oxford university
-
‘ప్రగతి’ సూపర్ సక్సెస్
సాక్షి బెంగళూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు, ప్రాజెక్టులపై ఎప్పటికప్పడు సమీక్ష జరుపుతూ సమయానికి పనులు పూర్తయ్యేలా చేసేందుకు నేరుగా ప్రధాని మోదీ పాల్గొని నిర్వహించే వర్చువల్ సమావేశం ప్రో–యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ (ప్రగతి) కార్యక్రమం అద్భుత ఫలితాలనిస్తోందని ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం కితాబునిచ్చింది. రెండో తేదీన బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో జరిగిన కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ‘ప్రగతి’కార్యక్రమంపై జరిపిన అధ్యయనాన్ని ఒక బిజినెస్ స్కూల్ కేస్ స్టడీ రూపంలో విడుదల చేసింది. ‘గ్రిడ్లాక్ టూ గ్రోత్’పేరిట చేసిన అధ్యయనంలో ప్రగతి కార్యక్రమం అమలు, వాటి ఫలితాలను విశ్లేషించింది. దేశంలో భారీ ఎత్తున మౌలిక వసతులు, సామాజికాభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రగతి పథకం ద్వారా విజయవంతంగా అమలు చేస్తున్నారని ఆక్స్ఫర్డ్ ప్రశంసించింది. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన ఈ పరిశోధనలో ‘ప్రగతి’కార్యక్రమం ద్వారా దేశంలో జరిగిన డిజిటల్ గవర్నెన్స్ అభివృద్ధిని ఆక్స్ఫర్డ్ ప్రస్తావించింది. 2015లో ‘ప్రగతి’ప్రస్థానం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు 205 బిలియన్ డాలర్ల విలువైన 340 ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తిచేశారని వెల్లడించింది. ‘ప్రగతి’కార్యక్రమంలో భాగంగా సుమారు 50 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని, రెట్టింపు స్థాయిలో విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపింది. మౌలికవసతుల కల్పన కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయి జీడీపీలో రూ. 2.5 నుంచి రూ. 3.5 మేర తిరిగి లబ్ధి చేకూర్చినట్లు ఆక్స్ఫర్డ్ అధ్యయనం తెలిపింది. ప్రధాన మంత్రి మౌలికవసతుల అభివృద్ధి కోసం ఉద్దేశించిన పీఎం గతిశక్తి, పర్యావరణ అనుమతుల నిమిత్తం రూపొందించిన పరివేశ్లను నిర్వహించడంలో ఈ ప్రగతి ఎంతగానో దోహదపడిందని వర్సిటీ తెలిపింది. గతంలో పర్యావరణ అనుమతుల కోసం 600 రోజులు పడుతుండగా ప్రస్తుతం ‘ప్రగతి’కారణంగా జీఐఎస్ మ్యాపింగ్, డ్రోన్ పర్యవేక్షణ ద్వారా ఆ గడువు దాదాపు 75 రోజులకు తగ్గిందని వెల్లడించింది. గ్రామాల్లోని కుళాయి కనెక్షన్స్ కూడా కేవలం ఐదేళ్లలో 17 శాతం నుంచి 79 శాతానికి పెరిగినట్లు తెలిపింది. -
రతన్ టాటా గౌరవార్థం: లండన్‌లో..
దేశం కోసం వేలకోట్లు ఉదారంగా దానం చేసిన దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాను ప్రపంచ దేశాలు సైతం గౌరవిస్తాయి. ఈ గౌరవంతోనే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్మించనున్న భవనానికి 'రతన్ టాటా' పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ భవన నిర్మాణ పనులు 2025లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ భవనాన్ని రాడ్‌క్లిఫ్ అబ్జర్వేటరీ క్వార్టర్లో.. టాటా గ్రూప్, సోమర్విల్లే కాలేజ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నిర్మించనున్నాయి. దీని ద్వారా బోధన, విద్యాకార్యకలాపాల నాణ్యతను మెరుగుపరుస్తారు. ఇది అవసరమైన పరిశోధనలకు నిలయంగా ఉంటుంది.సోమర్విల్లే కాలేజ్, రతన్ టాటా మధ్య దశాబ్ద కాలంగా ఉన్న స్నేహం వల్ల ఈ ప్రాజెక్ట్ సాధ్యమైంది. దీనిని లండన్‌కు చెందిన ఆర్కిటెక్ట్ మోరిస్ కో డిజైన్ చేయనున్నట్లు సమాచారం. రతన్ టాటా పేరుతో భవనాన్ని నిర్మించానికి లండన్ యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయం ఎంతోమంది భారతీయుల హృదయాలను గెలుచుకుంది.రతన్ టాటా పేరుతో భవన నిర్మాణం ప్రకటన తరువాత, సోమర్విల్లే కళాశాల ప్రిన్సిపాల్ బారోనెస్ రాయల్ మాట్లాడుతూ.. ఈ భవనం గత దశాబ్దంలో అనేక సంభాషణలు, ఆశలు, కలల ఫలం. టాటాతో మా సుదీర్ఘ అనుబంధానికి చిహ్నం అని అన్నారు. ఇది ఒక గొప్ప వ్యక్తి, సోమర్విల్లే ప్రియమైన స్నేహితుడి జీవితానికి శాశ్వత వారసత్వంగా నిలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. సోమర్విల్లే కళాశాలతో ఈ సహకారం రతన్ టాటా విలువలకు నివాళి అని అన్నారు. -
ఆక్స్ఫర్డ్ చాన్సలర్ పదవికి ఇమ్రాన్ పోటీ!
ఇస్లామాబాద్/లండన్: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ విఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ చాన్సలర్ పదవికి పోటీపడనున్నారు. ప్రస్తుతం జైళ్లో ఉన్న ఇమ్రాన్ ఆన్లైన్ బ్యాలట్ విధానంలో జరిగే ఎన్నికల్లో పాల్గొంటారని అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆయనకు సలహాదారుడైన వ్యాపారవేత్త సయ్యద్ జుల్ఫీ బుఖారీ శుక్రవారం జియో న్యూస్‌కు తెలిపారు. ఇమ్రాన్ ఆక్స్‌ఫర్ యూనివర్శిటీ పూర్వ విద్యారి్థ. ఎకనమిక్స్, పొలిటికల్ సైన్స్ చదివారు. 2005–2014 దాకా ఆయన బ్రాడ్ఫోర్డ్ యూనివర్శిటీ చాన్సలర్‌గా పనిచేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ చాన్సలర్ పదవికి గౌరవ హోదా.. పూర్వ విద్యార్థులు దీని కోసం పోటీపడటానికి అర్హులు. రాజకీయ నాయకులకు ఈ పదవి దక్కడం ఆనవాయితీగా వస్తోంది. బ్రిటన్ మాజీ ప్రధానులు టోనీ బ్లెయిర్, బోరిస్ జాన్సన్‌లు కూడా ఈసారి పోటీలో ఉన్నారు. -
‘డీల్ క్యాన్సిల్’.. టెక్ దిగ్గజం టీసీఎస్‌కు భారీ షాక్!
ప్రముఖ దేశీయ టెక్నాలజీ సంస్థ టీసీఎస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రద్దు చేసుకుంది. విద్యార్ధులకు అడ్మిషన్లు ఇచ్చేందుకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రతి ఏడాది ఆన్లైన్ అడ్మిషన్ టెస్ట్‌లు నిర్వహిస్తుంది. ఆ ప్రాజెక్ట్‌ను ఆక్స్ఫర్డ్.. టీసీఎస్‌కు అప్పగిచ్చింది. అయితే, ఇటీవల యూనివర్సిటీ ఆన్లైన్ అడ్మిషన్ టెస్ట్ నిర్వహించే సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డీల్ క్యాన్సిల్ దీనిపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో టీసీఎస్‌తో కుదుర్చున్న డీల్‌ను రద్దు చేస్తున్నట్లు యూనివర్సిటీ అధికారిక ప్రకటన చేసింది. ఇకపై ఆక్స్ఫర్డ్ నిర్వహించే అడ్మిషన్ టెస్ట్‌లకు టీసీఎస్‌కు సంబంధం లేదని తెలిపింది. టీసీఎస్‌పై ఫిర్యాదుల వెల్లువ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యూకేలోని సుమారు 30 కాలేజీల్లో గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యను అందిస్తుంది. సంబంధిత కాలేజీల్లో అర్హులైన విద్యార్ధుల్ని ఎంపిక చేసేందుకు ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా విద్యార్ధులకు ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఎప్పటిలాగే గత ఏడాది ఏప్రిల్ నెలలో అడ్మిషన్ టెస్ట్‌లను నిర్వహించడం కోసం టీసీఎస్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ ఫోకస్డ్ యూనిట్ టీసీఎస్ ఐఓఎన్ని ఎంపిక చేసింది. ఈ ఆన్లైన్ టెస్ట్ జరిగే సమయంలో విద్యార్ధులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే అంశంపై యూనిటీకి సైతం ఫిర్యాదు చేశారు. తప్పదు మరి కొద్ది రోజులకే ఆన్లైన్ టెస్ట్ జరిగే సమయంలో తలెత్తిన ఆయా సమస్యలను, అలాగే అభ్యర్థులు, ఉపాధ్యాయులు, పరీక్షా కేంద్రాల నుండి వచ్చిన అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుని టీసీఎస్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ‘విద్యార్ధల భవిష్యత్‌ను తీర్చిదిద్దడమే మా అంతిమ లక్ష్యం. ఈ ప్రక్రియలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. తదుపరి అడ్మీషన్లు ఎప్పుడనేది త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తామని’ ఆక్స్ఫర్డ్ తెలిపింది. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎమ్మెల్సీ కవిత కీలక ప్రసంగం..
సాక్షి, హైదరాబాద్: భారత దేశానికి తెలంగాణ అభివృద్ధి మోడల్ దిక్చూచి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అతి తక్కువ సమయంలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని, తెలంగాణ సమ్మిళిత, సమగ్ర అభివృద్ధి సాధించిందని వివరించారు. పరిపాలనలో మానవీయ కోణాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ అభినవ చాణక్యగా అభివర్ణించారు. అహింసా మార్గంలో తెలంగాణను సాధించిన గాంధీ సీఎం కేసిఆర్ అని స్పష్టం చేశారు. ఒకప్పుడు బీడువారిన భూములను పచ్చని పంటపొలాలుగా తీర్చిదిద్ది దేశానికి సీఎం కేసిఆర్ స్పూర్తినిచ్చారన్నారు. ప్రకృతి ఇచ్చిన వనరులను సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ ముందుందని అన్నారు. తెలంగాణ శాంతిసామరస్యానికి ప్రతీక అని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క మతకల్లోలం కూడా జరగలేదని గుర్తు చేశారు. తెలంగాణ మోడల్ అంటే ఆర్థిక గణాంకాలు కాదని.. అది మారిన తెలంగాణ జీవన స్థితిగతులని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యం పాటిస్తూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ముందుకెళ్తోందని, అన్ని రంగాల్లో తెలంగాణను సీఎం కేసీఆర్ అగ్రగామిగా నిలిపారని వివరించారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కేసీఆర్ తో సఫలం అయ్యిందన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం సుదీర్ఘ పోరాటం సాగిందని, చివరికి 2001లో సీఎం కేసీఆర్ తెలంగాణ పోరాటాన్ని ప్రారంభించారని తెలిపారు. దాంతో 2004లో అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశాన్ని కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో చేర్చిందని గుర్తు చేశారు. ఆ తర్వాత కేసీఆర్ ఉద్యమాన్ని ఉదృతం చేయడంతో 2009లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, చివరికి 2014లో ప్రత్యేక రాష్ట్రం సాకారమయ్యిందని వివరించారు. ధాన్యం ఉత్పత్తిలో రెండో స్థానం అయితే, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోన్న 10 జిల్లాల్లో 9 వెనుకబడిన జిల్లాలు ఉండేవని, రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉండేదని ప్రస్తావించారు. 2700 మెగావాట్ల విద్యుత్తు కొరత ఉండేదని, విద్యుత్తు లేక పరిశ్రమలను వారంలో రెండు రోజులపాటు మూసివేసేవారని, తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండేదని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సమూలమైన సంస్కరణల ద్వారా పూర్తిగా ఆ పరిస్థితులను మార్చివేశారని స్పష్టం చేశారు. విద్యుత్తు మిగులు సాధించామని, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానానికి చేరిందని అన్నారు. చదవండి: Telangana: ఎంపీ, ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్నా కూడా అసెంబ్లీకే జై 2014-15నుంచి 2022-23 మధ్యకాలంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)118.2 శాతం పెరగగా.. తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)155.7 శాతం పెరిగిందని తెలిపారు. అంటే జాతీయ సగటుకు మించి తెలంగాణ పయనిస్తోందని చెప్పారు. జీఎస్డీపీలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు అయ్యే సమయానికి రూ. 1,12,162 ఉన్న తలసరి ఆదాయం 2022-23 నాటికి రూ. 3,14,732కి పెరిగిందని, తలసరి ఆదాయం పెరుగుదలలో ఇతర రాష్ట్రాలకు మించి దూసుకెళ్తొందని తెలిపారు.అందరికి సమాన సందప విధానాన్ని సీఎం కేసీఆర్ అవలంభిస్తున్నారన్నది అర్థమవుతోందని వివరించారు. సమానాదాయ పంపిణీలో తెలంగాణ నెంబర్ వన్ ఎన్ఎఫ్ హెచ్ఎస్ 2019-21 ప్రకారం సమానాదాయ పంపిణీలో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందని ప్రస్తావించారు. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు నెగటివ్ వృద్ధిలో ఉన్న తెలంగాణ 2022-23 నాటికి 15.7 శాతం వృద్ధి సాధించిందని వెల్లడించారు. చివరి గింజ వరకు ప్రభుత్వం పంటను కొనుగోలు చేస్తోందని, రైతు బంధు పేరిట ఏటా ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇప్పటి వరకు 65 లక్షల మంది రైతులకు రూ.72815కోట్లు అందించామని చెప్పారు. ఈ చర్య వల్ల రైతులు ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు చేసే పరిస్థితి పోయిందని అన్నారు. ఎక్కడా లేని విధంగా రైతులకు ఉచితంగా సాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని, రైతాంగానికి 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్తు అందిస్తున్నమనా వివరించారు. పండగలా వ్యవసాయం తెలంగాణ వ్యవసాయం పండగలా మారిందని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ ద్వారా భూరికార్డులను కంప్యూటరీకరణ చేపట్టి విప్లవాత్మక మార్పుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. 99 శాతం భూరికార్డులు భద్రంగా ఉన్నాయని తద్వారా అవసరమైన రుణాలను కూడా బ్యాంకులు ఇస్తున్నాయని చెప్పారు. మిషన్ కాకతీయ కింద చెరువులు మరమ్మత్తు చేసుకోవడం వల్ల ఇవాళ రాష్ట్రంలో చెరువులు నిండుకుండాలా ఉన్నాయని, దానితో భూగర్భజలాలు పెరగడమే కాకుండా మత్స్య సంపద పెరిగిందని వివరించారు. మూడున్నరేళ్ల కాలంలోనే కాళేశ్వరం పూర్తి రికార్డుస్థాయిలో మూడున్నరేళ్ల కాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని పునరుద్ఘాటించారు. ఆ ప్రాజెక్టు వల్ల రైతులు మూడు పంటలు పండిస్తున్నారన్నారు. 2004-2014 మధ్యకాలంలో అప్పటి ప్రభుత్వాలు వ్యవసాయానికి రూ. 7994 కోట్లు ఖర్చు చేస్తే గత తొమ్మిదిన్నరేళ్లకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1,91,612 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. బలమైన విధానాలు రూపొందించడం వల్ల ఇవన్నీ సాధ్యమయ్యాయన్నారు. సాగు విస్తీర్ణం 1.31 లక్షల ఎకరాల నుంచి 2 కోట్లకుపైగా ఎకరాలకు పెరిగిందని, ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నామని వివరించారు. తాగునీటిపై రూ.36 వేల కోట్లు ఖర్చు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే మరో 50 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందని అన్నారు. 2014లో రూ. 62లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర బడ్జెట్ ఇప్పుడు రూ. 2 లక్షల 94 వేల కోట్లకు చేరుకుందని గుర్తు చేశారు. తాగునీటిపై రాష్ట్ర ప్రభుత్వం రూ.36 వేల కోట్లు ఖర్చు చేసిందని, మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్ కల్పించామని చెప్పారు. విద్యుత్తు రంగంలో రూ.38 వేల కోట్లు ఖర్చు చేశామని, 2014లో 7778 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తయ్యేదని, ఇప్పుడు 18453 మెగావాట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యానికి చేరుకున్నామన్నారు. హరితహారం కోసం రూ.10 వేల కోట్లు పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తిలోనూ తెలంగాణ ఎంతో ముందుందని పేర్కొన్నారు. తలసరి విద్యుత్తు వినియోగం 2126 యూనిట్లకు చేరిందని, ఇది దేశంలోనే అత్యధికమని ప్రస్తావించారు. కాగా, పర్యావరణ సవాళ్లను అధిగమించడానికి 280 కోట్ల మొక్కలు నాటామని, అందుకు తెలంగాణకు హరితహారం కింద రూ.10 వేల కోట్లను ఖర్చు చేశామన్నారు. ప్రతీ గ్రామంలో నర్సరీని నెలకొల్పామని, ప్రపంచంలో ఈ విధానం ఎక్కడా లేదని స్పష్టం చేశారు. కోట్లలో ఐటీ ఉత్పత్తుల ఎగుమతి పరిశ్రమల ఏర్పాటును వేగవంతంగా అనుమతులు ఇస్తున్నామని, టీఎస్ ఐపాస్ విధానం ద్వారా కేవలం 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని. ఆలోగా అనుమతులు రాకపోతే పరిశ్రమను స్థాపించుకునే వెసులుబాటును కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని వివరించారు. 2014 నుంచి ఈ ఏడాది జనవరి వరకు రూ.3.31 లక్షల కోట్ల పెట్టుబడులతో 22100 పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని, తద్వారా 22 లక్షల 36 వేల పరోక్ష ఉద్యోగాలను సృష్టించామని, 2014లో రాష్ట్రం నుంచిరూ. 57 వేల కోట్ల విలువైన ఐటీ ఉత్పత్తులు ఎగుమతవ్వగా.. ఇప్పుడు రూ.1.83 లక్షల విలువైన ఎగుమతులుకు చేరామని వివరించారు. వైద్య రంగంలో ఎంతో పురోగతి యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, అమెజాన్ వంటి బహుళజాతి కంపెనీలు సైతం తమ యూనిట్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే ఇంత వృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు. అలాగే, వైద్య రంగంలో తెలంగాణ ఎంతో పురోగమించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేవలం మూడు డయాలసిస్ కేంద్రాలు ఉండేవని, సీఎం కేసీఆర్ ఇప్పుడు 104కేంద్రాలకు పెంచారన్నారు. మహిళా సాధికారతకు కృషి రూ. 11 వేల కోట్లకుపైగా ఆసరా పథకం కింద 44 లక్షల మందికిపైగా పెన్షన్లు అందించామని అన్నారు. విద్యారంగంలో రంగంలో సమూల మార్పలు తీసుకొచ్చామని, 10 వేల మెడికల్ సీట్లను పెంచామని, ప్రతీ జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాల వారి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. మహిళా సాధికారతకు ఎంతో కృషి చేస్తున్నమన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు పోస్ట్ డేటెడ్ చెక్కు లాంటిది మహిళా రిజర్వేషన్ల చట్టం పోస్ట్ డేటెడ్ చెక్కు అని పార్లమెంటు ఆమోదించిన తర్వాత కూడా మా రిజర్వేషన్ల చట్టం అమలు కావడం లేదని కల్వకుంట్ల కవిత ఆక్షేపించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు పోస్ట్ డేటెడ్ చెక్కు లాంటిదని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మహిళా రిజర్వేషన్ చట్టం ద్వారా ప్రయోజనాలు పొందాలని ప్రయత్నించిందని అన్నారు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల నుంచే చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్లు వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. కేంద్రానికి చిత్తశుద్ధి లేదని, అన్ని పార్టీలు డిమాండ్ చేసినా ఓబీసీ కోటా కూడా కల్పించలేదని తప్పుబట్టారు. -
లండన్ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత
లండన్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవిత సోమవారం లండన్ చేరుకున్నారు. లండన్ విమానాశ్రయంలో కవితకు ఎన్నారైలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బ్రిటన్‌లోని ప్రసిద్ధ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగే సదస్సులో పాల్గొననున్నారు. తెలంగాణ అభివృద్ధి మోడల్‌పై భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 11 గంటలకు అక్కడ కీలకోపన్యాసం చేయనున్నారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు లండన్ వెళ్లిన ఎమ్మెల్సీ కవిత.. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 11.30 గంటలకు ఆక్స్ ఫోర్డ్ యూనివర్సిటీలో ‘ఎక్స్ ప్లోరింగ్ ఇన్ క్లూసివ్ డెవలప్మెంట్: ద తెలంగాణ మోడల్’ అనే అంశంపై ప్రసంగించనున్నారు. కీలక రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన గణనీయమైన పురోగతిపై ప్రజెంటేషన్ ఇస్తారు. వ్యవసాయం, విద్యుత్తు, విద్య, వైద్యం, తాగునీరు తదితర అంశాలపై తెలంగాణ సాధించిన ప్రగతిని అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించనున్నారు. చదవండి: చేతకాని దద్దమ్మలు కత్తిపోట్లకు పాల్పడుతున్నారు: కేసీఆర్ ఫైర్ -
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ హాస్పిటల్స్ సీయివోగా మేఘన.. ఆమెనే ఎందుకు?
భారతీయ మూలాలు ఉన్న ప్రొఫెసర్ మేఘనా పండిత్ బ్రిటన్‌లోని ప్రసిద్ధ ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ హాస్పిటల్స్ సీయివోగా నియమితురాలై ఈ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ప్రత్యేకత చాటుకుంది. గత సంవత్సరం జులై నుంచి బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ హాస్పిటల్స్(వోయుహెచ్), నేషనల్ హెల్త్ సర్వీసెస్ ట్రస్ట్(ఎన్హెచ్ఎస్)కు తాత్కాలిక సీయివోగా బాధ్యతలు నిర్వహించిన మేఘన ఇప్పుడు శాశ్వత ప్రాతిపదికన ఆ బాధ్యత లు చేపట్టబోతోంది. ‘సీయివోగా మేఘన నియామకం సంతోషం కలిగిస్తుంది. విషయం మీద ఆసక్తి, అనురక్తి మాత్రమే కాదు అంకితభావం, క్రమశిక్షణ ఉంటే ఉన్నతస్థాయికి ఎదగవచ్చు అని చెప్పడానికి ఆమె ఉదాహరణ. ఉద్యోగులతో కలిసి పనిచేసే తీరు ఆమెలోని నాయకత్వ లక్షణాలకు అద్దం పడుతుంది. ట్రస్ట్‌కు సంబంధించిన విలువలు కాపాడడంలో, ట్రస్ట్ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లడంలో ఆమె నాయకత్వ బలం ఉపయోగపడుతుంది’ అంటున్నారు ట్రస్ట్ చైర్పర్సన్ జోనాథన్. ‘ఎన్హెచ్ఎస్’కు బ్రిటన్‌లో ఎన్నో టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి. యూరప్‌లో అత్యధిక సంఖ్యలో హాస్పిటల్స్ ఉన్నాయి. ట్రస్ట్ ఆధ్వర్యంలో విలువైన పరిశోధనలు జరుగుతున్నాయి. గతంలో ‘ఎన్హెచ్ఎస్’కు సంబంధించి చీఫ్ మెడికల్ ఆఫీసర్(సిఎంవో)గా విధులు నిర్వహించింది మేఘన. వార్విక్ యూనివర్శిటీ హానరరీ ప్రొఫెసర్‌గా నియామకం అయింది. ముంబైలో ఎంబీబీఎస్ చేసిన మేఘనా పండిత్ బోధన నుంచి నిర్వహణ వరకు తనదైన ప్రతిభతో ముందుకు దూసుకువెళ్తోంది. చదవండి: మీకంటే తోపు లేడనుకుంటున్నారా? అయితే సమస్యే..! -
ఆక్స్ఫర్డ్ వర్సిటీ హాస్పిటల్స్ సీఈఓగా మేఘనా పండిట్
లండన్: బ్రిటన్‌లోని అతిపెద్ద బోధనా ఆసుపత్రుల్లో ఒకటైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్స్–ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్టు సీఈఓగా భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రొఫెసర్ మేఘనా పండిట్ నియమితులయ్యారు. నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) ట్రస్టుకు ఒక మహిళ, అందునా భారత సంతతికి చెందిన వ్యక్తి సీఈఓ కావడం ఇదే తొలిసారి. ఆమె 2022 జూలై నుంచి ఓయూహెచ్ మధ్యంతర సీఈఓగా ఉన్నారు. కఠిన పోటీని ఎదుర్కొని తాజాగా పూర్తిస్థాయి సీఈఓ అయ్యారు. భాగస్వామ్య వర్సిటీలతో, ఆక్స్ఫర్డ్ వర్సిటీ హాస్పిటల్స్ చారిటీతో కలిసి పనిచేస్తానని మేఘనా చెప్పారు. అత్యున్నత నాణ్యతతో కూడిన పరిశోధనలు, నవీన ఆవిష్కరణలపై ప్రత్యేకంగా దృష్టి పెడతానన్నారు. ఆమె అబ్స్టెట్రిక్స్, గైనకాలజీలో మేఘనా పండిట్ శిక్షణ పొందారు. అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్‌లో యూరోగైనకాలజీ విజిటింగ్ ప్రొఫెసర్‌గా, ఎన్హెచ్ఎస్ ట్రస్టులో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా, వార్విక్ యూనివర్సిటీలో గౌరవ ప్రొఫెసర్‌గా చేశారు. -
వారిని అస్సలు పట్టించుకోని అమెజాన్ ఫ్లెక్స్, ఓలా, ఊబర్, డంజో, ఫార్మ్ఈజీ
న్యూఢిల్లీ: కాంట్రాక్టు ఉద్యోగులకు (గిగ్ వర్కర్లు/తాత్కాలిక పనివారు) న్యాయమైన, పారదర్శక పని పరిస్థితులు కల్పించడంలో ఓలా, ఊబర్, డంజో, ఫార్మ్ఈజీ, అమెజాన్ ఫ్లెక్స్ సున్నా స్థానంలో నిలిచాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఫెయిర్‌వర్క్ ఇండియా ఈ రేటింగ్‌లు ఇచ్చింది. అంతర్జాతీయంగా డిజిటల్ టెక్నాలజీ కంపెనీల్లో పని పరిస్థితులపై ఫెయిర్‌వర్క్ రేటింగ్‌లు ఇస్తుంటుంది. ఈ సంస్థ ‘ఫెయిర్‌వర్క్ ఇండియా రేటింగ్స్ 2022’ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. న్యాయమైన వేతన చెల్లింపులు, పని పరిస్థితులు, న్యాయమైన ఒప్పందాలు, పారదర్శక నిర్వహణ, న్యాయమైన ప్రాతినిధ్యం అంశాల ఆధారంగా రేటింగ్‌లు కేటాయిస్తుంది. 10 పాయింట్లకు గాను అమెజాన్ ఫ్లెక్స్, డంజో, ఓలా, ఫార్మ్ఈజీ, ఊబర్ కు సున్నా పాయింట్లు వచ్చినట్టు ఈ నివేదిక వెల్లడించింది. నివేదికలో భాగంగా 12 ప్లాట్‌ఫామ్‌లకు ఫెయిర్‌వర్క్ రేటింగ్‌లు ఇవ్వగా, ఈ ఏడాది ఒక్క ప్లాట్‌ఫామ్ కూడా 10కి 10 పాయింట్లు సంపాదించలేకపోయింది. అర్బన్ కంపెనీ అత్యధికంగా 10 పాయింట్లకు గాను 7 పాయింట్లు సొంతం చేసుకుంది. బిగ్ బాస్కెట్ కు 6, ఫ్లిప్‌కార్ట్‌కు 5, స్విగ్గీకి 5, జొమాటోకు 4, జెప్టోకు 2, పోర్టర్‌కు ఒక పాయింట్ లభించింది. ‘‘చట్టం దృష్టిలో గిగ్ వర్కర్లు అంటే స్వతంత్ర కాంట్రాక్టర్లు. అంటే కార్మిక హక్కులను వారు పొందలేరు. అసంఘటిత రంగం ఉద్యోగులు, నిరుద్యోగుల మాదిరే వీరు కూడా. గంటల వారీ కనీస వేతనం అందించడం వారి పని పరిస్థితులు మెరుగుపడే విషయంలో మొదటి మెట్టు’’అని ఫెయిర్‌వర్క్ అని కంపెనీల పని పరిస్థితులను అధ్యయనం చేసిన ప్రొఫెసర్ బాలాజీ పార్థసారథి తెలిపారు. -
Covid-19: దిమాక్ ఖరాబ్ చేస్తున్న కరోనా
లండన్: కరోనా వచ్చి పోయింది, మానసికంగా ఒడిదుడుకులకు గురైనా పర్వాలేదుగానీ ఓ గండం దాటేశాం అనుకుంటున్న వాళ్లకు.. కొత్త కొత్తగా వస్తున్న నివేదికలు మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. శ్వాస కోశ వ్యవస్థ.. అంతర్గత అవయవాల పని తీరును డ్యామేజ్ చేయడం వరకే వైరస్ ప్రభావం ఆగిపోలేదు. పోస్ట్ కొవిడ్ ఎఫెక్ట్.. మెదడుపైనా దీర్ఘకాలం ప్రభావం చూపెడుతోందని తాజా అధ్యయనాల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు వివిధ దేశాల నుంచి సుమారు పన్నెండున్నర లక్షల మంది పేషెంట్ల ఆరోగ్య నివేదికల ఆధారంగా.. లాన్సెట్ సైకియాట్రీ జర్నల్ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది. ఇంత భారీ సంఖ్యలో ఫీడ్ బ్యాక్ తీసుకోవడం ఇదే మొదటిది. వీళ్లలో శ్వాస కోశ, హృదయ, ఎముకల సంబంధిత సమస్యల కంటే.. మెదడు మీదే కరోనా తీవ్ర ప్రభావం చూపుతోందని గుర్తించారు. COVID-19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి, ప్రాణాలతో బయటపడినవారు నాడీ సంబంధిత, సైకియాట్రిక్ సమస్యల బారినపడుతున్న ప్రమాదం ఎక్కువగా ఉందని ఆధారాలు అంతకంతకు పెరుగుతూ వస్తున్నాయి. బ్రెయిన్ ఫాగ్.. ఇబ్బందికర పరిస్థితి. పనుల మీద దృష్టిసారించకపోవడం. విషయాల్ని గుర్తుంచుకోకపోవడం. చుట్టూ ఉన్న విషయాలను పట్టించుకోకపోవడం.. మీ మీద మీకే విరక్తి కలగడం. ఎపిలెప్సీ.. బ్రెయిన్ యాక్టివిటీ అబ్నార్మల్గా ఉండడం. అసాధారణ ప్రవర్తన. వీటితో పాటు మూర్ఛ సంబంధిత సమస్యలూ వెంటాడుతున్నాయి. డిప్రెషన్, యాంగ్జైటీ రూపంలో స్థిమితంగా ఉండనివ్వడం లేదు. వైరస్ బారినపడి కోలుకున్నవాళ్లలో.. ఆరు నెలల నుంచి రెండేళ్లపాటు మానసిక రుగ్మతలు కొనసాగడం గుర్తించినట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పౌల్ హారిసన్ వెల్లడించారు. కొవిడ్-19 తర్వాతే ఎందుకిలా జరుగుతుంది?.. ఇది ఇంకెంత కాలం సాగుతుంది?.. సమస్యలను అధిగమించడం ఎలా? అనే వాటిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని ఆయన అంటున్నారు. ఇదీ చదవండి: షియోమి వారి కుంగ్ ఫూ రోబో! -
చిన్ననాటి పుస్తకాలనే చిన్నారులకు వినిపిస్తున్నారు
న్యూఢిల్లీ: భారతీయ తల్లిదండ్రుల్లో చాలామంది తాము చిన్నతనంలో చదివిన పుస్తకాలనే తమ పిల్లలకు చదివి వినిపిస్తారట. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ (ఓయూపీ) చేసిన ఓ అధ్యయనం ఈ మేరకు తేల్చింది. కోవిడ్ నేపథ్యంలో తల్లిదండ్రులు, కుటుంబం, స్నేహితులు కలిసి గడపడం, భాష ప్రాముఖ్యతను చాటడంతో పాటు పఠనాసక్తిని ప్రోత్సహించేందుకు ఓయూపీ ప్రయత్నించింది. అందులో భాగంగా ‘గిఫ్ట్ ఆఫ్ వర్డ్స్’ పేరుతో భారత్, బ్రిటన్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, చైనాల్లో ఇటీవల ఓ సర్వే చేసింది. అందులో పాల్గొన్న తల్లిదండ్రుల్లో దాదాపు సగం మంది తాము చిన్ననాడు చదివిన పుస్తకాలనే పిల్లలకు చదివి విన్పిస్తుంటామని చెప్పారు. తమ పిల్లలు కూడా దాన్నే ఇష్టపడతారని 56% మంది వెల్లడించారు. 48% మందేమో చిన్నప్పుడు తాము చదివిన పుస్తకాలనే చదివేందుకు తమ పిల్లలు ఇష్టపడుతున్నారని చెప్పారు. తాజాగా వచ్చే పుస్తకాలను ఎలా కనుక్కోవాలో 37% మందికి తెలియదని తేలింది. ఆన్లైన్, ఆడియో బుక్స్ కంటే ముద్రిత ప్రతులను చదివేందుకే ఇష్టపడతామని 70% మంది భారతీయ తల్లిదండ్రులు చెప్పారు. ఇలా పిల్లలకు పుస్తకాలు చదివి విన్పించడం ద్వారా వారితో తమ బంధం మరింత గట్టిపడుతుందని 78 శాతం మంది అభిప్రాయపడ్డారు. పిల్లలకు పుస్తకాలు చదివి విన్పించేందుకు తమకు మరింత సమయం అందుబాటులో ఉంటే బాగుండేదని 85 శాతం మంది బాధపడుతున్నారట! పిల్లల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు ది పైరేట్ మమ్స్, ది పర్ఫెక్ట్ ఫిట్, స్టెల్లా అండ్ ది సీగల్, ఎ సాంగ్ ఇన్ ది మిస్ట్, ఎవ్రీబడీ హాజ్ ఫీలింగ్స్, మ్యాక్స్ టేక్స్ ఎ స్టాండ్, ది సూప్ మూమెంట్, బేర్ షేప్డ్, ఎవ్రీబడీ వర్సీస్ వంటి ఆసక్తికరమైన పుస్తకాలను ఓయూపీ సూచించింది. -
కరోనా దెబ్బ.. ఆయుషు తగ్గింది!
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా రేపిన కలకలం ఇప్పట్లో ఆగిపోయేలా లేదు. కోవిడ్ కారణంగా ఇప్పటికే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా, కోట్ల సంఖ్యలో వైరస్ బారినపడిన వారు ఇతర రుగ్మతలు ఎదుర్కొంటున్నారు. మనిషి ఆయుర్దాయంపై కూడా కరోనా తీవ్ర ప్రభావం చూపిందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కోవిడ్ సంక్షోభంతో మనుషుల సగటు ఆయుషు గణనీయంగా పడిపోయిందని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తాజాగా తేల్చారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి. -
కోవిషీల్డ్ టీకా.. వ్యవధి పెరిగితే మేలే!
లండన్: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ది చేసిన కోవిడ్ 19 టీకా (భారత్‌లో కొవిషీల్డ్) రెండో డోసు వేసుకోవడానికి ఎక్కువ వ్యవధి తీసుకోవడం మంచిదని తాజా అధ్యయనంలో తేలింది. ఆక్స్ఫర్డ్ వర్సిటీ చేసిన ఈ అధ్యయనంలో రెండో డోసు తీసుకోవడాన్ని వాయిదా వేయడం వల్ల, అలాగే, ఆ తరువాత మూడో డోసును కూడా ఆలస్యంగా తీసుకోవడం వల్ల కరోనా నిరోధక శక్తి బాగా పెరుగుతోందని తేలింది. మొదటి, రెండో డోసుల మధ్య 45 వారాల వ్యవధి ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుందని ఆ అధ్యయనంలో పేర్కొన్నారు. 45 వారాల వ్యవధి వల్ల కరోనా ఇమ్యూనిటీ తగ్గుతుందన్న వాదనను ఇది తోసిపుచ్చింది. రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తరువాత మూడో డోసు తీసుకుంటే శరీరంలో యాంటీబాడీల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని పేర్కొంది. అయితే, ఈ అధ్యయనాన్ని మరింత లోతుగా పరీక్షించాల్సి ఉంది. ‘తగినన్ని టీకాలు అందుబాటులో లేని దేశాలకు ఇది శుభవార్త. రెండో డోసు ఆలస్యం కావడం వల్ల నష్టం కన్నా లాభమే ఎక్కువ’అని ఆ స్టడీలో పాల్గొన్న ఆండ్య్రూ పోలర్డ్ వ్యాఖ్యానించారు. మొదటి డోసు వేసుకున్న 10 నెలల తరువాత రెండో డోసు వేసుకున్న వారికి అద్భుతంగా ఇమ్యూనిటీ పెరిగిందన్నారు. మూడో డోసును ఆలస్యంగా వేయడం వల్ల కూడా సానుకూల ఫలితాలు వెలువడ్డాయన్నారు. కాగా, ఈ వ్యాక్సిన్‌తో అతికొద్ది మందిలో రక్తం గడ్డకట్టే సమస్య ఏర్పడుతున్నట్లు గుర్తించారు. దీంతో కొన్ని దేశాలు ఈ టీకాను నిషేధించగా, కొన్ని దేశాలు యువతకు ఈ టీకా ఇవ్వరాదని నిర్ణయించాయి. -
వ్యాక్సిన్‌లో ఎందుకింత గ్యాప్..!
ఎందుకు? ఎప్పుడు? ఎలా? కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ రెండు డోసుల వ్యవధిపై సామాన్య జనానికి వస్తున్న సందేహాలివి. మొదటి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి? కేంద్రం డోసుల వ్యవధిని ఎందుకు పెంచుకుంటూ పోతోంది? ఇలాగైతే ఎలా? వీటన్నింటి చుట్టూ పెద్ద వివాదానికే తెరలేచింది. ఆ వివాదం ఏంటి? కేంద్రం ఏం చెబుతోంది? బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెనా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిడ్–19 వ్యాక్సిన్ (కోవిషీల్డ్) రెండు డోసుల మధ్య వ్యవధిపై వివాదం నెలకొంది. పుణేకి చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ని ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కి అత్యవసర అనుమతులు మంజూరు చేసినప్పుడు 4 –6 వారాల మధ్య రెండో డోసు తీసుకోవాలని కేంద్రం నిర్దేశించింది. జనవరి 16న తొలిదశ వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యాక అలాగే ఇచ్చారు. మార్చి 23న రెండు డోసుల మధ్య వ్యవధిని 6–8 వారాలకు పెంచింది. ఆ తర్వాత మళ్లీ మే 13న హఠాత్తుగా వ్యవధిని ఒకేసారి 12–16 వారాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఇలా గడువు ఎందుకు పెంచుతోందని సామాన్య ప్రజలు గందరగోళానికి లోనవుతూ ఉంటే, శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ మధ్య ఏకంగా 12–16 వారాల వ్యవధి మంచిది కాదని, దానిని తగ్గించాలని ఒక వర్గం శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వ్యవధి తగ్గించాలని ఎందుకు అంటున్నారు? కేంద్ర ప్రభుత్వం రెండు డోసుల వ్యవధి పెంచిన తర్వాత జరిగిన అధ్యయనాల్లో కోవిషీల్డ్ సింగిల్ డోసుతో కేవలం 33% రక్షణ మాత్రమే వస్తుందని రెండు డోసులు తీసుకున్నాక 65 నుంచి 85% వరకు కరోనా నుంచి రక్షణ వస్తుందని తేలింది. భారత్‌లో ప్రమాదకరమైన డెల్టా వేరియంట్‌తో ముప్పు పొంచివుండటంతో వ్యాక్సినేషన్ రక్షణ లభిస్తే... ప్రాణహాని తగ్గుతుందని, సీరియస్ కా కుండా ఉంటుందని వాదిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆస్ట్రాజెనెకా (కోవిషీల్డ్) టీకా రెండోడోసును 8–12 వారాల మధ్య ఇవ్వాలని సిఫారసు చేయడం గమనార్హం. దీంతో పలు దేశాలు డోసుల మధ్య వ్యవధిని తగ్గిస్తున్నాయి. కేంద్రం చెబుతున్నదేంటి! కోవిషీల్డ్ కనిష్ట వ్యవధిని ఒక్కసారిగా రెట్టింపు చేస్తూ 84 రోజులకు పెంచడంపై విమర్శలు రావడంతో కేంద్రం వివరణ ఇచ్చింది. శాస్త్రీయ డేటాను విశ్లేషించిన తర్వాత టీకా డోసుల మధ్య వ్యవధి పెంచామని, ఈ నిర్ణయాన్ని రాజకీయం చేయడం దురదృష్టకరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ట్వీట్ చేశారు. ఎన్టీఏజీఐ, కేంద్రం ఏకాభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ గడువు 12 వారాలకు పెంచాలని అప్పట్లో కమిటీ కేంద్రానికి రాసిన లేఖ ప్రతిని కూడా హర్షవర్ధన్ ట్వీట్ చేశారు. మరోవైపు ఎన్టీఏజీఐ చైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా కూడా అన్ని రకాల అధ్యయనాలను విశ్లేషించి, భారత్‌లో డెల్టా వేరియెంట్‌పై ఎలా పని చేస్తోందో శాస్త్రీయపరమైన డేటా పరిశీలించాక ఈ సిఫారసులు చేశామని అన్నారు. తమ కమిటీలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని చెప్పారు. రెండు డోసుల మధ్య వ్యవధి ఎందుకు? మొదటి టీకా డోసు తీసుకున్నాక శరీరంలో కరోనా వైరస్‌ని తట్టుకునే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. రెండో డోసు బూస్టర్ డోసు లాంటిది. 12 వారాల తర్వాత రెండో డోసు ఇస్తే వ్యాక్సిన్ సామర్థ్యం మరింత పెరుగుతుందని ఏప్రిల్‌లో పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ వెల్లడించింది. బ్రిటన్‌లోని డోసుల మధ్య 12 వారాలు పెంచిన తర్వాతే ఆల్ఫా వేరియంట్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు. స్పెయిన్ (60 ఏళ్ల లోపు వారికి), కెనడా, శ్రీలంక దేశాల్లో కూడా 12–16 వారాల వ్యవధిలోనే రెండో డోసు ఇస్తున్నారు. యూరోప్‌లో ఈ గడువు 4–12 వారాలుగా ఉంది. వివాదం ఎందుకు మొదలైంది? కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య 42 రోజుల కనిష్ట వ్యవధిని 84 రోజులకి ఒకేసారి పెంచుతూ మే 13న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్టీఏజీఐ) వివిధ అధ్యయనాలను పరిశీలించాక 12–16 వారాల వ్యవధి ఉంటే యాంటీబాడీలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయన్న సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించింది. మే 1 నుంచి 18 ఏళ్ల పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడంతో ఒక్కసారిగా టీకా డోసులకి కొరత ఏర్పడింది. వ్యాక్సిన్కున్న డిమాండ్‌కి తగ్గట్టుగా ఉత్పత్తి, సరఫరా లేకపోవడంతో ఉద్దేశపూర్వకంగానే కేంద్రం వ్యాక్సిన్ గడువుని పెంచిందన్న ఆరోపణలున్నాయి. ఆ ఆరోపణలకు ఊతమిచ్చేలా ఎన్టీఏజీఐలో అత్యంత కీలకమైన 14 మంది సభ్యుల్లో ముగ్గురు శాస్త్రవేత్తలు రాయిటర్స్ సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ కేంద్ర ప్రభుత్వానికి తాము గడువు రెట్టింపు చేయాలని సిఫారసు చేయలేదని చెప్పారు. కేంద్రమే ఆ నిర్ణయం తీసుకుందని మాథ్యూ వర్ఘీస్ అనే శాస్త్రవేత్త వెల్లడించారు. దీంతో వివాదం మొదలై వ్యాక్సిన్ గడువు వ్యవధిని తగ్గించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కోవిడ్–19లో మార్పులు వస్తున్నట్టే దాని వ్యాక్సిన్ నిరంతరాయంగా మారే ప్రక్రియ. ఒకవేళ రెండో డోసుల వ్యవధిని తగ్గిస్తే ప్రజలకి 5–10% లబ్ధి జరుగుతుందని శాస్త్రీయంగా ఆధారాలు లభిస్తే తప్పకుండా వ్యవధి తగ్గించాలని సిఫారసు చేస్తాం. ప్రస్తుత 12–16 వారాల వ్యవధితోనే మేలు జరుగుతుందని అధ్యయనాలు చెబితే ఇదే కొనసాగుతుంది ఎన్.కె. అరోరా, నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ గ్రూప్ చైర్మన్ -
Anvee Bhutani: ఆక్స్ఫర్డ్ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్‌గా అన్వీ భూటానీ
లండన్: యూకేలోని ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ విశ్వ విద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన అన్వీ భూటానీ ఎన్నికయ్యారు. ఆమె ప్రస్తుతం ఆక్స్ఫర్డ్ వర్సిటీకి చెందిన మాగ్డలిన్ కాలేజీలో హ్యూమన్ సైన్స్ విద్యను అభ్యసిస్తున్నారు. అధ్యక్షురాలిగా విద్యార్థుల హక్కుల కోసం పోరాటం సాగిస్తానని అన్వీ పేర్కొ న్నారు. తోటి విద్యార్థుల నుంచి తనకు అద్భుత మైన మద్దతు లభించిందని ఆనందం వ్యక్తం చేశా యి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో అన్వీ మంచి మెజారిటీతో ఎన్నికయ్యారు. అధ్యక్షురాలిగా ఉన్న భారత సంతతి విద్యార్థిని రష్మీ సామంత్ రాజీనా మా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. ఆక్స్ఫర్డ్ వర్సిటీ విద్యార్థులందరి తరఫున తాను ప్రాతినిధ్యం వహిస్తుండడం గొప్ప గౌరవమని అన్వీ వ్యాఖ్యానించింది. 2021–22 విద్యా సంవత్సరంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికే చెందిన దేవిక ఎన్నిక కావడం విశేషం. -
Oxford University: భారత సంతతి యువతి అరుదైన ఘనత
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా భారత సంతతి యువతి ఎన్నికైంది. స్టూడెంట్ యూనియన్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో భారత సంతతి యువతి అన్వీ భుటానీ ఘన విజయం సాధించింది. ఆమె ప్రస్తుతం వర్సిటీలోని మ్యాగ్డలెన్ కాలేజీలో హ్యూమన్ సైన్స్ చదువుతోంది. ఈ ఫలితాన్ని అధికారులు గురువారం రాత్రి ప్రకటించారు. గతంలో సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించిన వివాదం కారణంగా ఇంతకు ముందు ఉన్న ఆధ్యక్షురాలు రష్మీ సమంత్ రాజీనామా తర్వాత ఈ ఉపఎన్నిక జరిగింది. భూటాని తన మ్యానిఫెస్టోలో.. చెర్వెల్ విద్యార్థి వార్తాపత్రిక ప్రకారం ఆక్స్ఫర్డ్ జీవన వేతనం అమలు చేయడం, సంక్షేమ సేవలు, క్రమశిక్షణా చర్యలను తొలగించడం లాంటివి చేర్చింది. 2021-22 విద్యా సంవత్సరానికిగాను స్టూడెంట్ యూనియన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇండియన్ సొసైటీ ప్రెసిడెంట్, రేసియల్ అవేర్నెస్, ఈక్వాలిటీ క్యాంపైన్ కో-చైర్ పదవి కోసం బరిలో నిలిచింది. దీంతో ఆమెకు భారీగా ఓట్లు పోలవడంతో ఏకపక్షంగా విజయం సాధించింది. చదవండి: కొడుక్కి ఎంతైనా ఇస్తా.. కూతురికి ఇవ్వను! -
కరోనా నుంచి కోలుకున్నా.. ఈ సమస్యలు వెంటాడొచ్చు!
సాక్షి, అమరావతి: ‘కరోనా బారినపడి కోలుకున్న తరువాత కూడా వివిధ అనారోగ్య సమస్యల ముప్పు పొంచి ఉంది. కాబట్టి కరోనా బాధితులు వారి ఆరోగ్య పరిరక్షణ విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది’ అని ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది. ప్రధానంగా నరాల సంబంధ వ్యాధులు, మానసిక రుగ్మతల బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ అధ్యయనం చెబుతోంది. కరోనా నుంచి కోలుకున్న 2,36,379 మంది ఆరోగ్య స్థితిగతులను విశ్లేషించిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈ నివేదికను వెల్లడించింది. ప్రఖ్యాత ‘లాన్సెట్ సైకియాట్రి’ జర్నల్ ప్రచురించిన ఆ నివేదికలోని ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి. మూడోవంతు మందికి.. ► కరోనా నుంచి కోలుకున్న వారిలో మూడోవంతు మంది నరాల సంబంధిత, మానసిక రుగ్మతల బారినపడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఫ్లూ వంటి ఇతర వ్యాధుల నుంచి కోలుకున్న వారితో పోలిస్తే కరోనా బాధితులు ఈ రెండు సమస్యల బారిన పడే అవకాశాలు 44 శాతం అధికం. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు 16 శాతం అధికం. ► అధ్యయనం చేసిన 2,36,379 మందిలో 1,05,579 మంది ఇన్ప్లూయెంజా వైరస్, 2,36,038 మంది శ్వాసకోశ నాళంలో ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. వీరిలో 17 శాతం మంది మానసిక రుగ్మతలతో, 14 శాతం మంది ఒత్తిడితో సతమతం అవుతున్నారు. ► వైరస్ నుంచి కోలుకున్న వారిలో 7 శాతం మందికి గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయి. 2 శాతం మంది మానసిక వైకల్య సమస్యల్ని కూడా ఎదుర్కొంటున్నారు. ఇలా కావడానికి ప్రధాన కారణం ఏమిటన్నది కచ్చితంగా నిర్ధారించనప్పటికీ.. మానసిక ఆందోళన, ఉద్యోగ భద్రత లేకపోవడం, దీర్ఘకాలం క్వారంటైన్లో ఒంటరిగా ఉండటం మొదలైనవి ప్రాథమిక కారణాలుగా అంచనా వేశారు. వీటిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నివేదిక పేర్కొంది. వీరికి సామాజిక భద్రత, సంరక్షణ కల్పించడం, మేమున్నామనే భరోసా ఇవ్వడం ద్వారా ఆ సమస్యల నుంచి వారిని బయటపడేయవచ్చని నివేదిక అభిప్రాయపడింది. మెదడుపై కరోనా ప్రభావం ఎంత! మెదడుపై కరోనా ప్రభావంపై ఇంకా లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తన నివేదికలో పేర్కొంది. లండన్‌లో కరోనా వైరస్ సోకి ఆస్పత్రిలో చేరిన ప్రతి ఐదు మందిలో నలుగురికి తలనొప్పి, మైకం, కండరాల నొప్పి తదితర లక్షణాలు కనిపించాయి. ఈ వైరస్ మొదటిసారిగా బయటపడిన చైనాలోని వూహాన్లో 36 శాతం కరోనా రోగుల్లో నరాల సంబంధ సమస్యలు, మగతగా ఉండటం వంటి లక్షణాలు కనిపించాయని నివేదిక తెలిపింది. -
కరోనా వైరస్: ఆక్స్ఫర్డ్ టీకా బాగా పని చేస్తోంది
లండన్: ఆక్స్ఫర్డ్/ఆస్ట్రాజెనెకా టీకా చాలా బాగా పని చేస్తోందని తాజాగా వెల్లడైన మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. అమెరికా, చిలీ, పెరూ దేశాల్లో దాదాపు 32 వేల మంది వాలంటీర్లపై ఈ పరిశోధన జరిగింది. ఇందులో కోవిడ్–19ను అడ్డుకోవ డంలో ఆక్స్ఫర్డ్/ఆస్ట్రాజెనెకా టీకా 79శాతం పనితీరును చూపిందని నివేదిక సోమవారం పేర్కొంది. వ్యాధి ముదరకుండా చూడటం, ఆస్పత్రిపాలు కాకుండా పని చేయడంలో ఈ వ్యాక్సిన్ 100 శాతం ఫలితాలను సాధించినట్లు తేలింది. ఇదే వ్యాక్సిన్‌ను భారత్‌లో సీరం ఇన్స్టిట్యూట్ ద్వారా తయరుచేయించి ప్రస్తుతం వ్యాక్సినేషన్ చేస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: వ్యాక్సిన్ పంపిణీలో ముందున్న భారత్) -
‘ఆక్స్ఫర్డ్’ డోస్‌ల మధ్య 3నెలల గ్యాప్
న్యూఢిల్లీ: ఆక్స్ఫర్డ్ కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులకు మధ్య మూడు నెలల వ్యవధి తీసుకోవడం మంచి ఫలితాలనిస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. వ్యాక్సిన్ డోసులకి మధ్య ఆరు వారాల వ్యవధి తీసుకున్నప్పటికన్నా, మూడు నెలల గ్యాప్‌తో వ్యాక్సిన్ తీసుకుంటే సత్ఫలితాలిస్తున్నట్టు అధ్యయనం తెలిపింది. ఈ రెండు డోసుల్లో తొలి డోసు వ్యాక్సిన్ 76 శాతం రక్షణనిస్తుందని వెల్లడించింది. లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించిన ఈ అధ్యయనం వ్యాక్సిన్ డోసులకి మధ్య మూడు నెలల సమయం తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టం వాటిల్లదని, తొలి డోసు అందుకు రక్షణ కల్పిస్తుందని వెల్లడించింది. కొందరికే రెండో డోసుని తొందరగా ఇచ్చే బదులు 3 నెలల కాలవ్యవధిలో ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించే వీలుంటుదని అ«ధ్యయనం వెల్లడించింది. ‘వ్యాక్సిన్ సరఫరా తక్కువగా ఉండడం, అత్యధిక మంది జనాభాకి వ్యాక్సిన్ అందించేందుకు తక్కువ సమయం ఉండడంతో ప్రభుత్వాలు ప్రజారోగ్య పరిరక్షణకు ఎటువంటి విధానం అవసరమో నిర్ణయించుకోవాలి’’అని ఆక్స్ఫర్డ్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఆండ్రూ పోల్లార్డ్ అన్నారు. యుకె, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలకు చెందిన 17,178 మంది ఆరోగ్య కార్యకర్తలపై జరిపిన ఈ అధ్యయనంలో. సుదీర్ఘకాలం వ్యవధితో వ్యాక్సిన్ తీసుకున్నవారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉన్నట్టు గుర్తించారు. ఆరు వారాల్లోపు వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కంటే 12 వారాల తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న వారికి మెరుగైన ఫలితాలు వచ్చినట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. ఒక డోసు తరువాత కరోనా యాంటీ బాడీలు మూడు నెలల పాటు శరీరంలో ఉంటున్నట్టు గుర్తించారు. వారిలో రోగనిరోధక శక్తి రెట్టింపు స్థాయిలో పెరిగినట్టు అధ్యయనవేత్తలు గుర్తించారు. తొలి డోసు ఇచ్చిన తరువాత 22 ల నుంచి మూడు నెలల వరకు వ్యాక్సిన్ సమర్థత 76 శాతం ఉన్నట్టు ఈ అధ్యయనం గుర్తించింది. -
చరిత్ర సృష్టించిన రష్మీ సామంత్
లండన్ : భారత్‌కు చెందిన రష్మీ సామంత్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జరిగిన విద్యార్థి ఎన్నికల్లో విజయం సాధించిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించారు. లినారె కాలేజ్‌లో ఎమ్మెస్సీ చదువుతున్న రష్మీ మొత్తం 3,708 ఓట్లకుగానూ, 1,966 ఓట్లు సాధించారు. 2021–22 సంవత్సరానికి ఆమె విద్యార్థి యూనియన్ అధ్యక్షురాలిగా పని చేయనున్నారు. సిలబస్ డీకాలనైజేషన్, డీకార్బొనైజింగ్ అనే రెండు ప్రధానాంశాలను ఆమె తన మేనిఫెస్టోలో చేర్చి విద్యార్థుల ఆదరణ చూరగొన్నారు. బేమ్ (బ్లాక్, ఏసియన్, మైనారిటీ, ఎత్నిక్) వర్గానికి చెందిన ఆమె బలహీన వర్గాలకు చెందిన వారి సమస్యలను అర్థం చేసుకున్నట్లుగా విజన్ స్టేట్మెంట్లో పేర్కొన్నారు. కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులకు అవసరమైన మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేస్తానని కూడా తన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. ఉపాధ్యక్షురాలిగా దేవికా అనే మరో బారతీయురాలు ఎన్నికయ్యారు. -
జూన్ కల్లా మరో వ్యాక్సిన్
న్యూఢిల్లీ: కోవిడ్–19ను నిలువరించే కోవోవ్యాక్స్ అనే మరో టీకాను వచ్చే జూన్‌కల్లా అందుబాటులోకి తెస్తామని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)ప్రకటించింది. ట్రయల్స్ ప్రారంభించేందుకు అనుమతులు కోరుతూ ఇప్పటికే దరఖాస్తు చేశామని ఎస్ఐఐ సీఈవో అధర్ పూనావాలా శనివారం ట్విట్టర్లో తెలిపారు. నోవావ్యాక్స్‌తో కలిసి అభివృద్ధి చేస్తున్న ఈ టీకా పనితీరు అద్భుతంగా ఉందన్నారు. 2021 జూన్ కల్లా ఈ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ– ఆస్ట్రా జెనెకా ఉమ్మడిగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ టీకాను ఎస్ఐఐ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. దేశంలో ప్రారంభమైన ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కోవిషీల్డ్‌తోపాటు కోవాగ్జిన్ టీకాలను ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం కేంద్రం 1.1 కోట్ల డోసుల కోవిషీల్డ్ టీకాను ఎస్ఐఐ నుంచి కొనుగోలు చేసింది. ఏప్రిల్ నాటికి నాలుగైదు కోట్ల నోవావ్యాక్స్ టీకా డోసులను ఉత్పత్తి చేస్తామని ఇటీవలే పూనావాలా ప్రకటించారు. 35 లక్షల మందికి కోవిడ్ టీకా ఆరోగ్య సిబ్బంది కోసం ప్రారంభించిన దేశవ్యాప్త కోవిడ్–19 వ్యాక్సినేషన్లో ఇప్పటి వరకు 35 లక్షల మందికి టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 5.70 లక్షల మందికి టీకా వేసినట్లు తెలిపింది. వీరిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 4,63,793 మంది, రాజస్తాన్‌లో 3,24,973 మంది, కర్ణాటకలో 3,07,891 మంది, మహారాష్ట్రలో 2,61,320 మంది లబ్ధిదారులు ఉన్నారంది. ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ కోసం 63,687 సెషన్లు నిర్వహించినట్లు వెల్లడించింది. దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసులు 1.7 లక్షలకు తగ్గిపోయాయని ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం పాజిటివ్ కేసుల్లో యాక్టివ్ కేసులు 1.58% మాత్రమేనని వెల్లడించింది. -
6 కోట్ల డోసుల టీకా కొనుగోలుకు కేంద్రం ఉత్తర్వులు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కోవిడ్ వ్యాక్సినేషన్ దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్యవసర వినియోగానికి అనుమతులిచ్చిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాల 6 కోట్ల డోసుల కొనుగోలుకు కేంద్రం సోమవారం ఆర్డర్ ఇచ్చింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) తయారు చేస్తున్న ఆక్స్ఫర్డ్ టీకా కోవిషీల్డ్‌ను మొదటి విడతలో 1.1 కోట్ల డోసులు, రెండో విడతలో ఏప్రిల్ కల్లా మరో 4.5 కోట్ల డోసులు కొనుగోలు చేస్తుంది. అదేవిధంగా, భారత్ బయోటెక్ టీకా కోవాగ్జిన్‌ను రూ.162 కోట్ల విలువైన 55 లక్షల డోసులను కొనుగోలు చేస్తోంది. ఇందుకు గాను మొత్తం రూ.1,300 కోట్లు వెచ్చిస్తోంది. తయారీ కేంద్రాల నుంచి టీకా డోసుల సరఫరా మంగళవారం ఉదయం నుంచి ప్రారంభం కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర ఆరోగ్య శాఖ తరఫున ప్రభుత్వ రంగ హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ నుంచి అడిషనల్ డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ పేరిట ఈ కొనుగోలు ఆర్డర్ జారీ అయింది. టీకా ఒక్కో డోసు ఖరీదు రూ.200 కాగా, జీఎస్టీతో రూ.10 కలుపుకుని డోసు ఖరీదు మొత్తం రూ.210 అని ఆ అందులో పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం నుంచి దేశవ్యాప్తంగా గుర్తించిన 60 పాయింట్లకు టీకా డోసులు సరఫరా అవుతాయి. అక్కడి నుంచి వివిధ పంపిణీ కేంద్రాలకు దానిని చేరవేస్తారు. ఢిల్లీలోని తహిర్‌పూర్‌లో ఉన్న రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సెంట్రల్ స్టోరేజీ పాయింట్‌కు 2,54,500 డోసుల కోవిషీల్డ్ టీకా చేరనుందని అధికారులు తెలిపారు. పుణేలోని మంజరి వద్దనున్న సీరం ఇన్స్టిట్యూట్ కేంద్రం నుంచి వ్యాక్సిన్ తీసుకెళ్లే ట్రక్కులకు రాష్ట్ర సరిహద్దుల వరకు, విమానాశ్రయాల వరకు మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసు భద్రత కల్పిస్తోంది. ఇమ్యునైజేషన్ ప్రక్రియలో భాగంగా ఈ టీకాను వ్యక్తులకు 28 రోజుల వ్యవధిలో రెండు డోసులుగా ఇస్తారు. స్వచ్ఛందంగా వేయించుకోండి వ్యాక్సిన్‌ను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వేయించు కోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తన 3.5 లక్షల మంది సభ్యులకు పిలుపునిచ్చింది. సంపూర్ణ శాస్త్రీయ విశ్లేషణ, నిపుణుల బృందం నివేదికల పరిశీలన, ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్‌వోలతో చర్చల అనంతరం ప్రభుత్వం చేపట్టే కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నిర్ణయించినట్లు తెలిపింది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను దేశీయ వాతావరణ పరిస్థితుల్లో నిల్వ ఉంచడం, వినియోగించడం సులువని వివరించింది. -
డయాలసిస్ పేషెంట్లకు ఆక్స్ఫర్డ్ టీకా
లండన్: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకా కలిసి తయారు చేసిన కోవిడ్–19 టీకా వ్యాక్సినేషన్ ప్రపంచంలోనే ప్రప్రథమంగా సోమవారం యూకేలో మొదలైంది. డయాలసిస్ పేషెంట్లకు ముందుగా ఈ టీకాను ఇస్తున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్లో డయాలసిస్ రోగి బ్రియాన్ పింకెర్(82)కు మొదటగా టీకా వేశారు. టీకా తయారీలో కీలక పాత్ర పోషించిన ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ గ్రూప్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆండ్రూ పొలార్డ్ కూడా మొదటగా టీకా తీసుకున్న వారిలో ఉన్నారు. ‘ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ తయారీ బ్రిటిష్ సైన్స్ సాధించిన ఘన విజయం. ఈ విజయంలో పాలుపంచుకున్న అందరికీ ధన్యవాదాలు’అని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. పరిశీలన నిమిత్తం ఆక్స్ఫర్డ్ టీకాను కొద్ది డోసుల్లో ముందుగా పంపిణీ చేస్తారు. వారం తర్వాత భారీ మొత్తంలో దేశవ్యాప్తంగా సరఫరా చేయనున్నారు. ఇందుకోసం 700 వ్యాక్సినేషన్ కేంద్రాలను తెరుస్తారు. జాతీయ ఆరోగ్య సేవల సిబ్బందికి కరోనా కొత్త వేరియంట్‌తో ముప్పు పొంచి ఉందని ఆరోగ్య మంత్రి మ్యాట్ హాంకాక్ తెలిపారు. మాస్క్ ధరించడం, పరిశుభ్రత పాటించడం వంటివి తప్పనిసరిగా పాటించాలని ప్రజలను కోరారు. యూకే ప్రభుత్వం ఇప్పటికే ఫైజర్/బయోఎన్‌టెక్ టీకాకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఫైజర్ టీకా మొదటి డోసును 10 లక్షల మంది ఆరోగ్య సేవల సిబ్బందికి అందజేశారు. రెండో డోసు కూడా త్వరలోనే ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫైజర్ టీకాతో పోలిస్తే ఆక్స్ఫర్డ్ టీకా తరలింపు, నిల్వ చాలా తేలిక. ఫైజర్ టీకాలను –70 డిగ్రీల వద్ద నిల్వ ఉంచాల్సి ఉంటుంది. ఆక్స్ఫర్డ్ టీకాను కోవిషీల్డ్ పేరుతో భారత్‌లోని సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకాల అత్యవసర వినియోగానికి భారత ప్రభుత్వం ఇటీవలే అనుమతి మంజూరు చేసింది. కాగా, కరోనా కొత్త వేరియంట్ యూకేలో శరవేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. వరుసగా ఆరు రోజులుగా 50వేలకు పైనే కేసులు నమోదవుతున్నాయి. స్కాట్లాండ్లో లాక్డౌన్ ఆంక్షలు లండన్: కరోనా వైరస్ కొత్త వేరియంట్ బాధితులు, మృతుల సంఖ్య పెరిగిపోతుండటంతో స్కాట్లాండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ నెలాఖరు వరకు పూర్తి స్థాయి లాక్డౌన్ ప్రకటించింది. అత్యవసరాలకు తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని స్కాట్లాండ్ ఫస్ట్‌మినిస్టర్ నికోలా స్టర్జియన్ ప్రజలను కోరారు. బ్రిటన్ ప్రధాని జాన్సన్ బ్రిటన్‌లో మరిన్ని ఆంక్షలు విధిస్తామంటూ ప్రకటించిన నేపథ్యంలో స్కాటిష్ పార్లమెంటు సోమవారం అత్యవసర సమావేశం జరిపి లాక్డౌన్ నిర్ణయం తీసుకుంది. యూకేలో మరిన్ని ఆంక్షలు దేశంలో మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తామని బ్రిటన్ ప్రధాని జాన్సన్ ప్రకటించారు. దేశవ్యాప్త పూర్తిస్థాయి లాక్డౌన్ విధించాలంటూ యూకే ప్రతిపక్ష లేబర్ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్న నేపథ్యంలో జాన్సన్ సోమవారం ఈ ప్రకటన చేశారు. యూకేలో చాలా ప్రాంతాలు ఇప్పటికే టయర్–4 ఆంక్షల కింద ఉన్నాయి. వైరస్ కొత్త వేరియంట్ బయటపడిన తర్వాత 28 రోజుల్లో యూకేలో 454 మంది కోవిడ్‌తో చనిపోయారు. ఇలా ఉండగా, దక్షిణాఫ్రికాలో బయటపడిన కరోనా వైరస్.. యూకే వేరియంట్ కంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. -
టీకాకు అటు..ఇటు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరులో నిర్ణయాత్మక ముందడుగు పడింది. కోవిడ్–19పై చేస్తున్న యుద్ధంలో భారతీయులకు సునిశిత ఆయుధం లభించింది. దేశంలో కరోనా టీకా అత్యవసర, నియంత్రిత వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) ఆదివారం ఆమోదం తెలిపింది. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ భాగస్వామ్యంతో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన స్వదేశీ టీకా ‘కోవాగ్జిన్’, బ్రిటన్‌కి చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ–ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్ ‘కోవిషీల్డ్’లకు షరతులతో డీసీజీఐ అనుమతించింది. ఈ రెండు టీకాలకు అనుమతివ్వాలని జాతీయ ఔషధ ప్రామాణికాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ)కు చెందిన నిపుణుల కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా డీసీజీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమానికి తొలి అడుగు పడినట్లయింది. అలాగే, జైడస్ క్యాడిలా అభివృద్ధి చేస్తున్న టీకా ఫేజ్–3 క్లినికల్ ట్రయల్స్‌కు కూడా డీసీజీఐ అనుమతించింది. ఈ టీకా అభివృద్ధి కోసం జైడస్ క్యాడిలాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు కేంద్ర బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి రేణు స్వరూప్ వెల్లడించారు. కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలకు అనుమతి లభించడాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వాగతించారు. కరోనా వైరస్‌పై భారత్ చేస్తున్న పోరాటంలో ఇది నిర్ణయాత్మక మేలి మలుపు అని అభివర్ణించారు. ‘భారత్ ఆరోగ్యకర, కోవిడ్ రహిత దేశంగా మారే ప్రయాణం దీంతో మరింత వేగవంతం కానుంది. కంగ్రాచ్యులేషన్స్ ఇండియా. టీకా కోసం అహర్నిశలు కృషిచేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు’అని ప్రధాని ట్వీట్ చేశారు. భారత్‌లో కరోనా టీకాల అత్యవసర వినియోగానికి అనుమతి లభించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హర్షం వ్యక్తం చేసింది. మరోవైపు, ఈ టీకాలను ఆగమేఘాలపై అభివృద్ధి చేసిన నేపథ్యంలో.. వాటి సమర్ధత, భద్రతలపై పలువురు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. సంపూర్ణ అధ్యయనం తరువాతే అనుమతి.. ఆయా సంస్థలు ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా విశ్లేíషించిన అనంతరం, నిపుణుల సిఫారసుల మేరకు కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలకు అత్యవసర పరిస్థితుల్లో నియంత్రిత వినియోగానికి అనుమతినివ్వాలని నిర్ణయించామని డీసీజీఐ వీజీ సోమానీతెలిపారు. ఈ రెండు టీకాలను రెండు డోసుల్లో ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వీటిని 2 నుంచి 8 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయాల్సి ఉంటుందని వివరించారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ 70.42% సామర్థ్యంతో పని చేస్తోందని తెలిపారు. 23,745 మంది వలంటీర్లపై చేసిన ‘కోవిషీల్డ్’ప్రయోగ ఫలితాల సమగ్ర వివరాలను సీరమ్ ఇన్స్టిట్యూట్ తమకు అందించిందన్నారు. కోవాగ్జిన్‌ను భారత్ బయోటెక్ అత్యంత సురక్షిత వీరోసెల్ ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేసిందని తెలిపారు. ఫేజ్ 1, 2 క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయని, ఎలాంటి దుష్ప్రభావాలు కలగలేదని సోమానీ వెల్లడించారు. ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్‌ను దేశవ్యాప్తంగా 22,500 మంది వలంటీర్లపై నిర్వహించారని, ఫలితాలు సానుకూలంగా వచ్చాయన్నారు. కోవాగ్జిన్ ప్రత్యామ్నాయమే! భారత్ బయోటెక్ చేసినకోవాగ్జిన్ను ప్రస్తుతానికి ప్రత్యామ్నాయమేనని ఎయిమ్స్ డైరెక్టర్, జాతీయ టాస్క్‌ఫోర్స్ బృందం సభ్యుడు డాక్టర్ రణ్‌దీప్ గులేరియా చెప్పారు. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ తొలిదశలో ఆక్స్ఫర్డ్– ఆస్ట్రాజెనెకా సాయంతో సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్ టీకానే వాడుతామన్నారు. ‘వీటికి అనుమతులు లభించడం కొత్త ఏడాది ప్రారంభంలో చోటుచేసుకున్న శుభ పరిణామం. ఈ రెండు టీకాలు చౌకైనవి. భద్రపరచడం, పంపిణీ సులువు. దేశీయంగా తయారైన వీటితో త్వరలోనే వ్యాక్సినేషన్ ప్రారంభించవచ్చు. కోవిషీల్డ్ పనితీరు ఎంతమేర పనిచేస్తుందనేది ఇంకా పూర్తి స్థాయిలో రుజువు కానందున, సైడ్ ఎఫెక్ట్స్ కనిపించిన అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సినేషన్‌కు కోవాగ్జిన్‌ను ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు’అని ఆయన అన్నారు. యూకే కరోనా కొత్త వేరియంట్ కేసులు దేశంలో అదుపుతప్పినా, లేదా మూడో దశ హ్యూమన్ ట్రయల్స్ పూర్తయినా.. కోవాగ్జిన్‌ను పూర్తిస్థాయిలో వాడే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. సీరం సంస్థ 5 కోట్ల డోసులు సిద్ధం చేసినందున, తొలి విడత వ్యాక్సినేషన్లో 3 కోట్ల మందికి కోవిషీల్డ్ వాడుతామన్నారు. సమర్థతపై అనుమానాలు.. కరోనా విజృంభణను అడ్డుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేసిన టీకాల సామర్ధ్యం, భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోవిషీల్డ్ సమర్ధత 70.42%గా డీసీజీఐ ప్రకటించింది. కానీ కోవాగ్జిన్ సమర్ధతపై స్పష్టమైన వివరణ రాలేదు. అలాగే, ఫేజ్–3 క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు పూర్తిగా వెలువడకముందే, టీకా సమర్ధతపై, సురక్షితమేనా అన్న విషయంపై పూర్తిస్థాయి సమాచారం అందకముందే కోవాగ్జిన్‌కు అనుమతినివ్వడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా టీకా వినియోగం ప్రారంభమైన తరువాత దుష్ప్రభావాలు వెల్లడైతే, పరిస్థితి అదుపుతప్పే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు, యూకేలో గుర్తించిన కరోనా కొత్త వైరస్ స్ట్రెయిన్‌పై ఈ టీకాలు ఎంతవరకు సమర్ధంగా పనిచేస్తాయనే దానికి శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తు చేస్తున్నారు. కోవాగ్జిన్ ఫేజ్ –3 క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైన సామర్ధ్యం, భద్రతలకు సంబంధించిన డేటా ఇంకా తమ వద్దకు రాలేదని ఆదివారం ఐసీఎంఆర్ కూడా స్పష్టం చేసింది. అయితే, కోవాగ్జిన్ అత్యున్నత సామర్థ్య, భద్రత ప్రమాణాలతో రూపొందుతున్న సంకేతాలున్నాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ వెల్లడించారు. ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ నివేదిక మరి కొన్ని వారాల్లో అందనుందన్నారు. కోవాగ్జిన్ ఫేజ్ 1, 2 ట్రయల్స్ ఫలితాలు సామర్ధ్యం, భద్రత పరంగా సానుకూలంగా ఉన్నాయన్నారు. ట్రయల్స్‌లో కోవాగ్జిన్ సమర్థతను నిరూపించుకుందని భారత్ బయోటెక్ ప్రకటించింది. కోవాగ్జిన్‌కు అనుమతి ఎలా ఇచ్చారు: కాంగ్రెస్ కోవాగ్జిన్‌కు డీసీజీఐ అనుమతులు ఇవ్వడంపై కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ టీకా మూడో దశ ప్రయోగాలు ముగియకుండానే అనుమతులివ్వడం ప్రమాదకరమని కాంగ్రెస్ నేతలు శశిథరూర్, ఆనంద్ శర్మ, జైరామ్ రమేశ్ హెచ్చరించారు. అత్యంత కీలక అంశాన్ని రాజకీయం చేయడం అవమానకరమంటూ కేంద్ర ఆరోగ్య మంత్రి ఎదురుదాడికి దిగారు. ఇప్పటివరకు ఏ దేశం కూడా వ్యాక్సిన్ సామర్థ్యం ఎంతో తెలుసుకోకుండా అనుమతులు ఇవ్వలేదని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ అన్నారు. తొలి విడతలో ఫ్రంట్‌లైన్ వర్కర్లకి టీకాలు ఇస్తున్నారని, వారి ఆరోగ్యానికి ఎవరు భరోసా ఇస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా కోవాగ్జిన్‌కు అనుమతులివ్వడాన్ని తప్పు పట్టారు. అంతవరకు కోవిషీల్డ్‌ను వాడుకోవాలని సూచించారు. కోవాగ్జిన్ టీకా అంశంలో నిబంధనలు ఎందుకు మార్చాల్సి వచ్చిందని మరో నేత జైరాం రమేష్ ప్రశ్నించారు. అయితే కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా స్వదేశీ టీకాకి అనుమతులివ్వడాన్ని స్వాగతించారు. శాస్త్రవేత్తల కృషిని ఆయన కొనియాడారు. కీలక అంశాల్లో రాజకీయాలా ? కాంగ్రెస్ నేతల ప్రశ్నలకి కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ట్విట్టర్ వేదికగా బదులిచ్చారు. ఇలాంటి కీలక అంశాల్ని రాజకీయం చేయడం అత్యంత అవమానకరమని అన్నారు. ‘కళ్లు తెరిచి చూడండి ఇలా మాట్లాడి మీకు మీరే అభాసు పాలవుతున్నార’ని మంత్రి అన్నారు. బీజేపీ ఎదురు దాడి కోవాగ్జిన్ అనుమతులపై కాంగ్రెస్ నేతలు కేంద్రాన్ని నిలదీయడంతో బీజేపీ ఎదురు దాడికి దిగింది. కాంగ్రెస్ ప్రతీది రాజకీయం చేస్తోందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ విమర్శించారు. ఒకప్పుడు సైనికుల త్యాగాలను ప్రశ్నించారని, ఇప్పుడు స్వదేశీ టీకాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారంటూ మండిపడ్డారు. భారత్ సాధించిన ఘనతలు ఎప్పటికీ కాంగ్రెస్‌కి గర్వకారణంగా అనిపించవని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కరోనా వైరస్‌పై భారత్ చేస్తున్న పోరాటంలో ఇది నిర్ణయాత్మక మేలి మలుపు. ‘భారత్ ఆరోగ్యకర, కోవిడ్ రహిత దేశంగా మారే ప్రయాణం దీంతో మరింత వేగవంతం కానుంది. కంగ్రాచ్యులేషన్స్ ఇండియా. అహర్నిశలు కృషిచేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు. – ప్రధాని మోదీ భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ టీకా యూకేలో గుర్తించిన వేరియంట్ సహా కొత్త కరోనా వైరస్ వేరియంట్లపై సమర్ధవంతంగా పనిచేసే అవకాశాలున్నాయి. – హర్షవర్ధన్ , ఆరోగ్య శాఖ మంత్రి మూడో దశ ప్రయోగాలు ముగియకుండానే వ్యాక్సిన్‌కు ఎలా అనుమతినిచ్చారు? ప్రొటోకాల్ నిబంధనలు పాటించకుండా, మూడో దశ ప్రయోగాలపై ఫలితాలు తేలకుండా అనుమతులు ఇవ్వడం ప్రమాదకరం. – కాంగ్రెస్ నేతలు శశిథరూర్, ఆనంద్ శర్మ, జైరామ్ రమేశ్ భారత్ బయోటెక్ తయారు చేసిన కోవిడ్ టీకా కోవాగ్జిన్ ప్రస్తుతానికి ప్రత్యామ్నాయమే. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ తొలిదశలో ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా సాయంతో సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్ టీకానే వాడతాం. కోవిషీల్డ్ పనితీరు ఎంతమేర పనిచేస్తుందనేది ఇంకా పూర్తి స్థాయిలో రుజువు కానందున సైడ్ ఎఫెక్ట్స్ కనిపించే అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సినేషన్‌కు కోవాగ్జిన్‌ను ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. – డాక్టర్ రణ్‌దీప్ గులేరియా, ఎయిమ్స్ డైరెక్టర్, జాతీయ టాస్క్‌ఫోర్స్ బృందం సభ్యుడు భద్రత పరంగా ఏ చిన్న సమస్య ఉన్నా అనుమతించేవాళ్లం కాదు. ఈ టీకాలు 110% సురక్షితం. స్వల్ప జ్వరం, ఒళ్లు నొప్పులు, అలర్జీ కనిపించవచ్చు. ఏ వ్యాక్సిన్‌కైనా అది సాధారణమే. – వి.జి. సోమానీ, డీసీజీఐ భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ టీకా యూకేలో గుర్తించిన వేరియంట్ సహా కొత్త కరోనా వైరస్ వేరియంట్లపై సమర్ధవంతంగా పనిచేసే అవకాశాలున్నాయి. – హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి -
కోవిషీల్డ్ వ్యాక్సిన్ వచ్చేసింది
న్యూఢిల్లీ : కొత్త ఏడాది వస్తూ వస్తూ శుభవార్తని మోసుకొచ్చింది. కరోనాని కట్టడి చేయడానికి మనకూ ఓ వ్యాక్సిన్ వచ్చేసింది. కోవిడ్–19పై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ (సీడీఎస్సీఓ) ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ–ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కోవిషీల్డ్ అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేయడానికి శుక్రవారం సిఫారసు చేసింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) దీనికి ఇంకా తుది ఆమోదం ఇవ్వాల్సి ఉంది. నేడు దేశవ్యాప్తంగా టీకా డ్రై రన్‌కి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో)కి చెందిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (సీఎస్‌వో) వ్యాక్సిన్ వినియోగానికి అనుమతులివ్వడానికి సిఫారసు చేసినట్టుగా అధికార వర్గాలు వెల్లడించాయి. 18 ఏళ్లు దాటిన వారికి 4– 6 వారాల మధ్యలో రెండు డోసుల్లో వ్యాక్సిన్ ఇచ్చేలా సూచించినట్లు అధికారులు చెబుతున్నారు. ఆరో తేదీ నుంచి వ్యాక్సినేషన్ ..? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా కంపెనీ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను పుణేకి చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోంది. శుక్రవారం జరిగిన నిపుణుల కమిటీ సమావేశంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు, కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న భారత్ బయోటెక్ ప్రతినిధులూ పాల్గొన్నారు. తమ వ్యాక్సిన్ల సంపూర్ణ సమాచారాన్ని అందించారు. అన్నింటినీ సమీక్షించిన అనంతరం నిపుణుల కమిటీ మాత్రం తొలుత ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ వినియోగానికే సిఫారసు చేసింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో దేశమైన భారత్‌లో అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమానికి మార్గం సుగమం అయింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన కేంద్ర ప్రభుత్వం జనవరి 6 నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ టీకాకు బ్రిటన్, అర్జెంటీనా తర్వాత అనుమతులు ఇచ్చిన మూడో దేశంగా భారత్ నిలుస్తోంది. రష్యా, బ్రిటన్, అమెరికా, కెనడా, చైనా, యూరోపియన్ యూనియన్, మధ్యప్రాచ్య దేశాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్ మొదలైంది. ఫైజర్ వ్యాక్సిన్‌కి డబ్ల్యూహెచ్‌వో గ్రీన్ సిగ్నల్ జెనీవా: కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మొదటి సారిగా ఫైజర్–బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్‌తో పాటు డజనుకు పైగా దేశాలు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాయి. అయితే డబ్ల్యూహెచ్ఒ అనుమతులు ఇవ్వడంతో నిరుపేద దేశాలకు కూడా ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. సాధారణంగా ఏ దేశానికి ఆ దేశమే వ్యాక్సిన్ వినియోగంపై నిర్ణయం తీసుకుంటాయి. కానీ వ్యవస్థలు బలహీనంగా ఉన్న దేశాలు మాత్రం డబ్ల్యూహెచ్‌వో అనుమతించాక మాత్రమే టీకా పంపిణీ చేపడతాయి. డబ్ల్యూహెచ్‌వో గురువారం ఫైజర్ అత్యవసర వినియోగానికి అనుమతినిస్తూ అన్ని దేశాలు వారి పరిధిలో వ్యాక్సిన్ వినియోగానికి అనుమతులివ్వడం, టీకా డోసుల దిగుమతి ప్రక్రియ వేగవంతం చేయాలని చెప్పింది. ఫైజర్ టీకా నాణ్యత, భద్రత అంశంలో ప్రమాణాలకు లోబడి ఉందని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. ఫైజర్ వ్యాక్సిన్‌ను మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సి ఉండడంతో అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాలు ఈ వ్యాక్సిన్‌ను ఎంతవరకు వినియోగిస్తారన్నది సందేహమే. ఈ విషయాన్ని అంగీకరించిన డబ్ల్యూహెచ్ఒ ఫైజర్ వ్యాక్సిన్ వినియోగంలో ఎదురయ్యే సవాళ్లను ఇతర దేశాలు ఎంతవరకు ఎదుర్కోగలవో చెప్పాలని పేర్కొంది. నేడు అన్ని రాష్ట్రాల్లో డ్రైరన్.. కోవిడ్ వ్యాక్సినేషన్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ 2న అన్ని రాష్ట్రాల్లో డ్రైరన్ చేపడుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. చెక్‌లిస్టులు, ఎస్ఓపీలను పూర్తిగా పరిశీలించిన అనంతరమే వ్యాక్సినేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. 20 వేల కొత్త కరోనా కేసులు.. దేశంలో గత 24 గంటల్లో 20,035 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,02,86,709కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 256 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,48,994 కు చేరుకుందని తెలిపింది. యూకేకు చెందిన కొత్త కరోనా స్ట్రెయిన్ మరో నలుగురికి సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో కొత్త స్ట్రెయిన్ కలిగిన మొత్తం వ్యక్తుల సంఖ్య 29కి చేరుకుంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 98,83,461కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 96.08 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 2,54,254గా ఉంది. ► ఆరు నుంచి ఎనిమిది నెలల కాలంలో 30 కోట్ల మందికి టీకా వేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ► మొదటి టీకా డోసు ఇచ్చిన నాలుగు నుంచి పన్నెండు వారాల్లోగా రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుంది. ► ధర విషయంలోనూ ఈ వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో ఉంది. ఒక్కో డోసు ధర 3 అమెరికా డాలర్లుగా నిర్ణయిం చారు. రెండు డోసులకి 6 డాలర్లు అంటే రూ. 440 అవుతుంది. అయితే ప్రైవేటు మార్కెట్లో రెండు డోసులకి రూ.700–800 వరకు వెచ్చించాల్సి ఉంటుందని సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈఓ అదార్ పూనావాలా చెప్పారు. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఇప్పటికే 5 కోట్ల టీకా డోసుల్ని సిద్ధంగా ఉంచింది. వాటినన్నింటినీ భారత్‌లోనే వినియోగించనున్నారు. మార్చి నాటికల్లా 10 కోట్ల డోసుల్ని ఉత్పత్తి చేయనుంది. ► ఈ నెల 6 నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్రం భావిస్తున్న నేపథ్యంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ శనివారం నుంచే టీకా డోసుల పంపిణీకి సన్నాహాలు చేస్తోంది. ► టీకా సామర్థ్యం అంశంలో ఫైజర్ మోడెర్నా కంటే కోవిషీల్డ్ వెనుకబడి ఉంది. ఫైజర్ టీకా 95% సామర్థ్యంతో పని చేస్తే ఈ వ్యాక్సిన్ 70.4% సామర్థ్యంతో పని చేస్తోంది. -
ఆక్స్ఫర్డ్ టీకాకు బ్రిటన్ ఓకే
లండన్/న్యూఢిల్లీ/బీజింగ్: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా అభివృద్ధిపరిచిన కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి బ్రిటన్ అనుమతిచ్చింది. బయోటెక్ ల్యాబ్స్ ఫైజర్ టీకా తరువాత యూకె.. ఓకే చెప్పిన రెండో కరోనా టీకాగా ఆస్ట్రాజెనెకా కోవిడ్ వ్యాక్సిన్ మరో వారం రోజుల్లో బ్రిటన్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ వ్యాక్సిన్‌ని బ్రిటిష్ రెగ్యులేటరీ మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ(ఎంహెచ్ఆర్ఏ) పరిశీలించింది. ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదీ, శక్తివంతమైనదని ఎంహెచ్ఆర్ఏ నిర్ధారించింది.సాధ్యమైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. జనవరి 4 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్టు బ్రిటన్ ఆరోగ్య మంత్రి మాట్ హాన్కాక్ తెలిపారు. భారత్‌లో ఇలా.. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి బ్రిటన్ ఓకే చెప్పడంతో భారత్‌లో ౖ టీకా వాడకానికి అనుమతికోసం సీరం కంపెనీ ఎదురుచూస్తోంది. ఆస్ట్రాజెనెకా టీకాను సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. పుణేకి చెందిన సీరం ఇన్స్టిట్యూట్ భారత్‌లో ఈ టీకా అత్యవసర వినియోగం కోసం డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. ఈ విజ్ఞప్తిని ప్రభుత్వం నియమించిన నిపుణుల బృందం పరిగణనలోనికి తీసుకుంది. వీరు అందించిన వ్యాక్సిన్ సంబంధిత సమాచారాన్ని ప్యానల్ పరిశీలిస్తోంది. శుక్రవారం నిపుణుల బృందం సమావేశం జరగనుంది. -
మరి కొద్ది రోజుల్లోనే వ్యాక్సిన్ : సీరం
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటన్‌లో ప్రకంపనలు రేపుతున్న మరో ప్రమాదకరమైన కరోనా వైరస్ ఉనికి తెలంగాణాలో కూడా ఉందన్న తాజా అంచనాల మధ్య దేశీయ అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు సీరం కీలక విషయాన్ని ప్రకటించింది. భారతదేశంలో సీరం ఉత్సత్తి చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్‌కు మరికొన్నిరోజుల్లో అత్యవసర ఉపయోగానికి ఆమోదం లభించనుంది. ఈ మేరకు సీరం సీఈఓ అదార్ పూనావల్లా వ్యాఖ్యలను ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది. సీరం ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో అక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ ప్రయోగాలకు సంబంధించిన సీరం సమర్పించిన లేటెస్ట్ డేలా సంతృప్తికరంగా ఉన్నందున త్వరలోనే వ్యాక్సిన్ అత్యసర వినియోగానికి ప్రభుత్వ అనుమతి లభించనుందని ఆశిస్తున్నట్టు పూనావల్లా తెలిపారు. ఇప్పటికే 40 మిలియన్ల నుండి 50 మిలియన్ల మోతాదుల వ్యాక్సిన్ సిద్దంగా ఉందన్నారు. అంతేకాదు డేటా విశ్లేషణ పూర్తయిన తర్వాత, టీకాకు అనుమతినిచ్చేందుకు యూకే మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్‌ఆర్‌ఎ) ఆమోదం కోసం భారత ప్రభుత్వం వేచి ఉండక పోవచ్చని ఆయన పేర్కొన్నారని రాయిటర్స్ తెలిపింది. -
ఆక్స్ఫర్డ్ టీకాకే తొలి ఛాన్స్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జనవరిలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు ఒక పక్క ముమ్మరం కాగా, అత్యవసర వినియోగానికి ఆక్స్ఫర్డ్ కోవిడ్–19 టీకాకు వచ్చే వారంలో ప్రభుత్వం అనుమతి మంజూరు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టీకా డోసులను దేశీయంగా పుణేకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా కలిసి రూపొందించిన కోవిషీల్డ్ టీకా వినియోగానికి యూకేలో అనుమతులు లభించిన వెంటనే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీవో) నిపుణుల సమావేశం కానుంది. భారత్‌తోపాటు ఇతర దేశాల్లో ఈ టీకా క్లినికల్స్ ట్రయల్స్‌కు సంబంధించిన డేటాను పరిశీలించి భద్రత, వైరస్ నిరోధకతపై చర్చించి, దీనిని అత్యవసర వినియోగానికి అనుమతించే విషయం పరిశీలించనుందని అధికారులు తెలిపారు. భారత్ బయోటెక్, ఫైజర్ సంస్థలు కూడా తమ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతించాలని కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నాయి. అయితే, భారత్ బయోటెక్ ‘కోవాగ్జిన్’ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నందున అనుమతించేందుకు మరికొంత సమయం పట్టనుంది. ఫైజర్ సంస్థ తన టీకా పనితీరుపై నివేదిక అందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆక్స్ఫర్డ్ ‘కోవిషీల్డ్’కే భారత్‌లో అత్యవసర వినియోగానికి తొలి అనుమతి లభించనుందని అధికారులు అంటున్నారు. వివిధ దేశాలు, సంస్థలు తయారు చేస్తున్న టీకాలు కోవిడ్ వైరస్ కొత్త వేరియంట్‌పైనా పనిచేస్తాయని ఇటీవల యూకే స్పష్టం చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఇప్పటికే 4 కోట్ల డోసుల టీకాను తయారు చేసి, సిద్ధంగా ఉంచింది. తగ్గుతున్న యాక్టివ్ కేసులు దేశంలో ప్రస్తుతం రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల, పెరుగుతున్న రికవరీల కారణంగా యాక్టివ్ కేసులు క్రమేపీ తగ్గుముఖం పడుతున్నాయని కేంద్రం తెలిపింది. దేశంలో యాక్టివ్ కేసులు ప్రస్తుతం 2,81,667 ఉన్నాయని శనివారం వెల్లడించింది. మొత్తం కేసుల్లో ఇవి 2.77% మాత్రమేనని వివరించింది. ‘కోవిడ్‌తో ఇప్పటి వరకు 97,40,108 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 95.78%గా ఉంది’ అని వివరించింది. రోజువారీ కోవిడ్ బాధితుల మరణాలు 6 నెలల తర్వాత మొదటిసారి 300లోపు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 251 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1,47,343కు చేరుకుంది. అదేవిధంగా, కొత్తగా 22,273 కొత్త కేసులు వెలుగులోకి రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,01,69,118కు చేరుకుందని తెలిపింది. -
ప్రపంచం కోసం 200 కోట్ల డోసులు
ఐక్యరాజ్యసమితి: కరోనా వ్యాక్సిన్ కోసం డబ్బు వెచ్చించలేని పేద దేశాలకు సాయం చేసేందుకు అంతర్జాతీయ వ్యాక్సిన్ భాగస్వామి కోవాక్స్ ముందుకొచ్చింది. ఐక్యరాజ్యసమితి ద్వారా ఈ వ్యాక్సిన్లను ప్రపంచ దేశాలకు అందించడానికి కోవాక్స్ సిద్ధమైంది. ఇందులో 2 కోట్ల డోసుల ఆస్ట్రాజెనెకా/ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్లు కూడా ఉన్నాయి. అన్ని రకాల అనుమతులు పొందిన వ్యాక్సిన్లను 2021లో దాదాపు 92 దేశాలకు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానొమ్ ఘెబ్రియేసుస్ స్పందించారు. ప్రపంచ ఆరోగ్యంలో ఇదో మైలు రాయి అని, గొప్ప వార్త అని వ్యాఖ్యానించారు. అయితే ఇది ఇంకా ప్రారంభం కాలేదని, త్వరలోనే అవుతుందని అన్నారు. వ్యాక్సిన్ రేసుల్లో ముందున్న అన్ని సంస్థలతోనూ డోనార్ల ఆర్థిక సాయంతో చర్చలు జరిపి వ్యాక్సిన్లను సేకరించి, వాటిని ఐరాస ద్వారా ప్రపంచంలోని పేద దేశాలకు, ఆయా జనాభాను బట్టి అందించనున్నారు. -
వ్యాక్సిన్‌పై వాస్తవాలేంటి?
ఇంకొన్ని రోజుల్లో భారత్‌లో కోవిడ్ టీకాలు వచ్చేస్తున్నాయి. ఆరోగ్య సిబ్బందితో మొదలుపెట్టి వృద్ధులు.. ఆరోగ్య సమస్యలున్న వారు అన్న క్రమంలో... వరుసగా టీకాలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి! మరి గడ్డుకాలమిక తొలగిపోయినట్లేనా? ఇక అంతా మంచేనా? ఊహూ.. కానేకాదు! టీకా తీసుకున్నా మరికొంత కాలం జాగ్రత్తలు కొనసాగాల్సిందే అంటున్నారు నిపుణులు. ఈ అంశంతోపాటు టీకాలకు సంబంధించిన ఇతర సందేహాలకు సమాధానాలివిగో.. వ్యాక్సిన్లలో రకాలేమిటి? హా ఫైజర్, మోడెర్నా సంస్థలు మెసెంజర్ ఆర్ఎన్ఏతో(ప్రొటీన్ తయారీకి పనికొచ్చే డీఎన్ఏ పోగు)టీకాను అభివృద్ధి చేస్తున్నాయి. హా భారత్‌లోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ టీకాలో వాడే వైరస్లు రోగ నిరోధక కణాలు గుర్తించే యాంటిజెన్లను సిద్ధం చేస్తాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకాలు తయారు చేస్తున్న కోవిషీల్డ్‌ను చింపాంజీకి చెందిన అడినోవైరస్‌ను వాహకంగా వాడుతున్నారు. హా భారత్ బయోటెక్ (హైదరాబాద్), గమలేయా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (రష్యా) నిర్వీర్యం చేసిన వైరస్ ఆధారంగా టీకాను తయారు చేస్తున్నాయి. ఈ వైరస్లు వ్యాధిని కలిగించవు కానీ.. రోగ నిరోధక వ్యవస్థ తాలూకూ కణాలు గుర్తించేందుకు ఉపయోగపడతాయి. ఏ వ్యాక్సిన్ సామర్థ్యం ఎంత? కోవిషీల్డ్ వ్యాక్సిన్ కోవిడ్–19 లక్షణాలు కనబరిచే వారిలో 70.4 శాతం సామర్థ్యంతో పనిచేస్తుంది. తీవ్రమైన లక్షణాలతో బాధపడుతున్న వారిలో 100 శాతం పనిచేస్తుందని అంచనా. ఫైజర్ టీకా సామర్థ్యం 95 శాతం కాగా, రష్యా టీకా స్పుత్నిక్–వీ 92 శాతం సామర్థ్యాన్ని కనబరిచింది. టీకాలు ఎవరెవరికి ఇవ్వవచ్చు? పైన పేర్కొన్న టీకాలను 18 లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారికి ఇవ్వవచ్చు. ఇందుకు తగ్గట్టుగా ప్రయోగాలు జరిగాయి. ప్రస్తుతం 12–18 ఏళ్ల వారిపై ఈ టీకాలు ఎలా పనిచేస్తాయన్నది పరీక్షిస్తున్నారు. అందుబాటులో ఉన్నాయా? కోవిషీల్డ్ టీకా అత్యవసర వాడకంపై అనుమతికి సీరమ్ ఇన్స్టిట్యూట్ దరఖాస్తు చేసుకుంది. భారత్ బయోటెక్, స్పుత్నిక్–వీ మూడో దశ ప్రయోగాలను పూర్తి చేయాల్సి ఉంది. ఫైజర్ వ్యాక్సిన్ ప్రైవేట్ రంగంలో అందుబాటులోకి రావచ్చు. 18 ఏళ్ల లోపువయసున్న వారికి ఏ టీకా అందుబాటులో లేదు. వ్యాధి సోకి నయమైన వారికి టీకా అవసరమా? కోవిడ్ బారిన పడి సహజసిద్ధంగా కోలుకున్న వారికి దీర్ఘకాలంలో వ్యాధి నుంచి రక్షణ ఉంటుందా? అన్నది ఇప్పటికీ అస్పష్టం. కాలక్రమంలో శరీరంలో యాంటీబాడీలు బలహీన పడే అవకాశాలు ఎక్కువైనప్పటికీ వ్యాధి నుంచి రక్షణ తగ్గిపోతుందని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. అందుకే కోవిడ్ నుంచి బయటపడిన వారికి ఆఖరులో టీకా ఇవ్వాలని యోచిస్తున్నారు. ఒక్కో డోస్ ఎంత? ఎన్ని డోసులు? కోవిషీల్డ్ టీకా ఒక డోసుకు 0.5 మిల్లీలీటర్ ఉంటుంది. 28 రోజుల వ్యవధిలో 2 డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఫైజర్, మోడెర్నా, స్పుత్నిక్–వీ టీకాలను 21 రోజుల వ్యవధిలో 2 డోసులు ఇస్తారు. రెండు వారాల సమయంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని అంచనా. ఎంఆర్ఎన్ఏ టీకా మాత్రం తొలి డోసు తీసుకున్న 10 రోజుల్లోనే యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు తెలిసింది. రెండు డోసుల స్థానంలో ఒకటే తీసుకున్నా ఓమోస్తరు ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రెండు డోసులతో రక్షణ ఎంత కాలం? ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. కోవిషీల్డ్ టీకా తీసుకున్న వారిలో నాలుగు నెలల కంటే ఎక్కువ కాలం వ్యాధి నుంచి రక్షణ లభించింది. యాంటీబాడీలు బలహీన పడినా వ్యాధి నుంచి రక్షణ లభిస్తుందని అంచనా. బూస్టర్ టీకా అవసరం రాకపోవచ్చనే అనుకుంటున్నారు. టీకా తీసుకున్న వారిలో నొప్పి, జ్వరం వంటి కొన్ని దుష్ప్రభావాలు కనిపించే అవకాశం ఉంది. టీకా వేసుకున్నాక మామూలుగా తిరిగేయవచ్చా? ఏ వ్యాక్సిన్ అయినా 100 శాతం రక్షణ కల్పించదు. టీకా తీసుకున్న వారు మళ్లీ వ్యాధి బారిన పడకపోవచ్చుగానీ.. ఇతరులకు వైరస్‌ను అంటించే అవకాశం ఉంటుంది. అందుకే టీకా వేసుకున్న తరువాత కూడా మాస్కు ఉపయోగించడం, భౌతిక దూరాన్ని పాటించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం మరికొంత కాలం కొనసాగించాల్సి ఉంటుంది. – సాక్షి, హైదరాబాద్ -
కోవిడ్ వ్యాక్సిన్లతో సరికొత్త ప్రయోగం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు రష్యా సావరిన్ వెల్త్ ఫండ్ కనుగొన్న స్పుత్నిక్ వి కోవిడ్–19 వ్యాక్సిన్ ఇప్పటికే రష్యా మార్కెట్లోకి ప్రవేశించిన విషయం తెల్సిందే. మరో పక్క ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులతో కలసి ఆస్ట్రాజెనెకా రూపొందించిన మరో కోవిడ్–19 వ్యాక్సిన్‌ను ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు జరగుతున్నాయి. వీటిలో స్పుత్నిక్ వ్యాక్సిన్ సక్సెస్ రేటు 92 శాతం కాగా, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తొలి దశలో 70 శాతంగా తేలిన విషయం తెల్సిందే. ఈ రెండింటి ఫలితాలను బేరీజు వేసిన పరిశోధకులకు ఓ సరికొత్త ఆలోచన వచ్చింది. (మొదటి విడత టీకా వేసేది వీరికే..) స్పుత్నిక్ వి వ్యాక్సిన్తోని ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ను కలిపి ట్రయల్స్ నిర్వహిస్తే! అదే సరికొత్త ఆలోచన. రెండు వ్యాక్సిన్లు కూడా జలుబుకు కారణమవుతున్న వైరస్ల నుంచి తయారు చేసినవే అవడం ఈ ట్రయల్స్ ప్రతిపాదనకు మరో కారణం. స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌తో కలిపి ట్రయల్స్ నిర్వహించేందుకు ఆస్ట్రాజెనికా శనివారం ఆమోదం తెలిపింది. ఈ నెలాఖరులోగా ఈ ట్రయల్స్ మొదలవుతాయని, రెండు వ్యాక్సిన్లను కలపడం వల్ల మెరుగైన ఫలితాలు లభించిన పక్షంలో కొత్త వ్యాక్సిన్‌ను రష్యానే తయారు చేస్తుందని రష్యా సావరిన్ వెల్త్ ఫండ్ ప్రకటించింది. (క్రిస్మస్కు ముందే ఇండియాలో వ్యాక్సిన్!) సోవియట్ యూనియన్ కాలంలో రోదసిలోకి విజయవంతంగా ప్రయోగించిన ఉపగ్రహం పేరు స్పుత్నిక్ వి. ఈ పేరునే ఇప్పుడు రష్యా కోవిడ్ వ్యాక్సిన్‌కు పెట్టారు. స్పుత్నిక్ వి సక్సెస్ రేటు 92 శాతం ఉండడంతో రష్యా మార్కెట్లోకి వ్యాక్సిన్ విడుదలకు రష్యా ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ వ్యాక్సిన్ పట్ల పాశ్చాత్య దేశాలు ఇంతవరకు ఆసక్తి చూపకుండా నిర్లిప్తంగానే ఉన్నాయి. మరోపక్క ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ సక్సెస్ రేటు 70 శాతం ఉండడంతో వ్యాక్సిన్ ప్రభావాన్ని మరోసారి సమీక్షించాల్సిందిగా ఉన్నతాధికారులను బ్రిటన్ అధికార యంత్రాంగం ఆదేశిందింది. (వచ్చే జనవరిలోనే వ్యాక్సిన్: అక్టోబరు నాటికి..) -
ఆస్ట్రాజెనెకా సురక్షితం.. ప్రభావవంతం
వాషింగ్టన్: యూకే వ్యాప్తంగా ఫైజర్ బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తమ భాగస్వామ్యంలో అభివృద్ధి చేందుతోన్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కోవిడ్‌కు వ్యతిరేకంగా ఎంతో సమర్థవంతంగా పని చేస్తుందని తెలిపారు. డోసేజ్ ప్రకారం ఇది 62 శాతం, 70 శాతం, 90 శాతం సమర్థవంతంగా పని చేస్తున్నట్లు వెల్లడించారు. తమ ఫేస్ 3 డాటాని పలువురు ప్రసిద్ధ శాస్త్రవేత్తలు పరిశీలించారని.. మొత్తం మీద తమ వ్యాక్సిన్ 70.4శాతం సామార్థ్యం కలిగి ఉన్నట్లు సైంటిస్ట్‌ల బృందం వెల్లడించదని తెలిపారు. దాదాపు 20 వేల మందికి పైగా అధునాతన పరీక్షల పూర్తి ఫలితాలను పరిశీలించిన స్వతంత్ర శాస్త్రవేత్తల బృందం ఈ నివేదిక రూపొందించినట్లు తెలిపారు. వ్యాక్సిన్ అత్యవసర వినియోగం.. అనుమతులు జారీ చేయడం వంటి కీలక అంశాలన్ని ఈ డాటా మీదనే ఆధారపడతాయన్నారు. అంతేకాక తమ ఫేజ్ 3 డాటాను స్టడీ చేసి లాన్సెట్ ఓ నివేదక విడుదల చేసిందని.. దాని ప్రకారం ఆస్ట్రాజెనెకా కోవిడ్19-కు వ్యతిరేకంగా ఎంతో సమర్థవంతంగా పని చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ గ్రూప్ డైరెక్టర్, ట్రయల్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్ ప్రొఫెసర్ ఆండ్రూ పొలార్డ్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు మేం ఫేజ్ 3 ట్రయల్ డాటా తాత్కాలిక విశ్లేషణలను ప్రచురించాము. ఈ కొత్త వ్యాక్సిన్ మంచి సేఫ్టీ రికార్డ్, కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పని చేయగల సామార్థ్యం కలిగి ఉన్నట్లు ఈ విశ్లేషణలు వెల్లడించాయి’ అన్నారు. అయితే ఏ డోస్ సురక్షితం.. ఏ వయసుల వారి మీద ఎంత డోస్ ఎఫెక్టివ్‌గా పని చేస్తుందనే పలు ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు ఇంకా లభించలేదని లాన్సెట్ నివేదిక పేర్కొంది. ఇక గత నెల రిలీజ్ చేసిన తాత్కాలిక ట్రయల్ రిజల్ట్స్ ఆధారంగా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ సమర్థత స్థాయిలను మూడు రకాలుగా విభజించారు. మొత్తం సమర్థత స్థాయి 70 శాతంగా ఉండగా.. 62 శాతం తక్కువ సమర్థత స్థాయిగా ఉండగా.. 90 శాతం అధిక సమర్థత స్థాయిగా ఉంది. ట్రయల్స్ సమయంలో వ్యాక్సిన్ డోసుల విషయంలో పొరపాటు జరగడంతో సమర్థత స్థాయిలోల తేడా వచ్చినట్లు తెలిపారు. (చదవండి: బ్రిటన్‌లో ఫైజర్ టీకా మొదలు) ఇక లాన్సెట్ 1,367 మంది ఫలితాలను విశ్లేషించి మంగళవారం ఓ నివేదిక విడుదల చేసింది. వీరిలో సగం డోసు.. పూర్తి డోసు తీసుకున్నవారు కూడా ఉన్నారు. ఇక వీరిలో కొందరిలో వ్యాక్సిన్ కోవిడ్ బారి నుంచి 90 శాతం రక్షణ కల్పిస్తున్నట్లు వెల్లడయ్యింది. అయితే ఇంత తక్కువ మంది సమాచారంతో ఓ ముగింపుకు రావడం కష్టం అంటున్నారు సైంటిస్టులు. ఇక ఈ డాటా ప్రకారం లో/స్టాండర్డ్ డోస్ లక్షణాలు బహిర్గతం కానీ ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడంలో సమర్థవంతంగా పని చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. చివరగా ఈ ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కోవిడ్-19కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పని చేస్తుంది. దీన్ని తీసుకున్న తర్వాత ఇన్ఫెక్షన్ తీవ్రం కావడం లేదు.. ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం రావడం వంటి పరిస్థితులు తలెత్తడం లేదు. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఎంతో సురక్షితం.. బాగా తట్టుకోగలదు అని నిరూపితమయ్యింది అని లాన్సెట్ వెల్లడించింది. (చదవండి: ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ముందుగా మనకే!) ఈ సందర్భంగా ఆస్ట్రాజెనెకా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాస్కల్ సోరియట్ మాట్లాడుతూ.. ‘మేము ముందస్తు అనుమతి పొందడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెగ్యులేటరీ అధికారులకు ఈ డాటాను సమర్పించడం ప్రారంభించాము. త్వరలోనే ప్రపంచ స్థాయిలో వందల మిలియన్ల డోసులను ఎటువంటి లాభాపేక్ష లేకుండా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము’ని తెలిపారు. భద్రత పరంగా, వ్యాక్సిన్‌కు సంబంధించిన ఒక తీవ్రమైన ప్రతికూల సంఘటన ఉంది మరియు మరొకటి - అధిక ఉష్ణోగ్రత - ఇప్పటికీ పరిశోధించబడుతోంది. -
మా వ్యాక్సిన్ సేఫ్: సీరం ఇన్స్టిట్యూట్
న్యూఢిల్లీ: కరోనా టీకా ‘కోవిషీల్డ్’ ట్రయల్స్‌లో పాల్గొన్న తనకు ఆరోగ్యపరంగా దుష్ప్రభావాలు కలిగాయని, తీవ్రమైన మానసిక సమస్యలు తలెత్తాయని చెన్నైలోని ఒక వలంటీర్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై సీరం ఇన్స్టిట్యూట్ స్పందించింది. తమ కోవిషీల్డ్ వ్యాక్సిన్ సురక్షితమైనదని.. ఇమ్యూనోజెనిక్ అని తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యాక్సిన్ అభివృద్ధిలో తాము అన్ని నియంత్రణ, నైతిక ప్రక్రియలను అనుసరిస్తున్నామని వెల్లడించింది. అన్ని రకాల జాగ్రత్తల తర్వాతే తాము ట్రయల్స్ నిర్వహించామన్నది. సదరు వలంటీర్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తమని సీరం ఇన్స్టిట్యూట్ తెలిపింది. ‘వలంటీర్ అనారోగ్యం గురించి నోటీసులో పేర్కొన్న విషయాలు పూర్తిగా అవాస్తవం.. అసంబద్ధమైనవి. ప్రస్తుతం వలంటీర్ ఎదుర్కొంటున్న అనారోగ్య పరిస్థితికి, సీరం ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ట్రయల్స్‌కి ఎలాంటి సంబంధం లేదు. వలంటీర్ అబద్దం చెప్తున్నాడు.. అతడి అనారోగ్య సమస్యలకు కోవిడ్-19 వ్యాక్సిన్ ట్రయల్స్‌ని బ్లేమ్ చేస్తున్నాడు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడు. అబద్ధాలతో సంస్థ ప్రఖ్యాతిని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాడు’ అని ప్రకటనలో పేర్కొంది. అంతేకాక సదరు వలంటీర్ ఆరోగ్య పరిస్థితిపై సీరం ఇన్స్టిట్యూట్ సానుభూతి వ్యక్తం చేసింది. వలంటీర్ ఆరోపణలపై ఆదివారమే స్పందించిన సీరం.. నేడు మరోసారి ప్రకటన విడుదల చేసింది. (చదవండి: 90%సామర్థ్యం ఉండాల్సిందే!) టీకా కారణంగా తన నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని సదరు వలంటీర్ ఆరోపించారు. ఈ అనారోగ్య సమస్యలన్నీ కరోనా టీకా వల్లనేనని పరీక్షల్లో తేలిందన్నారు. టీకా వల్ల మెదడు దెబ్బతిన్నదని ఈఈజీ పరీక్షలో స్పష్టమైందన్నారు. మాట, చూపు, జ్ఞాపక శక్తిలోనూ దుష్ప్రభావాలు తలెత్తాయన్నారు. దీనితో భవిష్యత్తులోనూ అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదముందన్నారు. ఇందుకు పరిహారంగా తనకు 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీకా దుష్ప్రభావాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పరిహారంతో పాటు తక్షణమే టీకా ప్రయోగాలను నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ వర్సిటీ రూపొందిస్తున్న ‘కోవిషీల్డ్’ టీకాకు భారత్‌లో పుణెకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ) క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ ట్రయల్స్ మూడో దశ ప్రయోగాల్లో భాగంగా అక్టోబర్ 1న చెన్నైలోని ‘శ్రీ రామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్’లో ఆ వలంటీరుకు టీకా వేశారు. -
వ్యాక్సిన్‌పై వార్.. 100 కోట్లకు దావా!
న్యూఢిల్లీ: కరోనా టీకా ‘కోవిషీల్డ్’తో ఆరోగ్య పరంగా దుష్రభావాలు కలిగాయని, తీవ్రమైన మానసిక సమస్యలు తలెత్తాయని చెన్నైలోని ఒక వలంటీర్ ఫిర్యాదు చేశారు. టీకా కారణంగా తన నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని ఆరోపించారు. ఈ అనారోగ్య సమస్యలన్నీ కరోనా టీకా వల్లనేనని పరీక్షల్లో తేలిందన్నారు. టీకా వల్ల మెదడు దెబ్బతిన్నదని ఈఈజీ పరీక్షలో స్పష్టమైందన్నారు. మాట, చూపు, జ్ఞాపక శక్తిలోనూ దుష్ప్రభావాలు తలెత్తాయన్నారు. దీనితో భవిష్యత్తులోనూ అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదముందన్నారు. ఇందుకు పరిహారంగా తనకు రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీకా దుష్ప్రభావాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రూ. 5 కోట్ల పరిహారంతో పాటు తక్షణమే టీకా ప్రయోగాలను నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ వర్సిటీ రూపొందిస్తున్న ‘కోవిషీల్డ్’ టీకాకు భారత్‌లో పుణెకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ) క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ ట్రయల్స్ మూడో దశ ప్రయోగాల్లో భాగంగా అక్టోబర్ 1న చెన్నైలోని ‘శ్రీ రామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్’లో ఆ వలంటీరుకు టీకా వేశారు. టీకా వలంటీరుగా పనిచేసిన ఆ 40 ఏళ్ల వ్యాపార వేత్త తరఫున ఒక న్యాయ సేవల సంస్థ ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ), కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ, ఆస్ట్రా జెనెకా సీఈఓ.. తదితరులకు లీగల్ నోటీసులు పంపించింది. ఈ టీకా పూర్తిగా సురక్షితమైందని తన క్లయింట్‌కు ఇచ్చిన సమాచార పత్రంలో పేర్కొన్నారని, అందువల్లనే ఆయన వలంటీరుగా చేరేందుకు అంగీకరించారని ఆ సంస్థ వివరించింది. టీకా తీసుకున్న 10 రోజుల తరువాత తీవ్రమైన తలనొప్పి, వాంతులు ప్రారంభమయ్యాయని, దాంతో ఆసుపత్రిలో చేర్చారని తెలిపింది. మాట్లాడలేకపోవడం, ఎవరినీ గుర్తు పట్టలేకపోవడం.. తదితర సమస్యలు తలెత్తాయని, ఆ తరువాత ఐసీయూలో చేర్చి చికిత్స అందించారని వలంటీరుగా పనిచేసిన వ్యక్తి భార్య వివరించారు. 100కోట్లకు దావా : సీఐఐ ఈ ఆరోపణలను ఆదివారం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తోసిపుచ్చింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేసినందుకు నష్ట పరిహారం కోరుతూ రూ. 100 కోట్లకు దావా వేస్తామని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ ప్రయోగానికి, ఆ వలంటీరు అనారోగ్యానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. తన అనారోగ్య సమస్యలకు టీకాను కారణంగా చూపుతున్నారని ఆరోపించింది. కాగా, టీకా దుష్ప్రభావాలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుపుతామని డీసీజీఐ పేర్కొంది. డీసీజీఐతో పాటు టీకా వేసిన సంస్థలోని ఎథిక్స్ కమిటీ కూడా ఈ విషయంపై దృష్టి సారించింది. క్లినికల్ ట్రయల్స్‌లో చోటు చేసుకునే టీకా దుష్ప్రభావాలపై.. ముఖ్యంగా దుష్ప్రభావాలకు, టీకాకు ఉన్న సంబంధంపై క్షుణ్నంగా, శాస్త్రీయంగా పరిశోధన జరుగుతుందని ఐసీఎంఆర్‌లో ఎపిడెమాలజీ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్ హెడ్ డాక్టర్ సమీరన్ పాండా చెప్పారు. హడావుడిగా విచారణ జరిపి, ఒక అంచనాకు రావడం సరికాదన్నారు. -
ఢిల్లీలో డేంజర్ బెల్స్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా స్వైర విహారం కొనసాగుతోంది. యూరోపియన్ దేశాల్లో కోవిడ్–19 సెకండ్ వేవ్ నడుస్తుండగా, ఢిల్లీలో మాత్రం థర్డ్ వేవ్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కోవిడ్–19 పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా ఢిల్లీలోనే రికార్డు స్థాయిలో నమోదవుతుండడంతో మరణాలు కూడా ఎక్కువ పెరిగాయి. చలిగాలులతో పాటు కాలుష్యం కారణంగా కరోనా వైరస్ విజృంభిస్తోందని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ పొరుగు రాష్ట్రాలైన హరియాణా, పంజాబ్ రాజస్తాన్‌ల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం కారణంగా కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా మహమ్మారి కేసులు వస్తున్న సమయంలోనైనా పంట వ్యర్థాల కాలుష్యాన్ని అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ సర్కార్ విజ్ఞప్తి చేసింది. దేశ రాజధానిలో ఈ స్థాయిలో కరోనా విజృంభించడానికి కారణం గాలి కాలుష్యమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కోవిడ్–19 పాజిటివ్ వ్యక్తులు ఈ కలుషిత గాలిని పీల్చడంతో ఆరోగ్యం విషమించి, మరణాల రేటు పెరుగుతోంది. మార్చి నుంచి మే వరకు కరోనా కేసులు పెరిగినప్పటికీ, జూన్ నుంచి కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే, ఉత్తరాదిన చలి, కాలుష్య తీవ్రత కారణంగా ఢిల్లీలో విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. రోగ నిరోధక శక్తిని తగ్గించి, అనారోగ్యాన్ని పెంచే వాయు కాలుష్యం ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. చేతులు దాటాక ఆస్పత్రికి.. హస్తినలో కోవిడ్ –19 కేసుల సంఖ్య పెరగడంతో, ఆసుపత్రుల్లో రోగులు గడిపే సమయం కూడా పెరిగింది. దీని కారణంగా దేశ రాజధానిలో కోవిడ్ పడకల కొరత పెరిగింది. అంతేగాక పాజిటివ్ నిర్ధారణ అయి, ఆక్సిజన్ స్థాయి తీవ్రంగా పడిపోయినప్పుడు మాత్రమే రోగులు ఆసుపత్రికి వస్తున్నారని ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న గురు తేజ్ బహదూర్ వైద్యులు తెలిపారు. అంతేగాక ఆసుపత్రిలో, కోవిడ్ రోగి బస చేసే సగటు వ్యవధి 10 రోజుల నుంచి మూడు వారాలకు పెరిగింది. జూన్–జూలై నెలల్లో మహమ్మారి సంక్రమణ సమయంలో ఒక్క రోజులో అత్యధిక మరణాలు (101) నమోదయ్యాయి. కానీ థర్డ్ వేవ్ ప్రారంభమైన తర్వాత, నవంబర్ 18న అత్యధికంగా ఒక్క రోజులో 131 మరణాలు నమోదయ్యాయి. నవంబర్ 11న ఒకే రోజులో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో 8,593 గా నమోదైంది. పాజిటివ్ నిర్ధారణ అయిన తర్వాత హోం క్వారంటైన్ అయిన రోగుల ఆరోగ్యం ఆక్సిజన్ స్థాయి నిర్ధారణలో ఆలస్యం కారణంగా విషమంగా మారుతోందని వైద్యులు తెలిపారు. ఇటువంటి కేసుల్లో 48–72 గంటల్లోనే మరణాలు సంభవిస్తున్నాయి. 57 లక్షల కరోనా సర్వేలో 13,516 మంది గుర్తింపు దేశ రాజధానిలో థర్డ్ వేవ్ కారణంగా ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాల్లో ఢిల్లీ ప్రభుత్వం ఐదు రోజుల పాటు ఇంటింటికి తిరిగి భారీ సంఖ్యలో కరోనా పరీక్షలను నిర్వహించింది. ఢిల్లీలోని 11 జిల్లాల్లో ముగ్గురు సభ్యుల 9వేల బందాలు కోవిడ్ హాట్‌స్పాట్ సెంటర్లలో 57 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. అందులో రోగ లక్షణాలు ఉన్న 13,516 మందిని, వీరితో పరిచయం ఉన్న 8,413 మందిని గుర్తించారు. రోగ లక్షణాలు గుర్తించిన వారిలో అత్యధికంగా 3,796 మంది నైరుతి ఢిల్లీ జిల్లాలో ఉన్నారు. కట్టడికి కఠిన నిబంధనలు కరోనా కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. మాస్కు ధరించని వారికి వేసే జరిమానాను రూ.500 నుంచి ఏకంగా రూ.2,000 కు పెంచింది. వివాహ వేడుకలకు హాజరయ్యే అతిథుల సంఖ్యను 200 నుంచి 50కి కుదించింది. జన సంచారం అధికంగా ఉండే మార్కెట్లలో కోవిడ్–19 నిబంధనలను పాటించకపోతే మూసివేసేందుకు ప్రతిపాదనలను కూడా సిద్ధం చేసింది. రెండు మార్కెట్లను తాత్కాలికంగా మూసివేయాలని తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఢిల్లీ ప్రభుత్వం వెనక్కి తగ్గిన విషయం విదితమే. భారత్‌లో రష్యా టీకా తయారీ రష్యాకు చెందిన సుత్నిక్ వీ కరోనా వ్యాక్సిన్‌ను ఇక భారత్‌లో పెద్ద ఎత్తున తయారు చేయనున్నారు. ఏడాదికి 10 కోట్లకు డోసులకు పైగా డోసుల్ని ఉత్పత్తి చేయడానికి రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) భారత్ ఫార్మా దిగ్గజం హెటిరోతో ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే ఏడాది మొదట్లో ఉత్పత్తిని భారత్‌లో ప్రారంభిస్తామని ఆర్డీఐఎఫ్ పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు వెనెజులా, భారత్ తదితర దేశాల్లో జరుగుతున్నాయి. 50కి పైగా దేశాల నుంచి 1,200 కోట్లకు పైగా టీకా డోసులు కావాలంటూ రష్యాకు విజ్ఞప్తులు అందాయి. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌ను అంచనా వేయండి లండన్: ఆక్స్ఫర్డ్–అస్ట్రాజెనెకా కోవిడ్–19 వ్యాక్సిన్ ఎంత వరకు పని చేస్తుందో అంచనా వేయాలంటూ యూకే ప్రభుత్వం వైద్య నియంత్రణ మండళ్లను కోరింది. ఈ మేరకు యూకే ఆరోగ్య మంత్రి మట్ హన్‌కాక్ లేఖ రాశారు. త్వరలోనే ఈ టీకా ప్రయోగాలు పూర్తి కావస్తూ ఉండడంతో ఈలోగా సామర్థ్యాన్ని అంచనా వేస్తే పంపిణీ సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అస్ట్రాజెనెకా ఈ ఏడాది చివరి నాటికి 40 లక్షల డోసుల్ని ఉత్పత్తి చేయనుంది. 2021 మార్చి నాటికి 4 కోట్ల డోసుల ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. -
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్: పొరపాటుతో ఖుషీ!
న్యూయార్క్: కరోనా వైరస్ కట్టికి బ్రిటిష్, స్వీడిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనకా రూపొందిస్తున్న వ్యాక్సిన్ తయారీలో పొరపాటు దొర్లినట్లు తాజాగా ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ పేర్కొంది. దీంతో బ్రిటన్‌లో ఒకటిన్నర డోసేజీలతోనే మూడో దశ క్లినికల్ పరీక్షలను నిర్వహించినట్లు తెలుస్తోంది. కోవిడ్-19 నిలువరించేందుకు ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న విషయం విదితమే. దీనిలో భాగంగా మూడో దశ క్లినికల్ పరీక్షలలో భాగంగా బ్రెజిల్లో రెండు పూర్తి డోసేజీలతో 8,895 మందిపై ప్రయోగాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇదే విధంగా బ్రిటన్‌లో ఒకటిన్నర డోసేజీలతో 2,781పై పరిశీలించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇటీవలే ఈ వ్యాక్సిన్ 70 శాతం ఫలితాలను ఇచ్చినట్లు ఆస్ట్రాజెనెకా తెలియజేసింది. మూడో దశ క్లినికల్ పరీక్షల ప్రాథమిక డేటా ప్రకారం తక్కువ డోసేజీ ఇచ్చిన కేసులలో మరింత అధికంగా 90 శాతం ఫలితాలు నమోదైనట్లు మరోసారి వెల్లడించింది. అయితే ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ తాజా ప్రకటనతో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ప్రమాణాలపై సందేహాలు తలెత్తే అవకాశమున్నట్లు ఫార్మా రంగ నిపుణులు వ్యాఖ్యానించారు. తక్కువ డోసేజీలో ఒకటిన్నర డోసేజీ పరీక్షలలో వ్యాక్సిన్ 90 శాతం విజయవంతంగా పనిచేసినట్లు ఆస్ట్రాజెనెకా చెబుతోంది. నిజానికి ఈ పొరపాటు అటు కంపెనీకి, ఇటు ప్రజలకూ ఒక విధంగా మేలు చేసే విషయమేనని ఫార్మా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కాగా.. లోయర్ డోసేజీవల్ల రోగనిరోధక శక్తిని పెంచే టీసెల్స్ మరింత సమర్థవంతంగా పనిచేసి ఉండవచ్చని సైంటిస్టులు పేర్కొన్నారు. ఈ రెండు ప్రయోగాలలోనూ పలు ఇతర అంశాలనూ పరిగణనలోకి తీసుకోవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ మూడో దశలో భాగంగా జపాన్, రష్యా, దక్షిణాఫ్రికాసహా పలు ఇతర దేశాలలోనూ క్లినికల్ పరీక్షలు కొనసాగుతున్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. రెండు పూర్తి డోసేజీలతో భారీ సంఖ్యలో చేపట్టిన ఫలితాలను పూర్తిగా విశ్లేషించవలసి ఉన్నట్లు ఈ సందర్భంగా ఫార్మా నిపుణులు తెలియజేశారు. -
కోవిషీల్డ్ వ్యాక్సిన్ : జనవరి నాటికి పదికోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సాయంతో తీసుకొస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్‌పై సీరం సీఈవో మరోసారి కీలక విషయాన్ని ప్రకటించారు. జనవరి నాటికి కనీసం 100 మిలియన్ల మోతాదుల వ్యాక్సిన్‌ను అందుబాటులోఉంచుతామని తెలిపారు. అలాగే ఫిబ్రవరి చివరి నాటికి వందల మిలియన్లు సిద్ధంగా ఉంటాయని అంచనావేశారు. బ్రిటన్, బ్రెజిల్ ట్రయిల్స్‌లో అస్ట్రాజెనెకా టీకా 90 శాతం ప్రభావవంతంగా ఉందని, ప్రపంచవ్యాప్తంగా పరీక్షిస్తున్నవాటిలో ప్రోత్సాహకరంగా ఉన్న వాటిల్లో తమది కూడా ఉందని అదర పూనవాలలా చెప్పారు. (ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ : అద్భుతమైన వార్త!) కోవిడ్-19 వ్యాక్సిన్ ‘కోవిషీల్డ్ ’ భారీ తయారీకి ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న పుణే సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా సోమవారం సాయంత్రం చెప్పారు. ఇప్పటికే 40 మిలియన్ల మోతాదులను సిద్ధం చేశామన్నారు. రెండు డోసుల ఈ వ్యాక్సిన్ ఒక్కొక్క మోతాదు ధర 500-600 రూపాయల మధ్య ఉంటుందని తెలిపారు. -
కరోనా టీకాపై భారత్ ఆశలు.. తేల్చేసిన సీరమ్ ఇన్స్టిట్యూట్
న్యూఢిల్లీ: కోవిడ్–19ను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ఉన్న ఏకైక మార్గం టీకా. ఇప్పటికే పలు కంపెనీలు టీకాలపై ప్రయోగాలు చేపట్టి చివరి దశకు చేరుకున్నాయి. ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా వంటి అంతర్జాతీయ ఫార్మా కంపెనీలతోపాటు భారత్ బయోటెక్, రష్యా, చైనాలు కూడా వేర్వేరు టీకాలను సిద్ధం చేశాయి. రష్యా, చైనాలు అత్యవసర పరిస్థితుల్లో కొంతమందిపై ఈ టీకాలను వినియోగించేందుకు అనుమతు లు కూడా ఇచ్చేశాయి. భారత్ విషయానికి వస్తే 2 నెలల్లో టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రకటించారు. మరోవైపు భారత్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆస్ట్రాజెనెకా–ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ టీకాను తయారు చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మాత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌కు గానీ టీకా సిద్ధం కాదని చెబుతోంది. (భారత్‌లో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసిందా?) ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ టీకా కోవిషీల్డ్ మూడో దశ మానవ ప్రయోగ ఫలితాలు డిసెంబర్ ఆఖరుకు అంటే క్రిస్మస్ నాటికి వెలువడతాయని అంచనా. ఆ తర్వాత ప్రభుత్వ అనుమతులకు మరో ఒకట్రెండు నెలల సమయం పడుతుంది. అంటే ఫిబ్రవరిలో బ్రిటన్‌లో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇదే టీకాపై భారత్‌లోనూ మూడో దశ ప్రయోగాలు మొదలయ్యాయి. మరోవైపు భారత్ బయోటెక్ టీకా కోవాగ్జిన్ మూడో దశ మానవ ప్రయోగాలు రెండ్రోజుల క్రితమే మొదలయ్యాయి. ఇవి పూర్తయ్యేందుకు 56 రోజుల సమయం పడుతుందనుకుంటే వచ్చే ఏడాది జనవరి చివరికల్లా ప్రయోగాలు పూర్తయ్యే అవకాశం ఉంది. మోడెర్నా, ఫైజర్ తదితర కంపెనీలు తయారు చేస్తున్న టీకాలను పరిగణనలోకి తీసుకోకపోయినా భారత్‌లో టీకా దొరికేందుకు కనీసం మార్చి తొలివారం వరకూ వేచి చూడక తప్పదన్నమాట. కరోనా టీకా పంపిణీ సవాళ్లు ఎన్నో.. ►260 కోట్లు: దేశంలోని 130 కోట్ల మందికి కావాల్సిన కరోనా టీకా డోసుల సంఖ్య ►40–50 కోట్లు: జూలై 2021 నాటికి ప్రభుత్వం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న టీకాల సంఖ్య ►26–27 కోట్లు: టీకాలను నిల్వ చేసేందుకు కావాల్సిన బాటిళ్లు. స్కాట్ కైషా, పిరమల్ గ్లాస్, బోరోసిల్, గెరిషైమర్ ఇండియా వంటి కంపెనీలు ఇప్పటికే వ్యాక్సిన్ బాటిళ్ల ఉత్పత్తిని పెంచాయి. ►కరోనా టీకాలు ఇచ్చేందుకు అవసరమైన సిరంజీల ఉత్పత్తిని పెంచేందుకు హెచ్ఎండీ, ఇస్కాన్ సర్జికల్స్, బీడీ వంటి కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ►వ్యాక్సిన్లను –20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసేందుకు జీఎంఆర్ ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాల్లో తగిన వ్యవస్థలను ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతోంది. ►స్నోమాన్ లాజిస్టిక్స్, బ్లూడార్ట్ ఎక్స్‌ప్రెస్, గతి, గుబ్బా కోల్డ్ స్టోరేజ్ తదితర కంపెనీలు అతిశీతల ఉష్ణోగ్రతల్లో కరోనా టీకాలను రవాణా చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ►అపోలో హాస్పిటల్స్ తన ఫార్మసీల ద్వారా టీకాలను పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది. -
ఏప్రిల్‌కల్లా ఆక్స్ఫర్డ్ టీకా
న్యూఢిల్లీ : ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ఆస్ట్రాజెనికా వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అందుబాటులోకి వస్తుందని వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా తెలిపారు. ఆరోగ్య రంగ సిబ్బందికి, వృద్ధులకి ఫిబ్రవరి నాటికే వ్యాక్సిన్‌ని ఇచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. రెండు వ్యాక్సిన్ డోసుల ఖరీదు వెయ్యి రూపాయల వరకు ఉంటుందన్నారు. హిందూస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్–2020లో పాల్గొన్న పూనావాలా ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ప్రయోగాలు ముగింపు దశకు వచ్చాయని చెప్పారు. 2024కల్లా అందరికీ వ్యాక్సినేషన్ ప్రజలందరికీ వ్యాక్సినేషన్ పూర్తి కావడానికి 2024 అవుతుందని వెల్లడించారు. ‘‘130 కోట్ల జనాభాకి వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే మూడు, నాలుగేళ్లు పడుతుంది. కేవలం వ్యాక్సిన్ డోసుల సరఫరాలో సమస్యలే కాకుండా డోసుల ఉత్పత్తికి సరిపడా బడ్జెట్ ఉండాలి. వాటి పంపిణీకి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలి. వీటన్నింటినీ అధిగమించినా 80–90శాతం జనాభాకే వ్యాక్సిన్ ఇవ్వడం కుదురుతుంది’’అని ఆయన వివరించారు. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వృద్ధుల్లో కూడా సత్ఫలితాలు ఇవ్వడంతో ఈ వ్యాక్సిన్‌పై అంచనాలు పెరిగిపోయాయని చెప్పారు. భారత్‌లో జరిగే ప్రయోగాల ఫలితాలు మరో నెలన్నరలో వెలువడతాయని పూనావాలా చెప్పారు. 2 నుంచి 8 డిగ్రీల వాతావరణంలో ఈ వ్యాక్సిన్‌ను నిల్వ చేయవచ్చునన్నారు. 2021 ఏప్రిల్ నాటికి 30 నుంచి 40 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తామని చెప్పారు. భారత్‌కి వ్యాక్సిన్ ఇవ్వడమే తొలిప్రాధాన్యమన్నారు. మూడో దశ ప్రయోగాల్లోకి చైనా టీకా చైనాకు చెందిన అన్హుయ్ ఝిఫై లాంగ్‌కామ్ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ మూడో దశ మానవ ప్రయోగాల్లోకి అడుగుపెట్టింది. అన్హుయ్ కంపెనీ ఈ వ్యాక్సిన్‌ను చైనీస్ అకాడెమీ సైన్సెస్‌కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో బయాలజీతో కలసి అభివృద్ధి చేస్తోంది. మూడో దశ ప్రయోగాల కోసం ప్రపంచవ్యాప్తంగా 29 వేల మందిని వాలంటీర్లుగా ఎంచుకోనుంది. రెమిడెసివిర్ ఇవ్వొద్దు డబ్ల్యూహెచ్‌వో సిఫారసు కరోనా చికిత్సలో సత్ఫలితాలు ఇస్తోందని ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చిన యాంటీ వైరల్ డ్రగ్ రెమిడెసివిర్‌తో కలిగే ప్రయోజనం ఏమీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. గిలియాడ్ సంస్థకు చెందిన ఈ ఔషధంతో కరోనా రోగులు కోలుకుంటారని, వారి ప్రాణాలు కాపాడగలమనడానికి ఎలాంటి ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. రెమిడెసివిర్ ఇచ్చిన 7 వేలకు పైగా కోవిడ్ రోగుల్ని అధ్యయనం చేసిన తర్వాత దాంతో వచ్చే ఉపయోగం లేదని అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులతో కూడిన డబ్ల్యూహెచ్‌వో గైడ్లైన్ డెవలప్మెంట్ గ్రూప్ అభిప్రాయపడింది. ఈ వివరాలను బ్రిటన్‌కు చెందిన మెడికల్ ట్రేడ్ జర్నల్ ప్రచురించింది. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసుపై గిలియాడ్ సంస్థ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కొవాగ్జిన్ వాలంటీర్‌గా హరియాణా మంత్రి భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ చివరి దశ ప్రయోగాలు హరియాణాలో ప్రారంభమయ్యాయి. ఈ ప్రయోగాల్లో భాగంగా హరియాణా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ వాలంటీర్‌గా టీకా డోసు తీసుకున్నారు. అంబాలాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మంత్రికి కొవాగ్జిన్ డోసు ప్రయోగాత్మకంగా ఇచ్చి చూశారు. వ్యాక్సిన్ ఇవ్వడానికి ముందు ఆయనకు కొన్ని పరీక్షలు చేశారు. ఒక ప్రజాప్రతినిధి వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం భారత్‌లో ఇదే తొలిసారి. టీకా ఇవ్వడంతో ఆయనలో వచ్చే ఆరోగ్యపరమైన మార్పుల్ని నిరంతరం వైద్యులు పరీక్షిస్తారు. నాలుగు వారాల తర్వాత మంత్రికి రెండో డోసు ఇస్తారు. -
జనవరి నాటికి కరోనా వ్యాక్సిన్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల కరోనా వైరస్ సెకండ్ వేవ్‌పై ఆందోళన పెరుగుతున్న సమయంలో వ్యాక్సిన్‌పై ఆశలు మరింత పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్-19 వ్యాక్సిన్‌పై సీరం ఇన్స్టిట్యూట్ కీలక విషయాన్ని ప్రకటించింది. 2021 జనవరి నాటికి తమవాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ, బ్రిటీష్ సంస్థ ఆశ్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ 2021, జనవరి నాటికి భారత్‌లో లభిస్తుందని పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా తాజాగా వెల్లడిచారు. ట్రయల్స్ విజయవంతమైన అనంతరం నియంత్రణ సంస్థల ఆమోదాలు సకాలంలో లభిస్తే వచ్చే ఏడాది జనవరి నాటికి టీకా భారత్‌లో లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. భారత్, యూకేలలో జరుగుతున్న పరీక్షల ఆధారంగా ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా ఉంటుందనే నమ్మకముందని పేర్కొన్నారు. భారత మార్కెట్ కోసం కొవీషీల్డ్ పేరుతో వస్తున్న ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం దేశంలో రెండు, మూడు దశల పరీక్షలు కొనసాగుతున్నాయి. ఫలితాలు వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న క్లినికల్ ట్రయల్స్ గురించి ప్రస్తావించిన అదర్ పూనావాలా కొవీషీల్డ్‌కు సంబంధించి తక్షణం ఆందోళన కలిగించే అంశాలేమీ లేవని, భారత్‌తో పాటు విదేశాల్లో వేలాది మంది ఈ వ్యాక్సిన్ షాట్ లభించిందని ఆయన తెలిపారు. ఇప్పటివరకైతే తమ సంస్థ 60 నుంచి 70 లక్షల మోతాదుల తయారీ లక్ష్యంగా ఉన్నట్టు, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక నెలకు కోటి మోతాదుల వ్యాక్సిన్లను తయారు చేయాలని భావిస్తున్నట్టు ఆయన వివరించారు. అంతేకాదు టీకా సరసమైన ధరకు టీకాను అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వంతో సీరం చర్చలు జరుపుతోందన్నారు. అందరికీ అందుబాటులో ధరలో టీకాను అందించాలని నిశ్చయించుకున్నామని పూనావాలా ప్రకటించారు. -
భారత్‌లో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ అప్పుడే!
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లోని సీరం ఇనిస్టిట్యూట్‌లో రూపొందే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ర్టాజెనెకాలు అభివృద్ధి చేస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ డిసెంబర్ నాటికి సిద్ధమవుతుందని పుణేకు చెందిన ఆ సంస్థ చీఫ్ ఆదార్ పూనావాలా వెల్లడించారు. పది కోట్ల వ్యాక్సిన్ డోసులతో తొలి బ్యాచ్ 2021 రెండు లేదా మూడో త్రైమాసికంలో సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. భారత్‌లో డిసెంబర్ నాటికి మానవ పరీక్షలు పూర్తవుతాయని, బ్రిటన్‌లో పరీక్షలు కూడా ముగిసిన పక్షంలో భారత్‌లో జనవరి నాటికి వ్యాక్సిన్ లాంఛ్ చేస్తామని ఓ జాతీయ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదార్ పూనావాలా పేర్కొన్నారు. బ్రిటన్‌లో మరో రెండు వారాల్లో వ్యాక్సిన్ పరీక్షలు పూర్తయి..వ్యాక్సిన్ సామర్థ్యం, భద్రత మెరుగ్గా ఉందని వెల్లడైతే అత్యవసర వాడకానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ తాము భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తామని చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా కొన్ని వారాల ప్రక్రియని, దీనిపై తాను ఊహించి చెప్పలేనని, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నారు. ఇక వ్యాక్సిన్ పూర్తిస్ధాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే వివరాలు వెల్లడిస్తూ తొలిబ్యాచ్‌గా 10 కోట్ల వ్యాక్సిన్ డోసులను వచ్చే ఏడాది రెండు, మూడు త్రైమాసికాల్లో (జూన్-సెప్టెంబర్) మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేపడుతున్నామని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో వ్యాక్సిన్ తయారీకి ఒప్పందం చేసుకుంది. చదవండి : ఏడాదికి 50 కోట్ల డోసులు -
డిసెంబర్లో కరోనా వ్యాక్సిన్
న్యూఢిల్లీ : ఇప్పటికే రెండు ట్రయల్స్‌ను దిగ్విజయంగా పూర్తి చేసుకొని మూడవ ట్రయల్స్‌ను కొనసాగిస్తోన్న ‘ఆక్స్ఫర్డ్ కోవిడ్ వ్యాక్సిన్’ మొదటి విడతను ఈ డిసెంబర్ నెలలోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు కృషి చేస్తున్నారు. అందుకు అవసరమైన అధికారిక అనుమతిని క్రిస్మస్‌లోగా పొందేందుకు ప్రయత్నాలను వారు ముమ్మరం చేశారు. వ్యాక్సిన్‌కు సంబంధించి మూడవ ట్రయల్స్ కూడా విజయవంతం అయితేగానీ అధికారిక అనుమతి లభించదు. ( అది చాలా ప్రమాదకరం: డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ) అయితే కరోనా బారిన పడిన రోగులకు వైద్య సేవలు అందిస్తూ తాము ఆ వైరస్ బారిన పడుతోన్న వైద్య సిబ్బందికి, వ్యాక్సిన అత్యవసరంగా అందించాల్సిన అవసరం ఉన్న వృద్ధ రోగులకు మొదటి విడత కింద డిసెంబర్లో వ్యాక్సిన్ అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తున్నామని వ్యాక్సిన్ ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహిస్తోన్న ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్ ఆండ్రియన్ హిల్ మీడియాకు తెలిపారు. మూడవ విడత ట్రయల్స్ పూర్తి కాక మునుపే మొదటి విడత వ్యాక్సిన్ డోసుల విడుదలకు అనుమతి కోరుతున్నామని, క్రిస్మస్‌లోగా అనుమతి వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. మూడవ ట్రయల్స్ పూర్తయ్యాక దేశ ప్రజలతోపాటు ఒప్పందం చేసుకున్న దేశాల ప్రజలకు వ్యాక్సిన్ డోస్‌లను 2021 తొలినాళ్లలో తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రొఫెసర్ ఆండ్రియన్ వివరించారు. -
ఔషధ పరీక్షల్లో వలంటీర్ మృతి
సావోపౌలో: అస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో వాలంటీర్ మృతి చెందినట్లు బ్రెజిల్ హెల్త్ అథారిటీ అన్విసా బుధవారం ప్రకటించింది. ట్రయల్స్ కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ట్రయల్స్‌ను కొనసాగిస్తామంది. ఈ ఘటనపై అస్ట్రాజెనెకా స్పందించలేదు. చనిపోయిన వలంటీర్‌కు వ్యాక్సిన్ ఇచ్చినట్లు నిర్ధారణైతే ట్రయల్స్‌ను 3 నెలలు ఆపివేయ వచ్చని సంబంధితవర్గాలు తెలిపినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఇప్పటికున్న సమాచారం ప్రకారం మృతి చెందిన వలంటీర్‌కు మెనింజిటిస్ వ్యాక్సిన్ ఇచ్చారని సదరు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి ట్రయల్స్ కొనసాగించవచ్చని ఈ ఘటనపై విచారణ జరిపిన స్వతంత్ర విచారణ కమిటీ సూచించిందని ట్రయల్స్‌ను పర్యవేక్షిస్తున్న సావోపౌలో ఫెడరల్ యూనివర్సిటీ తెలిపింది. మృతి చెందిన వలంటీర్ రియోడిజినిరోకు చెందిన 28 సంవత్సరాల వైద్యుడి గా చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి వలంటీర్లలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని యూనివర్సిటీ తెలిపింది. ఇప్పటివరకు 8 వేల మంది వలంటీర్లను ట్రయల్స్ కోసం తీసుకున్నారు. -
‘అతను చనిపోయింది మా వ్యాక్సిన్ వల్ల కాదు’
లండన్: కోవిడ్ చికిత్స కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ క్లినకల్ ట్రయల్స్‌లో పాల్గొన్న ఓ వ్యక్తి అనారోగ్యానికి గురవ్వడంతో ట్రయల్స్‌ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా బ్రెజిల్లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పరీక్షల్లో పాల్గొన్న ఓ వలంటీర్ మరణించాడు. అయితే అతడు తమ వ్యాక్సిన్ డోస్ తీసుకోలేదని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. అలానే మరణించిన వ్యక్తికి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేమని ఇందుకు సంబంధించిన అధికారి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా బ్రెజిల్ ఆరోగ్య అధికారి మాట్లాడుతూ.. ‘వలంటీర్ మరణానికి సంబంధించిన సమాచారం సోమవారం తెలిసింది. ట్రయల్ భద్రత గురించి అంచనా వేసే అంతర్జాతీయ కమిటీ నుంచి పాక్షిక నివేదిక అందింది. ట్రయల్స్ కొనసాగించవచ్చని కమిటీ సూచించింది’ అని తెలిపారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేస్తున్న ఆస్ట్రాజెనెకా ప్రైవసీ, క్లినికల్ ట్రయల్స్ నిబంధనల కారణంగా వ్యక్తిగత కేసులపై వ్యాఖ్యనించలేమని తెలిపింది. అంతేకాక వ్యాక్సిన్ భద్రత గురించి జరిపిన స్వతంత్ర, కేర్‌ఫుల్ రివ్యూ ఎలాంటి ఆందోళన లేదని తెలియజేసింది. బ్రెజిల్ రెగ్యూలేటర్స్ ప్రయోగాలు కొనసాగించవచ్చని తెలిపినట్లు యూనివర్సిటీ సమాచార విభాగం అధిపతి స్టీఫెన్ రూస్ తెలిపారు. (చదవండి: కరోనా: 10 రకాల వ్యాక్సిన్ల అప్డేట్) అమెరికాలో ట్రయల్స్‌కు బ్రేక్.. అమెరికాలో ఆస్ట్రాజెనెకా క్లినికల్ ట్రయల్స్ ఒక నెలకు పైగా నిలిపివేయబడ్డాయి. సెప్టెంబరులో యూకేలో వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొన్న ఓ వలంటీర్ అనారోగ్యానికి గురవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా ట్రయల్స్ ఆగిపోయాయి. అయితే యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, భారతదేశాలలో ఇటీవలి వారాల్లో తిరిగి ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. టీకా అధ్యయనాలలో తాత్కాలిక విరామాలు సాధారణం. అయితే, యూకే ఎపిసోడ్ గురించి మరింత సమాచారాన్ని బహిర్గతం చేయ్యాలంటూ ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అమెరికాలో ట్రయల్స్ నిలిచిపోవడంతో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాల గురించి ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఈ సంఘటనలు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేటప్పుడు పరిశోధకులు ఎదుర్కొంటున్న అవరోధాలను హైలైట్ చేశాయి. మరో టీకా తయారీదారు, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో భాగంగా ఓ వలంటీర్ అనారోగ్యానికి గురవ్వడంతో ట్రయల్స్‌ని తాత్కలికంగా నిలిపివేశారు. (చదవండి: కరోనా అంతానికిది ఆరంభం) ఆస్ట్రాజెనెకా, జేఅండ్‌జే టీకాలు రెండూ అడెనోవైరస్లపై ఆధారపడి ఉన్నాయి. తాజా పరిణామాలతో దశాబ్దాలుగా పరిశోధకులు ప్రయోగాత్మక చికిత్సలలో ఉపయోగించిన కోల్డ్ జెర్మ్స్ గురించి ఈ రెండు ట్రయల్స్ అనేక ప్రశ్నలు సంధించాయి. ఈ ఏడాది అమెరికాలో ట్రయల్స్ ప్రారంభించవచ్చని, యూఎస్ఏ వెలుపల పరీక్షల ఫలితాల ద్వారా వ్యాక్సిన్ ఆమోదం పొందుతుందని అక్టోబర్ ఆస్ట్రాజెనెకా తెలిపింది. -
ఆరునెలల్లో ఆక్స్ఫర్డ్ టీకా
లండన్: ఈ యేడాది చివరి నాటికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌కి అనుమతులొచ్చే అవకాశం ఉందని, ఆరు నెలల్లోపు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉందని బ్రిటన్ మీడియా తెలిపింది. ప్రముఖ ఔషధ కంపెనీ ఆస్ట్రాజెనెకాతో కలిసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేపట్టిన ప్రయోగాలు చివరి దశలో ఉన్నాయని, క్రిస్మస్‌నాటికి అనుమతులొచ్చే అవకాశం ఉందని మీడియా తెలిపింది. వ్యాక్సిన్‌కి అనుమతులొచ్చిన తరువాత, వృద్ధులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆరు నెలల లోపు అమలు చేయనున్నట్లు ఆ రిపోర్టు పేర్కొంది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆరు నెలల్లోపు, లేదా అంతకంటే ముందే ప్రారంభించడానికి ప్రయత్నించేలా చూస్తున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మొదటిగా 65 సంవత్సరాలు పైబడిన వారికి, తరువాత హైరిస్క్, ఇతర తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న యువతరానికి ఈ వ్యాక్సిన్‌ని ఇస్తామని, తర్వాత క్రమంలో 50 ఏళ్ళు పైబడిన వారికీ, అలాగే యువతకు వ్యాక్సిన్ ఇస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బ్రిటిష్ ప్రభుత్వం పది కోట్ల ఆక్స్ఫర్డ్ వ్యాక్సి న్ డోస్‌ల కొనుగోలుకి ఆదేశాలిచ్చినట్లు వారు తెలిపారు. మూడోదశ ప్రయోగాలకు అనుమతివ్వండి: రెడ్డీస్ ల్యాబ్స్ రష్యాకు చెందిన స్పుత్నిక్–వీ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాను కోరింది. రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ స్పుత్నిక్ను భారత్‌లో ప్రయోగించేందుకు, ఉత్పత్తి చేసేందుకు రెడ్డీస్ ల్యాబొరేటరీ రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కోలుకున్న 90 రోజుల తర్వాతా కరోనా వ్యాప్తి కోవిడ్‌తో తీవ్రంగా ప్రభావితమైన వారి శరీరంలో కోవిడ్ నుంచి కోలుకున్న 90 రోజుల తర్వాత కూడా వైరస్ ఉంటుందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రవెన్షన్ ఇన్ అట్లాంటా అనే సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలోని వివిధ ఆసుపత్రుల నుంచి రోగుల సమాచారాన్ని సేకరించి సంస్థ విశ్లేషించి చూడగా ఈ విషయం బయటపడింది. వారి ద్వారా ఈ వైరస్ అత్యంత వేగంగా ఇతరులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నదని ఆ అధ్యయనం తెలిపింది. -
వ్యాక్సిన్ కహానీ: అందుబాటులోకి వచ్చేదెలా?
ప్రపంచమిప్పుడు కాలంతో పోటీపడుతోంది... ఉరుకులు పరుగులతో కరోనా కట్టడికి టీకాను అభివృద్ధి చేస్తోంది.దశాబ్దాల సమయాన్ని నెలల్లోకి కుదించేస్తోంది!. ప్రయోగ ఫలితాలపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూన్న వేళ...టీకా అందరికీ అందుబాటులోకి వచ్చేదెలా?. పంపిణీలో సమస్యలు అధిగమించగలమా?. టీకా పరిశోధనలు మనకు నేర్పే పాఠాలేమిటి?. వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు. చైనాలోని వూహాన్లో పుట్టి ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా వైరస్ అంతానికి రంగం సిద్ధమైంది. ఒకటి కాదు.. రెండు కాదు.. కనీసం నాలుగైదు టీకాలు దాదాపుగా అందుబాటులోకి వచ్చేశాయి. కానీ 730 కోట్ల జనాభాకు టీకా సిద్ధం చేయడం సవాలే. కలిసికట్టుగా పని చేస్తేనే సాధ్యం. టీకా పంపిణీ, తారతమ్యాల్లేకుండా అందరికీ టీకా వేయించడం కీలకం. ప్రస్తుతం కనీసం 180 వ్యాక్సీన్ ప్రయోగాలు వివిధ దశల్లో ఉండగా తొమ్మిది మాత్రమే తొలి రెండు దశల మానవ ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. చైనా, రష్యాలు ఒక్కో టీకా వాడకానికి పరిమితమైన అనుమతులు ఇచ్చాయి కూడా. స్థూలంగా చూస్తే... ఇప్పటికైతే కరోనా టీకా ఏదీ అందుబాటులో లేనట్లే. ప్రీక్లినికల్ ట్రయల్స్‌తో కలుపుకుని ఒక్కో టీకా అభివృద్ధికి గతంలో 10 – 12 ఏళ్ల సమయం పట్టేది. కానీ కొన్ని దశలను కలిపేసి నిర్వహించడం, ప్రభుత్వాలు వేగంగా అనుమతులు జారీ చేయడం వంటి అనేక చర్యల వల్ల కోవిడ్ టీకా ఏడాది లోపే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తయారీ సవాలు! ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ టీకా మానవ ప్రయోగాల్లో మూడోదశలోనే ఉన్నప్పటికీ భారత్‌లో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వీటి తయారీకి ప్రయత్నిస్తోంది. మానవ ప్రయోగ ఫలితాలు మొత్తం అందుబాటులోకి వచ్చేవరకూ వేచి చూడరాదని, శాస్త్రవేత్తలు, నియంత్రణ సంస్థలు పరిశ్రమలు పరస్పర సహకారం తో ముందుకు సాగితేనే సకాలంలో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని కొంతమంది నిపుణుల అభిప్రాయం. భారత్ లాంటి దేశాలకు మాత్రమే టీకాలను భారీ స్థాయిలో తయారు చేయగల సామర్థ్యం ఉందని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ అభిప్రాయపడటం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. తయారీ విషయం ఇలా ఉంటే ప్రపంచం నలుమూలలకు టీకాను పంపిణీ చేయడం ఇంకో సవాలుగా నిలుస్తుంది. వ్యాక్సీన్ తయారీదారుల సమాఖ్య (గావి) ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పలు దేశాల్లోని కంపెనీలతో కలిసి కరోనా టీకా అన్నిచోట్ల ఏకకాలంలో తయారయ్యేలా చూసేందుకు ప్రయత్నిస్తోంది. యూపీఎస్ వంటి కొరియర్ సంస్థల సాయంతో వ్యాక్సీన్ అందరికీ అందేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అవసరమైతే డ్రోన్ల సాయంతోనూ టీకా పంపిణీ చేపడతామని గావి చెబుతూండటం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవ్యాక్స్ పేరుతో ఏర్పాటు చేసిన ప్లాట్ఫార్మ్ పేద దేశాలకు టీకా అందించే ఏర్పాటు చేస్తోంది. కోవిడ్ నేర్పిన పాఠాలెన్నో... కోవిడ్–19 ప్రపంచానికి నేర్పిన పాఠాలు ఎన్నో. అత్యవసర పరిస్థితులను అధిగమించేందుకు పరస్పర సహకారం ఒక్కటే మార్గం అన్నది ఇందులో ఒకటి. దశాబ్దాల సమయం పట్టే టీకా తయారీ ప్రక్రియను నెలల స్థాయికి కుదించగలగడం సహకారం వల్ల మాత్రమే సాధ్యమైందని ఇప్పటికే పలువురు నిపుణులు ప్రకటించారు కూడా. కరోనా తర్వాత కూడా ఈ సహకారం వైద్యపరిశోధనలను కొత్త పుంతలు తొక్కిస్తుందని, వ్యాధుల నుంచి రక్షించే టీకా అభివృద్ధి ప్రక్రియలో సమూలమైన మార్పులకు కారణమవుతుందని అంచనా. నిన్న మొన్నటివరకూ నిర్వీర్యమైన, లేదా బలహీన పరిచిన వైరస్ల ఆధారంగానే కొత్త టీకాలు తయారవుతూండగా.. కోవిడ్ –19 పుణ్యమా అని ఇకపై జన్యు ఆధారిత టీకా తయారీ ఊపందుకునే అవకాశం ఏర్పడింది. డీఎన్ఏ, ఎంఆర్ఎన్ఏలతో తయారయ్యే టీకాలతో దుష్పభ్రావాలు తక్కువన్నది తెలిసిందే. అంతేకాదు.. టీకా తయారీ చాలా వేగంగా జరిగిపోతుంది. ఖర్చు కూడా తక్కువే. తయారీ వేగమూ ఎక్కువే కావడం గమనార్హం. టీకా కహానీ ! ప్రపంచ ఆరోగ్య రంగాన్ని మలుపు తిప్పిన కొన్ని పరిణామాల్లో టీకాలు ఒకటన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆటలమ్మ మొదలుకొని కోరింత దగ్గు, పోలియో వంటి అనేక ప్రాణాంక వ్యాధులకు చెక్ పెట్టేందుకు, నవజాత శిశు మరణాలను తగ్గించేందుకూ ఈ టీకాలే కీలకమయ్యాయి. 1796లో ఎడ్వర్డ్ జెన్నర్ స్మాల్‌పాక్స్ వ్యాక్సిన్‌ను తయారు చేశారని చరిత్ర చెబుతోంది. అంతకంటే ముందు ఇదే వ్యాధి చికిత్స కోసమని చైనాలో ఓ వింత పద్ధతిని అనుసరించారు. స్మాల్‌పాక్స్ పొక్కులను పొడిచేసి ముక్కుల్లోకి చొప్పించే ఈ పద్ధతిని వైరొలేషన్ అని పిలిచేవారు. పశువుల కాపరులకు స్మాల్‌పాక్స్ సోకకపోవడాన్ని గుర్తించిన జెన్నర్ ఆవుల్లోని వైరస్ ఆధారంగా టీకాను సిద్ధం చేశారు. పాలమ్మాయి చేతులపై ఉన్న గాయాల నుంచి కొంత రసిని సేకరించి ఎనిమిదేళ్ల బాధితుడి చేతిపై చేసిన గాటులోకి వేయడం తొలి టీకా అయ్యింది. ఆరు వారాల తరువాత ఆ అబ్బాయికి స్మాల్‌పాక్స్ వైరస్ ఎక్కించినా వ్యాధి సోకలేదు. ఆవుతో సంబంధం ఉన్న కారణంగా లాటిన్ భాషలో ఆవును వాకా అని పిలుస్తారు కాబట్టి టీకా వేయడమే ప్రక్రియకు వ్యాక్సినేషన్ అన్న పేరు వచ్చింది. 1885లో లూయిస్ పాశ్చర్ ర్యాబిస్ వ్యాధికి టీకా అభివృద్ధి చేయడంతో ఆధునిక ప్రపంచంలో టీకాల వాడకం ఊపందుకుందని చెప్పుకోవచ్చు. 1914లో వూఫింగ్ కాఫ్‌కు టీకా తయారైన తరువాత 1969 నాటికల్లా ఎనిమిది టీకాల అభివృద్ధికి దారితీసింది. టీకా ఎన్నిరకాలు.. బ్యాక్టీరియా, వైరస్, వంటి సూక్ష్మజీవుల నుంచి రక్షణకు ఉపయోగపడే టీకాలను స్థూలంగా నాలుగు రకాలు. డీఎన్ఏ, ఆర్ఎన్ఏ ఆధారంగా సిద్ధమయ్యేవి తొలి రకం. సూక్ష్మజీవి సాయంతో జన్యుపదార్థాన్ని పంపించి రోగ నిరోధక వ్యవస్థ స్పందించేలా చేసేది రెండో రకం. కరోనా వైరస్ ప్రొటీన్లను ఉత్పత్తి చేసి వాటి ఆధారంగా మన రోగ నిరోధక వ్యవస్థ... హానికారక వైరస్‌లను గుర్తించేలా చేయడం మూడో రకం. నిర్వీర్యం చేసిన లేదా బలహీనపరిచిన వైరస్ల ఆధారంగా తయారయ్యేవి నాలుగో రకం. భారత్‌కు చెందిన జైడస్ క్యాడిల్లా డీఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ ఆధారిత టీకాలు తయారు చేస్తోంది. రష్యా తయారు చేసిన స్పుత్నిక్ –వీ రెండు అడినోవైరస్‌ల సాయంతో టీకాను అభివృద్ధి చేసింది. చైనా కంపెనీ అన్హుయి ఝీఫే లాంగ్‌కామ్, నోవావ్యాక్స్ (అమెరికా), మెడికాగో (కెనడా)లు ప్రొటీన్ ఆధారిత టీకా తయారీ ప్రయత్నాల్లో ఉన్నాయి. మెడికాగో, కెంటకీ బయోప్రాసెసింగ్ కంపెనీలు పొగాకు ఆధారంగా టీకాను అభివృద్ధి చేస్తూండటం విశేషం. నిర్వీర్యం చేసిన వైరస్‌తో అభివృద్ధి చేసిన టీకాపై సైనోవ్యాక్ బయోటెక్ బ్రెజిల్, ఇండొనేసియాల్లో మూడోదశ ప్రయోగాలు జరుపుతోంది. ఐసీఎంఆర్/భారత్ బయోటెక్, మెర్క్ (అమెరికా) లు కూడా నిర్వీర్యమైన వైరస్ల సాయంతో కరోనా కట్టడికి టీకాను తయారు చేసే ప్రయత్నాల్లో ఉన్నాయి. టీకా పరీక్షలు.. దశలు... ప్రీ క్లినికల్ కణాలు, ఎలుకలు, కోతుల్లాంటి జంతువులపై టీకా ప్రయోగిస్తారు. ఇప్పటివరకూ సుమారు 142 టీకాలు ఈ దశలో ఉన్నాయి. తొలి దశ ఎంపిక చేసిన కొంతమందికి టీకా ఇస్తారు. మోతాదు, దువాలు, రోగ నిరోధక వ్యవస్థ స్పందనలను పరిశీలిస్తారు. ప్రస్తుతం 27 టీకాలు ఈ దశను దాటాయి. ఒకట్రెండేళ్లు పట్టే తొలిదశ ప్రయోగాలను కోవిడ్ కోసం మూడు నెలలకు కుదించారు. రెండో దశ వందల మందికి టీకాలు ఇస్తారు. పిల్లలు, వయోవృద్ధులు ఇతరులందరినీ గుంపులుగా విడదీసి ప్రయోగాలు జరుగుతాయి. ఏ గుంపులోనైనా టీకా భిన్నంగా వ్యవహరిస్తోందా? అన్నది గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుంది. సురక్షితమేనా? రోగ నిరోధక వ్యవస్థ స్పందిస్తోందా?... లాంటి అంశాలను ధ్రువీకరించుకునేందుకూ ఈ దశ ఉపయుక్తం. సుమారు 15 టీకాలు రెండో దశ ప్రయోగాలు జరుపుకుంటున్నాయి. రెండు నుంచి మూడేళ్లు పట్టే రెండో దశ ప్రయోగాలు ఎనిమిది నెలల్లో పూర్తి చేశారు. మూడో దశ వేర్వేరు ప్రాంతాల్లో ఉండే కొన్ని వేల మందిని ఎంపిక చేసి టీకాలు ఇస్తారు. టీకా తీసుకున్న వారిలో కనీసం 50 శాతం మందికి రక్షణ లభిస్తే ఈ దశ విజయవంతమైనట్లుగా పరిగణిస్తారు. పదకొండు టీకాలు ప్రస్తుతం ఈ దశలో ఉన్నాయి. సాధారణంగా 2 – 4 ఏళ్లు పడుతుంది. కోవిడ్ విషయంలో ఈ సమయాన్ని కొన్ని నెలలకు కుదించారు. పరిమిత అనుమతులు మూడో దశ ఫలితాల కోసం వేచి చూడకుండానే టీకా వాడకానికి పచ్చజెండా ఊపడం పరిమితమైన అనుమతి కింద పరిగణించాలి. ప్రస్తుతం చైనా, రష్యాలతోపాటు దాదాపు 5 టీకాలకు ఈ అనుమతి లభించింది. ఫలితాల సమగ్ర సమీక్ష లేకుండానే టీకాను ఉపయోగించడం ప్రమాదకరమని నిపుణుల అభిప్రాయం. కోవిడ్ కోసం ఒకట్రెండేళ్లు పట్టే ఈ సమయాన్ని నెలల్లోనే పూర్తి చేస్తున్నారు. అనుమతులు ఆయా దేశాల్లోని నియంత్రణ సంస్థలు ప్రయోగాల వివరాలను పూర్తిగా విశ్లేషించి టీకా వాడకంపై నిర్ణయం తీసుకుంటాయి. టీకా వాడకానికి లైసెన్స్ ఇచ్చిన తరువాత తీసుకున్న వారిని దీర్ఘకాలంపాటు పరిశీలిస్తూంటారు. ప్రయోగ దశలు కలిపేయడం అత్యవసర పరిస్థితుల్లో టీకా ప్రయోగాల్లోని వేర్వేరు దశలను కలిపి నిర్వహించేందుకూ అవకాశం ఉంటుంది. కరోనా వైరస్ విషయాన్నే తీసుకుంటే కొన్ని కంపెనీలు తొలి రెండు దశలను కలిపి చేపడుతూంటే మరికొన్ని రెండు, మూడో దశలను కలిపేసి నిర్వహిస్తున్నాయి. టీకాలు సురక్షితమేనా? ఇప్పటివరకూ కొన్ని కోట్ల మంది టీకాలు వేయించుకుంటే.. తీవ్రమైన దుష్ప్రభావాలు కనిపించింది అతి తక్కువ మందిలోనే. టీకాలతో దుష్ప్రభావాలు ఉంటాయా? జ్వరం, చేతినొప్పి వంటి తాత్కాలిక దుష్ప్రభావాలు మాత్రమే. ప్రమాదకరమైన ప్రభావాలూ చాలా అరుదు. కోవిడ్ –19 టీకా ప్రయోగాల్లో పాల్గొనేందుకు ఏం చేయాలి? ప్రయోగాలు నిర్వహిస్తున్న ఆసుపత్రి లేదా టీకా తయారు చేస్తున్న కంపెనీని సంప్రదించడమే. ఆరోగ్య పరీక్షల తరువాత టీకా ఇవ్వాలా వద్దా అన్నది నిర్ణయిస్తారు. టీకా తయారీ, ప్రయోగాల ఖర్చులు భరించేదెవరు? టీకా తయారు చేస్తున్న కంపెనీ. కోవిడ్ కోసం కోవాగ్జిన్ పేరుతో టీకాను అభివృద్ధి చేస్తున్న భారత్ బయోటెక్ ప్రయోగాల్లో పాల్గొనే వారందరికీ జీవిత బీమా సౌకర్యం కూడా కల్పిస్తోంది. ఎవరు పాల్గొనవచ్చు? టీకాను బట్టి అర్హత ప్రమాణాలు మారుతూంటాయి. టీకా ఎన్నిసార్లు వేసుకోవాలి? టీకాను బట్టి ఉంటుంది. కొన్ని ఒకట్రెండేళ్లు రక్షణ కల్పిస్తాయి. కరోనా వైరస్ జన్యుక్రమ మార్పులు టీకాపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ప్రపంచవ్యాప్తంగా సుమారు 15 రకాల వైరస్లు వ్యాప్తిలో ఉన్నట్లు అంచనా. కోవిడ్ టీకాలపై జన్యుమార్పుల ప్రభావం దాదాపు లేనట్లే. కోవిడ్ టీకా ముందుగా ఎవరికి? ఆయా దేశాల్లోని నియంత్రణ సంస్థలదే తుది నిర్ణయం. వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులతోపాటు వ్యాధి కారణం గా మరణించే అవకాశాలు ఉన్న వారికి ప్రాధాన్యం లభిస్తుంది. టీకా వేసుకున్న తరువాత కూడా వ్యాధి సోకే అవకాశం ఉందా? టీకా తయారైన విధానం ఆధారంగా కొంతమందికి వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. బలహీన పరచిన వైరస్‌తో తయారైన టీకా కేన్సర్ రోగుల్లో వ్యాధి కలుగ చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. – గిళియార్ గోపాలకృష్ణ మయ్యా -
షరతులతో సీరంకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్‌ను తిరిగి ప్రారంభించడానికి సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు అనుమతి లభించింది. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఆక్స్ఫర్డ్ కోవిడ్-19 వ్యాక్సిన్ పరీక్షలకు అనుమతినిచ్చింది. అయితే ఈ సమయంలో ప్రోటోకాల్ ప్రకారం అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎప్పటికపుడు సంబంధిత సమాచారాన్ని కచ్చితంగా అందించాలని స్పష్టం చేసింది. రోజుకు 90 వేలకు పైగా కేసులతో కరోనా ఉధృతి కొనసాగుతున్న తరుణంలో ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వాక్సిన్ ప్రయోగాలు తిరిగి మొదలు కావడం కాస్త ఊరటనిచ్చే అంశం. (కరోనా భారత్: 50 లక్షలు దాటిన కేసులు) ఇటీవల ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా క్లినికల్ ట్రయల్స్‌ను బిట్రన్‌లో నిలిపివేసిన నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వ్యాక్సిన్ రెండు, మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ నిలిపి వేయాలని డీసీజీఐ ఈ నెల 11న సీరంను ఆదేశించింది. విదేశాల్లో అనుమతి లభించిన నేపథ్యంలో తాజా అనుమతిని డా.వి.జి.సొమానీ మంగళవారం మంజూరు చేశారు. అయితే అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సీరం ఇన్స్టిట్యూట్కు సూచించారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైతే వినియోగించాల్సిన మందుల జాబితాతో పాటు ఇతర చికిత్సా వివరాలను తమకు సమర్పించాలని ఆదేశించారు. (ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పరీక్షలు మళ్లీ షురూ!) కాగా బ్రిటిష్-స్వీడిష్ కంపెనీ ఆస్ట్రాజెనికా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా కోవిడ్ వాక్సిన్ను అభివృద్ధి చేసింది. దేశీయంగా ఆ వాక్సిన్ ఉత్పత్తికి పుణేకు చెందిన సీరం ఒప్పందం చేసుకుంది. మూడవ దశ ఫలితాల్లో సమస్యల కారణంగా ఇండియా సహా, బిట్రన్‌లో వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేసింది. ఇటీవల బ్రిటన్ మెడిసిన్ హెల్త్ రెగ్యులేటరీ అధారిటీ అనుమతి లభించడంతో ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌ను మళ్లీ ప్రారంభించిన సంగతి తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌లోనూ రెండు, మూడో దశ ప్రయోగాలకు డీసీజీఐ అనుమతినిచ్చింది. -
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పరీక్షలు మళ్లీ షురూ!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ పరీక్షలు నిలిపివేశామంటూ ఉసూరుమనిపించిన బ్రిటన్‌కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మళ్లీ శుభవార్త చెప్పింది. మెడిసిన్స్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ (ఎంహెచ్‌ఆర్‌ఎ) ధృవీకరించిన తరువాత యునైటెడ్ కింగ్డమ్లో ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ కరోనావైరస్ వ్యాక్సిన్ ట్రయల్‌ను తిరిగి ప్రారంభించినట్లు బ్రిటిష్-స్వీడిష్ సంస్థ ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. డేటాను స్వతంత్రంగా సమీక్షించిన తరువాత ట్రయల్స్ తిరిగి ప్రారంభించాలని యూకే రెగ్యులేటరీ అథారిటీ సిఫారసు చేసినట్లు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. (ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌కు భారత్‌లో బ్రేక్) ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ సందర్భంగా ఒక వాలంటీర్ అనారోగ్యానికి గురికావడంతో తాత్కాలికంగా ప్రయోగాలకు విరామం ఇచ్చినట్టు ప్రకటించింది. దీనిపై తమకు సమాచారం అందించలేదనీ, భద్రతా కారణాల రీత్యా పరీక్షలు నిలిపివేసి వివరణ ఇవ్వాలంటూ పూణేకు చెందిన అతిపెద్ద టీకా తయారీ సంస్థ సీరంకు డ్రగ్ కంట్రోలర్స్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) షోకాజ్ నోటీసులిచ్చింది. దీంతో మనదేశంలో ప్రయోగాలకు డీసీజీఐ అనుమతి పొందిన సీరం కూడా ఇండియాలో పరీక్షలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. (వ్యాక్సిన్ అభివృద్ధిలో తొందర పనికిరాదు) -
ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌కు భారత్‌లో బ్రేక్
న్యూఢిల్లీ: బ్రిటన్‌కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించిన కోవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాలు మన దేశంలోనూ ఆగాయి. ఈ ప్రయోగాలను నిర్వహిస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆస్ట్రాజెనెకా తిరిగి ప్రయోగాలు చేపట్టేవరకు తామూ నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. పరిస్థితుల్ని సమీక్షించడానికి ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామంటూ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కోవిడ్ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాల్లో ఉండగా టీకా డోసు ఇచ్చిన ఒక వాలంటీర్‌కి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ప్రయోగాలను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్టుగా వెల్లడించిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని తేలేవరకూ భారత్‌లో రెండు, మూడో దశలకు ఇచ్చిన అనుమతుల్ని ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలంటూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) డాక్టర్ వి.జి. సొమానీ సీరమ్ ఇన్స్టిట్యూట్కి షోకాజ్ నోటీసులు పంపింది. ఆ నోటీసులు అందుకున్న తర్వాతే ప్రయోగాలను నిలిపివేస్తున్నట్టుగా సీరమ్ వెల్లడించింది. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ప్రయోగాలకు బ్రేక్ పడినప్పటికీ ముందుగా అనుకున్నట్టుగానే ఈ ఏడాది చివరికి టీకాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆస్ట్రాజెనెకా సీఈఓ పాస్కాల్ సోరియెట్ చెప్పారు. టీకా భద్రతపై సమీక్షను వేగవంతంగా పూర్తి చేసి ఈ ఏడాది చివరికి, లేదంటే వచ్చే ఏడాది మొదట్లో వ్యాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. కరోనాకు చైనా నాజల్ స్ప్రే వ్యాక్సిన్ బీజింగ్: కరోనాను నిలువరించడానికి నాజల్ స్ప్రే వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కి చైనా అనుమతించింది. తొలి దశ క్లినికల్ ట్రయల్ నవంబర్‌లో ప్రారంభం కావొచ్చని చైనా తెలిపింది. చైనాకి చెందిన నేషనల్ మెడికల్ ప్రొడక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ ఈ తరహా వ్యాక్సిన్‌ని ఆమోదించడం ఇదే తొలిసారి. -
ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఆగిందా?
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ మహమ్మారి నుంచి రక్షిస్తుందని అందరూ నమ్ముతున్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ ప్రయోగాలకు తాత్కాలిక బ్రేక్ పడింది. వ్యాక్సిన్ ప్రయోగాల్లో పాల్గొన్న ఒక వ్యక్తి ఆరోగ్యం క్షీణించడం ఇందుకు కారణమైంది. బ్రిటన్‌లోని ఆరోగ్య వెబ్సైట్ స్టాట్‌న్యూస్ ప్రయోగాలు నిలిపివేస్తున్న సమాచారాన్ని ప్రకటించింది. ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా, పుణే కేంద్రంగా పనిచేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలు జరిపిన ప్రయోగాలూ ఆగిపోతాయా? ఆ పరిస్థితి వచ్చే అవకాశాలు తక్కువ అని స్పష్టం చేస్తున్నారు నిపుణులు. ఆక్స్ఫర్డ్ వర్సిటీ, ఆస్ట్రాజెనెకాలు అభివృద్ధి చేస్తున్న ఈ టీకా తొలి రెండు దశల మానవ ప్రయోగాలు పూర్తయ్యాయి. అమెరికా, యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికాల్లో కనీసం 30 వేల మందిపై మూడో దశ ప్రయోగాలు మొదలయ్యాయి. వేల మందిపై జరిగే ఈ మూడో దశ ప్రయోగాలు ఏళ్లపాటు కొనసాగుతాయి. ఈ క్రమంలో ఒకరిద్దరు జబ్బుపడటం అసాధారణంకాదని హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీకి చెందిన శాస్త్రవేత్త చెప్పారు. ఆస్ట్రాజెనెకా ఏం చెబుతోంది? స్వతంత్ర సంస్థ ఒకటి ప్రయోగాలకు సంబంధించిన సమాచారం మొత్తాన్ని సమీక్షించనుందని, ఆ తరువాతే ప్రయోగాల కొనసాగింపుపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఆస్ట్రాజెనెకా చెప్పినట్లు వార్తాలొచ్చాయి. గతంలోనూ ఒకసారి ఈ టీకా ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేశామని, టీకా వేసిన వ్యక్తి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరి సమస్యకు కారణం వెంటనే తెలియని పక్షంలో ముందు జాగ్రత్త చర్యగా ప్రయోగాలు నిలిపివేస్తారని ఆరోగ్యవార్తలను మాత్రమే ప్రచురించే స్టాట్‌న్యూస్ తెలిపింది. అన్నీ సవ్యంగా సాగితే కొన్ని రోజుల వ్యవధిలోనే ప్రయోగాలను పునరుద్దరిస్తారని వివరించింది. భారత్‌లో సాఫీగా ఆక్స్ఫర్డ్ రెండోదశ ప్రయోగాల్లో భారత్‌లో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదని సీరమ్ ఇనిస్టిట్యూట్ తెలిపింది. రెండోదశలో 100 మంది వలంటీర్లపై టీకాను ప్రయోగించామని, కీలకంగా భావించే ఏడురోజుల సమయం దాటినా ఎవరిలోనూ సైడ్ఎఫెక్ట్స్ కనిపించలేదంది. సీరమ్ ఇనిస్టిట్యూట్ 100 కోట్ల ఆక్స్ఫర్డ్ టీకాలను ఉత్పత్తి చేయడానికి అస్ట్రాజెనెకాతో ఒప్పందం చేసుకుంది. సీరమ్‌కు నోటీసు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌పై విదేశాల్లో ప్రయోగాలు నిలిపివేసిన సమాచారాన్ని తమకు ఇవ్వనందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) సీరమ్ ఇన్స్టిట్యూట్కు బుధవారం షోకాజ్ నోటీసు జారీచేసింది. వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమేనని నిరూపణ అయ్యేంతవరకు రెండు, మూడో దశల కోసం సీరమ్‌కు ఇచ్చిన అనుమతులను ఎందుకు సస్పెండ్ చేయకూడదో తెలపాలని కోరింది. షోకాజ్‌కు వెంటనే బదులివ్వాలని, లేని పక్షంలో సీరమ్ వద్ద వివరణ ఇవ్వడానికేమీ లేదని భావించి తదుపరి చర్యలు తీసుకుంటామని డీజీసీఏ డాక్టర్ వి.జి.సొమానీ స్పష్టం చేశారు. ప్లాస్మా.. పని చేయట్లేదు వెల్లడించిన ఐసీఎంఆర్ న్యూఢిల్లీ: కోవిడ్ వైద్యంలో భాగంగాచేసే ప్లాస్మా చికిత్స పెద్దగా ప్రభావం చూపలేదని భారతీయ వైద్య పరిశోధనా సంస్థ (ఐసీఎంఆర్) బుధవారం స్పష్టంచేసింది. మరణాల రేటును తగ్గించడంలో గానీ, కోవిడ్ తీవ్రతను తగ్గించడంలోగానీ ప్లాస్మా ప్రభావం చూపలేకపోయిందంది. ఏప్రిల్ 22 నుంచి జూలై 14 మధ్య 39 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపెన్ లేబెల్ పారలెల్ ఆర్మ్ ఫేజ్ 2 మల్టీ సెంటర్ రాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్(ప్లాసిడ్ ట్రయల్) పేరుతో జరిపిన పరీక్షల్లో ఈ వివరాలు వెల్లడైనట్లు తెలిపింది. ఈ పరిశోధనలో భాగంగా వైద్య నిపుణులు.. 464 మంది కోవిడ్ రోగులను ఎన్నుకొని, వారిలో 235 మందికి ప్లాస్మాను ఎక్కించారు. మరో 229 మందికి సాధారణ చికిత్స చేశారు. పరీక్షలో పాల్గొన్న వారికి 24 గంటలకు ఒక్కొక్కటి చొప్పున రెండు డోసుల ప్లాస్మా ఇచ్చినట్లు తెలిపింది. ప్రతి డోసులో 200 మిల్లీలీటర్ల ప్లాస్మా ఇచ్చినట్లు పేర్కొంది. పేషెంట్ల ఎన్రోల్, డేటా కలెక్షన్ వంటి విషయాల్లో ఐసీఎంఆర్ కలుగజేసుకోలేదని, అయితే పరీక్షల డిజైన్, స్టడీ కోఆర్డినేషన్, డేటా అనలైజేషన్ వంటి విషయాలను పరిశీలించిందని చెప్పింది. ప్లాస్మా ఇచ్చిన నాటి నుంచి 28 రోజుల వరకు వారిని పరీక్షించగా, రెండు గ్రూపుల మధ్య పెద్ద తేడాలేమీ లేవని గుర్తించినట్లు చెప్పారు. మరణాల రేటు కూడా పెద్దగా మారలేదని తెలిపారు. కోవిడ్ 19 కోసం ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్‌ఫోర్స్ ఈ పరిశోధనను పరిశీలించి ఆమోదించిందని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ప్లాస్మా థెరపీ ప్రయోగించడం సురక్షితమే అయినప్పటికీ ప్లాస్మాను నిల్వ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దేశంలో కేవలం కొన్ని సంస్థల్లోనే ఈ తరహా సదుపాయం ఉంది. దీనిపై చైనా, నెదర్లాండ్ లు కూడా పరిశోధనలు చేశాయి. అయితే రెండు దేశాలూ ఆయా పరిశోధనలను మధ్యలోనే ఆపేశాయి. ప్లాస్మా థెరపీని కోవిడ్ ఓ మోస్తరు స్థాయిలో ఉన్న వారిపైనే, పరిశోధనా పూర్వకంగా ప్రయోగించాలని కేంద్ర ఆరోగ్య శాఖ గతంలో తెలిపింది. 43లక్షలు దాటిన కేసులు న్యూఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి ఆగడం లేదు. ఇటీవల రోజుకు 90 వేలకు పైగా కేసులు బయట పడగా, తాజాగా గత 24 గంటల్లో 89,706 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 43,70,128 కు చేరుకుంది. గత 24 గంటల్లో 74,894 మంది కోలుకోగా.. 1,115 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 73,890 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 33,98,844 కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 8,97,394 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 20.53 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. శనివారానికి ఇది 77.77 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.69 శాతానికి పడిపోయిందని తెలిపింది. మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్ణాటకలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్రాలు సమన్వయంతో పని చేస్తుండటంతో కరోనాను కట్టడి చేయగలుగుతున్నామని, టెస్ట్, ట్రాక్, ట్రీట్ అనే త్రిముఖ వ్యూహంతో ముందుకెళుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో మొత్తం 1,678 ల్యాబుల్లో కరోనా నిర్థారణ పరీక్షలు చేస్తున్నారు. ప్రతి మిలియన్ మందికి 37,539 పరీక్షలు చేసినట్లు కేంద్రం తెలిపింది. -
‘ఆస్ట్రాజెనెకా’ ట్రయల్స్ నిలిపివేతపై సీరం స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో రూపొందుతున్న ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ చివరి దశ పరీక్షలను నిలిపివేస్తున్నట్టు వచ్చిన వార్తలపై ఫార్మా దిగ్గజం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్పందించింది. ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనెకా రూపొందించిన కోవిడ్-19 వ్యాక్సిన్ ట్రయిల్స్ భారత్‌లో నిలిపి వేయలేదని వివరించింది. పరీక్షలు కొనసాగుతున్నాయనీ ఎలాంటి సమస్యలు ఎదురు కాలేదని సీరం స్పష్టం చేసింది. కరోనా వైరస్ ఆస్ట్రాజెనెకా టీకా పరీక్షలకు సంబంధించి యూకేలో ట్రయల్స్‌ను నిలిపివేస్తున్నట్లు వచ్చిన నివేదికలపై వ్యాఖ్యానించేందుకు సీరం నిరాకరించింది. ప్రస్తుతానికి బ్రిటన్‌లో పరీక్షలను నిలిపివేసినా.. త్వరలోనే పునఃప్రారంభమవుతాయని ఆశిస్తున్నట్టు తెలిపింది. అయితే భారత విషయానికి వస్తే ట్రయల్స్‌కు ఎలాంటి ఆటంకం లేదని పేర్కొంది. కాగా ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా బ్రిటన్‌లో ఈ టీకా తీసుకున్న వలంటీర్లకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో తుది దశ ట్రయల్స్‌ను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ఆస్ట్రాజెనెకా అధికారికంగా ప్రకటించింది. ప్రయోగ ప్రామాణిక ప్రక్రియ, వ్యాక్సిన్ భద్రతపై పూర్తిస్థాయి సమీక్ష కోసం ఈమేరకు నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. దీంతో పలు దేశాల్లో జరుగుతున్న ఈ వ్యాక్సిన్ ప్రయోగం నిలిచిపోయింది. కరోనా వ్యాక్సిన్ రేసులో ఆక్స్ఫర్డ్ టీకా ముందువరుసలో ఉంది. ఈ టీకాకు సంబంధించి మనదేశంలో ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రయోగాలకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)కు డీసీజీఐ అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. We (Serum Institute of India) can't comment on reports of AstraZeneca pausing the trials in the UK, other than that they have been paused for review and shall restart soon. The Indian trials are continuing and we have faced no issues at all.#SII #COVID19 #Latestnews pic.twitter.com/HWPUrQydWc — SerumInstituteIndia (@SerumInstIndia) September 9, 2020 -
షాకిచ్చిన ఆస్ట్రాజెనెకా.. క్లినికల్ ట్రయల్స్‌కి బ్రేక్
లండన్: కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రపంచ దేశాలన్ని తీవ్రంగా కృషి చేస్తున్నాయి. వైరస్ భరతం పట్టే వ్యాక్సిన్ కోసం దేశాలన్ని ప్రయోగాలను ముమ్మరం చేశాయి. ఇప్పటికే రష్యా స్పూత్నిక్ వి అనే వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మిశ్రమ స్పందన వెలువడింది. ఇక ప్రపంచ దేశాలన్ని ఆస్ట్రాజెనెకా సంస్థతో కలిసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్ మీదనే ఆశలు పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో షాకింగ్ న్యూస్ వెలుగు చూసింది. తుది దశ ప్రయోగాలలో ఉన్న ఈ వ్యాక్సిన్‌ను తీసుకున్న ఓ వాలంటీర్‌కు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. పలు దేశాలలో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌ని ప్రయోగిస్తుండగా.. బ్రిటన్‌లో కరోనా ఆస్ట్రాజెనెకా టీకాను తీసుకున్న ఓ వాలంటీర్ తీవ్ర అస్వస్థతకు గురవుతున్నాడని గుర్తించారు. దాంతో క్లినికల్ ట్రయల్స్‌ని తాత్కలింగా నిలిపి వేశారు. క్లినికల్ ట్రయల్స్ సందర్భంగా వచ్చిన కొన్ని ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవని తేలడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి చిన్నచిన్న సమస్యలు వస్తూనే ఉంటాయని, అలాంటి సందర్భాలలో పరీక్షలు నిలిపేయడం సహజమేనని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. (చదవండి: 66 రోజుల్లో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్?) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న దాదాపు డజనుకుపైగా వ్యాక్సిన్లలో ఆస్ట్రా జెనెకా-ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ అన్నింటిలోకి ప్రభావవంతమయ్యింది అన్న అంచనాలున్నాయి. ఇప్పటికే రెండు దశల ట్రయల్స్ పూర్తి చేసుకున్న ఈ వ్యాక్సిన్, మిగతావాటికంటే ముందుగా మార్కెట్లోకి రావడానికి అవకాశముందని అంతా భావిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. భారత్ సహా ఇంగ్లాండ్, అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాల్లో ఈ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. అమెరికాలో 62 ప్రాంతాల్లో ఈ వ్యాక్సిన్ ప్రయోగాలను చేపట్టారు. మూడోదశ ప్రయోగం విజయవంతమైతే.. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే ఆశ అందరిలోనూ వ్యక్తమవుతోంది. అంతేకాక ఒక బిలియన్ డోసుల వ్యాక్సిన్ కోసం ఆ సంస్థకు ఇప్పటికే ఆర్డర్లు కూడా అందాయి. ఈ పరిస్థితుల్లో.. ఆస్ట్రాజెనెకా తీసుకున్న నిర్ణయం ఓ విఘాతంలా మారింది. ఈ ట్రయల్స్‌ను మళ్లీ ఎప్పుడు పునరుద్ధరిస్తారనేది స్పష్టం చేయలేదు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే విషయాన్ని కూడా ఆ సంస్థ ధ్రువీకరించలేదు. (చదవండి: ఈ వారంలోనే కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ!) అయితే ప్రయోగాల సందర్భంగా దుష్ప్రభావాలు కనిపించాయని, అందుకే వెంటనే వాటిని నిలిపివేయాల్సి వచ్చిందని, వ్యాక్సిన్‌ను పునఃసమీక్షించాల్సిన అవసరం ఏర్పడిందని మాత్రమే సంస్థ పేర్కొన్నది. క్లినికల్ ట్రయల్స్‌ను అర్ధాంతరంగా నిలిపివేయడం కొత్తేమీ కాదు. అయితే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలపై ప్రభావాన్ని చూపే కోవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాలను నిలిపివేయడం చర్చనీయాంశమవుతోంది. ప్రయోగాలు పూర్తికాక ముందే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఏ మాత్రం లేనందున.. కరోనా వ్యాక్సిన్ పంపిణీలో మరింత జాప్యం చోటు చేసుకోవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. -
66 రోజుల్లో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్?
