the rush of devotees
-
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట, కాలినడకన కొండపైకి వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. బుధవారం స్వామివారిని 68,610 మంది దర్శించుకోగా శ్రీవారి హుండీకి రూ. 2.30 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శుక్రవారం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు 46,635 మంది భక్తులు దర్శించుకున్నారు. 19 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న సర్వదర్శనం భక్తులకు 8 గంటలు, 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న కాలిబాట భక్తులకు 3 గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది. గదులు ఖాళీ లేవు. హుండీ కానుకలు రూ.2.36 కోట్లు లభించాయి. -
తిరుమల సమాచారం
తిరుమల: తిరుమలలో శుక్రవారం సాయంత్రం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100ల గదులు లభిస్తున్నాయి. రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 8 కంపార్టుమెంట్లు నిండాయి. సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం : గదుల వివరాలు: ఉచిత గదులు - 5 ఖాళీగా ఉన్నాయి రూ.50 గదులు - 10 ఖాళీగా ఉన్నాయి రూ.100 గదులు - 2 ఖాళీగా ఉన్నాయి రూ.500 గదులు - ఖాళీ లేవు ఆర్జిత సేవల వివరాలు ఆర్జిత బ్రహ్మోత్సవం - ఖాళీ లేవు సహస్ర దీపాలంకరణ - 90 ఖాళీగా ఉన్నాయి వసంతోత్సవం - ఖాళీ లేవు -
తిరుమల సమాచారం
తిరుమల: తిరుమలలో బుధవారం సాయంత్రం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50 గదులు లభిస్తున్నాయి. రూ.100, రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 4 కంపార్టుమెంట్లు నిండాయి. సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం : గదుల వివరాలు: ఉచిత గదులు - 10 ఖాళీగా ఉన్నాయి రూ.50 గదులు - 100 ఖాళీగా ఉన్నాయి రూ.100 గదులు - ఖాళీ లేవు రూ.500 గదులు - ఖాళీ లేవు ఆర్జిత సేవల వివరాలు ఆర్జిత బ్రహ్మోత్సవం - ఖాళీ లేవు సహస్ర దీపాలంకరణ - 120 ఖాళీగా ఉన్నాయి వసంతోత్సవం - ఖాళీ లేవు గురువారం ప్రత్యేక సేవ - తిరుప్పావడ -
తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమల సమాచారం తిరుమల: తిరుమలలో మంగళవారం రాత్రి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గదులు ఏవీ ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 24 కంపార్టుమెంట్లు నిండాయి. సాయంత్రం 10 గంటలకు అందిన సమాచారం : గదుల వివరాలు:ఉచిత గదులు - ఖాళీ లేవు రూ.50 గదులు - ఖాళీ లేవు రూ.100 గదులు - ఖాళీ లేవు రూ.500 గదులు - ఖాళీ లేవు ఆర్జిత సేవల టికెట్ల వివరాలు : బుధవారం ప్రత్యేక సేవ - సహస్ర కలశాభిషేకం -
శ్రీవారి దర్శనానికి 6 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం 6గంటల వరకు 35,879 మంది స్వామిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లలో ఉన్న సర్వదర్శన భక్తులకు 6గంట లు, 2 కంపార్ట్మెంట్లలోని కాలిబాట భక్తులు రెండు గంటల సమయం పట్టింది. గదులు సులభంగానే లభించాయి. హుండీ కానుకల నుంచి రూ.1.82 కోట్లు లభించాయి.ట -
తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. శని, ఆదివారాలతోపాటు గోదావరి పుష్కరాల నేపథ్యంలో మంగళవారం వరకు నాలుగు రోజుల పాటు సెలవులు వచ్చాయి. దీంతో భక్తులు పుష్కరాలతోపాటు తిరుమల బాట పట్టారు. శనివారం సాయంత్రం 6 గంటల వరకు 60 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. వెలుపల రెండు కిలోమీటర్ల వరకు భక్తులు క్యూ కట్టారు. వీరికి 20 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించనుంది. కాలిబాటల్లో నడచి వచ్చిన భక్తులు నారాయణగిరి ఉద్యానవనంలోని క్యూల్లో బారులు తీరారు. -
తిరుమల సమాచారం
తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50ల గదులు లభిస్తున్నాయి. రూ.100, రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 8 కంపార్టుమెంట్లు నిండాయి. సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం : ఉచిత గదులు - 10, రూ.50 గదులు - 20 ఖాళీగా ఉన్నాయి, రూ.100 గదులు, రూ.500 గదులు- ఖాళీ లేవు ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం : ఖాళీ లేవు, సహస్ర దీపాలంకరణ సేవ : 150, వసంతోత్సవం : 100 ఖాళీగా ఉన్నాయి మంగళవారం ప్రత్యేక సేవ : అష్టదళ పాదపద్మారాధన -
తిరుమలలో ఓ మోస్తరుగా భక్తుల రద్దీ
తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 11 కంపార్టుమెంట్లు నిండాయి. రాత్రి 7 గంటలకు అందిన సమాచారం: గదుల వివరాలు: ఉచిత గదులు - 43 రూ.50 గదులు - 19, రూ.100 గదులు - 140, రూ.500 గదులు - 9 ఖాళీగా ఉన్నాయి ఆర్జిత సేవల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం - 110 ఖాళీగా ఉన్నాయి సహస్రదీపాలంకరణ సేవ - 234 ఖాళీగా ఉన్నాయి వసంతోత్సవం - 106 ఖాళీగా ఉన్నాయి -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 3 కంపార్టుమెంట్లు నిండాయి. రాత్రి 7 గంటలకు అందిన సమాచారం: గదుల వివరాలు: ఉచిత గదులు - 157, రూ.50 గదులు - 37, రూ.100 గదులు - 112, రూ.500 గదులు- 15 ఖాళీగా ఉన్నాయి ఆర్జిత సేవల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం - 110 సహస్రదీపాలంకరణ సేవ - 220 వసంతోత్సవం - 186 ఖాళీగా ఉన్నాయి శుక్రవారం ప్రత్యేక సేవ - పూరాభిషేకం -
తిరుమల సమాచారం
తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100 గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 26 కంపార్టుమెంట్లు నిండాయి. రాత్రి 7 గంటలకు అందిన సమాచారం : గదుల వివరాలు: ఉచిత గదులు - 97 ఖాళీగా ఉన్నాయి రూ.50 గదులు - 45 ఖాళీగా ఉన్నారుు రూ.100 గదులు - 14 ఖాళీగా ఉన్నాయి రూ.500 గదులు - ఖాళీ లేవు వసంతోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేశారు. -
తిరుమల సమాచారం
తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 20 కంపార్టుమెంట్లు నిండాయి. రాత్రి 7 గంటలకు అందిన సమాచారం : గదుల వివరాలు: ఉచిత గదులు - 56 ఖాళీగా ఉన్నాయి రూ.50గదులు-102ఖాళీగా ఉన్నారుు రూ.100 గదులు-7 ఖాళీగా ఉన్నాయి రూ.500గదులు-14ఖాళీగా ఉన్నాయి ఆర్జిత సేవల టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం-105 ఖాళీగా ఉన్నాయి, సహస్ర దీపాలంకరణసేవ-45 ఖాళీగా ఉన్నా యి. వసంతోత్సవం-79 ఖాళీగా ఉన్నాయి -
తిరుమల సమాచారం
తిరుమలలో మంగళవారం సాయంత్రం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 5 కంపార్ట్మెంట్లు నిండాయి. సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం : గదుల వివరాలు: ఉచిత గదులు - 12 ఖాళీగా ఉన్నారుు రూ.50 గదులు-45 ఖాళీగా ఉన్నాయి రూ.100గదులు-77ఖాళీగా ఉన్నాయి రూ.500 గదులు-18ఖాళీగా ఉన్నాయి ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం - 145 ఖాళీగా ఉన్నారుు సహస్ర దీపాలంకరణ సేవ - 14 ఖాళీ ఉన్నాయి వసంతోత్సవం-59 ఖాళీగా ఉన్నాయి. బుధవారం ప్రత్యేకసేవ -సహస్ర కలశాభిషేకం -
తిరుమల సమాచారం
తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 2 కంపార్టుమెంట్లు నిండాయి. రాత్రి 7 గంటలకు అందిన సమాచారం గదుల వివరాలు: ఉచిత గదులు - 189, రూ.50 గదులు - 4, రూ.100 గదులు - 8, రూ.500 గదులు - 19 ఖాళీగా ఉన్నాయి ఆర్జిత సేవల టికెట్ల వివరాలు ఆర్జిత బ్రహ్మోత్సవం - 156 ఖాళీ, సహస్ర దీపాలంకరణసేవ - 287 ఖాళీ, వసంతోత్సవం - 189 ఖాళీగా ఉన్నాయి మంగళవారం ప్రత్యేక సేవ - అష్టదళ పాదపద్మారాధన -
తిరుమల సమాచారం
తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 4 కంపార్టుమెంట్లు నిండాయి. రాత్రి 7 గంటలకు అందిన సమాచారం: గదుల వివరాలు: ఉచిత గదులు - 17 రూ.50 గదులు - 29 రూ.100 గదులు - 2 రూ.500 గదులు - 7 ఖాళీగా ఉన్నాయి ఆర్జిత సేవల టికెట్ల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం - 113 సహస్ర దీపాలంకరణసేవ - 235 వసంతోత్సవం - 184 ఖాళీ. శుక్రవారం ప్రత్యేక సేవ: పూరాభిషేకం -
తిరుమల సమాచారం
తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 1 కంపార్టుమెంటు నిండింది. రాత్రి 7 గంటలకు అందిన సమాచారం: గదుల వివరాలు: ఉచిత గదులు-23 రూ.50 గదులు-45 రూ.100 గదులు-67 రూ.500 గదులు - 9 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత సేవల టికెట్ల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం - 153 ఖాళీగా ఉన్నాయి సహస్ర దీపాలంకరణసేవ - 34 ఖాళీగా ఉన్నారుు వసంతోత్సవం - 112 ఖాళీగా ఉన్నాయి బుధవారం ప్రత్యేక సేవ - సహస్ర కలశాభిషేకం -
తిరుమల సమాచారం
తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.50, రూ.100ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 26 కంపార్టుమెంట్లు నిండాయి. రాత్రి 7 గంటలకు అందిన సమాచారం: గదుల వివరాలు: ఉచిత గదులు-14 ఖాళీగా ఉన్నారుు రూ.50 గదులు రూ.100 గదులు - ఖాళీ లేవు రూ.500 గదులు -3 ఖాళీగా ఉన్నాయి ఆర్జిత సేవల టికెట్ల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం-17 సహస్ర దీపాలంకరణసేవ -45 ఖాళీగా ఉన్నాయి వసంతోత్సవం - ఖాళీ లేవు -
‘కొండ’పై పెరిగిన భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. హోలీ సెలవు దినం స్వామివారి దర్శనం కోసం భక్తులు అధికసంఖ్యలో తరలిరావడంతో కొండపై రద్దీ పెరిగింది. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు, గర్భాలయం, క్యూలైన్లతోపాటు వసతి గదులు కూడా పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. 50 ,150 రూపాయల క్యూలైన్లలో భక్తులు బారులుదీరారు. గదులుదొరకని యాత్రీకులు దేవస్థానం ఏర్పాటు చేసిన షెడ్ల కింద సేదదీరారు. స్వామి వారి దర్శించుకోవడానికి సుమారు 6గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. సుమారు 30వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్టు ఆలయ అధికారులు పేర్కొన్నారు. -
తిరుమల సమాచారం
తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 9 నిండాయి. రాత్రి 7 గంటలకు అందిన సమాచారం: గదుల వివరాలు: ఉచిత గదులు - 21 రూ.50 గదులు - 14 రూ.100 గదులు -12 రూ.100 గదులు -8 ఖాళీగా ఉన్నాయి ఆర్జిత సేవల టికెట్ల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం - 190 సహస్ర దీపాలంకరణసేవ -32 వసంతోత్సవం - 27 ఖాళీగా ఉన్నాయి శుక్రవారం ప్రత్యేక సేవ: పూరాభిషేకం -
తిరుమల సమాచారం
తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 4 నిండాయి. రాత్రి 7 గంటలకు అందిన సమాచారం : గదుల వివరాలు: ఉచిత గదులు - 32, రూ.50 గదులు - 9, రూ.100 గదులు -13, రూ.100 గదులు -8 ఖాళీగా ఉన్నాయి ఆర్జిత సేవల టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం-15 ఖాళీగా ఉన్నాయి సహస్ర దీపాలంకరణసేవ, వసంతోత్సవం - రద్దు చేశారు గురువారం ప్రత్యేక సేవ : తిరుప్పావడ -
తిరుమల సమాచారం
తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100ల గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 13 నిండాయి. రాత్రి 7 గంటలకు అందిన సమాచారం గదుల వివరాలు: ఉచిత గదులు - 55 రూ.50 గదులు - 09 రూ.100 గదులు -5 రూ.500 గదులు - ఖాళీ లేవు ఆర్జిత సేవల టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం - 23 ఖాళీగా ఉన్నాయి సహస్ర దీపాలంకరణసేవ - రద్దు చేశారు వసంతోత్సవం - రద్దు చేశారు బుధవారం ప్రత్యేక సేవ : సహస్రకలశాభిషేకం -
తిరుమల సమాచారం
తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100ల గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 5 నిండాయి. రాత్రి 7 గంటలకు అందిన సమాచారం: గదుల వివరాలు: ఉచిత గదులు-21, రూ.50 గదులు-17, రూ.100 గదులు-9 ఖాళీ,రూ.500గదులు-ఖాళీ లేవు ఆర్జిత సేవల టికెట్ల వివరాలు: బ్రహ్మోత్సవం - 34 ఖాళీ.సహస్ర దీపాలంకరణసేవ వసంతోత్సవం- రద్దు. మంగళవారం ప్రత్యేక సేవ: అష్టదళ పాదపద్మారాధన -
తిరుమల సమాచారం
తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 2 నిండాయి. రాత్రి 7 గంటలకు అందిన సమాచారం : గదుల వివరాలు: ఉచిత గదులు - 150 ఖాళీ, రూ.50 గదులు-190 ఖాళీ, రూ.100 గదులు - 50 ఖాళీ, రూ.500 గదులు - 15 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత సేవల టికెట్ల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం - ఖాళీ లేవు సహస్ర దీపాలంకరణసేవ -ఖాళీ లేవు వసంతోత్సవం - ఖాళీ లేవు శుక్రవారం ప్రత్యేక సేవ - ఖాళీ లేవు. -
తిరుమల సమాచారం
తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 7 నిండాయి. రాత్రి 7 గంటలకు అందిన సమాచారం : గదుల వివరాలు: ఉచిత గదులు 52 ఖాళీ, రూ.50 గదులు 17 ఖాళీ, రూ.100 గదులు 2 ఖాళీ, రూ.500 గదులు 9 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత సేవల టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం 177 ఖాళీ, సహస్ర దీపాలంకరణసేవ 120ఖాళీగా ఉన్నారుు. వసంతోత్సవం 79 ఖాళీగా ఉన్నాయి. గురువారం ప్రత్యేక సేవ - తిరుప్పావడ -
తిరుమల సమాచారం
తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.100 ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 9 నిండాయి. రాత్రి 7 గంటలకు అందిన సమాచారం : గదుల వివరాలు: ఉచిత గదులు 58 ఖాళీ, రూ.50 గదులు 320 ఖాళీ. రూ.100 గదులు ఖాళీ లేవు. రూ. 500 గదులు 1 ఖాళీ. ఆర్జిత సేవల టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం 300 ఖాళీ, సహస్ర దీపాలంకరణసేవ 230 ఖాళీగా ఉన్నారుు.వసంతోత్సవం ఖాళీలేవు. మంగళవారం ప్రత్యేక సేవ అష్టదళ పాదపద్మారాధన -
తిరుమల సమాచారం
తిరుమలలో ఆదివారం సాయంత్రం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100,రూ.500ల గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 24 కంపార్ట్మెంట్లు నిండారుు. సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం : గదుల వివరాలు: ఉచిత గదులు - 46, రూ.50 గదులు - 14 ఖాళీ, రూ.100 గదులు- 17,రూ.500 గదులు- 2 ఖాళీగా ఉన్నారుు ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం : 189 ఖాళీగా ఉన్నారుు సహస్ర దీపాలంకరణ సేవ - 41 ఖాళీగా ఉన్నారుు, వసంతోత్సవం - ఖాళీ లేదు. సోమవారం ప్రత్యేకసేవ - విశేషపూజ. -
తిరుమల సమాచారం
తిరుమలలో శనివారం సాయంత్రం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. ఉచిత, రూ.50ల గదులు భక్తులకు సులభంగా లభిస్తున్నాయి. రూ.100,రూ.500ల గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 21 కంపార్ట్మెంట్లు నిండారుు. సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం గదుల వివరాలు: ఉచిత గదులు-37 రూ.50 గదులు-82 ఖాళీగా ఉన్నారుు రూ.100 గదులు- 17 రూ.500 గదులు- 2 ఖాళీగా ఉన్నారుు ఆర్జితసేవా టికెట్ల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం:128 ఖాళీగా ఉన్నారుు సహస్ర దీపాలంకరణ సేవ - 107 ఖాళీగా ఉన్నారుు వసంతోత్సవం - 281 ఖాళీగా ఉన్నారుు -
పాఠాలు నేర్వని టీటీడీ
వైకుంఠ ఏకాదశినాడు లోపించిన సమన్వయం ఆగని భక్తుల ఆందోళనలు 1.63 లక్షల మందికి రికార్డు దర్శనం ఈవో, జేఈవో స్వీయ పర్యవేక్షణతో రేయింబవళ్లు పనిచేసిన కొన్ని విభాగాలు తిరుమల: పందొమ్మిదేళ్ల తర్వాత ఒకే రోజు వచ్చిన వైకుంఠ ఏకాదశి, కొత్త సంవత్సరంలో భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడంలో టీటీడీ, పోలీసు, విజిలెన్స్ విభాగాల మధ్య సమన్వయం కొరవడింది. దీని ద్వారా గ తం నుంచి కూడా టీటీడీ యంత్రాంగం పాఠాలు నేర్చుకున్నట్లు కనిపించలేదు. అందుకు నిదర్శనం నిరసనలు మిన్నంటగా, క్యూలు విరిగాయి. కాగా ఆ రెండు రోజుల్లో రికా ర్డు స్థాయిలో 1.63 లక్షల మందికి దర్శన భాగ్యం లభించింది. భక్తులను క్రమబద్ధీకరించడానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్, వెలుపల మొత్తం 40 వేల మందికి టీటీడీ క్యూలు సిద్ధం చేసింది. 5500 గదులు అందుబాటులో ఉంచారు. అదనంగా 11 తాత్కాలిక షెడ్లు, మరుగుదొడ్లు నిర్మించారు. ఊహించిన దానికం టే రెట్టింపు స్థాయిలో భక్తులు తరలివచ్చిన భక్తులు గదుల కోసం తిప్పలు పడ్డారు. ఇంజినీరింగ్ విభాగం పటిష్ట క్యూలు నిర్మించడానికి దృష్టి సారించకుండా ఉన్నవాటినే తాత్కాలిక మరమ్మతులు చేసి మమ అనిపించారు. ఆ క్యూలు భక్తులకు ఏమాత్రం సరిపోలేదు. ఏర్పాట్ల పర్యవేక్షణలో టీటీడీ, పోలీసు విభాగాలు ఎవరికి వారే యమునా తీరుగా వ్యవహరించాయి. భక్తులను నియంత్రించడం, అదుపు చేయడం, కంపార్ట్మెంట్లలోకి అనుమతించడంలోనూ ఆ రెండు విభాగాల మధ్య సఖ్యత కనిపించలేదు. నిరంతరం సేవలు చేసే టీటీడీ ఉద్యోగులు, పోలీసులు, ఇతర ప్రభుత్వ విభాగాలకు దర్శనం కల్పించే విషయంలో టీటీడీ ఉన్నతాధికారులు ఏమాత్రం చొరవ చూపలేదు. రిటైర్డ్ ఉద్యోగులకూ అవకాశం కల్పించలేదు. సామాన్య భక్తుల కోసం కేటాయించమని చెప్పిన 5500 గదుల్లో చాలా వరకు దొడ్డి దారిన కేటాయించినట్లు ఆరోపణలు వినిపించాయి. ఈవో, జేఈవో పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టిన పది రోజులకే ఈవో దొండపాటి సాంబశివరావు ఏకాదశి ఏర్పాట్లపై జేఈవో కేఎస్ శ్రీనివాసరాజుతో కలిసి రేయింబవళ్లు నిర్విరామంగా పర్యవేక్షించారు. ఆలయ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, అన్నదానం డెప్యూటీ ఈవో వేణుగోపాల్, అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డితో సమన్వయం చేసుకుంటూ క్యూలు క్రమబద్ధీకరించారు. నిరంతరం అన్నప్రసాదాలు అందించారు. ఫల, పుష్ప అలంకరణలతో గార్డెన్సూపరిండెంట్ శ్రీనివాసులు అభినందనలు అందుకున్నారు. రికార్డులో స్థాయిలో 4.58 లక్షల మందికి నిత్యాన్నవిభాగం భక్తులకు అన్నప్రసాదాలు, వేడి పాలు, కాఫీ, టీ అందించింది. -
శ్రీవారి దర్శన క్యూల్లో తొక్కిసలాట
శుక్రవారం కాలిబాట, శనివారం సర్వదర్శన క్యూల్లో మిన్నంటిన భక్తుల రోదనలు తిరుమల: తిరుమలలో పోటెత్తిన భక్తుల రద్దీ వల్ల దర్శన క్యూల్లో తొక్కిసలాటలు జరిగాయి. పలువురు భక్తులు గాయపడ్డారు. శుక్ర, శనివారాల్లో కాలిబాట, సర్వదర్శన క్యూలైన్లలో భక్తుల రోదనలు మిన్నంటాయి. దసరా సెలవుల వల్ల శుక్రవారం నుంచి స్వామి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. దాంతోపాటు పెరటాశి నెల మూడో శనివారం కావడంతో అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో నడచివచ్చే భక్తుల రద్దీ రెట్టింపైంది. రద్దీని ముందే ఊహించిన టీటీడీ అధికారులు శుక్రవారం నుంచి శనివారం వరకు నడచివచ్చే భక్తులకు కాలిబాటల్లో ఇచ్చే దివ్యదర్శనం టోకెన్లను రద్దుచేశారు. అనూహ్యంగా పెరిగిన రద్దీ వల్ల శుక్రవారం తిరుమలలోని కాలిబాట క్యూలలో తొక్కిసలాటలు జరిగాయి. శనివారం శ్రీవారి దర్శనం కోసం సర్వదర్శన క్యూలైన్లలోకి భక్తులను అనుమతించారు. అయినా రద్దీ అనూహ్యంగా పెరగడంతో తొక్కిసలాటలు జరిగి పలువురు భక్తులు గాయపడ్డారు. కాగా, తిరుమలలో తొక్కిసలాటలు జరగడంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజుతో మాట్లాడి అవాంచనీయ సంఘటనలు జరక్కుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
శ్రీవారి దర్శనానికి 20 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. వేకువజాము నుంచి సాయంత్రం 6 గంటల వరకు 48,341 మంది భక్తులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 27 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 20 గం టలు పడుతున్నట్లు అధికారులు వెల్లడిం చారు. మరోవైపు కాలిబాట భక్తులు క్యూలో బా రులు తీరగా 7 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభిం చింది. భక్తులరద్దీ కారణంగా సాయంత్రం 4 గం టలకు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని నిలిపివేశారు. కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించటానికి, గదులు తీసుకోవటానికి రెండు గంటల సమయం పట్టింది. శనివారం భక్తులు హుండీ లో సమర్పించిన కానుకలను ఆదివారం లెక్కిం చగా రూ.2.78 కోట్లు లభించింది. భారీ వర్షం: తిరుమలలో ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రారంభమైన భారీ వర్షం అర్ధరాత్రి వరకు కురుస్తూనే ఉంది. ఆలయప్రాంతం జల మయమైంది. ఘాట్‌రోడ్డులో కొండచరియలు. పలుచోట్ల చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. -
తిరుమలలో బారులు తీరిన భక్తులు
-
తిరుమలలో బారులు తీరిన భక్తులు
సర్వదర్శనానికి 25 గంటలు బస్సుల్లో సీట్ల కోసం కొట్లాటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఆదివారం అన్ని ప్రాంతాల్లో భక్తులు బారులు తీరారు. తిరుగుప్రయాణంలో బస్సుల్లో సీట్లకోసం భక్తులు ముష్టిఘాతాలకు దిగటంతో పలువురు గాయపడ్డారు. వరుస సెలవుల కారణంగా నాలుగురోజులుగా తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసిపోయింది. సర్వదర్శనం, కాలిబాట దర్శనం, రూ. 300 టికెట్ల దర్శనం, అన్నదానం, కల్యాణ కట్టలు అన్ని చోట్లా క్యూలలో భక్తులు గంటల తరబడి నిరీక్షించారు. కిక్కిరిసిన క్యూలలో తీవ్రస్థాయి తోపులాటల మధ్య, గంటల తరబడి వేచి ఉంటూ తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. పెరుగుతున్న రద్దీతో క్యూలను క్రమబద్ధీకరించటం ఆలయ అధికారులు, భద్రతా సిబ్బందికి సాధ్యం కాలేదు. సాయంత్రం 6 గంటలకు 31 కంపార్ట్మెంట్లలో నిండి వెలుపల మూడు కిలోమీటర్ల వరకు క్యూ కట్టారు. వీరికి దర్శన సమయం 25 గంటల తర్వాత కేటాయించారు. కాలిబాట క్యూ ఇదే స్థాయిలో ఉండగా, వీరికి దర్శనం 15 గంటలు పట్టింది. రద్దీ కారణంగా ఉదయమే రూ. 300 టికెట్ల క్యూలను మూసివేశారు. అప్పటికే క్యూలో ఉన్నవారికి 10 గంటల తర్వాత దర్శనం లభించింది. రెట్టింపైన భక్తుల కష్టాలు తిరుమలకు రావడం, గదులు, తలనీలాలు సమర్పించడం, స్వామి దర్శనం, లడ్డూలు.. ఇలా భక్తులు వరుసగా గంటల తరబడి క్యూలలో నిలబడి తీవ్ర కష్టాలు ఎదుర్కొన్నారు. లడ్డూల కోసం సుమారు రెండు కిలోమీటర్లు క్యూ కట్టారు. నాలుగు గంటలపాటు వేచి ఉండి కౌంటర్ వద్దకు చేరిన భక్తుడికి రెండే లడ్డూలు ఇవ్వడంతో తీవ్ర ఆవేదనతో తిరుగుముఖం పట్టారు. నేడు తిరుమలలో శ్రీకష్ణ జన్మాష్టమి తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు ఆలయంలోని బంగారు వాకిలిలో ప్రత్యేకంగా ఆస్థానం నిర్వహిస్తారు. మంగళవారం ఉట్లోత్సవం జరుగుతుంది. ఉట్లోత్సవాన్ని తిలకించేందుకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప ఆలయ పురవీధుల్లో ఊరేగనున్నారు. ఇందులో భాగంగా 19వ తేదీ కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది