శ్రీవారి దర్శనానికి 20 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. వేకువజాము నుంచి సాయంత్రం 6 గంటల వరకు 48,341 మంది భక్తులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 27 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 20 గం టలు పడుతున్నట్లు అధికారులు వెల్లడిం చారు. మరోవైపు కాలిబాట భక్తులు క్యూలో బా రులు తీరగా 7 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభిం చింది.
భక్తులరద్దీ కారణంగా సాయంత్రం 4 గం టలకు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని నిలిపివేశారు. కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించటానికి, గదులు తీసుకోవటానికి రెండు గంటల సమయం పట్టింది. శనివారం భక్తులు హుండీ లో సమర్పించిన కానుకలను ఆదివారం లెక్కిం చగా రూ.2.78 కోట్లు లభించింది.
భారీ వర్షం: తిరుమలలో ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రారంభమైన భారీ వర్షం అర్ధరాత్రి వరకు కురుస్తూనే ఉంది. ఆలయప్రాంతం జల మయమైంది. ఘాట్‌రోడ్డులో కొండచరియలు. పలుచోట్ల చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి.