![శ్రీవారి దర్శనానికి 8 గంటలు](/styles/webp/s3/article_images/2017/09/3/61460751828_625x300.jpg.webp?itok=DZIwl614)
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శుక్రవారం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు 46,635 మంది భక్తులు దర్శించుకున్నారు. 19 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న సర్వదర్శనం భక్తులకు 8 గంటలు, 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న కాలిబాట భక్తులకు 3 గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది. గదులు ఖాళీ లేవు. హుండీ కానుకలు రూ.2.36 కోట్లు లభించాయి.