త్వరలో కేన్సర్‌ టీకా! | Cancer vaccination coming soon | Sakshi
Sakshi News home page

త్వరలో కేన్సర్‌ టీకా!

Published Tue, Jul 11 2017 1:20 AM | Last Updated on Tue, Sep 5 2017 3:42 PM

త్వరలో కేన్సర్‌ టీకా!

త్వరలో కేన్సర్‌ టీకా!

ప్రాణాంతక కేన్సర్‌కు విరుగుడు కనుక్కునేందుకు శాస్త్రవేత్తలు చేయని ప్రయత్నం లేదు. రోగ నిరోధక వ్యవస్థ కేన్సర్‌ కణాలపై దాడి చేసే విధానాన్ని ఇప్పటివరకు శాస్త్రవేత్తలు ప్రయత్నించలేదు. అయితే చర్మ కేన్సర్లపై ఇటీవల జరిగిన రెండు క్లినికల్‌ ట్రయల్స్‌ కేన్సర్‌ కణితులకు అనుగుణంగా టీకాలను అభివృద్ధి చేయగలమన్న భరోసా కల్పిస్తున్నాయి. కేన్సర్‌ కణాల ఉపరితలంపై కనిపించే నియో యాంటీజెన్స్‌ ద్వారా ఇది సాధ్యం కావచ్చని అంచనా. అమెరికాలోని బోస్టన్‌లో ఉన్న డానా ఫార్బర్‌ కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్, జర్మనీకి చెందిన బయో ఫార్మాసూటికల్‌ న్యూ టెక్నాలజీస్‌లు వేర్వేరుగా నిర్వహించిన ప్రయోగాల ద్వారా ఈ విషయం స్పష్టమైంది.

కేన్సర్‌ కణితుల్లో ఉండే యాంటీజెన్లను కృత్రిమ పద్ధతుల్లో తయారు చేసి రోగి శరీరాల్లోకి ఎక్కించినప్పుడు దీర్ఘకాలం పాటు కేన్సర్‌ తిరిగి రాలేదని గుర్తించారు. కొంతమందిలో కేన్సర్‌ కణాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఈ రెండు ప్రయోగాల్లో వాడిన టీకాలు సత్ఫలితాలివ్వడంతో కేన్సర్‌కు విరుగుడుగా టీకా అభివృద్ధి చేసే అవకాశాలు పెరిగాయి. అయితే ఈ టీకా ఒక్కో రోగికి ప్రత్యేకంగా తయారవుతుంది. అయితే కేన్సర్‌ కణాల్లోని నియోయాంటీజెన్లతో టీకాలను అభివృద్ధి చేయడానికి ప్రస్తుతం అధిక మొత్తంలో ఖర్చు కావడమే కాకుండా ఎక్కువ సమయం పడుతోంది. అందరికీ అందుబాటులోకి రావాలంటే మరికొంత సమయం పట్టొచ్చు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement