Srivari view
-
వెంకన్న కొండపై నీటికి ఢోకాలేదు
కొండ డ్యాముల్లో పుష్కలంగా నీరు ఏడాదిన్నరకు సరిపడా నిల్వ అయినా పొదుపుగానే నీటి వాడకం తిరుమల: ఈ వేసవిలో తిరుమల కొండ మీద నీటికి ఢోకాలేదు. కుమారధార, పసుపుధార జంట ప్రాజెక్టులతో పాటు గోగర్భం, ఆకాశగంగ, పాపవినాశనం జలాశయాల్లోనూ నీరు పుష్కలంగా ఉంది. ఏడాదిన్నర వరకు నీటి అవసరాలకు ఇబ్బందుల్లేవు. శ్రీవారి దర్శనం కోసం రోజూ 70 వేల మంది భక్తులు వస్తుంటారు. భక్తుల అవసరాలతో పాటు ఆలయం, నిత్యాన్నప్రసాదం కోసం 32 లక్షల గ్యాలన్లు నీరు అవసరమవుతోంది. గత ఏడాది నవంబరులో కురిసిన అతి వర్షాలకు ఇక్కడి ఐదు జలాశయాలు పొంగిపొర్లాయి. అప్పటి నుంచి నీటిని వాడగా ప్రస్తుతం ఐదు జలాశయాల్లోనూ 70 శాతం నీటి వనరులున్నాయి. మరో ఏడాదిన్నరకు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవని టీటీడీ ఇంజినీర్లు చెబుతున్నారు. అయినప్పటికీ నీటి పొదు పు చర్యలు పాటిస్తున్నామని, వృథాను అరికట్టామని చెబుతున్నారు. తిరుమల: ఈ వేసవిలో తిరుమల కొండ మీద నీటికి ఢోకాలేదు. కుమారధార, పసుపుధార జంట ప్రాజెక్టులతో పాటు గోగర్భం, ఆకాశగంగ, పాపవినాశనం జలాశయాల్లోనూ నీరు పుష్కలంగా ఉంది. ఏడాదిన్నర వరకు నీటి అవసరాలకు ఇబ్బందుల్లేవు. శ్రీవారి దర్శనం కోసం రోజూ 70 వేల మంది భక్తులు వస్తుంటారు. భక్తుల అవసరాలతో పాటు ఆలయం, నిత్యాన్నప్రసాదం కోసం 32 లక్షల గ్యాలన్లు నీరు అవసరమవుతోంది. గత ఏడాది నవంబరులో కురిసిన అతి వర్షాలకు ఇక్కడి ఐదు జలాశయాలు పొంగిపొర్లాయి. అప్పటి నుంచి నీటిని వాడగా ప్రస్తుతం ఐదు జలాశయాల్లోనూ 70 శాతం నీటి వనరులున్నాయి. మరో ఏడాదిన్నరకు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవని టీటీడీ ఇంజినీర్లు చెబుతున్నారు. అయినప్పటికీ నీటి పొదు పు చర్యలు పాటిస్తున్నామని, వృథాను అరికట్టామని చెబుతున్నారు. -
శ్రీవారి సేవకు రాష్ట్రపతి
తిరుమలలో టీటీడీ ఘనంగా ఏర్పాట్లు తిరుమల: శ్రీవారి దర్శనం కోసం శుక్రవారం తిరుమల రానున్న భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన కోసం టీటీడీ ఘనంగా ఏర్పాట్లుచేసింది. ఇందులో భాగంగా ఆయన విడిది చేయనున్న పద్మావతి అతిథి గృహంలోని గదులను సరికొత్త హంగులతో తీర్చిదిద్దింది. ఈ ఏర్పాట్లను జేఈవో శ్రీనివాసరాజు స్వయంగా పరిశీలించారు. అన్నీ సవ్యం గా ఉన్నాయా? లేవా? గుర్తించి రిసెప్షన్ అధికారులకు సూచనలు చేశారు. రాష్ట్రపతితో పాటు వస్తున్న గవర్నర్ నరసింహన్ కోసం కేటాయించిన శ్రీకృష్ణ, సీఎం చంద్రబాబు కోసం కేటాయించిన లైలావతి అతిథి గృహాల్లో కూడా అన్ని ఏర్పాట్లు పరిశీలించారు. రాష్ట్రపతి, గవర్నర్, సీఎంలకు బస, దర్శనం, అన్నప్రసాదాల విషయంలో ఎలాంటి లోటులేకుండా చూడాలని జేఈవో సంబంధిత అధికారులకు ఆదేశించారు. జేఈవో వెంట అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి, ఎస్ఈ-2 రామచంద్రారెడ్డి, రిసెప్షన్ అధికారులు కోదండరామారావు, హరీంద్రనాథ్, ఝాన్సీ, లక్ష్మీనారాయణయాదవ్, డెప్యూటీ ఈవో సాగివేణుగోపాల్, శాస్త్రి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శర్మిష్ట పాల్గొన్నారు. వరాహస్వామిని దర్శించుకోనున్న రాష్ట్రపతి రాష్ట్రపతి పర్యటనలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం తొలుత భూ వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతే శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. అదే సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వరాహస్వామి దర్శనానంతరం శ్రీవారిని దర్శించుకంటారు. -
‘వైకుంఠా’నికి ఆధునిక హంగులు
సాక్షి, తిరుమల : శ్రీవారి దర్శనం కోసం భక్తులు గంటలతరబడి వేచి ఉండే వైకుంఠం కంపార్ట్‌మెంట్లన్నీ ఇకపై హైటెక్ హంగులు సంతరించుకోనున్నాయి. ప్రస్తుతం తిరుమలలో రెండు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్మెంట్లు ఉన్నాయి. వీటిని సర్వదర్శనం భక్తులకు కేటాయించారు. ఇందులో భక్తులు గంటలతరబడి దర్శనం కోసం వేచి ఉండాల్సి వస్తోంది. వారికి సౌకర్యంగా ఉండేందుకోసం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని ఒక కంపార్ట్మెంట్లో భారీ స్క్రీను, అధునాతన ప్రొజెక్టర్ ఏర్పాటు చేశారు. దానిలో ఎస్వీబీసీ ప్రత్యక్ష కార్యక్రమాలతోపాటు శ్రీవారి చిత్రాలు, పూజా విశేషాలు వంటివి ప్రసారం చేస్తున్నారు. అభివృద్ధిచేసిన ఈ కంపార్ట్మెంట్ సత్ఫలితాన్నిచ్చిందని టీటీడీ భావించింది. ఇదే తరహాలో వైకుంఠం అన్ని కంపార్ట్మెంట్లను ఆధునీకరించాలని టీటీడీ నిర్ణయించింది. త్వరలోనే ఈ పనులు ప్రారంభించనున్నారు. -
శ్రీవారి దర్శనానికి 20 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. వేకువజాము నుంచి సాయంత్రం 6 గంటల వరకు 48,341 మంది భక్తులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 27 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 20 గం టలు పడుతున్నట్లు అధికారులు వెల్లడిం చారు. మరోవైపు కాలిబాట భక్తులు క్యూలో బా రులు తీరగా 7 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభిం చింది. భక్తులరద్దీ కారణంగా సాయంత్రం 4 గం టలకు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని నిలిపివేశారు. కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించటానికి, గదులు తీసుకోవటానికి రెండు గంటల సమయం పట్టింది. శనివారం భక్తులు హుండీ లో సమర్పించిన కానుకలను ఆదివారం లెక్కిం చగా రూ.2.78 కోట్లు లభించింది. భారీ వర్షం: తిరుమలలో ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రారంభమైన భారీ వర్షం అర్ధరాత్రి వరకు కురుస్తూనే ఉంది. ఆలయప్రాంతం జల మయమైంది. ఘాట్‌రోడ్డులో కొండచరియలు. పలుచోట్ల చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి.