సాక్షి, తిరుమల : శ్రీవారి దర్శనం కోసం భక్తులు గంటలతరబడి వేచి ఉండే వైకుంఠం కంపార్ట్‌మెంట్లన్నీ ఇకపై హైటెక్ హంగులు సంతరించుకోనున్నాయి. ప్రస్తుతం తిరుమలలో రెండు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్లు ఉన్నాయి. వీటిని సర్వదర్శనం భక్తులకు కేటాయించారు.
ఇందులో భక్తులు గంటలతరబడి దర్శనం కోసం వేచి ఉండాల్సి వస్తోంది. వారికి సౌకర్యంగా ఉండేందుకోసం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని ఒక కంపార్ట్‌మెంట్‌లో భారీ స్క్రీను, అధునాతన ప్రొజెక్టర్ ఏర్పాటు చేశారు. దానిలో ఎస్వీబీసీ ప్రత్యక్ష కార్యక్రమాలతోపాటు శ్రీవారి చిత్రాలు, పూజా విశేషాలు వంటివి ప్రసారం చేస్తున్నారు.
అభివృద్ధిచేసిన ఈ కంపార్ట్‌మెంట్ సత్ఫలితాన్నిచ్చిందని టీటీడీ భావించింది. ఇదే తరహాలో వైకుంఠం అన్ని కంపార్ట్‌మెంట్లను ఆధునీకరించాలని టీటీడీ నిర్ణయించింది. త్వరలోనే ఈ పనులు ప్రారంభించనున్నారు.
‘వైకుంఠా’నికి ఆధునిక హంగులు
Published Mon, Dec 1 2014 7:02 AM | Last Updated on Sat, Sep 2 2017 5:28 PM
Advertisement