రొమ్ము కేన్సర్‌కు కొత్త చికిత్స.. సక్సెస్‌! | New Treatment Success for Breast Cancer | Sakshi
Sakshi News home page

రొమ్ము కేన్సర్‌కు కొత్త చికిత్స.. సక్సెస్‌!

Published Wed, Jun 6 2018 12:50 AM | Last Updated on Wed, Jun 6 2018 12:50 AM

New Treatment Success for Breast Cancer - Sakshi

రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయడం ద్వారా రొమ్ము కేన్సర్‌కు సమర్థంగా చికిత్స కల్పించారు శాస్త్రవేత్తలు. దాదాపు 49 ఏళ్ల వయసున్న మహిళ రొమ్ము కేన్సర్‌తో బాధపడుతోందని, మూడు నెలలకు మించి బతికేందుకు అవకాశం లేదని వైద్యులు తేల్చిచెప్పగా.. కెనడాలోని ఓ కేన్సర్‌ పరిశోధన సంస్థ కొత్త రకం ఇమ్యునోథెరపీని ఆ మహిళపై ప్రయోగించారు. రెండేళ్ల క్రితం చికిత్స మొదలుపెట్టగా కొన్ని వారాల్లోనే కేన్సర్‌ కణితి కనిపించకుండా పోయింది. ఆ తరువాత ఇప్పటివరకూ వ్యాధి లక్షణాలేవీ కనిపించలేదని నేచర్‌ మెడిసిన్‌లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం చెబుతోంది. రోగి శరీరంలోని ట్యూమర్‌ ఇన్‌ఫ్రిల్ట్రేటింగ్‌ లింఫోసైట్లను సేకరించి, కేన్సర్‌ కణాలను గుర్తించే లక్షణాలు వాటికి అందించి మళ్లీ శరీరంలోకి ప్రవేశపెట్టడం ఈ కొత్త రకం ఇమ్యునోథెరపీ ప్రత్యేకత.

‘‘చికిత్స ప్రారంభమైన వారం రోజులకే నాలో ఏదో జరుగుతున్న అనుభూతి కలిగింది. ఛాతీలో ఉన్న కణితి కరిగిపోతున్నట్లుగా అనిపించింది. ఆ తరువాత ఒకటి రెండు వారాలకు పూర్తిగా కుంచించుకుపోయింది ఆ కణితి’’ అని ఈ పరిశోధనలో పాల్గొన్న రోగి జూడీ పెర్కిన్స్‌ తెలిపారు. ఈ కొత్త రకం ఇమ్యునోథెరపీని కేవలం రొమ్ము కేన్సర్‌కు మాత్రమే కాకుండా ఇతర కేన్సర్లకు కూడా ఉపయోగించవచ్చుననీ, అన్ని కేన్సర్‌ కణాల్లోనూ జన్యుమార్పులు ఉండటం, వాటిని లక్ష్యంగా చేసుకుని లింఫోసైట్లను ప్రయోగించడం దీనికి కారణమనీ ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త స్టీఫెన్‌ రోసెన్‌బర్గ్‌ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement