టీడీపీ నేతల ఆధ్వర్యంలో అవినీతి, అక్రమాలు | TDP leaders, under the corruption and irregularities | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల ఆధ్వర్యంలో అవినీతి, అక్రమాలు

Published Mon, Oct 10 2016 2:12 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

టీడీపీ నేతల ఆధ్వర్యంలో అవినీతి, అక్రమాలు - Sakshi

టీడీపీ నేతల ఆధ్వర్యంలో అవినీతి, అక్రమాలు

టీడీపీ ఎంపీ రాయపాటి  వ్యాఖ్యలు

 వినుకొండ టౌన్: తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్నడూ లేనంత అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు  వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా వినుకొండలో శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాయపాటి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తనపై అక్షింతలు వేస్తున్నారంటూ నవ్వుతూనే.. మరోసారి పార్టీ నేతల అవినీతి, ఆగడాలపై వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల చిట్టా బాబు వద్ద ఉందని, జిల్లాలో దాదాపు అందరూ మైనస్ గ్రేడ్‌లలోనే ఉన్నారని చెప్పారు. విశాఖపట్నం రైల్వే జోన్ కావటం కష్టమని, అన్ని వసతులున్న గుంటూరుకు జోన్‌గా మార్పు చేయటం సులభమని పలుమార్లు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినా ఆయన ‘గమ్మునుండు..’ అంటున్నాడన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement