రాయపాటికి వివేకం లేకపోతే ఎలా? | Pawan Kalyan comments on MP rayapati | Sakshi
Sakshi News home page

రాయపాటికి వివేకం లేకపోతే ఎలా?

Published Mon, Jan 23 2017 2:04 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

రాయపాటికి వివేకం లేకపోతే ఎలా? - Sakshi

రాయపాటికి వివేకం లేకపోతే ఎలా?

  • జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌
  • పోలవరం వద్ద భూములను డంపింగ్‌ యార్డుగా మార్చారని ధ్వజం
  • సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు వద్ద ఉన్న భూములను రైతుల అనుమతులు లేకుండా డంపింగ్‌ యార్డుగా ఎలా మారుస్తారని, దీనిపై ఎంపీ రాయపాటి సాంబశివరావుకు వివేకం లేకపోతే ఎలా? అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. రాయపాటికి చెందిన ట్రాన్స్‌స్టాయ్‌ సంస్థ మూలలంకలోని 207 ఎకరాల మాగాణి భూములను రైతుల అనుమతి లేకుండా డంపింగ్‌ యార్డుగా మార్చడం ఎంత వరకు న్యాయమో ప్రజా ప్రతినిధులే చెప్పాలని ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

    అలాగే రాజధానికి భూములు ఇచ్చిన వారిలో కొందరు తాము దళితులు అయినందువల్లే నష్టపరిహారం చెల్లింపుల్లో వివక్షకు గురవుతున్నారని ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నిబంధనల ప్రకారం నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని, దీనిపై ప్రభుత్వం ప్రత్యేక అనుమతి తీసుకుందో లేదో స్పష్టత ఇవ్వడంలేదని పవన్‌ విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement