బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్య తహీర కశ్యప్ గతేడాది రొమ్ము క్యాన్సర్‌ను జయించింది. అప్పటి నుంచి ఆమె సోషల్ మీడియాలో క్యాన్సర్‌పై అవగాహన కల్పించే పోస్టులను పెడుతూ వస్తోంది. తాజాగా "నేషనల్ క్యాన్సర్ సర్వైవర్స్ డే" సందర్భంగా ఓ ఆడియో సందేశాన్ని అభిమానులతో పంచుకుంది. "కొన్ని గాట్లు లోతైనవి, కొన్ని కనిపిస్తాయి, మరికొన్ని కనిపించవు. కానీ ఆ మచ్చలు మీకు గతాన్ని గుర్తు చేస్తాయి. మీరు బాధ అనుభవించిన క్షణాలను గుర్తు చేస్తూనే ఉంటాయి. కానీ మీ శరీరంపై ఉన్న మచ్చలున్నాయే.. అవి దూరంగా ఉన్న నక్షత్రాల లాగే రహస్యాలను దాచిపెడతాయి. అయితే ఈ రహస్యాలను కంటితో చూడలేరు. ఇందులో ప్రపంచాన్ని విస్మరించే కఠోరమైన అబద్ధం దాగి ఉంటుంది.. (మా ఆయనతో సినిమా చేస్తా: హీరో భార్య)
ఇక ఈ మచ్చలు మనకు ఎన్నో నేర్పుతాయి. పోరాటం, శక్తి సామర్థ్యాలు అన్నీ.. ఆరోగ్య కర్మతో పోరాడే ప్రతి ఒక్కరూ విజేతలే. ఎలాగంటే ఈ పోరాటం మిమ్మల్ని అనుభవజ్ఞులుగానో లేదా యుద్ధానికి సిద్ధమవుతున్నారనో తెలుపుతుంది. అయితే క్యాన్సర్‌తో పోరాటం శారీరకంగానే కాదు, మానసికంగానూ ఉంటుంది. కొన్ని యుద్ధాలు జయించడానికి ఎంతో కష్టంగా ఉంటాయి. ముఖ్యంగా అవి అంతర్గతమైనపుడు! కానీ ఓ మాట గుర్తుంచుకోండి. మనందరికీ విశ్వమంతటి శక్తి ఉంది. కాబట్టి మీరు మచ్చలను దాచకండి, వాటిని చూపించండి.. మీ ఆత్మగౌరవానికి ఇతరులే ప్రేమలో పడుతారు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి" అని చెప్పుకొచ్చింది. (నేను కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నా: హీరో)
Comments
Please login to add a commentAdd a comment