సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటన్‌లో ప్రకంపనలు రేపుతున్న మరో ప్రమాదకరమైన కరోనా వైరస్ ఉనికి తెలంగాణాలో కూడా ఉందన్న తాజా అంచనాల మధ్య దేశీయ అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు సీరం కీలక విషయాన్ని ప్రకటించింది. భారతదేశంలో సీరం ఉత్సత్తి చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్‌కు మరికొన్నిరోజుల్లో అత్యవసర ఉపయోగానికి ఆమోదం లభించనుంది. ఈ మేరకు సీరం సీఈఓ అదార్ పూనావల్లా వ్యాఖ్యలను ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది.
సీరం ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో అక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ ప్రయోగాలకు సంబంధించిన సీరం సమర్పించిన లేటెస్ట్ డేలా సంతృప్తికరంగా ఉన్నందున త్వరలోనే వ్యాక్సిన్ అత్యసర వినియోగానికి ప్రభుత్వ అనుమతి లభించనుందని ఆశిస్తున్నట్టు పూనావల్లా తెలిపారు. ఇప్పటికే 40 మిలియన్ల నుండి 50 మిలియన్ల మోతాదుల వ్యాక్సిన్ సిద్దంగా ఉందన్నారు. అంతేకాదు డేటా విశ్లేషణ పూర్తయిన తర్వాత, టీకాకు అనుమతినిచ్చేందుకు యూకే మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్‌ఆర్‌ఎ) ఆమోదం కోసం భారత ప్రభుత్వం వేచి ఉండక పోవచ్చని ఆయన పేర్కొన్నారని రాయిటర్స్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment