మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యా ప్రజల శుభవార్త చెప్పారు. కొన్నాళ్ల నుంచి వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషికి త్వరలో ఫలితం దక్కనుందని తెలిపారు. అతి త్వరలో ప్రాణాంతకమైన క్యాన్సర్‌కు రష్యా వైద్య శాస్త్రవేత్తలు క్యాన్సర్‌కు వాక్సిన్ తయారు చేసి అందుబాటులోకి తీసుకురానున్నారని వెల్లడించారు.
‘మేము ఒక క్యాన్సర్ కొత్త జనరేషన్‌కు సంబంధించి వ్యాక్సిన్‌లు, ఇమ్యునోమోడ్యులేటరీ డ్రగ్స్ తయారికి దగ్గరగా వచ్చాం. అతి త్వరలో కొత్తగా తయరు చేసిన క్యాన్సర్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది వ్యక్తిగత థెరపీకి ఈ వ్యాక్సిన్ వినియోగంలోకి వస్తుంది’అని అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. అయితే ఎటువంటి క్యాన్సర్‌కు వ్యాక్సిన్ కనిపెట్టబోతున్నారన్న విషయాన్ని మాత్రం అధ్యక్షుడు పుతిన్ వెల్లడించకపోవటం గమనార్హం.
పలు దేశాలు, కంపెనీలు క్యాన్సర్ వ్యాక్సిన్ తయారికి కృషి చేస్తున్నాయి. గత ఏడాది బ్రిటన్ ప్రభుత్వం జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ కంపెనీతో ఒప్పదం చేసుకుంది. 2030 నాటికి సుమారు పదివేల మంది పేషెంట్లలకు క్లినికల్ ట్రయల్స్ ద్వారా క్యాన్సర్ చికిత్స అందిచాలని లక్ష్యం పెట్టుకుంది. ఫార్మాస్యూటికల్ కంపెనీలు మోడెర్నా, మెర్క్ అండ్ కో ఒక ప్రయోగాత్మక క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. సుమారు మూడేళ్ల చికిత్స తర్వాత ప్రాణాంతకమైన చర్మ క్యాన్సర్ మెలనోమా పేషెంట్లలో మరణం సంభవించే అవకాశాన్ని సగానికి తగ్గించనుందని ఆయా కంపెనీలు తయారు చేస్తున్న వ్యాక్సిన్ ద్వారా తెలుస్తోంది.
ఇక.. కరోనా సమయంలో రష్యా స్పూతినిక్-వి అనే వ్యాక్సిన్ తయారు చేసిన విషయం తెలిసిందే. తమ దేశం తయారు చేసిన ఈ కరోనా వ్యాక్సిన్‌ను అధ్యక్షుడు పుతిన్ స్వయంగా తీసుకొని ప్రజలకు నమ్మకం కల్పించారు.
చదవండి: అమెరికా స్పోర్ట్స్ పరేడ్‌లో కాల్పులు.. ఒకరు మృతి, 22 మందికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment