నేడు తిరుమలలో శ్రీరామనవమి ఆస్థానం
సాక్షి,తిరుమల: శ్రీరామనవమిని పురస్కరించుకుని శనివారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఆలయంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు మలయప్పస్వామి శ్రీరామచంద్రుని రూపంలో హనుమంత వాహనంపై ఊరేగుతూ దర్శనమిస్తారు. తర్వాత ఆలయంలో ప్రత్యేకంగా ఆస్థానం నిర్వహిస్తారు. అలాగే ఆదివారం రాత్రి 8 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శనివారం వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ, 29న వసంతోత్సవం మాత్రం రద్దు చేశారు.
2 నుంచి శ్రీవారి వసంతోత్సవాలు
తిరుమలలో ఏప్రిల్ 2 నుంచి శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు ఆరంభం కానున్నాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, పూజలు నిర్వహించనున్నారు.
4న ఆలయం మూత
ఏప్రిల్ నాలుగో తేదీ శనివారం మధ్యాహ్నం 3.45 గంటల నుండి రాత్రి 7.15 గంటల వరకుచంద్రగ్రహణం సందర్భంగా ఆరోజు ఉదయం 9.30 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు తిరుమల ఆలయం మూసివేస్తారు.