
వేసవి కాలంలో వచ్చే సమస్యలో ప్రధానమైంది మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు (UTIs). ఈ సమస్య ఉన్నవారికి తరచూ మూత్ర విసర్జన చేయాలనిపిస్తుంది. మూత్ర విసర్జన చేసే సమయంలో కొందరికి నొప్పి, మంట కూడా ఉంటాయి. అయితే మూత్రాశయ ఇన్ఫెక్షన్లు సహజమే అనే నిర్లక్ష్యం పనికిరాదు. అప్రమత్తంగా లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తుంది. మూత్రాశ్రయ ఇన్‌ఫెక్షన్లను ఎలా గుర్తించాలి? వేసవిలోఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
అసలేఈ ఏడాది సూర్యుడి భగభగలు మరింత మండించనున్నాయని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిలి. అధిక ఉష్ణోగ్రతలు డీహైడ్రేషన్ ప్రమాదాన్ని, వడదెబ్బ లాంటివి యూటీఐ ప్రమాదాన్ని పెంచుతాయి. వేసవిలో తగ్గినన్ని నీళ్లు తాగడంపోవడం, డీహైడ్రేషన్ మూత్ర సమస్యలను పెంచుతుంది. యూటీఐని సాధారణంగా మూత్ర విసర్జనలో మంట లేదా నొప్పి, తరచుగా మూత్ర విసర్జన , మూత్ర విసర్జన అత్యవసరం, మూత్రంలో రక్తం (హెమటూరియా) ద్వారా గుర్తించవచ్చు.
ఇదీ చదవండి: ఈవినింగ్ వాక్? మార్నింగ్ వాక్? ఎక్కువ ప్రయోజనాలు కావాలంటే?!
మూత్రం విసర్జనలో నొప్పి సహజమే అనుకోవడం అపోహ. ఒక్కోసారి అనేక ఇతర వ్యాధుల ముప్పు ఈ ఇన్ఫెక్షన్ల లక్షణాలతో మొదలవుతుంది. అందుకే దీన్ని నిర్ధారించు కోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. యూరిన్ కల్చర్ అవసరం యూరినాలిసిస్ లేదా డిప్‌స్టిక్ పరీక్ష సరిపోదు. క్రాన్బెర్రీ జ్యూస్ తో చికిత్స చేయవచ్చు అనేది మరో అపోహ అంటున్నారు వైద్యులు. ఒక రోగికి సంవత్సరంలో మూడు కంటే ఎక్కువ UTIలు నిర్ధారణ అయితే, యూరాలజిస్ట్‌ని సంప్రదించి కారణాలను విశ్లేషించుకోవాలి.
వేసవిలో మూత్రాశయ సమస్యలు రాకుండా ఉండాలంటే
ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపుకోవడం, తగినన్ని నీళ్లు తాగకపోవడం, బాక్టీరియా సోకడం వల్ల సాధారణంగా మూత్రాశయ సమస్యలొస్తాయి.
ప్రతిరోజూ కనీసం రెండు లీటర్ల ద్రవం తాగాలి. తద్వారా శరీరానని బాగా హైడ్రేట్ గా ఉంచుకోవాలి. తరచుగా మూత్ర విసర్జన చేయాలి. కనీసం ప్రతి మూడు గంటలకు ఒకసారి యూరిన్ పాస్ చేస్తున్నామా లేదా అని పరిశీలించుకోవాలి.
మల విసర్జన తరువాత శుభ్రం చేసుకొనే విధానం.. ముందు నుంచి వెనుకకు ఉండాలి. అంతేకానీ, వెనుక నుంచి ముందుకు ఉండకూడదు. మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. సంభోగం తర్వాత మూత్ర విసర్జన చేయాలి.
విటమిన్ సీ ఎక్కువగా ఉండే పండ్లుతీసుకోవాలి. అలాగే నీటి శాతం ఎక్కువగా పుచ్చ, పైనాపిల్, తర్బూజ కీవీ,నారింజ, నిమ్మ, ద్రాక్ష పండ్లను తీసుకోవాలి.
యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవాలి.
మూత్రాశయ ఇన్‌ఫెక్షన్ సమస్య ఉన్నవారికి క్రాన్ బెర్రీ పండ్ల రసం కొంతమేరకు ఉపయోగపడుతుంది. క్రాన్‌బెర్రీ సప్లిమెంట్లు ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించగలవు కానీ, పూర్తిగా కాదు అంటున్నారు.
బాడీ వాష్, బబుల్ బాత్ , కొన్ని రకాల సబ్బులు UTI కి కారణమవుతాయి. సున్నితమైన సబ్బులు వాడాలి.
వేసవి కాలంలో మెన్స్ట్రువల్ కప్పులు, టాంపాన్లు, ప్యాడ్‌లను క్రమం తప్పకుండా మార్చుకోవాలి.
టైట్ దుస్తులు వేసుకోకూడదు.
ప్రమాద సంకేతాలు
మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మూత్రం రంగుమారడంతో పాటు, దుర్వాసన,, పొత్తి కడుపు తీవ్రమైన నొప్ప, లేదా వెన్నునొప్పి, తిమ్మిరి లేదా అసౌకర్యంగా అనిపిస్తే అప్రమత్తం కావాలి.
అలాగే చలి జ్వరం, వికారం, వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పి లాంటి లక్షణాలుకనిపిస్తే వెంటనే సంప్రదించి సరియైన చికిత్స తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment