సీఎంను కలిసిన రాయపాటి సోదరులు | rayapati brothers met CM | Sakshi
Sakshi News home page

సీఎంను కలిసిన రాయపాటి సోదరులు

Published Sat, Apr 16 2016 1:11 AM | Last Updated on Thu, Aug 9 2018 9:10 PM

rayapati  brothers met CM

గుంటూరు (తాడేపల్లి రూరల్): శ్రీరామనవమి సందర్భంగా ఎంపీ రాయపాటి సాంబ శివరావు, ఆయన సోదరుడు  శ్రీనివాస్ శుక్రవారం సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఉండవల్లి కరకట్ట మార్గంలో ఉన్న ముఖ్యమంత్రి నివాసానికి వచ్చిన రాయపాటి సోదరులు సీఎంకు కోదండరామస్వామి వారి శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.   

 

మాచర్ల పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కోరారు. మాచర్ల వైద్యశాలకు అంబులెన్స్‌ను కేటాయించాలని విన్నవించారు. మాచర్లలోని చెన్నకేశవస్వామి దేవాలయానికి కృష్ణపుష్కర నిధులు కేటాయించి అభివృద్ధి పర్చాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement