
‘విక్కీ డోనర్’ వంటి విభిన్న కాన్సెప్ట్‌తో బాలీవుడ్‌కి పరిచయమై మంచి గుర్తింపు పొందిన నటుడు ఆయుష్మాన్ ఖురానా. ఆ తర్వాత కూడా డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు దూసుకుపోతున్నాడు ఈ కుర్ర హీరో. అయితే ఆయన భార్య తాహీరా కశ్యప్ తాజాగా ‘ది సెవెన్ సిన్స్ ఆఫ్ బీయింగ్ ఏ మదర్’ అనే పుస్తకం రాసింది. అందులో భర్త గురించి సంచలన విషయాలు ఆమె బయటపెట్టింది.
‘ఓ సారి మూడు రోజుల ట్రిప్ కోసం నేను, ఆయుష్మాన్ బ్యాంకాక్ వెళ్లాలనుకున్నాం. అప్పటికే మాకు ఏడు నెలల బేబీ ఉండడంతో.. తనని మా తల్లిదండ్రుల సంరక్షణ ఉంచాం. ఆ సమయంలో బేబీకి పట్టడానికి కొన్ని బాటిల్స్‌లో చనుబాలను పట్టిపెట్టాను. అనంతరం ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయాం. చెకింగ్ అవుతున్న సమయంలో మా అమ్మ ఫోన్ చేసింది. బేబీ బాగానే ఉంది. కానీ పాల సీసాలు ఖాళీగా ఉన్నట్లు చెప్పింది. ఆ బాధలోనే ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోయాం.
అక్కడికి వెళ్లిన తర్వాత కూడా పాలు వస్తుండడంతో వాటిని బాటిల్‌లో పెట్టి బయటికి వెళ్లాను. వచ్చి చూస్తే బాటిల్ ఖాళీగా ఉంది. అప్పుడు అర్థం అయ్యింది పాలను ఆయుష్మాన్ తాగాడని. ఈ విషయాన్ని అడిగితే ఆ పాలు మంచి పోషకాలతో ఉండడంతో తన మిల్క్ షేక్‌లో వేసుకొని తాగేశానని తెలిపాడు. అప్పటి నుంచి అతనికి కనిపించకుండా పాల బాటిల్స్‌ను దాస్తున్నట్లు’ ఈ స్టార్ భార్య తెలిపింది.
చదవండి: బోల్డ్ కంటెంట్‌ను ఎంకరేజ్ చేస్తారని అర్థమైంది: యంగ్ హీరో
Comments
Please login to add a commentAdd a comment