రష్యాను టెన్షన్‌ పెడుతున్న కొత్త వైరస్‌.. భయాందోళనలో రష్యన్లు! | New Virus Identify In Russia | Sakshi
Sakshi News home page

రష్యాను టెన్షన్‌ పెడుతున్న కొత్త వైరస్‌.. భయాందోళనలో రష్యన్లు!

Published Wed, Apr 2 2025 1:37 PM | Last Updated on Wed, Apr 2 2025 1:53 PM

New Virus Identify In Russia

మాస్కో: రష్యాలో మరో కొత్త వైరస్‌ విజృంభిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. అంతుచిక్కని వైరస్‌ కారణంగా రష్యా ప్రజలకు విపరీతమైన దగ్గుతో నోటిలో నుంచి రక్తం పడుతుందనే కథనాల్లో పేర్కొన్నాయి. వీరికి కోవిడ్‌ టెస్టులు చేయగా.. నెగిటివ్‌ వచ్చిందని.. ఇది మరో కొత్త వైరస్‌ అయి ఉంటుందని అభిప్రాయం వ్యక్తంచేశాయి. మరోవైపు.. ఈ కథనాలను రష్యా అధికారులు ఖండించారు. వైరస్‌ అంటూ వస్తున్న వార్తలు నిజం కాదన్నారు.

వివరాల ప్రకారం.. రష్యాలో మిస్టరీ వైరస్‌ విజృంభిస్తోందని మార్చి 29న పలు నివేదికలు వెలువడ్డాయి. అలెగ్జాండ్రా అనే మహిళ ఐదు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుందని.. కొన్ని రోజులకు దగ్గుతున్న సమయంలో రక్తం పడుతున్నట్లు తెలిపిందని నివేదికలు వెల్లడించాయి. అక్కడి ప్రజలు తీవ్రమైన శ్వాసకోస సంబంధిత వ్యాధులతో.. దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నారని తెలిపాయి. పలు నగరాల్లో ప్రజలు వారాలతరబడి జ్వరం, ఒళ్లు నొప్పులు, తీవ్ర దగ్గుతో బాధపడుతున్నారని పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఎన్ని మందులు వాడినప్పటికీ తగ్గుదల కనిపించట్లేదని ఆందోళన వ్యక్తంచేశాయి. ఇదే సమయంలో మరికొందరు నెటిజన్లు తాము తీవ్రమైన రక్తంతో కూడిన దగ్గుతో బాధ పడుతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు. అలాగే, తాము కోవిడ్‌ టెస్టులు చేపించుకున్నప్పటికీ పాజిటివ్‌ రాలేదని చెప్పుకొచ్చారు. ఈ వైరస్‌ కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు తెలిపారు.

దీంతో, కొత్త వైరస్‌పై తీవ్ర చర్చ మొదలైంది. ఈ వార్తలపై తాజాగా రష్యా అధికారులు స్పందించారు. ఈ క్రమంలో సదరు అధికారులు స్పందిస్తూ.. ఈ నివేదికలను ఖండించారు. తాము జరుపుతున్న పరీక్షల్లో దేశంలో ఎలాంటి నూతన వ్యాధి కారకాలు బయటపడలేదని.. కొత్త వైరస్‌ వ్యాపించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని వెల్లడించారు. నివేదికల్లో పేర్కొన్న మహిళకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు మైకోప్లాస్మా న్యుమోనియా ఉన్నట్లు నిర్ధరించారని తెలిపారు. ఒకవేళ కోవిడ్‌ తరహా వైరస్‌ వస్తే దానిని ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఇ‍క​, కొత్త వైరస్‌కు సంబంధించిన పలు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement