ట్వీట్లు చేస్తున్నారా.. జర భద్రం..!
సోషల్ మీడియాలో ట్విట్టర్ జోరు రోజురోజుకు పెరిగిపోతోంది. వ్యాపారవేత్తలు, క్రికెటర్స్, రాజకీయ నాయకులు, సినీ తారలు ఇలా చాలా రంగాలకు చెందిన వారు తమ అభిమానులతో ఎన్నో విషయాలను షేరుకుంటున్నారు. ఇందుకు ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ఖాతా వాడుతున్నారు. అయితే ఇప్పటినుంచి అందరు ఒక్క విషయాన్ని గుర్తుంచకోవాలని ఓ రీసెర్చ్ ద్వారా వెల్లడయింది. మన వ్యక్తిగత వివరాలు కొన్ని చెప్పేందుకు మనం చేసే ట్వీట్ లు ఉపయోగపడతాయని తాజా సర్వేలో తేలింది. లోకేషన్ తో పాటు ప్రైవసీకి భంగం వాటిల్లే అవకాశాలే ఎక్కువని యూజర్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఆక్స్ ఫర్డ్ వర్సిటీకి చెందిన మిట్ రీసేర్చర్స్ కనుగొన్న వివరాలిలా ఉన్నాయి. ట్విట్టర్లో ప్రతిరోజు ట్వీట్లు చేస్తుంటారు కదా.. అయితే రోజు కనీసం 8 ట్వీట్లు చేస్తే వ్యక్తిగత వివరాలు తెలుసుకోవచ్చు. పోస్ట్ చేసిన వ్యక్తి ఎక్కడి నుంచి చేశాడో తెలిసిపోతుందట. ఇవే కాకుండా ఇతరులు పోస్ట్ చేసిన ఫన్నీ వీడియోలకు కామెంట్లు, లైక్స్ కొట్టడంతో కూడా యూజర్స్ అడ్రస్, ఇతర సమాచారం చెప్పే అవకాశాలున్నాయని ఆక్స్ ఫర్డ్ రీసెర్చర్స్ వెల్లడించారు. ట్విట్టర్ లొకేషన్ సర్వీస్ ఆఫ్ చేస్తే ఈ విషయాలు కనిపెట్టేందుకు వీలుండదు. అయితే లొకేషన్ రిపోర్టింగ్ సర్వీస్ టర్న్ ఆఫ్ చేస్తే ప్రైవసీ ఉంటుందన్నారు. కొన్నిసార్లు ఇలా వ్యక్తిగత వివరాలు తెలియడంతో ఉపయోగాలున్నా.. అనర్థాలెన్నో అని ఇంటర్నెట్ పాలసీ రీసెర్చ్ చేసిన విశ్లేషకులు చెబుతున్నారు.