ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌: ఆశాజనకంగా ఫలితాలు | Oxford Corona Vaccine Can Train Immune System | Sakshi
Sakshi News home page

ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌: ఆశాజనకంగా ఫలితాలు

Published Mon, Jul 20 2020 7:47 PM | Last Updated on Mon, Jul 20 2020 8:18 PM

Oxford Corona Vaccine Can Train Immune System - Sakshi

లండన్‌ : కరోనా వ్యాక్సిన్‌ కోసం ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ.. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తొలి నుంచి కరోనా వ్యాక్సిన్‌‌ ప్రయోగాల్లో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ముందు వరుసలో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యాక్సిన్‌ తొలిదశ క్లినికల్‌ ట్రయల్స్‌ సంబంధించిన డేటా వెలువడింది. లాన్సెట్‌ మెడికల్‌ జర్నల్‌లో ఈ  ఫలితాలను ప్రచురించారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ తొలిదశ క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలు ఆశాజనంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్‌ ద్వారా రోగనిరోధక ప్రతిస్పందన గుణం పెరుగుతుందని తెలిపారు. అలాగే ఇది సురక్షితమైనదని వెల్లడించారు.

ఈ క్లినికల్‌ ట్రయల్స్‌లో దాదాపు 1,077 మందిపై వ్యాక్సిన్‌ ప్రయోగించగా.. వీరిలో యాంటీబాడీస్‌తోపాటుగా, కరోనాతో పోరాడగలిగే తెల్ల రక్తకణాలను ఏర్పరచడానికి తోడ్పడిందని తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ ద్వారా భయంకరమైన సైడ్‌ ఎఫెక్ట్స్‌‌ లేవని అన్నారు. అయితే వ్యాక్సిన్‌ తీసుకున్న వాలంటీర్లలోని పలువురిలో జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించాయని.. అయితే పరిశోధకులు వాటిని పారాసిటమాల్‌తో తగ్గించగలిగారని చెప్పారు. అయితే ఈ వ్యాక్సిన్‌ పూర్తి స్థాయిలో కరోనాను అడ్డుకోగలుగుతుందో లేదో తెలియాలంటే.. మరిన్ని పరీక్షలు జరగాల్సి ఉందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement