కొండ డ్యాముల్లో పుష్కలంగా నీరు
ఏడాదిన్నరకు సరిపడా నిల్వ
అయినా పొదుపుగానే నీటి వాడకం
తిరుమల: ఈ వేసవిలో తిరుమల కొండ మీద నీటికి ఢోకాలేదు. కుమారధార, పసుపుధార జంట ప్రాజెక్టులతో పాటు గోగర్భం, ఆకాశగంగ, పాపవినాశనం జలాశయాల్లోనూ నీరు పుష్కలంగా ఉంది. ఏడాదిన్నర వరకు నీటి అవసరాలకు ఇబ్బందుల్లేవు. శ్రీవారి దర్శనం కోసం రోజూ 70 వేల మంది భక్తులు వస్తుంటారు. భక్తుల అవసరాలతో పాటు ఆలయం, నిత్యాన్నప్రసాదం కోసం 32 లక్షల గ్యాలన్లు నీరు అవసరమవుతోంది. గత ఏడాది నవంబరులో కురిసిన అతి వర్షాలకు ఇక్కడి ఐదు జలాశయాలు పొంగిపొర్లాయి. అప్పటి నుంచి నీటిని వాడగా ప్రస్తుతం ఐదు జలాశయాల్లోనూ 70 శాతం నీటి వనరులున్నాయి. మరో ఏడాదిన్నరకు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవని టీటీడీ ఇంజినీర్లు చెబుతున్నారు. అయినప్పటికీ నీటి పొదు పు చర్యలు పాటిస్తున్నామని, వృథాను అరికట్టామని చెబుతున్నారు.
తిరుమల: ఈ వేసవిలో తిరుమల కొండ మీద నీటికి ఢోకాలేదు. కుమారధార, పసుపుధార జంట ప్రాజెక్టులతో పాటు గోగర్భం, ఆకాశగంగ, పాపవినాశనం జలాశయాల్లోనూ నీరు పుష్కలంగా ఉంది. ఏడాదిన్నర వరకు నీటి అవసరాలకు ఇబ్బందుల్లేవు. శ్రీవారి దర్శనం కోసం రోజూ 70 వేల మంది భక్తులు వస్తుంటారు. భక్తుల అవసరాలతో పాటు ఆలయం, నిత్యాన్నప్రసాదం కోసం 32 లక్షల గ్యాలన్లు నీరు అవసరమవుతోంది. గత ఏడాది నవంబరులో కురిసిన అతి వర్షాలకు ఇక్కడి ఐదు జలాశయాలు పొంగిపొర్లాయి.
అప్పటి నుంచి నీటిని వాడగా ప్రస్తుతం ఐదు జలాశయాల్లోనూ 70 శాతం నీటి వనరులున్నాయి. మరో ఏడాదిన్నరకు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవని టీటీడీ ఇంజినీర్లు చెబుతున్నారు. అయినప్పటికీ నీటి పొదు పు చర్యలు పాటిస్తున్నామని, వృథాను అరికట్టామని చెబుతున్నారు.