లండన్: కరోనా వాక్సిన్ ట్రైల్స్‌కు సంబంధించి ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటి శుభవార్తను అందించనుంది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి ఫేస్-3 హ్యూమన్ ట్రైల్స్ జరిగాయి. అయితే ఇంతవరకు ఫేస్-1కు సంబంధించిన ఫలితాలనే డెవలపర్స్ అందించలేదు. ఫేస్-1 డేటాను జూలైలో అందించే అవకాశం ఉందని వారు తెలిపారు. అయితే కరోనా వ్యాక్సిన్ ట్రైల్స్‌లో మంచి ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇది వాడటం వల్ల ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు లేవని, ఇది సురక్షితమైన వ్యాక్సిన్‌గా పరీక్షల్లో తేలింది. దీనిని వాలెంటర్ల మీద ప్రయోగించినప్పుడు చక్కని ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటి గురువారం తెలిపే అవకాశాలు ఉన్నాయి.
చదవండి: ఆగస్టులో రష్యా టీకా?
ఇప్పటి వరకు వివిధ దేశాలలో వందల మంది కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన ప్రయోగాలు చేస్తున్నారు. అయితే వాటిలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శటీ లైసెన్స్ పొందించిన ప్రముఖ ఇండియన్ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా వాక్సిన్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. ఈ ట్రైల్స్‌కు సంబంధించిన సమాచారం ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెంట్‌లో రానుంది. దీనికి సంబంధించి ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటి శాస్త్రవేత్త మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన విషయాన్ని ఎప్పుడూ పబ్లిష్ చేస్తారు అన్న విషయాన్ని ఇంకా లాన్సెంట్ సంస్థ కచ్చితంగా చెప్పలేదని తెలిపారు. అయితే ఈ వ్యాక్సిన్ మంచి ఫలితాలను ఇచ్చిందని, ఇది మనుషుల మీద ప్రయోగించినప్పుడు చక్కగా పనిచేసినట్లు తెలుస్తోంది. దీంతో గురువారం కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి శుభవార్త వినే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment