
నటి, దర్శకురాలు తహిరా కశ్యప్ (Tahira Kashyap) ఆరోగ్యం మరోసారి ఇబ్బందుల్లో పడింది. గతంలో బ్రెస్ట్ కేన్సర్‌ను ఓడించిన ఈ యోధురాల్ని మహమ్మారి ఇంకా వదల్లేదు. మళ్లీ తాను బ్రెస్ట్ కేన్సర్ (Breast Cancer) బారిన పడినట్టు నటుడు ఆయుష్మాన్ ఖుర్రానా భార్య తహిరా కశ్యప్ వెల్లడించింది. రొమ్ము కేన్సర్ మళ్లీ వచ్చిందని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ద్వారా ప్రకటించింది. దీనిపై ఆమె భర్త ఆయుష్మాన్ ఖురానాతో సహా పలువురు స్పందించారు. ఈ సారి కూడా ఈ వ్యాధి నుంచి బైటపడతావంటూ ధైర్యం చెప్పారు.
తనకు మళ్లీ కేన్సర్ సోకిందన్న విషయాన్ని ప్రపంచ ఆరోగ్యం దిన రోజున తన అభిమానులతో పంచుకుంది. ఆ పోస్ట్ కి తహిరా క్యాప్షన్ ఇచ్చింది:"ఏడేళ్ల బాధలు, రెగ్యులర్ చెకప్‌లు.. మామోగ్రామ్‌లు చేయించుకోవాలని ప్రతి ఒక్కరికీ అదే చెప్తూ ఉంటా... అయినా నాకు రౌండ్ 2...సోకింది అని తెలిపింది. అయినా తాను మరొక యుద్ధానికి సిద్ధంగా ఉన్నానని, ఈ వ్యాధితో పోరాడటానికి తాను నిశ్చయించుకున్నానని తెలిపింది. నాకు మళ్లీ కేన్సర్ వచ్చింది అని ప్రకటించడానికి మొహమాటం ఏమీ లేదు. ప్రపంచ ఆరోగ్య దినం రోజున ఇలా చెప్పడం బాధాకరమే. కానీ మన ఆరోగ్య సంరక్షణ గురించి మనం చేయ గలిగినంత చేద్దాం’ అంటూ పేర్కొంది. జీవితం నిమ్మకాయలు ఇచ్చినప్పుడు, నిమ్మరసమే తయారు చేసుకోవాలి. జీవితం గాడిన పడుతున్న సమయంలో మళ్లీ తిరగబెట్టినపుడు, దాన్ని కాలా ఖట్టా డ్రింక్‌లో దాన్ని పిండుకొని తాగడమే. ఎందుకంటే అది మంచి పానీయం. రెండోసారి కూడా నీకు కూడా మేలు జరుగుతుంది అంటూ రాసు కొచ్చింది
"నా హీరో" అంటూ భార్య పోస్ట్‌పై ఆయుష్మాన్ ఖుర్రానా స్పందించగా, తాహిరా మరిది అపరశక్తి ఖురానా, "బిగ్ టైట్ హగ్ బాబీ! అని, మోర్ పవర్‌టూయూ అని మరొకరు, "నువ్వు దీన్ని కూడా గెలుస్తావు! మీ కోసం ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రార్థిస్తా.. నీకు మరింత శక్తి" అని మరో యూజర్ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాధి గురించి అవగాహన కలిగి ఉండటం దానిని ఎదుర్కోవడానికి ఉత్తమమైన మార్గాల్లోఒకటి అని తహిరా విశ్వాసం. ఇందులో భాగంగానే గత కొన్నేళ్లుగా తన పోరాటాలు ,చికిత్స ప్రయాణం గురించి సోషల్ మీడియాలో తన అభిమానులతో నిరంతరం మాట్లాడుతూ ఉంటుంది. 2025 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం రోజు కీమో థెరపీ దుష్ప్రభావంతో జుట్టు ఊడిపోయి గుండుగా మారిన పోటోతో మరో స్ఫూర్తిదాయకమైన పోస్ట్‌ను పంచుకుంది.
‘టెన్ కమాండ్మెంట్స్ ఆఫ్ బీయింగ్ ఎ ఉమెన్ ’ సహా అనేక బెస్ట్ సెల్లింగ్ పుస్తకాల రచయిత్రి తహిరా కశ్యప్ .2018లో తహిరాకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. చికిత్స అనంతరం కోలుకుంది. కీమోథెరపీ సమయంలో తన అనుభవాలను, బాధలతోపాటు, ఈ ప్రయాణాన్ని సోషల్ మీడియాలో పంచు కుంది. ‘‘శర్మ జీ కి బేటి" తో బాలీవుడ్ దర్శకురాలిగా అరంగేట్రం చేసినటిగా తన ప్రతిభను చాటుకుంటోంది. ప్రకటించింది. ఇంతలోనే బ్రెస్ట్‌కేన్సర్ ఆమె సాహసానికి సవాల్ విసిరింది. యుద్ధంలో గెలవడానికి తాను సిద్ధంగా ఉన్నాననిగతంలో ప్రకటించిన మరీ కేన్సర్‌నుంచి బయటపడిన తహిరా ఇపుడు కూడా అదే నిబ్బరాన్ని ప్రకటించింది. దీంతో ఆమె స్నేహితులు, కుటుంబం స్నేహితులు అందరూ ఆమెకు అండగా నిలిచారు. అదే ధైర్యంతో ఈ వ్యాధినుంచి బైట పడి, విజేతగా నిలవాలని అందరూ కోరుకుంటున్నారు.