
ప్రముఖ హిందీ నటి హీనా ఖాన్ క్యాన్సర్ బారిన పడింది. మూడో దశ రొమ్ము క్యాన్సర్‌తో ప్రస్తుతం తాను బాధపడుతున్నానని బయటపెట్టింది. అలానే ఇప్పుడు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నానని, త్వరలోనే కోలుకుని తిరిగి మామూలు మనిషి అవుతానని ధీమా వ్యక్తం చేసింది. ఈమె ఇన్ స్టాలో ఇప్పుడు పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరీమె?
(ఇదీ చదవండి: జైలులో హీరో దర్శన్.. ఇతడికి సపోర్ట్‌గా టాలీవుడ్ హీరో)
జమ్ము కశ్మీర్‌లో పుట్టి పెరిగిన హీనా ఖాన్.. 2009 నుంచి నటిగా కొనసాగుతోంది. 'హే రిస్తా క్యా ఖేల్తా హై' సీరియల్‌తో కెరీర్ మొదలుపెట్టింది. దీని తర్వాత ఫియర్ ఖత్రోంకి ఖిలాడీ 8, బిగ్ బాస్ 11 రియాలిటీ షోల్లో పాల్గొంది. నాగిన్ 5, షద్యంత్రా తదితర సీరియల్స్‌లోనూ కీలక పాత్రలు చేసి ఆకట్టుకుంది. పలు సీరియల్స్‌లో అతిథి పాత్రలు చేసింది. ఓ అరడజను సినిమాలు, రెండు వెబ్ సిరీసులు కూడా చేసింది.
సీరియల్ నటిగా కొనసాగుతున్న టైంలోనే ప్రొడ్యూసర్ రాకీ జైశ్వాల్‌ని ప్రేమించి అతడిని 2014లో పెళ్లి చేసుకుంది. ఇకపోతే తనకు ఆస్తమా ఉన్నట్లు ఓ షోలో బయటపెట్టింది. ఇప్పుడు తాను మూడో దశ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు రివీల్ చేసింది. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని, త్వరలో పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగొస్తానని చెప్పుకొచ్చింది. దీంతో ఈమె త్వరగా కోలుకోవాలని సహా నటీనటులు కామెంట్స్ పెడుతున్నారు.
(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రభాస్.. 'కల్కి'లో ఇది గమనించారా?)
Comments
Please login to add a commentAdd a comment