cancer vaccine
-
క్యాన్సర్ వ్యాక్సిన్ తయారికి దగ్గరలో ఉన్నాం: పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యా ప్రజల శుభవార్త చెప్పారు. కొన్నాళ్ల నుంచి వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషికి త్వరలో ఫలితం దక్కనుందని తెలిపారు. అతి త్వరలో ప్రాణాంతకమైన క్యాన్సర్‌కు రష్యా వైద్య శాస్త్రవేత్తలు క్యాన్సర్‌కు వాక్సిన్ తయారు చేసి అందుబాటులోకి తీసుకురానున్నారని వెల్లడించారు. ‘మేము ఒక క్యాన్సర్ కొత్త జనరేషన్‌కు సంబంధించి వ్యాక్సిన్లు, ఇమ్యునోమోడ్యులేటరీ డ్రగ్స్ తయారికి దగ్గరగా వచ్చాం. అతి త్వరలో కొత్తగా తయరు చేసిన క్యాన్సర్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది వ్యక్తిగత థెరపీకి ఈ వ్యాక్సిన్ వినియోగంలోకి వస్తుంది’అని అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. అయితే ఎటువంటి క్యాన్సర్‌కు వ్యాక్సిన్ కనిపెట్టబోతున్నారన్న విషయాన్ని మాత్రం అధ్యక్షుడు పుతిన్ వెల్లడించకపోవటం గమనార్హం. పలు దేశాలు, కంపెనీలు క్యాన్సర్ వ్యాక్సిన్ తయారికి కృషి చేస్తున్నాయి. గత ఏడాది బ్రిటన్ ప్రభుత్వం జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ కంపెనీతో ఒప్పదం చేసుకుంది. 2030 నాటికి సుమారు పదివేల మంది పేషెంట్లలకు క్లినికల్ ట్రయల్స్ ద్వారా క్యాన్సర్ చికిత్స అందిచాలని లక్ష్యం పెట్టుకుంది. ఫార్మాస్యూటికల్ కంపెనీలు మోడెర్నా, మెర్క్ అండ్ కో ఒక ప్రయోగాత్మక క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. సుమారు మూడేళ్ల చికిత్స తర్వాత ప్రాణాంతకమైన చర్మ క్యాన్సర్ మెలనోమా పేషెంట్లలో మరణం సంభవించే అవకాశాన్ని సగానికి తగ్గించనుందని ఆయా కంపెనీలు తయారు చేస్తున్న వ్యాక్సిన్ ద్వారా తెలుస్తోంది. ఇక.. కరోనా సమయంలో రష్యా స్పూతినిక్-వి అనే వ్యాక్సిన్ తయారు చేసిన విషయం తెలిసిందే. తమ దేశం తయారు చేసిన ఈ కరోనా వ్యాక్సిన్‌ను అధ్యక్షుడు పుతిన్ స్వయంగా తీసుకొని ప్రజలకు నమ్మకం కల్పించారు. చదవండి: అమెరికా స్పోర్ట్స్ పరేడ్‌లో కాల్పులు.. ఒకరు మృతి, 22 మందికి గాయాలు -
BioNTech: త్వరలో క్యాన్సర్ వ్యాక్సిన్!
క్యాన్సర్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి ఇక ఎంతో సమయం పట్టదని ఈ ప్రాణాంతక వ్యాధిపై సుదీర్ఘ కాలంగా పరిశోధన చేస్తున్న దంపతులు, ‘బయో ఎన్‌టెక్’ వ్యాక్సిన్ల తయారీ సంస్థ అధినేలు ప్రొఫెసర్ ఉగుర్ సాహిన్, ప్రొఫెసర్ ఓజ్లెమ్ టురేసి చెబుతున్నారు. మహా అయితే ఎనిమిదేళ్లలోపే క్యాన్సర్ వ్యాక్సిన్ వాడుకలోకి రాబోతోందని వివరించారు. ప్రముఖ వార్తాసంస్థ బీబీసీ ఇంటర్వ్యూలో వారు ఈ మేరకు వెల్లడించారు. ‘‘మేం డాక్టర్లుగా బాధితుల వెతలు, నిరాశా నిస్పృహలు చూసి చలించిపోయేవాళ్లం. ఆ అనుభవమే క్యాన్సర్ పరిశోధనల వైపు మళ్లించింది’’ అన్నారు. ‘‘కరోనాకు మంచి వ్యాక్సిన్ తయారు చేస్తున్న క్రమంలో ఆ పరిశోధన అనుకోకుండా క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేలా మలుపు తిరిగింది. ఇది మెసెంజర్ ఆర్ఎన్ఏ సాంకేతికతతో రూపొందించిన వ్యాక్సిన్. మన ఒంట్లోని వ్యాధినిరోధక శక్తే క్యాన్సర్ కణాలను గుర్తించి తుదముట్టించేలా ఇది పని చేస్తుంది’’ అని డాక్టర్ సాహిన్ చెప్పారు. తమ వ్యాక్సిన్ అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుందని ఘంటాపథంగా చెప్పారు. అది క్యాన్సర్ కణాలను నేరుగా తుదముట్టించేలా రూపొందిందని టురేసి వివరించారు. ‘‘ట్రయల్స్‌లో బాధితులపై వ్యాక్సిన్‌ను వాడుతున్నప్పుడు ఎదురైన అడ్డంకులు దీన్ని మరింత ప్రభావవంతంగా మార్చేలా చేశాయి’’ అని దంపతులు చెప్పారు. ఈ పరిశోధనల వివరాలు తొలుత బిజినెస్ ఇన్సైడర్ మ్యాగజైన్లో ప్రచురితమయ్యాయి. -
త్వరలో కేన్సర్ టీకా!
ప్రాణాంతక కేన్సర్‌కు విరుగుడు కనుక్కునేందుకు శాస్త్రవేత్తలు చేయని ప్రయత్నం లేదు. రోగ నిరోధక వ్యవస్థ కేన్సర్ కణాలపై దాడి చేసే విధానాన్ని ఇప్పటివరకు శాస్త్రవేత్తలు ప్రయత్నించలేదు. అయితే చర్మ కేన్సర్లపై ఇటీవల జరిగిన రెండు క్లినికల్ ట్రయల్స్ కేన్సర్ కణితులకు అనుగుణంగా టీకాలను అభివృద్ధి చేయగలమన్న భరోసా కల్పిస్తున్నాయి. కేన్సర్ కణాల ఉపరితలంపై కనిపించే నియో యాంటీజెన్స్ ద్వారా ఇది సాధ్యం కావచ్చని అంచనా. అమెరికాలోని బోస్టన్‌లో ఉన్న డానా ఫార్బర్ కేన్సర్ ఇన్స్టిట్యూట్, జర్మనీకి చెందిన బయో ఫార్మాసూటికల్ న్యూ టెక్నాలజీస్‌లు వేర్వేరుగా నిర్వహించిన ప్రయోగాల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. కేన్సర్ కణితుల్లో ఉండే యాంటీజెన్లను కృత్రిమ పద్ధతుల్లో తయారు చేసి రోగి శరీరాల్లోకి ఎక్కించినప్పుడు దీర్ఘకాలం పాటు కేన్సర్ తిరిగి రాలేదని గుర్తించారు. కొంతమందిలో కేన్సర్ కణాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఈ రెండు ప్రయోగాల్లో వాడిన టీకాలు సత్ఫలితాలివ్వడంతో కేన్సర్‌కు విరుగుడుగా టీకా అభివృద్ధి చేసే అవకాశాలు పెరిగాయి. అయితే ఈ టీకా ఒక్కో రోగికి ప్రత్యేకంగా తయారవుతుంది. అయితే కేన్సర్ కణాల్లోని నియోయాంటీజెన్లతో టీకాలను అభివృద్ధి చేయడానికి ప్రస్తుతం అధిక మొత్తంలో ఖర్చు కావడమే కాకుండా ఎక్కువ సమయం పడుతోంది. అందరికీ అందుబాటులోకి రావాలంటే మరికొంత సమయం పట్టొచ్చు. -
కేన్సర్‌కు వ్యాక్సిన్ వచ్చేసిందా?
మానవాళిని పీడిస్తున్న కేన్సర్ మహమ్మారిపై విజయం దిశగా ఓ అడుగు పడింది. బ్రిటన్‌కు చెందిన ఓ యువతికి వైద్యులు ఓ సరికొత్త వ్యాక్సిన్ ఇచ్చారు. దాంతో.. ఆమె శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి, శరీరంలో ఎక్కడ ట్యూమర్లు పెరిగినా వాటిని నాశనం చేసే శక్తి వస్తుందని చెబుతున్నారు. కెల్లీ పోటర్ (35) అనే మహిళకు గర్భాశయ ముఖద్వార కేన్సర్ ఉన్నట్లు 2015 జూలైలో గుర్తించారు. అప్పటికే వ్యాధి కూడా ముదిరింది. ఆమెకు తొలిసారిగా ఈ వ్యాక్సిన్ ప్రయోగాత్మకంగా ఇచ్చారు. రాబోయే రెండేళ్లలో 30 మంది వాలంటీర్లకు ఈ వ్యాక్సిన్ ఇచ్చి పరిశీలించబోతున్నారు. సాధారణంగా శరీరంలో కణాలు కొంతకాలం తర్వాత చనిపోతుంటాయి, వాటి బదులు కొత్త కణాలు పుడుతుంటాయి. కానీ కేన్సర్ కణాలకు మాత్రం అసలు చావు అన్నది లేకపోగా, మరింతగా వృద్ధిచెందుతుంటాయి. సరిగ్గా ఇలాంటి కణాలపై పనిచేసేలాగే రోగనిరోధక శక్తిని పెంపొందించేలా ఈ కొత్త వ్యాక్సిన్‌ను వైద్య పరిశోధకులు రూపొందించారు. ఈ వ్యాక్సిన్ తీసుకుంటున్న సమయంలోనే పేషెంట్లకు కెమెథెరపీ కూడా తక్కువ డోస్‌లో ఇస్తారు. ఈ కెమోథెరపీ రోగనిరధక శక్తికి ఉండే అడ్డంకులను తొలగిస్తుంది. సాధారణంగా శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి బయటి నుంచి వచ్చే వాటిని అడ్డుకుంటుంది తప్ప, సొంత శరీరంలోనే పెరిగే కేన్సర్ కణాలను ఏమీ చేయదు. సరిగ్గా ఆ లక్షణాన్నే ఈ కెమోథెరపీ మందు వదిలిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కెల్లీకి కేన్సర్ నాలుగో దశలో ఉన్నట్లు గుర్తించారు. దురదృష్టవశాత్తు శరీరంలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాధి వ్యాపించింది. లండన్‌లోని గయ్స్ ఆస్పత్రిలో కొంతమేర చికిత్స చేసినా, అప్పటికే కాలేయానికి, ఊపిరితిత్తులకు కూడా వ్యాధి వ్యాపించిందని, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఈ వ్యాక్సిన్ తనకు ఇస్తాననగానే ఎంతో సంతోషించానని ఆమె చెప్పారు. ఆమెకు ఫిబ్రవరి 9వ తేదీన వ్యాక్సిన్ ఇచ్చారు. ఆ తర్వాత ఫ్లూ లాంటి లక్షణాలు కనిపించొచ్చని వైద్యులు చెప్పినా, అలాంటివేవీ ఇంతవరకు లేవు. ఈ వ్యాక్సిన్ సాయంతో తాను కేన్సర్‌ను జయిస్తే.. ఇతరులకు కూడా ఇది స్ఫూర్తిమంతంగా ఉంటుందని కెల్లీ పోటర్ తెలిపారు. తాము ప్రధానంగా శరీరంలోని రోగ నిరోధక శక్తి మీద పనిచేసేలా వ్యాక్సిన్‌ను రూపొందించామని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ హర్దేవ్ పాండా తెలిపారు.