Tahira Kashyap
-
ఓటీటీలో 'శర్మాజీ కి బేటీ'.. విడుదల తేదీ వచ్చేసింది
మంచి కామెడీ కంటెంట్ ఉన్న సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలకు రానుంది. 'శర్మాజీ కి బేటీ' అని చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుందని ప్రముఖ ఓటీటీ సంస్థ తెలిపింది. తాహిరా కశ్యప్ ఖురానా దర్శకురాలిగా ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతుంది. ఆమె ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా సతీమణి అని తెలిసిందే. క్యాన్సర్‌పై పోరాడి ఆ మహమ్మారిని జయించిన తాహిరా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంది. ఇందులో సయామి ఖేర్, దివ్య దత్తా, సాక్షి తన్వర్ ప్రధాన పాత్రలలో నటించారు.గతేడాది జియో మామి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రం ప్రీమియర్ షో పడింది. ఆ సమయంలో చాలామంది ఈ చిత్రాన్ని మెచ్చుకున్నారు. మంచి ఫ్యామిలీ కామెడీ డ్రామాగా దీనిని తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. జూన్ 28 నుంచి 'శర్మాజీ కి బేటీ' స్ట్రీమింగ్ కానుందని అమెజాన్ సోషల్ మీడియాలో తెలిపింది.తాహిరా దర్శకత్వం వహించిన ఈ చిత్రం కామెడీతో పాటు నాటకీయతతో కూడుకొని ఉంది. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన స్త్రీలు పట్టణ జీవితాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురౌతాయి. హిళలలు వ్యక్తిగత, సామాజిక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఆ మహిళల మానసిక స్థితి ఎలా ఉంటుందో ఈ సినిమా చెబుతుంది. తాహిరాకు ఇదే తొలి సినిమా అయినప్పటికీ గతంలో ఆమె చాలా షార్ట్ ఫిల్మ్స్ తీసింది. అవన్నీ మంచి గుర్తింపు పొందడంతో.. ఇప్పుడు శర్మాజీ కీ బేటీపై భారీ అంచనాలు ఉన్నాయి. -
బేబి కోసం పట్టిన పాలను ఆయుష్మాన్ తాగేశాడు: తాహిర్
‘విక్కీ డోనర్’ వంటి విభిన్న కాన్సెప్ట్‌తో బాలీవుడ్‌కి పరిచయమై మంచి గుర్తింపు పొందిన నటుడు ఆయుష్మాన్ ఖురానా. ఆ తర్వాత కూడా డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు దూసుకుపోతున్నాడు ఈ కుర్ర హీరో. అయితే ఆయన భార్య తాహీరా కశ్యప్ తాజాగా ‘ది సెవెన్ సిన్స్ ఆఫ్ బీయింగ్ ఏ మదర్’ అనే పుస్తకం రాసింది. అందులో భర్త గురించి సంచలన విషయాలు ఆమె బయటపెట్టింది. ‘ఓ సారి మూడు రోజుల ట్రిప్ కోసం నేను, ఆయుష్మాన్ బ్యాంకాక్ వెళ్లాలనుకున్నాం. అప్పటికే మాకు ఏడు నెలల బేబీ ఉండడంతో.. తనని మా తల్లిదండ్రుల సంరక్షణ ఉంచాం. ఆ సమయంలో బేబీకి పట్టడానికి కొన్ని బాటిల్స్‌లో చనుబాలను పట్టిపెట్టాను. అనంతరం ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయాం. చెకింగ్ అవుతున్న సమయంలో మా అమ్మ ఫోన్ చేసింది. బేబీ బాగానే ఉంది. కానీ పాల సీసాలు ఖాళీగా ఉన్నట్లు చెప్పింది. ఆ బాధలోనే ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోయాం. అక్కడికి వెళ్లిన తర్వాత కూడా పాలు వస్తుండడంతో వాటిని బాటిల్లో పెట్టి బయటికి వెళ్లాను. వచ్చి చూస్తే బాటిల్ ఖాళీగా ఉంది. అప్పుడు అర్థం అయ్యింది పాలను ఆయుష్మాన్ తాగాడని. ఈ విషయాన్ని అడిగితే ఆ పాలు మంచి పోషకాలతో ఉండడంతో తన మిల్క్ షేక్‌లో వేసుకొని తాగేశానని తెలిపాడు. అప్పటి నుంచి అతనికి కనిపించకుండా పాల బాటిల్స్‌ను దాస్తున్నట్లు’ ఈ స్టార్ భార్య తెలిపింది. చదవండి: బోల్డ్ కంటెంట్‌ను ఎంకరేజ్ చేస్తారని అర్థమైంది: యంగ్ హీరో -
జిందగీ ఇన్ షార్ట్ సినిమా రివ్యూ
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సెట్ చేసిన ట్రెండ్, క్రియేట్ చేసిన డిమాండ్.. ఆంథాలజీ. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, హాట్‌స్టార్.. ఎట్సెట్రా స్ట్రీమింగ్ చానెల్స్‌లో సిరీస్ కాకుండా సినిమాల కేటగిరీలో ఎక్కువ భాగం ఈ ఆంథాలజీలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే ‘జిందగీ ఇన్ షార్ట్’ కూడా ఆ కోవలోనిదే. అయితే సాధారణంగా ఈ ఓటీటీల ఆంథాలజీలన్నిటికీ దాదాపుగా సెక్స్ అండ్ క్రైమే కథావస్తువులు. ఈ రకంగా చూస్తే జిందగీ ఇన్ షార్ట్స్ కొంచెం భిన్నమైనది. స్త్రీ ప్రాధాన్యమున్న కథాంశాలే ఎక్కువ. ఏడు కథల సమాహారం ఇది. ఈ ఏడింటినీ కలిపే అంతస్సూత్రమేదీ లేదు. వేటికవే వైవిధ్యమైనవి. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. పిన్ని.. జిందగీ ఇన్ షార్ట్స్‌లోని మొదటి కథ. టైటిల్ పేరు వినగానే తెలుగు పేరులా అనిపిస్తుంది. కాని ఇది ఉత్తర భారతదేశంలోని ఒక మిఠాయి. తనను టేకెన్ ఫర్ గ్రాంటెండ్గా తీసుకున్న కుటుంబానికి తన విలువను తెలియజెప్పే ఒక గృహిణి కథే ఇది. పెళ్లయిపోయి కూతురు, ఉద్యోగంతో భర్త బిజీగా ఉంటే తనకు చేతనైన వంటలతో కాలక్షేపం చేస్తూంటుంది ఆమె. పిన్ని చేయడంలో ఆమెకు ఆమే సాటి. ఆ రుచికి ఎవరైనా దాసోహమనాల్సిందే. ఆ వంటలను ఎక్కడో మెట్రో నగరంలో ఉన్న తన బిడ్డకు కొరియర్ చేస్తూ ఫోన్లో రెండు మాటల కోసం ఎదురుచూస్తూంటుంది. ఇక్కడ భర్త దగ్గర అలాంటి పలకరింపునే కోరుకుంటూంటుంది. కాని ఆ ఇద్దరూ ఆమెను నిర్లక్ష్యం చేస్తారు. ఇంకా చెప్పాలంటే అసలు ఆమె ఉనికికే పట్టించుకోరు. అవమానంగా ఫీలవుతుంది గృహిణి. ఆ ఇంట్లో.. భర్త, కూతురి జీవితాల్లో తన ఉనికిని తెలియజెప్పడం కోసం స్ట్రయిక్ మొదలుపెడుతుంది ఆమె. ఈ కథకు దర్శకురాలు బాలీవుడ్ ప్రముఖ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్య తహిరా కశ్యప్ ఖురానా. ఇందులో గృహిణిగా నీనా గుప్త నటించారు. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు ఈ ఇద్దరూ. సన్నీ సైడ్ ఊపర్ పగలనక, రాత్రనక ఆసుపత్రిలో యంత్రంలా పనిచేస్తున్న డాక్టర్‌కు హఠాత్తుగా జీవితం ఎంత చిన్నదో అర్థమవుతుంది. తన తమ్ముడికి క్యాన్సర్ అని నిర్థారణ అవడంతో ఆ సత్యం బోధపడుతుంది. తన వాళ్లతో సమయం వెచ్చించాలని.. జీవితాన్ని ఆస్వాదించాలని అర్థమై కుటుంబాన్ని కలుసుకోవడానికి ప్రయాణమవుతుంది. దీనికి డైరెక్టర్ విజేతా కుమార్. డాక్టర్‌గా రీమా కళింగల్ నటించింది. స్లీపింగ్ పార్ట్నర్.. భార్యను సాటి మనిషిగా కాకుండా కోరికలు తీర్చే యంత్రంలా భావించే భర్తకు గుణపాఠం నేర్పిన స్త్రీ ఇతివృత్తమే ‘స్లీపింగ్ పార్ట్నర్’. ఒకరకంగా మ్యారిటల్ రేప్‌ను ప్రశ్నిస్తున్న కథ ఇది. మ్యారిటల్ రేప్ బాధితురాలిగా దివ్య దత్తా, పురుషాహంకార భర్తగా సంజయ్ కపూర్ నటించారు. దర్శకత్వం.. పునర్వసు నాయక్. థప్పడ్ హైస్కూల్లో ఆడపిల్లలకు ఎదురయ్యే వేధింపుల కథ ఇది. సాధారణంగా ఇంట్లోంచి ఆడపిల్ల బయటకు వెళితే అన్ననో, తమ్ముడినో రక్షణగా పంపిస్తారు. అలాగే ఇందులో కూడా అక్కా, తమ్ముడు ఇద్దరూ కలిసే స్కూల్‌కి వెళ్తూంటారు. అక్కను ఆమె క్లాస్ అబ్బాయి ప్రేమిస్తున్నానంటూ, ఆ ప్రేమను ఒప్పుకోవాలని ఇబ్బంది పెడ్తుంటారు. తన సోదరి వాళ్లకు భయపడకుండా తను చదివే కామిక్ పుస్తకాల్లోని హీరోలా ఫైట్ చేసి, వాళ్లకు బుద్ధి చెప్పాలని ఆరాటపడ్డమే కాకుండా తన అక్కలోని ధైర్యాన్ని ఆమెకు పరిచయం చేస్తాడు. తమ్ముడు అనుకున్నట్టుగానే అక్క ఆ జులాయిలకు బుద్ధి చెప్తుంది. తమ్ముడిగా షాఫిన్ పటేల్, అక్కగా వేదిక నవానీ నటన అద్భుతం. దర్శకత్వం.. వినయ్ చావల్. ఇవికాక అభద్రతా భావంతో తనను అనుమానించే భర్తకు ఆ భార్య నేర్పిన గుణపాఠంగా ‘స్వాహా’ అనే కథా బాగుంది. సంయుక్త పాణిగ్రాహి దర్శకత్వం వహించిన ఈ కథలో భర్తగా దీపక్ దోబ్రియాల్, భార్యగా ఇషా తల్వార్ నటించారు. డేటింగ్ యాప్‌ల స్నేహాలు, మతాల అంతరాలు, స్త్రీ సాధికారత అంశాలుగా సాగిన కథ గౌతమ్ గోవింద శర్మ దర్శకత్వంలోని ‘ఛాజు కే దహీ బల్లే’, రాకేశ్ సైన్ దర్శకత్వం వహించిన ‘ఒంటరి స్త్రీ దిగులు జీవితపు కథ ‘నానో సే ఫోబియా’ వంటివీ అలరిస్తాయి. ముందుగా చెప్పుకున్నట్టు వీటన్నిటికీ పోలిక చెప్పే అంతస్సూత్రం లేదు. కాని అన్ని కథలూ రివర్స్ మెకానిజంతో సాగినవే. స్త్రీ, పురుష సమానత్వ అవసరాన్ని చెప్పినవే. చదవండి: Singer Sunitha: విమర్శకుల నోరు మూయించేసారు -
ఆ మచ్చలు గతాన్ని గుర్తు చేస్తాయి
బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్య తహీర కశ్యప్ గతేడాది రొమ్ము క్యాన్సర్‌ను జయించింది. అప్పటి నుంచి ఆమె సోషల్ మీడియాలో క్యాన్సర్‌పై అవగాహన కల్పించే పోస్టులను పెడుతూ వస్తోంది. తాజాగా "నేషనల్ క్యాన్సర్ సర్వైవర్స్ డే" సందర్భంగా ఓ ఆడియో సందేశాన్ని అభిమానులతో పంచుకుంది. "కొన్ని గాట్లు లోతైనవి, కొన్ని కనిపిస్తాయి, మరికొన్ని కనిపించవు. కానీ ఆ మచ్చలు మీకు గతాన్ని గుర్తు చేస్తాయి. మీరు బాధ అనుభవించిన క్షణాలను గుర్తు చేస్తూనే ఉంటాయి. కానీ మీ శరీరంపై ఉన్న మచ్చలున్నాయే.. అవి దూరంగా ఉన్న నక్షత్రాల లాగే రహస్యాలను దాచిపెడతాయి. అయితే ఈ రహస్యాలను కంటితో చూడలేరు. ఇందులో ప్రపంచాన్ని విస్మరించే కఠోరమైన అబద్ధం దాగి ఉంటుంది.. (మా ఆయనతో సినిమా చేస్తా: హీరో భార్య) ఇక ఈ మచ్చలు మనకు ఎన్నో నేర్పుతాయి. పోరాటం, శక్తి సామర్థ్యాలు అన్నీ.. ఆరోగ్య కర్మతో పోరాడే ప్రతి ఒక్కరూ విజేతలే. ఎలాగంటే ఈ పోరాటం మిమ్మల్ని అనుభవజ్ఞులుగానో లేదా యుద్ధానికి సిద్ధమవుతున్నారనో తెలుపుతుంది. అయితే క్యాన్సర్‌తో పోరాటం శారీరకంగానే కాదు, మానసికంగానూ ఉంటుంది. కొన్ని యుద్ధాలు జయించడానికి ఎంతో కష్టంగా ఉంటాయి. ముఖ్యంగా అవి అంతర్గతమైనపుడు! కానీ ఓ మాట గుర్తుంచుకోండి. మనందరికీ విశ్వమంతటి శక్తి ఉంది. కాబట్టి మీరు మచ్చలను దాచకండి, వాటిని చూపించండి.. మీ ఆత్మగౌరవానికి ఇతరులే ప్రేమలో పడుతారు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి" అని చెప్పుకొచ్చింది. (నేను కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నా: హీరో) View this post on Instagram A small something I have written.... #nationalcancersurvivorsday . . Some scars are deep, some within, Some are seen while some are hidden. The thing about scars is , it reminds you of the past, The moments of suffering that you thought would forever last. But there’s more to these Goddamn scars, They are Secrets hidden far away, just like the stars. It’s the Truth which you don’t see with the naked eye, Oblivious to the functioning of the world, a blatant lie. But hear me, there’s more to this scar, It talks also about the fight, the resilience and your invincible power. My love and respect to those who fought, The treacherous battlefield that Few crossed while some got lost. But the thing with this health karma is that everyone is a winner, For it’s the fight that counts whether you an expert or a beginner. The fight with cancer is not just physical but also mental, Some battles are more tough to conquer especially if they are internal. But hear me again, we all have that fighter which has the universe’s might, The indomitable spirit that can’t be crushed by any fright. Hide not your scars my love, Show them, flaunt them, just like your bright smile, soothing to others eyes, And when you do that time and again giving people nowhere to run and hide, they will have to fall in love with your badge of honour, your prize. So hear me one last time, Fall in love with your self, All with dust, scar and grime. For that’s what make you, YOU Faulty, imperfect, blemished but all true! Lensed by @atulkasbekar who captures the soul! Thank you for this ❤️ A post shared by tahirakashyapkhurrana (@tahirakashyap) on Jun 6, 2020 at 11:27pm PDT -
మా ఆయనతో సినిమా చేస్తా: హీరో భార్య
విలక్షణ పాత్రల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ యువ హీరో ఆయుష్మాన్ ఖురానాతో సినిమా చేయాలనుకుంటున్నట్లు భార్య తాహిరా కశ్యప్ వెల్లడించారు. అతనితో కలిసి పనిచేయడం ఎంతో ఇష్టమని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే లాక్డౌన్ కారణంగా సినిమా దర్శకత్వం ఆలోచన వాయిదా పడిందని తెలిపారు. కాగా, థియేటర్ డైరెక్టర్, ప్రొఫెసర్ అయిన తాహిరా టోఫీ, పిన్ని వంటి షార్ట్ ఫిల్మ్‌లతో గుర్తింపు పొందారు. ఇక సినిమా రంగంలో తనకంటే సీనియర్ అయిన ఆయుష్మాన్‌ను అప్పుడే డైరెక్ట్ చేయాలని అనుకోవడం లేదని ఆమె చెప్పుకొచ్చారు. రెండు, మూడు సినిమాలు చేశాక.. ఆ అర్హత సంపాదిస్తానని వెల్లడించారు. (చదవండి: ‘ఈ ప్రపంచానికి నీ వయసు చెప్పలేను’) ఆయుష్మాన్ ఓ గొప్ప ఆర్టిస్ట్ అని తాహిర్ భర్తను కొనియాడారు. తాము భార్యభర్తలు కావడంతో అతనితో సినిమా విషయంలో ఒకింత భయం కూడా ఉందని, అయితే దానిని అదిగమిస్తామని తెలిపారు. తన స్క్రిప్ట్‌లు విని ఫీడ్‌బ్యాక్ అందించిన తొలి వ్యక్తి తనేనని తాహిరా తెలిపారు. కాగా, క్యాన్సర్ బారినపడిన తాహిరా దుబాయ్‌లో చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు. తన భార్య జబ్బు బారిన పడటంతో ఉదయం పూట సినిమా షూటింగ్స్, సాయంత్రం పూట భార్య బాగోగులు చూసుకున్న ఆయుష్మాన్... ఆమె కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తూ కార్వా చౌత్ (ఉపవాసం) కూడా నిర్వహించారు. ఆ విశేషాలను తాహిరా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. వీరికి 2008లో వివాహం అయింది. ఇద్దరు పిల్లలు. (చదవండి: గులాబో సితాబో డిజిటల్ రిలీజ్) View this post on Instagram Embarrassing you further @ayushmannk Our #karvachauth moment! While I am in Dubai for an event, my certainly better half keeps a fast for me on his set! (p.s I am still popping some pills so couldn’t fast) But how adorable are you Mr A ! Love you so much❤️ #fastinghusbands thank you @shrutiv11 for capturing this moment! A post shared by tahirakashyapkhurrana (@tahirakashyap) on Oct 17, 2019 at 10:43am PDT -
భారత సినీ చరిత్రలో ‘థప్పడ్’ మైలురాయి
అనుభవ సిన్హా దర్శకత్వంలో హీరోయిన్ తాప్సీ పన్ను నటించిన ‘థప్పడ్’ చిత్రం ఈనెల 28న విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా విడుదలైనప్పటీ నుంచి బాలీవుడ్ ప్రముఖులు దర్శకుడు అనుభవ్ సిన్హా, తాప్సీలపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా సినిమా చూసిన ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ ‘థప్పడ్’ను ప్రశంసిస్తూ శుక్రవారం ట్వీట్ చేశారు. ‘ఈ రోజు నేను సామాజిక అంశాల పట్ల సున్నితమైన భావాలను చూపించిన ‘థప్పడ్’ చూశాను. భారత సినీ చరిత్రలో ఈ సినిమాను ఓ మైలు రాయిగా చెప్పుకోవచ్చు. ఇంతటి విజయాన్ని సాధించిన దర్శకుడికి, నటీనటులకు నా అభినందనలు’ అంటూ ట్విటర్లో రాసుకొచ్చారు. తొలితాప్సీ అనొచ్చు కదా నటుడు ఆయుష్మాన్ ఖురానా భార్య తాహీర్ కశ్యప్ కూడా ఈ సినిమాను, తాప్సీని ప్రశంసించారు. ‘థప్పడ్ అద్బుతమైన చిత్రం. ఇటీవల కాలంలో వస్తున్న సినిమాలన్నింటిలో ‘థప్పడ్’ ప్రత్యేకమైనది. ఈ సినిమా చూసిన అన్ని రకాల ప్రేక్షకులకు ‘థప్పడ్’ కథ ఉద్దేశమెంటో అర్థమవుతుంది. తాప్సీ గృహిణిగా అమృత పాత్రలో ఒదిగిపోయారు. ఆమె నటన నన్ను ఆకట్టుకుంది’ అంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాలో అమృత(తాప్సీ) భర్తగా పావైల్ గులాటి నటించారు. కాగా దియా మీర్జా, రత్న పాథక్ షా, కుముద్ మిశ్రా, తన్వి అజ్మీలు ప్రముఖ పాత్రల్లో కనిపించారు. Today I saw one of the most sensitive , sensible and socially relevant film of recent times Thappad is an extremely well told and well performed movie . My congratulations to the writers director performers and the whole crew for this Mile stone of Indian cinema . — Javed Akhtar (@Javedakhtarjadu) February 28, 2020