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను పెద్ద మొత్తంలో తయారు చేసేందుకు ఆస్ట్రాజెనెకా, భారత్‌లోని సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మధ్య ఒక ఒప్పందం కుదిరిన విషయం అందరికీ తెలిసిందే. కనీసం 100 కోట్ల డోసుల టీకా తయారీకి సీరమ్ ఇన్ స్టిట్యూట్ సిద్ధమవుతోంది కూడా. అంతేకాదు.. కచ్చితంగా ఇంకో 66 రోజుల్లో కోవిషీల్డ్ అందరికీ అందుబాటులోకి వస్తుందని, 130 కోట్ల భారతీయుల కోసం కనీసం 68 కోట్ల డోసులను వచ్చే ఏడాది జూన్ నాటికి సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. ఒకవైపు టీకా ప్రయోగాలు ఇంకా రెండో దశలోనే ఉండగా.. విస్తృత స్థాయిలో నిర్వహించాల్సిన మూడోదశను కూడా దాటుకుని 66 రోజుల్లో అందుబాటులోకి రావడం సాధ్యమేనా? జరుగుతున్న పరిణామాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే అసాధ్యమేమీ కాదన్న సమాధానం వస్తోంది. ఎందుకంటే సరిగ్గా వారం క్రితమే కోవిషీల్డ్ రెండవ/మూడవ దశ ప్రయోగాలు మొదలయ్యాయి. పుణేలోని ఓ ఆసుపత్రిలో ఏడుగురికి టీకా అందించారు. (చదవండి : 36 లక్షలు దాటిన టెస్టులు) టీకా అందుకున్న వారిలో ఓ గైనకాలజిస్టు కూడా ఉన్నారు. రానున్న రోజుల్లో మరింత మందికి రెండో దశలో భాగంగా టీకా ఇచ్చేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయి. టీకా తొలి డోసు అందుకున్న వారికి 29 రోజుల తరువాత రెండో దఫా టీకా ఇస్తారు. దేశం మొత్తమ్మీద 17 కేంద్రాల్లో 1,600 మందికి ఈ టీకా అందిస్తారు. ఇంకోలా చెప్పాలంటే 58 రోజుల్లో ప్రయోగాలన్నీ ముగించి.. మరో 15 రోజుల సమయంలో సమాచారాన్ని క్రోడీకరించాలన్నది సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆలోచన. ప్రయోగాల సమయంలో పాటించాల్సిన పద్ధతులు కొన్నింటినీ తగ్గించడం, వేగవంతం చేయడం, వాణిజ్య ఉత్పత్తి చేపట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే సీరమ్ ఇన్ స్టిట్యూట్‌కు ప్రత్యేక లైసెన్సు జారీ చేసింది. (చదవండి : వ్యాక్సిన్ రేస్.. అందరికీ టీకా.. ఎందాక?) ఈ లెక్కన చూస్తే 66 రోజులకు టీకా వాణిజ్యస్థాయి ఉత్పత్తి మొదలవుతుందని అంచనా. భారత ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఇటీవల మాట్లాడుతూ.. భారత్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లలో ఒకటి మూడో దశ మానవ ప్రయోగాలు జరుపుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం. సాధారణ పరిస్థితుల్లో మూడవ దశ టీకా ప్రయోగాలకు కనీసం ఏడెనిమిది నెలల సమయం అవసరం కాగా.. కోవిషీల్డ్ విషయంలో ఈ సమయాన్ని గణనీయంగా కుదించారన్నమాట. అయితే కోవిషీల్డ్ 66 రోజుల్లో అందుబాటులోకి వస్తుందన్న మీడియా వార్తలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని సీరమ్ ఇన్ స్టిట్యూట్ అంటోంది. టీకా అందుకున్న వారిలో ఏ రకమైన దుష్ఫలితాలు కనిపించకపోతే తొందరగా మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం లేకపోలేదన్నది నిపుణుల మాట. ప్రస్తుతానికైతే అలాంటి ప్రమాదమేమీ కనిపించకపోవడం అందరికీ ఊరటనిచ్చే అంశం. దేశ జనాభా 130 కోట్లలో కనీసం 68 కోట్ల డోసులు సీరమ్ ఇన్ స్టిట్యూట్ నుంచి సేకరించాలని, మిగిలినవి భారత్ బయోటెక్, జైడస్ కాడిల్లా ప్రయోగాలు విజయవంతమైతే వారి నుంచి సేకరించాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. -
రెండు నెలలు ఓపిక పట్టండి : సీరం సీఈఓ
సాక్షి,ముంబై: కరనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నతరుణంలో టీకా కోసం దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. మరోవైపు కోవిషీల్డ్ క్లినికల్ ట్రయల్స్ పై మధ్యంతర డేటాపై రిపోర్టు చేయొద్దంటూ ఫార్మా దిగ్గజం సీరం సంస్థ మీడియాను కోరింది. ఈ మేరకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనవల్లా ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. క్లినికల్ ట్రయల్స్ రెండు నెలల్లో ముగిసిన అనంతరం సంబంధిత డేటా మొత్తం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని అప్పటిదాకా ఓపిక పట్టాలని పూనవల్లా కోరారు. (చదవండి : కరోనా వ్యాక్సిన్ : సీరం గుడ్ న్యూస్ ) ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం-ఆస్ట్రాజెనెకా కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీకి సీరం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కోవిషీల్డ్ క్లినికల్ ట్రయల్స్ పై రోగుల గురించి పూర్తి డేటా రాకముందే ఎలాంటి నివేదికలను ఇవ్వొద్దంటూ కోరారు. ఈ ప్రక్రియను గౌరవించాలని, పక్క దారి పట్టించవద్దంటూ ఆయన ట్వీట్ చేశారు. పూర్తి సమాచారం కోసం రెండు నెలలు ఓపికగా ఉండాలని పేర్కొన్నారు. కాగా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి పొందిన అనంతరం కోవిడ్-19 వాక్సీన్ 3 వ దశ క్లినికల్ ట్రయల్స్ సీరం సంస్థ ప్రారంభించింది. I would kindly request the media to refrain, from reporting on interim data coming in about patients on the SII - Covishield clinical trials. Let us not bias the process. Let us respect the process and stay patient for two months, all the relevant data will be published soon. — Adar Poonawalla (@adarpoonawalla) August 27, 2020 -
కరోనా వ్యాక్సిన్ : సీరం గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న సమయంలో వ్యాక్సిన్ విషయంలో ఊరటనిచ్చే వార్త. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్ కు సంబంధించి దేశంలో 3వ దశ ట్రయల్స్ ఈ వారంలోనే ప్రారంభం కానున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ట్రయల్స్‌లో 1600 మందికి ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఇస్తామని హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి సమాచారం అందించింది. ఈ వ్యాక్సిన్ తయారీకి అనుమతి పొందిన పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్ ఆగస్టు 22న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం పలు ప్రాంతాలను ఎంపిక చేసింది. 20 కేంద్రాలలో ప్రారంభం కానున్న ఈ ట్రయల్స్ మొదటి రోజున వంద మందికి టీకాలు వేస్తారు. ముఖ్యంగా పూణే, మహారాష్ట్ర , అహ్మదాబాద్ ఢిల్లీ. ఎయిమ్స్ సహా, ముంబైలోని సేథ్ జి.ఎస్. మెడికల్ కాలేజ్, కేఇఎం హాస్పిటల్, టీఎన్ మెడికల్ కాలేజ్, చండీగఢ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కేంద్రాల్లో 3వ దశ పరీక్షలను నిర్వహించనున్నారు. కోవిడ్-19 హాట్స్పాట్లుగా ఉన్న ఐదు వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ దేశవ్యాప్తంగా 20 వేర్వేరు ప్రాంతాలు, ఆసుపత్రులనుఎంపిక చేశామని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఐసీఎంఆర్ భాగస్వామ్యంతో11-12 ఆసుపత్రులలో ట్రయల్స్ నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందులో పాల్గొనేవారు వ్రాతపూర్వక సమ్మతి ఇవాల్సి ఉంటుందని, అలాగే స్టడీ ప్రోటోకాల్ అవసరాలకు అనుగుణంగా వారు అధ్యయన ప్రాంతంలోనే నివసించాలని తెలిపింది. దీంతో కరోనా నివారణకు సంబంధించి భారతదేశంలో అందుబాటులోకి రానున్న తొలి వ్యాక్సిన్ కోవిషీల్డ్ కానుందనే అంచనా నెలకొంది. -
మనకు తొలి వ్యాక్సిన్ ఆస్ట్రాజెనెకా నుంచే!
ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న మహమ్మారి కోవిడ్-19కు చెక్ పెట్టేందుకు దేశీయంగా తొలి వ్యాక్సిన్ 2020 డిసెంబర్‌కల్లా అందుబాటులోకి రావచ్చని ఫార్మా వర్గాలు ఊహిస్తున్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్ ఇప్పటికే రెండు, మూడు దశల క్లినికల్ పరీక్షలలో ఉంది. ఈ వ్యాక్సిన్ తయారీకి దేశీయంగా సీరమ్ ఇన్స్టిట్యూట్ లైసెన్సింగ్‌ను పొందిన సంగతి తెలిసిందే. మరోవైపు దేశీ కంపెనీలలో భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా సైతం సొంత వ్యాక్సిన్ తయారీ సన్నాహాల్లో ఉన్నాయి. ఐసీఎంఆర్‌తో చేతులు కలపడం ద్వారా భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్ ప్రస్తుతం తొలి దశ క్లినికల్ పరీక్షలను పూర్తిచేసుకోనుంది. ఇదే విధంగా జైడస్ క్యాడిలా రూపొందిస్తున్న జైకోవ్-డి సైతం తొలి దశ పరీక్షలలో ఉన్నట్లు సంబంధివర్గాలు పేర్కొన్నాయి. (నిమ్స్‌లో క్లినికల్ ట్రయల్స్ 2వ ఫేజ్‌కు..) 1600 మందిపై దేశీయంగా ఆక్స్ఫర్డ్- ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై క్లినికల్ పరీక్షలకు అనుమతి పొందిన సీరమ్ ఇన్స్టిట్యూట్.. 1600 మందిపై వీటిని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపిక చేసిన 17 ప్రాంతాలలో 18ఏళ్లకుపైబడిన వారిపై 2-3 దశల ప్రయోగాలు చేపట్టినట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. ఈ వ్యాక్సిన్ తయారీకి భాగస్వామిగా ఒప్పందాన్ని కుదుర్చుకున్న సీరమ్.. నెలకు 10 కోట్ల డోసేజీలను అందించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దేశీయంగా రూపొందిస్తున్న కంపెనీలు సైతం వ్యాక్సిన్లను ఐదు ప్రాంతాలలో 1,000-1100 మందిపై ప్రయోగిస్తున్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. కాగా.. ఆక్స్ఫర్డ్- ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అభివృద్ధి, పంపిణీలకు వీలుగా ఇటీవలే బిల్, మిలిందా గేట్స్ ఫౌండేషన్ 15 కోట్ల డాలర్లు(రూ. 1125 కోట్లు) అందించడం గమనార్హం! -
18 లక్షల పైమాటే
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి ఉధృతి పెరుగుతూనే ఉంది. వరుసగా ఐదో రోజు 50 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసుల సంఖ్య చూస్తుండగానే 18 లక్షలు దాటేసింది. కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 11.86 లక్షలకు చేరింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 52,972 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఒక్కరోజులో 771 మంది బాధితులు కన్నుమూశారు. దేశంలో ఇప్పటిదాకా మొత్తం కేసులు 18,03,695కు, మరణాలు 38,135కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం తెలియజేసింది. ప్రస్తుతం 5,79,357 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. 11,86,203 మంది చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. కరోనా రికవరీ రేటు 65.77 శాతం, మరణాల రేటు 2.11 శాతంగా నమోదైంది. ఇలా ఉండగా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌పై రెండు, మూడో దశల హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహించేందుకు డీసీజీఐ అనుమతించింది. యడ్యూరప్ప కుమార్తెకు కరోనా: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప కుమార్తెల్లో ఒకరు కరోనా వైరస్ బారినపడ్డారు. యడ్యూరప్పకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ముందు జాగ్రత్త చర్యగా వారంపాటు హోం క్వారంటైన్లో ఉంటానని యడ్యూరప్ప తనయుడు విజయేంద్ర ట్వీట్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తనయుడు, ఎంపీ కార్తీ చిదంబరానికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. కేంద్ర ఐటీ శాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ హోం క్వారంటైన్లో ఉంటున్నట్లు ప్రకటించారు. -
కరోనా టీకాపై ఓ గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో ఊరటనిచ్చే ఒక శుభపరిణామం చోటు చేసుకుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిడ్-19 వాక్సిన్‌పై మనదేశంలో ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రయోగాలు చేసేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)కు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. లండన్‌లో జరిగిన హ్యూమన్ ట్రయల్స్‌లో ఇప్పటికే సత్ఫలితాలు రావడంతో తాజాగా ఈ వ్యాక్సిన్‌పై భారత్‌లోనూ ప్రయోగాలు చేయనున్నారు. కోవిషీల్డ్ గా పిలుస్తున్న ఈ వాక్సిన్‌పై ముంబై, పుణెలో క్లినికల్ ట్రయల్స్ త్వరలోనే నిర్వహించనున్నారు. సుమారు 5వేల మందితో భారత్‌లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. వ్యాక్సిన్ పరీక్షలకు సంబంధించిన డేటా, ఫలితాలు, ప్రోటోకాల్ పై నిపుణుల కమిటీ సంతృప్తి చెందిందని, వారి అభిప్రాయం ఆధారంగా డీసీజీఐ భారతదేశంలో పరీక్షలకు అనుమతి ఇచ్చిందని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ మేరకు వెంటనే టీకా ట్రయల్స్ ప్రారంభిస్తామని, త్వరలోనే పెద్ద పరిమాణంలో వ్యాక్సిన్ ఉత్పత్తి కూడా మొదలు పెడతామని ఎస్ఐఐ సీఈవో అదార్ పూనవల్లా ప్రకటించారు. కోవిషీల్డ్ పేరుతో రాబోయే ఈ వ్యాక్సిన్ ఉత్పత్తికి అతిపెద్ద టీకా తయారీ సంస్థ ఎస్ఐఐ, బయోఫార్మా మేజర్ ఆస్ట్రాజెనెకాతో భాగస్వామ్యం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ టీకాపై యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలో ట్రయల్స్ అధునాతన దశలో ఉన్నాయి. అధికారిక గణాంకాల దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 18 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా 38,135 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, బ్రెజిల్ తర్వాత కేసుల సంఖ్యలో భారత్ మూడోస్థానంలో ఉంది. -
కరోనా టీకా ట్రయల్స్ కు డీసీజీఐ అనుమతి
-
ఆక్స్ఫర్డ్ వర్సిటీ వ్యాక్సిన్.. సీరమ్‌కు అనుమతివ్వండి
న్యూఢిల్లీ: బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌పై మూడో దశ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు పుణేలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)కు అనుమతి ఇవ్వాలని కోవిడ్‌పై ఏర్పాటైన నిపుణుల కమిటీ శుక్రవారం డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు సిఫార్సు చేసింది. హ్యూమన్ ట్రయల్స్ అనుమతి కోరుతూ సీరమ్ సంస్థ గురువారం నిపుణుల కమిటీకి విజ్ఞప్తి చేసింది. అదనపు సమాచారం జోడి స్తూ సవరించిన ప్రతిపాదనలను అందజేసింది.సీరమ్ దరఖాస్తుపై నిపుణుల కమిటీ శుక్రవారం చర్చించింది. దేశవ్యాప్తంగా 17 ప్రాంతాల్లో 1,600 మందిపై ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌ను పరీక్షిస్తామని సీరమ్ కంపెనీ తెలిపింది. ఇందులో విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ కూడా ఉంది. -
చైనా గ్రీన్ సిగ్నల్: వ్యాక్సిన్ తయారీలో పోటీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టేసిన నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మొదలైన ప్రయోగాల్లో ప్రపంచ దేశాలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే చైనా శాస్త్రవేత్తలు ఆదివారం కీలక ప్రకటన చేశారు. తాము రూపొందించిన వ్యాక్సిన్ అన్ని ప్రయోగాల్లో విజయవంతమై.. విడుదలకు అనుమతి పొందిందని ప్రకటించారు. కరోనాకు విరుగుడుగా డ్రాగాన్ తయారు చేసిన కిన్సినో బయో వ్యాక్సిన్ లిమిటెడ్‌కు చైనా ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఆ దేశానికే చెందిన వూహన్, సినోవాక్ వ్యాక్సిన్లు మూడు దశల్లోనూ ప్రయోగాలను పూర్తిచేసుకున్నాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆశలు రేకెత్తించిన ఆక్స్‌ఫర్డ్‌తో చైనా కంపెనీలు పోటీపడుతున్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ ఇప్పటికే మూడు ఫేజ్లను పూర్తిచేసుకుని బహిరంగ మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తినెలకొంది. ఇక ఆస్ట్రేలియా సైతం కరోనా విరుగుడు తయారీలో దూసుకుపోతోంది. ఆ దేశ శాస్త్రవేత్తల కృషి ఫలితంగా మార్డోక్ వ్యాక్సిన్ ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలోనే బహిరంగ మార్కెట్లో విడుదల చేయడానికి ఆ దేశ వైద్య పరిశోధన మండలి అనుమతి కోసం ఎదురుచేస్తున్నారు. ఇక భారత్ బయోటెక్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న కోవాగ్జిన్ సైతం ప్రయోగాల్లో సత్ఫలిస్తోందని ఐసీఎంఆర్ ఇదివరకే ప్రకటించింది. అయితే మన దేశంలో తయారు చేసే వ్యాక్సిన్ రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా, చైనా, ఆస్ట్రేలియా దేశాలు తయారుచేసిన వ్యాక్సిన్‌పై భారత్ ఆధారపడక తప్పదని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లోకి వ్యాక్సిన్ వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున ఆర్డర్ ఇచ్చేందుకు భారత్‌కు చెందిన కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. అయితే అవి భారత్‌లో వ్యాపించిన కరోనా వైరస్‌ని చంపగలవా? దేశ ప్రజలపై అది ప్రభావం చూపుతుందా అనే సందేహం పలువురిలో వ్యక్తమవుతోంది. దీనిపై సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు లోతైన పరిశోధనలు జరిపారు. ప్రపంచ దేశాలకు ఎలాంటి కరోనా వైరస్ సోకిందో, భారత్‌లోనూ అదే వైరస్ వ్యాప్తి చెందిందని అందువల్ల ప్రపంచ దేశాలు వాడే వ్యాక్సిన్ భారతీయులూ వాడొచ్చని డైరెక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు. -
అక్టోబర్–నవంబర్‌లో టీకా
భువనేశ్వర్: కరోనా మహమ్మారిని నియంత్రించే వ్యాక్సిన్ ఈ ఏడాది అక్టోబర్ – నవంబర్‌కల్లా సిద్ధం కావచ్చని ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా బుధవారం తెలిపారు. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ, ఫార్మా కంపెనీ అస్ట్రాజెనెకాలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న టీకాను పెద్ద మొత్తంలో తయారు చేసేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఒక ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. కరోనా టీకా మూడవ దశ మానవ ప్రయోగాలు ఆగస్టులో మొదలవుతాయని, అన్నీ సవ్యంగా సాగితే ఆ తరువాత రెండు మూడు నెలల్లో టీకా అందరికీ అందుబాటులోకి వస్తుందని ఆదార్ బుధవారం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలిపారు. భారత్ బయోటెక్ సిద్ధం చేస్తున్న కరోనా వ్యాక్సీన్ మానవ ప్రయోగాలకు సంబంధించి ఒడిశా రాజధాని భవనేశ్వర్‌లో ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో ఈ ప్రయోగాలు జరగనున్నాయి. ప్రస్తుతం టీకా ప్రయోగాల కోసం కార్యకర్తలను ఎంపిక చేస్తున్నామని ఈ ప్రయోగాలకు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ఇ.వెంకట్ రావు తెలిపారు. -
ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్లు సగం మనకే
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న భారత ప్రజానీకానికి భారీ ఊరటనిచ్చే వార్త ఇది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ పరీక్షలు విజయవంతమయ్యాయని లాన్సెట్ జర్నల్ ప్రచురించిన నేపథ్యంలో తమ సంస్థ ఉత్పత్తి చేసే వ్యాక్సిన్ డోసుల్లో 50శాతం భారత్‌కు అందిస్తామని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా వెల్లడించారు. మంగళవారం ఆయన ఒక జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ వ్యాక్సిన్ డోసుల్లో సగం భారత్‌లో పంపిణీ చేసి, మిగిలినవి ఇతర దేశాలకు సరఫరా చేస్తామన్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో భాగస్వామిగా.. వ్యాక్సిన్ ట్రయల్స్ అన్నీ సాఫీగా సాగి ఫలితాలు సానుకూలంగా వస్తే టీకాల తయారీలో ఆక్స్ఫర్డ్ యూనివర్సీటీతో భాగస్వామిగా ఉంటామని అదార్ చెప్పారు. పుణే కేంద్రంగా పనిచేసే సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యాక్సిన్ల తయారీలో ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ మూడో దశ మానవ ప్రయోగాల అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని, అనుమతులు రాగానే ఆగస్టులో ప్రయోగాలు చేస్తామన్నారు. ఆ ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తే భారీగా వ్యాక్సిన్ డోసుల్ని తయారు చేస్తామని తెలిపారు. ప్రతీ నెల ఉత్పత్తి చేసే డోసుల్లో సగం మనకే ఒకసారి టీకా ఉత్పత్తి ప్రారంభం కాగానే ప్రతీ నెల మార్కెట్‌కి విడుదల చేసే టీకా డోసుల్లో సగం భారత్‌లో సరఫరా చేసి మిగిలిన సగం ఇతర దేశాలకు పంపిస్తామన్నారు. భారత్ ప్రజలతో పాటుగా ప్రపంచ ప్రజల రోగనిరోధక వ్యవస్థ ముఖ్యమేనని చెప్పారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ ఏడాది చివరిలోగా కొన్ని లక్షల వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తి జరుగుతుందని, వచ్చే ఏడాది మొదటి మూడు నెలల్లో 30 నుంచి 40 కోట్ల టీకా డోసుల్ని తయారు చేసే సామర్థ్యం తమ సంస్థకు ఉందని అదార్ వెల్లడించారు. అంతా సవ్యంగా జరిగితే వచ్చే ఏడాది జూన్‌కల్లా వ్యాక్సిన్‌ను ఆవిష్కరిస్తామని ఆయన చెప్పారు. టీకా ధర రూ. వెయ్యి: కోవిడ్–19 వ్యాక్సిన్ ధర వెయ్యి రూపాయలు, అంతకంటే తక్కువే ఉంటుందని అదార్ వెల్లడించారు. కరోనా సంక్షోభ పరిస్థితుల్లో తాము లాభాపేక్ష కోసం చూడమని చెప్పారు. అయితే ప్రజలెవరూ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చునన్నారు. సర్వసాధారణంగా ప్రభుత్వాలే వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసి ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తాయని స్పష్టం చేశారు. ఆఫ్రికా వంటి నిరుపేద దేశాలకు 2 నుంచి 3 డాలర్లకే (రూ.150 నుంచి రూ. 225) పంపిణీ చేస్తామని అదార్ వివరించారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారికే తొలి దశలో వ్యాక్సిన్ ఇవ్వడం నైతిక ధర్మమని చెప్పారు. అయితే తొలుత ఎవరికి ఇవ్వాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుందని అదార్ వెల్లడించారు. -
ఆక్స్ఫర్డ్ టీకా భద్రమే..!
-
ఆక్స్ఫర్డ్ టీకా భద్రమే..!
లండన్ : కరోనా మహమ్మారితో గడగడలాడుతున్న ప్రపంచానికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శుభవార్త చెప్పింది. తాము రూపొందిస్తున్న వ్యాక్సిన్ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు చూపుతోందని తెలిపింది. వర్సిటీ అస్ట్రాజెనెకాతో కలిసి రూపొందించిన కరోనా టీకా ఒకటి, రెండో దశల క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు సానుకూలంగా వచ్చాయి. బ్రిటన్‌లోని ఐదు ఆస్పత్రుల్లో 18–55 ఏళ్ల మధ్యనున్న 1,107 మంది ఆరోగ్య వంతులపై చేపట్టిన క్లినికల్ ట్రయల్స్‌లో వైరస్‌ను నిరోధించేలా వ్యాధినిరోధకతను పెంచే యాంటీబాడీలు, టీ సెల్స్ పెరిగినట్లు గుర్తించినట్లు వర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఈ ఫలితాలు సోమవారం లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్, మేలో చేపట్టిన సార్స్–కోవ్–2 వ్యాక్సిన్ ట్రయల్స్ సందర్భంగా తీవ్రమైన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని వ్యాక్సిన్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ ఆండ్రూ పొలార్డ్ తెలిపారు. రెండో బూస్టర్ డోస్ టీకా ఇచ్చిన పది మందిలోనూ వ్యాధి నిరోధకత స్థాయిలు మరింత పెరిగినట్లు గుర్తించామని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన జెన్నర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ఆడ్రియన్ హిల్ చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి.. టీకాను ప్రజల వినియోగార్ధం విడుదల చేసే విషయం అన్ని సమీక్షలు పూర్తయ్యాక ఈ ఏడాది చివరి నాటికి నిర్ధారణవుతుందని చెప్పారు. ఆక్స్ఫర్డ్, ఔషధ సంస్థ అస్ట్రా జెనెకాతో సంయుక్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ టీకా తయారీకి సిద్ధంగా ఉందనీ, అస్ట్రా జెనెకా ఇప్పటికే 200 కోట్ల డోసుల టీకా తయారీకి ఒప్పందం కుదుర్చుకుందన్నారు. తమ టీకా కోవిడ్ నుంచి సంపూర్ణంగా రక్షణ ఇస్తుందని నిరూపించడమే తదుపరి లక్ష్యమన్నారు. బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌లకు చెందిన సుమారు 10వేల మందిపై చేపట్టిన ప్రయోగాల ఫలితాలపై సమీక్ష కొనసాగుతోందన్నారు. త్వరలోనే అమెరికాలో భారీ స్థాయిలో 30 వేల మందిపై ప్రయోగాలు చేపట్టనున్నట్లు వివరించారు. టీకా లేకుండా వైరస్ నియంత్రణ కష్టమన్నారు. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌తో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని ఈ పరిశోధనలతో సంబంధం లేని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ఎరిక్ ఫైగిల్–డింగ్ అన్నారు. భారత్‌లోనూ పరీక్షలు! క్లినికల్ ట్రయల్స్ ఆశాజనకంగా ఉన్నందున, త్వరలో భారత్‌లోనూ ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు కేంద్రానికి దరఖాస్తు చేసుకుంటామని పుణేకు చెందిన సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తెలిపింది. కేంద్రం నుంచి అనుమతులు లభిస్తే ట్రయల్స్ మొదలు పెడతామంది. వ్యాక్సిన్‌కు తుది అనుమతులు లభించక మునుపే భారీ పరిమాణంలో ఉత్పత్తి చేసి, విడుదలకు సిద్ధంగా ఉంచుతామని గతంలోనే సంస్థ ప్రకటించింది. వచ్చే నెలలోనే రష్యా టీకా! మాస్కో : రష్యా తయారీ కోవిడ్ టీకా త్వరగా క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని, వచ్చే నెలలోనే మార్కెట్లోకి విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ప్రపంచంలోనే మొట్టమొ దటిసారిగా తాము విడుదల చేస్తున్న వ్యాక్సిన్ పూర్తి సురక్షితమైందని రష్యా రక్షణ శాఖకు చెందిన సెంట్రల్ సైంటిఫిక్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ తెలిపింది. ఈ టీకా ఒకసారి వేసుకుంటే రెండేళ్లపాటు కరోనా నుంచి రక్షణ ఇస్తుందని పేర్కొంది. ‘సెచెనెవ్ యూనివర్సిటీ తయారీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ఈనెల 20వ తేదీన బుర్డెంకో ఆస్పత్రిలో పూర్తయ్యాయి. పరిశోధనలు ఇంకా ముగియనప్పటికీ ఫలితాలు సానుకూలంగా వచ్చాయి’ అని రష్యా రక్షణ శాఖకు చెందిన సెంట్రల్ సైంటిఫిక్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ అధిపతి సెర్గీ బోరిసేవిచ్ తెలిపారని అక్కడి మీడియా వెల్లడించింది. చివరి, మూడో క్లినికల్ ట్రయల్స్ పూర్తికాక మునుపే టీకా ను విడుదల చేయనున్నట్లు రష్యా ఆరోగ్య మంత్రి తెలిపారు. దేశీయంగా 3 కోట్ల డోసులు, విదేశాల్లో 17 కోట్ల డోసుల్ని తయారు చేస్తామని రష్యా ఇప్పటికే తెలిపింది. ఈ వ్యాక్సిన్ తయారీకి 5 దేశాలు ఆసక్తి చూపుతున్నాయని పేర్కొంది. చివరి దశ క్లినికల్ ట్రయల్స్‌ను ఆగస్టు 3న రష్యాతోపాటు సౌదీ, యూఏఈల్లో చేపట్టనుంది. -
ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్: ఆశాజనకంగా ఫలితాలు
లండన్ : కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గుడ్ న్యూస్ చెప్పింది. తొలి నుంచి కరోనా వ్యాక్సిన్ ప్రయోగాల్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ముందు వరుసలో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యాక్సిన్ తొలిదశ క్లినికల్ ట్రయల్స్ సంబంధించిన డేటా వెలువడింది. లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో ఈ ఫలితాలను ప్రచురించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తొలిదశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు ఆశాజనంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ ద్వారా రోగనిరోధక ప్రతిస్పందన గుణం పెరుగుతుందని తెలిపారు. అలాగే ఇది సురక్షితమైనదని వెల్లడించారు. ఈ క్లినికల్ ట్రయల్స్‌లో దాదాపు 1,077 మందిపై వ్యాక్సిన్ ప్రయోగించగా.. వీరిలో యాంటీబాడీస్తోపాటుగా, కరోనాతో పోరాడగలిగే తెల్ల రక్తకణాలను ఏర్పరచడానికి తోడ్పడిందని తెలిపారు. ఈ వ్యాక్సిన్ ద్వారా భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ లేవని అన్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్లలోని పలువురిలో జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించాయని.. అయితే పరిశోధకులు వాటిని పారాసిటమాల్‌తో తగ్గించగలిగారని చెప్పారు. అయితే ఈ వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో కరోనాను అడ్డుకోగలుగుతుందో లేదో తెలియాలంటే.. మరిన్ని పరీక్షలు జరగాల్సి ఉందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. -
ఓ వీల్‌చెయిర్ విజయం
‘చాలా స్ఫూర్తినిస్తున్నావు. బాగా చదువుకొని వచ్చి దేశానికి సేవ చేయి’ అని ట్వీట్ చేశారు పంజాబ్ సి.ఎం. అమరేందర్ సింగ్. ఆ ట్వీట్ ప్రతిష్ట దేవేశ్వర్ గురించి. ఆమెకు ఆక్స్ఫర్డ్ నివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది. సెప్టెంబర్‌లో జాయిన్ అవుతోంది. దేశంలో అలాంటి యోగ్యత పొందిన తొలి ‘వీల్‌చైర్ అమ్మాయి’ ప్రతిష్ట. నిరోధాలను ఎదిరించే విజయం ఆమెది. ప్రతిష్ట దేవేశ్వర్ది పంజాబ్. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. ఇప్పుడు లండన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి అడ్మిషన్ పొందింది. వీల్‌చైర్ మీద ఉంటూ చదువుకుని పై చదువులకు ఆక్స్‌ఫర్డ్‌కు ఎంపికైన తొలి భారతీయురాలు ప్రతిష్ట. అందుకే ఆమె ఘనత గురించి ఆమె చదువుకున్న ఢిల్లీ, ఆమె స్వరాష్ట్రం పంజాబ్ గర్వపడుతున్నాయి. అయితే ఈ విజయం సులువుగా రాలేదు. అందుకు ఎంతో పోరాటం చేయాల్సి వచ్చింది. ఆ పోరాటం గురించి ఆమె మాటల్లో... ప్రమాదం.. పక్షవాతం అప్పుడు నాకు పదమూడేళ్ల వయస్సు. కుటుంబంతో హోషియార్పూర్ నుంచి చండీగడ్‌కు వెళుతున్నాం. సడన్‌గా కారుకు యాక్సిడెంట్ అయ్యింది. కళ్లు తెరిచేసరికి ఆసుపత్రిలో ఉన్నాను. నా పరిస్థితి దారుణంగా ఉంది. ఆపరేషన్ చేస్తే శరీరంలో రక్తం కొరత ఏర్పడి ప్రాణాలకు ప్రమాదం ఉందన్నారు. కానీ ఆపరేషన్ కాకుండా నా ప్రాణాన్ని కాపాడటానికి మరో మార్గం లేదు. ఆ ఆపరేషన్ నా ప్రాణాన్ని కాపాడింది, కాని వెన్నెముకకు గాయం కారణంగా పక్షవాతం వచ్చింది. దాదాపు నాలుగు నెలలు ఐసియులో ఉన్నాను. తర్వాత మూడేళ్లపాటు పూర్తిగా బెడ్‌కే పరిమితమైనా ఇంటి నుంచే స్కూల్ చదువు పూర్తి చేశాను. 10వ తరగతిలో 90 శాతం మార్కులు వచ్చాయి. 12వ తరగతిలోనూ 90 శాతం మార్కులు వచ్చాయి. నా శారీరక బలహీనతలు నా చదువుపై ప్రభావం చూపనివ్వలేదు. ఎందుకంటే చదువు మాత్రమే నన్ను విజేతగా నిలబెడుతుందని నాకు తెలుసు. జీవితానికి కొత్త దిశ.. 12వ తరగతిలో మంచి మార్కులు సాధించిన తరువాత ఇంటి నాలుగు గోడలలోనే జీవించటానికి ఇష్టపడలేదు. నన్ను ఢిల్లీ విశ్వవిద్యాలయానికి పంపమని అమ్మానాన్నలతో మాట్లాడాను. వారు సరే అనడంతో శ్రీరామ్ మహిళా కాలేజీలో ప్రవేశం పొందాను. ఈ కళాశాల నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. నా కోసం మాత్రమే కాకుండా నాలాంటి ఇతర అమ్మాయిల కోసం కూడా నా గొంతు వినిపించడం నేర్చుకున్నాను. భారతదేశంలో వికలాంగులకు అనేక సంస్కరణలు ఇంకా అవసరమని నమ్ముతున్నాను. మన సమాజాన్ని మెరుగుపరచడానికి కూడా చాలా ప్రయత్నాలు చేయాలి. అందుకు అవసరమైన పబ్లిక్ పాలసీకోర్సు కోసం చాలా యూనివర్శిటీలలో ప్రయత్నించాను. కాని ఏకంగా ఆక్స్ఫర్డ్ నుంచి నాకు ఆమోదం లభించింది. ఈ కోర్సు పూర్తి చేసి భారతదేశంలో నివసిస్తున్న 2 కోట్ల 68 లక్షల మంది వికలాంగుల కోసం పని చేయాలనుకుంటున్నాను. జీవితంలో విజయవంతం కాకుండా వీల్చైయిర్ ఆపలేదని నిరూపించాలనుకుంటున్నాను. ఒంటరిగా పనులు.. ఢిల్లీకి వచ్చిన తరువాత వీల్‌చైర్‌లో ఉన్నవారికి అన్ని సౌకర్యాలు లభించే ప్రదేశాలు ఉన్నాయని గమనించాను. ఎవరి సహాయం లేకుండా స్వయంగా షాపింగ్ చేయడం, బిల్లులు చెల్లించడం, ఒంటరిగా ప్రయాణించడం అలవాటు చేసుకున్నాను. దీంతో స్వయంగా జీవించగలను అనే నమ్మకం వచ్చింది. అయితే కొన్ని పనులు మాత్రం చాలా కష్టమయ్యేవి. మినీ బస్సు లేదా క్యాబ్‌లో ప్రయాణించడం నాకు అంత సులభం కాదు. అటువంటి పరిస్థితిలో చక్రాల కుర్చీలో చాలా కిలోమీటర్లు ప్రయాణించడం ప్రారంభించాను. చక్రాల కుర్చీ నుండి ఢిల్లీలోని పర్యాటక స్థలాలను చూడటానికి కూడా వెళుతుండేదాన్ని. ఈ కరోనా యుగంలో కూడా చక్రాల కుర్చీ ద్వారా నా పోరాటాన్ని కొనసాగించాను. కలలు నెరవేర్చుకోవాలని కలలు... ఒక అమ్మాయి చక్రాల కుర్చీకే పరిమితం అయినప్పటికీ ఆమె కలలన్నీ నెరవేర్చుకోగల ధైర్యం ఉందని ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాను. నా శారీరక లోపం కారణంగా నా తల్లిదండ్రులు, అన్న నన్ను జీవితంలో ఒక చోటే ఉండమని ఎప్పుడూ అనలేదు. మా అన్న ఎప్పుడూ నేను ముందుకు వెళ్లే మార్గాన్నే చూపించాడు. శారీరకంగా అన్ని విధాలుగా బాగున్నవారితో సవాలు చేసిన అమ్మాయిగా చెబుతున్నాను. కలలు కనండి, ఆ కలలను నెరవేర్చడానికి నిరంతరం కృషి చేయండి. ఒక రోజు మీ కలలు తప్పక నెరవేరుతాయి’ అని ఆత్మవిశ్వాసమే ఆయుధంగా మలుచుకున్న ప్రతిష్ట చెబుతుంది. -
సెప్టెంబర్ నాటికి ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్!
లండన్ : కరోనా మహమ్మారి నిరోధానికి తొలి వ్యాక్సిన్ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి రానుంది. ఈ దిశగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌పై నిర్వహించిన మానవ ప్రయోగాల్లో ప్రోత్సాహకర ఫలితాలు వెల్లడయ్యాయని పరిశోధకులు తెలిపారు. మానవులపై జరిపిన ప్రాథమిక పరీక్షలో ఈ వ్యాక్సిన్ ప్రాణాంతక కరోనా వైరస్‌కు డబుల్ ప్రొటెక్షన్గా పనిచేస్తుందని గుర్తించారు. వ్యాక్సిన్ డోస్ ఇచ్చిన బ్రిటన్ వాలంటీర్ల బృందం నుంచి సేకరించిన రక్త నమూనాలను పరిశీలించగా శరీరంలో వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలతో పాటు టీసెల్స్నూ ఇది ప్రేరేపించిందని వెల్లడైనట్టు ది డైలీ టెలిగ్రాఫ్ పేర్కొంది. కరోనా సోకిన వారిలో యాంటీబాడీలు కొద్దినెలలకే కనుమరుగువుతున్నాయని కొన్ని అథ్యయనాలు పేర్కొన్న నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ ఫలితాలు ఆశాజనకంగా రావడం గమనార్హం. అయితే ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌పై ఫలితాలు అద్భుతంగా ఉన్నా ప్రాణాంతక వైరస్‌ను దీటుగా ఎదుర్కొనే దీర్ఘకాల ఇమ్యూనిటీ ఇస్తుందనేందుకు ఇంకా ఆధారాలు లభ్యం కాలేదని పరిశోధకులు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ శరీరంలో యాంటీ బాడీలు, టీ సెల్స్‌ను ప్రేరేపించేలా వ్యాక్సిన్ పనితీరు వెల్లడవడం కచ్చితంగా శుభవార్తేనని వారు చెబుతున్నారు. కోవిడ్-19 నుంచి ప్రజలను కాపాడేందుకు ఈ వ్యాక్సిన్ డబుల్ ప్రొటెక్షన్గా పనిచేస్తుందని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న పరిశోధకులు పేర్కొన్నారు. మరోవైపు ఆక్స్ఫర్డ్ బృందం వెల్లడించిన హ్యూమన్ ట్రయల్స్ ఫలితాలను ప్రచురిస్తామని ది లాన్సెట్ జర్నల్ స్పష్టం చేసింది. వ్యాక్సిన్ బృందం సరైన దారిలో పయనిస్తోందని ఆక్స్ఫర్డ్ పరీక్షలకు అనుమతించిన బెర్క్‌షైర్ పరిశోధక ఎథిక్స్ కమిటీ చీఫ్ డేవిడ్ కార్పెంటర్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ కచ్చితంగా ఎప్పుడు బయటకు వస్తుందని ఎవరూ తేదీలు ప్రకటించలేరని, సెప్టెంబర్ నాటికి వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో పని చేస్తున్నారని చెప్పారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్‌ను బ్రిటన్ ప్రభుత్వం, ఆస్ర్టాజెనెకాలు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు సహకరిస్తాయి. చదవండి: భారత ఫార్మా రంగంపై బిల్‌గేట్స్ ప్రశంసలు -
కరోనా వ్యాక్సిన్‌పై ‘ఆక్స్ఫర్డ్’ ముందడుగు!
లండన్: కరోనా వాక్సిన్ ట్రైల్స్‌కు సంబంధించి ఆక్స్ఫర్డ్ యూనివర్శిటి శుభవార్తను అందించనుంది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి ఫేస్-3 హ్యూమన్ ట్రైల్స్ జరిగాయి. అయితే ఇంతవరకు ఫేస్-1కు సంబంధించిన ఫలితాలనే డెవలపర్స్ అందించలేదు. ఫేస్-1 డేటాను జూలైలో అందించే అవకాశం ఉందని వారు తెలిపారు. అయితే కరోనా వ్యాక్సిన్ ట్రైల్స్‌లో మంచి ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇది వాడటం వల్ల ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు లేవని, ఇది సురక్షితమైన వ్యాక్సిన్‌గా పరీక్షల్లో తేలింది. దీనిని వాలెంటర్ల మీద ప్రయోగించినప్పుడు చక్కని ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఆక్స్ఫర్డ్ యూనివర్శిటి గురువారం తెలిపే అవకాశాలు ఉన్నాయి. చదవండి: ఆగస్టులో రష్యా టీకా? ఇప్పటి వరకు వివిధ దేశాలలో వందల మంది కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన ప్రయోగాలు చేస్తున్నారు. అయితే వాటిలో ఆక్స్ఫర్డ్ యూనివర్శటీ లైసెన్స్ పొందించిన ప్రముఖ ఇండియన్ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా వాక్సిన్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. ఈ ట్రైల్స్‌కు సంబంధించిన సమాచారం ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెంట్‌లో రానుంది. దీనికి సంబంధించి ఆక్స్ఫర్డ్ యూనివర్శిటి శాస్త్రవేత్త మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన విషయాన్ని ఎప్పుడూ పబ్లిష్ చేస్తారు అన్న విషయాన్ని ఇంకా లాన్సెంట్ సంస్థ కచ్చితంగా చెప్పలేదని తెలిపారు. అయితే ఈ వ్యాక్సిన్ మంచి ఫలితాలను ఇచ్చిందని, ఇది మనుషుల మీద ప్రయోగించినప్పుడు చక్కగా పనిచేసినట్లు తెలుస్తోంది. దీంతో గురువారం కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి శుభవార్త వినే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: వ్యాక్సిన్‌పై ఆశలు : మార్కెట్ల దూకుడు -
రిస్క్ చేసి వ్యాక్సిన్ ట్రయల్స్‌కు సిద్ధమయ్యాడు
లండన్: ఒక ఔషధాన్ని మార్కెట్లోకి తీసుకురావాలంటే ముందుగా దాన్ని ప్రయోగించాలి. ఆ ప్రయోగం సఫలమైతేనే అది మార్కెట్లోకి వచ్చేది.. లేకపోతే దాన్ని మర్చిపోవాల్సిందే. మరి ఇలాంటి ప్రమాదకర ప్రయోగంలో భాగస్వాములు కావాలంటే ఎంతో గుండె ధైర్యం కావాలి. దీపక్ పళివాల్.. భారత సంతతికి చెందిన ఇతను యునైటెడ్ కింగ్డమ్ వాసి. ఇతనితోపాటు వందలాదిమందిపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ ప్రయోగాలు చేస్తోంది. ఈ ప్రయోగాలు విజయవంతమైతే ఎంతోమంది ప్రాణాలు నిలబడతాయి. చావు అంచుల దగ్గర ఉన్న వాళ్లు కూడా కోలుకునే అవకాశం ఉంది. (కరోనా అంతానికిది ఆరంభం) కనీసం నా శరీరమైనా ఉపయోగపడుతుంది.. ప్రపంచం మొత్తం వణికిపోతున్న కరోనా మహమ్మారిని నిరోధించే వ్యాక్సిన్ ప్రయోగం కోసం దీపక్ పళివాల్ స్వచ్ఛందంగా ముందుకు రావడం విశేషం. ఓ ఆంగ్ల మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ.. "ఏప్రిల్ 16న దీని గురించి తెలుసుకున్నా. తర్వాత ఏప్రిల్ 26న లండన్‌లో దీనికి సంబంధించిన కేంద్రాన్ని సందర్శించాను. అనంతరం నా నిర్ణయం గురించి స్నేహితులకు, భార్యకు చెప్పాను. కానీ నా భార్య దీన్ని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ నేను వినిపించుకోలేదు. నా మెదడు వల్ల ఎలాంటి ఉపయోగం ఉండకపోవచ్చేమో, కానీ నా శరీరం ఖచ్చితంగా ఉపయోగపడుతుందనుకున్నా. అందుకే మరో ఆలోచనే లేకుండా మానవ ప్రయోగాలకు సిద్ధమయ్యా"నని తెలిపాడు. (ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ప్రాజెక్టులో భారత మహిళ ) సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలిసినా.. హ్యమన్ ట్రయల్స్ వికటించి ఓ వ్యక్తి మరణించిన విషయాన్ని కూడా దీపక్ తెలుసుకున్నాడు. ఈ ప్రయోగాల వల్ల మరణించడం, అవయవాలు దెబ్బతినడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని తెలిసినా వెనకడుగు వేయలేదు. అల్లల్లాడిపోతున్న మానవజాతిని కబళిస్తోన్న కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్ తయారీలో తనవంతు భాగస్వామ్యం అయ్యాడు. తనపై ట్రయల్స్ పూర్తవగానే క్షేమంగా ఇంటికి చేరుకోవడం చూసి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా దీపక్ పళివాల్ రాజస్థాన్‌లోని జైపూర్ వాసి. అతను తన భార్యతో కలిసి లండన్‌లో నివసిస్తున్నాడు. మరోవైపు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి (కలిపి కొడితే కరోనా ఫట్?) -
ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌తో దీర్ఘకాలిక రక్షణ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ విరుగుడికి ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ తయారు చేస్తోన్న వ్యాక్సిన్ బాగా పని చేస్తుందని, అది రోగి లోపలి రోగాన్ని నయం చేయడంతోపాటు కొన్నేళ్లపాటు ఆ రోగిలో రోగ నిరోధకశక్తి ఉండేలా చేస్తుందని ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ గురువారం నాడు బ్రిటన్ ఎంపీలకు వివరించారు. కరోనా వైరస్ స్వల్ప లక్షణాలు కలిగిన వారికి ప్రస్తుతం జబ్బు నయం అయినా మరోసారి కరోనా వచ్చే ప్రమాదం ఉందని ఆమె అన్నారు. ఆ విషయంలో తమ వ్యాక్సిన్ అద్భుతంగా పని చేస్తుందని, వాక్సిన్ వల్ల మనుషుల్లో రోగ నిరోధక శక్తి పెరిగి కొన్నేళ్ల పాటు అది శరీరంలో ఉండిపోతుందని, కరోనా మళ్లీ ఎప్పుడు దాడి చేసినా ఎదుర్కోగలదని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. (మహారాష్ట్రలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లేదు) వ్యాక్సిన్ తయారు చేసిన ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీకి సారా గిల్బర్ట్ నేతత్వం వహించారు. ఆ వ్యాక్సిన్ ఫార్ములా తీసుకొని ‘ఆస్ట్రా జెనికా’ అనే ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేస్తోంది. ప్రాథమిక ట్రయల్స్‌ను ముగించుకున్న ఈ మందుపై తుది ట్రయల్స్ మొదలవుతున్నాయి. బ్రిటన్‌లో ఎనిమిది వేల మందిపై, బ్రెజిల్లో నాలుగు వేల మందిపై, దక్షిణాఫ్రికాలో రెండు వేల మందిపై ప్రయోగించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తోన్న ట్రయల్స్‌లో ఆక్స్ఫర్డ్ తయారు చేసిన వ్యాక్సిన్ ముందుంది. (చైనా యాప్స్ డిలీట్ చేయండి..మాస్క్ పొందండి) 45 మంది చొప్పున మూడు బృందాలపై తాము నిర్వహించిన వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం అయ్యాయని ఆస్ట్రా జెనికాతో కలసి వ్యాక్సిన్‌ను తయారు చేస్తోన్న పీవిజర్ లాబరేటరీకి చెందిన చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ ఫిలిప్ దార్మిడ్చర్ తెలిపారు. కరోనా సోకకుండా తమ వ్యాక్సిన్ అడ్డుకుంటుందా లేదా సోకిన తర్వాత నయం చేస్తుందా? అన్న సందేహం ఇంకా సందేహంగానే ఉండిపోయిందని ఆయన అన్నారు. (ప్లాస్మా బ్యాంక్‌ను ప్రారంభించిన కేజ్రీవాల్) -
కరోనా : వ్యాక్సిన్ అవసరం ఉండకపోవచ్చు
లండన్ : మనలో చాలామందికి కోవిడ్ వ్యాక్సిన్ అవసరం ఉండకపోవచ్చని, వైరస్ దానంతట అదే సహజంగా సమసిపోతుందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటి ఫ్రొఫెసర్, ఎపిడెమియాలజిస్ట్ సునేత్రా గుప్తా అభిప్రాయపడ్డారు. వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలోనే కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, మిగతా వారికి ఒకవేళ సోకినా త్వరగానే కోలుకుంటున్నారని తెలిపారు. కరోనాను సాధారణ ఫ్లూ లాగే చూడాలని, అనవసంగా ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు. స్పానిష్ ఇన్ ఫ్లూయెంజా మాదిరిగానే కరోనా కూడా మన జీవితంలో భాగమవుతుందని అయితే ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ వస్తుందని గుప్తా ఆశాభావం వ్యక్తం చేశారు. (మనుషులపై పని చేస్తున్న వ్యాక్సిన్) 'ఇన్ ఫ్లూయెంజా కంటే కరోనా చాలా నయం. కరోనా మరణాల రేటు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. 1918లో వచ్చిన ఇన్ ఫ్లూయెంజా కారణంగా 50 మిలియన్ వరకు ప్రాణాలు కోల్పోతే 5 కోట్ల మందికి ఈ వైరస్ సోకింది. దీన్ని బట్టి అర్ధమవుతుంది కదా ప్రస్తుతం మనం ఎంతో ఆందోళన చెందుతున్న కరోనా పెద్ద ప్రమాదకరమేమి కాదని. అయినప్పటికీ జాగ్రత్తలు పాటించడం ముఖ్యమే అలా అని అనవరంగా ఆందోళన చెందాల్సిన పనిలేదు' అని వివరించారు. కరోనాను నియంత్రించడానికి లాక్డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని, దీని వల్ల దీర్ఘకాలికంగా కరోనాను కట్టడి చేయడం సాధ్యం కాదని గుప్తా పేర్కొన్నారు. పూర్తిస్థాయి లాక్డౌన్ విధించడం చాలా కష్టమైన పని అంతేకాకుండా ఎక్కువ రోజులపాటు లాక్డౌన్ విధించడం సాధ్యం కాదని తెలిపారు. మొదటిదశలో లాక్‌డౌన్‌ను విజయవంతంగా అమలుచేసిన దేశాలు కూడా ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. (నిషేధం నిబంధనలకు విరుద్ధం: చైనా ) -
ఆ ఔషధ ఉత్పత్తిని పెంచండి: డబ్ల్యూహెచ్ఓ
జెనీవా: కరోనా రోగుల పాలిట సంజీవనిగా భావిస్తున్న స్టెరాయిడ్ డెక్సామిథాసోన్ ఉత్పత్తిని పెంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూఓ) సోమవారం పిలుపునిచ్చింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కరోనా వైరస్ రోగులకు ఈ ఔషధాన్ని వాడటం వల్ల మరణాల సంఖ్య తగ్గుతుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ క్రమంలో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ ‘బ్రిటీష్ ట్రయల్‌లో ఈ ఔషధం మంచి ఫలితాన్ని ఇచ్చినట్లు నిరూపితం కావడంతో డెక్సామిథాసోన్‌కు ఇప్పటికే డిమాండ్ బాగా పెరిగింది. ఉత్పత్తిని వేగవంతం చేయాలి’ అని ఆయన సూచించారు. గత వారం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ బృందం నేతృత్వంలోని పరిశోధకులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 2 వేల మంది రోగులకు ఈ ఔ షధాన్ని ఇచ్చారు. ఇది మరణాల సంఖ్యను 35 శాతం తగ్గించినట్లు తెలిసింది. ‘పరిశోధనలు ఇంకా ప్రాధమిక దశలోనే ఉన్నప్పటికీ.. డెక్సమిథాసోన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కరోనా రోగుల ప్రాణాలను రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నదని నిరూపితమైనది. అందుకే ఈ ఔషధం వాడటానికి అనుమతిస్తున్నాం’ అని జెనీవాలో జరిగిన ఒక వర్చువల్ న్యూస్ కాన్ఫరెన్స్‌లో టెడ్రోస్ వెల్లడించారు. అంతేకాక ‘ఇప్పుడు మన ముందున్న సవాళ్లు ఏమిటంటే ఈ ఔషధ ఉత్పత్తిని పెంచడం.. ప్రపంచవ్యాప్తంగా వేగంగా.. దీని అవసరమున్న దేశాలకు సమానంగా పంపిణీ చేయడం.. ఎక్కువ అవసరమైన చోట దృష్టి సారించడం’ అని పేర్కొన్నారు.(వాటి వల్ల కరోనా చావదు: డబ్ల్యూహెచ్‌వో) ప్రాముఖ్య దేశాలు డెక్సామిథాసోన్ 60 సంవత్సరాలుగా మార్కెట్లో ఉంది. సాధారణంగా ఈ ఔషధం మంటను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అయితే ప్రస్తుతం కరోనాతో తీవ్రమైన అనారోగ్యానికి గురైన రోగులకు మాత్రమే డెక్సామిథాసోన్ వాడాలని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. అంతేకాక తేలికపాటి కరోనా లక్షణాలు ఉన్న రోగులకు లేదా కోవిడ్-19 నివారణ కోసం ఈ ఔషధం పనిచేస్తుందనడానికి ఎటువంటి ఆధారం లేదు. హాని కలిగించే ప్రమాదం కూడా ఉంది అని టెడ్రోస్ హెచ్చరించారు. దీని సరఫరాలో అధిక సంఖ్యలో కరోనా వైరస్ రోగులు ఉన్న దేశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని టెడ్రోస్ తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ ప్రకటన ఫలితంగా నాణ్యత లేని లేదా తప్పుడు ఉత్పత్తులు మార్కెట్లోకి ప్రవేశించే ప్రమాదం ఉన్నందున.. ఈ ఔషధ ఉత్పత్తిదారులు నాణ్యతకు సంబంధించి హామీ ఇవ్వవలసి ఉంటుందని టెడ్రోస్ హెచ్చరించారు. మింక్‌తో సంబంధం చైనా వుహాన్ కరోనాకు జన్మస్థలంగా భావిస్తున్న క్రమంలో శాస్త్రవేత్తలు ఇక్కడి మాంసం దుకాణాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఈ వైరస్ మొదట జంతువుల నుంచి మానవులకు సోకిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కరోనాపై పనిచేస్తున్న డబ్ల్యూహెచ్ఓ అధికారి మరియా వాన్ కెర్ఖోవ్ మాట్లాడుతూ.. ఉత్తర ఐరోపాలో జరిపిన అధ్యయనాల్లో కరోనా వైరస్ మానవులకు మింక్(అమెరికాలో కనిపించే ఓ జంతువు) ద్వారా సోకినట్లు తెలుస్తుందన్నారు. నెదర్లాండ్స్ మరియు డెన్మార్క్‌లో కొన్ని మింకులు కరోనా వైరస్‌కు సానుకూలంగా ఉన్నాయి అని వాన్ కెర్ఖోవ్ చెప్పారు. -
ఆనందంలో మలాలా కుటుంబ సభ్యులు
నోబెల్ శాంతి బహుమతి గ్రహిత, పాకిస్తాన్‌కు చెందిన మలాలా యూసఫ్ జాయ్ సంబరాల్లో మునిగిపోయారు. ప్రఖ్యాత ఆక్స్‌ఫర్ట్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన ఆమె.. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసిన ఫొటోలను కూడా షేర్ చేశారు. ‘హ్యాపీ గ్రాడ్యుయేషన్ మలాలా’ అని రాసి ఉన్న కేక్‌ను కట్ చేశారు. ‘నేను ఆక్స్‌ఫర్డ్‌లో నా ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ డిగ్రీ పూర్తిచేశాను. దీనిపై నా ఆనందాన్ని, కృతజ్ఞతను తెలుపడానికి మాటలు రావడం లేదు. ఇక ముందు ఏం జరుగుతుందో నాకు తెలియదు. ప్రస్తుతానికి నెట్‌ఫ్లిక్స్, పుస్తకాలు చదవడం, నిద్ర పోవడం ఇదే నా పని’ అని మలాలా పేర్కొన్నారు. కాగా, బాలికల విద్య కోసం పోరాడిన మలాలా.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. పాకిస్తాన్లో బాలికలను పాఠశాలల్లోకి అనుమతించాలని మలాలా ప్రచారం చేయడంతో.. 2012లో ఆమె ప్రయాణిస్తున్న స్కూలు బస్సుపై మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఆమె గాయపడ్డారు. ఈ క్రమంలోనే మలాలా సేవకు గుర్తింపుగా 2014లో ఆమెను నోబెల్ శాంతి బహుమతి వరించిన విషయం తెలిసిందే. (చదవండి : ఆ దేశంలో టెలిగ్రామ్‌పై నిషేధం ఎత్తివేత!) Hard to express my joy and gratitude right now as I completed my Philosophy, Politics and Economics degree at Oxford. I don’t know what’s ahead. For now, it will be Netflix, reading and sleep. 😴 pic.twitter.com/AUxN55cUAf — Malala (@Malala) June 19, 2020 -
ఆక్స్‌ఫర్డ్‌కు ఎన్నారై సోదరుల భారీ విరాళం
లండన్: భారతీయ సంతతికి చెందిన రూబేన్ సోదరులు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పార్క్ కాలేజీకి దాదాపు రూ.770 కోట్లు (8 కోట్ల పౌండ్లు) విరాళమిచ్చారు. స్కాలర్ షిప్ కార్యక్రమానికి ఈ నిధులను వెచ్చిస్తారు. డేవిడ్, సీమోన్ రూబేన్లు ముంబైకి చెందిన వారు. ది సండే టైమ్స్ గణాంకాలప్రకారం వీరిద్దరూ 16 బిలియన్ పౌండ్ల సంపదతో బ్రిటన్ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. రూబెన్ ఫౌండేషన్ ఇచ్చిన విరాళం చారిత్రాత్మకమని, పార్క్ కళాశాల ఇప్పుడు రూబెన్ కాలేజీగా మారిందని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం తెలిపింది. (అలసిపోయాం.. ఇక ఆపండి: జార్జ్ సోదరుడి ఆవేదన) రత్తన్లాల్కు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ న్యూయార్క్: ప్రముఖ భారత సంతతి అమెరికన్ శాస్త్రవేత్త రత్తన్‌లాల్(75)ను ప్రతిష్టాత్మక వరల్డ్ ఫుడ్ ప్రైజ్ వరించింది. 2020 సంవత్సరానికి సుమారు రూ.1.90 కోట్ల విలువైన ఈ బహుమతికి ఆయన్ను ఎంపిక చేసినట్లు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ పేర్కొంది. ‘రత్తన్‌లాల్ 50 ఏళ్లుగా నాలుగు ఖండాల్లో భూసార పరిరక్షణకు, 50 కోట్ల మంది రైతుల జీవనోపాధి పెంపునకు కృషి చేశారు. 200 కోట్ల ప్రజలకు ఆహార భద్రత కల్పించారు. వేలాది హెక్టార్ల భూమిలో సహజ ఉష్ణమండల పర్యావరణ వ్యవస్థలను కాపాడారు’ అని వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఆర్గనైజేషన్ కొనియాడింది. -
సెప్టెంబర్‌లో కరోనా వ్యాక్సిన్..!
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెచ్చుమీరుతున్న వేళ ఈ మహమ్మారికి చెక్ పెట్టే వ్యాక్సిన్ మరో 3 నెలల్లో దేశంలో అందుబాటులోకి రానుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌కు తయారీ, మార్కెటింగ్‌లో అధికారిక భాగస్వామిగా వ్యవహరిస్తున్న బ్రిటిష్ ఫార్మా దిగ్గజ సంస్థ ఆస్ట్రాజెనెకా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ఏజెడ్‌డీ 1222 జేఏబీ అనే వ్యాక్సిన్ తయారీని ప్రారం భించామని, అన్ని పరీక్షలు ఆగస్టులో విజయవంతంగా పూర్తయ్యే నాటికి మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు వ్యాక్సిన్ సిద్ధంగా ఉంటుందని సంస్థ ప్రకటించింది. ఈ సంస్థ అంచనా ప్రకారం సెప్టెంబ ర్‌కల్లా 10 కోట్ల డోసుల వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. తొలిదశ ట్రయల్స్ సక్సెస్ వాస్తవానికి కోవిడ్–19 వ్యాధికి వ్యాక్సిన్ తయారు చేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలకు చెందిన ఫార్మా కంపెనీలు, పరిశోధనా సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటిలో 12 సంస్థల పరిశోధనలను డబ్ల్యూహెచ్‌వో గుర్తించింది. ఇలా డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు పొందిన వాటిలో ఆక్స్ఫర్డ్ వర్సిటీ ఒకటి. ఈ వర్సిటీ కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ‘ఏజెడ్‌డీ 1222 జేఏబీ’ అనే వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 18–55 ఏళ్ల మధ్య ఉన్న ఆరోగ్యకర వాలంటీర్లపై ప్రయోగాలు నిర్వహించింది. ఈ ట్రయల్స్ విజయవంతం కావడంతో ఇప్పుడు మరో దశ ప్రయోగాలకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా త్వరలోనే పరీక్షలు నిర్వహించేందుకు వివిధ వయసులకు చెందిన 10,260 మంది వాలంటీర్లను ఎంపిక చేసింది. వారిపై ప్రయోగాలు సత్ఫలితాలనిస్తే తమ కృషి ఫలించినట్టేనని, వ్యాక్సిన్‌ను మార్కెట్లో విడుదల చేయవచ్చని అంచనా వేస్తోంది. బ్రిటన్ ప్రభుత్వంతో ఒప్పందం... ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థ నాలుగు దేశాల్లో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనుంది. బ్రిటన్‌తోపాటు భారత్, నార్వే, స్విట్జర్లాండ్ దేశాల్లో వ్యాక్సిన్ తయారీని ప్రారంభించనుంది. ఇందుకోసం బ్రిటన్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఆ సంస్థ... మన దేశంలో ఈ వ్యాక్సిన్ తయారు చేసేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. ఆస్ట్రాజెనెకా అంచనా ప్రకారం 2020 సెప్టెంబర్ నాటికి ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల డోసులు, 2021 జూన్ నాటికి 200 కోట్ల డోసుల ‘ఏజెడ్‌డీ 1222 జెఏబీ’ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. లాభం చూసుకోవట్లేదు... ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏ సంస్థ కూడా లాభం చూసుకోకూడదు. మేము కూడా ఈ విషయంలో లాభాపేక్ష లేకుండా పని చేస్తున్నాం. అదే కొనసాగిస్తాం కూడా. ప్రయోగ ఫలితాలు విజయవంతంగా పూర్తయ్యే సమయానికి వ్యాక్సిన్ మార్కెట్లోకి వెళ్లేలా సిద్ధం చేసి ఉంచుతాం. ఆగస్టుకల్లా అన్ని ప్రయోగాలు పూర్తవుతాయని ఆశిస్తున్నాం. సెప్టెంబర్‌లో వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. – పాస్కల్ సారియట్, ఆస్ట్రాజెనెకా సీఈవో -
టీకా ఎవరిదైనా మన పాత్ర ఉండాల్సిందే!
ముంబై: కరోనా వైరస్ కట్టిడికి ప్రపంచ వ్యాప్తంగా టీకాను కనుగొనడానికి అన్ని దేశాలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఎవరు ఏ ఫార్ములాతో కనుగొన్న మన దేశ దిగ్గజ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ పాత్ర ఉండాల్సిందే. ప్రపంచంలోనే భారీ స్థాయిలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సత్తా సీరమ్ సంస్థకు ఉంది. ప్రస్తుతం ఆక్స్ఫర్డ్ వర్సిటీ తయారుచేస్తున్న కరోనా వ్యాక్సిన్ తయారీలో సీరం సంస్థ భాగస్వామ్యం ఉంది. సీరమ్ సంస్థ ప్రయోగాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య సాంకేతిక సలహాదారు కె విజయ్‌రాఘవన్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సీరమ్ సంస్థ వ్యాక్సిన్ ఉత్పత్తే లక్ష్యంగా 1966 సంవత్సరం పూణెలో నెలకోల్పిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ ప్రయోగాలకు కావాల్సిన అన్ని సదుపాయాలను సీరం సంస్థకు కల్పిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సంస్థ చేస్తున్న ప్రయోగాలను ఉమేష్ శాలిగ్రామ్ అనే సీనియర్ శాస్త్రవేత్త పర్యవేక్షిస్తున్నారు. వ్యాక్సిన్ ప్రయోగ పురోగతిని ప్రభుత్వానికి నివేదిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. తమ సంస్థ కేవలం కరోనా నియంత్రణకు మాత్రమే కాకుండా రాబోయే వైరస్‌లను ఊహించి అందుకనుగుణంగా నూతన వ్యాక్సిన్ల ఉత్పత్తి కూడా చేయనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. చదవండి: సెప్టెంబర్ నాటికి మూడుకోట్ల డోస్‌లు! -
గుడ్‌న్యూస్ : కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తోంది..
న్యూయార్క్ : కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనుగొనే క్రమంలో భారీ ముందడుగు పడింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌కు పూర్తిగా సహకరిస్తామని బయోఫార్మా సంస్థ ఆస్ర్టాజెనెకా స్పష్టం చేసింది. మూడో దశ పరీక్షలకు పరిశోధకులకు సహకరిస్తామని పేర్కొంది. 40 కోట్ల డోసుల వ్యాక్సిన్ తయారీకి ఒప్పందం ఖరారైందని..మొత్తం వంద కోట్ల డోసులను తయారు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని ఆస్ర్టాజెనెకా గురువారం ప్రకటించింది. సెప్టెంబర్‌లోనే తొలి విడత వ్యాక్సిన్ సరఫరాలను చేపడతామని, వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీ, సరఫరా కోసం అమెరికన్ బయోమెడికల్ పరిశోధన అభివృద్ధి సంస్థ (బీఏఆర్డీఏ) నుంచి తమకు వంద కోట్ల డాలర్ల నిధులు మంజూరయ్యాయని సంస్ధ ప్రకటించింది. ఇందులో భాగంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేపట్టే మూడోవిడత క్లినికల్ ట్రయల్స్‌కు కంపెనీ సహకరిస్తుందని ఆస్ర్టాజెనెకా తెలిపింది. 30,000 మందిపై వ్యాక్సిన్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తారని వెల్లడించింది. ఈ వ్యాక్సిన్‌ను అతి త్వరగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో తాము కలిసిపనిచేస్తామని కంపెనీ సీఈఓ పాస్కల్ సోరియట్ వెల్లడించారు. చదవండి : స్టేషన్‌కు రప్పించారు..రైలు లేదన్నారు -
ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ప్రాజెక్టులో భారత మహిళ
లండన్: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కోవిడ్ వ్యాక్సిన్ పరిశోధనల్లో భారత్‌కు చెందిన చంద్ర దత్తా (34) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈమె ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్‌లో క్వాలిటీ అస్యూరెన్స్ మేనేజర్‌గా ఉన్నారు. వర్సిటీ పరిశోధకులు తయారు చేసిన వ్యాక్సిన్ వారం క్రితం మొదటి దశ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుంది. ఈ వ్యాక్సిన్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి అందుబాటులోకి రానుందని భావిస్తున్నారు. చంద్రదత్తా కోల్‌కతాలో బయో టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం ఎమ్మెస్సీ బయోసైన్స్ పూర్తి చేయడానికి 2009లో బ్రిటన్ వెళ్లారు. ఆక్స్‌ఫర్డ్‌లో వ్యాక్సిన్ ప్రయోగాల్లో పాలు పంచుకునే ముందు ఆమె పలు ఉద్యోగాలు చేశారు. ఆక్స్‌ఫర్డ్‌లో క్వాలిటీ అస్యూరెన్స్‌తోపాటు, ప్రయోగాల్లో సరైన నాణ్యతా ప్రమాణాలు, విధానాలు పాటిస్తున్నదీ లేనిదీ చంద్ర దత్తా పర్యవేక్షిస్తుంటారు. ‘కోవిడ్ వ్యాక్సిన్ రూపకల్పనలో పాలుపంచుకోవడం సంతోషం కలిగిస్తోంది. గత నెలంతా మేమెంతో ఒత్తిడి అనుభవించాం. అయితే వ్యాక్సిన్‌ను త్వరగా తయారు చేయగలిగాం’ అని ఆమె చెప్పారు. పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్లో సెప్టెంబర్, అక్టోబర్లలో భారీ స్థాయిలో వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలిపారు. సాధారణంగా వ్యాక్సిన్ తయారీకి మూడు నుంచి నాలుగేళ్లు పడుతుందని, అయితే కరోనా వ్యాక్సిన్‌ను నెలల వ్యవధిలోనే తయారు చేయగలిగామని చెప్పారు. కరోనాపై ఇప్పటి వరకు 600 వ్యాక్సిన్లు తయారు చేశామని, మరో 1000 వ్యాక్సిన్లు కూడా చేసిన అనంతరం భారీ స్థాయిలో ఉత్పత్తి చేపడతామని చెప్పారు. -
ఆరోగ్య సేతు అడ్డుపెట్టి కరోనా ఆపగలమా?
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన సప్తసూత్రాల్లో ఆరోగ్య యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం కూడా ఒకటి. మొత్తం 11 భాషల్లో ఇంగ్లీష్, ఇతర 10 భారతీయ భాషలు ఆరోగ్యసేతు అందుబాటులో ఉంది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచడం, కరోనా కేసుల్ని నియంత్రించడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. . అందుకే పదే పదే టెలికం సంస్థల నుంచి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోమని మెసేజ్‌లు వస్తుంటాయి. ప్రధాని పిలుపునిచ్చిన తర్వాత ప్రజలు ఈ యాప్‌ని రికార్డు స్థాయిలో డౌన్లోడ్ చేసుకున్నారు కానీ దీని వల్ల కలిగే ప్రయోజనం ఎంత అన్న చర్చ మొదలైంది. ఆరోగ్య సేతుని డౌన్లోడ్ చేసుకున్నాక వారి ఫోన్‌నెంబర్ రిజిస్టర్ అవుతుంది. బ్లూటూత్, లొకేషన్ ఎల్లప్పుడూ ఆన్‌లోనే ఉంచాలి. ఆ వ్యక్తి కోవిడ్ వ్యాధిగ్రస్తుల వద్దకి కానీ, క్వారంటైన్లో ఉన్న వారి దగ్గరగా వెళ్లి ఒక రెండు నిమిషాల గడిపితే వెంటనే యాప్ డేంజర్ జోన్లో ఉన్నామని అప్రమత్తం చేస్తుంది. ఆ తర్వాత ఎవరికైనా వైరస్ సోకినా అంతకు ముందు వారు ఏయే ప్రాంతాలకు వెళ్లారు ? ఎవరెవరిని (అప్పటికే అవతల వ్యక్తులు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉండాలి) కలుసుకున్నారు వంటివి ట్రాక్ చేయడం సులభం అవుతుంది. చైనా, దక్షిణ కొరియా మినహా ఈ తరహా యాప్ వాడుతున్న భారత్ సహా మిగిలిన దేశాల్లో కేవలం ట్రాకర్‌గానే ఉపయోగపడుతుంది తప్ప, మరే విధంగానూ వైరస్‌ని నియంత్రించలేదని ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనం స్పష్టం చేసింది. సగం జనాభా డౌన్లోడ్ చేసుకోవాలి ఆరోగ్య సేతు యాప్‌ని 50 నుంచి 60శాతం మంది వినియోగిస్తేనే ఫలితం ఉంటుందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనకారులు చెబుతున్నారు. మన దేశ జనాభాలో యాప్‌ని 5 శాతం మంది కంటే తక్కువే డౌన్లోడ్ చేసుకోవడం వల్ల సరైన ఫలితాలు వెలువడే అవకాశం లేదు విసురుతున్న సవాళ్లు ► చాలా తక్కువగా జరుగుతున్న కరోనా పరీక్షలు ► స్మార్ట్ వినియోగదారుల సంఖ్య అతిస్వల్పం ► బ్లూటూత్, లొకేషన్‌కి పర్మిషన్ లేకుండా ట్రాకింగ్ కుదిరే పనికాదు ► ప్రజలు తమ లక్షణాలపై తప్పుడు సమాచారం ఇచ్చినా రిస్క్ జోన్లోకి వెళతారు. యాప్‌తో కరోనాను నియంత్రిస్తున్న దేశాలు సింగపూర్, దక్షిణ కొరియా, చైనా , ఇరాన్, ఇజ్రాయెల్, తైవాన్, ఆస్ట్రియా, బెల్జియం, జర్మనీ, ఇటలీ. పరీక్షలే పరిష్కారం ఆరోగ్య సేతు వంటి యాప్‌ల ద్వారా ప్రజల్లో వ్యాధిపై అవగాహన పెంచడం, ట్రాకింగ్ వంటివే సాధ్యం. కరోనా నిర్ధారణ పరీక్షల ద్వారా మాత్రమే సాధ్యమని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఎంత ఎక్కువ మందికి పరీక్షలు చేస్తే కరోనా ముప్పు నుంచి అంత త్వరగా బయటపడవచ్చునని వారు చెబుతున్నారు. దేశ జనాభా: 130 కోట్లు స్మార్ట్‌ఫోన్ వాడేవారు: 40 కోట్లు (28%) 17 రోజుల్లో యాప్ డౌన్లోడ్లు: 6 కోట్లు (దేశ జనాభాలో 5% కంటే తక్కువ) -
హ్యుమన్ ట్రయల్స్.. నేను బతికే ఉన్నా
లండన్ : కరోనా మహమ్మారి నిర్మూలనే లక్ష్యంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధనలు కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్ ప్రారంభించింది. ఇందుకోసం దాదాపు 800 మంది వాలంటీర్లను కూడా ఎంపిక చేసింది. తొలుత ఇద్దరిపై ట్రయల్స్ మొదలుపెట్టగా.. అందులో మొదటగా 32 ఏళ్ల మైక్రో బయాలజిస్ట్ ఎలీసా గ్రానటో వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న ఎలీసా మరణించారని.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనలు విఫలమయ్యాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను ఎలీసా ఖండించారు. తాను బతికే ఉన్నానని స్పష్టం చేశారు. స్వచ్ఛందంగా ఈ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనడం ఆనందంగా ఉందని ఎలీసా చెప్పారు. తన పుట్టిన రోజునాడే వ్యాక్సిన్ తీసుకున్నానని.. ఇప్పుడు క్షేమంగా ఉన్నానని వెల్లడించారు. ‘నేను బతికే ఉన్నాను. నేను ఈరోజు(26 ఏప్రిల్) టీ తాగుతున్నాను. ఇవాల్టికి నా బర్త్‌డే జరిగి మూడు రోజులు అవుతుంది. నేను వ్యాక్సిన్ తీసుకుని కూడా మూడు రోజులు గడిచింది. నేను బాగానే ఉన్నాను. వీకెండ్‌ను ఎంజాయ్ చేస్తున్నాను. ప్రపంచంలోని అందరూ కూడా బాగానే ఉన్నారని భావిస్తున్నాను’ అని తెలిపారు. ఎలీసా మరణించారని జరిగిన తప్పుడు ప్రచారంపై యూకే ప్రభుత్వం కూడా ఘాటుగానే స్పందించింది. ఆ వార్తలు నిరాధామైనవని పేర్కొంది. ఆన్లైన్లో ఇలాంటి వార్తలు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు ఆదివారం యూకే హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ట్విటర్లో ఒక ప్రకటన చేసింది. ఎలీసా చనిపోయినట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొంది. అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీ ప్రతినిధి ఫెర్గస్ వాల్ష్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ‘క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న మొదటి వాలంటీర్ ఎలీసా మరణించారని జరుగుతున్న ప్రచారం అవాస్తవం. నేను ఈ రోజు ఉదయం కొద్ది నిమిషాల పాటు ఎలీసాతో స్కైప్ ద్వారా చాట్ చేశాను. ఆమె బతికే ఉన్నారు.. అలాగే చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు నాకు చెప్పారు. ప్రస్తుతం ఆమె తన బంధువులందరితో చాట్ కూడా చేస్తున్నారు’ అని ట్వీట్ చేశారు. అలాగే ఎలీసా మాట్లాడుతన్న వీడియోను కూడా షేర్ చేశారు. ....and here is Dr Elisa Granato in person. Alive and well pic.twitter.com/Csw1WqmBQa — Fergus Walsh (@BBCFergusWalsh) April 26, 2020 -
ఒక్కరోజులో 1,975 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి అలజడి ఆగడం లేదు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు రికార్డు స్థాయిలో కొత్తగా 1,975 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కేవలం ఒక్కరోజులో ఇంత భారీగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అలాగే, 24 గంటల వ్యవధిలో 47 మంది కరోనా వల్ల మరణించారు. దీంతో భారత్‌లో ఇప్పటిదాకా మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 26,917కు, మరణాల సంఖ్య 826కు చేరిందని ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. దేశంలో యాక్టివ్ కరోనా కేసులు 20,177 కాగా, 5,914 మంది(21.96 శాతం) బాధితులు పూర్తిగా కోలుకున్నారు. మొత్తం కరోనా బాధితుల్లో 111 మంది విదేశీయులు సైతం ఉన్నారు. దేశంలో అత్యధికంగా ఏప్రిల్ 24న 1,752 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ రికార్డును తిరగరాస్తూ తాజాగా 1,975 కేసులు బయట పడడం గమనార్హం. పరిస్థితులు మెరుగుపడుతున్నాయ్ దేశంలో కరోనా వైరస్ పరిస్థితులు మెరుగుపడుతున్నాయని ఆరోగ్య శాఖా మంత్రి హర్‡్షవర్ధన్ తెలిపారు. చాలా జిల్లాలు హాట్‌స్పాట్ (ప్రమాదకర/అత్యధిక కేసులు నమోదవుతున్న) నుంచి నాన్ హాట్స్పాట్లుగా మారుతున్నట్టు మంత్రి చెప్పారు. కరోనా వైరస్ నివారణ విషయంలో సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్‌తో చికిత్స పొందుతున్న వారితో వీడియోకాల్ ద్వారా మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. కాగా, గుజరాత్లో కరోనా వల్ల ఇప్పటిదాకా 133 మంది మృతిచెందారు. ఎల్–టైప్ వైరస్ వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాలోని వూహాన్లో ఈ వైరస్‌నే అలజడి సృష్టించింది. ఎస్–టైప్ కంటే ఎల్–టై‹ప్ వైరస్ మరింత ప్రమాదకారి అని శాస్త్రవేత్తలు చెప్పారు. ‘భారత్‌లో కరోనా వ్యాక్సిన్ తయారీ’ కరోనాను అంతం చేసే వ్యాక్సిన్‌ను వచ్చే రెండు మూడు వారాల్లో అభివృద్ధి చేస్తామని, మనుషులపై క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే అక్టోబర్ నాటికి మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లో తాము ఉత్పత్తి చేస్తామని మహారాష్ట్రలోని పుణేకు చెందిన ‘సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ ఆదివారం ప్రకటించింది. ఈ సంస్థ ఆక్స్ఫర్డ్ వర్సిటీతో భాగస్వామ్యం కలిగి ఉంది. తమ పరిశోధకుల బృందం ఆక్స్ఫర్డ్ వర్సిటీతో కలిసి పనిచేస్తోందని, కరోనా వ్యాక్సిన్‌ను ఉత్పత్తిని త్వరలో ప్రారంభిస్తామన్న నమ్మకం ఉందని, మొదటి ఆరు నెలలపాటు నెలకు 50 లక్షల చొప్పున డోసులను తయారు చేస్తామని ‘సెరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ సీఈవో అడార్ పూనావాలా వెల్లడించారు. అనంతరం నెలకు కోటి డోసుల చొప్పున ఉత్పత్తి చేస్తామని పేర్కొన్నారు. -
యూకేలో హ్యూమన్ ట్రయల్స్ షురూ!
లండన్: యూకేలోని ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృది చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించి మనుషులపై ప్రయోగాలు గురువారం మొదలయ్యాయి. ఆక్స్ఫర్డ్ వర్సిటీకి చెందిన సారా గిల్బర్ట్ నేతృత్వంలోని బృందం ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. గతంలో ఈమె ‘ఎబోలా’ వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు. తాజా కార్యక్రమానికి దాదాపు రూ.180 కోట్లను బ్రిటన్ ప్రభుత్వం కేటాయించింది. -
బొమ్మలు గీసే మరబొమ్మ
లండన్ : మామూలుగా మనషులు లేదా జంతువులు గీసిన బొమ్మలను ఎగ్జిబిషన్‌కు ఉంచటం చూసుంటాము. కానీ ఓ మరబొమ్మ తన స్వహస్తాలతో గీసిన బొమ్మలను ప్రదర్శనకు ఉంచనున్నారు. ఆయిదా అనే హ్యూమనాయిడ్ రోబోట్ గీసిన బొమ్మలను ఇంగ్లాండ్‌లోని ‘‘ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ’’లో జూన్ 12వ తేదీ ప్రదర్శనకు ఉంచనున్నారు. డ్రాయింగ్, పేయింటింగ్, వీడియో ఆర్ట్ వంటి వాటిని ఈ ప్రదర్శనలో చూడవచ్చు. ఈ రోబో ఏఐ టెక్నాలజీ, అల్గారిథమ్‌ల సహాయంతో బొమ్మలను వేస్తుంది. అచ్చం మనిషిలాగే కంటితో చూస్తూ, చేతితో పెన్సిల్ పట్టుకుని మనషుల బొమ్మలను గీస్తుంది. రోబో పనితనాన్ని బట్టి ఏఐ టెన్నాలజీ సామర్థ్యాన్ని అంచనా వేయవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
తిండి మారితే మేలు..
భూమిపై వనరుల వినియోగ భారాన్ని గణనీయంగా తగ్గించుకోవడానికి ఉత్తమ మార్గం మాంసం, డెయిరీ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించుకోవడమేనని సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం (2018) పేర్కొంది. మాంసం, పాల ఉత్పత్తులను తినటం మానివేస్తే చాలు.. ప్రజలకు ఆహార కొరత రాకుండా చూసుకుంటూనే ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ భూమి విస్తీర్ణాన్ని 75% తగ్గించవచ్చని ఒక అతిపెద్ద అధ్యయనం తెలిపింది. యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ 119 దేశాల్లో 40 వేల క్షేత్రాలు, ప్రజలు ఎక్కువగా తింటున్న 40 ఆహారోత్పత్తులపై అధ్యయనం చేసింది. ఈ ఉత్పత్తులకు అయ్యే వనరుల ఖర్చు, కాలుష్యం, వెలువడే ఉద్గారాలు తదితర విషయాలను పరిగణనలోకి తీసుకున్నది. అడవులు నరికి వ్యవసాయానికి మళ్లించడం వల్ల వన్యప్రాణుల సంఖ్య భారీగా అంతరిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా మాంసం, పాల ఉత్పత్తుల ద్వారా ప్రజలకు అందుతున్నది 18% కేలరీలు, 37% ప్రొటీన్లు. అయితే, వీటి కోసం 83% వ్యవసాయ భూములను కేటాయించాల్సి వస్తున్నది. వ్యవసాయం వల్ల వెలువడే కర్బన ఉద్గారాలలో 60% మాంసం, పాల ఉత్పత్తుల తయారీ వల్లనేనని ఈ అధ్యయనం తేల్చింది. మాంసం, పశువుల పాల ఉత్పత్తులను సగాన్ని తగ్గించుకొని, వాటి స్థానంలో పంటల ఉత్పత్తులతో భర్తీ చేసుకున్నా చాలా మేలు జరుగుతుందని తేలింది. -
కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ ‘జిన్’ పోరు
లండన్: బ్రిటన్‌లోని ప్రముఖ యూనివర్సిటీలు కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్‌లు తమ సంప్రదాయ వైరాన్ని మర్చిపోలేదు. తాజాగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ తన సొంత బ్రాండ్ జిన్ క్యూరేటర్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టడం ద్వారా ఆక్స్‌ఫర్డ్‌తో మరో పోటీకి తెరతీసింది. గత ఏడాది ఆక్స్ఫర్డ్ వర్సిటీ తన సొంత ఫిజిక్ బ్రాండ్ జిన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. వర్సిటీ గార్డెన్‌లోని చెట్లు, మొక్కల నుంచి రూపొందించిన ఈ జిన్ ధర 35 పౌండ్లుగా నిర్ణయించింది. అయితే, ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఇసాక్ న్యూటన్ సాపేక్ష సిద్ధాంతం కనుగొనేందుకు కారణమైన యాపిల్స్ నుంచి తాము క్యూరేటర్ జిన్ తయారు చేస్తున్నట్లు కేంబ్రిడ్జ్ తెలిపింది. దీనిని తమ బొటానికల్ గార్డెన్స్‌లోని యాపిల్స్ నుంచి రూపొందిస్తున్నట్లు పేర్కొంది. ఈ జిన్ ధర 40 పౌండ్లుగా తెలిపింది. ఇప్పటికే యూనివర్సిటీలోని దాదాపు 12 కళాశాలలకు ఈ జిన్ను అందజేస్తున్నట్లు తెలిపింది. తాజాగా, ఇదే కోవలోకి లీసెస్టర్ యూనివర్సిటీ కూడా వచ్చి చేరింది. తమ వర్సిటీ బొటానిక్ గార్డెన్‌లోని మొక్కల నుంచి జిన్ తయారు చేసేందుకు ఇటీవలే తమ విద్యార్థులకు అనుమతినిచ్చింది. -
టాప్ 250లో లేని భారత యూనివర్సిటీలు
లండన్ : ‘ది టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్’ వరల్డ్ యూనివర్సిటీ ర్యాకింగ్స్లో భారత్ నుంచి ఒక్క విశ్వవిద్యాలయం కూడా చోటు దక్కించుకోలేదు. కాగా, బుధవారం విడుదలైన ఈ జాబితాలో ప్రపంచ అత్యుత్తమ యూనివర్సీటీగా ఆక్స్ఫర్డ్ తన స్థానాన్ని పదిలం చేసుకోగా.. కేంబ్రిడ్జ్, స్టాన్ఫోర్డ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. మాసాచుసెట్స్ నాలుగో స్థానంలో ఉంది. 2019కి సంవత్సరానికి గాను ప్రపంచవ్యాప్తంగా 250 యూనివర్సీటీలకు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాకింగ్స్ ఇచ్చింది. ఇదిలాఉండగా.. భారత్‌లోని అన్ని యూనివర్సిటీల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగుళూరు టాప్‌లో నిలిచింది. ఐఐటీ-ఇండోర్, ఐఐటీ-బాంబే యూనివర్సిటీలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే, ప్రపంచ అత్యుత్తమ యూనివర్సిటీల జాబితాలో చోటు దక్కించుకోని భారత్.. గతేడాదికంటే కొంత మెరుగు పడింది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ జాబితాలో భారత్‌నుంచి పోయిన సంవత్సరం 42 యూనివర్సీలు ఉండగా.. తాజాగా ఆ సంఖ్య 49కి చేరింది. దీంతో 250పైన ర్యాంకులు గల దేశాల జాబితాలో ఇండియా అయిదో స్థానంలో నిలిచింది. ఐఐఎస్సీ బెంగుళూరు 251-300 ర్యాంకింగ్స్‌లో కొనసాగుతోంది. -
ఢిల్లీ వీధుల్లో ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్, వైరల్ పోస్ట్
న్యూఢిల్లీ : చేతికి వచ్చిన కొడుకులు పట్టించుకోకుండా రోడ్డుపై వదిలివేసిన ఓ 74 ఏళ్ల ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్‌కు సోషల్ మీడియా ఓ గూడు చూపించింది. నాలుగు దశాబ్దాలుగా వీధుల్లోనే నివాసం గడిపిన ఇతనికి తలదాచుకోవడానికి చోటు కల్పించింది. ఈ ప్రొఫెసర్‌పై ఢిల్లీకి చెందిన అవినాష్ సింగ్ చేసిన ఫేస్బుక్ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. రాజా సింగ్ ఫూల్.. ఒకానొక సమయంలో ఎంతో ఖ్యాతి గడించిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి ప్రొఫెసర్. కానీ ఆయన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఎంతో దుర్భాంతకరమైన సంచార జీవితం గడుపుతున్నారు. 1960లో తన సోదరుడితో పాటు భారత్‌కు వచ్చిన రాజా సింగ్, ముంబైలో మోటార్ పార్ట్‌ల వ్యాపారం మొదలు పెట్టారు. కానీ తన సోదరుడు మరణిచడంతో ఆ వ్యాపారం కుదేలైంది. అంతేకాక అతని ఇద్దరు కుమారు కూడా రాజాసింగ్‌ను విడిచిపెట్టారు. కొడుకులను విదేశాలకు పంపించడానికి చాలా హార్డ్ వర్క్ చేశానని రాజా సింగ్, అవినాష్ చేసిన పోస్టులో చెప్పారు. రుణం తీసుకుని మరీ కొడుకుల్ని చదివించి, ఒకర్ని యూకేకి, మరొకర్ని అమెరికాకి పంపించినట్టు తెలిపారు. కానీ వారు ప్రస్తుతం తమ భార్యలతో పాటు అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని, కనీసం తండ్రిని చూడటానికి కూడా వారికి తీరిక దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీసా సెంటర్ బయట దరఖాస్తులను నింపుతూ రాజా సింగ్ తన కాలం గడుపుతున్నట్టు తెలిపారు. ‘దరఖాస్తులను నింపుతుంటా, వారికి సాయపడతుంటాను’ అని రాజా సింగ్ , అవినాష్ చేసిన ఫేస్బుక్ పోస్టులో చెప్పారు. కనీసం తల దాచుకోవడానికి ఓ ఇళ్లంటూ లేని ఈ 74 ఏళ్ల ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌కు సాయం చేయాలంటూ అవినాష్ ఈ పోస్టు చేశాడు. ఏప్రిల్ 21న షేర్ అయిన ఈ పోస్టుకు ఒక్కసారిగా అనూహ్య స్పందన వచ్చింది. 5000కు పైగా షేర్లు రావడమే కాక, రాజా సింగ్‌కు సాయం చేస్తామంటూ చాలా మంది ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఆయన్ని న్యూఢిల్లీలోని ఓల్డ్ ఏజ్ హోమ్‌కు తరలించారు. -
‘విశ్వ’ విజేత
కాలేజీ రోజుల్లో అతడూ అందరిలాంటి కుర్రాడే... రోజంతా... స్నేహితులతో షికార్లు.. పార్టీలతో సరదాగా గడిపిన వాడే! తెలివైన వాడనే ఒకే ఒక్క కారణం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ డిగ్రీ పూర్తి చేసే అవకాశమిచ్చింది. అయితేనేం.. ఒకసారి గురి కుదిరిన తరువాత మాత్రం వెనక్కి తిరిగి చూడలేదు.. మనకు కనిపించని విశాల విశ్వం అంచులని తాకింది ఆయన దృష్టి.. విశ్వం ఆవిర్భావం మొదలుకొని... అన్నింటినీ తనలో కలుపుకోగల కృష్ణబిలాల వరకూ.. భౌతికశాస్త్రాన్ని ఔపోసన పట్టేశాడు. సిద్ధాంతాల చట్రంలోకి తెచ్చేశాడు. ఒళ్లు చచ్చుబడిపోయినా.. ఒకదశలో కళ్లు మినహా మరే ఇతర అవయవం పనిచేయకపోయినా... తన మేధోశక్తితో విశ్వం ఆనుపానులను సామాన్యుడి దరికి చేర్చాడు. ఈ తరం ఐన్‌స్టీన్‌గా మిగిలిపోయాడు. ‘స్టీఫెన్ హాకింగ్’పేరుతో కాలంలోకి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు.. సాక్షి, హైదరాబాద్: మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు ఉపయోగపడేది భౌతిక శాస్త్రం. నాలుగు వందల ఏళ్ల క్రితం సర్ ఐజాక్ న్యూటన్ గురుత్వ ఆకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం భౌతికశాస్త్ర పురోభివృద్ధికి తొలి మేలిమలుపు అయితే.. 20వ శతాబ్దం తొలినాళ్లలో ఐన్‌స్టీన్ సామాన్య సాపేక్ష సిద్ధాంతం రెండవదన్నది అందరూ అంగీకరించే విషయం. సామాన్య సాపేక్ష సిద్ధాంతం విశాల విశ్వం పనితీరుపై ఒక అవగాహన కల్పిస్తుంది. అణుస్థాయిలో భౌతిక ప్రపంచం తీరుతెన్నులను అర్థం చేసుకునేందుకు పనికొచ్చే క్వాంటమ్ మెకానిక్స్‌పై కూడా ఐన్‌స్టీన్ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తోంది అంటే.. అటు విశాల విశ్వాన్ని విడమరచి చెప్పే సాపేక్ష సిద్ధాంతాన్ని.. ఇటు సూక్ష్మ ప్రపంచం ధర్మాలను వివరించే క్వాంటమ్ మెకానిక్స్‌ను కలిపింది స్టీఫెన్ హాకింగ్ కాబట్టి! భౌతిక శాస్త్రంలో ఇది మూడో మేలి మలుపని ప్రపంచం ఇప్పటికే గుర్తించడం హాకింగ్ గొప్పదనానికి నిదర్శనం. ఐన్‌స్టీన్, హాకింగ్.. వీరిద్దరిలో ఎవరు గొప్ప అన్న వాదన చాలాకాలంగా జరుగుతోంది. శాస్త్రవేత్తల కమ్యూనిటీ ఈ విషయంలో రెండుగా విడిపోయి ఉండవచ్చు కూడా. ఇద్దరినీ పోల్చి చూడటం సరికాదన్న అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది. అయితే కొన్ని విషయాల్లో ఐన్‌స్టీన్ కంటే హాకింగ్ గొప్పవాడు అనక తప్పదు. అందుకు కారణాలు ఏమిటంటే.. పట్టుమని 21 ఏళ్లు కూడా నిండకుండానే.. ‘ఇంకొన్నేళ్లలో నీకు మరణం తప్పదు’ అని ఎవరైనా అంటే.. కుప్పకూలిపోతారు.. నిరాశ నిస్పృహలతో జీవితాన్ని కొనసాగిస్తారు. స్టీఫెన్ హాకింగ్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వైకల్యం ముంచుకొస్తున్న తరుణంలోనే తన మేధకు మరింత పదును పెట్టి ఖగోళశాస్త్రంలో తనదైన ముద్ర వేశాడు. అందుకే ఆయన ఒకచోట ‘‘21 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి జీవితంపై నా అంచనాలన్నీ సున్నా అయిపోయాయి. ఆ తరువాత నాకు దక్కిందంతా బోనస్’’అని అంటాడు. గొంతుకనిచ్చిన టెక్నాలజీ 1985.. హాకింగ్ జెనీవాలో పర్యటిస్తున్నారు. న్యుమోనియా బారిన పడటంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అప్పటికే అమియోమోట్రోపిక్ లాటరల్ స్లె్కరోసిస్ (ఏఎల్ఎస్) వ్యాధితో బాధపడుతున్న హాకింగ్ శరీరం ఈ కొత్త దాడికి తట్టుకోలేకపోయింది. పరిస్థితి విషమించిన దశలో ఆయన ఊపిరి పీల్చుకునేందుకు గాను గొంతుకు రంధ్రం చేయాల్సి వచ్చింది. దీంతో ఆయన మాట్లాడే అవకాశాన్నీ కోల్పోయారు. కొంతకాలంపాటు కనుబొమల కదలికలతో, స్పెల్లింగ్ కార్డుల సాయంతో అక్షరాలను సూచిస్తూ పదాలను నిర్మించి తన భావాలను వెల్లడించే వారు. ఈ పరిస్థితుల్లో హాకింగ్‌తో పనిచేస్తున్న మార్టిన్ కింగ్ అనే శాస్త్రవేత్త కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న వర్డ్స్ ప్లస్ అనే సంస్థను సంప్రదించారు. ఈ సంస్థ అధిపతి వూల్టోజ్ అత్తగారూ ఏఎల్‌ఎస్‌తో బాధపడుతుండేవారు. ఆమె మాట్లాడేందుకు, రాసేందుకు వీలుగా వూల్టోజ్ ఈక్వలైజర్ పేరుతో ఒక కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. హాకింగ్‌కు ఇదేమైనా ఉపయోగపడుతుందేమో అని మార్టిన్ కింగ్ వూల్టోజ్ను విచారించారు. వూల్టోజ్ ఆ ఈక్వలైజర్‌ను హాకింగ్‌కు ఉచితంగా ఇచ్చేశారు. ఆపిల్ –2 కంప్యూటర్‌పై ఈక్వలైజర్ సాఫ్ట్‌వేర్‌కు స్పీచ్ సింథసైజర్ అనే పరికరం తోడైంది. హాకింగ్‌కు సపర్యలు చేసిన ఒక నర్సు భర్త డేవిడ్ మేసన్ దీన్ని తయారు చేశాడు. చిన్నసైజులో ఉండే ఈ స్పీచ్ సింథసైజర్ హాకింగ్ చక్రాల కుర్చీ చేతిమీద అమరిపోయింది. వీటి సాయంతో హాకింగ్ నిమిషానికి 15 పదాల చొప్పున మాట్లాడటం ప్రారంభించారు. అయితే, తన బొటనవేలిని మాత్రం కదిలించేందుకు ఉపయోగపడ్డ ఒక నాడి క్రమేపీ దెబ్బతినడంతో 2008 నాటికి ఆయన మౌస్‌ను క్లిక్ చేసే సామర్థ్యాన్ని కూడా కోల్పోయారు. ఈ దశలో హాకింగ్ విద్యార్థి ఒకరు చీక్ స్విచ్ పేరుతో ఇంకో చిన్న పరికరాన్ని అభివృద్ధి చేశారు. హాకింగ్ కళ్లజోడుకు అతుక్కునేలా రూపొందించిన ఈ పరికరం పరారుణ కాంతితో పనిచేసేది. దవడ కండరాలను బిగించడం ద్వారా ఇది మౌస్ మాదిరిగా పనిచేసేది. ఈ పరికరం సాయంతో హాకింగ్ ఈ మెయిళ్లు రాయడం మొదలుకొని ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం, పుస్తకాలు రాయడం, స్పీచ్ సింథసైజర్ సాయంతో మాట్లాడగలగడం వంటి అనేక పనులు చేయగలిగారు. 2011 నాటికి పరిస్థితి మరింత క్షీణించింది. నిమిషానికి ఒకట్రెండు మాటలు మాత్రమే మాట్లాడగలిగిన స్థితికి చేరుకున్నారు. ఈ దశలో ఇంటెల్ వ్యవస్థాపకుడు గార్డన్ మూర్ సాయం అందించేందుకు ముందుకొచ్చారు. కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జస్టిన్ రాట్నర్ కొంతమంది నిపుణుల సాయంతో హాకింగ్ ఆలోచనలనే మాటల రూపంలోకి మార్చగలిగారు. భూమిపై... ‘మనం భూమిని ఖాళీ చేయాల్సిన సమయం ఎంతో దూరంలో లేదు. మరో వందేళ్లలోనే మనం నివాసయోగ్యంగా ఉండే మరో గ్రహాన్ని వెతుక్కోవాలి. మితిమీరిన జనాభా, వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులు, భూమికి అత్యంత సమీపంగా వస్తున్న గ్రహశకలాలతో ఇక భూమిపై జీవించడం దుర్లభంగా మారుతుంది’ –మరో భూమి అన్వేషణ కోసం బీబీసీ డాక్యుమెంటరీపై.. మరణంపై... మరణం తర్వాత జీవితం లేదు. స్వర్గం, నరకం అన్నవి అసలే లేవు. చావు అంటే భయం ఉన్నవారి కోసం అలాంటి కట్టు కథలు అల్లారు. మన మెదడు ఒక కంప్యూటర్ లాంటిది. కంప్యూటర్లో విడిభాగాలు పాడైతే అదెలా పనిచేయదో మెదడు కూడా అంతే.. పనిచేయడం ఆగిపోతుంది. నాకు చావంటే భయం లేదు. అలాగని వెంటనే మరణించాలని లేదు. నేను కన్నుమూసేలోపు చేయాల్సింది చాలా ఉంది. జీవించి ఉన్న సమయంలోనే మనలోని శక్తి సామర్థ్యాల్ని సమర్థంగా వినియోగించుకోవాలి. –2011లో గార్డియన్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హాకింగ్ 5 అద్భుత రచనలు మై బ్రీఫ్ హిస్టరీ ఇది హాకింగ్ ఆత్మకథ లాంటిది. లండన్‌లో హాయిగా సాగిన తన బాల్యం.. బెట్స్ కడుతూ తన మిత్రులతో సరదాగా గడిచిన యవ్వనం.. మేధావిగా, ప్రఖ్యాత సైద్ధాంతిక శాస్త్రవేత్తగా తన పరిణామం.. ఈ వివరాలన్నింటినీ ‘మై బ్రీఫ్ హిస్టరీ’లో ఆసక్తికరంగా హాకింగ్ వివరిస్తారు. పాఠకులకు తెలియని ఒక కొత్త హాకింగ్‌ను, సరదాపరుడు, చతురుడైన హాకింగ్‌ను ఈ పుస్తకంలో ఆయన పరిచయం చేస్తారు. ఇందులోని అరుదైన ఫొటోగ్రాఫ్‌లు పాఠకులకు అదనపు ఆసక్తిని కలిగిస్తాయి. ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ భౌతిక, ఖగోళ సిద్ధాంతాలు సామాన్యులకు అర్థమయ్యే లా హాకింగ్ ఈ పుస్తకాన్ని 1988లో రాశారు. ఇందులో విశ్వం ఆవిర్భావం, విస్తరణ, అంతరిక్షం, కాలంతో పాటు గురుత్వాకర్షణ, కృష్ణబిలాలను సరళమైన రీతిలో హాకింగ్ వివరించారు. 2001 నాటికి 35 భాషల్లో తర్జుమా అయింది. ది గ్రాండ్ డిజైన్ ఈ పుస్తకాన్ని లియోనార్డ్ మ్లోడినౌ అనే మరో భౌతికశాస్త్రవేత్తతో కలసి హాకింగ్ 2010లో రచించారు. బిగ్‌బ్యాంగ్(విశ్వ ఆవిర్భావం) భౌతికశాస్త్ర నియమాల ఆధారంగానే జరిగిందనీ, ఇందులో దేవుడి పాత్రేమీ లేదని ఈ పుస్తకంలో హాకింగ్ స్పష్టం చేశారు. విశ్వం పుట్టుకను తెలుసుకునేందుకు దేవుడ్ని అన్వేషించాల్సిన అవసరం లేదన్నారు. ‘దేవుడు లేడని ఎవ్వరూ నిరూపించలేరు. కానీ సైన్స్ దేవుడి అవసరం లేకుండా చేస్తుంది’ అని అన్నారు. యూనివర్స్ ఇన్ ఏ నట్‌షెల్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ పుస్తకానికి సీక్వెల్‌గా హాకింగ్ దీన్ని 2001లో రాశారు. ఇందులో తన పరిశోధనలతో పాటు క్వాంటమ్ మెకానిక్స్, ఆధునిక భౌతికశాస్త్ర సిద్ధాంతాలు, ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్తలైన ఐన్‌స్టీన్, రిచర్డ్ ఫైన్‌మెన్‌ల సిద్ధాంతాలను ఇందులో హాకింగ్ వివరించారు. ఈ పుస్తకం 2002లో అవెన్టిస్ ప్రైజ్‌కు ఎంపికైంది. జార్జ్స్ సీక్రెట్ కీ టు యూనివర్స్ కుమార్తె లూసీతో కలసి హాకింగ్ 2007లో చిన్నారుల కోసం రాసిన పుస్తకమిది. ఇందులో కాస్మోస్ అనే శక్తిమంతమైన కంప్యూటర్ సాయంతో చిన్నారులు సుసన్, రింగో, ఎరిక్, జార్జ్‌లతో పాటు డా.రీపర్ సాహసాలు చేస్తారు. కథల రూపంలో విశ్వంలోని సంక్లిష్ట అంశాలను సులభంగా అర్థమయ్యేలా హాకింగ్ ఇందులో వివరించారు. భారత్‌తో అనుబంధం తొలిసారి 2001లో భారత్‌కు వచ్చిన హాకింగ్ 16 రోజులపాటు దేశంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో జరిగిన ఓ సెమినార్లో ప్రసంగించారు. అలాగే ‘స్ట్రింగ్స్ 2001’పేరుతో జరిగిన మరో కార్యక్రమంలో నిర్వాహకులు హాకింగ్‌ను ‘సరోజిని దామోదర్ ఫెలోషిప్’తో సత్కరించారు. హాకింగ్ చక్రాల కుర్చీని అమర్చేలా మహీంద్రా అండ్ మహీంద్రా రూపొందించిన ప్రత్యేకమైన కారులో ఆయన ముంబైలో విహరించారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్, కుతుబ్మీనార్లను సందర్శించిన హాకింగ్ ఈ పర్యటనలో భాగంగా అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్‌ను కలుసుకుని దాదాపు 45 నిమిషాల సేపు ముచ్చటించారు. హాకింగ్‌ను కబళించిన వ్యాధి స్టీఫెన్ హాకింగ్‌కు 21 ఏళ్ల వయసులోనే అమియోట్రోపిక్ లాటరల్ స్లె్కరోసిస్ (ఏఎల్ఎస్) అనే ప్రాణాంతక వ్యాధి ఉన్నట్లు బయటపడింది. హాకింగ్ మరో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం బతకరని అప్పట్లో వైద్యులు చెప్పినా ఆయన మరో 50 ఏళ్లపైనే జీవించడం విశేషం. అసలు ఇంతకీ ఏంటీ ఏఎల్ఎస్ వ్యాధి.. దీనినే లౌ గెహ్రిగ్స్ వ్యాధి అని కూడా పిలుస్తారు. ఇది నాడీ వ్యవస్థపై దుష్ప్రభావం చూపే అరుదైన రోగం. భారత్‌లో ఏడాదికి దాదాపు లక్ష మంది ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు అంచనా. ఇది కండరాలను బలహీనపరిచి ఏ చిన్న పని కూడా చేయనీదు. చికిత్సతో స్వల్ప ప్రయోజనం ఉండొచ్చు కానీ పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు. రోజులు గడిచేకొద్దీ వ్యాధి మరింత ముదురుతుంది. క్రమక్రమంగా కండరాలు సత్తువ కోల్పోయి నిలబడటం, మాట్లాడటం, తినడం, కదలడం చేయలేరు. కనీసం సరిగ్గా ఊపిరి కూడా తీసుకోలేరు. నరాల నుంచి మెదడుకు సంకేతాలు చేరవు. కండరాలు చచ్చుబడిపోతాయి. సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు బయటపడిన మూడు నుంచి ఐదేళ్లలోపు శ్వాసకోశ సంబంధ సమస్యలతో రోగులు చనిపోతారు. ఆస్తులు 129.75 కోట్లు - చనిపోయేనాటికి స్టీఫెన్ హాకింగ్ సంపద రూ.129.75 కోట్లు(2 కోట్ల డాలర్లు)గా ఉంది. - సిమ్సన్స్, ఫ్యుచరమా, స్టార్‌ట్రెక్: నెక్సట్ జనరేషన్, ద బిగ్‌బ్యాంగ్ థియరీ వంటి టెలివిజన్ సీరియళ్లలో హాకింగ్ పేరుతో పాత్రలను రూపొందించారు. అడుగడుగునా పోరాటమే వీల్ చైర్ నుంచే విశ్వ రహస్యాలను శోధించి... ఆత్మస్థైర్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ జీవితమే ఒక పోరాటం. అరుదైన వ్యాధితో పోరాడటమే కాదు, కుటుంబ జీవితంలోనూ ఆయన ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. గొప్ప శాస్త్రవేత్తగా ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన హాకింగ్ విద్యార్థి జీవితం సాదాసీదాగా గడిచిపోయింది. చదువులో పెద్దగా ప్రతిభ కనబర్చకపోయినప్పటీకీ.. చిన్నారి హాకింగ్ తెలివితేటల్ని చూసి టీచర్లు మంత్రముగ్ధులయ్యేవారు. తొమ్మిదేళ్ల వయసులోనే హాకింగ్‌కు ఐన్‌స్టీన్ అనే నిక్‌నేమ్ కూడా ఉండేది. తొలుత హాకింగ్‌ను డాక్టర్ చేయాలని ఆయన తండ్రి ఆశపడ్డారు. ఇందుకోసం బయాలజీ తీసుకోవాలని ఒత్తిడి కూడా చేశారు. అయితే హాకింగ్‌కు గణితంపై అమితమైన ఆసక్తి ఉండటంతో అందులోనే డిగ్రీ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో గణితంలో డిగ్రీకి ప్రథమ ప్రాధాన్యం లేకపోవడంతో ఆయన భౌతికశాస్త్రాన్ని ఎంచుకున్నారు. అప్పటి నుంచి భౌతిక, ఖగోళ శాస్త్రాల లోతుపాతుల్ని తెలుసుకోవడం మొదలుపెట్టారు. ప్రేమ.. పెళ్లి 1963లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హాకింగ్‌కు జేన్ విల్డే అనే అమ్మాయితో తొలిసారి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇంతలోనే తనను అరుదైన వ్యాధి కబళిస్తోందన్న విషయం హాకింగ్‌కు తెలిసింది. ఈ విషయాన్ని విల్డేకు ఆయన తెలిపారు. ఆమె అంగీకరించడంతో వీరిద్దరూ 1965లో వివాహం చేసుకున్నారు. హాకింగ్ దంపతులకు రాబర్ట్, తిమోతి అనే ఇద్దరు కుమారులు, లూసీ అనే కుమార్తె ఉన్నారు. వివాహం అనంతరం సపర్యలు చేయడానికి వచ్చిన నర్సు ఎలైన్ మాసన్‌తో హాకింగ్ సన్నిహితంగా ఉండటంతో వీరి కాపురంలో కలతలు చెలరేగాయి. భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఆయనకు దూరమయ్యారు. హాకింగ్ తమకు దూరమవ్వడానికి ఎలైనే కారణమని అప్పట్లో ఆయన పిల్లలు ఆరోపించారు. అయితే వీటన్నింటిని పట్టించుకోని హాకింగ్ 1995లో ఎలైన్‌ను వివాహమాడారు. పెళ్లి తర్వాత ఎలైన్ హాకింగ్‌ను హింసిస్తోందనీ.. చెయ్యి చేసుకుంటోందని తోటి నర్సులు పోలీసులకు ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనమైంది. తొలుత ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, హాకింగ్ ఆ ఆరోపణల్ని ఖండించడంతో కేసును క్లోజ్ చేశారు. ఎలైన్‌తో హాకింగ్ వివాహబంధం కూడా ఎక్కువకాలం నిలవలేదు. 2006లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత హాకింగ్ తన పిల్లలకు దగ్గరయ్యారు. కుమార్తె లూసీతో కలసి సైన్స్‌కు సంబంధించి ఐదు పుస్తకాలు రాశారు. హాకింగ్ పరిశోధనలు క్లుప్తంగా.. 1970 ఈ విశ్వం మొత్తం సింగుల్యారిటీ ద్వారా ఏర్పడింది. మనకు కనిపిస్తున్న గ్రహాలు, నక్షత్రాలు అన్నిరకాల ఇతర పదార్థాలు కంటికి కనిపించనంత చిన్న గుళిక స్థాయికి కుంచించుకుపోయాయనుకోండి.. అప్పుడు విశ్వం సాంద్రత, బరువు అనంతమవుతాయి. అంతరిక్షం, కాలం అన్నీ అందులోనే ఇమిడిఉంటాయి. ఈ భావనను సింగ్యులారిటీ అంటారు 1972-74 కృష్ణబిలాల యంత్రాంగం: విశ్వంలో అక్కడక్కడా అదృశ్యంగా ఉండే కృష్ణబిలాల నుంచి కూడా రేడియోధార్మికత వెలువడుతూ ఉంటుందని ప్రతిపాదన. 1981 ఇన్ఫర్మేషన్ పారడాక్స్: కృష్ణబిలంలోకి వెళ్లే పదార్థం, సమాచారం ఏదైనా సరే.. అది ఆవిరి అవడంతో ఎవరికీ అందకుండా పోతుంది. 1983 అనంత విశ్వం: అంతరిక్షం–కాలాలకు సంబంధించి ఈ విశ్వానికి సరిహద్దులు లేవు 1988 కాలం: కాలమనేది దూసుకుపోతున్న మూడు బాణాల వంటిదని హాకింగ్ అంచనా వేశారు. థెర్మోడైనమిక్స్ ఒక బాణమైతే... ఖగోళ, మానసిక సంబంధమైనవి మిగిలిన రెండు. 2006 ఈ విశ్వం వేర్వేరు స్థితుల నుంచి ఉనికిలోకి వచ్చింది. -
దిగొచ్చిన ఆక్స్ఫర్డ్..
లండన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వెలగబెట్టిన నిర్వాకం వివాదంగా మారింది. సోషల్ మీడియాలో దుమారం రేగడంతో ఆక్స్ఫర్డ్ దిగొచ్చి క్షమాపణలు చెప్పింది. అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సోఫీస్మిత్.. ట్విటర్లో పోస్ట్ చేసిన మహిళ ఫొటో వివాదానికి కారణమైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి8) రోజున యూనివర్సిటీ మెట్లపై రాసివున్న ‘హ్యాపి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే’ నినాదాన్ని ఓ మహిళతో శుభ్రం చేయించడం, అక్కడేవున్న నలుగురు పురుషులు ఏమీ పట్టనట్టు మాట్లాడుకుంటున్నట్టు ఫొటోలో ఉంది. ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూనివర్సిటీ చర్యను తప్పుబడుతూ నెటిజన్లు మండిపడ్డారు. దీంతో ఆక్స్ఫర్డ్ క్షమాపణ చెప్పింది. ‘మీరు క్షమాపణలు చెప్పినందుకు అభినందనలు. కానీ మీరు ఆ మహిళకు హృదయపూర్వకంగా క్షమాపణలు తెలిపి, గౌరవించండి’ అంటూ ప్రొఫెసర్ సోఫీస్మిత్ ట్విటర్లో స్పందించారు. Oxford security makes a woman cleaner scrub out “Happy International Women’s Day” on the Clarendon steps. What an image for #IWD, @UniofOxford. #strikeforUSS #UCUstrike pic.twitter.com/E9u5S37hWW — Sophie Smith (@DrSophieSmith) March 8, 2018 I appreciate your apology, but far more importantly can you please make sure that the woman asked to remove the message receives a heartfelt apology, a warm cup of tea, the rest of the day off and, along with all our precarious staff, good enough pay to live in this city. — Sophie Smith (@DrSophieSmith) March 8, 2018 -
పురుషులను అధిగమించారు
లండన్: చారిత్రక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తన 800 ఏళ్ల చరిత్రలో తొలిసారి పురుషుల కన్నా మహిళలకు ఎక్కువ ప్రవేశాలు కల్పించింది. 2017లో వివిధ డిగ్రీ కోర్సులకు 1275 మంది మహిళలకు, 1165 మంది పురుషులకు అవకాశం ఇచ్చినట్లు యూనివర్సిటీ ప్రకటించింది. అందులో 1070 మంది మహిళలు, 1,025 మంది పురుషులు అవసరమైన గ్రేడ్లు సాధించి సీట్లు పొందినట్లు పేర్కొంది. సెప్టెంబర్‌లో తరగతులు ప్రారంభమవుతాయి. తాజా గణాంకాలు మహిళా విద్యార్థుల పురోగతికి సంకేతాలని యూనివర్సిటీ వ్యాఖ్యానించింది. ప్రముఖ యూనివర్సిటీలు వెనకబడిన, నిరుపేద విద్యార్థులకు కల్పిస్తున్న ప్రవేశాల్లో గణనీయ పెరుగుదల నమోదైనట్లు ఆక్స్ఫర్డ్ వెల్లడించిన వివరాల ఆధారంగా తెలుస్తోంది. ఇంగ్లండ్‌లో అత్యంత పురాతన యూనివర్సిటీగా పేరొందిన ఆక్స్‌ఫర్డ్‌ను ఎప్పుడు స్థాపించిందీ స్పష్టంగా తెలియదు. కానీ 1096లో బోధన ప్రారంభమై, 1167లో అభివృద్ధి చెందినట్లు యూనివర్సిటీ వెబ్సైట్లో సమాచారం ఉంది. -
నీటిని తాగేసిన మార్స్
లండన్: అంగారకుడి ఉపరితలంపై ఒకప్పుడు నీరు ప్రవహించేదా..? మరి ఇప్పుడు ఆ నీరు ఏమైంది..? అన్న ప్రశ్నలకు పరిశోధకులు సమాధానం కనుగొన్నారు. ఒకప్పుడు నదిలా ప్రవహించిన నీటిని అంగారక గ్రహ ఉపరితలం స్పాంజ్ మాదిరిగా శోషించుకుందని వెల్లడించారు. బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. భూ ఉపరితలంపై ఉన్న రాళ్ల కంటే మార్స్ ఉపరితలంపై రాళ్లు 25 శాతం అధికంగా నీటిని శోషించుకుంటాయని గుర్తించారు. ఎప్పటినుంచో ఈ విధంగా శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నా.. తొలిసారి తాము మాత్రం ప్రయోగాత్మకంగా దీన్ని నిరూపించామని వర్సిటీకి చెందిన పరిశోధకులు జాన్ వేడ్ వెల్లడించారు. ఇప్పటివరకు అయస్కాంత క్షేత్రం ఒక్కసారిగా పతనమవడంతో నీరు అంతరిక్షంలోకి మళ్లిందని పరిశోధకులు భావించేవారు. -
మరో గౌరవం కోల్పోయిన సూచీ
లండన్: మయన్మార్‌లో రోహింగ్యాల సమస్య కారణంగా ఆంగ్‌సాన్ సూచీ మరో గౌరవాన్ని కోల్పోయారు. సుప్రసిద్ధ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కాలేజ్‌లో ‘జూనియర్ కామన్ రూమ్’ నుంచి ఆమె పేరును తొలగించారు. స్వదేశంలో రోహింగ్యాలపై జరుగుతున్న అకృత్యాలకు సంబంధించి ఆమె నిస్సహాయంగా ఉన్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి సెయింట్ హ్యూస్ విద్యార్థులు సూచీ పేరును జూనియర్ కామన్ రూమ్ నుంచి తక్షణమే తొలగించడానికి అనుకూలంగా ఓటేశారు. ‘రాఖైన్‌లో రోహింగ్యాలపై జరుగుతున్న అకృత్యాలు, అత్యాచారాలు, హత్యలను సూచీ ఖండించకపోవడం శోచనీయం. సూచీ మౌనాన్ని ఖండిస్తున్నాం’ అని విద్యార్థులు తీర్మానంలో పేర్కొన్నారు. సెయింట్ హ్యూస్ కాలేజీ ప్రవేశ ద్వారం నుంచి సూచీ ఫొటోను ఇటీవల తొలగించిన సంగతి తెలిసిందే. -
సున్నా.. మరో 500 ఏళ్లు వెనక్కి!
సాక్షి, న్యూఢిల్లీ: అంకెలకు ముందు, వెనక స్థానానికి సున్నా(0)ను చేర్చటం-మార్చటం ద్వారా ఆ విలువ చాలా చాలా మారిపోతుంటుంది. అంతంటి విలువైన సున్నా అనే అంకెను మన భారతీయులే కనిపెట్టారన్నది మనకు గర్వకారణమైన విషయం. ప్రాచీన మయన్స్, బాబిలోనియన్స్ లాంటి సాంప్రదాయల నుంచి కాకుండా క్రీస్తు శకం 628లో భారతీయ గణిత శాస్త్రవేత్త బ్రహ్మగుప్త కనిపెట్టిన సున్నాకే విలువ ఇచ్చి చెలామణిలోకి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు దానిని కూడా మరో 500 ఏళ్ల ప్రాచీనతత్వాన్ని ఆపాదించేస్తూ ఆధారాలతో సహా నిరూపించేశారు ఆక్సఫర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు. ప్రాచీన తక్షశిల(ప్రస్తుతం పెషావర్ సమీపంలో ఉంది) నుంచి 1881 లో సేకరించిన బఖ్షలి మనులిపి 1902 నుంచి ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఉంచారు. కార్బన్ డేటింగ్ ఆధ్యయనం ద్వారా ఆ లిపిపై అక్షరాల క్రమం కనుగొన్న శాస్త్రవేత్తలు, అందులో 0 కు సంబంధించిన ఆధారాలను చూపించేస్తున్నారు. ఇంతకు ముందు 9 శతాబ్దానికి చెందిన మనుస్మృతి లిపి ద్వారా సున్నా అనే అక్షరాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. బ్రహ్మగుప్తుడు రచించిన బ్రాహ్మస్ఫుటసిద్ధాంతం నుంచి దానిని స్వీకరించినట్లు చెప్పారు. అయితే బఖ్షలి లిపి మాత్రం 224 నుంచి 383 క్రీశ శకాల మధ్య కాలానికి చెందినది చెందినదిగా చెబుతున్నారు. ఆ లెక్కన ఇంతకు ముందు చెప్పుకున్న దానికంటే 500 ఏళ్ల క్రితమే సున్నా వాడకంలో ఉండేదని మర్కస్ డు సౌతోయి అనే గణిత శాస్త్ర పరిశోధకుడు చెబుతున్నారు. బఖ్షలి లిపిలో చుక్క రూపంలో ఉన్నప్పటికీ తర్వాత కాలక్రమేణా అది సున్నాగా రూపాంతరం చెందిందని ఆయన అంటున్నారు. -
సూర్యుడు ఉన్నంతకాలం!
లండన్: మనుషులు, కీటకాలు, ఇతర జీవజాతుల ఆయుషు ఎంతో మనకు తెలిసిందే. అయితే సూర్యుడు ఉన్నంతకాలం జీవించే అరుదైన సూక్ష్మ జంతువు ఒకటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎనిమిది కాళ్లు ఉండే టార్డిగ్రేడ్ అనే జంతువు సూర్యుడు మరణించే వరకు జీవించి ఉండగలదని, ప్రపంచంలోనే నాశనం కాని జీవుల్లో ఇది ఒకటని పరిశోధకులు తెలిపారు. ఖగోళ విపత్తులను సైతం ఎదుర్కొని సుమారు పది బిలియన్ సంవత్సరాలు బతుకుతుందని బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వెల్లడించారు. అంతేకాకుండా 30 ఏళ్ల పాటు నీరు, ఆహారం లేకుండా, 150 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కూడా ఇది జీవించగలదని, అలాగే ఇతర గ్రహాలపై కూడా జీవించే అవకాశం ఉందని తెలిపారు. నీటి ఎలుగుబంటిగా పిలిచే ఈ జంతువు పరిమాణం కేవలం 0.5 మిల్లిమీటర్ మాత్రమేనని, మైక్రోస్కోప్‌లో దీన్ని స్పష్టంగా చూడవచ్చని వివరించారు.అతిపెద్ద ఉల్కాపాతం, సూపర్ నోవా రూపంలో జరిగే నక్షత్రాల పేలుళ్లు, గామా కిరణాల పేలుళ్లు వంటి ఖగోళంలో జరిగే ఈ మూడు ఘటనలను పరిశోధకులు అధ్యయనం చేశారు. భూమిపై మానవుడు నిష్క్రమించిన అనంతరం కూడా అనేక జంతుజాతులు జీవిస్తాయని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పోస్ట్ డాక్టరోల్ రీసెర్చ్ అసోసియేట్ రాఫెల్ ఆల్వ్ బటిస్టా వివరించారు. ఈ పరిశోధన ఫలితాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
ఆక్స్ఫర్డ్ పాఠాల్లో గాంధీ, లూథర్ కింగ్
లండన్: భారత్‌తో పాటు ఆసియాలోని పలు చారిత్రక అంశాలతో కూడిన చరిత్ర పేపర్‌ను తప్పనిసరి చేస్తూ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది. భారత జాతిపిత మహాత్మ గాంధీతో పాటు 1960లో అమెరికా నల్లజాతి హక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్‌కింగ్ గురించి పాఠ్యాంశాలను రూపొందించనున్నారు. ప్రస్తుతం బ్రిటన్ చరిత్రపై ఉన్న రెండు పేపర్లకు అదనంగా డిగ్రీ(హిస్టరీ) విద్యార్థులు దీన్ని చదవాల్సి ఉంటుందని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ‘మా పాఠ్యాంశాలు జాతివివక్షతో ఎందుకున్నాయి’ అనే నినాదంతో విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేపట్టపడంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. -
ఆక్స్ఫర్డ్ బోధన చెత్త: భారతీయ విద్యార్థి కేసు
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటే అందరూ ఒక ఆరాధనాభావంతో చూస్తారు. అక్కడ చదువుకోవడం అంటే పూర్వజన్మ సుకృతం అనుకుంటారు. కానీ, అలాంటి యూనివర్సిటీలో బోధన పరమ బోరింగ్‌గా ఉందని, దానివల్ల తనకు డిగ్రీలో సెకండ్ క్లాస్ వచ్చి, న్యాయవాదిగా తన కెరీర్లో సంపాదన కోల్పోవాల్సి వచ్చిందని ఆరోపిస్తూ ఒక భారతీయ విద్యార్థి కేసు వేశాడు. ఫైజ్ సిద్దిఖీ అనే యువకుడు యూనివర్సిటీలోని బ్రాసెనోస్ కాలేజిలో ఆధునిక చరిత్ర చదివాడు. అక్కడి టీచర్లు బోధనలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని లండన్ హైకోర్టులో కేసు దాఖలు చేశాడు. ముఖ్యంగా తాను ప్రత్యేక సబ్జెక్టుగా తీసుకున్న ఇండియన్ ఇంపిరీయల్ హిస్టరీ బోధన ఘోరంగా ఉందన్నాడు. ఈ కేసులో తీర్పు ఈ నెలాఖరులో వచ్చే అవకాశం ఉంది. 1999-2000 విద్యాసంవత్సరం సమయంలో ఏషియన్ హిస్టరీ బోధించేవాళ్లు మొత్తం ఏడుగురు ఉండగా అందులో నలుగురు సెలవులో ఉన్నారని, అందువల్ల మిగిలినవాళ్లు కూడా సరిగా చెప్పలేదని సిద్దిఖీ తరఫు న్యాయవాది రోజర్ మలాలియూ వాదించారు. తాను ఆక్స్‌ఫర్డ్‌లో చదివితే తనకు మంచి ర్యాంకులు వచ్చి, అంతర్జాతీయ కమర్షియల్ లాయర్‌గా పెద్దజీతం అందుకుంటానని భావించానని సిద్దిఖీ అన్నాడు. దక్షిణ భారత చరిత్రలో నిపుణుడైన డేవిడ్ వాష్‌బ్రూక్ చాలా బోరింగ్‌గా చెప్పారని తెలిపాడు. అయితే.. సిబ్బంది కొరత కారణంగానే ఆయనపై భరించలేనంత ఒత్తిడి కలిగిందని మలాలియూ చెప్పారు. అయితే వాష్‌బ్రూక్ మీద తాము వ్యక్తిగత ఆరోపణలు ఏమీ చేయడంలేదని, యూనివర్సిటీ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని అన్నారు. సిద్దిఖీ పరీక్షలలో తన ఫలితాలు చూసుకుని తీవ్రమైన డిప్రెషన్, నిద్రలేమికి గురయ్యాడని, అందువల్ల ఎక్కువసేపు సమర్థంగా పనిచేయలేకపోతున్నాడని కూడా వాదించారు. -
చేపలు మనుషులను గుర్తుపడతాయి..
లండన్: చేపలు మనుషుల ముఖాన్ని కచ్చితత్వంతో గుర్తు పట్టగలవని తేలింది. మనుషుల ముఖాలన్నీ ప్రాథమికంగా ఒకే నిర్మాణాన్ని కలిగి ఉంటాయనీ, అయినా ఆశ్చర్యకరంగా చేపలు వివిధ వ్యక్తుల ముఖాల మధ్య తేడాలను గుర్తించాయని అధ్యయనం జరిపిన క్వీన్స్లాండ్, ఆక్స్ఫర్డ్ వర్సిటీల శాస్త్రవేత్తలు తెలిపారు. మానవ మెదడులో మనుషులను గుర్తించే ప్రాంతం చిన్న జంతువుల్లో కూడా ఉంటుందో లేదో తాము పరీక్షించామన్నారు. చేపలు 44 వరకు ముఖాల మధ్య తేడాలను గుర్తించాయన్నారు. -
ప్రాచీన వేరు మూలకణాలు లభ్యం
లండన్: 32 కోట్ల ఏళ్లకింద నాటి వృక్ష శిలాజ వేరు మూలకణాల్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ వేరు ఇంకా పెరుగుతూనే ఉందని తెలిపారు. ఆక్స్ఫర్డ్ వర్సిటీలో ఈ పరిశోధనను నిర్వహించారు. శిలాజ వృక్ష కాండం వేర్లు, బతికున్న చెట్ల వేర్ల తరహాలోనే నిర్మాణం, వృద్ధి జరుగుతోందని పరిశోధకుడు అలెగ్జాండర్ హెతెరింగ్టన్ తెలిపారు. మూలకణాల్లోని స్వయం పునరుద్ధరణ కణాలు బహుకణ జీవుల పెరుగుదలకు ఏవిధంగా సహయపడతాయో తెలుసుకోవచ్చన్నారు. -
13 ఏళ్లకే అమ్మాయిలు అలా..
చదువులో డిగ్రీ సాధించాలని, యూనివర్సిటీలో చేరాలని మీకు ఎప్పుడు అనిపించింది? ఏ వయసులో మీకు చదువుల పట్ల సద్భావన కలిగింది? స్టడీస్ మీద శ్రద్ధపెట్టి ఎదగాలని ఎప్పుడు నిర్ణయించుకున్నారు? మీరు అబ్బాయిలైతే గనక ఈ ప్రశ్నలను మరోసారి జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే డిగ్రీ సాధించడం, వర్సిటీల్లో చేరాలనే నిర్ణయాలు తీసుకోవడంలో అబ్బాయిలు వెనుకబడిపోతున్నారు. అదే అమ్మాయిలైతే 13 ఏళ్లకే వర్సిటీలో చేరాలనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ జరిపిన తాజా అధ్యయనంలో ఉన్నత చదువులపై అమ్మాయిలు అబ్బాయిలకన్నా ఎక్కువ సానుకూల దృక్ఫథంలో ఉన్నట్లు వెల్లడైంది. లండన్ కు చెందిన సట్టన్ ట్రస్ట్ నిర్వహించిన ఈ సర్వేలో 65 శాతం అమ్మాయిలు వర్సిటీల్లో చదువుకోవాలని చిన్నవయసులోనే ఫిక్స్ అవుతుండగా, అబ్బాయిలు 58 శాతం మందే అలా భావిస్తున్నారని తేలింది. యూరప్ లో ఉన్నత విద్యను అభ్యసించే అబ్బాయిల శాతం (36) కంటే అమ్మాయిల శాతమే (46) ఎక్కువగా ఉండటం కూడా వారి పాజిటివ్ ఆటిట్యూడ్ కు మరో కారణం. 61 శాతం మంది అమ్మాయిలు డిగ్రీ చదవడం అత్యావశ్యం అనుకుంటే, 13 శాతం మంది మాత్రం దానిని తేలికగా తీసుకుంటున్నారు. 10 మంది అమ్మాయిల్లో ఒక్కరు మాత్రమే డిగ్రీ అవసరమేలేదని భావిస్తున్నారట. ఈ రిపోర్టు సాదాసీదాగా చేసిందేమీకాదని, 3000 మంది విద్యార్థినీ విద్యార్థుల సమగ్రవివరాలు సేకరించిన పిదప గణాంకాలను సిద్ధంచేశామని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ కేత్ సేల్వా చెబుతున్నారు. 13 ఏళ్ల వయసులో అమ్మాయిలు అబ్బాయిల మధ్య లింగపరమైన బేధాలు ఏర్పాడతాయని, అయితే భవిష్యత్ విషయంలో అబ్బాయిల కంటే అమ్మాయిలకే స్పష్టమైన అవగాహన ఏర్పడుతుందని ఆమె పేర్కొన్నారు. -
ట్వీట్లు చేస్తున్నారా.. జర భద్రం..!
సోషల్ మీడియాలో ట్విట్టర్ జోరు రోజురోజుకు పెరిగిపోతోంది. వ్యాపారవేత్తలు, క్రికెటర్స్, రాజకీయ నాయకులు, సినీ తారలు ఇలా చాలా రంగాలకు చెందిన వారు తమ అభిమానులతో ఎన్నో విషయాలను షేరుకుంటున్నారు. ఇందుకు ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ఖాతా వాడుతున్నారు. అయితే ఇప్పటినుంచి అందరు ఒక్క విషయాన్ని గుర్తుంచకోవాలని ఓ రీసెర్చ్ ద్వారా వెల్లడయింది. మన వ్యక్తిగత వివరాలు కొన్ని చెప్పేందుకు మనం చేసే ట్వీట్ లు ఉపయోగపడతాయని తాజా సర్వేలో తేలింది. లోకేషన్ తో పాటు ప్రైవసీకి భంగం వాటిల్లే అవకాశాలే ఎక్కువని యూజర్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఆక్స్ ఫర్డ్ వర్సిటీకి చెందిన మిట్ రీసేర్చర్స్ కనుగొన్న వివరాలిలా ఉన్నాయి. ట్విట్టర్లో ప్రతిరోజు ట్వీట్లు చేస్తుంటారు కదా.. అయితే రోజు కనీసం 8 ట్వీట్లు చేస్తే వ్యక్తిగత వివరాలు తెలుసుకోవచ్చు. పోస్ట్ చేసిన వ్యక్తి ఎక్కడి నుంచి చేశాడో తెలిసిపోతుందట. ఇవే కాకుండా ఇతరులు పోస్ట్ చేసిన ఫన్నీ వీడియోలకు కామెంట్లు, లైక్స్ కొట్టడంతో కూడా యూజర్స్ అడ్రస్, ఇతర సమాచారం చెప్పే అవకాశాలున్నాయని ఆక్స్ ఫర్డ్ రీసెర్చర్స్ వెల్లడించారు. ట్విట్టర్ లొకేషన్ సర్వీస్ ఆఫ్ చేస్తే ఈ విషయాలు కనిపెట్టేందుకు వీలుండదు. అయితే లొకేషన్ రిపోర్టింగ్ సర్వీస్ టర్న్ ఆఫ్ చేస్తే ప్రైవసీ ఉంటుందన్నారు. కొన్నిసార్లు ఇలా వ్యక్తిగత వివరాలు తెలియడంతో ఉపయోగాలున్నా.. అనర్థాలెన్నో అని ఇంటర్నెట్ పాలసీ రీసెర్చ్ చేసిన విశ్లేషకులు చెబుతున్నారు. -
'టిప్ ఇవ్వని విద్యార్థి'పై వర్సిటీ వేటు!
తెల్లగా ఉందన్న కారణంతో రెస్టారెంట్ వెయిట్రస్ కు టిప్ ఇవ్వకుండా అవమానించిన నల్లజాతి విద్యార్థిపై వేటు వేయాలంటూ దాదాపు 50 వేల మంది ఆక్స్ ఫర్డ్ వర్సిటీకి పిటిషన్లు పంపడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 'జాత్యహంకారి ఎన్టొకోజో క్వాంబే'ను ఆక్స్ ఫర్డ్ నుంచి తొలిగించాలంటూ వస్తున్న పిటిషన్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వర్సిటీ ఎలాంటి చర్య తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆక్స్ ఫర్డ్ లో లా పూర్తిచేసిన దక్షిణాఫ్రికా విద్యార్థి క్వాంబే.. పబ్లిక్ పాలసీలో పీజీ చేసేందుకు మళ్లీ అదే యూనివర్సిటీ చేరాడు. గతవారం తన సొంత ఊరు కేప్ టౌన్ లో ఓ రెస్టారెంట్ కు వెళ్లిన క్వాంబే తెల్ల వెయిట్రస్ కు టిప్ ఇవ్వకుండా దూషించి అవమానించాడు. సోషల్ మీడియాలో సంచలనం రేపిన ఈ ఉదంతంలో సదరు తెల్ల వెయిట్రస్ ఆష్లే స్కుల్జ్ కు భారీ ఎత్తున విరాళాలు లభించిన సంగతి తెలిసిందే. ఆక్స్ ఫర్డ్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, ఇక్కడి విద్యార్థుల భావాలకు, చేసే పోరాటాలకు అడ్డుకట్ట వేయబోదని వర్సిటీ అధికారుల ప్రకటించారు. అయితే సాటి మనిషిని తూలనాడటం తప్పేనని, అంత మాత్రాన క్వాంబేపై చర్యలు తీసుకోమని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సిఉంది. (చదవండి: ఆమె తెల్లగా ఉందని టిప్ ఇవ్వనన్నాడు!) -
పండ్లతో గుండె భద్రం!
బీజింగ్: తరచూ పండ్లు తినే వాళ్లకు గుండెపోటు వచ్చే ప్రమాదం తక్కువని తాజా అధ్యయనంలో తేలింది. చైనాలోని పది పట్టణాలు, గ్రామాల్లో సుమారు ఏడేళ్ల పాటు 5లక్షల మంది వయోజనులపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, చైనీస్ అకాడమీ ఆఫ్ మెడికల్ సెన్సైస్ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించా రు. ముఖ్యంగా యాపిల్, నారింజ పండ్లు రక్తపోటు నియంత్రణ తదితరాలపై ప్రభావం చూపుతున్నట్లు వెల్లడైంది. రోజుకు వంద గ్రాముల పండ్లు తినడంవల్ల గుండె సంబంధ వ్యా ధులు వచ్చే అవకాశం చాలా తక్కువని పరిశోధనలో తేల్చారు. -
ఫేస్బుక్ లో ఉన్నది నకిలీ ఫ్రెండ్స్..!
మనకు సమస్యలొస్తే ఫేస్బుక్ స్నేహితులు అసలు పట్టించుకోరట. పట్టించుకోవడం మాట దేవుడెరుగును కానీ అసలు మన బాధలు ఏంటన్నది కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరట. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన బృందం చేసిన తమ సర్వేలో మరెన్నో నిజాలు, విషయాలు వెల్లడయ్యాయి. వర్సిటీకి చెందిన సైకాలజీ ప్రొఫెసర్ రాబిన్ డుంబార్ సుమారు 150 మంది ఫేస్బుక్ యూజర్స్‌ను సంప్రదించి వారిని ప్రశ్నించగా ఆసక్తికర వివరాలు బయటకొచ్చాయి. సోషల్ మీడియా నెట్ వర్క్ ఫేస్బుక్లో అకౌంట్ ఉండటం ఆనవాయితీ అనే విధంగా నెటిజన్ల తీరు ఉంది. అయితే అదే సమయంలో ఆ ఫేస్బుక్ ఫ్రెండ్స్ లిస్టులో ఉండే వందల మంది వ్యక్తులు నిజంగా స్నేహితులేనా అంటే కచ్చితంగా కాదు అనే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఫ్రెండ్స్ జాబితాలోని కేవలం నలుగురు, ఐదు మంది వ్యక్తులు మాత్రమే మన బాగోగులు చూస్తారని నమ్ముతున్నారట. కేవలం 15 మంది మాత్రమే తమ మిత్రుల సమస్యలను తమ బాధలుగా భావిస్తున్నారని ప్రొఫెసర్ డుంబార్ సర్వేలో తేలింది. ఫ్రెండ్స్ లిస్టులో ఉన్నవారిలో కేవలం 27శాతం వ్యక్తులు మాత్రమే అసలైన స్నేహితులని ఫేస్బుక్ యూజర్లు బదులిచ్చారట. ప్రపంచమే ఓ కుగ్రామంగా ఈ రోజుల్లో మిత్రుల సంఖ్యను సోషల్ మీడియా ద్వారా చాలా సులువుగా పెంచుకోవచ్చు. నిజానికి ప్రాక్టికల్ గా ఆలోచిసినట్లయితే... ఈ స్నేహాలలో చాలా రకాలు ఉన్నాయట. నేరుగా కలిసి మాట్లాడి ఓ వ్యక్తితో స్నేహం చేస్తేనే ఆ వ్యక్తుల మధ్య ఫ్రెండ్షిప్ చాలా రోజులు ఉంటుండట. లేని పక్షంలో తమ ఫ్రెండ్స్ బాధలను, సంతోషం మొదలైన విషయాలలో జోక్యం చేసుకోరు, అసలు స్పందించే అవకాశాలు చాలా తక్కువని ప్రొఫెసర్ పేర్కొన్నాడు. ఐదు మంది మాత్రమే సన్నిహితులని, ఇతర గ్రూపులు, వ్యక్తుల ద్వారా పరిచయమైన వారిని వందల సంఖ్యలో ఫ్రెండ్స్ గా స్వీకరిస్తున్నారని సర్వేలో తేలింది. ఇప్పటికైనా ఫేస్బుక్ యూజర్స్ ఇలాంటి విషయాలను గమనించాలని సర్వే బృందం పేర్కొంది. -
900 ఏళ్లలో తొలిసారిగా ఓ మహిళ...
-
900 ఏళ్లలో తొలిసారిగా ఓ మహిళ...
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ... ప్రపంచంలోని అత్యంత ప్రఖ్యాతిగాంచిన అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో ఒకటి. వందల ఏళ్ల పురాతనమైనది. అలాంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి 900 ఏళ్లలో తొలిసారిగా ఓ మహిళ వైస్ చాన్సలర్‌గా నియమితురాలయ్యారు. 56 ఏళ్ల లూయిస్ రిచర్డ్సన్ ఈ ఘనతను సాధించారు. ఉగ్రవాదం, అంతర్జాతీయ భద్రత అంశాల్లో ప్రపంచంలోనే సాధికారత కలిగిన వ్యక్తిగా ఆమెకు పేరు. వివిధ దేశాల్లో చట్టసభ సభ్యులకు ఈ అంశాలపై నిష్ణాతురాలైన ఆమె అవగాహన కల్పించడమే కాకుండా... పలు సూచనలు కూడా చేస్తుంటారు. జనవరి 1న ఆమె ఆక్స్ఫర్డ్ వీసీగా నియమితురాలైనప్పటికీ 12వ తేదీన అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఐర్లాండ్‌లోని తీరప్రాంత పట్టణమైన ట్రాన్‌మోర్‌లో ఓ సేల్స్‌మన్ ఏడుగురి సంతానంలో లూయిస్ రిచర్డ్సన్ అందరికంటే పెద్దవారు. డబ్లిన్‌లోని ట్రినిటీ కాలేజీ నుంచి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. డిగ్రీ చేసే సమయంలో లైబ్రరీలో సహా యకురాలిగా, బార్లో వెయిట్రెస్‌గా పనిచేస్తూ తన చదువుకు కావాల్సిన డబ్బును సమకూర్చుకునేవారు. చదువే ఆమె లోకం. కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి రాజనీతి శాస్త్రంలో ఎంఏ చేశారు. ప్రభుత్వ పాలన సబ్జెక్టుగా హార్వర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశారు. అనంతరం పీహెచ్డీ చేశారు. 1981 నుంచి 2001 దాకా 20 ఏళ్లపాటు హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. అంతర్జాతీయ సంబంధాలు.. ముఖ్యంగా ఉగ్రవాదం, అంతర్జాతీయ భద్రత, అమెరికా విదేశాంగ విధానం... తులనాత్మక అధ్యయనం... అనే అంశాలపై ఎక్కువగా దృష్టి సారించేవారు. తద్వారా ప్రపంచం నలుమూలలా పెచ్చరిల్లుతున్న ఉగ్రవాదం... వాటి మూలాలు, ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లు తదితర అంశాలపై సాధికారత సాధించారు. హార్వర్డ్ యూనివర్సిటీలో రాడ్‌క్లిఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీకి ఏడున్నరేళ్లు ఎగ్జిక్యూటివ్ డీన్‌గా పనిచేశారు. 2009లో బ్రిటన్‌లోని సెయింట్ అండ్రూస్ యూనివర్సిటీకి వైస్ చాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టారు. పూర్వ విద్యార్థులు, అభిమానుల నుంచి 500 కోట్ల రూపాయల మేర నిధులు సమీకరించి యూనివర్సిటీలోని సదుపాయాలను ఆధునీకరించారు. ఆమె సారథ్యంలో సెయింట్ అండ్రూస్ యూనివర్సిటీ బ్రిటన్‌లో మూడో అత్యుత్తమ వర్సిటీగా నిలిచింది. ఆమె పలు రచనలు కూడా చేశారు. 2006లో ప్రచురితమైన ‘వాట్ ద టైస్ట్స్ వాంట్: అండర్‌స్టాడింగ్ ద ఎనిమీ, కంటెయినింగ్ ద థ్రెట్’ అనే పుస్తకం బాగా ప్రాచుర్యం పొందింది. డాక్టర్ థామస్ జెవాన్ను పెళ్లాడారు. వీరికి ముగ్గురు సంతానం. -సెంట్రల్ డెస్క్ -
డిజిటల్ సొల్యూషన్ ప్రొడక్ట్ విడుదల చేసిన ఆక్స్ఫర్డ్
-
సోనియా తాలింపు.. మోదీ లాలింపు!
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌పై ప్రధాని ప్రశంసల జల్లు న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తిట్టిపోసిన మరుసటి రోజే ప్రధాని నరేంద్రమోదీ ఆయనపై ప్రశంసల జల్లు కురిపిం చారు! థరూర్ వాదనా పటిమ అద్భుతమని కొనియాడారు. గురువారమిక్కడ అంతర్జాతీయ అంశాలపై ఎంపీలకు అవగాహన కల్పించేందుకు స్పీకర్ ఆధ్యర్వంలో సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నుంచి థరూర్ ఒక్కరే హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..‘ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఇటీవలజరిగిన ఓ వేదికపై శశిజీ చాలా బాగా మాట్లాడారు. యూట్యూబ్‌లో ఇది వైరస్‌లా పాకింది. ఆయన మాటలు భారతీయుల మనోభావాలకు అద్దం పట్టాయి’ అని అన్నారు. భారత్‌ను 200 ఏళ్లు పాలించినందుకు బ్రిటన్ తగిన పరిహారం చెల్లించాలని ఆక్స్ఫర్డ్ వర్సిటీ వేదికపై థరూర్ ఇటీవల డిమాండ్ చేశారు. మోదీ తనను పొగుడ్తున్న సమయంలో ముందు వరసలో కూర్చు న్న థరూర్.. చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. -
చేదు జ్ఞాపకాల్ని మర్చిపోవాలనుకుంటున్నారా?
న్యూయార్క్: జ్ఞాపకాలు.. కొన్ని తీపివి.. మరి కొన్ని చేదువి. తీపి జ్ఞాపకాల్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని భావిస్తే చేదు జ్ఞాపకాల్ని మాత్రం త్వరగా మర్చిపోవాలనుకుంటాం. అయితే అది అంత సులభం కాదు. కానీ దీనికో చిన్న ఉపాయం సూచిస్తున్నారు నిపుణులు. కంప్యూటర్ గేమ్స్ ఆడితే ఇలాంటి అవాంచిత జ్ఞాపకాలు తగ్గుతాయని వారు సూచిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం మెదడుకు గాయం కావడం వల్ల ఇలాంటి అవాంచిత జ్ఞాపకాలు ఏర్పడే అవకాశం ఉంది. మెదడులో గాయాలున్న వారు అవాంచిత దృశ్యాల్ని చూడడానికి ఇష్టపడరు. వాటిని మర్చిపోవాలని వారు భావిస్తారు. మళ్లీ సాధారణ స్థితికి రావాలని కోరుకుంటారు. అయితే కంప్యూటర్ గేమ్స్ ఆడడం వల్ల ఇలాంటి విషయాల్ని త్వరగా మర్చిపోగలుగుతారని శాస్త్రవేత్తలు తెలిపారు. తమ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్లు తెలిపారు. -
ఆక్స్‌ఫర్డ్‌కు తొలి మహిళా వైస్ చాన్స్‌లర్
లండన్: బ్రిటన్‌లో అత్యంత ప్రాచీనమైన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వైస్ చాన్స్‌లర్ రాబోతున్నారు. ప్రస్తుతం సెయింట్ ఆండ్రూస్ వర్సిటీ వైస్‌చాన్స్‌లర్, ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ లూసీ రిచర్డ్సన్(56)ను ఆక్స్ఫర్డ్ వర్సిటీ కాంగ్రెగేషన్ కమిటీ వచ్చే ఏడాది జనవరిలో తమ వైస్‌చాన్స్‌లర్‌గా నియమించనుంది. 800 ఏళ్ల చరిత్ర ఉన్న ఆక్స్ఫర్డ్ వైస్‌చాన్స్‌లర్ పదవిని చేపట్టనున్న తొలి మహిళగా ఆమె రికార్డుకెక్కనున్నారు. తనకు ఈ అవకాశమివ్వడాన్ని గొప్పగా భావిస్తున్నానని రిచర్డ్సన్ చెప్పారు. రిచర్డ్సన్ విద్యారంగంలో గణనీయ కృషి చేశారని ఆక్స్ఫర్డ్ వర్సిటీ చాన్స్‌లర్ లార్డ్ పాటన్ కొనియాడారు. -
పిల్లలకూ బాధ ఎక్కువే!
లండన్: శిశువులకు మెదడు ఎదుగుదల సరిగా ఉండదు కాబట్టి నొప్పి కలిగినపుడు వారికి ఆ బాధ అంతగా ఉండదని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఏదైనా నొప్పి కలిగినపుడు శిశువులకు కూడా పెద్దవారిలాగే బాధ కలుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఒక్కటే తేడా... వారు ఆ బాధను పెద్దవారిలా వెలిబుచ్చలేరు. దీంతో వారు అంత బాధపడుతున్నట్లు అనిపించదు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పీడియాట్రిక్స్ నిపుణుడు రెబెక్కా స్లేటర్ నొప్పి సమయంలో పిల్లల్లో కలిగే బాధపై పరిశోధన చేశారు. మాగ్నినెన్స్ రెసోనెన్స్ ఇమేజింగ్ (ఎంఆర్ఐ) స్కానింగ్ ద్వారా పిల్లలకు నొప్పి కలిగినపుడు వారి మెదడు ఎలా స్పందిస్తుందనే అంశాన్ని పరిశీలించారు. నొప్పి కలిగినపుడు పెద్దల మెదడు ఎలా స్పందిస్తుందో శిశువుల మెదడు కూడా అలాగే స్పందించడాన్ని పరిశోధకులు గమనించారు. ఒకటి నుంచి ఆరు సంవత్సరాల వయసు గల పిల్లల్ని, 23-36 సంవత్సరాల వయస్సున్న ఆరోగ్యవంతమైన యువకుల్ని వీరు అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో పిల్లల్లో, పెద్దల్లో నొప్పి కలిగినపుడు మెదడులో ఒకే రకమైన మార్పులుండడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. -
టూకీగా ప్రపంచ చరిత్ర 69
ఆచారాలు-నమ్మకాలు వైదికకర్మ ప్రాధాన్యతకు భిన్నంగా ‘భక్తి’ని సారాంశంగా మలుచుకున్న రచన భాగవతం. ఐనా, భాగవతంలో దేవతలకు ఆలయాలున్న విరివి కనిపించదు. క్రీ.పూ. 400 కాలానిదైన పాణిని వ్యాకరణం ద్వారా ‘వాసుదేవుని ఆరాధన’ ప్రజల్లో చొరబడినట్లు సూచనలగా తెలుస్తుంది. మౌర్య చంద్రగుప్తుని పాలనలో స్థానికసంస్థలు నిర్వహించే బాధ్యతల జాబితాలో దేవాలయాల నిర్వహణ కూడా ఒక అంశంగా ‘ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ’వారి హిందూదేశ చరిత్రలో మాటమాత్రంగా కనిపించడం మినహా, ఆ వంశం రాజులు దేవాలయాలు నిర్మించినట్టు ఆధారాలు లేవు. క్రీ.శ. 213లో ఇక్ష్వాకు వంశానికి (ఇది రామాయణ ఇక్ష్వాకువంశం కాదు) చెందిన ఎహువళ శాంతమూలుడు అనే రాజు కట్టించిన ‘పుష్కభద్రస్వామి’ దేవాలయం (నందికొండ, నల్గొండ జిల్లా) భారతదేశంలోనే మరో నాలుగు ఆలయాలు కూడా నిర్మాణమైనట్టు చరిత్రకు తెలుస్తూంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి సమీపంలోని ‘గుడిమల్లం’ గ్రామానికి చెందిన శివాలయం భారతదేశానికి మొదటిదని మరికొందరి వాదన. ఇవి కాకపోతే మరొకటో మరొకటో మొట్టమొదటి దేవాలయంగా వెలుగుచూసే అవకాశం దక్షిణ భారతదేశానికే ఉంది. దానికి కారణాలు రెండు. పడమటి నాగరికతలతో సింధూనాగరికతకు బలిష్టమైన వ్యాపారసంబంధాలు చిరకాలంగా కనొసాగినా, తాత్విక సంప్రదాయాలను వాళ్ల నుండి అది స్వీకరించకపోవడం మొదటిది. ఆ తరువాతి కాలంలో విగ్రహారాధన ఇచ్చగించని ఆర్యసంప్రదాయం సింధూనది పొడవునా పటిష్టమైన కోటగోడగా నిలవడం రెండవది. అందువల్ల ఉత్తరభారతదేశంలో దేవాలయాల స్థాపనకు ఆస్కారం లేకుండా పోయింది. అటువంటి అవరోధం దక్కన్ (దక్షిణ) పీఠభూమికి లేదు. సముద్రమార్గంలో దక్కన్కు పడమటి వైపుండే మెసొపొటేమియాతోనూ, తూర్పు వైపుండే ఆగ్నేయ ఆసియాలోని ఇండోనేషియా, మలేషియా, థాండ్లాండ్, కాంబోడియా తదితర దేశాలతోనూ క్రీ.పూ. 1500 నాటి నుండే నిరవధికమైన వ్యాపార సంబంధాలు కొనసాగాయి. ద్రవిడ నాగరికత ఏ కారణంగానో మెసొపొటేమియా నుండి దేవాలయాల సంస్కృతిని స్వీకరించింది. ఆ సంస్కృతి దక్షిణభారతదేశంలో నెరుసుకున్న తరువాత ఉత్తర భారతదేశంలో క్రీ.శ. 12వ శతాబ్దం దాకా ఆలయనిర్మాణం జరిగిన దాఖలాలు చరిత్రకు దొరకలేదు. ఆగ్నేయ ఆసియాలోని థాయిలెండ్, కాంబోడియా వంటి దేశాల్లోని దేవాలయాలు దక్కన్‌లోని ఆలయాల నమూనాకు నకళ్లు మాత్రమే. ఇంతదాకా ప్రస్తావించిన నాగరికతలకు దూరంగా, వెలుపలిగా ఎదిగిన నాగరికత చైనాది. పడమటి సరిహద్దుగా దుర్గమమైన పర్వతాలూ, తూర్పున పసిఫిక్ మహాసముద్రాల అవరోధంవల్ల, ప్రాచీనకాలంలో ఆ దేశానికి ఇతర నాగరికతలతో సంబంధాలు పరిమితం. క్రీ.పూ. 3000 నాటికే, ‘పట్టుమార్గం’ (సిల్క్ రూట్) ద్వారా ఇతర ప్రదేశాలకు చైనా నుండి పట్టుబట్టల రవాణా జరిగేదని చరిత్రకు కొన్ని ఆధారాలున్నాయి. పట్టుబట్టలకు ‘చీనాంబరాలు’గా గుర్తింపు మన ప్రాచీన సాహిత్యంలోనూ కనిపిస్తుంది. రావాణా మార్గమంటూ ఏర్పడిన తరువాత ఎగుమతులూ ఉంటాయి, దిగుమతులూ ఉంటాయి. ఈ మార్గాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానం, సంస్కృతుల బదిలీలు జరుగుతాయి. ఐనా, చిత్రమేమిటంటే, ఇతర ప్రాచీనసంస్కృతుల్లోని ఏవొక్క దానితో ఏమాత్రం పోలికలేనిది చైనీయుల తాత్వికచింతన. రచన: ఎం.వి.రమణారెడ్డి -
చదువు.. సంపాదించు!
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా ఓ విషయంలో మాత్రం ముందుంది. పేద కుటుంబాలు అధిక సంఖ్యలో ఉన్న ఈ జిల్లాలో బాలికలు ఆర్థికంగా తమ కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలుస్తూ భేష్ అనిపించుకుంటున్నారు. అలాగని వారు చదువుకు దూరం కావడం లేదు. ఒకవైపు చుదువుకుంటూనే.. మరోవైపు చిన్న చిన్న పనులు చేస్తూ సంపాదనలో పడుతున్నారు. ఈ విషయంలో బాలుర కంటే ముందున్న బాలికలు.. చదువులో మాత్రం ఇప్పుడిప్పుడే వారితో పోటీ పడుతున్నారు. సెస్ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో బాలికలే చదువు విషయంలో ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు, ఓ వైపు పనుల కెళ్తూ మరోవైపు విద్యాభ్యాసానికి తాపత్రయపడుతున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నేతృత్వంలో డిపార్ట్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలెప్మెంట్(డీఎఫ్ఐడీ) విభాగం పర్యవేక్షణలో హైదరాబాద్‌కు చెందిన ఆర్థిక, సామాజిక అధ్యయన సంస్థ(సెస్)కు చెందిన ఓ బృందం శ్రీకాకుళం, అనంతపురం, పశ్చిమగోదావరి, కడప జిల్లాల్లో పలు అంశాలపై సర్వే చేశారు. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 750 మంది పిల్లలపై అధ్యయనం చేశారు. మంగళవారం జెడ్పీ సమావేశం మందిరంలో కలెక్టర్ లక్ష్మీనరసింహాన్ని కలిసిన ఈ బృందం సభ్యులు ‘గ్రోయింగ్ అప్ ఇన్ పావర్టీ, ఫైండింగ్స్ ఫ్రమ్ యంగ్ లైవ్స్ ఇన్ శ్రీకాకుళం’ పేరిట నాలుగో రౌండ్ అధ్యయన ఫలితాలను ఆయనకు వివరించారు. 2016లో చివరి రౌండ్ ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పిల్లలు, యువతీ యువకుల జీవన విధానం, చదువు, ఉపాధి, ఉద్యోగం వంటి అంశాలతో పాటు పిల్లల పౌష్టికాహారంపైనా అధ్యయనం చేశారు. ‘యువత-అభివృద్ధి’ అనే అంశంలోనూ ఏడాది వయసున్న వారిపై ఓసారి, వారు ఐదేళ్ల వయస్సుకొచ్చినప్పుడు రెండోసారి, ఎనిమిదేళ్ల వయస్సుకొచ్చినప్పుడు మూడోసారి, 12 ఏళ్ల ప్రాయంలో నాలుగోసారి.. ఇలా నాలుగు రౌండ్లలో నిర్ణీత అంశాలను అధ్యయనం చేశారు. 8, 12, 15, 19యేళ్ల వయస్సున్న వారి నుంచీ కొన్ని వివరాలు సేకరించినట్లు సెస్ సంస్థ డెరైక్టర్ ఎస్.గలాబ్, రిటైర్డ్ అధికారి డా. పిపి.రెడ్డి తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో.. శ్రీకాకుళం జిల్లాలో 61 శాతం మంది బాలికలు చదువుపై ఆసక్తి చూపిస్తుండగా.. వారిలో 48 శాతం మంది ప్రభుత్వ పాఠశాలలకే వెళ్తున్నారు. 12 శాతం మంది పని చేసుకుంటూ చదువుకుంటున్నారని సర్వే చెబుతోంది. మిగతా జిల్లాలతో పోల్చి చూస్తే ఈ జిల్లాలో పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ మరికొన్ని విషయాలనూ ఈ బృందం వెలుగులోకి తెచ్చింది. 39 శాతం మంది బాలికలు ఓ పక్క వ్యవసాయం చేసుకుంటూనే చదువు పట్ల ఆసక్తి చూపిస్తున్నారని కూడా తేల్చారు. ఎప్పుడు.. ఎలా..? 2006లో ప్రాథమిక పాఠశాలల్లో చేరిన 12 ఏళ్ల వయసున్న పిల్లల సంఖ్య 90 శాతం కాగా..2013 నాటికి అది 97 శాతానికి పెరిగింది. 2006 నుంచి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆడపిల్లలే అధికంగా పాఠశాలల్లో చేరినట్టు తేలింది. వీరిలో షెడ్యూల్డ్ కులాలకు చెందినవారూ ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్లలో చేరుతున్న 12 ఏళ్ల పిల్లల సంఖ్య 2006-13 మధ్య కాలంలో 28 శాతం నుంచి 37 శాతానికి పెరిగింది. 2013 సర్వే ప్రకారం 43 శాతం మంది అబ్బాయిలు ప్రైవేట్ స్కూళ్లలోనే చదువుతుంటే.. అమ్మాయిల సంఖ్య 31 శాతంగానే ఉంది. గణితం సబ్జెక్టులో 2006-13 మధ్య 12 ఏళ్ల పిల్లలను సర్వే చేయగా 14 శాతం మందికి ఆ సబ్జెక్టులో ఆసక్తి తక్కువగా ఉన్నట్టు తేలింది. 2006-13మధ్య కాలంలో చాలా మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్టు గుర్తించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి దారుణంగా ఉంది. 14 శాతం మంది పిల్లలు అపరిశుభ్రత మధ్యే కాలం గడుపుతున్నారు. సగానికి పైగా విద్యార్థులు 19 ఏళ్ల నాటికీ విద్య పట్ల ఆసక్తి చూపిస్తున్నట్టు గుర్తించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ 7 శాతం మంది ఇంకా సెకండరీ స్కూల్ విద్య పూర్తి చేయాల్సి ఉండగా, 9శాతం మంది పీజీ/వృత్తి విద్య, మరికొంతమంది యూనివర్సిటీ స్థాయిలో చదువుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని ఆసక్తికర అంశాలు 12 ఏళ్ల వయసువారిలో 3 శాతం మంది చదువుపై ఆసక్తి చూపడం లేదు. 2006-13 మధ్య కాలంలో 12 ఏళ్ల పిల్లల్లో 28 నుంచి 37 శాతం వరకు ప్రైవేట్ స్కూళ్లలో చదువుకు ఆసక్తి కనబరిచారు. అందులో 43 శాతం అబ్బాయిలుంటే 31 శాతం అమ్మాయిలున్నారు. 2006లో సేకరించిన వివరాల ప్రకారం లెక్కల సబ్జెక్టులో 14 శాతంమంది తక్కువ ఆసక్తి కనబర్చినట్టు తేలింది. 6-14 ఏళ్ల మధ్య పిల్లలు చట్ట ప్రకారం నిర్బంధ విద్యకు అర్హులు. దేశవ్యాప్తంగా జరిపిన సర్వేలో (డైస్ 2103 ప్రకారం) ఈ వియసు పిల్లలు పాఠశాలల్లో చేరుతున్నప్పటికీ విద్యపై అంతగా ఆసక్తి కనబరచడం లేదని తేలింది. యంగ్ లైవ్స్ పేరిట జరిగిన నాలుగు రౌండ్ల సర్వేలో 12 ఏళ్ల వయసున్న పిల్లలు తల్లిదండ్రుల ఒత్తిడితోనే పాఠశాలలకు వెళ్తున్నట్టు వెల్లడైంది. -
ముగ్గురు క్రికెటర్ల.. మూడు పాఠాలు
ప్రేరణ క్రికెట్.. మనదేశంలో ఈ క్రీడను అభిమానించని వారుండరు. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అందరికీ ఇష్టమైన ఆట క్రికెట్. ఎందరో క్రీడాకారులు క్రికెట్లో అద్భుతాలు సృష్టించారు. ఎందరికో అభిమానపాత్రులయ్యారు. కేవలం ఆటతీరుతోనే కాకుండా తమ జీవితం ద్వారా మంచి సందేశమిచ్చే ఆటగాళ్లూ ఉన్నారు. అలాంటి ముగ్గురి గురించి తెలుసుకుందాం.. విన్నర్ మైండ్‌సెట్‌ను అలవర్చుకోవాలి టైగర్ పటౌడీ... నవాబుల కుటుంబంలో జన్మించాడు. ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. క్రికెట్ క్రీడాకారుడిగా కెరీర్ ప్రారంభించాడు. కేవలం 20 ఏళ్ల వయసులోనే తన ఆటతీరుతో ప్రపంచాన్ని అబ్బురపర్చాడు. కానీ, అంతలోనే ఊహించని ఆపద ఎదురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. టైగర్ తన కుడి కంటి చూపును కోల్పోయాడు. మిగిలిన ఒక కంటితో చూడడం, పనులు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కనీసం తేనీరును కూడా కప్పులో సరిగ్గా వంపుకోలేకపోయేవాడు. ఇక క్రికెట్ ఎలా ఆడగలడు? క్రికెట్లో రాణించాలంటే మంచి కంటిచూపు ఉండాలి. మరి టైగర్ పటౌడీ కెరీర్ ముగిసినట్లేనా? క్రికెట్‌కు స్వస్తి చెప్పాల్సిందేనా? ఆయన మాత్రం అలా ఆనుకోలేదు. ఒక కన్ను పోయినందుకు బాధపడకుండా మరో కన్ను ఇంకా మిగిలే ఉన్నందుకు సంతోషించాడు. పోగొట్టుకున్నదాని గురించి ఆలోచించకుండా తన వద్ద ఉన్నదానిపైనే దృష్టిపెట్టాడు. విన్నర్ మైండ్‌సెట్‌ను అలవర్చుకున్నాడు. ఒక కంటితో చూస్తూ క్రికెట్ ఆడడం సాధన చేశాడు. బ్యాట్ పట్టుకొని మళ్లీ మైదానంలోకి దిగాడు. వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్లాడు. తర్వాత భారత క్రికెట్ జట్టుకు అత్యంత పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా పేరుగాంచాడు. జీవితంలో అనుకోని ప్రమాదాలు, అపజయాలు అనివార్యం. అయితే వాటి పట్ల మనం ఎలా స్పందిస్తున్నాం అనే దాని బట్టే మన విజయం ఆధారపడి ఉంటుంది. ఈసారి పరాజయం పలకరించినప్పుడు పాతాళంలోకి కుంగిపోకుండా.. టైగర్ పటౌడీలా ఉవ్వెత్తున పైకి ఎగసిపడండి. విజయాన్ని అందుకోండి. ఇతరులతో పోల్చుకోవద్దు మిమ్మల్ని మీరు ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోవద్దు. శక్తి వంచన లేకుండా లక్ష్య సాధన కోసం కృషి చేయాలి. హోఖైతో జిమోమీ పేరు మీరెప్పుడైనా విన్నారా? చాలామంది విని ఉండరు. ఆయన ఒక క్రికెట్ క్రీడాకారుడు. నాగాలాండ్ రాష్ట్రంలోని యువకులకు ఆయన ఆరాధ్యదైవం. ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. గతంలో ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఎంపికయ్యాడు. నాగాలాండ్ నుంచి ఐపీఎల్‌కు ఎంపికైన మొట్టమొదటి క్రికెటర్ అయనే. జిమోమీ భారత జట్టు తరఫున ఆడి ఉండకపోవచ్చు. కానీ, తన రాష్ట్రంలో మాత్రం ఆయన హీరోనే. ఒక కుగ్రామం నుంచి వచ్చిన వ్యక్తి ఐపీఎల్‌కు ఎంపిక కావడం చిన్న విషయం కాదు. ప్రతి ఒక్కరూ ఇండియన్ క్రికెట్ ప్లేయర్ కాకపోవచ్చు. అందరూ సచిన్ టెండూల్కర్ కాలేరు. ఒక పెద్ద కంపెనీకి సీఈఓ కాకపోవచ్చు. అంతమాత్రాన ప్రయత్నం నిలిపివేయకూడదు. ఎవరి రంగంలో వారు ఎదిగేందుకు ప్రయత్నించాలి. ఎవరి పరుగును వారే పరుగెత్తాలి. మీలోని పూర్తి శక్తిసామర్థ్యాలను కేంద్రీకరించి పనిచేయడం ముఖ్యం. ఎవరి ప్రత్యేకత వారిదే. ఇతరులతో పోల్చుకుంటూ బాధపడొద్దు. 30 నిమిషాల అదనపు శ్రమ ప్రతిరోజూ అదనంగా కేవలం 30 నిమిషాలు శ్రమించడం.. మీ జీవితాల్లో ఎనలేని మార్పును తీసుకొస్తుంది. భారత క్రికెట్ జట్టులో రాణించిన యూసుఫ్ పఠాన్ విషయంలో ఇది నిజమని రుజువైంది. పఠాన్ తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. తొలుత చాలా మ్యాచ్‌ల్లో ఎక్కువ పరుగులు చేయలేక చేతులెత్తేశాడు. విమర్శల పాలయ్యాడు. తన ఆటను పూర్తిగా సమీక్షించుకొని సాధనకు పదునుపెట్టాడు. తర్వాత మైదానంలో పరుగుల వరద పారించాడు. జట్టుకు విజయాలనందించాడు. యూసుఫ్ పఠాన్‌లో మార్పు ఎలా సాధ్యమైంది. రోజూ అదనంగా 30 నుంచి 40 నిమిషాలపాటు సాధన చేయడం వల్ల మంచి క్రికెటర్‌గా పేరుతెచ్చుకున్నాడు. మైదానంలోంచి సహచరులు వెళ్లిపోయిన తర్వాత కూడా అదనంగా 30 నుంచి 40 నిమిషాలు ప్రాక్టీస్ చేసేవాడినని, ఏకాగ్రతతో బ్యాటింగ్ చేయడం అప్పుడే అలవడిందని ఓ ఇంటర్వ్యూలో పఠాన్ తెలిపాడు. శ్రమకు తగ్గ ఫలితం ఎప్పటికైనా దక్కుతుంది. మీరు కూడా రోజూ అదనంగా 30 నిమిషాలు కష్టపడండి. అది మీ కెరీర్లో ఎదుగుదలకు తప్పకుండా తోడ్పడుతుంది. - ‘కెరీర్స్ 360’ సౌజన్యంతో -
ఈ కళ్లజోడుతో రేచీకటి పరార్....
దృష్టిలోపం, రేచీకటి ఉన్న వ్యక్తులు ఇక రాత్రిపూట లేదా వెలుతురు తక్కువగా ఉన్న సమయంలో అడుగు ముందుకు వేయడానికి తడుముకోనక్కరలేదు. అధునాతనమైన ఈ కళ్లజోడును పెట్టుకుంటే చాలు.. ఎదురుగా ఉన్న వస్తువులు, అడ్డంకులు వారికి ఎంచక్కా కనిపిస్తాయి. కళ్లజోడు ఫ్రేముపై ఉండే వీడియో కెమెరా ఎదురుగా ఉన్న దృశ్యాలను చిత్రీకరిస్తుంది. వాటిని ఫోన్మాదిరిగా జేబులో పెట్టుకునేంత చిన్నగా ఉండే ఓ కంప్యూటర్ ప్రాసెసింగ్ యూనిట్ విశ్లేషిస్తుంది. ఎదురుగా ఉన్న వస్తువులను స్పష్టమైన చిత్రాలుగా మలచి కళ్లజోడు అద్దాలపై ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది. కుర్చీలు, బల్లలు, మనుషులు, జంతువుల వంటివాటినీ ఈ కంప్యూటర్ యూనిట్ ప్రత్యేకంగా గుర్తిస్తుంది. అయితే ఇది పూర్తిగా చూపును కోల్పోయినవారికి ఉపయోగపడకపోయినా.. స్వల్ప దృష్టిలోపం, రేచీకటి వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి బాగా సాయపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. దీనిని 20 మంది చూపుమందగించిన వలంటీర్లు ధరించగా వారికి బాగా ఉపయోగపడిందని, భవిష్యత్తులో వీటిని మామూలు కళ్లజోడు స్థాయికి తగ్గిస్తామని దీనిని తయారుచేసిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకుడు స్టీఫెన్ హిక్స్ వెల్లడించారు. -
బెస్టీ అంటే.. బెస్ట్ ఫ్రెండ్!
లండన్: ఆంగ్ల నిఘంటువు ఆక్స్ఫర్డ్లోకి ఈ ఏడాది కొత్తగా 900కి పైగా పదాలు, పదబంధాలు చేరాయి. తాజాగా విడుదలైన ఆక్స్ఫర్డ్ ఎడిషన్‌లోకి చేరిన పదాల్లో బెస్టీ (బెస్ట్ ఫ్రెండ్), బీట్‌బాక్సర్ (గొంతుతో సంగీత ధ్వనులు చేసేవారు), బుక్‌హాలిక్ (పుస్తకాల పురుగు), హీరోగ్రామ్ (పొగడటం) వంటి పదాలు ఉన్నాయి. అలాగే డెడ్ వైట్ మేల్ (రచయితలను తక్కువ చేసి చూపడం), క్రాప్ షూట్ (పాచికలతో జూదం), వాకడూ, వాకడూడుల్ (విపరీత మనస్తత్వం గలవారు) వంటి పదబంధాలు చేరాయి. తాజా ఎడిషన్‌లో చేరిన పదాల్లో పూర్తిస్థాయిలో అప్డేట్ చేసిన పదాలు ఎక్కువగా ఉండటం విశేషం. వెయ్యేళ్ల నుంచీ ఉపయోగిస్తున్న పదాలను, పదబంధాలను, వ్యాఖ్యలను, తాజాగా పుట్టే పదాలను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ 1884 నుంచీ నిఘంటువులో చేర్చుతోంది. -
ముద్దు వెనక మూడు కారణాలు!!
ము..ము.. ము.. ము.. ముద్దంటే చేదా? నీకా ఉద్దేశం లేదా అని ఏనాడో పాటు పాడించారు సినీ రచయితలు, దర్శకులు. ఇంతకీ అసలు ముద్దు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? దాని వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అవును.. ఉంటుందట. అనుబంధాలను మరింత పటిష్ఠం చేసేందుకు ముద్దు ఉపయోగపడుతుందని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. దాంతో పాటు మరో మూడు కారణాలనూ వివరించారు. భాగస్వాములను ఎప్పటికీ తమతోనే ఉండేలా చేసుకోవాలన్నా కూడా అధరామృతమే దివ్యౌషధమని అంటున్నారు. ''మానవ లైంగిక సంబంధాల్లో ముద్దుకు చాలా ప్రధానమైన పాత్ర ఉంది. ఇది ప్రతి సమాజంలోను, ప్రతి సంస్కృతిలోనూ ఉంది'' అని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని ప్రయోగాత్మక సైకాలజీ విభాగంలో పరిశోధన విద్యార్థిగా ఉన్న రఫెల్ వ్లోడార్స్కీ చెప్పారు. చింపాంజీలు, ఇతర జంతువులు, కొన్ని రకాల పక్షుల్లో కూడా ఇలా ముద్దుపెట్టుకోవడం ఉందని వివరించారు. మనుషులలో ఇది చాలా విస్తృతంగాను, వేర్వేరు చోట్ల వేర్వేరుగా విభిన్నంగాను ఉందన్నారు. అయితే, ఇది అంత విస్తృతంగా ఎందుకు వ్యాపించిందో మాత్రం తెలియదని చెప్పారు. ముద్దు వెనక ప్రధానంగా మూడు కారణాలున్నాయని రఫెల్ అన్నారు. భాగస్వాములను ఎంచుకోడానికి ఇది ప్రధాన సాధనం అని, అవతలి వారిలో లైంగిక వాంఛలను పెంచడానికి ఉద్దీపనంలా పనిచేస్తుందని, అనుబంధాలను పటిష్ఠం చేసుకోడానికీ ఉపయోగిస్తుందని అన్నారు. ఈ సిద్ధాంతాలపై మరింత లోతుగా పరిశోధనలు చేస్తామంటున్నారు.