నెత్తై చూడని నిగ్రహ సంపత్తీ నేటి యువతరానికి మార్గదర్శకాలు. రామకథ ఈనాటి సమాజానికి కూడా గురుస్థానంలో నిలుపుకోవలసిన మహాకావ్యమే, రాముడు నేటికీ మనకు మార్గదర్శకుడే. నాటికీ నేటికీ ఏనాటికీ రాముని శీలసంపద, గుణసంపత్తి, అగాధమైన అమృతసాగరం. సర్వకాలాలకూ, సర్వదేశాలకూ ఒక దీపస్తంభం రాముని వ్యక్తిత్వం. జన్మతః రాక్షసుడైనా రామబాణ స్పర్శతో విశేషమైన పరివర్తనకు లోనైన మారీచుడు రాముని వ్యక్తిత్వాన్నీ, దివ్యత్వాన్నీ సంపూర్ణంగా అవగాహన చేసుకొన్న ధన్య జీవి. అతని మాటల్లోనే రాముని గురించిన ఏకవాక్య సమగ్ర వివరణ ‘రామో విగ్రహవాన్ ధర్మః’. మూర్తీభవించిన ధర్మమే రాముడు. ఈ ఒక్క వాక్యం శ్రీరాముని పరిపూర్ణమైన మానవ త్వానికీ, దివ్యత్వానికీ దర్పణం పడుతుంది. - ఆర్.ఎ.ఎస్.శాస్త్రి రిటైర్డ ప్రిన్సిపాల్, ఆర్ట్స అండ్ సైన్స కాలేజ్, ఆదోని తండ్రి నేరుగా అడవులకు వెళ్లమని చెప్ప లేదు, పెపైచ్చు వెళ్లవద్దని బతిమాలు తున్నాడు. అయినా తండ్రి ఏనాడో ఇచ్చిన మాట వ్యర్థం కారాదనీ తద్వారా తండ్రికి అసత్యదోషం అంటరాదన్న రాముని తపన ఎంత విశేషమైంది! -
రామపాద దర్శనం
-
ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవ రాముడు
ఒంటిమిట్ట: వైఎస్ఆర్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామునికి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీరామనవమి, పోతన జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. మూలవిరాట్‌కు అభిషేకం, ప్రత్యేక పూజలు జరిపారు. ధ్వజస్తంభ ప్రాంగణంలో సీతా రామలక్ష్మణ ఉత్సవ విగ్రహాలను ఆశీనులను చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు వీణా రాఘవాచార్యుల ఆధ్వర్యంలో ధ్వజారోహణ కార్యక్రమం చేపట్టారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి దంపతులు స్వామికి పట్టువస్త్రాలను సమర్పించారు. కేఈ ఉదయం కడపలో మాట్లాడుతూ ఒంటిమిట్ట అభివృద్ధికి ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేస్తుందన్నారు. అమరావతి కేంద్రంగా రాజధాని ప్రాంతానికి ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టాలని కోరుతున్నానన్నారు. -
ఒంటిమిట్టలో వైభవంగా ధ్వజారోహణం
-
ఒంటిమిట్టలో వైభవంగా ధ్వజారోహణం
ఒంటిమిట్ట : కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా శనివారం ఉదయం ధ్వజారోహణం నిర్వహించారు. ధ్వజారోహణ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రి కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు. కాగా ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ వేడుకలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. శుక్రవారం సాయంత్రం అంకురార్పణతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఏప్రిల్ 2న జరిగే సీతారాముల కల్యాణోత్సవంలో గవర్నర్ నరసింహన్‌తో పాటు, ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. -
భద్రాచలంలో రాములోరి కల్యాణం
-
శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం శ్రీరామనవమి ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా ఏప్రిల్ 2 నుంచి 4 వరకు శ్రీవారి సాకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. ఏప్రిల్ 4 వ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. -
ఒంటిమిట్టలో నవమి ఉత్సవాలు ప్రారంభం
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ఈ రోజు ఉదయం ధ్వజారోహణం, సాయంత్రం పోతన జయంతి, రాత్రి శ్రీరామ జయంతి, శేష వాహనం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. -
నేడు తిరుమలలో శ్రీరామనవమి ఆస్థానం
సాక్షి,తిరుమల: శ్రీరామనవమిని పురస్కరించుకుని శనివారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఆలయంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు మలయప్పస్వామి శ్రీరామచంద్రుని రూపంలో హనుమంత వాహనంపై ఊరేగుతూ దర్శనమిస్తారు. తర్వాత ఆలయంలో ప్రత్యేకంగా ఆస్థానం నిర్వహిస్తారు. అలాగే ఆదివారం రాత్రి 8 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శనివారం వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ, 29న వసంతోత్సవం మాత్రం రద్దు చేశారు. 2 నుంచి శ్రీవారి వసంతోత్సవాలు తిరుమలలో ఏప్రిల్ 2 నుంచి శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు ఆరంభం కానున్నాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, పూజలు నిర్వహించనున్నారు. 4న ఆలయం మూత ఏప్రిల్ నాలుగో తేదీ శనివారం మధ్యాహ్నం 3.45 గంటల నుండి రాత్రి 7.15 గంటల వరకుచంద్రగ్రహణం సందర్భంగా ఆరోజు ఉదయం 9.30 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు తిరుమల ఆలయం మూసివేస్తారు. -
తారకరాముడు
రాముడి యుగం పోయి రాకెట్ యుగం వచ్చింది.. అయినా ఆయన ఇమేజ్ మాత్రం తగ్గలేదు! ఇప్పటికీ రామచంద్రుడులాంటి కొడుకు కావాలని కోరుకోని తల్లిదండ్రులుండరు.. సాకేతరాముడిలాంటి ఏకపత్నీవ్రతుడు దొరకాలని దండం పెట్టని ఆడపిల్ల ఉండదు! శ్రీరామనవమి సందర్భంగా బుల్లితెర తారలను కదిలిస్తే మనసులో ఉన్న మాటను బయటపెట్టారిలా... ..:: శిరీష చల్లపల్లి హరే రామ.. హరే కృష్ణ.. ‘అనగనగా’ సినిమా కథానాయిక, వెల్‌నోన్ యాంకర్ ప్రశాంతి ఏం చెప్తుందంటే ‘నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా నాయనమ్మ ద్వారా విన్న కథ రామాయణమే. చిన్నప్పుడు రాముడంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉండేది. తర్వాత తర్వాత రామాయణం చదవడం.. ఎనాలసిస్ చేసుకోవడం మొదలుపెట్టాక రాముడంటే గౌరవం పెరిగింది. కానీ, నాకు కాబోయే భర్త రాముడిలా ఎఫెక్షనేట్‌గా ఉండాలి.. కృష్ణుడిలా రొమాంటిక్‌గా ఉండాలి’ అంటుంది. రాముడులాంటి వాడే కావాలి.. మహిళా ప్రేక్షకుల మనసు దోచిన సీరియల్ శశిరేఖా పరిణయం. ఆ సీరియల్లో శారద పాత్రను పోషిస్తున్న తార నిహారిక. హీరో ప్రదీప్, సీనియర్ యాంకర్ సరస్వతీల ముద్దుల పట్టీ. శ్రీరామనవమి పండుగను తనెలా అభివర్ణించిందంటే... ‘శ్రీరాముడు.. ధర్మనిరతుడు. గొప్ప నాయకుడు. విశ్వామిత్రుడి ఆజ్ఞమేరకు తాటకిని వధించడం నుంచి వాలిని కూల్చడం.. రావణ సంహారం.. అన్నీ రాముడ్ని ధర్మపక్షపాతిగా నిలిపాయి. మనసావాచాకర్మణా సీతకే అంకితమయ్యాడు. మంచికే కట్టుబడి ఉన్నాడు. నాకూ అలాంటి భర్తే కావాలి. నా పాషన్ అయిన కళను ఎంకరేజ్చేయాలి. కుటుంబవిలువలు తెలిసినవాడై ఉండాలి’ అంటూ చెప్పుకొచ్చింది. చిలిపివాడైతే.. పదమూడో ఏటే యాంకర్ అయి పదేళ్లుగా అదే రంగంలో అప్రతిహతంగా దూసుకుపోతున్న అశ్విని.. 108 స్తోత్రాలను ఒకటిన్నర నిమిషంలో రాగయుక్తంగా ఆలపించి గిన్నిస్‌బుక్‌లోనూ చోటు సంపాదించింది. శ్రీరాముడిలోని ఏ సుగుణాలు తన కాబోయే వరుడిలో ఉండాలనుకుంటుందంటే ‘నాకు రాముడన్నా, సీతన్నా, రామాయణమన్నా చాలా ఇష్టం. నేను నేర్చుకున్న కీర్తనలన్నీ రాముడిమీదే. ఆయన ఎంతమంచి వాడైనా, కారణమేదైనా సీతమ్మను కానలకు పంపాడన్న అపవాదును మోశాడు. నాకైతే.. కొంచెం రాముడు, కొంచెం కృష్ణుడిలాంటి వాడు నాకు భర్తగా దొరకాలి అనుకుంటున్నా. అంటే ప్రేమించే తత్వంలో రాముడిలా ఉండాలి. చిలిపితనంలో కృష్ణుడిలా ఉండాలి. అయితే నా పెళ్లికి ఇంకా రెండేళ్లు టైముంది’ అంటుంది అశ్విని. పొసెసివ్‌నెస్ ఉండాలి.. గుడ్‌మార్నింగ్ టాలీవుడ్, షార్ట్‌కట్ అనే టీవీ షోస్ ద్వారా పాపులర్ అవుతున్న యాంకర్ వైష్ణవి. అనసూయ చెల్లెలు. ‘రామాయణం అందరికీ ఆదర్శం. కానీ రాముడే కొంచెం పొసెసివ్‌గా ఉండి ఉంటే సీతకు ఆ కష్టాలు తప్పేవి. నాకు కాబోయే భర్త నా పట్ల కొంచెం పొసెసివ్నెస్తోనే ఉండాలని కోరుకుంటాను. రాముడిలాంటి సింప్లిసిటీ ఉండాలి. డబ్బు ఆశ ఉండకూడదు. ఇది ఎంత రాకెట్ కాలమైనా.. విలువల విషయంలో రాముడికాలమే. కాబట్టి కుటుంబవిలువల విషయంలో రాముడిలా వ్యవహరించాలి. ఏకపత్నీవ్రతుడు అనే క్వాలిటీ కంపల్సరీ’ అంటుంది నవ్వుతూ! -
ఎంతో రుచిరా..!
కదళీఫలం (అరటిపండు) మధురం. ఖర్జూరం మృదు మధురం. నవరస పరమాన్న నవనీతాలు మధురాతి మధురం. కానీ భక్తరామదాసు ఒప్పుకోడు! రామనామాన్ని మించిన మధురం లేదంటాడు. ఎందుకు లేదూ... ఉంది! శ్రీరాముడిపై రామదాసు భక్తి!! ఇవాళ శ్రీరామనవమి. భక్తితో పానకం చేసినా, అరటి పూరీ చేసినా అది మధురమే. పానకం కావలసినవి: బెల్లం తురుము - 3 కప్పులు; నీళ్లు - 5 కప్పులు; శొంఠి పొడి - అర టీ స్పూను; మిరియాల పొడి - 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి - టీ స్పూను; ఉప్పు - పావు టీ స్పూను; నిమ్మరసం - టేబుల్ స్పూను; తయారీ: ఒక పెద్ద పాత్రలో నీళ్లు, బెల్లం తురుము వేసి బాగా కరిగే వరకు కలపాలి ఉప్పు, నిమ్మరసం వేసి మరో మారు కలపాలి శొంఠి పొడి, మిరియాల పొడి, ఏలకుల పొడి వేసి బాగా కలిపి గ్లాసులలో అందించాలి. దోసకాయ కోసుమల్లి కావలసినవి: పెసర పప్పు - అరకప్పు; దోసకాయ లేదా కీర దోస కాయ - 1 (తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి); నిమ్మరసం - 3 టీ స్పూన్లు; ఉప్పు - అర టీ స్పూను; కొత్తిమీర - చిన్న కట్ట (శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి); నెయ్యి - టీ స్పూను; ఆవాలు - అర టీ స్పూను; ఇంగువ - చిటికెడు; తాజా కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు. తయారీ పెసర పప్పును శుభ్రంగా కడిగి సుమారు రెండు గంటల సేపు నానబెట్టి, జల్లెడ వంటి దానిలో వడకట్టి సుమారు పది నిమిషాలు అలాగే ఉంచేయాలి. (పూర్తిగా నీళ్లు పోవాలి) ఒక పాత్రలో తరిగిన దోసకాయ ముక్కలు, నిమ్మరసం, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలపాలి చిన్న గుంట గరిటెలో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ఇంగువ జత చేసి బాగా కలిపి దోసకాయ ముక్కలు ఉన్న గిన్నెలో వేయాలి తాజాకొబ్బరి తురుముతో అలంకరించి అందించాలి. అరటిపండు పూరీ కావలసినవి: అరటిపండ్ల గుజ్జు - అర కప్పు; పంచదార - అర కప్పు; నెయ్యి - టేబుల్ స్పూను (కరిగించినది); ఏలకుల పొడి - పావు టీ స్పూను; ఉప్పు - చిటికెడు; బాదం పప్పుల తురుము - 3 టేబుల్ స్పూన్లు; గోధుమపిండి - ముప్పావు కప్పు; మైదా పిండి - ముప్పావు కప్పు; నూనె - వేయించడానికి తగినంత. తయారీ ఒక పాత్రలో అరటిపండ్ల గుజ్జు, పంచదార, బాదం పప్పుల తురుము, కరిగించిన నెయ్యి, ఉప్పు, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి గోధుమపిండి, మైదా పిండి జత చేసి బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని చపాతీ పిండిలా తయారుచేసి సుమారు రెండు గంటల సేపు పక్కన ఉంచాలి చేతికి నూనె కాని నెయ్యి కాని రాసుకుని పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, చిన్న చిన్న పూరీల మాదిరిగా అప్పడాల పీట మీద ఒత్తాలి బాణలిలో నూనె కాగాక ఒక్కో పూరీ వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి. (ఇవి ఒక్కొక్కటీ వేగడానికి సుమారు రెండు నిమిషాలు పడుతుంది) వీటిని వేడివేడిగా అందించాలి. -
నవమి దాటాక పట్టాల పంపిణీ
పేదలకు ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై సీఎం సమీక్ష సాక్షి, హైదరాబాద్: పేదలు నివాసముంటున్న స్థలాలను వారిపేరిట క్రమబద్ధీకరించే ప్రక్రియను శ్రీరామనవమిలోగా పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, నవమి తర్వాతరోజు నుంచి పట్టాలను పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై బుధవారం ఆయన రెవెన్యూశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా, సీసీఎల్ఏ ప్రధాన కమిషనర్ అదర్‌సిన్హా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు ఇందులో పాల్గొన్నారు. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కబ్జాలు లేకుండా పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడంపై దృష్టిపెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వ భూములు, యూఎల్సీ భూముల కోసం వచ్చిన దరఖాస్తులను వేర్వేరు కేటగిరీలుగా విభజించి క్రమబద్ధీకరించాలని సీఎం సూచించారు. క్రమబద్ధీకరణకు అర్హమైన దరఖాస్తులు సుమారు రెండులక్షలు రాగా, ఇందులో 1.70 లక్షల దరఖాస్తులు ప్రభుత్వ భూములకు సంబంధించినవేనని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని భూములకు సంబంధించిన దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలని సీఎం ఆదేశించారు. నవమి దాటాక పట్టాల పంపిణీ చేయాల్సి ఉన్నందున ఈ ప్రక్రియను వేగవతం చేసేందుకు అవసరమైతే ఇతర ప్రాంతాల నుంచి సిబ్బందిని డిప్యుటేషన్‌పై నియమించుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించినట్లు తెలిసింది. -
శ్రీ రామనవమి టికెట్ల ధరలు పెంపు
భద్రాచలం : ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే శ్రీ రామనవమి ఉత్సవాల టికెట్ల రేట్లను పెంచుతున్నట్లుగా దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది మార్చి 28న జరిగే ‘స్వామివారి వసంత పక్ష తిరు కల్యాణమహోత్సవం’ ఉభయదాతల టికెట్ల ధర గతంలో రూ.3,016 ఉండగా ప్రస్తుతం రూ.5 వేలుగా నిర్ణయించారు. వీవీఐపీ సెక్టార్ టికెట్ల ధరను రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచినట్లుగా తెలిపారు. భక్తులు ఈ మార్పును గమనించాలని కోరారు. శ్రీ సీతారామచంద్రస్వామివారి కల్యాణోత్సవ ఉభయదాతల టికెట్లను 23వ తేదీ నుంచి అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. కావాల్సిన భక్తులు కార్యాలయ రిసెప్షన్ నంబర్ 08743-232428, ఆలయ పర్యవేక్షకులు 76600 07679, ఆలయ పరిశీలకులు 76600 07681, 76600 07682 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
నేడు సీతారాముల కల్యాణం
ముస్తాబైన భద్రగిరి.. ఏర్పాట్లు పూర్తి వేలాదిగా చేరుకుంటున్న భక్తజనం ముత్యాల తలంబ్రాలతో నేడు గవర్నర్ రాక భద్రాచలం, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో మంగళవారం జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధమైంది. శ్రీరామనవమి రోజున భద్రగిరిలో జరిగే స్వామివారి కల్యాణాన్ని వీక్షించేందుకు మన రాష్ట్రంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. మిథిలాస్టేడియంలోని సుందరంగా తీర్చిదిద్దిన కల్యా ణ మండపంలో స్వామివారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ మండపంలో స్వామి వారి కల్యాణ తంతు మంగళవారం ఉదయం 10.30 నుంచి ప్రారంభమవుతుంది. అభిజిత్ లగ్నమందు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు మాంగల్య ధారణ జరుగుతుంది. మిథిలా స్టేడియంలో 35 వేల మంది వరకూ భక్తులు కూర్చుని స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు ఏర్పాటు చేశారు. రామాలయం పరిసర ప్రాంతాల్లో ఎల్ఈడీలను ఏర్పాటు చేశారు. ఈసారి ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మిథిలా స్టేడియంలో సెక్టార్లలో 40 కూలర్లను ఏర్పాటు చేశారు. సుమారు రెండు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు ప్రత్యేక వసతి కేంద్రాలను ఏర్పాటు చేశారు. భక్తులు సేద తీరేందుకు గోదావరి ఘాట్, మిథిలా స్టేడియం ప్రాంగణంతో పాటు వివిధ ప్రాంతాల్లో భారీ టెంట్లను ఏర్పాటు చేశారు. రామాలయాన్ని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. భక్తులందరికీ స్వామి వారి ప్రసాదాలను అందించేందుకు సుమారు 2 లక్షల లడ్డూల ప్రసాదాలను సిద్ధం చేశారు. అదే విధంగా 100 క్వింటాళ్ల స్వామి కల్యాణం తలంబ్రాలను సిద్ధం చేశారు. ఈసారి అందరికీ ముత్యాల తలంబ్రాలను అందించేందుకు రూ.5లకు ఒక ప్యాకెట్ చొప్పున విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం తరఫున రాష్ట్ర గవర్నర్ నరసింహన్ స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే భద్రాచలం చేరుకున్న దేవాదాయశాఖ కమిషనర్ ముక్తేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మిథిలా స్టేడియంలో ఇదే వేదికపై బుధవారం స్వామి వారికి పట్టాభిషేక మహోత్సవం జరుగనుంది. రామయ్యకు మండపేట బోండాలు మండపేట, న్యూస్‌లైన్ : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణ మహోత్సవంలో తూర్పు గోదావరి జిల్లా మండపేట కొబ్బరి బోండాలు కొలువుదీరనున్నాయి. పట్టణానికి చెందిన కేవీఏ రామారెడ్డి, మహాలక్ష్మి దంపతులు 2001 నుంచి భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవానికి బోండాలను అలంకరించి తీసుకెళ్తున్నారు. బోండాలకు ఎనామిల్, వాటర్ పెయింట్లు వేస్తారు. పూసలు, రాళ్లు, రిబ్బన్లు తదితర సామగ్రితో సుందరంగా తీర్చిదిద్దుతారు. శంఖు చక్రాలు, నామాలు, సీతారాముల పేర్లతో ప్రత్యేకంగా ముస్తాబు చేస్తారు. ఈ అలంకరణకు పది రోజులు పడుతుందని రామారెడ్డి తెలిపారు. సీతారాముల కల్యాణ వేడుకలో ఈ బోండాలను కానుకగా ఇవ్వాలని ఆకాంక్షించామని, అదే తరువాత ఆనవాయితీగా మారిందని చెప్పారు. రాజన్న సన్నిధిలో.. వేములవాడ, న్యూస్‌లైన్: కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి సన్నిధిలో శ్రీ సీతారాముల కల్యాణం మంగళవారం వైభవంగా జరుగనుంది. ఈ వేడుకను తిలకించేందుకు సుమారు రెండు లక్షల మంది తరలివస్తారు. మంగళవారం ఉదయం 10.05 నుంచి మధ్యాహ్నం 12.35 మధ్య జానకీరాముల కల్యాణం నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో కృష్ణాజీరావు తెలిపారు. పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులు కల్యాణ వేడుకలను తిలకించేందుకు వీలుగా ఎల్ఈడీలను ఏర్పాటు చేశారు. అనంతరం సాయంత్రం 4.30కు రథోత్సవం నేత్రపర్వంగా నిర్వహించనున్నారు. సీతారాముల కల్యాణ వేడుక జరుగుతున్న సమయంలోనే శివసత్తులు, హిజ్రాలు శివుడిని పెళ్లాడటం ఇక్కడ ఆనవాయితీ. ఓవైపు సీతారాముల తలంబ్రాల వేడుక కన్నులపండువగా సాగుతున్న సమయంలో వీరంతా పరస్పరం తలంబ్రాలు పోసుకోవటం విశేషం.