Rayapati Sambashiva Rao
-
కుంభకోణంలో బాబే ప్రధాన సూత్రధారి
సాక్షి, అమరావతి: బ్యాంక్ ఆఫ్ బరోడా ట్రాన్స్ట్రాయ్ రుణాన్ని నిరర్థక ఆస్తిగా ప్రకటించినప్పుడే గత సర్కారు ఆ సంస్థపై వేటు వేసి పోలవరం పనుల నుంచి తొలగిస్తే ఇంత భారీ కుంభకోణానికి అవకాశమే ఉండేది కాదని 14 బ్యాంకుల కన్సార్షియం, ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకే ఈ కుంభకోణాన్ని చంద్రబాబు చేత.. చంద్రబాబు కోసం.. చంద్రబాబే పాల్పడిన స్కాంగా అభివర్ణిస్తున్నారు. ఎక్కడా లేని రీతిలో కేబినెట్ తీర్మానం ద్వారా పోలవరం పనుల్లో ట్రాన్స్‌ట్రాయ్‌కి సిమెంట్, స్టీలు ప్రభుత్వమే కొనుగోలు చేసి సరఫరా చేసేలా నాటి సీఎం చంద్రబాబు చక్రం తిప్పారు. కానీ రాయపాటి వాటిని కొనుగోలు చేయకుండానే నకిలీ బిల్లులతో రూ.1,527.10 కోట్ల బ్యాంకు రుణాన్ని దారి మళ్లించి స్వాహా చేయడాన్ని బట్టి ఈ కుంభకోణంలో బాబే ప్రధాన సూత్రధారి అనేది స్పష్టమవుతోంది. దీనిపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ట్రాన్స్ట్రాయ్ వాటా 13 శాతమే.. పోలవరం హెడ్‌వర్క్స్‌ను ట్రాన్స్ట్రాయ్–జేఎస్సీ– ఈసీ–యూఈఎస్ (జేవీ) రూ.4,054 కోట్లకు దక్కించుకుని 2013 మార్చి 2న నాటి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ జేవీలో రష్యా, ఉక్రెయిన్‌కు చెందిన జేఎస్సీ–ఈసీ–యూఈఎస్ వాటా 87% కాగా రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ వాటా కేవలం 13 శాతమే. జేఎస్సీ–ఈసీ–యూఈఎస్ సంస్థలో తన సమీప బంధువు చెరుకూరి శ్రీధర్‌ను డైరెక్టర్‌గా చేర్చి ఆ సంస్థకు కమీషన్లు చెల్లించి సొంతం చేసుకున్నారు. చిన్న ప్రాజెక్టుల పనులే చేయలేని ట్రాన్స్‌ట్రాయ్‌కి 194.6 టీఎంసీల సామర్థ్యం ఉన్న పోలవరం పనులను ఎలా అప్పగిస్తారని అప్పట్లో విపక్షాలు ఆందోళన చేశాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాయపాటి భారీగా ముడుపులు ఇవ్వడం వల్లే ట్రాన్స్‌ట్రాయ్‌కి పోలవరం కాంట్రాక్టు దక్కిందని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఆరోపణలు చేశారు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరి ఎంపీగా గెలిచిన రాయపాటి చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నారు. దివాలా తీసిన సంస్థకే దన్ను.. పోలవరం కాంట్రాక్టు ఒప్పందాన్ని చూపించిన ట్రాన్స్‌ట్రాయ్‌కి కెనరా బ్యాంక్ నేతృత్వంలోని 14 బ్యాంకుల కన్సార్షియం బ్యాంకు గ్యారెంటీలు, లెటర్ ఆఫ్ క్రెడిట్, రుణం రూపంలో రూ.7,926.01 కోట్లు ఇచ్చేందుకు 2013లో అంగీకారం తెలిపాయి. ఆ మేరకు రుణాలిచ్చాయి. ఇందులో కొంత భాగాన్ని 2014 ఎన్నికల్లో టీడీపీకి ఇం‘ధనం’గా మళ్లించారనే ఆరోపణలున్నాయి. తీసుకున్న రుణాన్ని ఇతర సంస్థలకు మళ్లించి స్వాహా చేయడంతో 2014 అక్టోబర్ 5న ట్రాన్స్ట్రాయ్ రుణాన్ని ఎన్పీఏగా బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. ఆ తర్వాత 13 బ్యాంకులు ట్రాన్స్ట్రాయ్ రుణాలను ఎన్పీఏలుగా ప్రకటించాయి. చదవండి: (పురిటి గడ్డ రుణం.. సీఎం జగన్ సంకల్పం) పోలవరం పనులు దక్కించుకుని ఒప్పందం చేసుకున్నాక జేవీలోని విదేశీ సంస్థలైన జేఎస్సీ, యూఈఎస్ సంస్థలు పత్తా లేకుండా పోయాయి. కేవలం కాంట్రాక్టు దక్కించుకోవడానికి మాత్రమే విదేశీ సంస్థలను కాగితాలపై చూపిన ట్రాన్స్ట్రాయ్పై వేటు వేయాలని జలవనరుల శాఖ ఉన్నతాధికారులు నాడు సీఎంగా ఉన్న చంద్రబాబుకు సూచించినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో 2015 మార్చి 12న తొలి సారిగా సమావేశమైన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) విదేశీ సంస్థలు పత్తా లేకపోవడాన్ని ప్రశ్నించింది. దివాలా తీసిన ట్రాన్స్‌ట్రాయ్‌కి పోలవరం పనులు చేసే సత్తా లేదని, దాన్ని తప్పించాలని సూచించినా చంద్రబాబు వినలేదు. ట్రాన్స్‌ట్రాయ్‌ని ముందు పెట్టి దోపిడీ.. విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని శరవేగంగా పూర్తి చేసేందుకు పీపీఏతో ఒప్పందం చేసుకోవాలని గత సర్కారుకు కేంద్రం పలుదఫాలు సూచించింది. అయితే పీపీఏతో ఒప్పందం చేసుకుంటే సత్తాలేని రాయపాటి సంస్థపై వేటు పడటం ఖాయం. ప్రాజెక్టును కేంద్రం చేపడితే కమీషన్లు రావని ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ 2016 సెప్టెంబర్ 7న పోలవరం నిర్మాణ బాధ్యతలను చంద్రబాబు దక్కించుకున్నారు. తర్వాత డయాఫ్రమ్ వాల్ పనులను ఎల్ అండ్ టీ–బావర్(జేవీ), జెట్ గ్రౌటింగ్ పనులను కెల్లర్, మట్టి తవ్వకం పనులను త్రివేణి, కాంక్రీట్ పనులను పూట్జ్‌మీస్టర్, పెంటా, గేట్ల పనులను బీకెమ్ సంస్థలకు అప్పగించి, కమీషన్లు వసూలు చేసుకున్నారు. దీన్నేమంటారు బాబూ..? డయాఫ్రమ్ వాల్ పనులు చేస్తున్న సంస్థలకు ఎస్క్రో అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లించేలా 2015 అక్టోబర్ 10న కేబినెట్లో చంద్రబాబు తీర్మానం చేయించారు. ఈ మేరకు ట్రాన్స్ట్రాయ్, సబ్ కాంట్రాక్టర్లు, పోలవరం ఈఎన్సీల పేరు మీద బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎస్క్రో అకౌంట్‌ను గత సర్కార్ తెరిపించింది. బిల్లులు చెల్లించేటప్పుడు ఎస్క్రో అకౌంట్లో జమ చేయాలి. పోలవరం ఈఎన్సీ సూచనల ప్రకారం వాటిని ఆయా సంస్థలకు బ్యాంకు విడుదల చేస్తుంది. ట్రాన్స్‌ట్రాయ్‌కి బిల్లులు వస్తాయని నాటి సీఎం చంద్రబాబు చెప్పడంతో నిబంధనలను పక్కన పెట్టి మరీ ఆ సంస్థకు రూ.300 కోట్ల రుణాన్ని ఇచ్చామని బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు చెబుతున్నారు. దీన్ని బట్టి బ్యాంకులను రాయపాటి దోచేయడంలో బాబు ప్రధాన పాత్ర పోషించారన్నది స్పష్టమవుతోంది. కేబినెట్ తీర్మానం తుంగలోకి.. ఎస్క్రో అకౌంట్ తెరిచిన కొద్ది రోజులకే దివాలా తీసిన ట్రాన్స్ట్రాయ్ 2018 అక్టోబర్ 10న ఎన్సీఎల్టీ(నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)ని ఆశ్రయించింది. ట్రాన్స్‌ట్రాయ్‌కి ఎస్క్రో అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లిస్తే బ్యాంకులు బకాయిల కింద జమ చేసుకుంటాయని, కమీషన్లు రావని పసిగట్టిన గత సర్కారు పెద్దలు నేరుగా ట్రాన్స్ట్రాయ్కే చెల్లింపులు జరపాలని జలవనరుల శాఖ ఉన్నతాధికారిపై ఒత్తిడి తెచ్చారు. ట్రాన్స్‌ట్రాయ్‌కి రూ.2,362.22 కోట్లను చెల్లించగా కేవలం రూ.95 కోట్లను మాత్రమే ఎస్క్రో అకౌంట్ ద్వారా చెల్లించారు. రూ.2,267.22 కోట్లను నేరుగా ట్రాన్స్ట్రాయ్కే చెల్లించడం ద్వారా కేబినెట్ తీర్మానాన్ని ఉల్లంఘించారు. ఇందులో సింహభాగం చంద్రబాబు జేబులోకి చేరినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇది కాదా సహకారం? ►నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, విజయ మాల్యాలను తలదన్నేలా బ్యాంకుల నుంచి రూ.7,926.01 కోట్లను రాయపాటి లూటీ చేయడంలో ప్రధాన సూత్రధారి ఎవరు? దివాళా తీసిన ట్రాన్స్‌ట్రాయ్‌ని పోలవరం కాంట్రాక్టు నుంచి తొలగించకుండా కొనసాగించడం ద్వారా ఈ లూటీకి చంద్రబాబు సహకరించలేదా? ►బ్యాంక్ ఆఫ్ బరోడా 2014లోనే ట్రాన్స్ట్రాయ్ రుణాన్ని నిరర్ధక ఆస్థి (ఎన్పీఏ)గా ప్రకటించినందున నిబంధనల ప్రకారం ఆ సంస్థకు మళ్లీ రుణం ఇవ్వకూడదు. కానీ ట్రాన్స్ట్రాయ్, జలవనరుల శాఖలతో అదే బ్యాంకులో ఎస్క్రో అకౌంట్ తెరిపించిన చంద్రబాబు దాన్ని హామీగా చూపి 2017లో కొత్తగా రూ.300 కోట్ల రుణం ఇప్పించడంలో ఆంతర్యం బ్యాంకులను లూటీ చేయడం కాదా? -
9 కంపెనీలు.. 9 బ్యాంకులు.. రూ.9వేల కోట్లు
సాక్షి, అమరావతి: బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని ఆ నిధులు మళ్లించిన కేసులో టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ సంస్థపై సీబీఐ అధికారులు లోతైన దర్యాప్తు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక రాయపాటికి చెందిన ట్రాన్స్ట్రాయ్ కంపెనీపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఇక విచారణలో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా రూ.7వేల రూపాయల కోట్ల స్కాంకు తెరలేపిన రాయపాటి కంపెనీ.. తన వద్ద పనిచేసే సిబ్బంది పేర్లపై నకిలీ కంపెనీలు ఏర్పాటు చేశాడు. ఇక నిధులు దారి మళ్లించేందుకు ఈ కంపెనీలకు డైరెక్టర్లను సైతం నియమించినట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది. (చదవండి: ‘అదే రాయపాటి సాంబశివరావుకు గౌరవం’) పద్మావతి, బాలాజీ, యూనిక్ ఎంటర్‌ప్రైజర్, రుత్విక్ అసోసియేట్ వంటి నకిలీ కంపెనీల పేరుతో రాయపాటి 7వేల కోట్ల రూపాయల స్కామ్‌కు పాల్పడ్డాడు. 9 నకిలీ కంపెనీలు ఏర్పాటు చేసి కెనరా బ్యాంక్‌తోపాటు మరో 9 బ్యాంక్‌ల నుంచి.. 9వేల కోట్ల రూపాయల రుణాలు పొందినట్లు తెలిసింది. ఈ క్రమంలో ట్రాన్స్ట్రాయ్ కంపెనీ ఎండీ చెరుకూరి శ్రీధర్, సతీష్‌పై సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
మాజీ ఎంపీ రాయపాటి ఇంట్లో సీబీఐ రైడ్
-
కాక రేపుతోన్న కోడెల వ్యతిరేకవర్గం
గుంటూరు: సత్తెనపల్లిలో సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే కోడెల శివప్రసాద రావు వ్యతిరేక వర్గం కాక రేపుతోంది. సత్తెనపల్లి నియోజకవర్గానికి పట్టిన పీడ పోవాలంటూ టీడీపీ కార్యకర్తలు పసుపునీటితో శుద్ధి చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. సత్తెనపల్లి పట్టణంలో టీడీపీ కార్యకర్తలు రోడ్లు ఊడుస్తూ పసుపు నీళ్లు చల్లి కోడెల మాకొద్దంటూ నినాదాలతో హోరెత్తించారు. గోబ్యాక్ కోడెల, కోడెల డౌన్ డౌన్ అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదే సీటు తన కుమారుడికి ఇప్పించుకోవాలని నరసరావుపేట టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న సంగతి తెల్సిందే. అయితే చంద్రబాబు నుంచి సత్తెనపల్లి అసెంబ్లీ, నరసరావుపేట ఎంపీ సీట్లపై ఎలాంటి హామీ రాకపోవడంతో రాయపాటి సాంబశివరావు అగ్గిమీద గుగ్గిలం అవుతోన్నారు. సత్తెనపల్లి అసెంబ్లీ సీటు రాయపాటి సాంబశివరావు అడగటం భావ్యం కాదని ఆయన సీటు ఏదో ఆయన చూసుకోవాలి గానీ తన సీటు అడగటం ఏంటని కోడెల కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. -
టీటీడీ ఛైర్మన్,ఈవోలపై ఎంపీ రాయపాటి ఫైర్
-
రాయపాటికి వివేకం లేకపోతే ఎలా?
జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పోలవరం వద్ద భూములను డంపింగ్ యార్డుగా మార్చారని ధ్వజం సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు వద్ద ఉన్న భూములను రైతుల అనుమతులు లేకుండా డంపింగ్ యార్డుగా ఎలా మారుస్తారని, దీనిపై ఎంపీ రాయపాటి సాంబశివరావుకు వివేకం లేకపోతే ఎలా? అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. రాయపాటికి చెందిన ట్రాన్స్‌స్టాయ్ సంస్థ మూలలంకలోని 207 ఎకరాల మాగాణి భూములను రైతుల అనుమతి లేకుండా డంపింగ్ యార్డుగా మార్చడం ఎంత వరకు న్యాయమో ప్రజా ప్రతినిధులే చెప్పాలని ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అలాగే రాజధానికి భూములు ఇచ్చిన వారిలో కొందరు తాము దళితులు అయినందువల్లే నష్టపరిహారం చెల్లింపుల్లో వివక్షకు గురవుతున్నారని ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల ప్రకారం నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని, దీనిపై ప్రభుత్వం ప్రత్యేక అనుమతి తీసుకుందో లేదో స్పష్టత ఇవ్వడంలేదని పవన్ విమర్శించారు. -
సుష్మాకు నా కిడ్నీ ఇస్తా :టీడీపీ ఎంపీ
విజయవాడ: కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్(64) కు తన కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు(73) ప్రకటించారు. సుష్మా ఆరోగ్య పరిస్ధితిపై విచారం వ్యక్తం చేశారు. ఆమెకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ చేయాలనే డాక్టర్లు సూచన మేరకు తన కిడ్నీని ఇవ్వడానికి సిద్ధమని చెప్పారు. ఈ మేరకు ఎయిమ్స్ కు లేఖ రాశారు. కాగా బుధవారం అనారోగ్యంతో ఎయిమ్స్ లో చేరిన సుష్మా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ గురించి ట్విట్టర్ లో పోస్టు చేసిన విషయం తెలిసిందే. -
టీడీపీ నేతల ఆధ్వర్యంలో అవినీతి, అక్రమాలు
టీడీపీ ఎంపీ రాయపాటి వ్యాఖ్యలు వినుకొండ టౌన్: తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్నడూ లేనంత అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా వినుకొండలో శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాయపాటి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తనపై అక్షింతలు వేస్తున్నారంటూ నవ్వుతూనే.. మరోసారి పార్టీ నేతల అవినీతి, ఆగడాలపై వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల చిట్టా బాబు వద్ద ఉందని, జిల్లాలో దాదాపు అందరూ మైనస్ గ్రేడ్లలోనే ఉన్నారని చెప్పారు. విశాఖపట్నం రైల్వే జోన్ కావటం కష్టమని, అన్ని వసతులున్న గుంటూరుకు జోన్‌గా మార్పు చేయటం సులభమని పలుమార్లు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినా ఆయన ‘గమ్మునుండు..’ అంటున్నాడన్నారు. -
చౌక్బౌన్స్ కేసులో ఎంపీ రాయపాటి మేనకోడలి అరెస్టు
రాజమహేంద్రవరం : చెక్ బౌన్స్ కేసులో గుంటూరు జిల్లా నర్సారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు మేనకోడలు పులపర్తి విజయలక్ష్మిని త్రీటౌన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నగరంలోని షాడే గర్ల్స్ హైస్కూలుకు చెందిన 15 వేల గజాల స్థలాన్ని 49 సంవత్సరాల లీజుకు తీసుకునేందుకుగాను మొదటి లీజుదారైన నక్కా విల్సన్‌తో ఆమె ఒప్పందం చేసుకొని ఇచ్చిన రూ.47 లక్షల చెక్కు బౌన్స్ అవడంతో 2011లో కేసు వేశారు. విచారించిన కోర్టు విజయలక్ష్మిని అరెస్ట్ చెయ్యాలని న్యాయస్థానం ఆదేశించింది. -
సీఎంను కలిసిన రాయపాటి సోదరులు
గుంటూరు (తాడేపల్లి రూరల్): శ్రీరామనవమి సందర్భంగా ఎంపీ రాయపాటి సాంబ శివరావు, ఆయన సోదరుడు శ్రీనివాస్ శుక్రవారం సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఉండవల్లి కరకట్ట మార్గంలో ఉన్న ముఖ్యమంత్రి నివాసానికి వచ్చిన రాయపాటి సోదరులు సీఎంకు కోదండరామస్వామి వారి శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. మాచర్ల పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కోరారు. మాచర్ల వైద్యశాలకు అంబులెన్స్‌ను కేటాయించాలని విన్నవించారు. మాచర్లలోని చెన్నకేశవస్వామి దేవాలయానికి కృష్ణపుష్కర నిధులు కేటాయించి అభివృద్ధి పర్చాలని కోరారు. -
నేను పార్టీలో ఇమడలేకపోతున్నా..
చంద్రబాబు కోప్పడుతున్నారు ఎంపీ రాయపాటి వ్యాఖ్యలు ప్రత్తిపాడు: సీఎం చంద్రబాబు తనను తిడుతున్నారని, తెలుగుదేశం పార్టీలో ఇమడలేకపోతున్నానని నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ సంబరాలకు గురువారం రాత్రి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాయపాటి మాట్లాడుతూ... మాచర్ల, వినుకొండ, గురజాల గ్రామాల్లో నీటి సమస్య పరిష్కరించేందుకు రూ.1120 కోట్లతో వాటర్‌గ్రిడ్ ఏర్పాటుకు పూనుకున్నానని, ఈవిషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళితే నిధులు లేవన్నారని తెలిపారు. కేంద్రంతో మాట్లాడి నిధులు తెచ్చుకునేందుకు అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం మనకు, ఢిల్లీకి అంటీముట్టనట్లుగా ఉందని, అక్కడ నేను గట్టిగా అడిగితే బాబు తిడుతున్నారని (దొబ్బేస్తున్నారని) వాపోయారు. దీంతో అప్పు కోసం బ్యాంకర్లతో మాట్లాడానని, పది నుంచి పదిహేను సంవత్సరాల్లో తీసుకున్న అప్పును 9.6 శాతం వడ్డీతో తిరిగి చెల్లించేందుకు బ్యాంకర్లు ఒప్పుకున్నారని, అయితే చంద్రబాబు 8.5శాతం అయితే ఓకే అంటున్నారని చెప్పారు. గుంటూరు రైల్వేజోన్‌కోసం ఒత్తిడి చేద్దామంటే సీఎం కోప్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్య తాను సీపీఐ వాళ్లకు భోజనాలు పెడితే, ఎందుకు పెట్టావని పార్టీ వాళ్లు ప్రశ్నించారని చెప్పారు. ‘ఇక్కడ నేను ఇమడలేకపోతున్నాను.. రత్తయ్య గారూ ఇన్నాళ్లు మీరెలా ఇమిడి ఉండిపోయారు..’ అని అదే వేదికపై ఉన్న మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్యను ప్రశ్నించారు. చంద్రబాబు తనను తీసుకెళ్లి అడవుల్లో పడేశారని ఆవేదన వ్యక్తంచేశారు. అయితే తన వ్యాఖ్యలన్నీ ‘ఆఫ్ ది రికార్డ్’ అని, రాయవద్దని బహిరంగసభ చివర్లో రాయపాటి చెప్పడం గమనార్హం. -
కాలం వెంట వెళ్లను...కాలం నా వెంటే రావాలి!
- బాలకృష్ణ ‘‘బిడ్డను అనాథను చేసినట్లుగా రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టారు. ఎంతో చరిత్ర ఉన్న అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఎంపిక చేయడం ఆనందం. బుద్ధుడు నడయాడిన భూమి ఇది. మా నాన్నగారు నందమూరి తారక రామారావుగారు రాజకీయ చరిత్రను తిరగ రాశారు. తెలుగు జాతికి గర్వకారణం అమరావతి’’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈరోస్ ఎంటర్ టైన్మెంట్స్తో కలసి వేదాశ్వ క్రియేషన్స్ పతాకంపై తొలిసారి శ్రీవాస్ నిర్మాతగా మారి, దర్శకత్వం వహించిన చిత్రం ‘డిక్టేటర్’. బాలకృష్ణ, అంజలి, సోనాల్ చౌహాన్ నాయకానాయికలుగా నటించిన ఈ చిత్రానికి తమన్ పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం పాటల వేడుక ఆదివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగింది. ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆడియో సీడిని ఆవిష్కరించి, బాలకృష్ణకు ఇచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ - ‘‘నేనెప్పుడూ కాలం వెంట వెళ్లను. కాలం నా వెంట రావాల్సిందే. నా స్వభావానికి తగ్గ టైటిల్ ‘డిక్టేటర్’. ఒక్కోసారి మంచి మార్పు తీసుకు రావాలంటే జులుం తప్పదు. ఈ చిత్రకథాంశం ఇదే. శ్రీవాస్ నాలానే ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. తమన్ మంచి పాటలిచ్చారు’’ అంటూ ‘సింహం కూడా దాహం వేస్తే తలదించుకుని నీళ్లు తాగుతుంది. అంత మాత్రాన తలదించినట్లు కాదు. కొట్టడానికి తొడా ఉండదు... ఎత్తడానికి తలా ఉండదు’ అని సినిమాలోని డైలాగ్ చెప్పారు. ఇది ఓ అభిమాని పంపించిన డైలాగ్ అని బాలకృష్ణ చెప్పారు. ఏమీ ఆశించికుండా అభిమానులు ఆదరిస్తున్న తీరు చాలా ఆనందంగా ఉందనీ, నాడు తన తండ్రి పార్టీ పెట్టినప్పుడు అభిమానులే అండగా నిలిచారనీ బాలకృష్ణ అన్నారు. ఇప్పుడు ప్రభుత్వానికీ, పార్టీకి అభిమానులు అండగా నిలుస్తున్నారనీ, వాళ్లకు ఇప్పటికే కావాల్సినవి చేశాననీ, మున్ముందు ఇంకా చేస్తానని ఆయన అన్నారు. నాన్నగారి అభిమానులే కాకుండా భవిష్యతులో పార్టీ పరంగా నా అభిమానులు కూడా ముందుంటారని ఆశిస్తున్నానని బాలకృష్ణ అన్నారు. పదవులు ఎప్పుడూ మనకు అలంకారం కాకూడదనీ, మనమే పదవులకు అలంకారం కావాలని కూడా అన్నారు. శ్రీవాస్ మాట్లాడుతూ - ‘‘98 చిత్రాల్లో ఎన్నో పాత్రలు చేసిన బాలయ్యగారిని 99వ చిత్రంలో ఎలాంటి పాత్రలో చూపిస్తే బాగుంటుందా? అని రచయితలు గోపీ-కోనవెంకట్ , శ్రీధర్ సీపాన, ఎమ్.రత్నంలతో కలిసి బాగా డిస్కస్ చేసి, ఈ కథ తయారు చేశాం. బాలయ్యగారిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అని చాలామంది చెప్పారు. ఆయనకు నిజాయతీగా ఉంటే నచ్చుతుంది. ఆయనతో నేను సినిమా చేయాలన్న మా నాన్నగారి కోరిక నెరవేరినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. తమన్ మట్లాడుతూ- ‘‘నేను బాలయ్యగారి ‘భైరవద్వీపం’ సినిమాలోని ఓ సన్నివేశానికి ఆర్ఆర్ ఇచ్చాను. అందుకుగాను నేను తీసుకున్న జీతం 30 రూపాయలు. నా తొలి సంపాదన ఆయన సినిమాతోనే స్టార్ట్ అయింది’’ అని చెప్పారు. నిర్మాతలు అంబికా కృష్ణ, సాయి కొర్రపాటి, అనిల్ సుంకర, రామ్ ఆచంట, కథానాయికలు అంజలి, సోనాల్ చౌహాన్, ఈరోస్ వైస్ ప్రెసిడెంట్ చింటు, గుంటూరు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే బాబూరావు, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెళ్ల కిషోర్‌బాబు తదితర రాజకీయ రంగ, చిత్రరంగ ప్రముఖులు పాల్గొన్నారు. -
ప్రజా భాగస్వామ్యంతోనే అభివృద్ధి
గవర్నర్ నరసింహన్ వ్యాఖ్య ముగిసిన నరసరావుపేట పురపాలక శతాబ్ది ఉత్సవాలు నరసరావుపేట వెస్ట్: ప్రభుత్వ పథకాల్లో ప్రజలు భాగస్వామ్యం అయినప్పుడే అవి విజయవంతం అవుతాయని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చెప్పారు. ఆదివారం శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరిగిన నరసరావుపేట పురపాలక శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ప్రభుత్వం కేవలం పథకాలను మాత్రమే రూపొందిస్తుందని, అవి సక్రమంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులతోపాటు ప్రజలపై ఉందన్నారు. స్వచ్ఛభారత్‌ను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. బిడ్డల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు వారిని బడికి పంపాలన్నారు. మరుగుదొడ్లు లేక పిల్లలు బడి మానేసే పరిస్థితులను చూస్తున్నామన్నా రు.ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు ఏడాదిలోగా జిల్లాలోని ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించాలని ఆయన ఆదేశించారు. ఆరోగ్యం, విద్య, పర్యావరణం బాగుండాలని తెలిపారు. ఈ ప్రాంతానికి రాజధాని దగ్గరలోనే ఉందని, దాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందజేయాలన్నారు. నా పేరులోనే సగం నరసరావుపేట ఉంది..! తన పేరు నరసింహన్ అని, ఆ పేరులోనే సగం నరసరావుపేట ఉందని గవర్నర్ ఛలోక్తి విసిరారు. ఈ సంద ర్భంగా ఆయన రూ.41 కోట్ల రుణాల చెక్కును స్వయం సహాయ గ్రూపులకు అందజేశారు. గవర్నర్‌ను స్పీకర్ కోడెల, ఎంపీ రాయపాటి సాంబశివరావు, డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ఘనంగా సత్కరించారు. -
ఆర్థిక అసమానతలు మంచిది కాదు
నరసరావుపేట శతాబ్ది ఉత్సవాల్లో కేంద్రమంత్రి వెంకయ్య నరసరావుపేట వెస్ట్: దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలు దేశ భవిష్యత్తుకు మంచిది కాదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. కొందరు నేతలు కులం, మతం పేరుతో దేశాన్ని చీల్చేందుకు యత్నిస్తున్నారని, వారి ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పురపాలక శతాబ్ది ఉత్సవాల రెండోరోజు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. కొన్ని పార్టీలు తాత్కాలిక ప్రయోజనాల కోసం పాకులాడుతూ మతాల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు యత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. వారు మైనార్టీల కోసం నిజంగా శ్రమించి ఉంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా మైనార్టీలు ఇంకా పేదవారిగానే ఎందుకున్నారని ప్రశ్నించారు. పట్టణాలతో పాటు గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఏపీకి జాతీయ రహదారుల కింద రూ.65 వేల కోట్ల నిధులు మంజూరు చేయనున్నామని తెలిపారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల, మంత్రి కామినేని , ఎంపీ రాయపాటి ప్రసంగించారు. శాసనమండలి చైర్మన్ చక్రపాణి, చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
అంచనా పెంచింది.. వంచనకే..!
♦ పోలవరంలో ముడుపులు, కమీషన్ల వ్యవహారం ♦ సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడానికి రంగం సిద్ధం సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు పనుల్లో కాసులు దండుకొనే చర్యలను ప్రభుత్వం ప్రారంభించింది. అందుకు అనుగుణంగానే అంచనా వ్యయాన్ని భారీగా పెంచి, పనులను సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించడానికి రంగం సిద్ధం చేసింది. కమీషన్లు, ముడుపులనూ పరిగణనలోకి తీసుకొనే అంచనా వ్యయాన్ని పెంచుతున్నారని నీటిపారుదల శాఖలో ప్రచారం జరుగుతోంది. ప్రాజెక్టు పనుల్లో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ వ్యయం సుమారు రూ.200 కోట్లను మూడు రెట్లకు పైగా పెంచి రూ.603 కోట్లు చేయాలని ప్రతిపాదించింది. ఒక్కో పనిని ఒక్కో కంపెనీకి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం పేరిట అంచనా వ్యయాన్ని పెంచి సబ్ కాంట్రాక్ట్ కింద అప్పగించే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ట్రాన్స్ట్రాయ్పై చర్యలేవీ? ఎర్త్‌కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కింద 110 మీటర్ల కాంక్రీట్ గోడను నిర్మించనున్నారు. భారీ యంత్రాలను ఉపయోగించి తవ్వకాలు లేకుండానే కాంక్రీట్ వాల్ నిర్మించడానికి అవకాశం ఉంటుంది. భారీ యంత్రం సహాయంతో గోడ పరిమాణం మేర మట్టిని వెలికి తీసి, ఆ గ్యాప్‌లో కాంక్రీట్ వేస్తారు. దీన్ని డయాఫ్రమ్ వాల్ విధానం అంటారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉందని నిరూపించుకున్న తర్వాతే ట్రాన్స్‌ట్రాయ్‌కి పోలవరం కాంట్రాక్టు అప్పగించారు. తీరా.. పనుల దగ్గరకు వచ్చే సరికి ఆ కంపెనీ చేతులెత్తేసింది. పనులు చేయలేకపోతే కాంట్రాక్టు సంస్థ మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. కానీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి బదులు.. కాంట్రాక్టర్‌ను రక్షించే ప్రయత్నం చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం భారీగా పెంచిన నేపథ్యంలో.. నేరుగా టెండర్లు పిలిచి సామర్థ్యం ఉన్న కంపెనీకే పనులు అప్పగించాలని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు సూచించారు. టెండర్లు పిలవాలంటే.. ప్రస్తుత కాంట్రాక్టర్, టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ మీద చర్యలు తీసుకోవాలి. కానీ అందుకు భిన్నంగా.. సొంతపార్టీ ఎంపీని రక్షించి, సబ్ కాంట్రాక్టు పేరిట కమిషన్లు దండుకోవడానికే ప్రభుత్వ పెద్దలు మొగ్గుచూపడం గమనార్హం. -
పెంచేద్దాం.. పంచేద్దాం
♦ పోలవరంతో దండుకోవడానికి బాబు ప్రభుత్వం కొత్త ప్లాన్ ♦ నిపుణుల కమిటీ పేరుతో కొత్త నాటకానికి రంగం సిద్ధం ♦ కాంట్రాక్టర్‌ను కాపాడుకుంటూ, సబ్ కాంట్రాక్టర్లను తెరపైకి తెచ్చే యత్నం.. అందుకు అనుగుణంగా ప్రాజెక్టు అంచనా వ్యయం పెంపునకు ప్రయత్నం ♦ ప్రభుత్వ తీరును తప్పు పట్టిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ♦ కేంద్ర ప్రతినిధి అయిన పీపీఏను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వరప్రదాయిని అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో అంతులేని నిర్లక్ష్యాన్ని చూపుతూ వస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మాణంతో కాసుల పంట పండించుకోవడానికి రంగం సిద్ధం చేసింది. ఒకవైపు తనవాడైన కాంట్రాక్టర్‌ను కాపాడుకుంటూనే.. మరోవైపు అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి, సబ్ కాంట్రాక్టర్ల పేరుతో తమ వారైన మరింత మందికి లబ్ధి చేకూరుస్తూ.. ప్రజాధనంతో, ప్రజాప్రయోజనాలతో కొత్త ఆటకు సిద్ధమైంది. అంతిమంగా పోలవరం కాంట్రాక్టులు చేపట్టిన తమ వారి జేబులు నింపే ప్రయత్నానికి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ‘నిపుణుల కమిటీ’ ప్రతిపాదనలను తెరపైకి తెస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేసిన పీపీఏ: పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని, ఏడాదిన్నరగా పనులు నత్తనడకన నడుస్తున్నా ప్రభుత్వం కాంట్రాక్టరును ప్రశ్నించకపోవడాన్ని ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ఇప్పటికే తేటతెల్లం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి కూడా తీసుకెళ్లింది. ప్రభుత్వ నిర్లక్ష్యం, అనాసక్తి, మరోవైపు సొంత ప్రయోజనాల కోసం సత్తాలేని కాంట్రాక్టర్(టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు)కు వత్తాసు పలకడం, ఇంకోవైపు జాతీయహోదా దక్కినా ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించకుం డా కాసుల పంట పండించుకోవడానికి ప్రభు త్వ పెద్దలు చేస్తున్న ప్రయత్నం... వీటన్నింటినీ అథారిటీ ఎండగట్టింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం సెప్టెంబర్ 30న నిపుణుల కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి కాసుల వేటకు కొత్త వ్యూహాన్ని రచించింది. అవినీతికి బాసటగా నిపుణుల కమిటీ... ప్రాజెక్టు పనులు సకాలంలో చేయించడానికి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం.. ఏడాదిన్నర కాలంగా చూసీచూడనట్లుగా ఉండటానికి కారణాలను నిపుణుల కమిటీ చెప్పలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని పీపీఏ స్పష్టంగా చెప్పిన విషయాన్ని కూడా కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. జాతీయ హోదా దక్కిన ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలంటే.. కేంద్రం ఏర్పాటు చేసిన పీపీఏకు సహకరించకపోతే ఎలా సాధ్యమనే విషయాన్నీ కమిటీ పట్టించుకోలేదు. సమావేశం మినిట్స్‌లో.. కాంట్రాక్టర్ తగిన స్థాయిలో యంత్రాలను మోహరించలేదని కమిటీ స్పష్టంగా చెప్పింది. పనులు చేయడానికి ట్రాన్స్‌ట్రాయ్‌కి సామర్థ్యం లేదని నిపుణుల కమిటీ కూడా తేల్చింది. కానీ అదనపు చెల్లింపుల అంశంలో ‘మిషనరీ, మెటీరియల్స్’ ను పరిగణనలోకి తీసుకొని చెల్లించాలని కమి టీ సూచించడం గమనార్హం. ఈ అంశం ఒప్పం దంలో కూడా లేదు! మిషనరీ ఖాళీగా ఉంచి నందుకు పరిహారం ఇవ్వాలట! 2015-16 ధరలు(స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్) ప్రకారం అదనపు చెల్లింపులు నిర్ణయించాలని సూచించింది. ఇప్పటి వరకూ చేసింది శూన్యం... పోలవరం ప్రాజెక్టులో భాగమైన రూ. 4,054 కోట్ల విలువైన పనులను ప్రస్తుత టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి 2013 మార్చిలో అప్పగించారు. పనులు పూర్తి చేయడానికి ఐదేళ్ల గడువు ఇచ్చారు. ఇచ్చిన గడువులో సగానికిపైగా కాలం గడిచినా ఇప్పటి వరకూ 5.52 శాతం పనులే చేశారు. రంగంలోకి సబ్ కాంట్రాక్టర్లు... ఇప్పటి వరకూ పనులు చేపట్టని కాంట్రాక్టర్‌ను ప్రభుత్వం కానీ, నిపుణుల కమిటీ కానీ ప్రశ్నించలేదు. అన్ని సమస్యలకూ విరుగుడు అన్నట్టుగా అంచనా వ్యయాన్ని పెంచేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. సబ్ కాంట్రాక్టర్లను రంగంలోకి దించి దాన్ని వారికి పంచడానికి వ్యూహం రచించారు. సబ్ కాంట్రాక్టర్లు వచ్చినా అసలు కాంట్రాక్టర్ అలాగే ఉంటారు. పనులు చేయడం చేతకావడం లేదని స్వయం గా కమిటీనే తేల్చినా ఆ కాంట్రాక్టర్‌కు దక్కాల్సినవన్నీ దక్కుతాయి. సబ్ కాం ట్రాక్టర్లు కూడా ట్రాన్స్ట్రాయ్ కిందే పని చేస్తూ.. అంతా కలిసి అవినీతి మొత్తాన్ని పంచుకుంటారు. అందుకు అనుగుణంగా సబ్ కాంట్రాక్టర్లను నియమించే బాధ్యత కూడా ట్రాన్స్ట్రాయ్కే అప్పగించే అవకాశాలున్నాయి. పీపీఏ జోక్యం లేకుండా దొంగదారులు పనులు చేయడంలో నిర్లక్ష్యం చూపిన ట్రాన్స్ట్రాయ్ మీద చర్యలు తీసుకోవాలనే యోచన ప్రభుత్వానికి లేకపోవడంతో.. నిపుణుల కమి టీ కూడా అందుకు అనుగుణంగానే వ్యవహరించింది. పనులను సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించడానికి రెండు మార్గాలున్నాయని పేర్కొం ది. మొత్తం పనిని సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించడం (బ్యాక్ టు బ్యాక్) ఒక మార్గంగా సూచించింది. అయితే ‘పేమెంట్స్’ విషయం లో ఇబ్బందులు తలెత్తవచ్చని చెప్పింది. సబ్ కాంట్రాక్టర్లను తెచ్చుకొనే అవకాశం ట్రాన్స్ట్రాయ్కే ఇచ్చి, ఆ సబ్ కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసే విధానం పరిశీలించదగిందేనని కమిటీ సూచించింది. అంటే.. తనకు కావాల్సిన కాం ట్రాక్టర్లను తెచ్చుకొని సొమ్ము నొక్కేయాలనే యోచనను నిపుణుల కమిటీతో చెప్పించడం ద్వారా ప్రభుత్వ పెద్దలు శంకువులో పోసి తీర్థం చేసేలా వ్యవహరిస్తున్నారని నీటిపారుదల శాఖ ఇంజనీర్లే వ్యాఖ్యానిస్తున్నారు. -
జల్సాల ట్రాన్స్ట్రాయ్
14 బ్యాంకుల్లో రూ.4,300 కోట్ల రుణం అప్పు చెల్లించకుండా విలాసాలు హైదరాబాద్: అధికారపార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన కంపెనీ అది. పేరు ట్రాన్స్ట్రాయ్. పోలవరం కాంట్రాక్టు దక్కించుకున్న ఈ కంపెనీ తాజాగా బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుని ఎగవేస్తున్న కంపెనీల జాబితాలో చేరింది. 14 బ్యాంకుల నుంచి రూ.4,300 కోట్ల రుణం తీసుకున్న ఈ కంపెనీ.. తిరిగి చెల్లిం చకుండా చేతులెత్తేసింది.ఈ పరిస్థితుల్లోనూ ఆ సంస్థ రూ.5 కోట్ల వ్యయంతో 4 లగ్జరీ కార్లు కొనుగోలు చేసింది. బ్యాంకుల్ని ముంచి విలాసాలకు ఖర్చుపెట్టడం కార్పొరేట్ ప్రపంచంలోనూ చర్చనీయాంశమైంది. లగ్జరీ కారుకోసం దేనా బ్యాంకులో రుణం తీసుకుని సరిగా ఈఎంఐ చెల్లించకపోవడంతో ఆ బ్యాంకు ట్రాన్స్ట్రాయ్ వ్యవహారాన్ని బయటపెట్టింది. దీంతో మిగతా బ్యాంకులు ఉలిక్కిపడ్డాయి. మొత్తం 14 బ్యాంకులనుంచి రూ.4,300 కోట్ల రుణం తీసుకున్నట్లు తేల్చాయి. అన్ని బ్యాంకుల్లో ట్రాన్స్ట్రాయ్ ఖాతాలను ఎన్పీఏ (మొండిబకాయిలు-నాన్ పెర్ఫామింగ్ అసెట్స్)గా ప్రకటించాయి. ఇకమీదట ట్రాన్స్ట్రాయ్కు రుణాలివ్వరాదని నిర్ణయించాయి. లగ్జరీ కార్ల కొనుగోలుతో కదిలిన డొంక లంబొర్గిని హరకన్ కూప్, మెర్సిడెస్ బెంజ్ ఎస్350, బీఎండబ్ల్యూ జెడ్4 ఎస్డ్రైవ్.. కార్ల కొనుగోలుకు బీఎండబ్ల్యూ గ్రూప్ ఆర్థిక సేవల విభాగం ‘అల్ఫెరా ఫైనాన్షియల్ సర్వీసెస్’తో ఈ ఏడాది జనవరి చివరివారంలో ట్రాన్స్ట్రాయ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో మూడు కార్లకు దేనా బ్యాంకు నుంచి రుణం పొందారు. కార్లు కొనుగోలు చేసిన మూడు నెలల తర్వాత ఈఎంఐ చెల్లించడం మానేశారు. దీంతో దేనా బ్యాంకు ట్రాన్స్ట్రాయ్ ఖాతాను ఎన్పీఏగా ప్రకటించింది. దీంతో మిగతా బ్యాంకు లు మేల్కొన్నాయి. ఒక బ్యాంకుకు తెలియకుండా మరో బ్యాంకు నుంచి.. ఇలా మొత్తం 14 బ్యాంకుల నుంచి భారీగా రుణాలు పొందిన విషయాన్ని గుర్తించాయి. సాధారణంగా ఇలా బ్యాంకుల్ని మోసగించకుండా నిరోధించడానికి వీలుగా అన్ని బ్యాంకులు కలసి ‘కన్సార్షియం’గా ఏర్పడి భారీ కంపెనీలకు రుణాలిస్తుంటాయి. కానీ ట్రాన్స్ట్రాయ్ విషయంలో ఇందుకు భిన్నంగా రుణాలివ్వడం గమనార్హం. ఈసురోమంటున్న పోలవరం పనులు రూ.4 వేల కోట్ల విలువైన పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకున్నా వేగంగా పనులు చేసిన చరిత్ర ట్రాన్స్‌ట్రాయ్‌కి లేదు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. నిబంధనలకు విరుద్ధంగా రూ.250 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకుంది. ప్రభుత్వమిచ్చిన అడ్వాన్స్కుగాను కంపెనీకి చెందిన యంత్రాలు, వాహనాల పత్రాలను అప్పగించాలని(మార్ట్గేజ్) సర్కారు సూచించింది. అయితే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న యంత్రాలు, వాహనాల పత్రాలన్నింటినీ బ్యాంకులకే మార్ట్గేజ్ చేశారు. పోనీ.. తీసుకున్న అడ్వాన్స్ మేరకైనా పనులు చేసిందా? అంటే అదీ లేదు. ఏడాదిగా కనీసం రూ.100 కోట్ల విలువైన పనులూ చేయలేక చతికిలపడింది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కిన నేపథ్యంలో.. మొత్తం నిర్మాణ వ్యయాన్ని కేంద్రప్రభుత్వమే భరిస్తుంది. ఈ సదవకాశాన్నీ వినియోగించుకోకుండా సొంత పార్టీకి చెందిన కాంట్రాక్టర్‌ను కాపాడటానికే ఏపీ సీఎం చంద్రబాబు ప్రాధాన్యమిచ్చారు. తీరాచూస్తే.. సదరు కాంట్రాక్టర్ బ్యాంకులనుంచి భారీగా రుణం తీసుకొని ఎగనామం పెట్టారు. ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ ఒకవైపు ప్రభుత్వ పెద్దలు ఊదరగొడుతూనే, మరోవైపు బ్యాంకులకు భారీగా రుణాలు ఎగవేసిన కాంట్రాక్టర్‌ను కాపాడటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కాగా పోల వరం పనులు జరుగుతున్న ప్రాంతంలో పనిచేస్తున్న వాహనాలు నిర్వహణ లేక మూలన పడుతున్నాయి. సిబ్బందికి కొన్ని నెలలుగా జీతాలివ్వడం లేదు. మరోవైపు బ్యాంకు రుణాలను యాజమాన్యం లగ్జరీ కార్లకు, విలాసాలకు ఖర్చు పెట్టడంపై సంస్థ సిబ్బందిలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది.