Immune System
-
సూర్యరశ్మికి కొదువ లేదు..ఐనా ఆ విటమిన్ లోపమే ఎక్కువ ఎందుకు..?
భారత్‌లో సూర్యరశ్మి పుష్కలంగా ఉంటుంది.. ఉష్ణమండల ప్రాంతమే అయినా..ఇక్కడ డీ విటమిన్ లోపంతో బాధపడే వాళ్ల సంఖ్యే ఎక్కువ. బలమైన ఎముకలకు అవసరమైన విటమిన్ డీ. ఇది ఎముకల దృఢత్వానికి అవసరమైన కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా రోగనిరోధక వ్యవస్థ, కండరాల పనితీరు, కణాల పెరుగుదలకు మద్దతిస్తుంది. అలాంటి డీ విటమిన్‌ని మన భారతదేశంలో అత్యంత సమృద్ధిగా లభించే సూర్యరశ్మి సాయంతో ఈజీగానే పొందొచ్చు. అయిప్పటికీ మన దేశంలోనే ఎందుకు ఎక్కువ మంది ఈ విటమిన్ లోపంతో బాధపడటానికి గల కారణం..?. ఎలా అధిగమించొచ్చు వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా..!.భారతీయులు ఆధునిక పట్టణ జీవన శైలి ఇందుకు కారణమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. చాలావరకు పట్టణాల్లో నివశించే ప్రజలు ఎక్కువ సమయం ఇంటిలో లేదా పాఠశాలలు, కార్యాలయాల్లోనే గడుపుతారు. అలాంటప్పుడు సూర్యరశ్మికి బహిర్గతం అయ్యే అవకాశం ఎక్కడ ఉంటుందని ప్రశ్నిస్తున్నారు నిపుణులు. కనీసం బహిరంగ కార్యకలాపాల్లో నిమగ్నమైనా.. ఆ అవకాశం కాస్తోకూస్తో ఉండే వీలుంటుంది. సహజసిద్ధంగా లభించే డీ విటమిన్‌ని పొందలేకపోవడానికి మరో బలమైన కారణం దుస్తులు. పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు, సన్‌స్క్రీన్ లోషన్లు తదితరాలు శరీరాన్ని బహిర్గతం కానివ్వకుండా చేస్తున్నాయని చెబుతున్నారు నిపుణులు. ఇంకొక ప్రధాన కారణం పర్యావరణ కాలుష్యం. పట్టణాల్లో పొగ, దుమ్ముతో కూడిన వాతావరణంలో సూర్యరశ్మి కోసం బహిర్గతమైతే లేనిపోని ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదమే ఎక్కువ. వారికే డీ విటమిన్ అధికం..అలాగే ముదురు రంగు చర్మం కలవారిలో మెలనిన్ స్థాయిలు అధికంగా ఉంటాయి. లేతరంగులో ఉన్న వారితో పోలిస్తే వారిలోనే డీ విటమిన్ అధికమని చెబుతున్నారు నిపుణులు. అలాగే ఆయా వ్యక్తులలోని అధిక మెలనిన్ యూవీ కిరణాల నుంచి సంరక్షిస్తుంది. అలాంటి ఆహారాలు తీసుకోకపోవడం..విటమిన్ డీ సమృద్ధిగా ఉండే ఆయిల్ ఫిష్, గుడ్డు సొన, పాల ఉత్పత్తుల్లో ఉంటాయి. వీటిని చాలామంది భారతీయలు తగినంతగ తీసుకోకపోవడమే ప్రధాన కారణమని చెబుతున్నారు. అందువల్లే ఈ విటమిన్ లోపం ఇక్కడ తీవ్రంగా ఉందని చెబుతున్నారు. అధిగమించాలంటే..ప్రతిరోజూ మంచి సూర్యరశ్మి లభించే ఆరుబయట గడపే యత్నం చేయాలి. కనీసం ఉదయం పది గంటల లోపు, అలాగే మధ్యాహ్నం మూడు గంటల మధ్య ముఖం, చేతులు, కాళ్లను సూర్యరశ్మికి బహిర్గతం చేయాలి. ఆహారం: సాల్మన్, మాకేరెల్, ఫిస్ రోయ్, పోర్టిఫైడ్ డైరీ, తృణధాన్యాలు, విటమిన్ డీ అధికంగా ఉండే ఆహారాలను చేర్చండి. డీ విటమిన్ సప్లిమెంట్లు: పెద్దలకు 400 ఐయూ యూనిట్లు, 70 ఏళ్లు పైబడిన వారు 800 ఐయూ యూనిట్లు సప్లిమెంట్లు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఎముకల నొప్పి, ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటే మాత్రం ఆరోగ్య నిపుణులను సంప్రదించి తగిన మోతాదులో ఈ సప్లిమెంట్లను వాడటం మంచిదని చెబుతున్నారు నిపుణులు. చివరిగా ఈ విటమిన్ లోపాన్ని అధిగమించాలంటే మాత్రం మెరుగైన ఆహారపు అలవాట్లు, సూర్యరశ్మికి బహిర్గతం అయ్యేలా చేయడం వంటి వాటితోనే సాధ్యమని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్‌కు ఓ రెస్టారెంట్ వినూత్న నివాళి..!) -
స్ట్రాంగ్ రోగ నిరోధక శక్తికి సరిపోయే బూస్టర్స్ ఇవే..!
వాతావరణం మారుతోంది. ఇప్పుడే ఎండ... అంతలోనే చిటపట చినుకులు... రాత్రి అయేసరికి చలి.. ఈ పరిస్థితులలో దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లునొప్పులు వంటివి చాలామందికి సర్వసాధారణం. మన రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా ఉన్నంతవరకు మనల్ని ఏ రుగ్మతా ఏమీ బాధపెట్టలేదు. అయితే అలా మన ఇమ్యూన్ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ కొన్ని చిట్కాలు పాటించడం అవసరం. అవి మన వంటింట్లో సులువుగా దొరికే సహజసిద్ధమైనవైతే మరీ మంచిది. అలాంటి చిట్కాలేమిటో చూద్దాం...పొద్దున్నే లేచి బ్రష్ చేసుకోగానే ఆమ్లా, చియా సీడ్స్ వాటర్ తాగితే చాలామంచిది. ఈ జ్యూస్ తాగితే జీవక్రియలు సక్రమంగా జరగడం తోపాటు ఒంటికి సరిపడా సీ విటమిన్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి.క్రమం తప్పకుండా ఈ డ్రింక్ తాగుతుంటే కొద్దిరోజుల తర్వాత చర్మం పట్టులా నిగారించడంతోపాటు వాపులు, నొప్పులు తగ్గి, శరీరం తేలిక పడుతుంది. తిన్న ఆహారం చక్కగా ఒంటికి పడుతుంది. జుట్టు బాగా పెరుగుతుంది. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. సుగర్ స్థాయులు అదుపులో ఉంటాయి. లివర్ పనితీరు బాగుంటుంది. కండరాలు దృఢపడతాయి. ఈ జ్యూస్ తయారీకి కావలసిందల్లా ముందుగా రెండు టీస్పూన్ల చియాసీడ్స్‌ను రాత్రిపూట నానబెట్టుకుని ఉంచుకోవాలి. పొద్దున లేవగానే చక్కగా కడిగి తరిగిన రెండు ఉసిరి కాయలను గింజలు తీసి రోటిలో వేసి దంచండి లేదా జ్యూసర్ లో అరగ్లాసు నీళ్లు కలుపుకుని రసం తీసి, వడ కట్టుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చియా సీడ్స్‌ను కలుపుకుంటే సరి! డ్రింక్ రెడీ!!(చదవండి: ‘నలుగురు కూతుళ్లేనా..’ కాదు డాక్టర్ డాటర్స్..!) -
నటి డైసీ రిడ్లీకి 'గ్రేవ్స్ వ్యాధి': ఎందువల్ల వస్తుందంటే..?
హాలీవుడ్ నటి, స్టార్ వార్స్ ఫేమ్ డైసి రిడ్లీకి 2023లో ఈ గ్రేవ్స్ వ్యాధి వచ్చినట్లు నిర్థారణ అయ్యింది. ఆమె ఇటీవలే తనకు వచ్చిన వ్యాధి గురించి ఉమెన్స్ హెల్త్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. తాను 'గ్రేవ్స్ డిసీజ్' అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు వివరించింది. ఇదొక "విచిత్రమైన అలసటగా" అభివర్ణించిది. ఇది శరీరమంతటా వ్యాపించి నిసత్తువుగా చేసేస్తుందంటూ బాధగా చెప్పుకొచ్చింది. అసలేంటి గ్రేవ్స్ వ్యాధి..?. ఎందువల్ల వస్తుందంటే..గ్రేవ్స్ వ్యాధి అంటే..?థైరాయిడ్ హార్మోన్ల అధిక ఉత్పత్తికి దారితీసే పరిస్థితిని హైపర్ థైరాయిడిజం అంటారు. ఈ పరిస్థితికి ఐరిష్ వైద్యుడు రాబర్ట్ గ్రేవ్స్ పేరు పెట్టారు. అతను 1800లలో తొలిసారిగా ఈ రుగ్మత గురించి వివరించాడు. గ్రేవ్స్ వ్యాధి అనేది స్వయం ప్రతిరక్షక ప్రతిస్పందన వల్ల వస్తుంది. ఇది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున థైరాయిడ్ గ్రంధిపై దాడి చేస్తుంది. దీంతో అధిక మొత్తంలో థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేసేందుకు కారణమవుతుంది. ఇప్పటి వరకు ఇలా ఎందుకు జరుగుతోందనేందుకు కారణాలు తెలియరాలేదు. ఇది కుటుంబ చరిత్ర, జన్యుపరిస్థితి, ఒత్తిడి వంటి వాటి కారణంగా వస్తుందని చెబుతుంటారు.లక్షణాలు:అలసట, బలహీనతవేగవంతమైన లేదా క్రమరహిత హృదయ స్పందనవణుకువిపరీతమైన ఆకలి, బరువు తగ్గడంఆందోళన, చిరాకు, మానసిక కల్లోలంతరచుగా ప్రేగు కదలికలుఉబ్బిన కళ్ళు (ఎక్సోఫ్తాల్మోస్), కళ్ల చుట్టూ ఉన్న మృదు కణజాలాల వాపుఇక్కడ నటి రిడ్లీ బరువు తగ్గడం, చేతి వణకు వంటి లక్షణాలు వచ్చినట్లు వివరించింది. ఈ అలసటను భరించలేని చిరాకుని కలిగిస్తుందని చెప్పుకొచ్చింది. ఆమె కొన్నేళ్లుగా శాకాహారి. ఈ రోగ నిర్థారణ తర్వాత నుంచి గ్లూటెన్ రహితంగా ఫుడ్ తీసుకోవడం మొదలుపెట్టినట్లు తెలిపింది. అంతేగాదు పలు ఆరోగ్య జాగ్రత్తులు తీసుకుంటున్నట్లు కూడా చెప్పింది. ప్రస్తుతం ఆమె ఆకుపంక్చర్, ఆవిరి స్నానాలు, క్రయోథెరపీ వంటివి తీసుకుంటోంది. ఈ వ్యాధిని జయించేందుకు కొద్దిపాటి వర్కౌట్ల తోపాటు మాససిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇచ్చేలా యోగా వంటి వాటిని చేస్తున్నట్లు వివరించింది. నిజానికి కొన్ని రకాల వ్యాధులు ఎందుకు వస్తాయనేందుకు ప్రత్యేక కారణాలు తెలియవు. అలాగే చికిత్స ఇది అని కూడా ఉండపోవచ్చు. అలాంటప్పుడూ మన రోజూవారి జీవనశైలిలో మార్పులు చేయడం, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం వంటి చిట్కాలతో ఎలాంటి వ్యాధినైనా జయించగలుగుతారు. ఈ నటి నుంచి స్పూర్తిగా తీసుకోవాల్సింది ఈ అంశాన్నే. ఏ వ్యాధి అయినా నయం అవ్వాలంటే మానసిక స్థైర్యం ఉంటేనే సాధ్యం అనేది గ్రహించాలి. (చదవండి: Monsoon Diet వర్షాకాలంలో తప్పనిసరిగా తినాల్సిన కూరగాయలివే..!) -
దోమ.. ప్రాణాంతకం! లాలాజలంలో వైరల్ ఆర్ఎన్ఏ గుర్తింపు
సాక్షి, అమరావతి: దోమ.. చూడటానికి చిన్నప్రాణే. కానీ.. ప్రపంచాన్ని వణికిస్తోంది. దోమను ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన ప్రాణిగా వర్జీనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ప్రకటించారు. రోగాలను మోసుకు రావడంలో ముందుండే దోమలు ఇప్పుడు మనిషి రోగనిరోధక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తున్నట్టు వెల్లడించారు. దోమ లాలాజలంలోని ఆర్ఎన్ఏ మానవ రోగ నిరోధక(ఇమ్యూనిటీ) వ్యవస్థను తీవ్రంగా నాశనం చేస్తున్నట్టు అధ్యయనంలో గుర్తించారు. సరికొత్త చికిత్సకు మార్గం దోమల ద్వారా సంక్రమించే వ్యాధులతో ఏటా ప్రపంచవ్యాప్తంగా 7.25 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో మలేరియాతో మరణించే వారి సంఖ్య 6 లక్షలు ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇక డెంగీ వ్యాధి బారిన పడుతున్న వారు 400 మిలియన్ల మంది ఉంటున్నారు. తీవ్రమైన జ్వరం, వాంతులు, చర్మంపై మచ్చలు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని సందర్భాలలో అంతర్గత రక్తస్రావంతో పాటు కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. డెంగీ వైరస్‌కు పూర్తిస్థాయిలో చికిత్స అందుబాటులోకి రాలేదని, డెంగీ లక్షణాలను తగ్గించే వైద్య పద్ధతులను మాత్రమే అనుసరిస్తున్నట్టు వర్జీనియా శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ప్రస్తుత అధ్యయనం ద్వారా డెంగీ చికిత్సకు, ఔషధాల తయారీకి కొత్త మార్గం లభించినట్టయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. వెలుగులోకి కొత్త విషయాలు ఇటీవల వర్జీనియా శాస్త్రవేత్తలు డెంగీ వైరస్‌పై పరిశోధనలు చేయగా.. కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. దోమల లాలాజలంలోని వైరల్ ఆర్ఎన్ఏ మనిషిలోని రోగ నిరోధక వ్యవస్థను అడ్డుకుంటున్నట్టు తేలింది. వర్జీనియా విశ్వవిద్యాలయానికి చెందిన బయోకెమిస్ట్ తానియా స్ట్రిలెట్స్ నేతృత్వంలోని బృందం మూడు వేర్వేరు విశ్లేషణ పద్ధతుల ద్వారా దోమ సెలైవా(లాలాజలం)పై అధ్యయనం చేశారు. ఇందులో నిర్దిష్ట రకమైన వైరల్ ఆర్ఎన్ఏ (రిబోన్యూక్లియిక్ యాసిడ్)ను గుర్తించారు. ఇందులో ‘ఎక్స్ట్రా సెల్యులర్ వెసికిల్స్’ అని పిలిచే మెంబ్రేన్ (పొర) కంపార్ట్మెంట్లలో సబ్ జెనోమిక్ ఫ్లేవివైరల్ ఆర్ఎన్ఏ (ఎస్ఎఫ్ ఆర్ఎన్ఏ) ద్వారా డెంగీ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని గుర్తించారు. వైరస్ ఇన్ఫెక్షన్ స్థాయిని ఎస్ఎఫ్ ఆర్ఎన్ఏ పెంచిందని బృందం ధ్రువీకరించింది. ఇది దోమ లాలాజలంలో ఉంటుందని, మనిషి రోగ నిరోధక శక్తిని ఎస్ఎఫ్ ఆర్ఎన్ఏ శక్తివంతంగా అడ్డుకుంటోందని తానియా స్ట్రిలెట్స్ వెల్లడించారు. ఈ సబ్ జెనోమిక్ ఫ్లేవివైరల్ ఆర్ఎన్ఏను కీటకాల ద్వారా సంక్రమించే జికా, ఎల్లో ఫీవర్ వంటి రోగాల్లో కూడా గుర్తించారు. దోమ కుట్టినప్పుడు డెంగీ ఉన్న లాలాజలాన్ని శరీరంలోకి చొప్పిస్తుందని, దాన్ని అడ్డుకునేందుకు మానవ శరీరంలో ఉండే రోగనిరోధక వ్యవస్థ చేసే దాడిని లాలాజలంలోని ఎస్ఎఫ్ ఆర్ఎన్ఏ అడ్డుకుంటోందని తేల్చారు. -
మీకు తెలుసా?
పాలు అనగానే సాధారణంగా గేదెపాలు లేదా ఆవుపాలే అందరికీ తెలుసు. అయితే ఇటీవల గాడిదపాలు, మేకపాలు కూడా కొందరు తాగుతున్నారు. ఇవే కాదు, కొబ్బరిపాలు కూడా ఉన్నాయి. పచ్చికొబ్బరిని కోరి లేదా ముక్కలు చేసి తగినన్ని నీళ్లు చేర్చి రుబ్బి, వడపోయడం ద్వారా కొబ్బరిపాలను తయారు చేయవచ్చు. కొబ్బరిపాలను తాగడం ద్వారా చాల ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాం... ♦ ఆవు పాలకు సమానమైన పోషకాలను కలిగి ఉంటాయి. ♦ యాంటీ వైరల్ గుణాలు సమృద్ధిగా ఉండటంతో రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ♦ శరీరంలో ఏర్పడే ఒత్తిడి తగ్గించడంతో పాటు కీళ్ల నొప్పులకు మందులా పనిచేస్తాయి. ♦ ఫాస్ఫరస్, కాల్షియం వంటి పోషకాలు ఉండడంతో దంతాలు, ఎముకలు బలంగా మారతాయి. మీ పిల్లలు మామూలు పాలు తాగడానికి మొగ్గు చూపనప్పుడు ఒకసారి కొబ్బరిపాలను పట్టించడానికి ప్రయత్నించండి. మంచి ఫలితం ఉంటుంది. -
చిన్నారుల్లో నిమోనియా!
చిన్న పిల్లల్లో నిమోనియా చాలా సాధారణంగా కనిపించే ఊపిరితిత్తుల వ్యాధి. మరీ ముఖ్యంగా ఐదేళ్ల కంటే వయసు తక్కువ చిన్నారుల్లో ఇది ఎక్కువగానే కనిపిస్తుంది. పెద్దల్లో వ్యాధి నిరోధక వ్యవస్థ బాగా పనిచేస్తుంటుంది కాబట్టి కాస్త తట్టుకుంటారు. కానీ పిల్లల్లో ఇమ్యూనిటీ అంతే పటిష్టంగా ఉండకపోవడం వల్ల ఒక్కోసారి ఇది ్రపాణాంతకమూ అయ్యే అవకాశముంది. ఇప్పుడున్న వైద్యపరిజ్ఞానంతో దీన్ని తేలిగ్గా తగ్గించవచ్చు కాబట్టి దీని పట్ల అవగాహన ముఖ్యం. బ్యాక్టీరియా, వైరస్, ఫంగై... ఇవన్నీ నిమోనియాకు కారణమవుతాయి. లక్షణాలు : నిమోనియా వల్ల పిల్లలందరిలోనూ ఒకేలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. ఏ కారణంగా నిమోనియా వచ్చిందనే అంశాన్ని బట్టి లక్షణాలు మారుతుంటాయి. సాధారణంగా కనిపించే లక్షణాలివి... ♦ దగ్గు వస్తుంటుంది. ఇది తెమడ/గళ్లను ఉత్పత్తి చేస్తుండటం వల్ల తడిదగ్గు ఎక్కువ. ♦ తీవ్రమైన జ్వరం. ♦ ఆకలి తగ్గిపోతుంటుంది. ♦ తీవ్రమైన అలసట, నీరసం, ♦ కొందరు పిల్లల్లో వాంతులు, విరేచనాలూ కావచ్చు. వైరల్ నిమోనియాలో ఊపిరి తీసుకోవడం కష్టం కావడం, ఆయాసం, ఊపిరి తీసుకుంటున్నప్పుడు శబ్దం రావడం (వీజింగ్) క్రమంగా కనిపిస్తాయి. బ్యాక్టీరియా కారణంగా వచ్చే నిమోనియా కంటే వైరల్ నిమోనియా ప్రమాదకరం. పిల్లల్లో వణుకు, ఆయాసం, తలనొప్పి, అయోమయం కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. నిర్ధారణ : ♦ ఛాతీ ఎక్స్‌రే, ♦ కొన్ని రక్తపరీక్షలు ♦ కళ్లె పరీక్ష ♦ సీటీ స్కాన్ (ఛాతీది) ♦ అవసరాన్ని బట్టి అరుదుగా బ్రాంకోస్కోపీ, ఊపిరితిత్తుల్లో నీరు చేరితే దాన్నీ పరీక్ష చేస్తారు. సెకండరీ నిమోనియా : పిల్లల్లో ఇంకేదైనా వ్యాధి (ముఖ్యంగా వైరల్ జ్వరాలు) వచ్చాక, అది నిమోనియాకు దారితీస్తే దాన్ని సెకండరీ నిమోనియా అంటారు. ఇది కాస్తంత ప్రమాదకరం. అందుకే హాస్పిటల్లో ఉంచి చికిత్స అందించాలి. ఇందులో తీవ్రతను బట్టి రక్తనాళం ద్వారా లేదా నోటి ద్వారా యాంటీబయాటిక్స్ ఇవ్వడం, సెలైన్ ఎక్కించడం, ఆక్సిజన్ ఇవ్వడం, పిల్లలు తమంతట తాము కళ్లె / గళ్ల తీయలేరు కాబట్టి వారు దాన్ని ఊసేసేలా వివరించి చెప్పడం, బాగా ఊపిరితీసుకోగలుగుతున్నారా అని చూడటం జరగాలి. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో చిన్నారులను తప్పనిసరిగా హాస్పిటల్లో ఉంచి చికిత్స అందించడం మేలు. నివారణ : ఇప్పుడు 13 రకాల నిమోనియాలకు తగిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ♦ అందరు పిల్లలకు ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాక్సిన్ వేయించాలి. వర్షాకాలానికి ముందు (ప్రీ–మాన్సూన్ పీరియడ్‌లో) ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. ♦ వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా పిల్లలకు శిక్షణ ఇవ్వడం, బాగా దగ్గుతున్న పెద్దలు, రోగగ్రస్తుల వద్దకు పిల్లలను కాస్త దూరంగా ఉంచడం, చాలాకాలం పాటు ధాన్యం నిల్వ ఉంచే గరిసెలకు, కోళ్ల వంటి పెంపుడు పక్షులకు పిల్లలను దూరంగా వంటి జాగ్రత్తలతో నిమోనియాను కొంతవరకు నివారించవచ్చు. అయితే పిల్లల్లో ఆగకుండా దగ్గు వస్తూ, ఆయాసం వస్తున్నప్పుడు ఒకసారి హాస్పిటల్లో చూపించి, తగిన చికిత్స తీసుకోవడమే మేలు. చికిత్స: బ్యాక్టీరియా వల్ల వచ్చే నిమోనియా మంచి యాంటీబయాటిక్స్‌తో తేలిగ్గా తగ్గిపోతుంది. అయితే వైరల్ ఇన్ఫెక్షన్తో నిమోనియా వస్తే దానికి నిర్దుష్టంగా మందులు లేకపోయినా కొన్నిసార్లు యాంటీవైరల్ మందులు ఇస్తారు. ఇలాంటి పిల్లలకు పుష్కలంగా నీళ్లు తాగించడం, గది కాస్తంత సౌకర్యంగా ఉండటంతో పాటు అందులో తగినంత తేమ ఉండేలా చూడటం, జ్వరం, దగ్గు వంటివి తగ్గడానికి లక్షణాలను బట్టి (సింప్టమాటిక్) చికిత్స ఇవ్వడం వంటివి చేస్తారు. - డా. శాశ్వత్ మొహంతీ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ అండ్ పీడియాట్రీషియన్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్, విశాఖపట్నం. ఫోన్ : 8882 730 730 www.rainbowhospitals.in -
క్యాన్సర్‌ను చంపే ‘ముసుగు మందు’..!
క్యాన్సర్‌కు చేసే చికిత్సలు చాలా కష్టంగా అనిపిస్తుంటాయి. దానికి కారణమూ ఉంది. క్యాన్సర్‌కు వాడే కీమో మందులైనా, రేడియేషన్ ఇచ్చినా... క్యాన్సర్ కణాలతో పాటు ఎన్నో కొన్ని / ఎంతో కొంత ఆరోగ్యకరమైన కణాలూ దెబ్బతింటాయి. చికిత్స తర్వాత సైడ్ఎఫెక్ట్స్ ఎలాగూ ఉండనే ఉంటాయి. ఆఖరికి శస్త్రచికిత్స చేసినా సరే... మళ్లీ పెరగకుండా ఉండేందుకు కొంత మార్జిన్ తీసుకుని, క్యాన్సర్ గడ్డకు ఆనుకుని ఉన్న మంచి కణాలనూ కొంతమేరకు తొలగిస్తుంటారు. చివరకు వ్యాధి నిరోధకతను పెంచడం ద్వారా క్యాన్సర్ కణాలనే నశింపజేసి, బాధితుల ఆయుష్షును పెంచే ఇమ్యూనోథెరపీల విషయంలోనూ ఇలాంటి నష్టం ఎంతో కొంతమేర జరుగుతుంది. ఒకవేళ మంచి కణాలకు ఏమాత్రం హాని చేయకుండా, కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే వెదికి వెదికి పట్టి తుదముట్టించే చికిత్స ప్రక్రియను కనుగొంటే ఎలా ఉంటుందన్న ఆలోచన చాలామంది శాస్త్రవేత్తల్లో ఉన్నప్పటికీ... యూనివర్సిటీ ఆఫ్ షికాగోకు చెందిన ప్రిట్జ్కర్ స్కూల్ ఆఫ్ మాలెక్యులార్ ఇంజనీరింగ్‌కు చెందిన కొంతమంది పరిశోధకులు ఓ ప్రయత్నం చేశారు. దాని ఫలితమే ఈ ముసుగు మందు!! దాని వివరాలివి... ముసుగు మందు పని తీరు ఇది క్యాన్సర్ కణాలకూ, ఆరోగ్యకరమైన కణాలకూ ఓ తేడా ఉంది. ఆరోగ్యకరమైన కణాలు క్రమపద్ధతిలో, నియమిత వేగంతో మాత్రమే పెరుగుతాయి. కానీ క్యాన్సర్ కణాల పెరుగుదల ఓ పద్ధతి లేకుండా చాలా వేగంగా కొనసాగుతుంది. ఇలా పెరగడానికి కొన్ని ఎంజైములు ఉత్పత్తి అవుతుంటాయి. కానీ అదే ఆరోగ్యకరమైన కణాలతో ఈ ఎంజైముల ఉత్పత్తి పరిమితంగా ఉంటుంది. ఈ తేడాలనే మరింత సురక్షితమైన ‘ఐఎల్–12’ వర్షన్‌ను రూపొందించడానికి శాస్త్రవేత్త లు ఉపయోగించుకున్నారు. దీని ఆధారంగా విపరీతంగా ప్రవర్తించే ఈ ‘ఐఎల్–12’ కణాలకు ఓ ‘మాలెక్యులార్ ముసుగు’ తొడిగారు. అవి క్యాన్సర్ గడ్డను చేరేవరకు వాటిపై ఆ ముసుగు అలాగే ఉంటుంది. చాలా వేగంగా ఉత్పత్తయ్యే కణజాలం ఎంజైములు తగిలినప్పుడు ఆ ముసుగు తొలగిపోతుంది. అంటే ఆ ఎంజైమే ఈ ముసుగును ఛిద్రం చేస్తుంది. అంటే... ‘ఐఎల్–12’ కణాలు క్యాన్సర్ గడ్డను చేరగానే ముసుగు తొలగిపోతుందన్నమాట. అక్కడ అవి తమ తీవ్రతా, వైపరీత్యం వంటి గుణాన్ని కోల్పోకుండా... అక్కడే తమ ప్రభావాలను చూపుతాయి. ఫలితంగా అక్కడ కిల్లర్ టీ–సెల్స్‌ను విపరీతంగా పెరిగేలా చేస్తాయవి. దాంతో క్యాన్సర్ గడ్డపై మాత్రమే ఆ తీవ్రత ప్రభావం తీక్షణంగా ఉంటుంది. మిగతా ఆరోగ్యకరమైన కణాలు సురక్షితంగా ఉంటాయి. ఒక క్లినికల్ పరీక్షలో ఈ అంశాన్ని ప్రయోగాత్మకంగా చూశారు. ‘ట్రోజెన్ డ్రగ్ డెలివరీ’ అనే కొత్త చికిత్సగా... ముసుగు వేసుకుని... లక్ష్యాన్ని చేరాక అక్కడ తీవ్రస్థాయిలో ప్రభావవంతంగా జరిగే ఈ చికిత్సనే ‘ట్రోజెన్ డ్రగ్ డెలివరీ’గా కూడా అభివర్ణిస్తారు. తమ యుద్ధతంత్రంలో భాగంగా... ఓ పెద్ద చెక్క గుర్రాన్ని తయారు చేసి, అందులో రహస్యంగా సైనికులను నింపి ఉంచి... శత్రువులకు బహూకరించాక... అందులోంచి ఒక్కపెట్టున సైనికులు వచ్చి దాడి చేసిన‘ట్రోజన్ వార్’ కథ తెలిసిందే. అందుకే ఈ చికిత్స ప్రక్రియకు ఆ పేరు పెట్టారు. అయితే... ఎంత ముసుగు వేసుకుని పోయినా కొన్నిసార్లు ఇది కొన్నిచోట్ల (మైక్రో ఎన్విరాన్మెంట్లో) అక్కడి కణాల కన్నుకప్పలేకపోవచ్చు. ఆ ఇబ్బందిని గనక అధిగమిస్తే... ఇమ్యూనోథెరపీనీ, కార్–టీ సెల్ థెరపీ (కైమరిక్ యాంటీజెన్ రీకాంబినెంట్ టీ సెల్ థెరపీ)ని... రెండింటినీ కలగలుపుకున్న ఈ థెరపీ మరింత సమర్థంగా రూపొందే అవకాశం ఉందనేది నిపుణుల భావన. అదే జరిగితే (జరిగే అవకాశాలే ఎక్కువ) ఇది తిరుగులేని చికిత్సగా ఆవిర్భవిస్తుందన్నది వైద్యశాస్త్రవేత్తలూ, నిపుణుల మాట. క్యాన్సర్ కణంపై రోగనిరోధక వ్యవస్థ పని చేసేదిలా! మన రోగనిరోధక వ్యవస్థలో సైటోకైన్స్ అనే ప్రోటీన్లు ఒక్కసారిగా దాడి చేసి హానికారక కణాలను తుదముట్టించడానికి ప్రయత్నిస్తాయి. ఈ ప్రయత్నంలో భాగంగా సైటోకైన్లు... తెల్లరక్తకణాల్లో ఒక రకానికి చెందిన ‘కిల్లర్ టీ–సెల్స్’ను పెద్ద ఎత్తున ప్రేరేపిస్తాయి. అప్పుడా ‘కిల్లర్ టీ–సెల్స్’ క్యాన్సర్ కణాలపై దాడి ప్రారంభిస్తాయి. ఈ దాడి ప్రభావపూర్వకంగా ఎలా జరగాలన్న అంశంపై ఈ సైటోకైన్ ప్రోటీన్లే... ‘కిల్లర్ టీ–సెల్స్’కు శిక్షణ అందిస్తాయి. ఇలా అవి క్యాన్సర్ కణాలనూ, గడ్డలనూ ఎదుర్కొని వాటిని సమూలంగా నాశనం చేయడానికి ప్రయత్నిస్తాయి. ఇలాంటి సైటోకైన్లలో ఒక రకమే ‘ఇంటర్‌ల్యూకిన్–12’. దీన్ని సంక్షిప్తంగా ‘ఐఎల్–12’ అని కూడా అంటారు. వాటి ప్రభావం ఇలా ఉంటుంది... ఐఎల్– 12ను కనుగొని దాదాపు 30 ఏళ్లయ్యింది. కానీ వీటిని చికిత్సలో ఉపయోగించినప్పుడు అవి వాపు, మంట కలిగించే అంశాలనూ పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తాయి. అంటే ఇన్ఫ్లమేటరీ మాలెక్యుల్స్ను పుట్టిస్తాయి. ఇవి దేహంలోని ఇతర కణాలను, ముఖ్యంగా కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. అందుకే... వీటిని ఉపయోగించాక కలిగే అనర్థాలూ, దుష్ప్రభావాల కారణంగా, ముఖ్యంగా కాలేయం వంటి కీలక అవయవాలకు జరిగే నష్టాల వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని... ఎఫ్‌డీఏ వీటిని చికిత్స ప్రక్రియలకు అనుమతించలేదు. ఆనాటి నుంచి శాస్త్రవేత్తలు ఒక ప్రయత్నాన్ని మొదలు పెట్టారు. క్యాన్సర్ కణాల పట్ల ఈ ‘ఐఎల్–12’ కణాల ప్రభావం తగ్గకూడదు. కానీ దేహం తట్టుకోగలిగేలా వాటిని రూపొందించాలి. ప్రయోగాత్మకంగా రెండు కేస్–స్టడీలివి... రొమ్ముక్యాన్సర్ వచ్చిన కొందరు బాధితులను పరిశీలించగా... సాధారణంగా ఇమ్యూనోధెరపీలో ఉపయోగించే ‘చెక్‌పాయింట్ ఇన్హిబిటార్’తో కేవలం 10 శాతం ఫలితాలు కనిపించగా... ఈ ‘మాస్క్డ్ ఐఎల్–12’తో 90 శాతం ఫలితాలు కనిపించాయి. ఇక ఒక పెద్దపేగు (కోలన్) క్యాన్సర్ కేస్–స్టడీలో ఈ ‘మాస్క్డ్ ఐఎస్–12’తో 100 శాతం ఫలితాలు కనిపించడం మరో విశేషం. డాక్టర్ సురేష్. ఏవీఎస్. మెడికల్ ఆంకాలజిస్ట్ -
యాంటీబయాటిక్స్ అతి వాడకంతో.. ముప్పే
బర్మింగ్‌హామ్: కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు చిన్నచిన్న నలతలకు సైతం యాంటీబయాటిక్స్ వాడుతూ పోతే చివరకు పెను ప్రమాదం కొనితెచ్చుకుంటారని సైంటిస్టులు హెచ్చరిస్తునే ఉన్నారు. అతిగా యాంటీబయాటిక్స్ వాడితే రోగనిరోధవ్యవస్థలో లోపాలు ఏర్పడతాయని, దీంతో ప్రమాదకరమైన ఫంగల్ వ్యాధులు సోకే ప్రమాదం పెరుగుతుందని తాజాగా మరో నూతన అధ్యయనం వెల్లడించింది. చిన్నపాటి వ్యాధి నుంచి ప్రమాదకరమైన ఇన్వాసివ్ కాండిడియాసిస్ సోకేందుకు కాండిడా అనే ఫంగస్ కారణం. ఈ ఫంగస్ సోకేందుకు యాంటీ బయాటిక్స్ అతివాడకం కూడా ఒక కారణమని యూనివర్సిటీ ఆఫ్ బిర్మింగ్‌హామ్ పరిశోధకులు గుర్తించారు. యాంటీబయాటిక్స్‌ను ఎక్కువగా వాడితే జీర్ణవాహికలోని ప్రయోజనకరమైన బాక్టీరియా(ప్రొబయాటిక్స్) నశిస్తాయి. దీంతో ఈ బాక్టీరియా స్థానంలో జీర్ణవాహికలో జీవనం సాగించే కాండిడా వంటి ఫంగి చేరతాయని పరిశోధన వెల్లడించింది. ఇదే సమయంలో సదరు వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగినా లేదా కీమోథెరపీ లాంటి చికిత్స తీసుకున్నా జీర్ణవాహిక నుంచి ఈ ఫంగి రక్త ప్రవాహంలోకి ప్రవేశించి కాండిడియాసిస్ను కలిగిస్తుంది. ఐసీయూలో పేషెంట్లకు అతిగా యాంటీబయాటిక్స్ అందిస్తే కేథటర్ నుంచి కూడా ఈ ఫంగస్ రక్తంలోకి సోకే ప్రమాదముందని తేలింది. ప్రయోగ వివరాలు యాంటీబయాటిక్స్ వాడకంతో ఫంగల్ వ్యాధులు సోకే అవకాశాలు పెరగడంపై పరిశోధనలో భాగంగా ముందుగా ఎలుకలకు యాంటీబయాటిక్ మిశ్రమాన్ని ఇచ్చారు. అనంతరం ఈ ఎలుకలకు కాండిడా ఫంగస్ సోకేలా చేశారు. మరో సమూహం ఎలుకలకు యాంటీబయాటిక్స్ ఇవ్వకుండా కేవలం ఫంగస్‌ను సోకేలా చేశారు. అనూహ్యంగా యాంటీబయాటిక్స్ వాడిన ఎలుకల్లో ఫంగస్ ఎక్కువ ఇన్ఫెక్షన్ కలిగించినట్లు కనుగొన్నారు. సాధారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకిన జీవుల్లో మూత్రపిండాలు బలహీనపడతాయి, దీంతో ఆ జీవులు అనారోగ్యం పాలవుతుంటాయి. ఈ ప్రయోగంలో ఎలుకలను మూత్రపిండాల బలహీనత కన్నా యాంటీబయాటిక్స్ మిశ్రమమే ఎక్కువ అనారోగ్యాన్ని కలిగించినట్లు గుర్తించారు. ఎలుకల్లోని సహజసిద్ధ యాంటీ ఫంగల్ ఇమ్యూన్ రెస్పాన్స్‌ను అది దెబ్బతీసిందని విశ్లేషించారు. రక్తంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ను గుర్తించే సైటోకైన్స్ అనే ప్రోటీన్ల ఉత్పత్తిని ఈ యాంటీబయాటిక్స్ తగ్గించాయి. దీంతో ఫంగస్ ఇన్ఫెక్షన్ను ఎదుర్కొనే రోగనిరోధకత ఈ ఎలుకల్లో తగ్గిపోయిందని తెలిసింది. సైటోకైన్స్‌ను విడిగా ఔషధ రూపంలో అందిస్తే యాంటీబయాటిక్ వల్ల ఫంగల్ వ్యాధులు సోకిన వారిలో మెరుగుదల ఉంటుందని నిపుణులు తెలిపారు. వాంకోమైసిన్ వల్ల ఫంగస్ ఇన్ఫెక్షన్ పెరిగే ప్రమాదం అధికమని గుర్తించారు. -
ఆ ఆలోచనతో 30 శాతం మరణం ముప్పు తగ్గుతుంది: హార్వర్డ్ పరిశోధన
‘‘సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా...’’ అన్నాడో కవి. సంతోషం సగం బలమే కాదు.. పూర్తి మనోబలం అంటున్నారు శాస్త్రవేత్తలు. పొద్దునలేస్తే వాట్సాప్‌లో ‘పాజిటివ్ థింకింగ్’కోట్స్... యూట్యూబ్, షేర్‌చాట్ అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ ‘బీ పాజిటివ్’అంటూ వీడియోస్. చుట్టూ ఇన్ని సమస్యలు పెట్టుకుని ఈ పాజిటివ్ గోలేంట్రా!? అని అనుకోని వారుండరు. ‘ఎవరెన్నైనా అనుకోనివ్వండి ఆలోచన అనేది మానసికంగానే కాదు.. శారీరక ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తుంది. ఆలోచన బాగుంటే చాలు... అంతా బాగుంటుంద’న్నది శాస్త్రవేత్తల మాట. అందులో నిజానిజాలేంటో నేడు ‘వరల్డ్ థింకింగ్ డే’ సందర్భంగా తెలుసుకుందాం. ‘ఆశ... క్యాన్సర్ ఉన్నవాడినైనా బతికిస్తుంది. భయం.. అల్సర్ ఉన్నవాడినైనా చంపేస్తుంది’అని ఓ సినిమాలో డైలాగ్. అది నిజమేనంటున్నారు శాస్త్రవేత్తలు. పెట్టుకునే ఆశ అయినా... పెంచుకునే భయం అయినా... ప్రభావితం చేసేది బ్రెయిన్. మనం ఏది చెప్తే అదే స్వీకరించే బ్రెయిన్.. శరీర భాగాలు అలాగే స్పందించేలా చేస్తుంది. ఏదైనా జబ్బుతో డాక్టర్ దగ్గరకు వెళ్తే.. ఆయన మిమ్మల్ని రిసీవ్ చేసుకున్న తీరు, ట్రీట్ చేసిన విధానం నచ్చకపోతే ఫలితం ఒకలా ఉంటుంది. చికిత్స ఇద్దరిదీ ఒకటే అయినా... డాక్టర్ రిసీవ్ చేసుకున్న విధానం, మీతో మాట్లాడిన తీరు, మీకిచ్చిన భరోసా బాగుంటే... అదే సగం జబ్బును తగ్గిస్తుంది. డాక్టర్ నుంచి వచ్చిన స్పందన, దాంతో వచ్చిన సంతృప్తి తాలూకు ఫలితం అది. ఇదే చాలా విషయాలకూ వర్తిస్తుందని సైంటిస్టులు అంటున్నారు. మరణం ముప్పు తగ్గుతుంది... సంతోషంగా సానుకూల దృక్పథంతో ఉంటే.. క్యాన్సర్ ముప్పును 16 శాతం తగ్గించుకోవచ్చు. హృద్రోగాలతో మరణించే రిస్క్‌ను 38 శాతం తగ్గించొచ్చు. శ్వాస సంబంధిత జబ్బుల మర ణాలనుంచీ 38% బయటపడొచ్చు. గుండెపోటుతో మరణించే రిస్క్‌ను 38% తగ్గించొచ్చు. ఇతర ఇన్ఫెక్షన్ల బారి నుంచి 52 శాతం తప్పించుకోవచ్చని అధ్యయనం వెల్లడించింది. సానుకూల ఆలోచనకు సంతోషానికి, ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉందని హార్వర్డ్ బృందం తెలిపింది. ఈ సానుకూల ధోరణి శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించి, యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలను పెంచుతుందట. అలాగే రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇవన్నీ కలిపి.. వివిధ జబ్బుల రిస్క్ నుంచి కాపాడతాయి. అవుట్‌కమ్ మీద ఆలోచనల ప్రభావం... కీడెంచి మేలెంచాలని సామెత. ఎప్పుడూ మేలే ఎంచాలనేది పాజిటివ్ థింకింగ్ థియరీ. ‘ఏదైనా చేయగలననుకుంటే.. మెదడు అటువైపు నడిపిస్తుంది. చేయలేననుకుంటే.. నీరుగారుస్తుంది’ అని న్యూజిలాండ్ విక్టోరియా యూనివర్సిటీకి చెందిన సైకాలజిస్టులు చెబుతున్నారు. ఇదేమీ మ్యాజిక్కాదు... ఆలోచనలే ఆచరణమీద ప్రభా వం చూపి అవుట్‌కమ్‌ను ప్రభావితం చేస్తాయట. యవ్వనం, ఫిట్నెస్కూడా మైండ్ గేమే అంటున్నారు. అయితే ప్రతీదానికి పాజిటివ్ ఉండమంటూ... మనిషిలో ప్రశ్నించే తత్వాన్ని దూరం చేస్తున్నారనే మరో వాదనా ఉంది. ఎనిమిదేళ్ల ఆయుష్షు... ఆలోచనలు సానుకూల దృక్పథంతో ఉంటే... అంత ఎక్కువ కాలం బతుకుతారని ఓ అధ్య య నం తేల్చి చెప్పింది. ఆలోచనా విధానం బాగుంటే చావును ఎనిమిదేళ్లు వాయిదా వేయొచ్చట. ఆలోచనా దృక్పథం ఆయుష్షును ఎనిమిదేళ్లు పెంచుతుందని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. అం దులోనూ మహిళల్లో ఈ ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని తేల్చి చెప్పింది. అందుకే... రోగులకు మంచి ఆహారం తీసుకోమని, వ్యాయామం చేయమని చెప్పడమే కాదు.. వారిని సానుకూల ఆలోచనలను వైపు నడిపించా లని పరిశోధక బృందానికి నాయ కత్వం వహించిన డాక్టర్ ఎరిక్కిమ్ వైద్యులకు సూచిస్తున్నారు. వాటివల్ల అనేక ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. హార్వర్డ్ ఈ పరిశోధనను 70వేల మంది మహిళల మీదే జరిపినా... పురుషులకూ ఇదే వర్తిస్తుందని అంటున్నారు. వివిధ జబ్బులతో బాధపడుతున్న మహిళలను కొన్నేళ్లపాటు పరీక్షించగా.. సానుకూల దృక్పథంతో ఉన్నవారిలో మరణం ముప్పు 30% తగ్గిందట. -
‘ఫ్లొరోనా’కలకలం..! లక్షణాలివే..
Pregnant woman in Israel was found to be infected with ‘florona’: ఓ వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్తు ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న తరుణంలో ఇజ్రాయెల్‌లో మరో కొత్త రకం వ్యాధి కలకలం రేపుతోంది. అక్కడ తొలి ‘ఫ్లొరోనా’ కేసు నమోదయ్యినట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం గురువారం మీడియాకు వెల్లడించింది. ఓ గర్భిణీ స్త్రీలో మొదటి కేసు వెలుగు చూసినట్లు తెలిపింది. ఐతే ఆమె ఇంతవరకూ వ్యాక్సిన్ వేయించుకోలేదని స్పష్టం చేసింది. ఇది కొత్త రకం వెరియంట్ కాదని, ఒకే సమయంలో ఫ్లూ, కోవిడ్లకు చెందిన రెండు రకాల వైరస్లు శరీరంలోకి ప్రవేశించడం వల్ల రోగనిరోధకత వ్యవస్థ విచ్ఛిన్నమై ఫొరోనా సోకి ఉండవచ్చని ఇజ్రాయెల్ వైద్యులు తెలిపారు. అంతేకాకుండా గత కొన్ని వారాలుగా దేశంలో ఇన్‌ఫ్లూయెంజా కేసులు పెరుగుతున్నాయని, ఈ క్రమంలో అది ఉద్భవించి ఉండవచ్చని పేర్కొన్నారు. దీంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై, కొత్త వ్యాధి వ్యాప్తి కట్టడికి పూనుకుంది. ఇమ్యునిటీ వ్యవస్థను బలపరిచేందుకు శుక్రవారం నుంచే కోవిడ్ 19 నాలుగో డోస్ వ్యాక్సిన్లు వేయడం ప్రారంభించింది. అలాగే అనారోగ్యంతో ఉన్న వృద్ధులకు కూడా కరోనా వ్యాక్సిన్ వేసేందుకు అనుమతించింది. ఇక మూడో డోస్ వేసి 4 నెలలు గడుస్తున్న కారణంగా రోగనిరోధకత తగ్గిన వ్యక్తుల కోసం బూస్టర్ డోస్‌లు వేసున్నామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ నాచ్మన్ యాష్ పేర్కొన్నారు. కాగా ఇజ్రాయెల్ దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. అక్కడి వైద్య శాఖ తాజా గణాంకాల ప్రకారం ఒక్క గురువారం నాడే 5000 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏమిటీ ఫ్లొరోనా? ఫ్లొరోనా అనేది కోవిడ్, ఇన్‌ఫ్లూయెంజా వైరస్లు ఒకే సమయంలో శరీరంలో ప్రవేశించడం వల్ల ఏర్పడిన డబుల్ ఇన్ఫెక్షన్. ఫ్లొరోనా వ్యాధి లక్షణాలివే.. ఫ్లొరోనా వ్యాధి తాలూకు లక్షణాలు కొంత ప్రమాదకరస్థాయిలో ఉన్నట్లు డేటా తెలుపుతోంది. ఐతే కోవిడ్-19 లక్షణాలతోపాటు గుండె కండరాలలో నొప్పి/మంట వంటి అదనపు లక్షణాలు కనిపిస్తాయి. అలాగే న్యుమోనియా, ఇతర శ్వాసకోశ సమస్యలతోపాటు, మయోకార్డిటిస్‌కు కూడా దారితీయవచ్చు. సరైన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోకపోతే రోగి మృతి చెందే ప్రమాదం కూడా ఉంది. ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యాధి తీవ్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌తో పాటు ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ సిఫార్సు చేస్తోంది. ఈ వ్యాధిని ఎదుర్కోవడంలో రోగనిరోధకత పాత్ర ఏమిటి? రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటే ఫ్లొరోనా ఇన్ఫెక్షన్ తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇమ్యునిటీని పెంపొందించుకునేందుకు బూస్టర్ డోసులు వేసుకోవడంతోపాటు, ఇతర జాగ్రత్తలు కూడా విధిగా పాటించాలని సూచిస్తున్నారు. చదవండి: Omicron: ‘ఆస్పత్రుల సామర్థ్యాన్ని తక్షణమే పెంచండి... ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేం!’ -
Covid Alert: 70 రెట్లు వేగంతో వ్యాపిస్తున్న ఒమిక్రాన్! నిపుణుల హెచ్చరికలు..
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 దేశాల్లో ఒమిక్రాన్ ఉధృతి కొనసాగుతోంది. ఏడాది ప్రారంభంలో గరిష్ఠ స్థాయిలో మారణహోమాన్ని రగిలించిన కోవిడ్ రెండో వేరియంట్ డెల్టాప్లస్ కంటే కూడా ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ శర వేగంగా విస్తరిస్తోంది. ఐతే తాజా అధ్యయనాల ప్రకారం త్వరలో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతాయని, వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి మూడో వేవ్ తాకే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దేశం మొత్తంలో 200 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఐతే డెల్టా ప్లస్ కంటే ఒమిక్రాన్ 70 రెట్లు వేగంగా వ్యాపిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ హాంగ్ కాంగ్ అధ్యయన నివేదిక వెల్లడించింది. అంతేకాదు రోగనిరోధక వ్యవస్థపై దాడిచేసి పతనంచేస్తుందని, రానున్న కాలంలో మరిన్ని వేరియంట్లు ఉద్భవించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటివరకూ వెలుగుచూసిన ఒమిక్రాన్ కేసుల్లో గొంతు నొప్పి, అలసట వంటి తేలికపాటి లక్షణాలు మాత్రమే బయటపడ్డాయి. ఇంట్లోనే తగు జాగ్రత్తలతో కోలుకుంటున్నారు కూడా. దేశంలో ఇప్పటివరకూ ఒక్క ఒమిక్రాన్ మృతి నమోదవ్వనప్పటికీ, అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం సంభవించడంతో యావత్ ప్రపంచం భయాందోళనల్లో ఊగిసలాడుతోంది. చదవండి: ఈ దగ్గుమందు చాలా ప్రమాదకరమైనది, పిల్లలందుకే మృతి చెందారు: డీజీహెచ్ఎస్ -
కరోనాకు ‘కత్తెర’ పడినట్టే!.. సరికొత్త చికిత్స అందుబాటులోకి
ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మందిని గడగడలాడిస్తున్న కరోనాకు ‘కత్తెర’ పడే టైం వచ్చేస్తోంది. కరోనా ఎన్ని కొత్త రూపాంతరాలు మార్చుకున్నా.. ఎన్నిమార్పులు చేసుకున్నా దొరకబుచ్చుకుని అంతం చేసే సరికొత్త చికిత్స అందుబాటులోకి రానుంది. అత్యంత ఆధునికమైన జన్యు ఎడిటింగ్ టెక్నాలజీతో కోవిడ్‌కు చెక్‌పెట్టే దిశగా ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. ఒక్క కరోనా అనే గాకుండా చాలా రకాల వైరస్‌లను ఈ విధానంలో నిర్మూలించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి ఈ పరిశోధన వివరాలు ఏమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ రూపు మార్చుకుంటూ.. భయపెడుతూ.. కరోనా వ్యాప్తి మొదలై ఏడాదిన్నర దాటింది. ఇప్పటికే రెండు వేవ్‌లతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఇబ్బందిపెట్టి.. లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటూ పంజా విసురుతోంది. శాస్త్రవేత్తలు పగలూరాత్రీ కష్టపడి వ్యాక్సిన్లను అభివృద్ధి చేసినా.. వాటి ప్రభావం నుంచి, మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఇలాంటి సమయంలో మళ్లీ ప్రపంచవ్యాప్తంగా కేసులు,మరణాలు పెరుగుతుండటంతో అలజడి మొదలైంది.కరోనాను పూర్తిస్థాయిలో ని ర్మూలించే చికిత్సలపై అందరిదృష్టిపడింది.ఈ క్ర మంలోనే ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ యూనివర్సి టీ ఇన్ఫెక్షన్ అండ్ ఇమ్యూనిటీ ఇన్స్టిట్యూట్, పీటర్ మెకల్లమ్ కేన్సర్‌సెంటర్ శాస్త్రవేత్తలు ‘క్రిస్పర్ క్యాస్’ సాంకేతికతతో కోవిడ్‌కు చెక్‌పెట్టే పరిశోధన చేపట్టారు. కరోనా మూలంపైనే టార్గెట్.. కోవిడ్ వైరస్‌లో అంతర్గతంగా జన్యు పదార్థం ఉండి.. దానిచుట్టూ కొన్ని ప్రొటీన్లు, ఆపై కొవ్వు పదార్థంతో కూడిన పొర, దానిపై స్పైక్ ప్రొటీన్లు ఉంటాయి. కరోనా వ్యాక్సిన్లుగానీ, ప్రస్తుతం చికిత్సలో వాడుతున్న యాంటీవైరల్ మందులుగానీ.. వైరస్‌లోని స్పైక్ ప్రొటీన్, మరికొన్ని ఇతర ప్రొటీన్లను టార్గెట్ చేస్తాయి. మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ కూడా వీటినే లక్ష్యంగా చేసుకుంటుంది. అయితే కరోనా వైరస్.. ఈ ప్రొటీన్లలో మార్పులు చేసుకుని, కొత్త వేరియంట్లుగా మారుతుండటంతో.. వ్యాక్సిన్లకు, మందులకు చిక్కడం లేదు. ఈ నేపథ్యంలోనే వైరస్‌లో మార్పు చెందకుండా ఉండే జన్యు పదార్థంపై నేరుగా దాడి చేసే చికిత్సపై మెల్బోర్న్ వర్సిటీ శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. ఏమిటీ ‘క్రిస్పర్ క్యాస్’? భూమ్మీద జీవులన్నింటికీ మూలాధారం జన్యువులే. ఒక రకంగా చెప్పాలంటే.. మనకు మెదడు ఎలాంటిదో, ప్రతి కణానికి డీఎన్ఏ పదార్థం అలాంటిది. ఆ కణం ఏమిటి? దాని విధులు ఏమిటి? కణంలోని భాగాలు ఏయే పనులు చేయాలి? ఏం ఉత్పత్తి చేయాలి? ఎలా వ్యవహరించాలి అన్నది జన్యువులే చూసుకుంటాయి. బ్యాక్టీరియాల వంటి సూక్ష్మజీవులు మొదలుకుని చెట్లు, జంతువులు, మనుషులు సహా అన్నిజీవుల కణాల్లో ఈ డీఎన్ఏ ఉంటుంది. ఇలాంటి జన్యువుల్లో మార్పులు, చేర్పులు చేయడం ద్వారా కణాల విధులు, లక్షణాల్లో మార్పులు తేవొచ్చు. ఇందుకు తోడ్పడే అత్యాధునిక సాంకేతికతనే ‘క్రిస్పర్ క్యాస్’. ఇందులో క్రిస్పర్ అనే వ్యవస్థ ద్వారా ‘క్యాస్–9’ అనే ఎంజైమ్ ఎంజైమ్‌ను ఉపయోగించి.. డీఎన్ఏను కత్తిరించడం, అందులోని ఏదైనా భాగాన్ని తొలగించడం, మరేదైనా భాగాన్ని కలపడం చేస్తారు. ఈ ‘క్రిస్పర్ క్యాస్9’ విధానాన్ని అభివృద్ధి చేసిన ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలు.. మ్యాక్స్‌ప్లాంక్ యూనిట్ ఆఫ్ సైన్స్‌కు చెందిన ఎమ్మాన్యుయెల్ చార్పింటర్, కాలిఫోర్నియా వర్సిటీ ప్రొఫెసర్ జెన్నిఫర్ దౌడ్నాలకు 2020 రసాయన శాస్త్ర నోబెల్ రావడం గమనార్హం. కరోనా జన్యు పదార్థాన్ని ముక్కలు చేసేలా.. జీవుల్లో జన్యుపదార్థం ‘డీఎన్ఏ’ రూపంలో ఉంటుంది. వైరస్లు పూర్తిస్థాయి జీవులు కాదు. వాటిలో ‘ఆర్ఎన్ఏ’ రూపంలో ఉంటుంది. క్యాస్9 ఎంజైమ్‌లు డీఎన్ఏను మాత్రమే కత్తిరిస్తాయి. దీంతో మెల్బోర్న్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఆర్ఎన్ఏను కత్తిరించగలిగే.. ‘క్యాస్13బీ’ ఎంజైమ్‌ను అభివృద్ధి చేశారు. ల్యాబ్‌లో కరోనాపై ప్రయోగించి చూశారు. ►‘‘ఈ ప్రయోగంలో కరోనా వైరస్‌ను గుర్తించిన ‘క్యాస్13బీ’ ఎంజైమ్.. దాని ఆర్ఎన్ఏకు అతుక్కుని, వైరస్ పునరుత్పత్తికి తోడ్పడే భాగాలను కత్తిరించేసింది. వేర్వేరు కరోనా వేరియంట్లపైనా ప్రభావవంతంగా పనిచేసింది’’ అని పరిశోధనకు నేతృ త్వం వహించిన శాస్త్రవేత్త షరోన్ లెవిన్ తెలిపారు. వ్యాక్సిన్ కాదు.. చికిత్స.. కరోనాకు మ్యూటేషన్ చెందే సామర్థ్యం ఎక్కువని, భవిష్యత్తులో వ్యాక్సిన్ల ప్రభావం తగ్గిపోతుందని షరోన్ లెవిన్ అభిప్రాయపడ్డారు. అందువల్ల కరో నా సోకిన తర్వాత అందించే చికిత్స కీలకమన్నారు. ప్రస్తుతం తాము రూపొందించినది ఒక రకంగా యాంటీ వైరల్ చికిత్స అని తెలిపారు. దీన్ని జంతువులపై ప్రయోగించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని.. తర్వాత మానవ ప్రయోగాలు చేపడతామన్నారు. ►క్రిస్పర్ క్యాస్ విధానం ద్వారా ఒక్క కరోనా మా త్రమేగాకుండా చాలా రకాల వైరస్‌లకు చెక్‌పెట్టవచ్చని షరోన్ తెలిపారు. ఇప్పటికే కేన్సర్, హెచ్ఐవీలను ఈ విధానంలో నియంత్రించేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయని వెల్లడించారు. -
స్త్రీ శక్తికి కరోనా సలామ్..!
స్త్రీ శక్తి స్వరూపిణి.. ఆడది అబల కాదు సబల.. అని పెద్దలు ఊరికే అనలేదు. ఈ మాటలను నిజం చేస్తున్నాయి తాజా పరిశోధనలు. రోగాల బారిన పడిన సందర్భాల్లో మగవారి కన్నా ఆడవారిలో అధిక రోగ నిరోధకత కనిపిస్తుందని పలు అధ్యయనాలు ప్రకటించాయి. తాజాగా కరోనా సైతం మహిళల్లో ఎక్కువ ప్రభావం చూపలేదని, మగవారిపై మాత్రం విరుచుకుపడుతోందని అమెరికాలోని యేల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన పరిశోధన చెబుతోంది. ఈ వివరాలను సైన్స్ సిగ్నలింగ్ జర్నల్‌లో ప్రచురించారు. లండన్: కరోనా వైరస్ సోకినప్పుడు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ స్పందించే తీరు ఆడవారిలో, మగవారిలో వేర్వేరుగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కరోనా సోకిన ఆడవారి కన్నా మగవారిలో లక్షణాలు ఎక్కువగా ఉంటాయని, చనిపోయే అవకాశం కూడా మగవారిలో అధికమని అధ్యయనం వెల్లడించింది. ఇమ్యూన్ రెస్పాన్స్‌కు సంబంధించిన ఒక మెటబాలిక్ పాత్వే మగవారిలో మాత్రమే కనిపించిందని తెలిపింది. కోవిడ్ పేషెంట్లలో ఆడవారితో పోలిస్తే మగవారిలో కైనూరెనిక్ యాసిడ్ స్థాయిలు అధికంగా ఉన్నట్లు పరిశోధన పేర్కొంది. ఈ యాసిడ్ ఎల్– ట్రిప్టోపాన్ అనే అమైనో ఆమ్ల జీవక్రియ(మెటబాలిజం)లో ఉత్పత్తి అయ్యే ఒక మెటబొలైట్(మెటబాలిజంలో ఉత్పన్నమయ్యే పదార్థం). నియాసిన్ అనే న్యూట్రియంట్ తయారవడంలో ఈ యాసిడ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ యాసిడ్ స్థాయిలు అధికంగా ఉంటే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు భావిస్తారు. ‘‘ఒక వ్యాధి సోకినప్పుడు శరీరంలో జరిగే బయోకెమికల్ మార్పులను అవగాహన చేసుకోవడం అవసరం. అప్పుడే సదరు వ్యాధికి కచ్చితమైన ఔషధాన్ని తయారు చేయగల మార్గాన్ని చేరగలం’’ అని పరిశోధకుల్లో ఒకరైన నికోలస్ రాట్రే చెప్పారు. తమ పరిశోధనను మరింత విస్తృతీకరించడం ద్వారా ఒక్కో మనిషి ఇమ్యూన్ వ్యవస్థను అర్ధవంతంగా విశ్లేషించవచ్చన్నారు. ఈ అధ్యయనం కోసం 22 మంది ఆడ, 17మంది మగ కోవిడ్ బాధితుల నుంచి రక్త నమూనాలు తీసుకున్నారు. అనంతరం 20 మంది వ్యాధి సోకనివారి నమూనాలతో వీటిని పోల్చి అధ్యయనం చేశారు. సుమారు 75 మెటబొలైట్స్‌ను సైంటిస్టులు ఈ పరిశోధనలో గమనించారు. వీటిలో 17 మెటబొలైట్స్ కరోనా వ్యాధితో సంబంధం కలిగిఉన్నట్లు, వీటిలో కైనూరెనిక్ యాసిడ్ స్థాయిలు మగ పేషెంట్లలో అధికంగా ఉండటాన్ని గుర్తించారు. ఆడవారిలోనే టీ సెల్స్ అధికం కోవిడ్ వచ్చిన మగ పేషెంట్లతో పోలిస్తే ఆడ పేషంట్లలో టీ సెల్ యాక్టివేషన్ అధికమని యేల్ యూనివర్సిటీ పరిశోధన నిరూపించింది. మనిషి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఈ టీసెల్స్ కీలక పాత్ర పోషిస్తాయి. బీ సెల్స్ లాగా ఇవి యాంటీబాడీలను ఉత్పత్తి చేయవు కానీ, నేరుగా హోస్ట్ కణాలను నాశనం చేస్తాయి. ఇదే సమయంలో ఇతర ఇమ్యూనిటీ కణాలను యాక్టివేట్ చేస్తాయి. వయసు పెరిగే కొద్దీ మగ కోవిడ్ పేషంట్లలో ఈ టీసెల్ రెస్పాన్స్ క్షీణిస్తోందని, కానీ ఆడ పేషెంట్లలో వయసుతో సంబంధం లేకుండా టీసెల్ యాక్టివిటీ ఉందని అధ్యయనం తెలిపింది. పరిశోధన కోసం 98 మంది ఆడ, మగ పేషెంట్ల నుంచి శాంపిల్స్ సేకరించారు. వ్యాధి ముదిరేకొద్దీ సైటోకైన్స్ పెరగడంతో సైటోకైన్ స్ట్రోమ్ అనే అవలక్షణం మగ పేషెంట్లలో మొదలైందని,దీంతో ఊపిరితిత్తుల్లో ద్రవాలు పెరగడం, ఆక్సీజన్ స్థాయిలు తగ్గడం, అవయవాలు పనిచేయకపోవడం వంటి సమస్యలు వచ్చాయన్నారు. ఆడ పేషెంట్లలో అధికంగా టీసెల్స్ పెరిగాయన్నారు. మగవారిలో టీసెల్స్ తక్కువగా విడుదల కావడంతో వారిలో వ్యాధి మరింత ముదిరిందని, ఆడవారిలో టీసెల్స్ యాక్టివిటీ పెరగడంతో వ్యాధి ముదరడం మందగించిందని గుర్తించారు. ఇమ్యూనిటీ రెస్పాన్స్ ఎక్కువ మానవ ఆవిర్భావం నుంచి పురుషుల్లో కన్నా మహిళల్లో వైరస్, బ్యాక్టీరియాలు కలిగించే వ్యాధులను ఎదుర్కొనే ఇమ్యూన్ రెస్పాన్స్ ఎక్కువని అధ్యయనాలు వివరిస్తున్నాయి. ఇందుకు కారణం ఎక్స్ క్రోమోజోములని గుర్తించారు. స్త్రీలలో ఎక్స్ ఎక్స్ అని రెండు క్రోమోజోములంటాయని, మగవారిలో ఒక ఎక్స్, ఒక వై క్రోమోజోమ్ ఉంటుందని తెలిసిందే! ఆడవారిలో ఉండే డబుల్ ఎక్స్ క్రోమోజోమ్ వారిలో బలమైన ఇమ్యూన్ రెస్పాన్స్‌కు కారణమని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు ఆడవారిలో విడుదలయ్యే ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్లు ఇమ్యూన్ రెస్పాన్స్‌ను ప్రోత్సహిస్తాయని గమనించారు. ఫ్లూ వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాత ఫ్లూ వైరస్‌కు గురైన మహిళల్లో మగవారి కన్నా రెండింతల యాంటీబాడీలు విడుదలవడం సైతం గుర్తించారు. మహిళల్లో రోగనిరోధకత అధికంగా ఉండడం మంచిదే కానీ కొన్ని కేసుల్లో ఈ ఓవర్ ఇమ్యూనిటీ వల్ల కొందరు ఆటో ఇమ్యూన్ వ్యాధుల బారిన పడే ప్రమాదాలున్నాయని సైంటిస్టులు వివరించారు. అందువల్లే ప్రపంచంలో మగవారి కన్నా ఆడవారు ఎక్కువగా ఇలాంటి ఆటో ఇమ్యూన్ వ్యాధుల బారిన పడుతుంటారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
ఎంతో కీలకమైన బాడీ క్లాక్ గురించి ఈ విషయాలు తెలుసా?
రాత్రి, పగలు తేడా లేకుండా శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ నిరంతరం పహారా కాస్తుంటుందని, ఎలాంటి చొరబాటు (వ్యాధి)పైనైనా వెంటనే స్పందిస్తుందని అందరం అనుకుంటాం! కానీ ఇటీవలి పరిశోధనలు ఇమ్యూనిటీ వ్యవస్థ పనితీరు రాత్రి ఒకలాగా, పగలు ఒకలాగా ఉంటుందని అలాగే టీకా ప్రభావం కూడా తీసుకున్న సమయాన్ని బట్టి తేడాగా ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం జీవ గడియారం లేదా బాడీ క్లాక్... అసలేంటీ బాడీ క్లాక్? ఇమ్యూనిటీపై దీని ప్రభావమేంటి? టీకా తీసుకునే సమయాన్ని బట్టి ప్రభావం మారుతుందా? చూద్దాం... బాడీ క్లాక్ లేదా జీవ గడియారం.. మనిషిలో ఒక్క రోజులో రూపుదిద్దుకోలేదు. ప్రస్తుత బాడీ క్లాక్ రూపొందడానికి లక్షల సంవత్సరాలు, వేల తరాలు పట్టింది. శరీరంలోని ఇమ్యూనిటీ కణాలతో సహా ప్రతి కణం ఈ గడియారంలో భాగమే! ప్రతి కణంలో కూడా టైమ్‌ను సూచించే ప్రోటీన్లుం టాయి. ఇవన్నీ సమాహారంగా పనిచేసి మనకు రాత్రి, పగలు తేడాను తెలియజేయడమేకాకుండా, తదనుగుణంగా పనిచేస్తుంటాయి. ఉదాహరణకు మధ్యాహ్నం ఒంటిగంటకు ఠంచనుగా ఆకలవుతుంది. కానీ అర్ధరాత్రి అదే సమయానికి నిద్రలో ఉంటాము. అంటే మన బాడీక్లాక్ మనం ఎప్పుడు ఏ పనిచేయాలని సమయానుగుణంగా తెలియజేస్తుంటుంది. ఈ ప్రక్రియను కొనసాగించేందుకు బాడీక్లాక్ 24 గంటల రిథమ్స్‌ను ఉత్పత్తి చేస్తుంటుంది. వీటిని సిర్కాడియన్ రిథమ్స్ అంటారు. ఈ రిథమ్స్కు అనుగుణంగా ఆయా కణాలు ఆయా పనులు చేస్తుంటాయి. ఇందుకు మరో ఉదాహరణ.. రాత్రి అయినప్పుడు మాత్రమే శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తి అవుతుంది. ఈ రసాయనం మూలంగా మనం అలసిన ఫీలింగ్ కలిగి నిద్రలోకి జారుకుంటాము. ఒక్కోసారి ఒక్కోలా..: ఇమ్యూనిటీపై బాడీ క్లాక్ ప్రభావం గుర్తించేందుకు చేసిన ప్రయోగాల్లో ఆశ్చర్యకరమైన అంశాలు బయటపడ్డాయి. ఒకే తరహా సూక్ష్మక్రిమి మన శరీరంలోకి ప్రవేశించి వ్యాధిని కలిగించినా, అది పగలు ప్రవేశించిందా? రాత్రి ప్రవేశించిందా? అనే అంశం ఆధారంగా వ్యాధి తీవ్రత ఉంటుందని ప్రయోగాలు వెల్లడిస్తున్నాయి. అలాగే వ్యాధులను అరికట్టేందుకు మనం తీసుకునే ఔషధాలు అవి తీసుకున్న సమయాన్ని బట్టి కూడా పనితీరులో తేడాలు చూపుతాయని తేలింది. ఉదాహరణకు నిద్రించేసమయంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి, రాత్రి సమయంలో కొలెస్ట్రాల్ తగ్గించే ఔషధం తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నమాట! టీకా టైమ్..: ఇమ్యూనిటీపై జీవగడియార ప్రభావం ఇంతలా ఉందంటే, వ్యాక్సిన్లపై కూడా దీని ప్రభావం అధికంగానే ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. నిజానికి టీకా అనేది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపైకి జరిపే ఉత్తుత్తి దాడి. టీకా కారణంగా ఇమ్యూనిటీ కణాలు సదరు ఇన్ఫెక్షన్ను మెమరైజ్ చేసుకుంటాయి. అందువల్ల టీకా తీసుకునే సమయం కూడా దాని పనితీరుపై ప్రభావం చూపుతుందన్నది నిపుణుల మాట. ఇందులో నిజానిజాలు తెలుసుకునేందుకు పలువురికి ఒక్కరోజులో వివిధ సమయాల్లో ఇన్‌ఫ్లూయెంజా టీకా ఇచ్చి పరిశోధన చేశారు. వీరిలో ఉదయం 9–11 గంటల మధ్య టీకా తీసుకున్నవారిలో మధ్యాహ్నం తీసుకున్నవారి కన్నా అధిక యాంటీబాడీల ఉత్పత్తి కనిపించింది. అలాగే మరికొందరిపై బీసీజీ టీకా ఇచ్చి చూడగా, వీరిలో సైతం ఉదయం పూట టీకా తీసుకున్నవారిలో మధ్యాహ్నం బ్యాచ్ కన్నా ఎక్కువ నిరోధకత కనిపించింది. అలాగే హెపటైటిస్ టీకా తీసుకున్నవారు ఆ రోజు తగినంత నిద్రపోతే వారిలో సైతం అధిక యాంటీబాడీలు కనిపించినట్లు తెలిసింది. జీవగడియారం, నిద్ర, ఇమ్యూనిటీ మధ్య ఒక సంబంధం ఉందని, దీంతో ఉదయం పూట టీకా తీసుకోవడం మరింత ప్రభావకారకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కసారి గుర్తిస్తే చాలు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో పలురకాల ఇమ్యూనిటీ కణాలుంటాయి. ఇవన్నీ ఎల్లప్పుడూ శరీరంలోకి జరిగే చొరబాట్లను పసిగట్టేందుకు పహారా కాస్తుంటాయి. అయితే వీటిలో ఏ కణాలు, ఏ ప్రాంతంలో, ఏ సమయంలో పహారా కాయాలనేది జీవ గడియారం నిర్దేశిస్తుందని తాజా పరిశోధన వెల్లడిస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పగటి పూట ఈ కణాలు కణజాలాల్లో ఉండిపోయి, రాత్రుళ్లు శరీరమంతా తిరుగుతుంటాయి. ఇమ్యూనిటీ కణాల సిర్కాడియన్ రిథమ్ ఏర్పడేందుకు వేల ఏళ్లు పట్టింది. ఒకప్పుడు ఆదిమానవుడు ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశాలుండేవి. ఆ రోజుల్లో ఈ రిథమ్ రూపుదిద్దుకోవడం ఆరంభించింది. రాత్రుళ్లు ఈ కణాలు శరీరమంతా తిరిగి లింఫ్ గ్రంథుల్లో ఆగి ఆ రోజు మొత్తం మీద ఎదుర్కొన్న అంశాలను జ్ఞప్తీకరించుకుంటాయి. అంటే భవిష్యత్‌లో ఎప్పుడైనా అవి అప్పటికే ఎదుర్కొన్న ఇన్ఫెక్షన్ లక్షణాలు గుర్తిస్తే తదనుగుణంగా స్పందిస్తాయన్నమాట. కరోనా టీకా.. కిం కర్తవ్యం? ప్రస్తుతం కరోనా సంక్షోభ సమయంలో ప్రపంచమంతా వ్యాక్సినేషన్ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఈ సమయంలో కోవిడ్ వైరస్‌పై బాడీ క్లాక్ స్పందన చాలా కీలకంగా మారింది. కోవిడ్ 19 వైరస్ మానవ శరీర కణాల్లోకి ప్రవేశించేందుకు అవసరమైన కణ గ్రాహకాలు(సెల్ రిసెప్టార్లు) బాడీక్లాక్ కంట్రోల్లో ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. మానవ శ్వాసకోశ మార్గంలో ఈ రిసెప్టార్లు రోజులో కొన్ని సమయాల్లో అధిక చురుగ్గా ఉంటాయని తేలింది. అంటే అలాంటి సమయాల్లో కరోనా సోకే అవకాశాలు ఎక్కువ. కానీ ఈ విషయమై ఇంకా లోతైన పరిశోధనలు జరగాల్సిఉంది. బాడీక్లాక్‌ను అనుసరించి కోవిడ్ టీకా ఏ సమయంలో తీసుకుంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందనే అంశంపై కూడా ఇంకా పూర్తి పరిశోధనలు జరగాల్సిఉంది. కానీ సంక్షోభ సమయంలో ఫలానా టైంలోనే టీకా తీసుకోవాంటే కుదిరేపని కాదు కాబట్టి, ఎవరి వీలును బట్టి వారు టీకా తీసుకోవడమే ప్రస్తుతం చాలా ముఖ్యం. కానీ భవిష్యత్‌లోనైనా బాడీక్లాక్‌ను అనుసరించి ‘‘సరైన’’ సమయంలో టీకా తీసుకోవడం అధిక ప్రభావశీలంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భుజంపైనే టీకాలు ఎందుకు?
ఇండియానాపొలిస్(అమెరికా): దేశం మొత్తమ్మీద కోవిడ్–19 నిరోధక టీకాలు తీసుకున్న వారి సంఖ్య 20 కోట్లకు చేరువ అవుతోంది. తొలి డోసు ఎడమ భుజంపై, రెండో డోసు ఇంకో భుజంపై తీసుకోవడం మనలో చాలామంది గమనించే ఉంటారు. పోలియో, రోటా వైరస్ వంటి వ్యాధుల నిరోధానికి ఉపయోగించే వ్యాక్సిన్లను నోటిద్వారా, మరికొన్ని టీకాలను చర్మం కింద ఇస్తూంటే.. కోవిడ్ టీకాలను ఇంట్రామస్క్యులర్ అంటే భుజం కండరాల ద్వారా మాత్రమే ఎందుకిస్తున్నారు? ఆసక్తికరమైన ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే... భుజం పైభాగంలో ఉండే డెల్టాయిడ్ కండరాల్లో రోగనిరోధక వ్యవస్థ తాలూకూ ముఖ్యమైన కణాలు ఉంటాయి. వైరస్ తాలూకూ అవశేషాలను అంటే యాంటిజెన్లను ఇవే గుర్తిస్తాయి. టీకాలను.. వైరస్‌ను నిర్వీర్యం చేయడం ద్వారా లేదా అందులోని భాగాలతో తయారు చేస్తారన్నది ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఈ యాంటిజెన్లను గుర్తించే కణాలు ఉండే డెల్టాయిడ్ కండరం వద్ద టీకా ఇస్తే రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయడం, తద్వారా యాంటీబాడీల సృష్టి వేగంగా జరుగుతుందన్నమాట. కొన్ని రకాల కోవిడ్ టీకాల్లో యాంటిజెన్లు ప్రత్యక్షంగా లేకపోయినా వాటిని తయారు చేసే ప్రణాళిక ఉంటుంది. కండరాల్లోని రోగనిరోధక వ్యవస్థ కణాలు వీటికీ తేలికగానే స్పందిస్తాయి. టీకాను రోగ నిరోధక వ్యవస్థ కణాలు గుర్తించగానే యాంటిజెన్ల వివరాలను వినాళ గ్రంథులకు అందజేస్తాయి. ఈ వినాళ గ్రంథుల్లో మరిన్ని రోగ నిరోధక వ్యవస్థ కణాలు యాంటిజెన్లను గుర్తించి యాంటీబాడీలను తయారు చేసే ప్రక్రియ మొదలయ్యేలా చేస్తాయి. వినాళ గ్రంథులకు దగ్గరగా ఉండటం భుజంపై టీకా ఇవ్వడానికి ఇంకో కారణం. బాహు మూలాల్లో ఈ వినాళ గ్రంధులు ఉంటాయి. యాంటిజెన్లతోపాటు టీకాలో ఉండే ఇతర పదార్థాలు రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజితం చేసేందుకు ఉపయోగపడతాయి. స్థానికంగా కట్టడి... వ్యాక్సిన్ వేసుకున్నాక శరీరంపై దద్దుర్లు, ఎర్రటి మచ్చలు రావొచ్చు. భుజం కండరాల్లో వ్యాక్సిన్ ఇస్తే... ఇలాంటి వాటిని స్థానికంగా కట్టడి చేసే శక్తి డెల్టాయిడ్ కండరాలకు ఉంటుంది. అంతేకాకుండా కొవ్వు పేరుకుపోయే చోట ఉండే కండరాలకు ఇస్తే శరీరమంతటా దద్దుర్లు, ర్యాష్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే కొవ్వు పట్టిన చోట కండరాలకు రక్త సరఫరా సరిగా ఉండదు. ఫలితంగా వ్యాక్సిన్లను సరిగా సంగ్రహించలేవు. వీటితో పాటు భుజంపై టీకా తీసుకోవడానికి ఎవరికీ అభ్యంతరాలుండవు. టీకాను భుజంపైనే ఇవ్వడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. -
దేశంలో పంజా విసురుతున్న మ్యూకోర్మైకోసిస్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 మహమ్మారి బారినపడి, కోలుకున్నవారిలో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. బ్లాక్ ఫంగస్ రూపంలో మృత్యువు కాటేస్తోంది. గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ ఆనవాళ్లు బయటపడ్డాయి. బ్లాక్‌ఫంగస్‌గా పిలిచే మ్యూకోర్మైకోసిస్ సంక్రమణ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నుంచి కోలుకున్నవారిలో ఈ బ్లాక్ ఫంగస్ కనిపిస్తోంది. మహారాష్ట్రలో మ్యూకోర్మైకోసిస్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా శనివారం కనీసం 8 మంది కోవిడ్–19 రోగులు ప్రాణాలు కోల్పోయారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బ్లాక్ ఫంగస్ కేసులు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. ఢిల్లీలో రెండు రోజుల వ్యవధిలో ఆరుగురు బ్లాక్ ఫంగస్ బారిన పడి చికిత్స కోసం సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. గుజరాత్‌లోని సూరత్‌లో కిరణ్ సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో 50 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. చికిత్స కోసం మరో 60 మంది ఎదురు చూస్తున్నారు. ఈ బాధితులంతా ఇటీవలే కోవిడ్ నుంచి బయటపడిన వారే కావడం గమనార్హం. కరోనా చికిత్స సమయంలో రోగికి ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉన్నప్పుడు ఆ కారణంగా ఏర్పడే తేమ వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ వారి రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేసి ప్రాణాంతకంగా మారుతోందని మహారాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (డీఎంఈఆర్) అధిపతి డాక్టర్ తత్యారావు లాహనే వెల్లడించారు. రోగి మెదడుకు ఫంగస్ చేరుకుంటే అది ప్రాణాంతకమని స్పష్టం చేశారు. రోగి ప్రాణాలను కాపాడేందుకు కళ్లలో ఒకటి శాశ్వతంగా తొలగించాల్సి ఉంటుందన్నారు. మ్యూకోర్మైకోసిస్ సాధారణ లక్షణాలు తలనొప్పి, జ్వరం, కళ్ల కింద నొప్పి, పాక్షికంగా దృష్టి కోల్పోవడం వంటివి ఉన్నాయని తెలిపారు. ఈ బ్లాక్ ఫంగస్ చికిత్సలో భాగంగా ఒక్కొక్కటి రూ.9 వేల విలువైన ఇంజెక్షన్లను 21 రోజుల పాటు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. చదవండి: (కరోనాతో ఊపిరి సమస్యలే కాదు.. మరో పెనుముప్పు కూడా!) -
డబుల్ మ్యూటెంట్.. పేరు వింటేనే దడపుట్టేస్తోంది!
డబుల్ మ్యూటెంట్... ఇప్పుడు ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాల్లో దడ పుడుతోంది. భారత్‌లో తొలిసారిగా కనిపించి, 10 దేశాలకు విస్తరించిన ఈ కొత్త రకం మ్యూటెంట్ ఎంత ప్రమాదకరమో, వ్యాక్సిన్లకు లొంగుతుందో లేదో తెలియక, తలో మాట వినిపిస్తూ ఉండడంతో ఇంటా, బయటా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వేరియెంట్ల కంటే భారత్‌లో డబుల్ మ్యూటెంట్ మరింత ప్రమాదకరమైనదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా కేంద్రం దానిని తక్కువ చేసిన చూపించడానికే ప్రయత్నాలు చేస్తోంది. దేశంలో రోజుకి 2 లక్షలకు పైగా కేసులు నమోదవుతూ వస్తున్నప్పటికీ రెండుసార్లు రూపాంతరం చెందిన వైరస్‌కు, కేసుల పెరుగుదలకి ఎలాంటి సంబంధం లేదని వాదిస్తోంది. అయితే, ఈ డబుల్ మ్యూటెంట్ శరవేగంగా వ్యాపించడమే కాకుండా, శరీరంలోని రోగనిరోధక వ్యవస్థని దెబ్బతీస్తుందని అశోకా యూనివర్సిటీ త్రివేది స్కూలు ఆఫ్ బయో సైన్సెస్ డైరెక్టర్, ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్ షాహిద్ జమీల్ చెప్పారు. 10 దేశాల్లో డేంజర్ బెల్స్ భారత్‌కు చెందిన డబుల్ మ్యూటెంట్ వైరస్ ఇప్పటివరకు ఆస్ట్రేలియా, బెల్జియం, జర్మనీ, ఐర్లాండ్, నమీబియా, న్యూజిలాండ్, సింగపూర్, యూకే, యూఎస్, ఇజ్రాయెల్‌లో వెలుగులోకి వచ్చింది. బ్రిటన్, బ్రెజిల్ తరహా వేరియెంట్ల కంటే వ్యాప్తిలోనూ, రోగనిరోధక శక్తిని దెబ్బ తీయడంలోనూ ఇది ప్రమాదకరం కావడంతో డబ్ల్యూహెచ్‌వో కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. వ్యాక్సిన్‌కు లొంగుతుందా ? డబుల్ మ్యూటెంట్ వ్యాక్సిన్లకు లొంగుతుందా లేదా అన్న దిశగా పరిశోధనలు సాగుతున్నాయి. భారత్ డబుల్ మ్యూటెంట్‌పై ఇజ్రాయెల్ చేసిన పరిశోధనల్లో ఫైజర్ వ్యాక్సిన్ ఈ వైరస్‌ను పాక్షికంగా అరికట్టగలదని తేల్చింది. ఆ మర్నాడే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ దీనిని సమర్థంగా అడ్డుకోగలదని వెల్లడించింది. కరోనాలో వివిధ రకాల వేరియెంట్లతో పాటుగా డబుల్ మ్యూటెంట్ని కూడా ఈ వ్యాక్సిన్ బలంగా అడ్డుకున్నట్టుగా ఐసీఎంఆర్ బుధవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ‘‘కరోనా వైరస్ విజృంభణని అరికట్టడానికి గల అవకాశాలను పరిశీలించడానికి బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాతో పాటు భారత్ డబుల్ మ్యూటెంట్ కరోనా వైరస్‌ని విజయవంతంగా ఐసోలేట్ చేసి కల్చర్ చేశాము. కోవాగ్జిన్ వ్యాక్సిన్ అన్ని రకాల మ్యుటేషన్లను అడ్డుకుంటుందని మా పరిశోధనల్లో తేలింది’’అని ఐసీఎంఆర్ వెల్లడించింది. కాగా తమ కోవాగ్జిన్ టీకా సాధారణ, సీరియస్ కోవిడ్ కేసుల్లో 78% సమర్థతతో పనిచేస్తున్నట్లు మూడోదశ మధ్యంతర విశ్లేషణలో వెల్లడైందని భారత్ బయోటెక్ ప్రకటించింది. – నేషనల్ డెస్క్, సాక్షి ఎంత ప్రమాదకరం ►గత ఏడాది అక్టోబర్‌లో తొలిసారిగా డబుల్ మ్యూటెంట్ని కనుగొన్నారు. ►రెండుసార్లు జన్యు మార్పిడికి లోనైన రూపాంతరాలు ఈ484క్యూ, ఎల్452ఆర్లు కలిసి కనిపించే ఈ కొత్త రకాన్ని బి.1.617 అని పిలుస్తున్నారు ►మహారాష్ట్రలో మార్చిలో వచ్చిన కేసుల్లో 15–20 శాతం డబుల్ మ్యూటెంట్ ఉన్నప్పటికీ కేంద్రం దాని తీవ్రతను గుర్తించలేదు. ►ప్రసుతం దేశంలో నమోదవుతున్న కేసుల్లో 52% డబుల్ మ్యూటెంట్ కేసులే కాగా ముంబై వంటి నగరాల్లో 60 శాతానికి పైగా ఇదే రకానికి చెందినవి. ►డబుల్ మ్యూటెంట్ వైరస్ 20శాతం అధికవేగంతో వ్యాప్తి చెందుతుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థని 50% తగ్గిస్తుంది. ►దేశంలోని 10 రాష్ట్రాల్లో డబుల్ మ్యూటెంట్ కేసులు కనిపిస్తున్నప్పటికీ నమోదవుతున్న కేసుల్లో తేడాలున్నాయి -
రౌడీ క్యాన్సర్లను రఫ్ఫాడించేద్దాం రండి!
సమాజంలో రకరకాల మనుషులుంటారు. దేహంలో కణాలూ అంతే. వాటిల్లో ఎన్నెన్నో రకాలు. సమాజంలోని వ్యక్తులంతా సమాజం విధించిన నియమ నిబంధనలను పాటిస్తూ, చట్టాన్ని గౌరవిస్తూ ఉంటారు. దేహంలోని కణాలూ అంతే. జీవక్రియల విషయంలో తమకు అస్పగించిన విధులను నిర్వర్తిస్తూంటాయి. అయితే సమాజంలోని కొందరు వ్యక్తులు మాత్రం సామాజిక నియమనిబంధనలను లెక్కచేయరు. వారెంతో బలంగా మారతారు. ఎవరికీ లొంగరు. తమ బలం తో చట్టాలను అతిక్రమిస్తారు. వారినే ‘రౌడీ‘లనీ, సంఘవ్యతిరేక శక్తులనీ అంటాం. సమాజంలో వారెలాగో... కణాల్లోనూ జీవక్రియల నియమ నిబంధనలను అతిక్రమించే రౌడీకణాలే క్యాన్సర్ కణాలనుకోవచ్చు. ఈరోజు ‘వరల్డ్ క్యాన్సర్ డే’ సందర్భంగా క్యాన్సర్ అంటే ఏమిటో చాలా తేలిగ్గా అర్థం చేసుకునేందుకు... క్యాన్సర్‌ను సమాజం లోని సంఘవిద్రోహశక్తులతో పోలుస్తూ ఇస్తున్న ప్రత్యేక కథనమిది. రోడ్డు మీద అందరూ ఎడమపక్కనే నడవాలి. రెడ్‌లైట్ పడితే ఆగాలి. గ్రీన్‌లైట్ పడ్డప్పుడు జీబ్రాక్రా సింగ్ దగ్గర రోడ్డు దాటాలి. ఇవి సామాజిక నియమాలు. వీటిని పాటిస్తే ప్రమాదాలే జరగవు. రౌడీ కుర్రాళ్లు రెడ్‌లైట్ పడ్డాక కూడా బైక్‌ను దాటిస్తారు. జీబ్రాక్రాసింగ్ వద్ద జనాలు వెళ్తున్నప్పుడే వాళ్ల మీదికి వాహనాన్ని తీసుకెళ్తారు. ఏమాత్రం నియమ నిబంధనలను పాటించరు. అచ్చం ఇలాగే దేహంలోని క్యాన్సర్ కణం కూడా. నిశ్చితంగా ఒకేవిధంగా విభజితం కావాల్సిన కణాలు అలా కావు. నిర్దిష్టంగా పెరగాల్సిన ఒకవేపునకు పెరగవు. ఇష్టం వచ్చినట్లు దేహమంతా పాకేస్తాయి. ఆరోగ్య కణాలమీదికి దాడి చేస్తాయి. దోపిడీలూ, కబ్జాలు చేసే రౌడీ క్యాన్సర్ కణాలు M. G. Naga Kishore Chief Surgical Oncologist, Omega Hospitals, Guntur Ph: 0863 2223300 సమాజంలో మామూలు వ్యక్తులు దొంగతనాలు చేయగలరా? దోపిడీలకు పాల్పడగలరా? కబ్జాలు చేయగలరా? వారికా ధైర్యం ఉంటుందా? ఉండదు. కేవలం రౌడీతనంతో వ్యవహరించే వారే ఈ పనులన్నీ చేయగలరు కదా. అలాగే కణాల్లోనూ రౌడీ కణాల్లాంటి ఈ క్యాన్సర్ కణాలు దోపిడీలూ, కబ్జాలూ, మోసాలు చేస్తాయి. అదెలాగో చూద్దాం. దేహకణాల మనుగడకు ఆహారం, ఆక్సిజన్ కావాలి. ఇది రక్తం ద్వారా అందుతుంది. ఏ కణానికి ఎంత అవసరమో ఆయా కణాలు అంతే తీసుకుంటాయి. కానీ క్యాన్సర్ కణాలు తమకు కావాల్సిన ఆహారం, ఆక్సిజన్ కోసం రౌడీయిజమ్ చేస్తాయి! కబ్జా చేస్తాయి!! అదెలాగంటే... తమవైపు ఎక్కువగా రక్తం ప్రవహించేందుకు వీలుగా... మరిన్ని ఎక్కువ రక్తనాళాలను ఏర్పాటు చేసుకుని ఆహారాన్ని కబ్బా చేస్తాయి. సాధారణ కణాలు అన్ని కణాలకూ రక్తం అందేందుకు రక్త రవాణా వ్యవస్థను ఒక నిర్దిష్టమైన క్రమపద్ధతిలో నిర్మించుకుంటాయి. దానిపేరే ‘యాంజియోజెనెసిస్’. సాధారణంగా రక్తనాళంలోని లోపలి పొర అయిన ఎండోథీలియమ్ నుంచి ఈ రహదారులు ఏర్పడుతుంటాయి. ఇలా ప్రతి సాధారణ కణానికి రక్తనాళాలు ఏర్పడే ప్రక్రియను ‘నార్మల్ యాంజియోజెనెసిస్’ అంటారు. కానీ రౌడీలు దారిదోపిడీ చేసినట్లుగానూ, సామాన్యుల ఆస్తులను కబ్జా చేసినట్లుగానూ వ్యవహరింస్తూ ఆహార కబ్బాలకోసం అనుసరించే మార్గాన్ని వైద్యపరిభాషలో ట్యూమర్ యాంజియోసిస్ అంటారు. ఈ ‘ట్యూమర్ యాంజియోజెనెసిస్’ మార్గంలో పొరుగు ఆరోగ్యకణాలపై రౌడీయిజం చేసి, వాటిని ఎలా కొల్లగొట్టి కబ్జా చేస్తాయో కాస్త విపులంగా చూద్దాం. సాధారణ కణాలూ తమలోకి రక్తం ప్రవహించేందుకు రహదారి పడేలా సిగ్నల్స్ పంపుతాయి. సరిగ్గా అలాంటి సిగ్నల్స్‌నే ఈ క్యాన్సర్ కణాలు కూడా పంపుతాయి. అంతేకాదు.. పక్కన ఉండే హెల్దీ కణాలకు అందే రక్తం కూడా తమకే అందేలా ఆరోగ్యకరమైన కణం మీద దౌర్జన్యం చేస్తాయి. అలా పొరుగుకణాన్ని నాశనం చేస్తాయి. మోసాల... దొంగవేషాల కేడీలివి... Dr. Y Venkata Rami Reddy Medical Director, Omega Hospitals Kurnool, +91 6281066155 క్యాన్సర్ కణాలు చేసే మోసాల తీరు అచ్చం మన సమాజంలోని కేడీలు చేసినట్లుగానే ఉంటాయి. అదెలాగో చూడండి. సాధారణంగా మన దేహంలో నాలుగు ప్రధాన రకాల కణాలుంటాయి. అవి ఎపిథీలియల్, కనెక్టివ్, కండర (మజిల్ టిష్యూ), నాడీకణజాలాలు (నర్వ్ టిష్యూ). సాధారణంగా ఏ అవయవానికైనా... పైవైపున ఉండే కణజాలం ఎపిథీలియల్ కణాలనే కణజాలంతో నిర్మితమై ఉంటుంది. క్యాన్సర్గడ్డకు పైభాగంలో ఉండే ఎపిథీలియల్ కణజాలం కూడా తాను వ్యాధినిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునేందుకు ఒక దొంగవేషంతో మోసం చేస్తుంది. అదేలాగంటే... క్యాన్సర్ కణపు ఎపిథీలియమ్ కణజాలం కాస్తా... అకస్మాత్తుగా కనెక్టివ్ టిష్యూగా మారిపోతుంది. అంటే ఇక్కడ ఎపిథీలియన్ కణాలన్నీ కనెక్టివ్ కణాలుగా మారువేషం వేస్తాయన్నమాట. చాలా సంక్లిష్టంగా జరిగే ఆ ప్రక్రియను కాస్త మనకు అర్థమయ్యే తేలిక భాషలో చెప్పుకుందాం. ఓ పామును పట్టుకుంటే అది తన పైకుబుసాన్ని మన చేతిలో వదిలేసి, కింద కొత్త కుబుసంతో తప్పించుకుని జారిపోయినంత తేలిగ్గా ఈ పని జరుగుతుంది. దీన్నే నిపుణులు ‘ఇన్‌యాక్టివేషన్ ఆఫ్ మాలెక్యులార్ స్విచ్’ అంటారు. రౌడీలకు మద్యంలా ... క్యాన్సర్‌కు చక్కెర మన సినిమాల్లో రౌడీవిలన్లు ఎప్పుడూ చేతిలో మద్యం గ్లాసు పట్టుకుని కనిపిస్తుంటారు కదా. వారికి మద్యం ఎలా ఇష్టమో రౌడీక్యాన్సర్ కణానికి చక్కెర అలా ఇష్టం. వాటి పెరుగుదలకు శక్తి కావాలి. మిగతాక ణాల నుంచి కబ్జా చేసి పొందే ఆ శక్తి గ్లూకోజ్ రూపంలో క్యాన్సర్ కణాలకు అందుతుంటుంది. అనేక పోషకాలూ గ్లూకోజ్, ఆక్సిజన్‌తో కలిసి అందే ఆ శక్తిని పొందే చర్యంతా ‘సెల్ రెస్పిరేషన్’ అనే పేరున్న సంక్లిష్ట ప్రక్రియలో జరుగుతుంది. ఈ శక్తి (ఎనర్జీ)ని అందుకున్న క్యాన్సర్ కణం దాన్ని ఉపయోగించుకొని, మరింత అనియంత్రితంగా పెరుగుతుంది. ఇందుకు అవసరమైన గ్లూకోజ్ (చక్కెర) కోసం అది రౌడీలు మద్యం కోసం వెంపర్లాడినంతగా అన్నమాట! సాధారణ ఆరోగ్యకరమైన కణజాలాలు తమకు అందే గ్లూకోజ్ నుంచి ‘గ్లైకాలసిస్’ అనే ప్రక్రియ ద్వారా శక్తిని తయారు చేసుకుంటాయి. కానీ క్యాన్సర్ కణం ఇలా గ్లైకాలసిస్ను నమ్ముకోదు. పైన చెప్పిన ప్రక్రియ కారణంగా క్యాన్సర్ కణంలోని మైటోకాండ్రియా దెబ్బతింటుంది. Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 మద్యం తాగిన వాడు ఆ మత్తులో ఎవరినీ లెక్క చేయడు. ఆ మద్యం ప్రభావంతో ఒక్కోసారి పోలీసులనూ ఎదిరిస్తుంటాడు కదా. అలాగే పైన చెప్పిన అక్రమ ప్రక్రియలో మద్యంలా ఎనర్జీ ని తాగేసి పుంజుకున్న బలంతో ఈ క్యాన్సర్ రౌడీ కణాలు... తమ పాలిటి పోలీస్ అయిన కీమోథెరపీని సైతం ధిక్కరిస్తూ ఉంటాయి. ఆరోగ్యకరమైన సమాజంలో రౌడీలూ, ఉగ్రవాదులు ఉండరు. సమాజం ఆరోగ్యకరంగా లేనప్పుడే అలాంటి సంఘవిద్రోహులు పుట్టుకొస్తారు. అలాగే దేహం ఆరోగ్యంగా లేనప్పుడూ ఆరోగ్యకరమైన క్యాన్సర్ కణంగా మారేందుకూ... వాటి నుంచి మరిన్ని క్యాన్సర్ కణాలు ఉద్భవించేందుకు ఆస్కారం ఉంది. అందుకే సమాజంలాగే దేహాన్నీ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకోసం మనం ఆరోగ్యకరమైన జీవనశైలితో, మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. కాలుష్యపూరితమైన వాతావరణానికి దూరంగా ఉండాలి. ప్రతిరోజూ ఎంతో కొంతసేపు దేహశ్రమ, వ్యాయామం చేస్తూ వ్యాధినిరోధకశక్తిని పెంచుకోవాలి. మన దేహం బాగుంటే మనందరమూ ఆరోగ్యంగా ఉంటే సమాజమూ బాగుంటుంది. అందరూ హాయిగా, హ్యాపీగా ఉంటారు. సాధారణ కణానికీ... రౌడీ కణానికీ తేడా చూద్దామా! సాధారణ జీవకణాలన్నీ కొన్ని నియమాలను పాటిస్తుంటాయి. అవి నిర్ణీత క్రమంలో విభజితమై పెరుగుతుంటాయి. కణజాలంలోని ఒక కణానికీ, మరో కణానికీ మంచి కమ్యూనికేషన్స్‌తో ఉంటాయి. ప్రోటీన్ల రూపంలో ఉండే సెల్కెమికల్స్ ద్వారా సిగ్నల్స్‌తో పలకరించుకుంటూ, పరస్పరం సహకరించుకుంటూ ఉంటాయి. ఇలా గుండెలో ఉండేవి అక్కడి విధులూ, మెదడు కణాలు వాటి విధులూ, కాలేయకణాలు తమకు నిర్దేశించిన పనులూ చేసుకుంటూ ఉంటాయి. అవి ఎంత క్రమశిక్షణతో వ్యవహరిస్తుంటాయంటే... తమ పనులు తాము చేసుకుంటూ ఉండటమే కాదు... ఒక్కోసారి ఒకవేళ తమకు ఏదైనా కారణంగా అనారోగ్యం కలిగితే.. తమ జబ్బు తమకు మాత్రమే పరిమితం చేసుకునేందుకూ, పక్క కణాలకు అంటకూడదని ‘సెల్‌డెత్’ పేరిట తమను తాము నాశనం చేసుకుంటాయి. అచ్చం సమాజంలోని ఆరోగ్యకరమైన వ్యక్తులు క్వారంటైన్లో ఉండి తమ వ్యాధి ఇతరులకు పాకకుండా ఉన్నట్లుగా అవీ వ్యవహరిస్తాయి. కానీ క్యాన్సర్ పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తుంది! ఉదాహరణకు మన చర్మంలోని కణాలు నిత్యం కొత్తవి పుడుతూ పాతవి చనిపోతూ ఉంటాయి. అలా కొత్తవి పుట్టినప్పటికీ చర్మం ఎప్పటిలా ఒకేలా ఉంటుంది. కానీ క్యాన్సర్ కణాలు పుడుతున్న కొద్దీ ఇష్టమొచ్చినట్టు పెరుగుతూ పోతాయి. అసహ్యకరమైన గడ్డల్లా అడ్డదిడ్డంగా పెరుగుతాయి. అవే క్యాన్సర్ ట్యూమర్లు. దొంగదారుల్లో దాక్కునే ఉగ్రవాదులాంటివి... సమాజంలోని రౌడీలు దొంగదారులు తొక్కుతారు. పోలీసులను తప్పించుకునేందుకు దొంగవేషాలు వేస్తారు. అచ్చం ఇలాగే ఈ క్యాన్సర్ కణాలూ దొంగవేషాలు వేస్తాయి. మన దేహంలో ఉండే వ్యాధినిరోధక వ్యవస్థ ఓ పోలీస్ వ్యవస్థలాంటిదే. రౌడీలూ, దొంగలూ పోలీసులను తప్పించుకునేందుకు అండర్ గౌండ్స్‌లో దాక్కోవడం, మారువేషాలతో మోసాలు చేయడం చూస్తుంటాం కదా. రౌడీ క్యాన్సర్ కణాలూ ఇలాగే చేస్తుంటాయి. అదెలాగో చూద్దాం. మన దేహంలో మనకు మేలు చేసే లింఫ్‌నోడ్స్ ఒక ప్రోటీన్‌ను రూపొందించుకుంటాయి. ఈ ట్యూమర్ కణాలు కూడా అచ్చం అలాంటి ప్రోటీన్‌నే రూపొందించుకుంటాయి. ఇది ఎలా ఉంటుందంటే... ఒక్కోసారి దొంగలే పోలీస్ డ్రస్సులతో వచ్చి వారిని బోల్తా కొట్టించినట్లుగా అవి కూడా తప్పించుకుంటాయి. తమపైని ప్రోటీన్‌ను... అచ్చం ఓ దొంగ ఐడీ కార్డులా, నకిలీ ఫోర్జరీ డాక్యుమెంట్ లా సృష్టించి వాడుకుంటాయి. ఆరోగ్యాన్ని కాపాడే ఈ వ్యాధినిరోధక వ్యవస్థ ఆ ఐడీలను చూసి ఆ కణాలు కూడా తమలాంటి ‘లింఫ్ టిష్యూ’లేమోనని పొరబడి వాటిని వదిలేస్తాయి. అలా రోగనిరో«ధక శక్తుల్లాంటి పోలీస్ వ్యవస్థ కనుగప్పి తప్పించుకోవడమే గాకుండా... క్యాన్సర్లన్నీ ఒంట్లో వివిధ ప్రదేశాలకూ, వేర్వేరు అవయవాలకూ పాకి.... అక్కడా ఆహారం, ఆక్సిజన్‌లాంటి వనరుల కబ్జా, దోపిడీలకు మళ్లీ పాల్పడుతుంటాయి. ఇదొక సైకిల్ కొనసాగుతూ ఇలా నిరంతరం జరిగిపోతుంటుంది. చికిత్సను తప్పించుకోడానికి రౌడీలు, ఉగ్రవాదులు ఒక్కోసారి కూంబింగ్ ఆపరేషన్స్‌నుంచి తప్పించుకునేందుకు... తాము ఉండటానికి ఎవరూ అనుమానించని చోటికి వెళ్లి దాక్కుంటారు. బయట సమాజంలో దాన్ని సేఫ్ షెల్టర్ జోన్ గా అంటుంటారు. అలాగే ఈ మోసకారి కణాలు కూడా సేఫ్ జోన్లలాంటి పక్క కణజాలాల్లోకి దూరిపోయి అక్కడ షెల్టర్ తీసుకుంటూ ఉంటాయి. ఉదాహరణకు కొన్ని రకాల లూకేమియాలకు కీమోథెరపీ చికిత్స తో ‘కూంబింగ్’ చేసే సమయంలో ఈ ఉగ్ర–క్యాన్సర్ కణాలు పక్కనే ఉండే ఎముకల్లోకి దూరిపోయి తమను తాము రక్షించుకుంటుంటాయి. -
వ్యాక్సిన్‌పై వాస్తవాలేంటి?
ఇంకొన్ని రోజుల్లో భారత్‌లో కోవిడ్ టీకాలు వచ్చేస్తున్నాయి. ఆరోగ్య సిబ్బందితో మొదలుపెట్టి వృద్ధులు.. ఆరోగ్య సమస్యలున్న వారు అన్న క్రమంలో... వరుసగా టీకాలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి! మరి గడ్డుకాలమిక తొలగిపోయినట్లేనా? ఇక అంతా మంచేనా? ఊహూ.. కానేకాదు! టీకా తీసుకున్నా మరికొంత కాలం జాగ్రత్తలు కొనసాగాల్సిందే అంటున్నారు నిపుణులు. ఈ అంశంతోపాటు టీకాలకు సంబంధించిన ఇతర సందేహాలకు సమాధానాలివిగో.. వ్యాక్సిన్లలో రకాలేమిటి? హా ఫైజర్, మోడెర్నా సంస్థలు మెసెంజర్ ఆర్ఎన్ఏతో(ప్రొటీన్ తయారీకి పనికొచ్చే డీఎన్ఏ పోగు)టీకాను అభివృద్ధి చేస్తున్నాయి. హా భారత్‌లోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ టీకాలో వాడే వైరస్లు రోగ నిరోధక కణాలు గుర్తించే యాంటిజెన్లను సిద్ధం చేస్తాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకాలు తయారు చేస్తున్న కోవిషీల్డ్‌ను చింపాంజీకి చెందిన అడినోవైరస్‌ను వాహకంగా వాడుతున్నారు. హా భారత్ బయోటెక్ (హైదరాబాద్), గమలేయా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (రష్యా) నిర్వీర్యం చేసిన వైరస్ ఆధారంగా టీకాను తయారు చేస్తున్నాయి. ఈ వైరస్లు వ్యాధిని కలిగించవు కానీ.. రోగ నిరోధక వ్యవస్థ తాలూకూ కణాలు గుర్తించేందుకు ఉపయోగపడతాయి. ఏ వ్యాక్సిన్ సామర్థ్యం ఎంత? కోవిషీల్డ్ వ్యాక్సిన్ కోవిడ్–19 లక్షణాలు కనబరిచే వారిలో 70.4 శాతం సామర్థ్యంతో పనిచేస్తుంది. తీవ్రమైన లక్షణాలతో బాధపడుతున్న వారిలో 100 శాతం పనిచేస్తుందని అంచనా. ఫైజర్ టీకా సామర్థ్యం 95 శాతం కాగా, రష్యా టీకా స్పుత్నిక్–వీ 92 శాతం సామర్థ్యాన్ని కనబరిచింది. టీకాలు ఎవరెవరికి ఇవ్వవచ్చు? పైన పేర్కొన్న టీకాలను 18 లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారికి ఇవ్వవచ్చు. ఇందుకు తగ్గట్టుగా ప్రయోగాలు జరిగాయి. ప్రస్తుతం 12–18 ఏళ్ల వారిపై ఈ టీకాలు ఎలా పనిచేస్తాయన్నది పరీక్షిస్తున్నారు. అందుబాటులో ఉన్నాయా? కోవిషీల్డ్ టీకా అత్యవసర వాడకంపై అనుమతికి సీరమ్ ఇన్స్టిట్యూట్ దరఖాస్తు చేసుకుంది. భారత్ బయోటెక్, స్పుత్నిక్–వీ మూడో దశ ప్రయోగాలను పూర్తి చేయాల్సి ఉంది. ఫైజర్ వ్యాక్సిన్ ప్రైవేట్ రంగంలో అందుబాటులోకి రావచ్చు. 18 ఏళ్ల లోపువయసున్న వారికి ఏ టీకా అందుబాటులో లేదు. వ్యాధి సోకి నయమైన వారికి టీకా అవసరమా? కోవిడ్ బారిన పడి సహజసిద్ధంగా కోలుకున్న వారికి దీర్ఘకాలంలో వ్యాధి నుంచి రక్షణ ఉంటుందా? అన్నది ఇప్పటికీ అస్పష్టం. కాలక్రమంలో శరీరంలో యాంటీబాడీలు బలహీన పడే అవకాశాలు ఎక్కువైనప్పటికీ వ్యాధి నుంచి రక్షణ తగ్గిపోతుందని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. అందుకే కోవిడ్ నుంచి బయటపడిన వారికి ఆఖరులో టీకా ఇవ్వాలని యోచిస్తున్నారు. ఒక్కో డోస్ ఎంత? ఎన్ని డోసులు? కోవిషీల్డ్ టీకా ఒక డోసుకు 0.5 మిల్లీలీటర్ ఉంటుంది. 28 రోజుల వ్యవధిలో 2 డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఫైజర్, మోడెర్నా, స్పుత్నిక్–వీ టీకాలను 21 రోజుల వ్యవధిలో 2 డోసులు ఇస్తారు. రెండు వారాల సమయంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని అంచనా. ఎంఆర్ఎన్ఏ టీకా మాత్రం తొలి డోసు తీసుకున్న 10 రోజుల్లోనే యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు తెలిసింది. రెండు డోసుల స్థానంలో ఒకటే తీసుకున్నా ఓమోస్తరు ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రెండు డోసులతో రక్షణ ఎంత కాలం? ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. కోవిషీల్డ్ టీకా తీసుకున్న వారిలో నాలుగు నెలల కంటే ఎక్కువ కాలం వ్యాధి నుంచి రక్షణ లభించింది. యాంటీబాడీలు బలహీన పడినా వ్యాధి నుంచి రక్షణ లభిస్తుందని అంచనా. బూస్టర్ టీకా అవసరం రాకపోవచ్చనే అనుకుంటున్నారు. టీకా తీసుకున్న వారిలో నొప్పి, జ్వరం వంటి కొన్ని దుష్ప్రభావాలు కనిపించే అవకాశం ఉంది. టీకా వేసుకున్నాక మామూలుగా తిరిగేయవచ్చా? ఏ వ్యాక్సిన్ అయినా 100 శాతం రక్షణ కల్పించదు. టీకా తీసుకున్న వారు మళ్లీ వ్యాధి బారిన పడకపోవచ్చుగానీ.. ఇతరులకు వైరస్‌ను అంటించే అవకాశం ఉంటుంది. అందుకే టీకా వేసుకున్న తరువాత కూడా మాస్కు ఉపయోగించడం, భౌతిక దూరాన్ని పాటించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం మరికొంత కాలం కొనసాగించాల్సి ఉంటుంది. – సాక్షి, హైదరాబాద్ -
ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్: ఆశాజనకంగా ఫలితాలు
లండన్ : కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గుడ్ న్యూస్ చెప్పింది. తొలి నుంచి కరోనా వ్యాక్సిన్ ప్రయోగాల్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ముందు వరుసలో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యాక్సిన్ తొలిదశ క్లినికల్ ట్రయల్స్ సంబంధించిన డేటా వెలువడింది. లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో ఈ ఫలితాలను ప్రచురించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తొలిదశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు ఆశాజనంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ ద్వారా రోగనిరోధక ప్రతిస్పందన గుణం పెరుగుతుందని తెలిపారు. అలాగే ఇది సురక్షితమైనదని వెల్లడించారు. ఈ క్లినికల్ ట్రయల్స్‌లో దాదాపు 1,077 మందిపై వ్యాక్సిన్ ప్రయోగించగా.. వీరిలో యాంటీబాడీస్తోపాటుగా, కరోనాతో పోరాడగలిగే తెల్ల రక్తకణాలను ఏర్పరచడానికి తోడ్పడిందని తెలిపారు. ఈ వ్యాక్సిన్ ద్వారా భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ లేవని అన్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్లలోని పలువురిలో జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించాయని.. అయితే పరిశోధకులు వాటిని పారాసిటమాల్‌తో తగ్గించగలిగారని చెప్పారు. అయితే ఈ వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో కరోనాను అడ్డుకోగలుగుతుందో లేదో తెలియాలంటే.. మరిన్ని పరీక్షలు జరగాల్సి ఉందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. -
‘అందుకే వారిలో మరోసారి కరోనా’
లండన్: కరోనాతో ప్రపంచం అంతా కకావికలమవుతోంది. ఈ మహమ్మారికి ఇంతవరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. సరైన వైద్యం కూడా లేదు. ఇన్ని సమస్యల మధ్య ఒకసారి కరోనా బారిన పడ్డ వారిలో మరోసారి వైరస్ లక్షణాలు కనిపిస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో తాజాగా లండన్ కింగ్స్ కాలేజీ సంచలన విషయాలు వెల్లడించింది. కరోనా వైరస్ సోకిన వారిలో నెలల వ్యవధిలో రోగ నిరోధక శక్తి తగ్గడంతో.. మరోసారి తిరిగి వైరస్ బారిన పడుతున్నట్లు వెల్లడించింది. తేలికపాటి లక్షణాలు ఉన్న వారిలో కూడా రోగనిరోధక వ్యవస్థ కొంత ప్రతిస్పందనను కలిగి ఉన్నట్లు నివేదిక తెలిపింది. (త్వరలో శుభవార్త అందించబోతున్నాం) 90 మంది కరోనా రోగులను పరీక్షించిన తర్వాత ఈ నివేదిక వెల్లడించింది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 60 మందిలో వైరస్ సంక్రమించిన మొదటి వారాల్లో శక్తివంతమైన ప్రతిస్పందన చూపినట్లు నివేదిక వెల్లడించింది. అంతేకాక 16.7శాతం మందిలో మూడు నెలల తర్వాత కరోనా న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ అధిక స్థాయిలో ఉన్నట్లు వెల్లడించింది. అయితే ఎక్కువ అధిక శాతం మందిలో 90 రోజుల తర్వాత యాంటీబాడీస్ చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్లు నివేదిక తెలిపింది. దానివల్ల రోగనిరోధక శక్తి సన్నగిల్లింది. అందువల్లే ఇలాంటి వారికి మరోసారి కరోనా వచ్చే అవకాశం ఉన్నట్లు నివేదిక తెలిపింది. శరీరంలో యాంటీబాడీస్ ఎక్కువ ఉన్నట్లయితే రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది. ఫలితంగా కొత్త వైరస్‌లను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నివేదిక ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. రాబోయే పరిణామాలకు తగ్గట్లు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడానికి ఈ నివేదిక ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. (పెళ్లి విందు అడ్డుకున్నారు..!) -
సరికొత్త యాంటీబాడీ పరీక్ష సిద్ధం
కరోనా వైరస్‌ను గుర్తించేందుకు ప్రస్తుతం పీసీఆర్ ఆర్సీటీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గొంతు, ముక్కు నుంచి సేకరించిన ద్రవ నమూనాల్లో వైరస్ తాలూకు డీఎన్ఏ పోగులను గుర్తించడం ఈ పరీక్షల పద్ధతి. అయితే ఇందుకు చాలా సమయం పడుతుంది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ పరీక్షల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఫలితాలపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వైలీ అనే సంస్థ యాంటీబాడీ పరీక్ష ఒకదాన్ని సిద్ధం చేసింది. ప్రస్తుతం వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వాటిని గుర్తించడం వీలవుతుండగా యాంటీబాడీ లేదా రక్త పరీక్షలు తొలిదశలోనే వైరస్‌ను గుర్తించగలవు. అంతేకాకుండా వైరస్ ఎంతమేరకు విస్తరించింది, ఒక్కో వ్యక్తి యాంటీబాడీ ప్రతిస్పందన ఎలా ఉంది? మరోసారి వైరస్ బారిన పడకుండా ఉండగలిగే సామర్థ్యం ఎందరికి ఉంది? అన్నది ఈ కొత్త యాంటీబాడీ పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. కరోనా వైరస్‌లోని కీలకమైన ప్రొటీన్ భాగాలను ఉపయోగించడం ద్వారా వైరస్‌ను అడ్డుకునేందుకు శరీర రోగ నిరోధక వ్యవస్థ తయారు చేసిన యాంటీబాడీలను గుర్తించడం ఈ కొత్త పరీక్ష పద్ధతి విశేషం. లక్షణాలు లేని వారితోపాటు, కొద్దిపాటి తీవ్రత ఉన్నవారిలోనూ వైరస్ వ్యాప్తి ఎంతనేది ఈ పరీక్షల్లో స్పష్టంగా తెలుస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వైరస్‌ను తట్టుకోగల రోగ నిరోధకశక్తి ఉన్న వ్యక్తులను గుర్తించడం కూడా ఈ పరీక్ష ద్వారా సాధ్యమవుతుంది. దీనివల్ల కరోనా వైరస్ సోకని వ్యక్తులనే రోగుల చికిత్సలో ఉపయోగించవచ్చు. తద్వారా వైరస్ ఇతరులకు సోకే అవకాశం తగ్గిపోతుంది. ఈ కొత్త పరీక్ష ఎలా నిర్వహించాలనేది కరెంట్ ప్రొటోకాల్స్ ఇన్ మైక్రోబయాలజీలో విశదీకరించారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ఊపు కరోనా నేపథ్యంలో ఐటీతోపాటు ఇతర ఉద్యోగాల్లోనూ ఇంటి నుంచే పనిచేయడమనే సంస్కృతి రానుంది. ఇప్పటివరకూ ఉద్యోగులు కంపెనీల ఐటీ బ్యాండ్‌విడ్త్‌ను ఉపయోగించుకుని పనులు చేస్తుంటే.. ఇప్పుడు ఇళ్లలోని ఇంటర్నెట్ కనెక్షన్లను వాడాలి. దీంతో బ్యాండ్‌విడ్త్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో సరికొత్త వైఫై ప్రొటోకాల్ అందుబాటులోకి రావడం ఊరటనిచ్చే అంశం. ఇది అందుబాటులోకి వస్తే ఒకే కనెక్షన్‌పై బోలెడన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను జోడించుకుని నడిపించవచ్చు. ఇంట్లోని వారంతా హైస్పీడ్ వీడియోగేమ్‌లు, ఇతర సాఫ్ట్వేర్లు వాడుతున్నా ఇంటర్నెట్ వేగం ఏమాత్రం తగ్గదన్నమాట. అయితే ప్రస్తుతానికి ఈ కొత్త వైఫై ప్రొటోకాల్‌ను వాడుకోగల స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త వైఫైతో వీడియో కాన్ఫరెన్సింగ్, టెలిమెడిసిన్, ఆన్లైన్ క్లాసుల వంటివి బ్యాండ్‌విడ్త్ సాఫీగా నడుస్తాయని నిపుణులు చెబుతున్నారు. -
నిర్వీర్యం చేసిన వైరస్‌తో టీకా!
సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్‌ను అంతమొందించేందుకు టీకా తయారీకి హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. నిర్వీర్యం చేసిన కరోనా వైరస్‌నే టీకాగా అభివృద్ధి చేస్తుండటం విశేషం. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో ఏడాదిలో టీకా మన ముందుకు వస్తుందని సంస్థ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. సురక్షితమైన, సులువుగా తయారు చేసేందుకు వీలైన పద్ధతిలో తాము టీకా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ అని పిలిచే ఈ తరహా టీకాల తయారీ మానవ కణంలో వైరస్ సంతతిని గణనీయంగా పెంచడం ద్వారా మొదలవుతుంది. ఆ తర్వాత కొన్ని ప్రత్యేకమైన రసాయనాలను లేదా వేడిని ఉపయోగించడం ద్వారా వైరస్‌ను నిర్వీర్యం చేస్తారు. వైరస్ నిర్వీర్యమైనా, పునరుత్పత్తి సామర్థ్యం లేకపోయినా.. అందులోని ప్రొటీన్ కొమ్ము లాంటి భాగాలు మాత్రం చెక్కు చెదరకుండా ఉంటాయి. ఈ కొమ్ము సాయంతోనే వైరస్ కణాల్లోకి ప్రవేశిస్తుందన్నది మనకు తెలిసిన విషయమే. అయితే నిర్వీర్యమైన వైరస్ మన కణంలోకి ప్రవేశిస్తే.. రోగ నిరోధక వ్యవస్థ దాన్ని గుర్తిస్తుంది. తదనుగుణంగా యాంటీబాడీలను తయారు చేస్తుంది. వైరస్ ఎలాగూ నిర్వీర్యమైంది కాబట్టి దాని ద్వారా వ్యాధి లక్షణాలు కనిపించవు. ఇంకోలా చెప్పాలంటే.. ఈ టీకాను వాడటం సురక్షితమన్నమాట. బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న వారు కూడా దీన్ని ఉపయోగించొచ్చు. సీసీఎంబీలో ప్రస్తుతం తాము ఈ ఇనాక్టివేటెడ్ టీకా తయారీకి సిద్ధమవుతున్నామని రాకేశ్ మిశ్రా తెలిపారు. నిర్వీర్యమైన వైరస్‌లను చెప్పుకోదగ్గ స్థాయిలో ఉత్పత్తి చేసి ఇంజెక్షన్ రూపంలో శరీరంలోకి ప్రవేశపెట్టాలన్నది తమ ఆలోచన అని వివరించారు. బయట పెంచడమే సవాల్.. వైరస్‌లన్నీ పరాన్న జీవులని తెలిసిన విషయమే. వీటికి స్వయంగా జీవం ఉండదు. కాకపోతే ఇతర జంతువుల కణాల్లోకి చొరబడి.. వాటి జన్యుపదార్థాన్ని హైజాక్ చేయడం ద్వారా వేగంగా వృద్ధి చెందుతాయి. ఇప్పుడు టీకా తయారీలో అతిపెద్ద సవాలు కూడా ఇదే. శరీరం బయట ఈ వైరస్‌లను పెంచాల్సి ఉంటుంది. సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఈ సమస్యను అధిగమించేందుకు ఆఫ్రికాకు చెందిన కోతుల చర్మపు పై పొరలోని కణాలను వైరస్‌ను వృద్ధి చేసేందుకు ఉపయోగించాలన్న ఆలోచనలో ఉన్నారు. నిర్వీర్యమైన వైరస్‌లో అవసరమైన ప్రొటీన్లు అన్నీ ఉన్న వాటిని ఎంపిక చేసేందుకు రెండు, మూడు నెలల సమయం పడుతుందని, ఆ తర్వాత వేర్వేరు దశల్లో జంతు, మానవ ప్రయోగాలు చేపట్టేందుకు, మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు ఏడాది కంటే ఎక్కువ సమయం పడుతుందని రాకేశ్ మిశ్రా వివరించారు. వైరస్‌ను పెంచేందుకు తగిన పద్ధతిని కనుక్కోవడం భవిష్యత్తులో కరోనా చికిత్సకు అవసరమైన మందుల తయారీకి కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. ఒకసారి వైరస్‌ను కణంలోకి ప్రవేశపెడితే రెండు, మూడు రోజుల తర్వాత కణాలు చనిపోగా.. వైరస్లు ఇబ్బడిముబ్బడిగా ఉంటాయని.. మందుగా పనిచేస్తాయనుకున్న వాటిని నేరుగా ప్రయోగించి వాటి సామర్థ్యాన్ని లెక్కకట్టవచ్చని తెలిపారు. నాలుగు రకాల టీకాలు.. వ్యాధుల నివారణకు ఉపయోగపడే టీకాలను స్థూలంగా నాలుగు పద్ధతుల్లో తయారు చేస్తారు. బ్యాక్టీరియా, వైరస్ వంటి వాటి నుంచి ఎలా ఎదుర్కోవాలో శరీర రోగ నిరోధక వ్యవస్థకు నేర్పించడం టీకా ప్రధాన ఉద్దేశం. తద్వారా బ్యాక్టీరియా, వైరస్ల ద్వారా వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చన్నమాట. శాస్త్రవేత్తలు టీకాలను తయారు చేసేటప్పుడు బ్యాక్టీరియా/వైరస్‌లకు రోగ నిరోధక వ్యవస్థ ఎలా స్పందిస్తోంది.. ఎవరికి టీకా అవసరం.. టీకా తయారీకి మేలైన పద్ధతి, టెక్నాలజీ ఏది అన్న అంశాలను ముందుగా పరిగణనలోకి తీసుకుంటారు. వీటి ఆధారంగా నాలుగు రకాల టీకాల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకుంటారు. బలహీనమైన వైరస్‌లతో.. ఈ రకమైన టీకాను లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్ అని పిలుస్తారు. ఇందులో వైరస్‌కు విరుగుడుగా బలహీనమైన వైరస్‌ను ఉపయోగిస్తారు. ఈ రకమైన టీకాలోని వైరస్లు బలహీనంగా ఉంటాయి గానీ.. వీటికి కూడా రోగ నిరోధక వ్యవస్థ స్పందిస్తుంది. యాంటీబాడీలను తయారు చేసుకుంటుంది. ఒకట్రెండు డోసుల టీకాతోనే జీవితాంతం నిర్దిష్ట వైరస్ నుంచి రక్షణ లభిస్తుంది. అయితే ఈ రకమైన టీకాలు అందరికీ అనుకూలంగా ఉండవు. బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్నవారు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు.. అవయవ మార్పిడి చేసుకున్నవారు ఈ రకమైన టీకాలు వేయించుకునే ముందు వైద్యులను సంప్రదించడం మేలు. బలహీనమైన వైరస్‌లతో కూడిన టీకాలను ఎప్పుడూ చల్లగా ఉంచాల్సి ఉంటుంది. మశూచి, స్మాల్‌పాక్స్, చికెన్ పాక్స్ వంటి వ్యాధుల నుంచి రక్షణకు ఇచ్చే టీకాలు ఈ లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్లకు ఉదాహరణలు. సూక్ష్మజీవి భాగాలతో చేస్తే.. వ్యాధి కారక సూక్ష్మజీవి భాగాలను ఉపయోగించుకుని కూడా టీకా తయారు చేయొచ్చు. ప్రొటీన్లు, చక్కెరలు, సూక్ష్మజీవి చుట్టూ ఉండే తొడుగు వంటివి టీకా తయారీకి వాడతారు. వాడే భాగాన్ని బట్టి వీటిని సబ్యూనిట్/ రీకాంబినెంట్/పాలిశాకరైడ్/ కంజుగేట్ వ్యాక్సిన్లుగా పిలుస్తారు. విడిభాగం ఒక్కదాన్నేవాడటం వల్ల రోగ నిరోధక వ్యవస్థ స్పందన బలంగా ఉంటుంది. అవసరమైన వారందరికీ ఇచ్చేందుకు వీలైన టీకా ఇది. అయితే వ్యాధి నుంచి రక్షణ కావాలంటే.. తరచూ బూస్టర్ షాట్లు తీసుకోవాల్సి ఉంటుంది. హెపటైటిస్–బి, షింగిల్స్, మెనింజో కోకల్, న్యూమోకోకల్, హ్యూమన్ పాపిలోమా వైరస్ వంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పించే టీకాలన్నీ ఇలా బ్యాక్టీరియా/వైరస్ విడిభాగాలతో తయారవుతాయి. విషాన్ని విరుగుడుగా ఇస్తే.. సూక్ష్మజీవులకు పడని విషాన్ని ఉపయోగించడం ద్వారా తయారయ్యే టీకాను టాక్సాయిడ్ వ్యాక్సిన్ అని పిలుస్తారు. ఇవి తీసుకున్నప్పుడు సూక్ష్మజీవి మొత్తానికి రోగ నిరోధక వ్యవస్థ స్పందించదు. వాడిన టాక్సిన్ (విషం) ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే స్పందిస్తుంది. టాక్సాయిడ్ టీకాలు కూడా తరచూ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకట్రెండు డోసులతో జీవితాంతం రక్షణ లభించదు. టెటానస్, డిప్తీరియా వంటి వ్యాధుల నుంచి రక్షణకు ఉపయోగించేవి టాక్సాయిడ్ వ్యాక్సిన్లకు ఉదాహరణలు. నిర్వీర్యమైన సూక్ష్మజీవులతో.. ఈ రకమైన టీకాలను ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ అని పిలుస్తారు. వ్యాధి కారక సూక్ష్మజీవిని నిర్వీర్యం చేసిన తర్వాత వాడతారన్నమాట. లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్లతో పోలిస్తే అంత ప్రభావం చూపవు. ఎక్కువ డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. సూక్ష్మజీవి నిర్వీర్యమైనా.. అవి శరీరంలో ఉన్నప్పుడు రోగ నిరోధక వ్యవస్థ వాటిని గుర్తించి ప్రతిచర్యలు తీసుకుంటుంది కాబట్టి.. నిర్దిష్ట వ్యాధి సోకదన్నది ఈ టీకా వెనుక ఉన్న సూత్రం. పోలియో, రేబిస్, హెపటైటిస్–ఏ వంటి వ్యాధుల నివారణకు ఇచ్చే టీకాలు ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్లు! -
ఉప్పుతో ముప్పే
బెర్లిన్: ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే రక్తపోటు మొదలుకొని అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని మనం ఇప్పటికే చాలాసార్లు విని ఉంటాం. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ తరుణంలో ఉప్పుతో రోగ నిరోధక వ్యవస్థకూ చేటే అన్న కొత్త విషయం బయటపడింది. జర్మనీలోని బాన్ హాస్పిటల్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఎలుకలపై జరిపిన పరిశోధనలు ఈ విషయాన్ని రుజువు చేశాయి. ఎక్కువ ఉప్పు ఉన్న ఆహారం అందించిన ఎలుకల్లో బ్యాక్టీరియా సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు, మనుషుల్లోనూ రోజుకు మామూలు కంటే 6 గ్రాములు ఎక్కువ ఉప్పు తీసుకున్న వారిలో రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడినట్లు గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంకోలా చెప్పాలంటే ఫాస్ట్ఫుడ్తో రెండుసార్లు భోజనం చేస్తే రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడుతుందన్నమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం మనిషికి రోజుకు 5 గ్రాముల ఉప్పు సరిపోతుంది. ఇది ఒక టీస్పూ న్ ఉప్పుతో సమానం. ఉప్పు ఎక్కువగా తిన్న వారి రక్తాన్ని వారం తర్వాత పరిశీలించగా, రోగ నిరోధక వ్యవస్థలో భాగమైన గ్రాన్యులోసైట్స్ బ్యాక్టీరియాపై పోరాడటంలో బాగా వెనుకబడినట్లు తెలిసిందని శాస్త్రవేత్తలు తెలిపారు. -
యుద్ధానికి సిద్ధమెలా?
కరోనా వైరస్ పేరు చెప్పగానే మనమంతా వణికి పోతున్నాం గానీ.. ఇవి మనకు కొత్తేమీ కాదు. యుగాలుగా మనపై దాడి చేస్తూనే ఉన్నాయి.. ప్రతి దాడితో మనిషి మరింత బలపడ్డాడు. కొత్త వాటిని అడ్డుకునే శక్తి సంపాదించుకున్నాడు అంతా మన శరీరంలోని అత్యంత సంక్లిష్టమైన రోగ నిరోధక వ్యవస్థ ఫలితం! ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఏం చేస్తే బలహీన పడుతుంది? మరింత బలం పుంజుకోవడం ఎలా? యుద్ధంలో మాదిరిగానే ఈ రోగ నిరోధక వ్యవస్థలోనూ.. చతురంగ బలాలు ఉంటాయి. సూక్ష్మజీవుల ఎత్తులకు పైఎత్తులేయడం.. అస్త్రశస్త్రాలతో వాటిని చిత్తు చేయడం.. నిత్యం జరిగేవే. వేగులు, సైనికులు, సమాచారం సేకరించే వారు.. బోలెడన్ని ఆయుధ కర్మాగారా లు ఈ వ్యవస్థలో భాగాలే. కణాలు, కణజాలాలు, శోషరస గ్రంథులు (లింఫ్‌నోడ్స్), అవయవాలతో కూడి ఉంటుంది ఈ వ్యవస్థ. సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశిస్తే వాటిని నాశనం చేయడం, లోపలికి చొరబడ్డ శత్రువు వివరాలను నిక్షిప్తం చేసుకుని భవిష్యత్తులో మళ్లీ అదే శత్రువు వస్తే అడ్డుకోవడం, క్రిములను చంపేయడం, సమాచారం ఒక చోటి నుంచి ఇంకోచోటికి చేరవేయడం వంటి సుమారు 12 పనులను ఈ వ్యవస్థ చేస్తుంది. ఈ పనులన్నీ చేసేందుకు సుమారు 21 రకాల కణాలు అందుబాటులో ఉంటాయి. ఎలా పనిచేస్తుంది? ఉదాహరణకు శరీరంపై ఏదైనా గాటు పడితే.. ఆ వెంటనే దాని గుండా బ్యాక్టీరియా వంటివి లోపలికి ప్రవేశించి బాగా పెరుగుతాయి. వీటిని అడ్డుకునేందుకు సరిహద్దులో గస్తీ సైనికుల మాదిరిగా మాక్రోఫేగస్ కణాలు రంగంలోకి దిగుతాయి. కొంచెం పెద్ద సైజు (21 మైక్రోమీటర్లు) ఉండే ఈ మాక్రోఫేగస్ ఒక్కొక్కటి వంద వరకు బ్యాక్టీరియాలను మింగేసి ఎంజైమ్‌ల సాయంతో నాశనం చేస్తాయి. మంట/వాపు కలిగించడం ద్వారా నీళ్ల లాంటి ద్రవం విడుదల చేయాల్సిందిగా రక్త కణాలకు సమాచారం పంపుతాయి. బ్యాక్టీరియా తగ్గకపోతే.. కొంతకాలం తర్వాత మాక్రోఫేగస్ విడుదల చేసే మెసెంజర్ ప్రొటీన్లతో రక్తంలో ప్రవహిస్తున్న న్యూట్రోఫిల్స్‌ను అదనపు బలగాల రూపంలో అందుబాటులోకి వస్తాయి. విష పదార్థాలను విడుదల చేయడం ద్వారా ఇవి బ్యాక్టీరియాను చంపేస్తాయి. బ్యాక్టీరియాను అడ్డుకునేందుకు తమను తాము నాశనం చేసుకునేందుకు కూడా ఇవి వెనుకాడవు. ఇంత జరిగినా బ్యాక్టీరియా ప్రభావం తగ్గలేదనుకోండి.. అప్పుడు రోగ నిరోధక వ్యవస్థకు మెదడు లాంటి డెండ్రటిక్ కణాలు రంగ ప్రవేశం చేస్తాయి. బ్యాక్టీరియా తాలూకు సమాచారం మొత్తం సేకరించి.. దగ్గరలోని శోషరస గ్రంథులను చేరుకుంటాయి. ఈ గ్రంథుల్లోని కోటాను కోట్ల హెల్పర్ టి–సెల్స్, కిల్లర్ టి–సెల్స్‌లో తగిన వాటిని గుర్తించి వాటిని చైతన్యపరుస్తాయి. ఈ టి, కిల్లర్ కణాలు గణనీయంగా వృద్ధి చెంది బ్యాక్టీరియాపై దాడి చేస్తాయి. ఈ క్రమంలో కొన్ని శోషరస గ్రంథిలోనే ఉంటాయి. భవిష్యత్తులో ఇదే రకమైన బ్యాక్టీరియా దాడి చేస్తే ప్రతిదాడికి సిద్ధంగా ఉంటాయి. కొన్ని హెల్పర్ టి–కణాలు గ్రంథుల్లోని శక్తిమంతమైన బి–కణాలను చైతన్యపరచడంతో అవి యాంటీబాడీలను తయారు చేసి బ్యాక్టీరియాపైకి వదులుతాయి. ఇవి బ్యాక్టీరియాకు అతుక్కుపోయి వాటిని నిర్వీర్యం చేస్తాయన్న మాట. దాడి చేసే సూక్ష్మజీవిని బట్టి రోగనిరోధక వ్యవస్థలోని కణాలు వేర్వేరు పద్ధతుల్లో వాటిని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తాయి. బలహీనపడేది ఇలా.. రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడేందుకు వయసుతో పాటు ఒత్తిడి, దురలవాట్లు వంటి అనేక కారణాలు ఉంటాయి. పోషకాహార లోపాలు, కొన్ని రకాల మందులు, హెచ్ఐవీ/ఎయిడ్స్ వంటి రోగాలు కూడా కారణమే. మానసిక ఒత్తిడికి గురైనప్పుడు మెదడు కొన్ని రకాల హార్మోన్లను విడుదల చేయడం వల్ల రోగ నిరోధక వ్యవస్థలో కీలకమైన తెల్లరక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. ఒత్తిడి దీర్ఘకాలం కొనసాగితే కార్టిసోల్ వంటి మంచి చేసే హార్మోన్లు కూడా శరీరానికి హానికారకంగా మారిపోతాయి. రోగ నిరోధక వ్యవస్థలోని కణాలు ఈ హార్మోన్‌కు అలవాటు పడిపోయి తగువిధంగా స్పందించవు. కొన్ని రకాల అలవాట్లు కూడా శరీరాన్ని ఒత్తిడికి గురిచేయడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థను బలహీన పరుస్తాయి. అయితే కొంతమందికి పుట్టుకతో బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ ఉంటుంది. మరికొందరిలో ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం ద్వారా కీళ్లనొప్పులు, టైప్–1 మధుమేహం, మల్టిపుల్ స్లీ్కరోసిస్ వంటి రోగాలు వస్తూంటాయి. శక్తిమంతుడిగా మారాలంటే.. రోగ నిరోధక వ్యవస్థన బలపరుచుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. కాసింత జాగ్రత్తగా వ్యవహరిస్తే సరిపోతుంది. ఇందుకు మన జీవనశైలిని మార్చుకోవాల్సిన అవసరమూ ఉండదు. తగిన పోషకాలున్న ఆహారం సగం సమస్యలు తీరుస్తుంది. ఉదాహరణకు ప్రోటీన్లు.. రోగ నిరోధక వ్యవస్థలోని అన్ని కణాలకు, ఇతర కణాలకు కూడా ప్రొటీన్లలో ఉండే ఎల్–ఆర్జినిన్ అవసరముంటుంది. ఈ ఎల్–ఆర్జినిన్ శరీరంలో హెల్పర్ టి–సెల్స్ ఉత్పత్తి అయ్యేందుకు ఉపయోగపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. పండ్లు, కూరగాయలు తగినంత మోతాదులో తీసుకోవడం (భారతీయులు రోజుకు కనీసం 400 గ్రాములు తీసుకోవాలి) వల్ల శరీరానికి అవసరమైన పోషకాలన్నీ లభిస్తాయి. తద్వారా రోగ నిరోధక వ్యవస్థకు బలం చేకూరుతుంది. రోగనిరోధక కణాల్లో సుమారు 70 శాతం మన కడుపు/పేగుల్లో ఉంటాయని సైన్స్ చెబుతోంది. కాబట్టి జీర్ణ వ్యవస్థను కాపాడుకోవడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండేలా చూసుకోవచ్చు. జీర్ణ వ్యవస్థలో సుమారు వెయ్యి రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. వీటిలో అత్యధికం శరీరానికి మేలు చేసేవే కాబట్టి.. వీటిలో సమతుల్యం ఉండేలా చూడాలి. పెరుగు తదితర ప్రోబయోటిక్స్ తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థలో సమతుల్యత చెడకుండా చూసుకోవచ్చు. విటమిన్లు, యాంటీయాక్సిడెంట్లు తగినన్ని శరీరానికి అందేలా చేయడం ముఖ్యమే. సూర్యరశ్మితో శరీరంలో ఉత్పత్తి అయ్యే విటమిన్–డి మరీ ముఖ్యం. వ్యాయామం కూడా శరీర రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుందని ఇప్పటికే పలు పరిశోధనల ద్వారా స్పష్టమైంది. మంచి ఆహారం తీసుకోవాలి.. తగినంత వ్యాయామం చేయాలి.. ఒత్తిడి తగ్గించుకోవాలి.. ఇవన్నీ చేయగలిగితే కరోనాను దూరం పెట్టడం పెద్ద కష్టమేమీ కాదు! – సాక్షి, హైదరాబాద్ -
ఇదీ తుది దశ...
వైరస్ సోకిన తరువాత దగ్గు, జలుబు లక్షణాలు కనిపిస్తున్నా వైద్యం చేయించుకోకపోతే పొడిదగ్గు ఎంత తీవ్రమవుతుందంటే.. ఒక్కో దగ్గుకు మీ వెన్ను భాగం కలుక్కుమంటుంది. వైద్యులు పరీక్షలు జరిపి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారిస్తారు. ఐసోలేషన్ వార్డులో ఉంచుతారు. సీటీ స్కాన్ చేస్తే.. ఊపిరితిత్తుల్లో ద్రవాలు అక్కడక్కడా పోగుబడి ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థకు, వైరస్‌కు మధ్య యుద్ధం జరిగేది ఈ ద్రవాలు ఉన్నచోటే. ఇంకోలా చెప్పాలంటే ఈ దశలో కోవిడ్‌తోపాటు ప్రమాదకర స్థాయిలో న్యుమోనియా కూడా ఉందన్నమాట. వైద్యులు ఐవీ ఫ్లూయిడ్స్‌తో చికిత్స మొదలుపెడతారు. దీంతో శరీరానికి తగిన పోషకాలు అందుతాయి. యాంటీ వైరల్ మందులు ఇస్తారు. వయసు మీరి ఉన్నా, మధుమేహం, గుండెజబ్బు వంటి ఆరోగ్య సమస్యలుంటే.. పరిస్థితి మెరుగుపడదు సరికదా, మరింత క్షీణిస్తుంది. రోజులపాటు వాంతులవుతాయి. గుండె కొట్టుకునే వేగం నిమిషానికి యాభైకి పడిపోతుంది. ఈ దశలో శరీర రోగ నిరోధక వ్యవస్థ సైటోకైన్స్‌ను విపరీతంగా ఉత్పత్తి చేస్తుంది. తెల్ల రక్త కణాలు ఊపిరితిత్తులపై దాడి చేస్తాయి. కణజాలం నశించిపోవడం, ద్రవాలు పేరుకుపోవడం ఎక్కువవుతుంది. దీంతో రక్తం నుంచి ఆక్సిజన్‌ను సేకరించే వ్యవస్థ నాశనమవుతుంది. తర్వాత ఒక్కో అవయవం పనిచేయడం ఆగిపోతుంది. కాలేయం పని చేయకపోతే రక్తంలోని విషాలు బయటకు వెళ్లవు. ఇంకోవైపు ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల మెదడు కణాలు నశించిపోతుంటాయి. డాక్టర్ల మాటలు సగం సగమే వినపడుతుంటాయి. ఊపిరితిత్తులు, గుండె పని చేసేందుకు బయటి నుంచి యంత్రాన్ని ఏర్పాటు చేస్తారు. కొన్ని గంటల నరకయాతన తరువాత.. శ్వాశ ఆగిపోతుంది. సబ్బుకు, వైరస్‌కు వైరమెందుకు 1. కరోనా వైరస్ పైపొర కొవ్వులు, ఇతర ప్రొటీన్లతో తయారై ఉంటుంది. మధ్యమధ్యలో కొన్ని ప్రొటీన్లు బయటకు పొడుచుకు వచ్చి ఉంటాయి. వీటిని స్పైక్ ప్రొటీన్లు అంటారు. స్పైక్ ప్రొటీన్: వైరస్ లోపలికి ప్రవేశించేందుకు కారణమవుతుంది. ఇది కొవ్వులు, ఇతర ప్రొటీన్లతో కూడిన పై పొర. 2. సబ్బు అణువులు హైబ్రిడ్ నిర్మాణం కలిగి ఉంటాయి. తల భాగానికి నీటితో అతుక్కుపోయే గుణం ఉంటే, తోక భాగం నీటిని వికర్షిస్తూంటుంది. హైడ్రోఫిలిక్ తల: నీటితో బంధం ఏర్పరచుకుంటుంది. హైడ్రోఫోబిక్ తోక: నీటితో కాకుండా, నూనెలు, కొవ్వులతో బంధం ఏర్పరచుకుంటుంది. 3. చేతులు కడుక్కునే క్రమంలో సబ్బు అణువుల్లోని తోకలు వైరస్ పైపొర వైపు ఆకర్షితమవుతాయి. సూదుల్లాంటి నిర్మాణం ఉండటం వల్ల కొవ్వులతో తయారైన పై పొరకు కన్నాలు పడతాయి. ఫలితంగా వైరస్ లోపల ఉండే ఆర్ఎన్ఏ జన్యుపదార్థం బయటకు వస్తుంది. వ్యర్థాలతోపాటు వైరస్ తాలూకు ముక్కలు మిసిల్లే అని పిలిచే చిన్నచిన్న బుడగల్లా మారిపోతాయి. -
అంతా బాగున్నా..
వైరస్ జీర్ణ వ్యవస్థలోకి చేరే వరకు దాని లక్షణాలేవీ బయటపడవు. అంతా బాగుంది కదాని అనుకునేలోపు.. శరీరంలో వైరస్ ఆర్ఎన్ఏ హైజాక్ చేసిన కణాలతో రోగ నిరోధక వ్యవస్థ మేల్కొంటుంది. అది.. సైటోకైన్ అనే రసాయనాలను విడుదల చేస్తుంది. అవి.. వైరస్ బారినపడ్డ కణాలను గుర్తించి నాశనం చే యడం మొదలుపెడతాయి. దీంతో జ్వరం వస్తుంది. ఆహారం తీసుకుంటే వామిటింగ్ సెన్సేషనల్ కలుగుతుంది. గంటల వ్యవధి లో ఛాతీ పట్టేసిన అనుభూతి.. పొడి దగ్గు మొదలై ఎంతకీ ఆగదు. కరోనా వైరస్ బారినపడ్డ వారిలో 80 శాతం మంది తేలికపాటి జలుబు లక్షణాలే కలిగి ఉండటం, సుమారు 13 శాతం మందిలో లక్షణాల తీవ్రత ఎక్కు వగా, 5 శాతం మందిలో విషమంగా ఉన్నట్టు పరిశోధనలు బలపరుస్తున్నాయి. -
కణాధారిత చికిత్సలదే భవిష్యత్తు
సాక్షి, హైదరాబాద్: మనిషికి వచ్చే అనేక రకాల వ్యాధులను మందులతో కాకుండా.. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ సాయంతోనే చికిత్స చేసే కాలం దగ్గర్లోనే ఉందంటున్నారు డాక్టర్ కార్ల్ జూన్. కేన్సర్ చికిత్స ఇమ్యూనోథెరపీకి ఆద్యుడు.. రోగ నిరోధక వ్యవస్థలోని టి–కణాలను కేన్సర్ వ్యాధిపై పోరాటానికి సిద్ధం చేసిన వ్యక్తి కార్ల్ జూన్.. హైదరాబాద్‌లో జరుగుతున్న బయో ఆసియా సదస్సుకు హాజరయ్యారు. జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డును అందుకున్న ఆయ నను ‘సాక్షి’ మంగళవారం పలకరించింది. కార్–టి కణచికిత్స ఆలోచనకు దారితీన పరిస్థితులు, పురోగతి.. తదితర అంశాలపై ఆయనతో జరిగిన సంభాషణ ఇలా ఉంది.. ప్రశ్న: రోగ నిరోధక వ్యవస్థ కణాలనే కేన్సర్‌కు వ్యతిరేకంగా వాడొచ్చన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? జవాబు: రోగ నిరోధక వ్యవస్థలోని టి–కణాలను కేన్సర్‌కు వ్యతిరేకంగా వాడటమే తొలి కణాధారిత చికిత్స కాదు. ఎముక మజ్జను మార్పిడి చేయడం కూడా ఆ కోవకు చెందిన చికిత్సే. 1980లలో నేను ఈ రంగంలో పనిచేసే వాడిని. రోగికి సంబంధం లేని వ్యక్తి ఎముక మజ్జను వాడినప్పుడు మెరుగైన ఫలితాలు వస్తున్నట్లు గుర్తించాం. దీనికి కారణమేంటన్నది అన్వేషించినప్పుడు టి–కణాల గురించి తెలి సింది. ఆ పరిశోధనల ఆధారంగా కార్–టి సెల్ థెరపీకి సంబంధించిన ఆలోచన వచ్చింది. టి– కణాల్లో మార్పుల ద్వారా మజ్జ మార్పిడి ప్రక్రియ లేకుండానే కేన్సర్‌కు చికిత్స అందించొచ్చన్న ఆలోచనతో దీన్ని మొదలుపెట్టాం. ప్ర: వ్యాధికారక బ్యాక్టీరియా, వైరస్‌లను చంపేయడమే ఇప్పటివరకు పలు వ్యాధుల చికిత్సకు వాడుతున్న పద్ధతి. ఇలా కాకుండా శరీర వ్యవస్థలను బలోపేతం చేయడం వ్యాధులను నియంత్రించడం సాధ్యమేనా? జ: రోగ నిరోధక వ్యవస్థలో రకరకాల కణాలు ఉన్నాయి. కొన్ని బ్యాక్టీరియాలను నాశనం చేసేందుకు ఉపయోగపడితే టి–కణాల్లాంటివి వైరస్‌లను మట్టుబెట్టేందుకే పరిణమించాయి. బీ–కణాలు తయారుచేసే యాంటీబాడీలు బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములకు అతుక్కుపోవడం ద్వారా అవి నాశనమయ్యేందుకు తోడ్పడతాయి. ఈ ప్రాథమిక ధర్మాల ఆధారంగా భవిష్యత్తులో ఎయిడ్స్ లాంటి వ్యాధులకూ చికిత్స చేయొచ్చు. మధుమేహం, ఆర్థరైటిస్ వంటి వ్యాధుల చికిత్సకూ కణాధారిత చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. ప్ర: కరోనా వైరస్‌కు విరుగుడుగా టీ– కణాలను వాడొచ్చా? జ: వాడొచ్చు. ప్రస్తుత పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే కరోనా వైరస్ నియంత్రణకు ఒక వ్యాక్సిన్ పనిచేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కార్–టి వంటి కణాధారిత చికిత్సల అవసరం ఉండకపోవచ్చు. ఇప్పటికే కోవిడ్–19 బారిన పడి స్వస్థత చేకూరిన వారి రక్తంలో వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు మెండుగా ఉంటాయి. ఇలాంటి వారి నుంచి సేకరించిన సీరమ్‌ను ఎక్కించడం ద్వారా ఇతరులకు సోకకుండా చేయొచ్చు. ప్ర: ప్రస్తుతం మీరు ఏ అంశాలపై ప్రయోగాలు చేస్తున్నారు? జ: కార్–టి చికిత్స విధానానికి జన్యు ఎడిటింగ్ టెక్నాలజీ క్రిస్పర్ను జోడించేందుకు ప్రయత్నం చేస్తున్నా. ఇది కేన్సర్ కణితులపై మంచి ఫలితం చూపిస్తుందని అంచనా. ప్ర: కార్–టి పద్ధతి అన్ని విధాలుగా మెరుగైన కేన్సర్ చికిత్సేనా? జ: అమెరికాలో ఈ పద్ధతి ఇప్పటికే చాలా మంది ల్యూకేమియా, లింఫోమా రోగులకు చికిత్స కల్పించింది. త్వరలోనే ఎముక మజ్జకు వచ్చే మైలోమా రకం కేన్సర్‌కు కూడా ఎఫ్‌డీఏ అనుమతులు రానున్నాయి. మైలోమా చికిత్సకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. దీని వల్ల రెండు మూడేళ్లు మాత్రమే బతుకుతారనే వారు పదేళ్ల వరకూ మనుగడ సాగించవచ్చు. కేన్సర్ చికిత్సకు మరికొన్ని మార్గాలున్నాయి. కణాల మధ్య సమాచార ప్రసారానికి ఉపయోగపడే ఎగ్జోజోమ్స్. వీటిని ఎలా తయారు చేస్తారన్న అంశంపై ఇది ఆధారపడి ఉంటుంది. వేర్వేరు రకాల చికిత్స పద్ధతులను కార్–టి చికిత్స విధానంతో కలిపి వాడే అవకాశాలున్నాయి. ప్ర: కార్–టి కణాల చికిత్సను భారత్‌లో విస్తృతంగా ఉపయోగించాలంటే ఏం చేయాలి? జ: కార్–టి కణాల తయారీ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇప్పటివరకు టి–కణాలను పరిశోధన సంస్థల్లోనే తయారు చేస్తున్నారు. నోవర్టిస్ లాంటి సంస్థ వాణిజ్య స్థాయి ఉత్పత్తి మొదలుపెట్టినా అది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు కొంత సమయం పడుతుంది. ప్ర: భారత ప్రభుత్వంతో కలసి పనిచేసే అవకాశం ఉందా? జ: కచ్చితంగా.. కార్–టి చికిత్స విధానంపై ప్రభుత్వం తయారు చేసిన మార్గదర్శకాలను పరిశీలించి తగిన సలహా సూచనలు ఇవ్వాలన్నది ఆలోచన. బయోకాన్ కంపెనీతో పాటు, కేన్సర్ నిపుణులు సిద్ధార్థ ముఖర్జీ వంటి వారితో కలసి కంపెనీ పెట్టే ఆలోచన కూడా ఉంది. -
ఉదయంపూట కీళ్లు పట్టేస్తున్నాయి
నా వయసు 39 ఏళ్లు. నేను పదేళ్లగా కీళ్లనొప్పుల సమస్యతో బాధపడుతున్నాను. పొద్దున లేవగానే కీళ్లన్నీ పట్టేసి జ్వరం వచ్చినట్లుగా ఉండి, మధ్యాహ్నానికి ఉపశమనం ఉంటోంది. ఈఎస్ఆర్ పెరిగి ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చిందన్నారు. ఈ కీళ్లనొప్పులకు హోమియోలో చికిత్స ఉందా? మీకు వచ్చిన వ్యాధిని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఇది ఆటోఇమ్యూన్ వ్యాధుల్లో ఒకరక. మన శరీరం వ్యాధుల బారిన పడకుండా కాపాడటానికి, వాటితో పోరాడటానికి ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఆ రక్షణ వ్యవస్థ పొరబడి తన సొంత శరీరంపైనే దాడి చేస్తే వచ్చే సమస్యల్లో ఇది ఒకటి. ఈ వ్యాధి శరీరంలోని ఇరుపక్కలా సమాంతరంగా వ్యాప్తి చెందుతుంది. కీళ్లు తీవ్రమైన వాపునకు గురికావడంతో వాటి కదలికలు పూర్తిగా స్తంభిస్తాయి. దాంతో కీళ్లు వైకల్యానికి గురికావడం జరుగుతుంది. కీళ్లనొప్పులు, వాపు, కీళ్లు పట్టివేయడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. కీళ్లు మాత్రమే కాకుండా కళ్లు, నోరు, ఊపిరితిత్తులకు వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఒక్కోసారి ఒకటి కంటే ఎక్కువ కీళ్లలో కనిపిస్తుంది. అయితే మొదట చేతివేళ్లు, కాలివేళ్ల వంటి చిన్న చిన్న కీళ్లలో మొదలై ఆ తర్వాత మోచేయి, మోకాలు, తుంటి వంటి పెద్ద కీళ్లలోకి పాకుతుంది. కారణాలు: ►శరీరంలోని జీవక్రియల్లో అసమతౌల్యత, రోగ నిరోధక వ్యవస్థలోని మార్పుల వల్ల ఈ జబ్బు వస్తుంది ►శారీరక, మానసిక ఒత్తిడి ►పొగతాగడం, మద్యం అలవాటు ఉన్నవారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ ►ఆరోగ్య పరమైన జాగ్రత్తలు అస్సలు పాటించని వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. లక్షణాలు: ►నిరాశ, అలసట, ఆకలితగ్గడం, బరువు తగ్గడం ►మడమ చేతి ఎముకలపై చిన్న గడ్డలు రావడం ►ఉదయం లేచిన వెంటనే కీళ్లు బిగపట్టినట్లుగా ఉండి, నొప్పి ఉండటం ►ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం, ఊపిరితిత్తులు గట్టిపడటం ►రక్తహీనత, జ్వరం వంటివి. నిర్ధారణ పరీక్షలు: సీబీపీ, ఈఎస్ఆర్, ఎక్స్–రే, ఎమ్మారై, ఆర్.ఏ. ఫ్యాక్టర్, ఏఎన్ఏ, ఎల్ఎఫ్టీ. చికిత్స: రోగి మానసిక, శారీరక లక్షణాలను అనుసరించి చికిత్స చేయాల్సి ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. బ్రయోనియా, రస్టాక్స్, కాల్చికమ్, ఆర్సినికమ్, లైకోపోడియమ్, నేట్రమ్మూర్ మొదలైన మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే వ్యాధి సమూలంగా నయమవుతుంది. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ -
క్రిస్పర్‌తో అందరికీ సరిపోయే మూలకణం!
శరీరంలోని ఏ కణంగానైనా, అవయవంగానైనా మారిపోగల సామర్థ్యం మూలకణాల సొంతం. అయితే ఒకరి మూలకణాలు ఇంకొకరికి సరిపోవు. అందరికీ సరిపోయేలా మూలకణాలను తీర్చిదిద్దగలిగితే.. ఎన్నో వ్యాధులకు సమర్థమైన చికిత్స అందించడం వీలవుతుంది. ఈ అద్భుతాన్ని సాధించారు కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఈ సార్వత్రిక మూలకణాలు రోగ నిరోధక వ్యవస్థ కళ్లుగప్పి పనిచేయడం ఇంకో విశేషం. పెద్దల్లోని మూలకణాలను పిండ మూల కణాల లక్షణాలు కనపరిచేలా చేయగలరని దశాబ్దం క్రితం ప్రపంచానికి తెలిసినప్పటి నుంచి వాటిని సమర్థంగా వాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అయితే నాణ్యత.. పునరుత్పత్తి విషయంలో కొన్ని సమస్యలు రావడంతో విస్తృత వినియోగంలోకి రాలేకపోయాయి. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా వర్శిటీ శాస్త్రవేత్తలు జన్యు ఎడిటింగ్ టెక్నాలజీ క్రిస్పర్ను ఉపయోగించి ఏ మూలకణాన్నైనా పిండ మూల కణాల లక్షణాలు కనిపించేలా మార్చగలిగారు. ఇందుకోసం రెండు జన్యువులను పనిచేయకుండా చేశామని, సీడీ47 అనే జన్యువు ద్వారా ఎక్కువ మోతాదులో ప్రొటీన్లను ఉత్పత్తి చేయించడం ద్వారా లక్ష్యాన్ని చేరుకున్నామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డ్యూస్ తెలిపారు. జంతువులపై జరిగిన పరిశోధనలు సంతప్తికరంగా ఉన్నాయని వివరించారు. అంతేకాకుండా.. ఈ కొత్త సార్వత్రిక మూలకణాలతో తాము గుండె కండర కణాలను తయారు చేశామని.. ఎలుకల్లోకి వీటిని జొప్పించి పరిశీలించామని వివరించారు. -
కేన్సర్ ఇక ఖతమే!
కేన్సర్ సోకిందంటే చాలు.. ఇక మరణమే అని అనుకునేవారు ఒకప్పుడు! సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన మార్పులో..పరిశోధనల ఫలితమో కానీ ఇప్పుడు ఈ వ్యాధి సోకినా కొన్నేళ్లపాటు బతికేయొచ్చు అన్న భరోసా వచ్చింది.. ఇప్పటికీ సాధ్యం కాని విషయం ఏంటంటే..కేన్సర్‌ను నయం చేయడం! ఈ లోటును ఏడాదిలోపే తాము భర్తీ చేస్తామంటోంది ఏఈబీఐ అంతటి అద్భుతం ఈ కంపెనీ చేతిలో ఏముంది? ఏటా రెండు కోట్ల మంది ప్రాణాలు బలితీసుకుంటున్న కేన్సర్ మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఏఈబీఐ ఓ వినూత్నమైన మార్గాన్ని ఎంచుకుంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే.. హెచ్ఐవీ చికిత్సను ఒక్కసారి గుర్తుచేసుకోవాలి. ఒకప్పుడు ఈ వ్యాధికి బోలెడన్ని మాత్రలు ఇచ్చేవారు. రోజుకు ఇరవై ముప్పై మాత్రలు వేసుకున్నా ప్రాణాలకు గ్యారంటీ ఉండేది కాదు. కానీ.. యాంటీరెట్రోవైరల్ డ్రగ్స్ (ఏఆర్టీ) రంగ ప్రవేశంతో ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. మూడు మందులను కలిపివాడే ఈ ఏఆర్టీ మందుల వాడకంతో ఇప్పుడు హెచ్‌ఐవీతోనూ దశాబ్దాల పాటు బతకడం సాధ్యమవుతోంది. దాదాపు ఇలాంటి పద్ధతినే కేన్సర్ వ్యాధికి వర్తింప జేసింది ఇజ్రాయెల్ కంపెనీ ఏఈబీఐ. ఈ పద్ధతికి ఏఈబీఐ పెట్టిన పేరు ముటాటో. మల్టీటార్గెట్ టాక్సిన్‌కు క్లుప్తరూపం ఈ ముటాటో. కేన్సర్ చికిత్సకు ఇప్పటివరకూ వాడుతున్న వేర్వేరు పెప్టైడ్లను కలిపి వాడటం ఈ పద్ధతిలోని కీలకాంశం. ఇవన్నీ ఏకకాలంలో కేన్సర్ కణాలపై దాడి చేస్తాయి. ఫలితంగా కేన్సర్ కణాలు నాశనమవుతాయని ఏఈబీఐ సీఈవో ఇలాన్ మొరాద్ చెబుతున్నారు. ఈ కొత్త పద్ధతి కేన్సర్ కణాల సృష్టికి కారణమైన మూలకణాలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుందని అంటున్నారు. కేన్సర్ కణాలు సాధారణంగా రోగ నిరోధక వ్యవస్థ కళ్లు కప్పేందుకు డీఎన్ఏలో మార్పులు జరుగుతుంటాయని.. తమ పద్ధతి ద్వారా ఇది కూడా వీలుకాదని వివరించారు. పరిశోధనకు నోబెల్.. ఏఈబీఐ అభివృద్ధి చేస్తున్న కొత్త కేన్సర్ చికిత్స పద్ధతి ఇంకో ఏడాదిలోపే అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఇలాన్ చెబుతున్నారు. ఎస్ఓఏపీ అనే ప్లాట్‌ఫాం ద్వారా అన్ని రకాల కేన్సర్లపై పోరాడే లక్షణాలు ఉన్న పెప్టైడ్లను గుర్తించడం ద్వారా ఈ కొత్త పద్ధతి తొలి రోజు నుంచి ప్రభావం చూపుతుం దని అంచనా. బ్యాక్టీరియాలపై దాడి చేసే వైరస్‌లోకి నిర్దిష్ట ప్రొటీన్లను ఉత్పత్తి చేసే డీఎన్ఏ పోగులను ప్రవేశపెట్టడం ద్వారా ఇది జరుగుతుంది. ఈ ప్రొటీన్‌ను సులువుగా గుర్తించవచ్చని, అదెలా పనిచేస్తుందో కూడా గమనిస్తుండవచ్చని చెబుతున్నారు. ఈ పద్ధతి ద్వారా కొత్త, వినూత్నమైన పెప్టైడ్లను సృష్టించొచ్చన్న పరిశోధనకే గతేడాది నోబెల్ బహుమతి దక్కింది. ఏఈబీఐ ఎలుకలపై ప్రయోగాలు చేసి సానుకూల ఫలితాలు రాబట్టింది. వ్యక్తిగత వైద్యం.. ముటాటో కేన్సర్ చికిత్స పద్ధతిలో ఉండే ఇంకో విశేషం ఇది అందరికీ ఒకే మందు ఇవ్వడం కుదరదు. కేన్సర్ కణితి నుంచి నమూనా సేకరించి అందులో ఎక్కువగా కనిపిస్తున్న కణ లక్ష్యాలను ముందుగా గుర్తిస్తారు. ఆ తర్వాత వాటికి విరుగుడుగా పనిచేసే పెప్టైడ్లను సిద్ధం చేసి అందిస్తారు. అంటే ఇది వ్యక్తిగత వైద్యం అన్నమాట. వేర్వేరు కేన్సర్లకు అవసరమైన పెప్టైడ్లన్నీ ఒకే ప్లాట్‌ఫాంపై ఏర్పాటు కావడం వల్ల కేన్సర్ కణాలకు మాత్రమే నష్టం జరుగుతుందని కంపెనీ చెబుతోంది. కేన్సర్‌కు ప్రస్తుతం ఉపయోగిస్తున్న కీమోథెరపీ, రేడియేషన్ చికిత్స పద్ధతులు అనేక దుష్ప్రభావాలు చూపుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. బహుళ పెప్టైడ్ విధానం వల్ల ఈ సమస్యలేవీ ఉండవు. పైగా ముటాటో మందులు జీవితాంతం వాడాల్సిన అవసరం లేదు. కొన్ని వారాల పాటు మందులు వాడితే సరిపోతుంది. అంతా బాగుందికానీ.. ఏఈబీఐ ప్రయోగాలకు సంబంధించి ఇప్పటివరకూ ఇతర శాస్త్రవేత్తల సమీక్ష జరగలేదు. ఈ లోటును కూడా పూరించుకుంటే కేన్సర్‌పై పోరులో కొత్త అధ్యాయం మొదలైనట్లే. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ప్రొటీన్ పూతతో మందుకు పది రెట్ల బలం!
కేన్సర్ కణుతులను లక్ష్యంగా చేసుకుని పనిచేసే మందులు ఇప్పటికే బోలెడున్నాయి. వీటన్నింటితో ప్రయోజనం మాత్రం చాలా తక్కువ. దక్షిణ కొరియాకు చెందిన ఉల్సాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనలు పూర్తిస్థాయిలో విజయవంతమైతే మాత్రం ఈ పరిస్థితి మారిపోతుంది. మందుల ప్రభావం పది రెట్లు పెరగడమే కాకుండా.. దుష్ప్రభావాలు కూడా గణనీయంగా తగ్గనున్నాయి. ఇప్పటివరకు ఉపయోగిస్తున్న మందులు కేన్సర్ కణితిని చేరే లోపు బోలెడన్ని ప్రొటీన్లు వాటికి అతుక్కుపోవడం వల్ల ప్రభావం తక్కువగా ఉందని చాలాకాలం క్రితమే గుర్తించారు. ఈ సమస్యను అధిగమించేందుకు కొరియా శాస్త్రవేత్తలు మందులపై ప్రత్యేకమైన ప్రొటీన్ పూత పూశారు. ఇది ఒంటరిగానే పనిచేస్తుంటుంది. నానోస్థాయి మందులపై ప్రొటీన్ పూత పూసి తాము ముందుగా కంప్యూటర్ లో సిములేట్ చేశామని రోగ నిరోధక వ్యవస్థ కళ్లుగప్పి మరీ ఇవి కణితిపై దాడిచేయగలిగాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త హ్యోయుంగ్ రో తెలిపారు. ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లోనూ తాము సానుకూల ఫలితాలు రాబట్టగలిగామని, ఈ పద్ధతిని కేవలం కేన్సర్‌కు మాత్రమే కాకుండా వేర్వేరు వ్యాధుల నిర్ధారణ, చికిత్సలకు ఉపయోగించవచ్చునని వివరించారు. -
కేన్సర్‌కు కృత్రిమ వైరస్ విరుగుడు!
శరీరంలోని కేన్సర్ కణాలన్నింటినీ టకటక నమిలి మింగేస్తే...? పనిలోపనిగా వాటిపక్కన ఉండే హానికారక ఫైబ్రోబ్లాస్ట్‌ల నాశనమూ జరిగిపోతే? ఈ అద్భుతం సాకారమవుతోంది అంటున్నారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. తాము సృష్టించిన కృత్రిమ వైరస్ అటు కేన్సర్ కణాలతోపాటు అవి రోగనిరోధక వ్యవస్థకు చిక్కకుండా చేసే ఫైబ్రోబ్లాస్ట్‌లను కూడా నాశనం చేస్తుందని వీరు తెలిపారు. ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ వైరస్ ఇప్పటికే కొన్ని క్లినికల్ ట్రయల్స్‌లో వాడుతూండటం! ఎనాడినోటుసిరీవ్ అని పిలుస్తున్న ఈ వైరస్ కేవలం కేన్సర్ కణాలపై మాత్రమే దాడిచేయడం ఇంకో ముఖ్యమైన అంశం. కేన్సర్ కణాలు టి–సెల్ ఎంగేజర్ అనే ప్రొటీన్‌ను ఉత్పత్తి చేసేలా ఈ వైరస్ కొన్ని సంకేతాలు పంపుతుంది. ఈ టి–సెల్ ఎంగేజర్ ఒకవైపు ఫైబ్రోబ్లాస్ట్‌లను ఇంకోవైపు రోగ నిరోధక వ్యవస్థకు చెందిన టి–కణాలతోనూ అతుక్కుంటుంది. దీంతో టి–కణాలు ఫైబ్రోబ్లాస్ట్‌లను నాశనం చేసేందుకు ప్రయత్నం చేస్తాయి. అంతేకాకుండా టి–సెల్ ఎంగేజర్ ప్రొటీన్ కేన్సర్ కణితి లోపల ఉండే రోగ నిరోధక వ్యవస్థ కణాలను కూడా చైతన్యవంతం చేస్తుందని ఫలితంగా అవి కూడా కేన్సర్ కణాలను మట్టుబెట్టడంలో మునిగిపోతాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ జాషువా ఫ్రీడ్‌మ్యాన్ తెలిపారు. ఎలుకలతోపాటు పరిశోధనశాలలో మానవ కేన్సర్ కణాలపై జరిపిన ప్రయోగాల్లో ఈ కొత్త పద్ధతి మంచి ఫలితాలివ్వడం గమనార్హం. -
కణకణంలోనూ కిల్లర్ కోడ్!
నార్త్‌వెస్టర్న్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఓ ఆసక్తికరమైన ఆవిష్కరణ చేశారు. మన శరీరంలోని ప్రతి కణంలో ఉండే రహస్యమైన కోడ్‌ను వీరు గుర్తించారు. కణం అదుపు తప్పి పోతుందనుకున్నప్పుడు తనను తాను చంపేసుకునేందుకు ఈ కోడ్ ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కోడ్, దాని వెనుకనున్న వ్యవస్థను క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగితే భవిష్యత్తులో కేన్సర్ అనేది అస్సలు ఉండదని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త మార్కస్ పీటర్ అంటున్నారు. రోగనిరోధక వ్యవస్థ ఏర్పడకముందు బహుకణ జీవుల్లో కేన్సర్ లాంటి ముప్పులను తట్టుకునేందుకు ఏదైనా వ్యవస్థ ఉందా? తెలుసుకునేందుకు మార్కస్ పరిశోధనలు చేపట్టారు. అతిసూక్ష్మమైన ఆర్ఎన్ఏ కణాలను చైతన్యవంతం చేయడం ద్వారా ముప్పులను అడ్డుకునేందుకు అతిపురాతన కాలం నుంచి ఓ వ్యవస్థ పనిచేస్తున్నట్లు గత ఏడాది స్పష్టమైంది. కీమోథెరపీ కూడా ఇదేరకంగా పనిచేస్తూండటం ఇక్కడ గమనార్హం. ఆరు న్యూక్లియోటైడ్లతో కూడిన మూలకాలు కేన్సర్ కణాలను నాశనం చేస్తున్నట్టు గుర్తించిన శాస్త్రవేత్తలు మొత్తం 4096 మూలకాలలో కచ్చితంగా ఏది ఈ పనిచేస్తోందో తెలుసుకోగలిగారు. ఈ మూలకం ఆధారంగా మందులు తయారు చేస్తే నిరోధకత అన్నది ఉండదని, కీమోథెరపీ అవసరం లేకుండా కేన్సర్ కణాలను నాశనం చేయవచ్చునని పీటర్ తెలిపారు. -
కీళ్లవాతం.. కొన్ని నిజాలు
కీళ్లవాతం మనిషికి తెలిసిన జబ్బుల్లో అత్యంత పురాతనమైన, దీర్ఘకాలిక వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలమంది ప్రజలు కీళ్లవాతం వ్యాధులతో బాధపడుతున్నారు. ఐయితే చాలామంది తమ బాధల గురించి వైద్యులకు చెప్పరు. ఇది వయసు పెరుగుతున్నకొద్దీ వచ్చే సమస్యని అంగీకరిస్తారు. మరికొంతమంది ఈ సమస్యకు చికిత్స లేదని భావిస్తారు. ఇవేమీ నిజం కాదు. కీళ్లవాతం అంటే... కీళ్లవాతం అంటే కేవలం కీళ్ల దగ్గర మాత్రమే ఉంటుందనీ శరీరంలో ఏ ఇతర అవయవాల మీద దాని ప్రభావం ఉండదన్నది వాస్తవం కాదు. కీళ్లవాతం అనేది ఒక సాధారణమైన పదం. కానీ కీళ్లవాత సంబంధిత వ్యా«ధుల్లో వందకు పైగా రకాలున్నాయి. సమాజంలో ఈ వ్యాధులపైన పూర్తి అవగాహన లేదు. ఈ వ్యాధులకు పూర్తి స్థాయిలో వైద్యం చేసే అర్హులైన రుమటాలజిస్టులు కూడా దేశంలో చాలా తక్కువమందే ఉన్నారు. ఈ రెండు కారణాలవల్ల ఈ వ్యాధులతో రోగికి ఎంతో నష్టం చేకూరుతోంది. అసలు ఈ జబ్బులు ఎందుకు వస్తాయి? మన శరీరంలో ఉన్న రోగ నిరోధక వ్యవస్థ మనలోకి ఇన్ఫెక్షన్ కలగజేసే క్రిములు చొరబడకుండా కాపాడుతుంది. అయితే కొన్ని పరిస్థితుల వల్ల కంచే చేను మేసినట్లుగా ఈ రోగనిరోధక వ్యవస్థ మన సొంత అవయవాల మీదే దాడికి దిగి శరీరాన్ని నాశనం చేస్తుంది. దీన్నే ఆటో ఇమ్యూనిటీ అంటారు. దీనివల్ల శరీరంలోని ఏ భాగంపై ప్రభావం పడుతుందో ఆ అవయవం పనితీరు తగ్గుతుంది. ఈ ప్రక్రియలో సాధారణంగా కీలు మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువ శాతం ఆటో ఇమ్యూన్ వ్యాధులలో కీళ్లనొప్పి మొదట బయటపడతాయి. కేవలం కీలు మీదే కాకుండా తల వెంట్రుక దగ్గర నుంచి కాలి గోరు వరకు దేనినైనా నాశనం చేసే శక్తి ఈ జబ్బులకు ఉంటుంది. జన్యుప్రవర్తన, పర్యావరణంలో జరిగే మార్పులు, అనేక రకాలైన వైరస్, ఇతర క్రిముల వల్ల ఈ జబ్బులు రావచ్చు. వీటిని గుర్తించడం ఎలా? కీళ్లవాతంలో కీళ్ల దగ్గర వాపు, నొప్పి, దృఢత్వం తగ్గడం అనేవి సాధారణంగా కనిపించే లక్షణాలు. అయితే ఈ జబ్బులు ఏ లక్షణాలతోనైనా మొదలయ్యే అవకాశాలు ఉంటాయి. నెమ్మదిగా చాప కింద నీరులా గానీ, అకస్మాత్తుగా గాని ప్రారంభం కావచ్చు. తేలికపాటిగా ఉండటం మొదలుకొని కొన్ని నిమిషాలు లేదా గంటలలోనే తీవ్రరూపం దాల్చేలా కూడా ఉండవచ్చు. దీని తీవ్రత తరచూ మారుతుంటాయి. అలాగే లక్షణాలు కూడా ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. అందరిలో ఒకేలా వ్యక్తం కావు. విపరీతమైన అలసట, బరువు తగ్గడం, ఆకలి మందగించడం అనేవి సాధారణ లక్షణాలు. వ్యాధి తీవ్రత ముదిరే ముందునుంచే ఈ లక్షణాలు ఉంటాయి. యుక్తవయసులో ఉన్నవారికి తరచూ గర్భస్రావం జరగడం, పక్షవాతం రావడం, గుండెపోటు రావడం, దీర్ఘకాలంగా మానని పుండ్లు, చర్మం మీద మచ్చలు, తరచూ విరేచనాలు, నడుమూ, మెడ నొప్పి, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, పొర ఏర్పడటం, నోరెండిపోవడం వంటివి సాధారణంగా కనిపించే లక్షణాలు. ఈ జబ్బులు ఎవరిలో రావచ్చు? వయసు పెరుగుతున్న కొద్దీ కీళ్లవాతానికి సంబంధించిన వ్యాధులు వచ్చే ముప్పు పెరుగుతుంది. బరువు ఎక్కువగా ఉండటం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఇవి తీవ్రరూపం దాలుస్తాయి. చిన్నవారిలో, పెద్దవారిలో మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ఇవి వచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా 25 నుంచి 40 ఏళ్ల వయసున్న మహిళల్లో ఇవి వచ్చే అవకాశాలు ఒకింత ఎక్కువ. సాధారణ కీళ్లవాతాలు : రుమటాయిడ్ ఆర్థరైటిస్ : ఈ జబ్బులో మన సొంత రోగనిరోధక వ్యవస్థ కీళ్ల మధ్యన ఉండే పొరపై ప్రభావం చూపి, కీళ్లను ధ్వంసం చేస్తుంది. చేతివేళ్లు, కాళ్ల వేళ్లు, మోచేతుల కీళ్లు ప్రభావితమవుతాయి. నిర్లక్ష్యం చేస్తే కీళ్లు పూర్తిగా చెడిపోయి వంకర్లు తిరుగుతాయి. గుండె, శ్వాసవ్యవస్థ, మెదడు, మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపించి ప్రాణాంతకంగా మారుతుంది. తొలిదశలోనే చికిత్స తీసుకోకపోతే మరణం సంభవించే అవకాశాలు 60% వరకు ఉంటాయి. ఎస్‌ఎల్‌ఈ/లూపస్: ఈ రోగుల్లో రోగనిరోధక వ్యవస్థ మితిమీరి ప్రవర్తిస్తుంది. శరీరంలోని చర్మం, కీళ్లు, కిడ్నీలు, రక్తకణాలు, మెదడుతో పాటు ఇతర అవయవాలను నాశనం చేస్తుంది. దీన్ని అత్యంత తీవ్రమైన జబ్బుగా పరిగణిస్తారు. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ జబ్బు వచ్చే అవకాశాలు ఐదు రెట్లు ఎక్కువ. ఈ వ్యాధిగ్రస్తుల్లో ఆరోగ్యసంబంధిత కారణాలతో జీవన నాణ్యత గణనీయంగా తగ్గిపోతుంది. అలాగే వీళ్లలో అంటువ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. ఇటీవల ఈ వ్యాధి కారణంగా హాస్పిటళ్లలో చేరేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. వ్యాధి ఉన్నవారిలో గర్భవతిగా ఉన్నప్పుడు బీపీ పెరుగుతుంది. పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే నెలలు నిండకుండానే బిడ్డపుట్టడం, బరువు తక్కువగా పుట్టడం వంటివి కూడా తరచూ జరుగుతుంటాయి. జాగ్రన్స్ సిండ్రోమ్ : రోగనిరోధక వ్యవస్థ మన శరీరంలోని తేమని ఉత్పత్తి చేసే గ్రంథుల మీద ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా ఒంటికి కావలసిన తేమ, లాలాజలం, కన్నీరు ఉత్పత్తి తగ్గి చర్మం, నోరు, కళ్లు ఎండిపోవడం జరుగుతుంది. విపరీతమైన అలసట ఉంటుంది. అలాగే కీళ్ల దగ్గర నొప్పి, వాపు వస్తాయి. ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, నాడీవ్యవస్థ పైన కూడా ప్రభావం పుడుతుంది. ఈ జబ్బు సాధారణంగా 40, 50 ఏళ్ల వయసులఉన్న మహిళల్లో ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధి తరచుగా ఇతర రుమాటిక్ వ్యాధులతో కలిసి వ్యక్తమవుతుంటుంది. మయోసైటిస్ : శరీర కదలికల్లో కండరాల భూమిక చాలా ప్రధానం. ఈ మయోసైటిస్ అనే తరహా కీళ్లవాతంలో మన రోగనిరోధక శక్తి కండరాలపై దాడిచేసి కదలకుండా మంచం పట్టేట్టు చేస్తుంది. తొలిదశలో గుర్తించకపోతే ఊపిరి తీసుకోడానికి తోడ్పడే కండరాలపై దాడి చేసి ప్రాణాంతకంగా మారుతుంది. అలాగే చర్మం, కీళు ఊపిరితిత్తుల మీద కూడా ఈ తరహా కీళ్లవాతం ప్రభావం చూపుతుంది. ఇది చిన్నపిల్లల్లోనూ తరచూ కనిపించవచ్చు. సిస్టమిక్ స్క్లిరోసిస్ : పురుషులతో పోలిస్తే, మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి బారిన పడ్డవారు నల్లగా మారడం, చర్మం బిగుతుగా మారి పుండ్లు పడటం, చల్లని వాతావరణంలో ఉన్నప్పుడు వేళ్లు నీలంగా, తెల్లగా మారి కుళ్లిపోవడం వంటివి తరచూ జరుగుతాయి. అలాగే దీని ప్రభావం గుండె, జీర్ణకోశం, ఊపిరితిత్తులు (ఐఎల్‌డి), కండరాలు, కీళ్ల మీద పడుతుంది. స్పాండైలో ఆర్థరైటిస్: మిగతా కీళ్లవాతాలకు భిన్నంగా ఇది పురుషుల్లో ఎక్కువగా వస్తుంది. దీన్ని యాంకైలోజింగ్ స్పాండలైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, రియాక్టివ్ ఆర్థరైటిస్, ఐబిడి ఆర్థరైటిస్ అనే రకాలుగా విభజించవచ్చు. యుక్తవయసులోని పురుషుల్లో విపరీతమైన నడుమునొప్పితో, నడుము దగ్గర బిగుతుగా పట్టేసి కదల్లేని స్థితి కలిగిస్తుంది. అశ్రద్ధ చేస్తే కాలక్రమేణా వెన్నెముక వెదురు కర్రలా మారిపోయి జీవననాణ్యత కోల్పోవడం జరుగుతుంది. వీరి చర్మంపై సోరియాటిక్ మచ్చలు, కళ్లలో యువిౖయెటిస్, తరచూ విరేచనాలు కావడం, మడమల్లో విపరీతమైన నొప్పి రావడం కూడా తరచూ జరుగుతంటాయి. పిల్లల్లో కీళ్లవాతం : జువెనైల్ ఆర్థరైటిస్ అనేది పిల్లల్లో తరచూ చూసే ఒక రకం కీళ్లవాతం. ఇది ఒకటి లేదా అంతకంటే ఎక్కవ కీళ్లను ప్రభావితం చేస్తుంది. ఈ జబ్బు ఉన్న పిల్లల్లో కంటిచూపు మీద ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఎక్కువ. -
దీర్ఘాయుష్షు కిటుకు రూఢీ అయింది..
కాయగూరలు, పండ్లు బాగా తింటే ఆయుష్షు పెరుగుతుందనేది చాలామంది నమ్మిక. ఇందులో నిజం లేకపోలేదు కూడా. కాకపోతే ఇదెలా జరుగుతోందన్నది మాత్రం తాజా పరిశోధన ద్వారా తెలిసింది. కాయగూరలు, పండ్లలో ఉండే ఫిసెటిన్ అనే ఫ్లేవనాయిడ్ పాడైపోయి.. విభజన ఆగిపోయిన కణాలను శరీరం నుంచి బయటకు పంపడంలో ఉపయోగపడతాయని, ఫలితంగా ఆరోగ్యంతోపాటు ఆయుష్షు కూడా మెరుగవుతుందని ఈ అధ్యయనం చెబుతోంది. సాధారణ పరిస్థితుల్లో మన రోగ నిరోధక వ్యవస్థ పాడైన కణాలను తొలగిస్తూంటుంది. అయితే వయసు పెరిగే కొద్దీ రోగ నిరోధక వ్యవస్థ సామర్థ్యమూ తగ్గిపోవడం వల్ల పాడైన కణాలు శరీరంలో పోగుపడుతూంటాయి. ఈ పరిణామం కాస్తా మంట, వాపులకు.. తద్వారా వ్యాధులకు దారితీస్తుందన్నమాట. ఈ నేపథ్యంలో పాడైన కణాలను శరీరం నుంచి తొలగించే మందుల తయారీకి ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. పది ఫ్లేవనాయిడ్లపై పరిశోధనలు జరగ్గా ఫిసెటిన్తో మంచి ఫలితాలు ఉన్నట్లు తెలిసింది. ఎలుకలతోపాటు మానవ కణజాలంపై జరిపిన ప్రయోగాల్లో మంచి ఫలితాలు రావడంతో మానవ ప్రయోగాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఫిసెటిన్ అనేది సహజసిద్ధమైన పదార్థం కావడం వల్ల మానవ ప్రయోగాలూ సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త పాల్ రాబిన్స్ అంటున్నారు. -
ప్రొటీన్ ఆధారిత మందులు వచ్చేస్తున్నాయి...
కేన్సర్ చికిత్సకు వాడే మందులతో బోలెడన్ని దుష్ప్రభావాలు ఉంటాయని అందరికీ తెలుసు. అందుకే ఈ దుష్ప్రభావాలను వీలైనంత తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో యూనివర్సిటీ ఆఫ్ కోపెన్హాగన్ శాస్త్రవేత్తలు విజయం సాధించారు. అతి సంక్లిష్టమైన ప్రొటీన్ల నిర్మాణాన్ని నియంత్రించడం ద్వారా అతితక్కువ చెడు ప్రభావాలను చూపగల కేన్సర్ మందుల తయారీకి వీరు మార్గం సుగమం చేశారు. ప్రొటీన్లతో కేన్సర్‌కు మాత్రమే కాకుండా అనేకానేక ఇతర వ్యాధులకు సమర్థమైన చికిత్స అందించవచ్చునని చాలాకాలంగా తెలిసినప్పటికీ సంక్లిష్ట నిర్మాణం కారణంగా ఇప్పటివరకూ అది సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ జెన్సిన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం కొన్ని పరిశోధనలు చేపట్టింది. హిస్–ట్యాగ్ అకైలేషన్ అని పిలిచే ఈ పద్ధతిలో ప్రొటీన్లకు నిర్దిష్టమైన పరమాణువులను అతికించడం సాధ్యమవుతుంది. ఈ రకమైన ప్రొటీన్లు కేవలం కేన్సర్ కణాలకు మాత్రమే అతుక్కుంటాయి. ఆరోగ్యకరమైన వాటిని వదిలేస్తాయి. ఫలితంగా దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయన్నమాట. ఈ కొత్త పద్ధతిని ఉపయోగిస్తే కొత్తరకమైన ప్రొటీన్ ఆధారిత మందుల తయారీ రోగనిర్ధారణ కూడా సులువు అవుతుందని అంచనా. ఉదాహరణకు ప్రతీదీప్తినిచ్చే పరమాణువులను ప్రొటీన్లకు అతికిస్తే శరీరంలో అది ఎక్కడికెళ్లిందో సులువుగా చూడవచ్చునని జెన్సిన్ తెలిపారు. రోగ నిరోధక వ్యవస్థకూ మధుమేహానికీ లంకె...! తిండి ద్వారా ఊబకాయమొస్తే రోగ నిరోధక వ్యవస్థ కూడా మీ సాయానికి రాదని వైద్యశాస్త్రం చెబుతుంది. తెల్ల రక్తకణాలు నేరుగా అడిపోస్ కొవ్వుకణజాలంలోకి చేరిపోయి మంట/వాపులకు కారణమవుతున్నాయని, ఇది కాస్తా చివరకు మధుమేహానికి దారితీస్తుందని కూడా శాస్త్రవేత్తలకు తెలుసు. ఎలా జరుగుతుందన్న విషయాన్ని మాత్రం వాండర్బిల్ట్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు తాజాగా తెలుసుకోగలిగారు. కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని అందించి ఎలుకలపై ప్రయోగాలు జరిపినప్పుడు సీడీ 8 + తెల్ల రక్తకణాలు చైతన్యవంతమవుతున్నాయని, కొవ్వులు దహనమయ్యే ప్రక్రియలో విడుదలయ్యే ఐసోలెవుగ్లాన్డిన్స్ రసాయనాలతో సీడీ 8 + కణాలు బ్యాక్టీరియా, వైరస్, అనారోగ్య కణాలపై దాడులు చేస్తాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త వ్యాట్ మెక్‌డోనెల్ తెలిపారు. అయితే ఇవే కణాలు కొవ్వు కణజాలంలో మాత్రం మంట/వాపులకు కారణమవుతుందని అన్నారు. ఇది కాస్తా ఇన్సులిన్ పనితీరుపై ప్రభావం చూపుతుందని, ఫలితంగా మధుమేహం వస్తుందని వివరించారు. ఐసోలెవుగ్లాన్డిస్ రసాయనాల ఉత్పత్తిని నియంత్రించే మందులను తయారు చేయడం ద్వారా ఇన్సులిన్ నిరోధకతను అధిగమించేందుకు అవకాశముంటుందని తమ పరిశోధన చెబుతోందని చెప్పారు. జాబిల్లిపై షికారుకు టూరిస్ట్ రెడీ... అంతరిక్ష విహార యాత్రకు రంగం సిద్ధమైపోయింది. ఈలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ త్వరలో జాబిల్లిపైకి పంపే బిగ్ ఫాల్కన్ రాకెట్లో ప్రయాణించేందుకు ఓ అజ్ఞాత వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు. అన్నీ సవ్యంగా సాగితే ఇంకొన్ని నెలల్లో తొలి ప్రయోగం జరుగుతుందని అంచనా. ఈ తొలి అంతరిక్ష యాత్రికుడు ఎవరన్న ప్రశ్నకు మస్క్ నేరుగా సమాధానం ఇవ్వలేదు. ట్విట్టర్లో జపాన్ జాతీయ పతాకాన్ని పోస్ట్ చేసి ఆ దేశపు వ్యక్తి అని సూచించారు. ఆ తరువాత స్పేస్ ఎక్స్ ఇంకో ట్వీట్ చేస్తూ ఇప్పటివరకూ జాబిల్లిని చుట్టివచ్చిన వారు కేవలం 24 మంది మాత్రమేనని, 46 ఏళ్లు గడిచినా 25వ వ్యక్తి చందమామను చేరకపోయేందుకు అనేక కారణాలున్నాయని వివరించారు. రాకెట్ తయారీకి అనుమతులు లభించడంతోపాటు, ప్రాజెక్టు పూర్తి చేయడంలో ఉన్న ఇబ్బందుల వల్ల ప్రయోగం కొంచెం అటు ఇటు కావచ్చునని సూచించారు. దాదాపు 350 అడుగుల ఎత్తున్న బిగ్ ఫాల్కన్ రాకెట్ల ద్వారా ముందుగా జాబిల్లిపైకి.. ఆ తరువాత కొన్నేళ్లకు అంగారకుడిపైకి మనుషులను పంపుతానని ఈలాన్ మస్క్ ఏడాది క్రితమే ప్రకటించారు. -
హెచ్ఐవీ వ్యాక్సిన్ వచ్చేస్తోంది...
హెచ్ఐవీ వ్యాధి నిరోధానికి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న సరికొత్త వ్యాక్సిన్ సత్ఫలితాలనిస్తోంది. మానవులతోపాటు కోతులపై జరిగిన ప్రయోగాల్లో ఈ వ్యాక్సిన్ రోగనిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయడం ద్వారా వ్యాధిని అడ్డుకుందని నేషనల్ కేన్సర్ సెంటర్ శాస్త్రవేత్తలు అంటున్నారు. దాదాపు 400 మంది పాల్గొన్న ఈ పరీక్షలు మంచి ఫలితాలిచ్చిన నేపథ్యంలో రెండో దశ పరీక్షలు దక్షిణాఫ్రికాలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఇందులో 2600 మంది మహిళలకు ఈ వ్యాక్సిన్‌ను అందించనున్నామని ప్రొఫెసర్ డాన్ బరూచ్ తెలిపారు. హెచ్ఐవీని అడ్డుకునేందుకు గత 35 ఏళ్లలో ఐదు వరకు వ్యాక్సిన్లను అభివృద్ధి చేయగా, ఈ స్థాయికి చేరుకున్న వ్యాక్సిన్ ఇదొక్కటే కావడం గమనార్హం. రకరకాల హెచ్ఐవి వైరస్ల ముక్కలు సేకరించి వాటిని కలపడం ద్వారా రోగనిరోధక శక్తిని ప్రేరేపించడం ఈ కొత్త వ్యాక్సిన్ ప్రత్యేకత. దీన్ని వాడినప్పుడు కోతులు హెచ్ఐవి లాంటి వైరస్‌ను 67 శాతం వరకు అడ్డుకోగలిగాయని బరూచ్ తెలిపారు. ప్రపంచం మొత్తం మీద దాదాపు 3.7 కోట్ల మంది హెచ్ఐవి బాధితులు ఉండగా.. ఏటా 18 లక్షల కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ప్రాణాంతకమైన ఈ వ్యాధిని నిరోధించే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఎన్నో విలువైన ప్రాణాలు నిలబడతాయి. -
ఆ వైరస్‌తో మనకు మేలే!
వయసుతో పాటు మన రోగ నిరోధక శక్తి తగ్గిపోతూంటుంది. వృద్ధులకు వైరస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు టక్కున వచ్చేందుకు కారణం ఇదే. ఈ సమస్యను అధిగమించేందుకు అరిజోనా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలు ఓ విచిత్రమైన ఫలితాలిచ్చాయి. వ్యాధులకు కారణమవుతాయని మనం ఇప్పటివరకూ భయపడుతూన్న వైరస్‌లలోనే ఒకటి మన రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయగలదని వీరు గుర్తించారు. సైటో మెగలో వైరస్ అని పిలుస్తున్న ఈ వైరస్ సగం మంది మనుషులకు చిన్నప్పుడే సోకుతుంది. చికిత్స ఏదీ లేకపోవడం వల్ల పెద్దవాళ్లలోనూ కనిపిస్తూంటుంది. కాబట్టి రోగ నిరోధక శక్తి ఈ వైరస్‌తో పోరాడుతూ ఉంటుందని, ఫలితంగా ఇతర వైరస్‌లకు త్వరగా లొంగిపోతుందని ఇప్పటివరకూ ఉన్న అంచనా. అయితే సైటో మెగలో వైరస్‌ను ఎలుకలకు ఎక్కించి, అదే సమయంలో లిస్టీరియా వైరస్‌ను చేర్చినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ మరింత సమర్థంగా లిస్టీరియాను ఎదుర్కొందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న డాక్టర్ స్మితీ తెలిపారు. మరిన్ని పరిశోధనలు చేసి∙చూడగా, సైటో మెగలో వైరస్ రోగ నిరోధక వ్యవస్థకు మరింత బలం చేకూరుస్తున్నట్లు తెలిసిందని చెప్పారు. -
రొమ్ము కేన్సర్‌కు కొత్త చికిత్స.. సక్సెస్!
రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయడం ద్వారా రొమ్ము కేన్సర్‌కు సమర్థంగా చికిత్స కల్పించారు శాస్త్రవేత్తలు. దాదాపు 49 ఏళ్ల వయసున్న మహిళ రొమ్ము కేన్సర్‌తో బాధపడుతోందని, మూడు నెలలకు మించి బతికేందుకు అవకాశం లేదని వైద్యులు తేల్చిచెప్పగా.. కెనడాలోని ఓ కేన్సర్ పరిశోధన సంస్థ కొత్త రకం ఇమ్యునోథెరపీని ఆ మహిళపై ప్రయోగించారు. రెండేళ్ల క్రితం చికిత్స మొదలుపెట్టగా కొన్ని వారాల్లోనే కేన్సర్ కణితి కనిపించకుండా పోయింది. ఆ తరువాత ఇప్పటివరకూ వ్యాధి లక్షణాలేవీ కనిపించలేదని నేచర్ మెడిసిన్‌లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం చెబుతోంది. రోగి శరీరంలోని ట్యూమర్ ఇన్ఫ్రిల్ట్రేటింగ్ లింఫోసైట్లను సేకరించి, కేన్సర్ కణాలను గుర్తించే లక్షణాలు వాటికి అందించి మళ్లీ శరీరంలోకి ప్రవేశపెట్టడం ఈ కొత్త రకం ఇమ్యునోథెరపీ ప్రత్యేకత. ‘‘చికిత్స ప్రారంభమైన వారం రోజులకే నాలో ఏదో జరుగుతున్న అనుభూతి కలిగింది. ఛాతీలో ఉన్న కణితి కరిగిపోతున్నట్లుగా అనిపించింది. ఆ తరువాత ఒకటి రెండు వారాలకు పూర్తిగా కుంచించుకుపోయింది ఆ కణితి’’ అని ఈ పరిశోధనలో పాల్గొన్న రోగి జూడీ పెర్కిన్స్ తెలిపారు. ఈ కొత్త రకం ఇమ్యునోథెరపీని కేవలం రొమ్ము కేన్సర్‌కు మాత్రమే కాకుండా ఇతర కేన్సర్లకు కూడా ఉపయోగించవచ్చుననీ, అన్ని కేన్సర్ కణాల్లోనూ జన్యుమార్పులు ఉండటం, వాటిని లక్ష్యంగా చేసుకుని లింఫోసైట్లను ప్రయోగించడం దీనికి కారణమనీ ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త స్టీఫెన్ రోసెన్‌బర్గ్ తెలిపారు. -
అన్ని వ్యాధులకూ చెక్ పెట్టే టైమొచ్చిందా?
భూమ్మీద వ్యాధులన్నవి లేకుండా పోతే ఎంత బాగుంటుందో అని మనలో చాలామందికి అనిపిస్తూంటుంది. మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తల పరిశోధన పుణ్యమా అని సమీప భవిష్యత్తులోనే ఇలాంటి అద్భుతం సాధ్యం కానుంది. అనేకరకాల వైరస్‌లను మట్టుబెట్టగల సామర్థ్యమున్న ప్రొటీన్లను తయారు చేసేందుకు వీరో వినూత్న పద్ధతిని ఆవిష్కరించడం దీనికి కారణం. ఇప్పటివరకూ మనకు ప్రకృతిలో అందుబాటులో ఉన్న ప్రొటీన్లనే కృత్రిమ పద్ధతుల్లో తయారు చేసి మందులుగా వాడుతూండగా.. వీరు ఒక అడుగు ముందుకేసి అమినోయాసిడ్ల నుంచి ఎక్కడా లేని లక్షల రకాల ప్రొటీన్లను తయారు చేయవచ్చునని నిరూపించారు. పైగా వీటిని రిఫ్రిజిరేటర్లలో చల్లగా ఉంచాల్సిన అవసరం కూడా లేదని.. రోగ నిరోధక వ్యవస్థ స్పందించే అవకాశాలూ తక్కువేనని అంటున్నారు. అమెరికా రక్షణ సంస్థ డార్పా కోసం నాలుగేళ్ల క్రితం తాము ఈ ప్రాజెక్టును మొదలుపెట్టామని... గతంలో తాము ప్రొటీన్ శృంఖలాలను కృత్రిమంగా తయారు చేసేందుకు అభివృద్ధి చేసిన టెక్నాలజీని దీంట్లో వాడామని పెంటల్యూట్ అనే శాస్త్రవేత్త వివరించారు. ఈ కొత్త రకం ప్రొటీన్లను ఎబోలా, నీపా వైరస్ వంటి అనూహ్యమైన వైరస్ ఇన్ఫెక్షన్లకు సమర్థమైన చికిత్స అందించేందుకు వీలేర్పడుతుందని అంచనా. -
వంట సోడా తాగితే మేలే!
రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారా? అయితే ఇకపై ఒక పద్ధతి ప్రకారం బేకింగ్ సోడాను తీసుకోవడం మొదలుపెట్టండి. ఒక్క రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే కాదు.. టైప్–1 మధుమేహంతోపాటు అనేక ఇతర ఆటో ఇమ్యూన్ వ్యాధులను ఎదుర్కొనేందుకు బేకింగ్ సోడా చక్కగా ఉపయోగపడుతుందని ఆగస్టా యూనివర్సిటీకి చెందిన మెడికల్ కాలేజీ ఆఫ్ జార్జియా శాస్త్రవేత్తలు అంటున్నారు. వినడానికి కొంత ఆశ్చర్యంగా అనిపించినా.. ఇందులో ఉన్న శాస్త్రం ఏమిటో డా.పాల్ ఓ కానర్ అనే శాస్త్రవేత్త వివరించారు. సోడియం బైకార్బొనేట్ అని పిలిచే ఈ బేకింగ్ సోడాను ఎలుకలకు ఇచ్చినప్పుడు వాటి కడుపులో ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యాయని తద్వారా ఆ తరువాత తినే ఆహారం చక్కగా జీర్ణమయ్యేందుకు ఉపయోగపడతాయన్నారు. అంతేకాకుండా... రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయాల్సిన అవసరం లేదంటూ క్లోమగ్రంథిపై ఉన్న కొన్ని ప్రత్యేక కణాలు సందేశాన్ని పంపేలా చేస్తాయి. క్లోమగ్రంథి కూడా రోగ నిరోధక వ్యవస్థలో భాగమన్నది తెలిసిందే. రెండు వారాలపాటు బేకింగ్ సోడా ద్రావణాన్ని తాగిన కొంతమందిని పరిశీలించినప్పుడు మాక్రోఫేగస్ అనే రోగ నిరోధక కణాలు తమ స్థితిని మార్చేసుకుని మంట/వాపు తగ్గించేందుకు ఉపయోగపడ్డాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. రోజువారీ బేకింగ్ సోడా సేవనం ద్వారా అసిడిటీ తగ్గడంతోపాటు కిడ్నీ సంబంధిత వ్యాధుల సమస్య కూడా మందగిస్తుందని ఇప్పటికే కొన్ని పరిశోధనలు చెబుతున్న విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. -
ఐరన్ ఆకు
పుట్టబోయే బిడ్డలో ఎలాంటి అవయవలోపాలూ, ఆరోగ్యలోపాలూ రాకుండా చూసే శక్తి పాలకూరలో ఉంది. చాలామంది ఆకుకూరలు అంటే పెదవి విరుస్తారు కాబట్టి, అచ్చం పాలకూరలో ఉండే లాంటి పోషకాలతోనే రూపొందించిన ట్యాబ్లెట్లను గర్భవతులకు ఇస్తుంటారు. దీన్ని బట్టి చూసినా పాలకూర గొప్పదనం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కేవలం గర్భవతులకు మాత్రమే కాదు... అందరికీ ఆరోగ్యాన్నిచ్చే పోషకాలు పాలకూరలో పుష్కలంగా ఉన్నాయి. పాలకూరతో సమకూరే ప్రయోజనాల్లో ఇవి కొన్ని... పాలకూరలో ఐరన్ చాలా ఎక్కువ. అందుకే రక్తహీనత ఉన్నవారికి డాక్టర్లు పాలకూరను సిఫార్సు చేస్తుంటారు. కొందరికి ఐరన్ టాబ్లెట్లు సరిపడుకపోవచ్చేమోగానీ... పాలకూరతో అలాంటి ఇబ్బందులేమీ ఉండవు. అనీమియా (రక్తహీనత) ఉన్నవారు పాలకూరను తరచూ తీసుకుంటే త్వరలోనే అనీమియా సమస్య తగ్గిపోతుంది. పాలకూరలో ల్యూటిన్, జియాగ్జాంథిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఆ పోషకాలు చాలా శక్తిమంతమైనవి కావడంతో ఎన్నో రకాల క్యాన్సర్ల బారి నుంచి అవి కాపాడుతుంటాయి. పాలకూరలో విటమిన్–ఏ పాళ్లు చాలా ఎక్కువ. కళ్లకు మేలు చేసి, చూపును పదిలంగా ఉంచుతుంది. పాలకూరలో విటమిన్–సి కూడా చాలా ఎక్కువ. క్రమం తప్పకుండా పాలకూర తినేవారికి మంచి వ్యాధి నిరోధక శక్తి సమకూరుతుంది. ∙పాలకూర క్రమం తప్పక తినేవారికి గుండెజబ్బులు, హైబీపీ వంటి ఆరోగ్య సమస్యలు అంత తేలిగ్గా రావు. ∙పాలకూరలో పొటాషియమ్, మాంగనీస్, మెగ్నీషియమ్, కాపర్, జింక్ వంటి ఖనిజ లవణాలు, ఇతర పోషకాలు ఎక్కువ. మేనిని నిగారింపజేస్తూ... చర్మాన్ని చాలాకాలం యౌవనంగా ఉంచడానికి ఆ ఖనిజ లవణాలు దోహదం చేస్తాయి. -
హైడ్రోజెల్తోనూ ఇమ్యునో థెరపీ..
ప్రాణాంతకమైన కేన్సర్ వ్యాధికి మెరుగైన చికిత్స కనుక్కునే ప్రయత్నాల్లో రైస్ యూనివర్శిటీ, టెక్సాస్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కీలకమైన ముందడుగు వేశారు. మందును దీర్ఘకాలంపాటు నెమ్మదిగా విడుదల చేస్తూ కణుతులు పూర్తిగా నాశనయమ్యేలా చేయగల సరికొత్త హైడ్రోజెల్‌ను వీరు అభివృద్ధి చేశారు. రోగ నిరోధక వ్యవస్థను కాపాడే టీ– కణాలను కేన్సర్‌పై దాడికి ఉపయోగించడాన్ని ఇమ్యునో థెరపీ అంటారని.. ఇటీవలి కాలంలో ఈ పద్ధతి మంచి ఫలితాలు సాధిస్తున్నదనీ మనందరికీ తెలుసు. అయితే దీంతోనూ కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. ఇంజెక్షన్ల రూపంలో అందించే మందులు శరీరం మొత్తం వ్యాపిస్తూంటాయి. ఈ క్రమంలో కేన్సర్ కణితి వద్దకు వచ్చేసరికి వీటి ప్రభావం తక్కువైపోతూంటుంది. రైస్, టెక్సాస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన హైడ్రోజెల్‌ను నేరుగా కణితి ఉన్న ప్రాంతంలోకే పంపిస్తారు కాబట్టి.. అది అక్కడే ఉండటంతో పాటు మందులను కూడా చాలా నెమ్మదిగా విడుదల చేస్తూ కేన్సర్ కణాలు చచ్చిపోయేందుకు దోహదపడుతుంది. ఈ హైడ్రోజెల్‌ను ఎలుకలపై ప్రయోగించినప్పుడు అవి ఎక్కువ కాలం జీవించడంతోపాటు కొత్తగా ప్రవేశపెట్టిన కేన్సర్ కణాలను కూడా చంపేయగలిగాయని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త జెఫ్రీ హార్ట్గెరింక్ తెలిపారు. -
ఇలా చేయండి.. యవ్వనంతో మెరిసిపోండి
సాధారణంగా పెరుగుతున్న వయసుకు తగ్గట్టుగా ఓ మనిషి బలంగా ఉండటం అంత తేలిక కాదు.. ముఖ్యంగా యవ్వన దశ దాటి పోయిన తర్వాత ఓ స్థాయి వరకు స్థిరంగా ఉండి ఆ వెంటనే తిరోగమన దశ మొదలవుతుంది. అయితే, కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రం ఓ మనిషి బలంగా, మంచి రోగ నిరోధక శక్తిని కలిగి ఎలాంటి జబ్బులకు లోను కాకుండా ఉంటాడట. ఇంతకి ఆ జాగ్రత్త ఏమిటంటే సైక్లింగ్. అవును.. నిత్యం సైక్లింగ్ చేసే అలవాటు ఉండేవారు ఎప్పటికీ యంగ్‌గా ఉంటారని, వారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని ఓ ఆధ్యయనం పేర్కొంది. ఏజింగ్ సెల్ అనే జర్నల్‌లో ఈ అంశాన్ని తాజాగా వెల్లడించారు. సాధారణంగా మధ్యవయసులో, వృద్ధాప్యంలో రోగాలు అలుముకుంటుంటాయి. రోగ నిరోధక శక్తి కుంటుబడుతుంది. అయితే, సైక్లింగ్ చేసే అలవాటు ఉన్నవారికి మాత్రం పైన పేర్కొన్న వయసులో ఇలాంటి పరిస్థితి ఉండదట. 55 నుంచి 79 ఏళ్ల మధ్య వయసున్న వారిని మొత్తం 125మందిని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఈ నిజాలు గుర్తించారు. ప్రతి వ్యక్తిలో ఉండే థైమస్ గ్రంధి (హృదయానికి సమీపంలో ఉంటుంది) సాధారణంగా రోగ నిరోధక శక్తి కణాలను (వీటినే టీ సెల్స్ అంటారు) ఉత్పత్తి చేస్తుంది. ఇవి సాధారణంగా 20 ఏళ్ల తర్వాత కాస్త మందగించినట్లుగా మారిపోతుంటాయి. అయితే, సైక్లిస్టుల్లో మాత్రం ఇవి చాలా ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి అయ్యి, రోగ నిరోధక శక్తిని మరింత విస్తృతం చేస్తాయని, దాంతో మరింత యవ్వనంగా ఉండేలా చేస్తుందని, పురుషుల్లో ఇది టెస్టోస్టెరాయిన్ లెవల్స్‌కు మరింత బూస్ట్‌ను ఇచ్చినట్లుగా పనిచేస్తుందని కూడా శాస్త్రవేత్తలు తేల్చారు. అంతేకాదు, నిత్యం సైక్లింగ్ చేసేవారిలో పురుషులు అయితే, 6.5గంటల్లో 100 కిలోమీటర్లు, 5.5 గంటల్లో స్త్రీలు 60 కిలోమీటర్లు ప్రయాణించగలరని కూడా గుర్తించారు. -
క్యాన్సర్ చికిత్సకు మరింత బలం...
శరీర రోగ నిరోధక వ్యవస్థ కణాలనే క్యాన్సర్‌పై ఆస్త్రాలుగా మార్చే ఇమ్యునో థెరపీని మరింత బలోపేతం చేసేందుకు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఓ సరికొత్త మార్గాన్ని కనుక్కున్నారు. శరీరంలోకి ప్రవేశించే వైరస్, బ్యాక్టీరియాను ముందుగా రోగ నిరోధక వ్యవస్థకు చెందిన తెల్లరక్త కణాలు ఎదుక్కొంటాయని మనకు తెలుసు. కానీ ఇవి క్యాన్సర్ కణాలను మాత్రం గుర్తించలేవు. ఇమ్యునో థెరపీలో సీడీ8+ అనే రోగ నిరోధక కణాలను రోగి నుంచి సేకరించి, వాటికి జన్యుపరమైన మార్పులు చేసి మళ్లీ శరీరంలోకి ప్రవేశపెట్టడం ద్వారా అవి క్యాన్సర్ కణాలపై దాడి చేసేలా చేస్తారు. అయితే ఈ పద్ధతి కణుతులు ఉన్న క్యాన్సర్లకు పనిచేయదు. సీడీ8+ కణాలు ఏ మార్పు కారణంగా క్యాన్సర్ కణాలపై దాడి చేస్తున్నాయో స్పష్టంగా తెలియకపోవడం దీనికి కారణం. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు చేశారు. సీడీ8+ కణాల్లోని రన్ఎక్స్3 అనే ప్రొటీన్ వాటి స్వరూపాన్ని మార్చేసి క్యాన్సర్ కణాలపై దాడులకు ఉసిగొల్పుతున్నట్లు తెలిసింది. ఈ ప్రొటీన్ ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు జంతువుల్లోని కణుతుల సైజు గణనీయంగా తగ్గడమే కాకుండా కణుతులు ఏర్పడటంలోనూ జాప్యం జరిగిందని, అవి ఎక్కువ కాలంపాటు మనగలిగాయని తెలిసింది. ‘రన్ఎక్స్3 ప్రొటీన్ సీడీ8+ కణాల్లోని క్రోమోజోమ్‌లపై పనిచేస్తోంది. ఫలితంగా జన్యువుల్లో మార్పులు వస్తున్నాయి. ఆ తరువాత ఈ కణాల్లో క్యాన్సర్ కణుతులు ఎక్కువగా పెరుగుతున్నాయి’’ అని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మాథ్యూ పిప్కిన్ తెలిపారు. -
యాంటీబయాటిక్స్‌తో రోగ నిరోధక వ్యవస్థకు చిక్కులు!
చిన్న సమస్య వస్తే చాలు.. ఎడా పెడా యాంటీబయాటిక్‌లు వాడేస్తున్నారా? అయితే కొంచెం జాగ్రత్త. ఈ యాంటీబయాటిక్‌లు మన రోగ నిరోధక వ్యవస్థను బలహీనం చేస్తాయని.. ఫలితంగా మరిన్ని ఎక్కువ రోగాల బారిన పడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.. హార్వర్డ్, మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు! రకరకాల కారణాల రీత్యా ఇప్పటికే కొన్ని బ్యాక్టీరియా మందులకు లొంగకుండా పోతున్న విషయం తెలిసిందే. కొత్త మందులేవీ అందుబాటులో లేని నేపథ్యంలో బ్యాక్టీరియా మరింత బలం పుంజుకునే అవకాశముంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఎంఐటీ, హార్వర్డ్ శాస్త్రవేత్తలు అసలు ఈ యాంటీబయాటిక్స్ మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకునేందుకు ఓ అధ్యయనం నిర్వహించారు. ఈ కోలీ బ్యాక్టీరియాను ఎలుకల్లోకి ప్రవేశపెట్టి.. వాటికి సిప్రోఫ్లాక్సిన్ మందు ఇచ్చి శరీరం లోపల ఏరకమైన మార్పులు జరుగుతున్నాయో గుర్తించారు. ఈ మందు నేరుగా ఎలుక కణజాలంపై పనిచేస్తున్నట్లు తెలిసింది. ఇది కాస్త జీవక్రియల కోసం విడుదలయ్యే రసాయనాల్లో మార్పులకు తద్వారా బ్యాక్టీరియా నిరోధానికి దారితీసినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాకుండా యాంటీబయటిక్ మందులు మాక్రోఫేగస్ కణాలను దెబ్బతీయడంతో అవి వ్యాధులను అరికట్టే విషయంలో తక్కువ ప్రభావం చూపాయని జేసన్ యాంగ్ తెలిపారు. పరి పరిశోధన -
మందులిచ్చే బుల్లి రోబోలు!
మోటార్‌బైక్‌లో ఏదైనా సమస్య వస్తే ఏం చేస్తాం? ఏ భాగంలో ఇబ్బంది ఉందో చూసుకుని సరిచేసే ప్రయత్నం చేస్తాం! మరి మన శరీరంలోని ఏదైనా అవయవానికి సమస్య వస్తే..? నేరుగా ఆ భాగానికైతే మందివ్వలేం కదా.. ఇకపై అలా కాదు.. చిన్న చిన్న రోబోలు తయారవుతున్నాయి.. ఇవి నేరుగా వ్యాధిసోకిన భాగాలకే వెళ్లి మందులిచ్చేస్తాయి మరి.. ఆ రోబోల కథ మీ కోసం.. నాచు.. అదే శైవలాలు అంటారు... హాంకాంగ్‌లోని చైనీస్ యూనివర్సిటీ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం వీటిని బయోహైబ్రిడ్ రోబోలుగా మార్చేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. మీటర్ కన్నా కొన్ని లక్షల రెట్లు తక్కువ పొడవుండే ఈ రోబోలతో వ్యాధులతో నేరుగా పోరాడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జబ్బు పడ్డ ఏ అవయవానికైనా నేరుగా మందులు అందించవచ్చని భావిస్తున్నారు. కేన్సర్ సోకిన ఎలుకలపై జరిపిన ప్రయోగాలు విజయవంతం కావడంతో మానవుల్లో కూడా సానుకూల ఫలితాలు రాబట్టొచ్చని అంచనా. స్పిరులినా ప్లాటెన్సిస్ అనే నాచుమొక్కకు అయ స్కాంత కణాలు జోడించి.. రసాయన పూత పూస్తే బుల్లి హైబ్రిడ్ రోబో సిద్ధమైపోతుంది. అయస్కాంత కణాలు ఉంటాయి కాబట్టి వీటిని శరీరం బయటి నుంచి కూడా నియంత్రించొచ్చు. దాదాపు 10 లక్షల రోబోలను ఒక్కసారి ప్రయోగించినా సరే.. ఒకదానితో ఒకటి అతుక్కోకుండా నేరుగా అవసరమైన చోటికి వెళతాయని శాస్త్రవేత్త డాక్టర్ కీ ఝౌ తెలిపారు. వాటంతట అవి నాశనమవుతూ వాటిల్లోకి జొప్పించిన మందులను విడుద ల చేస్తాయన్నారు. పైపూత మందాన్ని మార్చడం ద్వారా ఇవి ఎంత కాలానికి నాశనం కావాలో మనమే నిర్ణయించొచ్చు. ఎలుకలపై వీటిని ప్రయోగించినప్పుడు నేరుగా కేన్సర్ కణాలపై మాత్రమే దాడి చేశాయని గుర్తించారు. ఈ రోబోల తయారీ సులువు కావడంతో చికిత్సలకయ్యే ఖర్చు తగ్గే అవకాశముందని చెబుతున్నారు. ఉపయోగాలేంటి? వ్యాధుల నిర్ధారణతో పాటు బోలెడన్ని ఉపయోగాలున్నాయి. పరిసరాల్లో జరుగుతున్న రసాయన మార్పులను కూడా ఇవి గుర్తించగలవు. ఏదైనా వ్యాధి వచ్చే ముందు శరీరంలో చోటు చేసుకునే రసాయనిక మార్పులను గుర్తించొచ్చు. ఇవి ఎక్కడున్నాయో గుర్తించడం కూడా చాలా సులువు. చర్మానికి దగ్గరగా ఉంటే వాటి సహజమైన ప్రతి దీప్తి ద్వారా.. శరీరం లోపల ఉంటే ఎంఆర్ఐ యంత్రం ద్వారా వీటిని గుర్తించొచ్చు. రోగ నిరోధక వ్యవస్థ ఎలా స్పందిస్తుందో తెలుసుకునేందుకు మరిన్ని పరిశోధనలు చేస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
స్వైన్ ఫ్లూకు దూరంగా... ఎలా?
జలుబు... చాలా తరచుగా బాధించే వ్యాధి. ఒక్కసారిగా ఏడు రోగాల పడినంత బాధ పెడుతున్నా దానిని చాలా తేలిగ్గా తీసుకుంటాం. ఇప్పుడు స్వైన్‌ఫ్లూ భూతంలా భయపెడుతోంది. దీన్నుంచి కుటుంబాన్ని రక్షించుకోవడమే ఇప్పుడు ప్రధాన సమస్య అవుతోంది. 1. హెచ్1ఎన్1 అనే స్వైన్ ఫ్లూ వైరస్ మనిషి శరీరం నుంచి బయటపడిన తర్వాత 24 గంటల సేపు బతికి ఉంటుందని తెలుసు. ఎ. అవును బి. కాదు 2. స్వైన్ ఫ్లూ వచ్చిన వాళ్లు వాడిన వస్తువులను ఉపయోగించినా కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది కాబట్టి తరచుగా చేతుల్ని యాంటి బ్యాక్టీరియల్ సోప్‌తో కడుగుతున్నారు. ఎ. అవును బి. కాదు 3. ఈ వైరస్ బారిన పడకుండా ఉండడానికి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గకుండా చూసుకుంటున్నారు. ఎ. అవును బి. కాదు 4. రోజుకు తప్పని సరిగా ఎనిమిది గంటల నిద్ర ద్వారా వ్యాధి నిరోధక వ్యవస్థ బాగా పని చేస్తుంది. ఎ. అవును బి. కాదు 5. ఎక్కువ నీటిని తాగితే దేహంలోని విషపదార్థాలు, వ్యర్థాలు బయటకు పోతాయి. దీని ద్వారా వ్యాధుల బారిన పడే అవకాశమూ తగ్గుతుందని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 6. ఆల్కహల్ సేవనం వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తుందని, ఆకుపచ్చని కూరగాయలు, విటమిన్లు,పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 7. వ్యాయామం ద్వారా రక్తప్రసరణ వేగం పెరిగి, శరీరంలో అన్ని భాగాలకూ ఆక్సిజన్ బాగా అందుతుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుందని తెలుసు. ఎ. అవును బి. కాదు 8. వ్యాధి బారిన పడిన వారికి మనం దూరంగా ఉండడమే కాకుండా మనకు వ్యాధి లక్షణాలున్నట్లు అనుమానం వస్తే ఫంక్షన్లకు వెళ్లకూడదని తెలుసు. ఎ. అవును బి. కాదు 9. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు పిల్లలను స్కూలు పంపరు, అలాగే తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు కర్చీఫ్ వాడకాన్ని అలవాటు చేశారు. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే ఈ వ్యాధి గురించిన ప్రాథమిక సమాచారం, జాగ్రత్తలు మీకు తెలుసు. తుమ్మినప్పుడు బయటపడిన ఈ వైరస్ టేబుల్, కంప్యూటర్ కీ బోర్డుల వంటి గట్టి వస్తువుల మీద ఒక రోజంతా బతికే ఉంటాయి. ఈ లోపు వాటిని తాకిన వాళ్ల శరీరంలోకి చేరతాయి. అందుకే ఆఫీసు వస్తువులు, బస్సులు, ఆటోల వంటి వాటిని వాడేవాళ్లు కనీసం గంటకొకసారయినా చేతులను శుభ్రం చేసుకోవాలని అంకిత్ అరోరా చెబుతున్నారు. -
త్వరలో కేన్సర్ టీకా!
ప్రాణాంతక కేన్సర్‌కు విరుగుడు కనుక్కునేందుకు శాస్త్రవేత్తలు చేయని ప్రయత్నం లేదు. రోగ నిరోధక వ్యవస్థ కేన్సర్ కణాలపై దాడి చేసే విధానాన్ని ఇప్పటివరకు శాస్త్రవేత్తలు ప్రయత్నించలేదు. అయితే చర్మ కేన్సర్లపై ఇటీవల జరిగిన రెండు క్లినికల్ ట్రయల్స్ కేన్సర్ కణితులకు అనుగుణంగా టీకాలను అభివృద్ధి చేయగలమన్న భరోసా కల్పిస్తున్నాయి. కేన్సర్ కణాల ఉపరితలంపై కనిపించే నియో యాంటీజెన్స్ ద్వారా ఇది సాధ్యం కావచ్చని అంచనా. అమెరికాలోని బోస్టన్‌లో ఉన్న డానా ఫార్బర్ కేన్సర్ ఇన్స్టిట్యూట్, జర్మనీకి చెందిన బయో ఫార్మాసూటికల్ న్యూ టెక్నాలజీస్‌లు వేర్వేరుగా నిర్వహించిన ప్రయోగాల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. కేన్సర్ కణితుల్లో ఉండే యాంటీజెన్లను కృత్రిమ పద్ధతుల్లో తయారు చేసి రోగి శరీరాల్లోకి ఎక్కించినప్పుడు దీర్ఘకాలం పాటు కేన్సర్ తిరిగి రాలేదని గుర్తించారు. కొంతమందిలో కేన్సర్ కణాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఈ రెండు ప్రయోగాల్లో వాడిన టీకాలు సత్ఫలితాలివ్వడంతో కేన్సర్‌కు విరుగుడుగా టీకా అభివృద్ధి చేసే అవకాశాలు పెరిగాయి. అయితే ఈ టీకా ఒక్కో రోగికి ప్రత్యేకంగా తయారవుతుంది. అయితే కేన్సర్ కణాల్లోని నియోయాంటీజెన్లతో టీకాలను అభివృద్ధి చేయడానికి ప్రస్తుతం అధిక మొత్తంలో ఖర్చు కావడమే కాకుండా ఎక్కువ సమయం పడుతోంది. అందరికీ అందుబాటులోకి రావాలంటే మరికొంత సమయం పట్టొచ్చు. -
‘క్రిస్పర్ క్యాస్–9’తో డిజైనర్ బేబీలు?
♦ ఈ టెక్నాలజీతో నచ్చిన లక్షణాలతో జన్యువుల సృష్టి ♦ ఆరోగ్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు ♦ సరికొత్త విధానానికి ముసాయిదా సిద్ధం చేస్తున్న కేంద్రం ♦ కేంద్ర బయోటెక్నాలజీ విభాగం సలహాదారు ఎస్ఆర్ రావు తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశ వ్యవసాయ, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులకు రంగం సిద్ధమైంది. జీవకణాల్లోని జన్యువులను మన అవసరాలకు తగ్గట్టుగా మార్చుకోగల క్రిస్పర్ క్యాస్–9 టెక్నాలజీకి సంబంధించి కేంద్రం ముసాయిదా విధానాన్ని సిద్ధం చేస్తోంది. బయోటెక్నాలజీ విభాగం రూపొందిస్తున్న ఈ విధానం అమల్లోకి వస్తే జన్యు మార్పిడి పంటల విషయంలో ఎదురవుతున్న అనేక సమస్యలను సులువుగా అధిగమించవచ్చు. తిరుపతిలో జరుగుతున్న భారత సైన్స్ కాంగ్రెస్‌లో జన్యు ఎడిటింగ్ టెక్నాలజీలపై జరిగిన సమావేశంలో బయోటెక్నాలజీ విభాగం సలహాదారు డా.ఎస్ఆర్ రావు ఈ విషయాలను వివరించారు. ఉత్పత్తులపై మాత్రమే నియంత్రణ... ‘‘క్రిస్పర్ క్యాస్–9 టెక్నాలజీలో ఇతర జీవుల నుంచి సేకరించిన జన్యువులను ఉప యోగించరు. ఉన్న వాటికే మార్పులు చేర్పులు చేస్తారు. బయో టెక్నాలజీ విభాగం రూపొందిస్తున్న సరికొత్త ముసాయిదా విధానంలో అర్జెంటీనా వంటి దేశాల మాదిరి గా జన్యు ఎడిటింగ్ ఫలితంగా తయారయ్యే ఉత్పత్తులపైనే నియంత్రణ ఉంటుంది. ఇందుకు ఉపయోగించిన టెక్నాలజీపై నియంత్రణ ఉండదు’’ అని ఎస్ఆర్ రావు తెలిపారు. క్రిస్పర్‌క్యాస్–9 టెక్నాలజీని సమర్థంగా వాడుకునేందుకు పంటలు, జీవజాతుల జన్యుక్రమాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం ముఖ్యమని, కేంద్ర బయోటెక్నాలజీ విభాగం ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసిందని వివరించారు. కృత్రిమ జీవం అభివృద్ధిని పరిశీలిస్తున్నాం... నచ్చిన లక్షణాలు ఉన్న జన్యువులను కృత్రిమంగా తయారు చేయగలగడం సాంకేతి కంగా సాధ్యమేనని, ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపారు. మానవ జన్యుక్రమ నమోదు తరువాత కృత్రిమ జీవం అభివృద్ధిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరిగిందని ఎస్ఆర్ రావు తెలిపారు. ఈ రంగంలో ప్రాథమిక స్థాయి పరిశోధనలు చేపట్టాయని వివరించారు. క్రిస్పర్ క్యాస్–9 వంటి జన్యు ఎడిటింగ్ టెక్నాలజీలతోపాటు అనేక ఇతర శాస్త్ర రంగాల భాగస్వామ్యంతో మాత్రమే కృత్రిమ జీవాలు, జన్యువులను అభివృద్ధి చేయడం వీలవుతుందన్నారు. డిజైనర్ బేబీలు దూరాలోచన! ‘‘క్రిస్పర్ క్యాస్–9తో డిజైనర్ బేబీలను పుట్టించడం సాంకేతికంగా సాధ్యమే అయినా అది ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదు. మరిన్ని పరిశోధనలు జరగాలి. పైగా డిజైనర్ బేబీలను అభివృద్ధి చేయడంపై ఎన్నో నైతిక ప్రశ్నలు ఎదురవుతాయి’’ అని మదురై కామరాజ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ కె.వేలుతంబి చెప్పారు. అయితే భవిష్యత్తులో మానవ అవయవాలను పందుల్లో పెంచి ఉపయోగించుకునేందుకు క్రిస్పర్ క్యాస్–9 పనికొస్తుందని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్ డాక్టర్ కురుకూటి శ్రీనివాసులు చెప్పారు. ఏమిటీ క్రిస్పర్ క్యాస్–9? కణ కేంద్రకాల్లో ఉండే జన్యుక్రమం గురించి మీరు వినే ఉంటారు. మన ఒడ్డూ పొడుగుల నుంచి రాగల వ్యాధుల వరకూ అన్ని రకాల జీవక్రియలకు సంబంధించిన సమాచారం ఈ జన్యుక్రమంలో ఉంటుంది. జన్యుక్రమంలో ఉండే జన్యువుల్లో మార్పులు చేర్పులు చేయడం ద్వారా సమస్యలను అధిగమించేందుకు దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఐదారేళ్ల క్రితం అతిసులువుగా జన్యుమార్పులు చేసేందుకు, అనవసరమైన వాటిని తొలగించేందుకు, మార్పులు, చేర్పులు చేసుకునేందుకు వీలుగా క్రిస్పర్ క్యాస్ –9 టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. జన్యుక్రమంలో అక్కడక్కడా ఒకేతీరున ఉండే భాగాలు, బ్యాక్టీరియా రోగ నిరోధక వ్యవస్థలో ఉండే ఒక ఎంజైమ్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. జన్యు ఎడిటింగ్ కోసం ఇప్పటికే కొన్ని టెక్నాలజీలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటితో కచ్చితమైన ఫలితాలు సాధించడం కొంచెం కష్టం! -
కీలెంచి.. మేలెంచు!
మన రక్షణ కోసం పాటుపడాల్సిన బాణం మనల్నే పోటు పొడిచినట్లుగా చేసే శరాఘాతమే ఈ కీళ్లవాతం. మేకులతో గుచ్చినట్లు బాకులతో పొడిచినట్లు ఒకటే నొప్పి! చిన్న కీళ్ల నుంచి మొదలై పెద్ద కీళ్లలోకి పాకుతూ మరింత పెరిగే బాధ! ఈ సీజన్లో అవస్థలను పెంచే వ్యాధుల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ముఖ్యమైనది. మన కీళ్లపై మనకు అవగాహన పెంచేందుకే ఈ ప్రత్యేక కథనం. కీలెంచి మేలెంచేందుకు చదవండి... చదివించండి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ చాలా సాధారణంగా కనిపించే ఆటో ఇమ్యూన్ వ్యాధి. దీన్ని సాధారణ పరిభాషలో కీళ్లవాతం అని కూడా అంటారు. మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ మన సొంత కీళ్లపైనే ప్రతికూలంగా వ్యవహరిస్తూ, వాటిని బాధించే పరిస్థితిని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. జన్యుపరమైన మార్పుల వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి రావడానికి కారణాలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎందుకు వస్తుందనే అంశంపై స్పష్టత లేదు. దీనికి సరైన కారణం తెలియదు. జన్యుపరమైన మార్పులు లేదా పర్యావరణంలో కలిగే మార్పుల సంయుక్త ప్రభావం వల్ల ఈ వ్యాధి వస్తుందని కొందరు నిపుణుల అంచనా. మన శరీరంలో ఉండే రోగ నిరోధక వ్యవస్థ సొంత కణాలను గుర్తించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఫలితంగా సొంత కణాలను శత్రు కణాలుగా పొరబడుతుంది. అలా వాటిపై దాడి చేస్తుంది. ఈ పరిణామాల కారణంగా ఎముకల చివర్లలో కీళ్ల మధ్య ఉండే కార్టిలేజ్, ఎముక పొర దెబ్బతిని, కీళ్లు క్రమంగా అరిగిపోతాయి. క్రమేణా కీళ్లు బలహీనపడి పటుత్వాన్ని కోల్పోతాయి. మిగతా వారితో పోలిస్తే పొగతాగే అలవాటు ఉన్నవారిలో ఈ వ్యాధి మూడు రెట్లు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు పెరుగుతాయని వైద్యుల అభిప్రాయం. ఎవరెవరిలో ఈ వ్యాధి వస్తుంది? రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ఏ వయసువారిలోనైనా చూడవచ్చు. అయితే సాధారణంగా 40 ఏళ్లు పైబడ్డ వారిలో, ముఖ్యంగా మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇక పొగతాగే వారిలో ఇది ఎక్కువన్న విషయం పరిశోధనల్లో తేలింది. గర్భిణుల్లో వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టి... ప్రసవం తర్వాత తీవ్రరూపం దాలుస్తుంది. వ్యాధి తీవ్రత రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు, తీవ్రత అందరిలోనూ ఒకేలా ఉండవు. అలాగే కాలంతో పాటు వ్యాధి తీవ్రత కూడా మారుతుంది. కొన్నిసార్లు కారణం లేకుండానే తీవ్రత చాలా ఎక్కువగా ఉండవచ్చు. మరికొన్ని సందర్భాల్లో ప్రశాంతంగానూ ఉండవచ్చు. వ్యాధి వల్ల కలిగే క్లిష్ట సమస్యలు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ప్రారంభ దశలోనే కనుగొని సరైన చికిత్స తీసుకోకపోతే ఇది మరిన్ని సమస్యలకూ, ఇతర వ్యా«ధులకూ దారితీస్తుంది. కీళ్లు వంకరపోవడం, చర్మం మీద దీర్ఘకాలంగా మానని పుండ్లు పడటం, చర్మం కుళ్లిపోవడం, చర్మం మీద దద్దుర్లు రావడం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. అలాగే ఊపిరితిత్తులు మూసుకుపోవడం, గుండెపోటు, మూత్రపిండాలు, కాలేయ వైఫల్యం వంటివీ కలుగుతాయి. ఒంటిలో కొవ్వు శాతం పెరిగి, రక్తకణాలు మూసుకుపోతాయి. నరాల బలహీనత, మెదడులో రక్తం గడ్డకట్టడం, పక్షవాతం, కంటిచూపు కోల్పోవడం వంటి అనర్థాలు సంభవించే అవకాశం కూడా ఉంది. సరైన చికిత్స తీసుకోని వారిలో ఎముకలు బోలుగా మారడం, కార్పల్ టన్నల్ సిండ్రోమ్, చిన్నవయసులోనే మరణం, క్యాన్సర్ జబ్బులు కూడా అధికంగా వస్తాయి. వ్యాధి నిర్ధారణ రుమటాయిడ్ ఆర్థరైటిస్ విషయంలో ఆరంభదశలోనే వ్యాధి నిర్ధారణ చేయడం అత్యంత కీలకమైన అంశం. అయితే ఈ దశలో వ్యాధిని కనిపెట్టడం కొంచెం కష్టమైన పని. ఎందుకంటే వివిధ రకాల కీళ్లవాతాలు, కీళ్ల నొప్పుల సమస్యలు, కీళ్ల వాపులు వంటì కీళ్లకు సంబంధించిన జబ్బులన్నీ దాదాపు ఒకేలాంటి లక్షణాలు కలిగి ఉంటాయి. దాంతో నిర్దిష్టంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్లనొప్పులను కనిపెట్టడం ఒకింత కష్టసాధ్యమవుతుంది. అందుకే కాస్త సంక్లిష్టంగా కనిపించే కీళ్లనొప్పులు వస్తే రుమటాలజిస్ట్ను సంప్రదించడం అవసరం. ఈ నిపుణులు కండరాలు, కీళ్లు పరీక్షించి, వ్యాధిని సరిగా కనిపెడతారు. దాంతోపాటు కీళ్ల వాతానికి సంబంధించిన ఆర్ఏ ఫ్యాక్టర్, యాంటీ సీసీపీ అనే నిర్దిష్టమైన పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేస్తారు. చికిత్స కోసం సీబీపీ, ఈఎస్ఆర్, కిడ్నీ, కాలేయ పరీక్షలు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. చికిత్స విధానాలు వ్యాధి తీరును బట్టి, తీవ్రతను బట్టి నిపుణులు చికిత్సను ప్రారంభిస్తారు. ఈ వ్యాధికి అనేక రకాల చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి. కీళ్లలో నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు సాధారణంగా కొన్ని రోజులు మాత్రం నొప్పి నివారణ మాత్రలు వాడాలి. స్టెరాయిడ్స్ అనేవి చికిత్స విధానాలలో ఒక భాగం. వ్యాధి నిర్ధారణ జరిగిన వెంటనే వీటిని మొదలు పెట్టాలి. వ్యాధి తీవ్రత తగ్గుతున్నప్పుడు వీటి మోతాదును క్రమేణా తగ్గించి, మొదటి మూడు నెలల నుంచి ఆరు నెలల లోపు వాటిని మానేయాలి. వీటి వల్ల వెంటనే నొప్పి, వాపు తగ్గుతాయి. పర్యవేక్షణ లేకుండా దీర్ఘకాలం వాడితే అనర్థాలే! రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు చెందిన మందులను నిపుణుల పర్యవేక్షణ లేకుండా సొంతంగా దీర్ఘకాలం వాడితే షుగర, బీపీ, ఎముకల బలహీనత, ఇలా బలహీనపడటం వల్ల తేలిగ్గా విరిగిపోవడం, కంటిలో శుక్లం, అంటువ్యాధులకు తేలిగ్గా లోనుకావడం వంటి ప్రతికూల ప్రభావాలు సంభవిస్తాయి. తీవ్రతను బట్టి మందులు, మోతాదులు ఒకటి లేదా రెండు కీళ్లలోనే జబ్బు తీవ్రత కనిపిస్తే, దాన్ని తగ్గించడానికి నిపుణులు కీళ్లలోకి సూదిమందును పంపే ప్రక్రియను సూచిస్తారు. స్టెరాయిడ్ స్పేరింగ్ మందులు... అంటే మెథిట్రెక్ట్సెట్, సల్ఫాసాలజీన్, లెఫ్లూనమైడ్, హైడ్రాక్సీక్లోరోక్విన్ మొదలైనవి అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల వ్యాధి తీవ్రత క్రమంగా అదుపులోకి వస్తూ, పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడుతుంది. ఈ మందులు వాడేటప్పుడు క్రమం తప్పకుండా సీబీసీ, కాలేయం, కిడ్నీకి సంబంధించిన వైద్య పరీక్షలను డాక్టర్ల సలహా మేరకు చేయించుకోవాలి. అందుబాటులో అనేక ఆధునిక చికిత్సలు ఇటీవల ఈ వ్యాధికి అనేక ఆధునిక చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని బయొలాజికల్ మందులు అంటారు. స్టెరాయిడ్ స్పేరింగ్ మందులకు లొంగని వ్యాధిగ్రస్తులలో, అలాగే ముందు నుంచి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో ఈ మందులను సూచిస్తారు. వీటి వల్ల సత్వర ఉపశమనం కలుగుతుంది. అలాగే వ్యాధి వల్ల కలిగే సంక్లిష్ట సమస్యలను కూడా ముందునుంచే అరికట్టవచ్చు. నివారణ: దురదృష్టవశాత్తు ఈ వ్యాధికి శాశ్వత నివారణ లేదు. ఆరంభదశలో చికిత్స మొదలు పెడితే, జీవననాణ్యత మెరుగుపరుచుకోవచ్చు. మూడు ‘ఎస్’లతో గుర్తించడం తేలిక రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిన వారిలో కనిపిస్తున్న మూడు ప్రధాన లక్షణాలను ఇంగ్లిష్‌లో చెప్పుకోవడం ద్వారా ఈ వ్యాధిని తేలిగ్గా గుర్తించవచ్చు. అవి... స్టిఫ్నెస్ (బిగుసుకుపోవడం): ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోయినట్లుగా అయిపోయి అలాగే 30 నిమిషాలకుపైగా ఉండటం. స్వెల్లింగ్ (వాపు): కీళ్ల వాపు కనిపించడం (ప్రధానంగా చేతి వేళ్ల కణుపుల వద్ద అంటే చిన్న కీళ్లు అన్నమాట) స్క్వీజింగ్ (నొక్కడంతో నొప్పి): సాధారణంగా ఎవరైనా షేక్‌హ్యాండ్ ఇచ్చినప్పుడు కలిగే ఒత్తిడితో పెద్దగా నొప్పి ఫీల్ అయ్యేందుకు అవకాశం ఉండదు. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు... షేక్‌హ్యాండ్ వల్ల కలిగే చిన్నపాటి ఒత్తిడికి కూడా భరించలేరు. ఈ మూడు ‘ఎస్’ ఫ్యాక్టర్లకు మీ సమాధానం కూడా ‘ఎస్’ అయితే మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందేమోనని చూసుకోవాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే రుమటాలజిస్ట్లను సంప్రదించి, వ్యాధిని నిర్ధారణ చేసుకొని, సత్వరం చికిత్స మొదలుపెట్టుకోవాలి.వైద్యుల సలహా మేరకు కీళ్లవాతానికి సంబంధించిన మందులు వాడుతున్నప్పుడు సకాలంలో ఇతర పరీక్షలు కూడా కొన్ని చేయించుకుంటూ ఉండాలి. ఉదాహరణకు ఏడాదికి ఒకసారి ఒంట్లో కొవ్వు శాతం, గుండె పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి.మందులతో పాటు ఫిజియోథెరపీ వంటి చికిత్స విధానాలను కూడా అనుసరించాలి. దీనివల్ల తీవ్రమైన నొప్పులనుంచి ఉపశమనం పొందడమే గాకుండా కీళ్లు వంకరపోకుండా కాపాడుకోవచ్చు.క్యాల్షియం ఎక్కువ మోతాదులో ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.పొగతాగే అలవాటును, మద్యం దురలవాటు ఉంటే తక్షణం వాటిని మానేయాలి. ఇతర లక్షణాలు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను గుర్తించడం చాలా తేలిక. కేవలం ఒక చేతి కీళ్లకే ఈ నొప్పి పరిమితం కాదు. ఇది వచ్చిందంటే రెండు చేతుల కీళ్లూ... ఒకేలా నొప్పి పెడతాయి. ఉదయంపూట తీవ్రమైన అలసట ఉంటుంది. ఒక్కోసారి రాత్రికి రాత్రే కీళ్లన్నీ బిగుసుకుపోయి ఉదయం కల్లా పరిస్థితి దుర్భరమవుతుంది. కొందరిలో ఎంతగా అలసట ఉంటుందంటే వాళ్లు అదేపనిగా నిద్రపోతుంటారు. సాధారణంగా మనం డోర్‌నాబ్ తిప్పడం, డబ్బా మూత తీయడం, షర్ట్ బటన్లు పెట్టుకోవడం సమయంలో వేళ్ల కణుపుల్లోనూ, మణికట్టులోనూ కలిగే నొప్పితో దీన్ని గుర్తించవచ్చు. లక్షణాలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రధానంగా కీళ్లపై ప్రభావం చూపెడుతుంది. కీళ్లు వాచిపోయి సున్నితంగా మారతాయి. ఉదయాన్నే ఎక్కువసేపు బిగుసుకుపోయి (స్టిఫ్నెస్ కలిగి) ఉంటాయి. సాధారణంగా చేతి, కాళ్ల చిన్న చిన్న కీళ్లను ఈ వ్యాధి మొదట ప్రభావితం చేస్తుంది. క్రమంగా మణికట్టు, భుజాలు, మోకాళ్లు వంటి పెద్ద కీళ్లకు వ్యాపిస్తుంది. కీళ్లనొప్పులతో పాటు జ్వరం, అలసట, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, బుద్ధిమాంద్యం లాంటివి కూడా కనిపిస్తాయి. కేవలం కీళ్ల మీదనే గాక ఇతర అవయవాలైన చర్మం, కళ్లు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండె, మెదడు, రక్తనాళాలు, కాలేయం మీద కూడా ఈ వ్యాధి ప్రభావం చూపెడుతుంది. ఈ వ్యాధి గర్భవతులకు వస్తే.... ఈ వ్యాధి కారణంగా వారిలో.... పూర్తిగా నెలలు నిండక ముందే శిశువుల ప్రసవం, తక్కువ బరువు ఉన్న శిశువుల జన్మించడం, గర్భస్రావం మొదలైన సమస్యలు కనిపిస్తాయి. డాక్టర్ విజయ ప్రసన్న పరిమి, కన్సల్టెంట్ రుమటాలజిస్ట్,కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
శ్వాసకోశ వ్యాధులు ఉన్నా వ్యాయామం చేయాలంటే..?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 54. నేను గత కొన్నేళ్లుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నాను. దయచేసి నాకు తగిన పరిష్కారం సూచించగలరు. - డి. హేమలత, హైదరాబాద్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఇమ్యూన్ వ్యవస్థ తన సొంతకణజాలాలతోనో పోరాడినప్పుడు కలిగే వ్యాధి. ఇది మొదట చేతివేళ్లు, కాలివేళ్లు తరువాత మోచేయి, మోకాలు, తుంటికి పాకుతుంది. మన శరీరంలోని వివిధ కీళ్లలో ఉండే సైనోవియం పొరను ఈ వ్యాధి ప్రభావితం చేస్తుంది. ఇన్ఫ్లమేషన్కు గురయిన ఈ పొర క్రమంగా కీళ్లలోని ఎముకలు, వాటి కార్టిలేజ్‌ను కూడా దెబ్బతినేలా చేస్తుంది. ఫలితంగా కీళ్లు వాటి ఆకారం, అమరిక కోల్పోయి, విపరీతమైన నొప్పితో బాటు కీళ్ల కదలికలు కూడా ఇబ్బందికరంగా తయారవుతాయి. ఇది కొందరిలో ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె, రక్తనాళాలు, చర్మం మొదలైన వాటిపై కూడా దుష్ర్పభావం చూపిస్తుంది. వ్యాధి కారణాలు: మన శరీరంలో తెల్లరక్తకణాలు వ్యాధి నిరోధక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. బ్యాక్టీరియా, వైరస్ తదితర వ్యాధికారక క్రిములతో పోరాడుతూ నిత్యం మనల్ని రక్షిస్తుంటాయి. ఆర్థరైటిస్ రోగులలో తెల్లరక్తకణాలు కీళ్లచుట్టూ ఉండే సైనోవియల్ పొరలోకి వెళ్లి ప్రొటీన్లను విడుదల చేయడం వల్ల అది మందంగా మారిపోయి దెబ్బతినడం ఆరంభమవుతుంది. క్రమేపీ కీళ్లలోపలి ఎముకలు, కార్టిలేజ్ ఇన్ఫ్లమేషన్కు గురవడం వల్ల కీళ్ల అమరికలో ఏర్పడే మార్పు వైకల్యానికి దారితీస్తుంది. లక్షణాలు: కీళ్లవాపు, నొప్పి, చేతితో తాకితే వేడిగా ఉండడం, ఉదయం నిద్రలేచేసరికి కీళ్ల కదలికలు బాధాకరంగా ఉండడం, బిగుసుకు పోవడం, ఈ లక్షణాల తీవ్రత ఎప్పడూ ఒకేలా కాకుండా రెండువైపులా ఒకకేరకంగా కీళ్లు ప్రభావితం కావడం ఈ వ్యాధి ముఖ్యలక్షణం. వీటికితోడు రక్తహీనత, ఆకలి సరిగా లేకపోవడం, నిస్సత్తువ, బరువు తగ్గడం, కొద్దిపాటి జ్వరం, మోచేయి, మణికట్టు వంటి కీళ్లలో చర్మం కింద చిన్న చిన్న బుడిపెలు ఏర్పడవచ్చు. నిర్ధారణ: సీబీపీ, ఈఎస్ఆర్, ఆర్.ఎ.ఫ్యాక్టర్, యాంటిసిపిపి, ఎక్స్‌రే, ఎమ్మారై తదితర పరీక్షలు. హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కి ఇతర చికిత్సా విధానాల ద్వారా కేవలం ఉపశమనం మాత్రమే లభిస్తే హోమియోకేర్ ఇంటరేనషనల్లోని జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ వైద్యపద్ధతిలో వ్యాధిని తగ్గించడం లేదా కీళ్ల కదలికలను సురక్షితంగా ఉంచడంలో మంచి ఫలితాలను సాధించవచ్చు. వ్యాధి తీవ్రత పెరగకుండా చేయవచ్చు. లైఫ్ స్టయిల్ కౌన్సెలింగ్ నా వయసు 42 ఏళ్లు. ఆస్తమా ఉంది. ఈ చలికాలంలో ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు వ్యాయామం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. - ఎమ్. సంజీవరావు, వైజాగ్ ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు సైతం వ్యాయామం చేయవచ్చు. ఇలాంటి వారికి జాగింగ్, బ్రిస్క్ వాకింగ్ వంటి వ్యాయామాలు మంచిది. అయితే వెయిట్ లిఫ్టింగ్, బరువులు ఉండే మెషిన్స్ వంటి ఉపకరణాల సహాయంతో వ్యాయామం చేయదలచుకున్నవారు ముందుగా ఫిజీషియన్‌ను సంప్రదించి తగిన సలహా తీసుకోవాలి. మీ వ్యాయామం శరీరాన్ని తీవ్ర అలసటకు గురిచేయకూడదు. ఎందుకంటే ఒక్కోసారి ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా వంటివీ రావచ్చు. శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు, ఏదైనా తినీతినగానే వ్యాయామాలు వద్దు. లైట్‌గా తిన్న తర్వాత 30 నిమషాల వ్యవధి ఇచ్చి వ్యాయామం మొదలుపెట్టండి. ప్రివెంటార్ ఇన్హేలర్స్ పీల్చాక, నెబ్యులైజేషన్ తర్వాత వ్యాయామం మొదలుపెట్టడానికి కనీసం 30 నిమిషాల వ్యవధి ఇవ్వండి. వ్యాయామం మొదలుపెట్టే సమయంలో ముందుగా బ్రీతింగ్ వ్యాయామాలు, వార్మప్ వ్యాయామాలు విధిగా చేయండి. నేరుగా పెద్ద పెద్ద వ్యాయామాల జోలికి వెళ్లవద్దు. వ్యాయామం పూర్తయ్యాక అకస్మాత్తుగా ఎక్సర్సైజ్ను ఆపేయవద్దు. శరీరాన్ని క్రమంగా వ్యాయామం నుంచి ఉపసంహరించే క్రమంలో కూల్‌డౌన్, బ్రీతింగ్ అవుట్ ఎక్సర్సైజులు చేయాలి. మరీ ఎక్కువగా బరువులు ఎత్తే వ్యాయామాలు చేయకపోవడమే మంచిది. పుషప్స్, సిటప్స్ వంటివి చేయకపోతేనే మంచిది. బరువు ఎత్తే వ్యాయామాలు చేయదలిస్తే అవి ఎత్తే సమయంలో శ్వాస విడుస్తూ ఉండాలి. ఆరుబయట ఉంటే మరీ ఎక్కువ వేడిగానూ లేదా మరీ ఎక్కువగా చల్లగానూ ఉండవచ్చు. అలాంటప్పుడు బయట ఉండే తేమ ఊపిరితిత్తులను తొందరగా అలసటకు గురిచేస్తుంది. అందుకే ఈ సీజన్లో జిమ్‌లో గానీ లేదా ఇన్డోర్స్లోగానీ వ్యాయామం చేయండి. నిటారుగా ఉండే ఎత్తులను ఎక్కకండి. మీకు ఆరోగ్యం బాగా లేనప్పుడు, జ్వరం ఎక్కువగా ఉందనిపించినప్పుడు వ్యాయామం చేయకండి. వ్యాయామం చేస్తున్నప్పుడు శ్వాస అందని పరిస్థితి ఉన్నా లేదా ఆయాసంగా ఉన్నా వ్యాయామం చేయడం ఆపి, డాక్టర్‌ను సంప్రదించండి. గుండెదడగా అనిపిస్తే వ్యాయామాన్ని నిలిపివేయండి. బలహీనంగా అనిపించినా, కళ్లు తిరుగుతున్నట్లు అనిపించినా, ఛాతీమీద బరువుగా అనిపించినా, భుజం, దవడ, వెన్ను భాగంలో నొప్పి ఉన్నా వ్యాయామం ఆపి డాక్టర్‌ను కలవండి. వ్యాయామం చేస్తున్నప్పుడు ఛాతీలోగానీ లేదా శరీరంలోని ఏ భాగంలోనైనా నొప్పి వస్తే, దాన్ని విస్మరించి వ్యాయామాన్ని కొనసాగించకండి. ఫిజియోథెరపీ కౌన్సెలింగ్ నా వయసు 44 ఏళ్లు. మెడనొప్పిగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించాను. ఫిజియోథెరపిస్ట్‌ను కలిసి మెడకు సంబంధించి వ్యాయామాలు చేస్తూ, కొన్ని జాగ్రత్తలు పాటించమని చెప్పారు. దయచేసి వివరించండి. - సుభానీ, గుంటూరు మీరు మెడనొప్పిని తగ్గించుకోడానికి ఎప్పుడూ మెడను పూర్తిగా రౌండ్‌గా తిప్పకండి. సగం మాత్రమే తిప్పండి. నిద్రపోయే సమయంలో పలచగా ఉన్న తలగడను భుజాలకిందుగా ఉండేలా అమర్చుకోవాలి. మరీ మెత్తటి తలగడను వాడకండి. మీ కంప్యూటర్ మానిటర్, టీవీ చూసే సమయంలో దానిలోకి తొంగిచూస్తున్నట్లుగా మెడను ఉంచకండి. కూర్చున్నప్పుడు, నిలబడ్డ సమయంలో మీ తలను శరీరానికి నిటారుగా ఉంచండి. తలను అటు ఇటు అకస్మాత్తుగా తిప్పకండి. ఫోన్లు మాట్లాడే సమయంలో భుజానికి, తలకు మధ్యన ఫోన్‌ను ఇరికించి, తలను పక్కకు తిప్పి మాట్లాడకండి. భుజాలను ముందుకు ఒంగేలా ఉంచకండి. మీ మెడనొప్పి తగ్గడానికి... మీ భుజాలను షగ్ ్రచేస్తున్నట్లుగా మెడకు దగ్గరగా లాక్కొని ఐదు అంకెలు లెక్కపెట్టి మళ్లీ వదలండి. ఇలా కనీసం ఐదుసార్లు చేయండి. మీ భుజాలను మొదట ఒక ఐదుసార్లు సవ్యదిశలో, ఆ తర్వాత ఐదుసార్లు అపసవ్యదిశలో తిప్పండి. మీ నుదుటిని అరచేతితో పట్టుకొని తలను ఆ అరచేతికేసి నొక్కుతూ ఐదంకెలు లెక్కపెట్టండి. అలాగే రెండు చెంపలకూ అరచేతిని నొక్కుతున్నట్లుగా ఇదేవిధంగా వ్యాయామం చేయండి. ఆ తర్వాత తల వెనక చేతిని పెట్టుకొని కాసేపు తలను వెనకవైపునకు నొక్కుతూ వ్యా యామం చేయండి. మెడ, వెన్ను, భుజం... ఇలా ఏ ప్రాంతంలో నొప్పి ఉందో అక్కడ కాపడం పెట్టండి. చదువుతున్నప్పుడు, రాస్తున్నప్పుడు, పేపర్ చూస్తున్నప్పుడు తలను ఎక్కువగా ఒంచకండి. ల్యాప్‌టాప్ గానీ, కంప్యూటర్ మానిటర్గానీ మీ కళ్ల లెవల్‌కు సమానంగా ఉండేలా చూసుకోండి. కంటికీ మానిటర్కూ మధ్యన 16 నుంచి 22 అంగుళాల దూరం ఉండాలి. అంతకు తక్కువ, ఎక్కువ ఉండటం సరికాదు. కంప్యూటర్‌పై పనిచేసే సమయంలో మీ మోచేతులను కుర్చీ చేతుల మీద ఆన్చి... వాటికి సపోర్ట్ ఉండేలా చూసుకోండి. -
హోమియా కౌన్సెలింగ్
రుమటాయిడ్ ఆర్థరైటిస్ తగ్గుతుందా? నా వయసు 55 ఏళ్లు. ఒకసారి నా వేళ్లు కొంకర్లుపోయి ఏపని చేయలేకపోయాను. దాంతో డాక్టర్‌ను కలిస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పి, మందులిచ్చారు. కానీ పెద్దగా మెరుగుదల కనిపించలేదు. హోమియోలో దీనికి తగిన చికిత్స ఉందా? - ఇస్మాయిల్, కావలి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్. అంటే ఒక వ్యక్తి రోగనిరోధక వ్యవస్థ, తన సొంతకణాలనే హానికరమైనవాటిగా గుర్తించి, వాటితో పోరాడుతున్నప్పుడు ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్‌లు వస్తాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చాలా నెమ్మదిగా పెరిగే సమస్య. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ కీళ్లలో కనిపిస్తుంది. మొదట చిన్న చిన్న కీళ్లలో (చేతి, కాలి వేళ్లు), ఆ తర్వాత పెద్ద కీళ్లలోకి (మోచేయి, మోకాలు, తుంటి) విస్తరిస్తుంది. మన శరీరంలోని వివిధ కీళ్లలో ఉండే సైనోవియం అనే పొరను ఈ వ్యాధి ప్రభావితం చేస్తుంది. దీంతో ఇన్ఫ్లమేషన్కు గురైన ఈ సైనోవియం పొర క్రమంగా కీళ్లలోని ఎముకలు, వాటి కార్టిలేజ్‌ను కూడా దెబ్బతినేలా చేస్తుంది. ఫలితంగా కీళ్లు, వాటి ఆకృతినీ, అమరికనూ కోల్పోయి, విపరీతమైన నొప్పితో పాటు, కీళ్ల కదలిక కూడా కష్టంగా మారుతుంది. లక్షణాలు: రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిన వారిలో కీళ్లవాపు, కీళ్లనొప్పి, చేతితో తాకితే వేడిగా ఉండటం, ఉదయం నిద్రలేచే సరికి కీళ్ల కదలిక చాలా బాధాకరంగా ఉండటం, బిగుసుకుపోవడం జరుగుతుంది. శరీరానికి రెండు వైపులా ఒకే రకం కీళ్లు ప్రభావితం కావడం ఈ వ్యాధి ముఖ్యలక్షణం. వీటికి తోడు రక్తహీనత, ఆకలి సరిగా లేపోవడం, నిస్సత్తువ, బరువు తగ్గడం, కొద్దిపాటి జ్వరం, మోచేయి, మణికట్టు వంటి కీళ్లలో చర్మం కింద చిన్న చిన్న బుడిపెలు (రుమటాయిడ్ నాడ్యూల్స్) ఏర్పడవచ్చు. కీళ్లవాతాన్ని నిర్లక్ష్యం చేస్తే వివిధ రకాల వ్యాధులు... ముఖ్యంగా గుండెజబ్బులు, కళ్లు పొడిబారడం, లాలాజలం తగ్గడం, గుండెచుట్టూ, ఊపిరితిత్తుల చుట్టూ నీరుచేరడం వంటి దుష్ర్పభావాలు వచ్చే అవకాశం ఉంది. నిర్ధారణ: సీబీపీ, ఈఎస్ఆర్, ఆర్.ఏ. ఫ్యాక్టర్, ఎక్స్-రే, ఎమ్మారై మొదలైన పరీక్షలతో పాటు మరికొన్ని పరీక్షలు వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. సైకోసొమాటిక్ డిజార్డర్లలో ఒకటైన రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు హోమియోలో సంపూర్ణ చికిత్స ఉంది. ఇతర చికిత్స విధానాలలో కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభిస్తుంది. అయితే హోమియో ప్రక్రియలో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ వైద్య పద్ధతిని అనుసరించడం వల్ల వ్యాధిని తగ్గించడంలోనూ, కీళ్ల కదలికలను సురక్షితంగా ఉంచడంలోనూ మంచి ఫలితాలు లభ్యమవుతాయి. రోగి మానసిక, శారీరక స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించి, విచారించి, అనువైన మందులను నిర్ణయించి ఇవ్వడం ద్వారా వ్యాధి తీవ్రత పెరగకుండా కాపాడవచ్చు. వ్యాధిని సంపూర్ణంగా నయం కూడా చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ -
అన్ని కేన్సర్లకు ఒకే టీకా..!
* కేన్సర్ కణాలను గుర్తించేలా రోగనిరోధక వ్యవస్థ బలోపేతం * శరీరంలోకి టీ-కణాలు ప్రవేశపెట్టి కేన్సర్ నివారణ * మూడేళ్ల క్రితమే అమెరికా మహిళపై ప్రయోగం కేన్సర్ చికిత్స కొత్తపుంతలు తొక్కుతోంది. కొత్త వ్యాక్సిన్లతో ఈ మహమ్మారిని జయించే దిశగా శాస్త్రవేత్తలు అడుగులు వేస్తున్నారు. కేన్సర్‌పై పోరాటంలో ‘గేమ్ చేంజర్’అనదగ్గ కొత్త వ్యాక్సిన్లను ఆవిష్కరించడంలో అతిపెద్ద విజయం సాధించారు. కీమోథెరపీ, డ్రగ్స్ వంటి పద్ధతులు కాకుండా రోగనిరోధక శక్తి ద్వారా కేన్సర్ కణాలను నాశనం చేసే సరికొత్త వ్యాక్సిన్‌ను ఆవిష్కరించారు. దీని ద్వారా రోగులే కేన్సర్‌ను జయించేలా చేయాలనేది శాస్త్రవేత్తల ప్రయత్నం. కేన్సర్‌పై పోరాటంలో పరిశోధకులు ఘన విజయం సాధించారు. కీమోథెరపీ, డ్రగ్స్ పద్ధతులు కాకుండా రోగనిరోధక శక్తి ద్వారా కేన్సర్‌కణాలను నాశనం చేసే సరికొత్త టీకాను ఆవిష్కరించారు. దీని ద్వారా రోగులే వ్యాధిని జయించేలా చేయాలనేది శాస్త్రవేత్తల ప్రయత్నం. ఇప్పటికే అమెరికాకు చెందిన ఒక మహిళపై ఈ ప్రయోగం విజయవంతమైంది. బ్లడ్ కేన్సర్చివరి దశలో ఉన్న ఆమెకు ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చి ఆమె జీవితకాలాన్ని అనూహ్యంగా పెంచారు. కొన్ని నెలల్లోనే దీని బారి నుండి బయటపడటమే కాక మూడేళ్ల తర్వాత కూడా ఆమె ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే వ్యాధి నుంచి బయటపడినవారు ఆమె ఒక్కరే కాదని వైద్యులు చెపుతున్నారు. మరోవైపు బ్రిటిష్ శాస్త్రవేత్తలు ఇటువంటి విధానంపైనే పరిశోధనలు సాగిస్తున్నారు. టీ-సెల్స్ కీలకం: అమెరికా, బ్రిటన్ ఈ రెండు విధానాల్లోనూ కేన్సర్‌పై పోరాటానికి టీ-సెల్స్(తెల్ల రక్తకణాలు) కీలకం. కేన్సర్కణాల ఉపరితలంపై ఉండే ‘డబ్ల్యూటీ1 ప్రొటీన్’ను గుర్తించే సామర్థ్యాన్ని ఈ కణా లకు అందిస్తారు. లుకేమియా(రక్త కేన్సర్ై)తో బాధపడే రోగులపై ఈ పరిశోధనలు సాగుతున్నాయి. అయితే రొమ్ము, ప్రేగు, ప్రొస్టేట్ మొదలైన కేన్సర్లపై పోరాటానికి కూడా ఈ విధానాన్ని ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఈ కేన్సర్ కణాల ఉపరితలంపైనా డబ్ల్యూటీ1 ఉంటుందని, అందువల్ల ఈ టీకా పనిచేస్తుందని అభిప్రాయపడుతున్నారు. కేన్సర్‌ను జయించడంలో దీనిని ‘యూనివర్సల్ కేన్సర్ వ్యాక్సిన్’ అని శాస్త్రవేత్తలు ఇప్పటికే భావిస్తున్నారు. మూడేళ్లుగా చికిత్స.. న్యూయార్క్‌లోని మెమోరియల్ స్లోన్ కెట్టరింగ్ కేన్సర్ సెంటర్లో స్పెషలిస్ట్ డాక్టర్ గ్వున్తెర్ కోహెన్ మూడేళ్లుగా 15 మంది ప్లాస్మా సెల్ లుకేమియా రోగులకు టీ-కణాల ద్వారా చికిత్స అందించారు. సాధారణ చికిత్సను అందిస్తే ఈ 15 మంది రోగుల్లో చాలా మంది నెలలు మాత్రమే బతకడానికి అవకాశం ఉందని, కానీ తమ టీకా వల్ల వీరిలో సగం మందికిపైగా ఇప్పటికీ బతికే ఉన్నారన్నారు. కోహెన్ తొలి రోగి గ్రాఫిక్ డిజైనర్ రూత్ లాసీ(64)కు 2012లో ఈ చికిత్స చేశారు. బ్రిటన్ శాస్త్రవేత్తల పరిశోధనలు.. బ్రిటన్ శాస్త్రవేత్తలు కూడా ఇలాంటి చికిత్సకు ప్రయత్నిస్తున్నారు. వర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్, రాయల్ ఫ్రీ హాస్పిటల్లో స్పెషలిస్ట్ డాక్టర్ ఎమ్మా మోరిస్ బృందం ఈ పరిశోధనలు జరుపుతోంది. 20 మంది లుకేమియా రోగులకు డీఎన్ఏలో టీ-కణాలను ప్రవేశపెట్టి రోగి శరీరంలోకి ఇంజెక్ట్ చేశారు. ఇవి డబ్ల్యూటీ1 ప్రొటీన్‌ను గుర్తించగలవు. చాలామందిలో రోగనిరోధక కణాలు కేన్సర్ కణాలను గుర్తించలేవు. కేన్సర్‌పై పోరాటంలో ఇదే అతిపెద్ద సమస్య. జన్యుపరమైన మార్పులు చేసిన టీ-కణాలు.. లుకేమియా కణాలను త్వరగా గుర్తించి నిర్మూలిస్తాయి. చికిత్సా విధానం ఇలా... దాత నుంచి ఎముక మజ్జ(బోన్ మ్యారో) తీసు కుని చికిత్స అందిస్తారు. మజ్జను మూలకణాలు, టీ-కణా లు గా విభజిస్తారు. రోగి శరీరంలోకి నేరుగా మూల కణాలను ఇంజెక్ట్ చేస్తారు. టీ-కణాలను కేన్సర్ కణాల ఉపరితలంపై ఉండే డబ్ల్యూటీ1 ప్రొటీన్‌ను గుర్తించేలా ల్యాబ్‌లో జన్యుపర మార్పులు చేస్తారు. వీటిని రోగికి ఇంజెక్ట్ చేయటం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచి కేన్సర్ కణాలను నిర్మూలిస్తారు. -
ఆంకిలోజింగ్ స్పాండిలోసిస్
ఇది దీర్ఘకాలికంగా బాధించే సమస్య. ఇది ముఖ్యంగా కీళ్ళు, వెన్నెముక, తుంటి భాగంలో రావచ్చు. ముఖ్యంగా 18-30 ఏళ్ల యుక్తవయసులో వారికి ఈ సమస్య తలెత్తినప్పుడు కీళ్లు, మెడ బిగుసుకుపోతాయి. ఈ వ్యాధి పురుషుల్లో 3:1 నిష్పత్తిలో కనిపిస్తోంది. 40% కేసులలో కళ్లు ఎర్రబడటం, ఫొటోఫోబియా వంటి లక్షణాలు ఉంటాయి. దీనినే రుమటాయిడ్ స్పాండిలైటిస్ అంటారు. వెన్నెముకకు సోకే ఆర్థరైటిస్‌లో ఇదో రకం. దీనివల్ల వెన్నుపూసల మధ్య వాపు ఏర్పడుతుంది. ఇది ఆటోఇమ్యూన్ వ్యాధి .అనగా సాధారణంగా మీ శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించే ఇమ్యూనిటీ వ్యవస్థ మీ శరీరంలోని కణజాలాన్ని నాశనం చేస్తుంది. ఇది పురుషులలో సాధారణంగా ఎక్కువ తీవ్రతతో వస్తుంది. ఇది జన్యుపరంగా వస్తుంది. నడుమునొప్పి, కీళ్లు బిగుసుకుపోవడం ముందుగా కన్పించే లక్షణాలు. ఈ సమస్య ఎక్కువగా లేట్ అడాల్సెన్స లేదా ఎర్లీ అడల్ట్హుడ్లో మొదలవుతుంది. కొన్ని రోజులు గడిచాక వెన్నుపూసలు కలసిపోయి కదిలికను తగ్గిస్తుంది. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు కానీ మందుల ద్వారా నొప్పి, వాపు, ఇతర లక్షణాలను తగ్గించవచ్చు. వ్యాయామం కూడా ఉపయోగపడుతుంది. ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్‌కు కారణం ఏమిటి ? సరైన కారణం తెలియదు, కానీ జన్యువులు ముఖ్యపాత్ర పోషిస్తాయి. చాలామందిలో జన్యు వు ఉత్పత్తి చేసే జెనెటిక్ మార్కర్ ఉంటుంది. దీనిని ‘ప్రొటీన్ హెచ్ఎల్ఏ-బీ27’ అంటారు. యూరోపియన్ యాన్సెస్ట్రీ జనాభాలో ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్ కలిగిన వారిలో 95% మందిలో ఈ మార్కర్‌ను గుర్తించారు. దీనితో పాటు వాతావరణ కారకాలు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వంటివి కూడా ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్ రావడాన్ని ప్రేరేపిస్తాయి. మామూలు జనాభాలో 8% మందిలో ఇది సాధారణ జన్యువు. ఈ జన్యువు కలిగిన వారిలో 2% మందిలో మాత్రమే స్పాండిలైటిస్ వచ్చే అవకాశం ఉంది. మా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నట్లయితే, నాకు హెచ్ఎల్ఏ-బీ27 పాజిటివ్ వచ్చినట్లయితే ఎంతవరకు నాకు స్పాండిలైటిస్ వచ్చే అవకాశం వుంది? మీ ఇంట్లో ఎవరికైనా స్పాండిలైటిస్ వుండి మీకు హెచ్ఎల్ఏ-బి27 జన్యువు ఉన్నట్లయితే మీ వయస్సు 40 సంవత్సరాల లోపు ఉన్నట్లయితే మీకు స్పాండిలైటిస్ వచ్చే అవకాశం 20% ఎక్కువ. మీరు 40 సంవత్సరాలకు పైబడిన వయసు ఉన్నట్లయితే, స్పాండిలైటిస్ వచ్చే అవకాశం చాలా తక్కువ. మీకు ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఉన్నట్లయితే అది మీ పిల్ల్లలకు చేరే అవకాశం చాలా తక్కువ. తల్లిదండ్రులలో హెచ్ఎల్ఏ-బీ27 జన్యువు ఇన్హెరిటెడ్గా ఉంటే అది 50% మంది పిల్లలకి వచ్చే అవకాశం వుంది. ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఎలా నిర్ధారిస్తారు ? ఫిజికల్ పరీక్షతోపాటు ఎక్స్‌రేలు, వారి మెడికల్ హిస్టరీ, ఇంట్లో ఎవరికైనా ఈ వ్యాధి ఉందా, హెచ్ఎ-బి27 జన్యువు కొరకు రక్తపరీక్షల వంటి ఫలితాలపై ఆధారపడి వ్యాధిని నిర్ధారిస్తారు. దీనిని పూర్తిగా నయం చేయవచ్చునా? ప్రస్తుతానికి ఉన్న మందులతో ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్‌ను పూర్తిగా నయం చేయలేరు. కాని మందుల ద్వారా చికిత్స చేసి లక్షణాలను తగ్గిస్తారు మరియు నొప్పిని మేనేజ్ చేస్తారు. కొన్ని నూతన బయలాజిక్ మందులు వ్యాధి వ్యాపించే వేగాన్ని తగ్గిస్తాయి లేదా ఆపివేస్తాయని కొన్ని పరిశోధనలలో తేలింది. సాధారణంగా చికిత్సలో మందులు, ఎక్స్ర్సైజు మరియు ఫిజియో థెరపీ, మంచి పాశ్చర్ను అలవాటు చేయించడం ఉంటాయి. వాడదగిన హోమియో మందులు: కాల్కేరియా ఫాస్, ఆరమ్, సైలీషియా, ఫాస్పరస్, ఫాస్పరిక్ ఆసిడ్, నేట్రమ్ కార్బ, లైకోపోడియం, పల్సటిల్లా, నక్స్‌వామికా -
హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్‌కు అద్భుతమైన వైద్యం
‘రోగనిరోధక వ్యవస్థ’ అనేది అనేక రకాల అనారోగ్యాలకు గురి కాకుండా నిత్యం మనల్ని రక్షించే ఒక పటిష్టమైన రక్షణ వ్యవస్థ. ఇది ఒక్కోసారి పొరబడి శరీర అంతర్భాగాలపైనే దాడి చేస్తుంది. ఇలాంటప్పుడు ఉత్పన్నమయ్యే రకరకాల ఆటో ఇమ్యూన్ సమస్యలలో ‘ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్’ కూడా ఒకటి. సాధారణంగా వెన్నుపూసలు అరిగి, వాటి మధ్య డిస్కులు దెబ్బతినటంతో వెన్నెముక సమస్యలు వస్తాయి. ఒక్కోసారి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ స్వయంగా, వెన్ను సంబంధిత కణజాలంపై దాడి చేయటంతో ‘ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్’ సమస్య ఉత్పన్నమవుతుంది. ముఖ్యంగా ఇన్ఫ్లమేషన్కు గురైన వెన్నెముక బిరుసుగా మారిపోయిన స్థితినే ‘ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్’ అంటారు. డిస్కులు, కండరాలు, లిగమెంట్లు, టాండన్‌లు, కార్టిలేజ్‌లు మొ॥సముదాయాలతో కూడిన వెన్నెముక నిర్మాణం ఎంతో సంక్లిష్టమైనది. మనిషి ముఖ్యంగా వంగేందుకు మరియు ఇతర ముఖ్య కదలికలన్నింటికీ వెన్నెముక తోడ్పాటు చాలా కీలకం. ఎప్పుడైతే వెన్నెముక దగ్గర కణజాలం ఫైబ్రోసిస్ బారిన పడుతుందో లేదా వెన్నెముక అసాధారణంగా పెరిగి, పూసలు ఒకదానికొకటి కలసిపోతాయో అప్పుడు వెన్నెముక తన సహజ కదలికలు కోల్పోయి, బొంగు కర్ర మాదిరిగా గట్టిగా మారిపోవటాన్ని వైద్య పరిభాషలో ‘బ్యాంబుస్పైన్’ అని అంటారు. ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్ కారణాలు: జన్యుపరమైన ఒక పరిశీలన మేరకు, 90% వ్యాధి బాధితులు ఏఔఅఆ27 అనే జన్యువును కలిగి అంటారు. ఇంతే కాకుండా ‘ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్’ వ్యాధికి కుటుంబ చరిత్ర కూడా ఒక కారణం. లక్షణాలు: సాధారణ స్థితికి మొదలుకుని అత్యంత తీవ్ర స్థితి వరకు నుడము, తుంటి కీళ్ళు మరియు పిరుదులలో నొప్పి ఉండవచ్చు. వెన్నుపూసలు ఒకదానికొకటి నొక్కుకుపోవటంతో, నడుము-తుంటి భాగంతో పాటు మెడ పట్టేసి మామూలు కదలికలకు ఆటంకమవుతుంది. ఇది కేవలం వెన్నెముకతో పాటు, కాళ్ళు చేతుల తాలూకు కీళ్ళు గుండె కవాటాలను మరియు ఊపిరితిత్తులను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి బాధితులలో 40% మందిలో కనిపించే కంటి సంబంధ లక్షణాలు: కళ్ళు ఎర్రగా మారి వెలుతురు చూడలేకపోవడం, కొన్ని సందర్భాల్లో కంటిచూపు మందగించడం, వీటితో పాటు జ్వరం, నీరసం మరియు ఆకలి తగ్గడం. హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స: ఒక దీర్ఘకాలిక సమస్యగా పరిణమించే ‘ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్’ వ్యాధిని మొదట్లోనే గుర్తించి, సత్వర వైద్యం చేయిస్తే, వెన్నెముక పాడవకుండా కాపాడవచ్చు. కేవలం హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో మాత్రమే అందుబాటులో ఉండే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో రోగి లక్షణాలైన నొప్పి, తిమ్మిరి, మంటలను పూర్తిగా తగ్గించడంతో పాటు వ్యాధి మూలకారణాన్ని కూడా గుర్తించి సమర్థవంతమైన చికిత్సను అందివ్వడం జరుగుతుంది. ఈ విశిష్ట హోమియోపతి చికిత్సతో శరీర రోగనిరోధక వ్యవస్థను క్రమపరిచి, ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్‌ను సంపూర్ణంగా నయం చేయవచ్చు లేదా వ్యాధి తీవ్రతను పూర్తిగా తగ్గించి, దుష్పలితాల నుండి పూర్తిగా కాపాడవచ్చు. డా. శ్రీకాంత్ మోర్లావర్, ఇకఈ హోమియోకేర్ ఇంటర్నేషనల్