
సాక్షి, విజయవాడ: జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును జనసేన ప్రకటించింది. ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నాగబాబు పేరును జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఖరారు చేశారు.
ఏపీలో శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా నాగబాబు పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ ఖరారు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు జనసేన ట్విట్టర్ వేదికగా వివరాలను వెల్లడించారు.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ @NagaBabuOffl గారి పేరు ఖరారు
శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా శ్రీ కొణిదెల నాగబాబు గారి పేరును పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఖరారు చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీ నాగబాబు గారు… pic.twitter.com/B4yBXjG96X— JanaSena Party (@JanaSenaParty) March 5, 2025
Comments
Please login to add a commentAdd a comment