భారీ ఊరట: ఆ మూడు కేన్సర్లకు త్వరలో వ్యాక్సీన్‌ | Cancer Vaccine For Women To Be Available In 6 Months Union Minister | Sakshi
Sakshi News home page

భారీ ఊరట: ఆ మూడు కేన్సర్లకు త్వరలో వ్యాక్సీన్‌

Feb 19 2025 2:49 PM | Updated on Feb 19 2025 6:24 PM

Cancer Vaccine For Women To Be Available In 6 Months Union Minister

కేన్సర్‌కు  సంబంధించి కేంద్ర ప్రభుత్వం మహిళలకు భారీ ఊరటనిచ్చే వార్తను ప్రకటించింది.   దేశంలోని మహిళలకు ఆరు నెలల్లో క్యాన్సర్‌ టీకాను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఆయుష్ సహాయ మంత్రి  ప్రతాప్‌ జాదవ్‌ మంగళవారం వెల్లడించారు. మహిళలను ప్రభావితం చేసే కేన్సర్‌లను ఎదుర్కోవడానికి టీకా ఐదు నుండి ఆరు నెలల్లో అందుబాటులోకి వస్తుందని, 9-16 ఏళ్ల వయస్సున్న అమ్మాయిలు టీకాలు తీసుకోవడానికి అర్హులని కేంద్ర మంత్రిప్రకటించారు.  ఈ టీకా రొమ్ము, నోటి, గర్భాశయ కేన్సర్‌ నిరోధకంగా పనిచేస్తుందన్నారు.

దేశంలో క్యాన్సర్‌ బాధితుల సంఖ్య పెరుగుతోంది, ఈ నేపథ్యంలోనే ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్టు కేంద్రంమంత్రి తెలిపారు.. 30 ఏండ్ల పైబడిన మహిళలకు ఆ సుపత్రిల్లో స్క్రీనింగ్‌ నిర్వహిస్తారు.  కేన్సర్‌ను ముందుగానే గుర్తించడానికి డే కేర్‌  కేన్సర్‌ కేంద్రాలను నెలకొల్పుతామని కూడా కేంద్రమంత్రి  వెల్లడించారు. . ప్రభుత్వ ఆసుపత్రులలో  ఆయుష్‌ విభాగాలున్నాయని.. ప్రజలు వాటిని వైద్యం కోసం ఉపయోగించుకోవచ్చని తెలిపారు. దేశంలో ఇటువంటి 12,500 ఆరోగ్య సౌకర్యాలు ఉన్నాయని, ప్రభుత్వం వాటిని పెంచుతోందని ఆయన అన్నారు. 

కాగా మన దేశంలో మహిళల్లో రొమ్ము కేన్సర్  బాగా కనిపిస్తోంది. అదే పురుషుల్లో అయితే ఊపిరితిత్తుల అత్యధికంగా విస్తరిస్తోంది. చిన్నపిల్లలో లింఫోయిడ్ లుకేమియా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి.  స్త్రీ జననేంద్రియ కేన్సర్‌లో  ప్రధానంగా ఐదు కాలుఉన్నాయి.  గర్భాశయ ముఖద్వార, అండాశయ,  గర్భాశయ, యోని  అండ్‌ వల్వార్.  ఆరవది చాలా అరుదైనది  ఫెలోపియన్ ట్యూబ్ కేన్సర్ .
 

చదవండి: ఒక్కో గ్రాము ధర రూ. 53 వేల కోట్లు, అంత ‘మ్యాటర్‌’ ఏముంది?

మహిళ చేతివాటం, దెబ్బకి బ్యాన్‌ చేసిన వాల్‌మార్ట్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement