సుష్మాకు నా కిడ్నీ ఇస్తా :టీడీపీ ఎంపీ | Telugu Desam MP Rayapati Sambasiva Rao offers kidney to ailing Sushma Swaraj | Sakshi
Sakshi News home page

సుష్మాకు నా కిడ్నీ ఇస్తా :టీడీపీ ఎంపీ

Published Fri, Nov 18 2016 9:15 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

సుష్మాకు నా కిడ్నీ ఇస్తా :టీడీపీ ఎంపీ - Sakshi

సుష్మాకు నా కిడ్నీ ఇస్తా :టీడీపీ ఎంపీ

విజయవాడ: కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్(64) కు తన కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు(73) ప్రకటించారు. సుష్మా ఆరోగ్య పరిస్ధితిపై విచారం వ్యక్తం చేశారు. ఆమెకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ చేయాలనే డాక్టర్లు సూచన మేరకు తన కిడ్నీని ఇవ్వడానికి సిద్ధమని చెప్పారు.
 
ఈ మేరకు ఎయిమ్స్ కు లేఖ రాశారు. కాగా బుధవారం అనారోగ్యంతో ఎయిమ్స్ లో చేరిన సుష్మా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ గురించి ట్విట్టర్ లో పోస్టు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement