
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ఆర్థిక కష్టాలతో ట్విటర్‌ను గట్టెక్కించేందుకు సీఈవో ఎలాన్ మస్క్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే గతేడాది అక్టోబర్ నుంచి ట్విటర్ బాస్‌గా మస్క్ బాధ్యతలు తీసుకున్నారు. దీంతో నాటి నుంచి ఈ ఏడాది జనవరి 18 వరకు సుమారు 500 కంపెనీలు ట్విటర్‌కు ఇచ్చే యాడ్స్‌ను నిలిపివేసినట్లు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది.
మరోవైపు అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విటర్ ఆఫీస్ 1,36,250 డాలర్ల అద్దె చెల్లింపుల్లో జాప్యం జరగడంతో అది కాస్తా కోర్టు వరకు వెళ్లింది. శాలరీ పెంచాలని డిమాండ్ చేసిన పారిశుధ్య కార్మికుల్ని విధుల నుంచి తొలగించారు. దీంతో ఆఫీస్‌ను శుభ్రం చేయకపోవడంతో వాష్ రూమ్‌ల నుంచి వెదజల్లుతున్న కంపు భరించలేమంటూ ట్విటర్ ఉద్యోగులు వాపోయినట్లు న్యూయార్స్ టైమ్స్ హైలెట్ చేసింది
ఈ తరుణంలో వ్యయాలను గణనీయంగా తగ్గించడం, ఆదాయ మార్గాలను పెంచుకోవడమే తన వ్యూహమని మస్క్ గతంలో స్పష్టం చేశారు. అందులో భాగంగానే ట్విటర్ బ్లూ తీసుకొస్తున్నామని వెల్లడించారు. తాజాగా, ట్విటర్ యాడ్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ సేవల్ని అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. ట్విటర్‌లో పెద్ద పెద్ద యాడ్స్ కనిపిస్తుంటాయి. సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే ఆ యాడ్స్ ఇకపై కనిపించవు. ఇది కార్యరూపం దాలిస్తే ట్విటర్ ఆదాయం పెరగవచ్చనే యోచనలో మస్క్ ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment