advertisments
-
ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ఆర్థిక కష్టాలతో ట్విటర్‌ను గట్టెక్కించేందుకు సీఈవో ఎలాన్ మస్క్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే గతేడాది అక్టోబర్ నుంచి ట్విటర్ బాస్‌గా మస్క్ బాధ్యతలు తీసుకున్నారు. దీంతో నాటి నుంచి ఈ ఏడాది జనవరి 18 వరకు సుమారు 500 కంపెనీలు ట్విటర్‌కు ఇచ్చే యాడ్స్‌ను నిలిపివేసినట్లు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. మరోవైపు అమెరికా శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విటర్ ఆఫీస్ 1,36,250 డాలర్ల అద్దె చెల్లింపుల్లో జాప్యం జరగడంతో అది కాస్తా కోర్టు వరకు వెళ్లింది. శాలరీ పెంచాలని డిమాండ్ చేసిన పారిశుధ్య కార్మికుల్ని విధుల నుంచి తొలగించారు. దీంతో ఆఫీస్‌ను శుభ్రం చేయకపోవడంతో వాష్ రూమ్‌ల నుంచి వెదజల్లుతున్న కంపు భరించలేమంటూ ట్విటర్ ఉద్యోగులు వాపోయినట్లు న్యూయార్స్ టైమ్స్ హైలెట్ చేసింది ఈ తరుణంలో వ్యయాలను గణనీయంగా తగ్గించడం, ఆదాయ మార్గాలను పెంచుకోవడమే తన వ్యూహమని మస్క్ గతంలో స్పష్టం చేశారు. అందులో భాగంగానే ట్విటర్ బ్లూ తీసుకొస్తున్నామని వెల్లడించారు. తాజాగా, ట్విటర్ యాడ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ సేవల్ని అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. ట్విటర్లో పెద్ద పెద్ద యాడ్స్ కనిపిస్తుంటాయి. సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఆ యాడ్స్ ఇకపై కనిపించవు. ఇది కార్యరూపం దాలిస్తే ట్విటర్ ఆదాయం పెరగవచ్చనే యోచనలో మస్క్ ఉన్నట్లు తెలుస్తోంది. -
కేజ్రీవాల్ పార్టీకి షాకిచ్చిన ఢిల్లీ గవర్నర్.. రూ.97 కోట్లు కట్టాలని ఆదేశం..
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి మరోసారి షాక్ ఇచ్చారు. ప్రభుత్వ ప్రకటనల పేరుతో ఆప్ పార్టీ సొంత ప్రచారానికి చేసిన ఖర్చును చెల్లించాలని ఆదేశించారు. మొత్తం రూ.97 కోట్లు వసూలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వ కార్యదర్శికి లేఖ రాశారు. ప్రభుత్వ ప్రకటనల నిబంధనలకు సంబంధించి 2016లో సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆమ్ ఆద్మీ పార్టీ విస్మరించిందని వీకే సక్సెనా ఆరోపించారు. ప్రభుత్వ ప్రకటనల పేరు మీద ఆప్ సొంత పార్టీ కోసం ప్రచారం చేసుకుందని ఆరోపించారు. నిబంధనలు ఉల్లఘించినందుకు ఆ మొత్తాన్ని ఆప్ పార్టీనే చెల్లించాలన్నారు. అయితే వీకే సక్సేనా ఆదేశాలపై ఆప్ ఘాటుగా స్పందించింది. అసలు గవర్నర్‌కు ఆ అధికారమే లేదని పేర్కొంది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ విజయం, జాతీయ పార్టీగా అవతరించడం చూసి ఓర్వలేకే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ప్రకటనల కోసం వేల కోట్లు ఖర్చు చేసిందని ఆప్ చెప్పింది. బీజేపీ మొత్తం రూ.22 వేల కోట్లను ప్రభుత్వ ప్రకటనల పేరుతో ఖర్చు చేసిందని ఆరోపించింది. ఆ మొత్తాన్ని ఆ పార్టీ నుంచి వసూలు చేసిన తర్వాత తాము కూడా రూ.97 కోట్లు కచ్చితంగా చెల్లిస్తామని చెప్పుకొచ్చింది. చదవండి: Taj Mahal: రూ.1.9 కోట్లు ట్యాక్స్ కట్టాలని తాజ్‌మహల్‌కు నోటీసులు.. -
పండగ సీజన్: తగ్గేదేలే అంటున్న కంపెనీలు, పుల్ జోష్‌లో ఆ రంగం!
న్యూఢిల్లీ: పండుగల సీజన్ కావడంతో కంపెనీలు ప్రకటనలను హోరెత్తిస్తున్నాయి. వినియోగ డిమాండ్‌ను అనుకూలంగా మలుచుకునేందకు తమ ఉత్పత్తులకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తున్నాయి. ఈ కామర్స్, ఫ్యాషన్, అప్పారెల్, ఖరీదైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కంపెనీలు ఈ పండుగల సీజన్ కోసం తమ ప్రకటనల బడ్జెట్‌ను 15–20 శాతం పెంచాయి. దీన్నిబట్టి కంపెనీలు విక్రయాలకు సంబంధించి నిర్ధేశించుకున్న లక్ష్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దసరా నుంచి పండుగల సీజన్ మొదలు కాగా, ఇప్పటికే ఈ విభాగాల్లో విక్రయాలు అంచనాలను మించాయి. దీంతో కంపెనీలు సైతం తగ్గేదేలా అంటూ ప్రకటనలకు మరింత ఖర్చు చేస్తున్నాయి. ‘‘ఈ కామర్స్, అప్పారెల్, ఫ్యాషన్, ప్రీమియం ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్లు, బ్యూటీ, వెల్నెస్ ఉత్పత్తులు, వినోద, జ్యుయలరీ సంస్థలు అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికం కోసం తమ ప్రకటనల బడ్జెట్‌ను (నిధుల కేటాయింపులు) 15–20 శాతం పెంచాయి. పండుగల డిమాండ్‌కు అనుకూలంగానే ఇది ఉంది. ఈ కేటగిరీల్లో ఇప్పటి వరకు విక్రయాలు లక్ష్యాలను మించి నమోదయ్యాయి’’అని మీడియా టెక్నాలజీ స్టార్టప్ ఆర్డీ అండ్‌ఎక్స్ నెట్వర్క్ చైర్మన్ ఆశిష్ భాసిన్ తెలిపారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగంలో మాత్రం ప్రకటనల పరంగా ఆచితూచి అనుసరించే ధోరణి ఉన్నట్టు చెప్పారు. ఇక ముందూ కొనసాగొచ్చు.. పండుగల సమయాల్లో వినియోగదారులు కొనుగోళ్లకు మొగ్గు చూపిస్తుంటారు. గత రెండు సంవత్సరాల్లో కరోనా ప్రభావం కొనుగోళ్ల డిమాండ్‌పై చూపించింది. కానీ, ఈ ఏడాది వైరస్ ప్రభావం ఏమీ లేదు. సాధారణ ఆర్థిక కార్యకలాపాల మద్దతుతో వినియోగ డిమాండ్ పట్టణాల్లో బలంగానే ఉంది. దీంతో విక్రయాలు గణనీయంగానే నమోదవుతున్నాయి. దీపావళి వరకు ఈ కొనుగోళ్లు జోరుగా ఉంటాయని జాన్‌రైజ్ అడ్వర్టైజింగ్, బ్రాండింగ్ డైరెక్టర్ సుమన్ గద్దె తెలిపారు. ఆ తర్వాత పండుగల సీజన్ కూడా కలిసొస్తుందని అన్నారు. విస్తృత స్థాయిలో ఉత్పత్తులు, వాటిపై ఆఫర్లను ఈ సీజన్లో అందిస్తున్నట్టు ఎల్జీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దీపక్ బన్సాల్ తెలిపారు. డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉన్నట్టు చెప్పారు. అన్ని మాధ్యమాల్లో తమ ఉత్పత్తులకు సంబంధించి విస్తృతమైన ప్రచారం చేపట్టినట్టు వెల్లడించారు. ఈ సీజన్లో ఎక్కువే.. ‘‘మా జ్యుయలరీ బ్రాండ్లు తనిష్క్, మియా, జోయ, కార్ట్‌లేన్‌కు సంబంధించి ప్రకటనలపై చేసే ఖర్చు గతేడాది ఇదే సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్లో పెరిగింది’’అని టాటా గ్రూపు కంపెనీ టైటాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అజయ్ చావ్లా తెలిపారు. ఎగువ మధ్య తరగతి, ఖరీదైన విభాగాల్లో వినియోగదారుల ఆసక్తి పెరిగినట్టు చెప్పారు. దీంతో మరింత మంది కస్టమర్లను ఆకర్షించడం ద్వారా, మెరుగైన వృద్ధి అంచనాలను చేరుకునే లక్ష్యంతో ఉన్నట్టు తెలిపారు. విచక్షణారహిత వినియోగ విభాగంలో ఇప్పటి వరకు డిమాండ్ బలంగా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఇది ప్రకటనలపై అధిక వ్యయాలకు మద్దతునిస్తున్నట్టు చెప్పాయి. ఫ్రెంచ్ అప్పారెల్ బ్రాండ్ సెలియో సీఈవో సత్యేన్ మొమాయ మాట్లాడుతూ.. దసరా సమయంలో పెట్టుబడులపై మంచి రాబడులు రావడంతో ప్రకటనల బడ్జెట్‌ను 25 శాతం పెంచినట్టు ఈ సందర్భంగా తెలిపారు. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
Viral: మ్యాట్రిమోనీలో యాడ్.. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాల్ చేయద్దంటూ..
ఒకప్పుడు బంధువులు, తెలిసిన వారి ద్వారా పెళ్లి సంబంధాలు కుదిరేవి. ఇప్పుడు కాలం మారింది. మ్యాట్రిమోనీ సైట్లు వచ్చాక ఎక్కువగా వీటిపైనే ఆధారపడుతున్నారు. తమ వివరాలతో ప్రొఫైల్ క్రియేట్ చేసి మ్యాట్రిమోనీ సైట్లలో అప్లోడ్ చేసేస్తున్నారు. అంతేగాక తమకు ఎలాంటి గుణాలు ఉన్న వ్యక్తి కావాలో కూడా చెప్పుకునే అవకాశం ఉటుంది. వీటితోపాటు పత్రిక ప్రకటనలు చూసి కూడా పెళ్లిళ్లు నిశ్చయించుకుంటున్నారు. తాజాగా ఓ పత్రికలో ఇచ్చిన పెళ్లి ప్రకటన వైరల్‌గా మారింది. వ్యాపారవేత్త సమీర్ అరోరా.. న్యూస్ పేపర్లో ప్రచురితమైన మ్యాట్రిమోనీ అడ్వర్టైజ్మెంట్ క్లిప్‌ను ట్విటర్లో షేర్ చేశారు. ఇందులో 24 ఏళ్ల అందమైన అమ్మాయికి ధనవంతులైన, బిజినెస్ బ్యాగ్రౌండ్ ఉన్న వరుడు కావాలి. అదే కులానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్, లేదా డాక్టర్ అని అయి ఉండాలి’ అని ఉంది. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా ప్రకటన చివర్లో ‘సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దయచేసి కాల్ చేయవద్దు’ అని నొక్కి చెప్పారు. ‘ఐటీ రంగానికి భవిష్యత్తు అంతాగా కనిపించడం లేదు’ అనే ట్యాగ్‌లైన్‌తో షేర్ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. Future of IT does not look so sound. pic.twitter.com/YwCsiMbGq2 — Samir Arora (@Iamsamirarora) September 16, 2022 ఓ వర్గం వారు నిజమేనంటూ మద్దతిస్తుంటే.. మరో వర్గం వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మండిపడుతున్నారు. ఈ యాడ్ చూస్తుంటే.. దేశ భవిష్యత్తు మొత్తం మంచిగా కనిపించడం లేదు. ఐటీ లేకుంటే భవిష్యత్తే బాగోదు. హమ్మయ్యా నాకు 11 ఏళ్ల క్రితమే పెళ్లైంది. ఇది సరైంది కాదు. డోంట్ వర్రీ..ఇంజనీర్లు ఇలాంటి వార్తాపత్రికల ప్రకటనపై ఆధారపడరు. వారు తమంతట తాముగా ప్రతిదీ వెతుకుంటారు’ అని రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కాని ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోది. Don't worry..Engineers don't rely on some newspaper ad. They find everything on their own. — Ajay sharma (@Ajaysha17977479) September 16, 2022 Looking at the ad, the whole country's future doesn't look so sound. — Ashutosh Vishwakarma (@aashutoshaawara) September 16, 2022 Thank god, I got married 11 years ago! — Bharat Trader 🇮🇳 (@BharatTrader) September 16, 2022 -
యాడ్స్‌పై ఒక్క రూపాయి పెట్టలేదు.. కానీ కంపెనీ విలువ రూ.76.21 లక్షల కోట్లు
పబ్లిసిటీపై ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వివాస్పద వ్యాఖ్యలు చేస్తూ సినిమాకు పబ్లిసిటీ తీసుకురావడంలో రామ్‌గోపాల్ వర్మది అందవేసిన చేయి. అలాంటి ఆర్జీవీకే బాప్లా ఉన్నాడు ఎలన్ మస్క్. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్న ఎలన్‌మస్క్ విజయ ప్రస్థానంలో టెస్లా కార్లది కీలక పాత్ర. మోస్ట్ సక్సెస్ఫుల్ ఎలక్ట్రిక్ కార్ల బ్రాండ్‌గా టెస్లా కొనసాగుతోంది. టెస్లా కార్ల పబ్లిసిటీ కోసం ఎలన్ మస్క్ ఎటువంటి ప్రచారం చేయలేదు. ఎక్కడా కూడా ఒక సెంటు డాలరు ఖర్చు పెట్టి అడ్వెర్టైజ్మెంట్లు ఇచ్చింది లేదు. కానీ టెస్లా కార్ల నాణ్యత. ఎలన్ మస్క్ వ్యూహచతురతతో టెస్లా కంపెనీ మార్కెట్ క్యాపిటల్ విలువ ఒక ట్రిలియన్ డాలర్లకు (రూ. 76.21 లక్షల కోట్లు) చేరుకుంది. ఈ విషయాన్ని ఎలన్‌మస్క్ ఇటీవల ఓ మార్కెట్ నిపుణుడి ట్వీట్‌కి స్పందిస్తూ స్వయంగా తెలిపారు. గ్యారీబ్లాక్ అనే మార్కెట్ నిపుణుడు టెస్లా వ్యవహరాలను నిశితంగా పరిశీలిస్తున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో టెస్లా కార్ల సేల్స్, మార్కెట్ వాల్యు ఎలా పెరిగిందో తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు. ఈవీ సెక్టార్లో ఇతర కంపెనీలు అడ్వైర్టైజ్మెంట్లు ఇస్తుంటే అమ్మకాలు టెస్లాలో పెరుగుతున్నాయంటూ ఓ చార్ట్‌ను పోస్ట్ చేశారు. దీనికి ఎలన్ మస్క్ స్పందిస్తూ యాడ్స్ కోసం రూపాయి ఖర్చు చేయకుండా టెస్లా కంపెనీ మార్కెట్ విలువ వన్ ట్రిలియన్ డాలర్లకు చేరిందంటూ తెలిపాడు. Most informative chart in the 1Q earnings deck: The day after the 2022 Super Bowl, $TSLA orders surged, which validates our long held view that competitors’ advertising their new EVs helps TSLA as EV market leader the most. @elonmusk @MartinViecha pic.twitter.com/68G4wOaqKn — Gary Black (@garyblack00) April 20, 2022 చదవండి: Elon Musk: నేను ట్విటర్ సొంతం చేసుకుంటే వాళ్లకు జీతం ఉండదు! -
ఉక్కిరిబిక్కిరి అవుతున్న నెట్‌ఫ్లిక్స్.. ఇష్టం లేకున్నా వాటి వైపు చూపు!
వెండితెరకు, బుల్లితెరకు ప్రత్యామ్నాయంగా వచ్చిన ఓవర్ ది టాప్ (ఓటీటీ) కంటెంట్ రోజురోజుకి మార్కెట్లో దూసుకుపోతుంది. దీంతో రోజుకో కంపెనీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఫలితంగా ఒకప్పుడు ఓటీటీ మార్కెట్లో రారాజుగా వెలిగిన నెట్‌ఫ్లిక్స్‌కి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో నెట్‌ఫ్లిక్స్ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది చందాదారులు ఉన్నారు. కొత్త సినిమాలు రిలీజ్ చేయడంతో పాటు సినిమాలనే తలదన్నెలా ఒరిజినల్స్‌ని ప్రేక్షకులను అందిస్తూ మెజారిటీ దేశాల్లో పాగా వేసింది నెట్‌ఫ్లిక్స్. అయితే గత కొంత కాలంగా నెట్‌ఫ్లిక్స్‌కి గడ్డు రోజులు ఎదురవుతున్నాయి. కొత్తగా వచ్చిన ఓటీటీ యాప్‌లతో నెట్‌ఫ్లిక్స్‌కి తీవ్ర పోటీ ఎదురువుతోంది. ఫలితంగా చందాదారుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు గతేడాది నెట్‌ఫ్లిక్స్ తన చందా ధరలను తగ్గించింది. ఇండియాలో అయితే రూ.199కే బేసిక్ ప్లాన్‌ను అమల్లోకి తేగా అప్పటి వరకు రూ.199గా ఉన్న మొబైల్ ప్లాన్ ధరని రూ. 149కి తగ్గించింది. ఐనప్పటికీ పరిస్థితితో పెద్దగా మార్పు రాలేదు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఇప్పటికే రెండు లక్షల మంది చందాదారులను కోల్పోయింది. దశాబ్ద కాలం తర్వాత భారీ స్థాయిలో చందాదారులను కోల్పోయింది. అంతేకాదు ఈ ఏడాది చివరి నాటికి ఇరవై లక్షల మంది చందాదారులను కోల్పోవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. దీంతో సరికొత్త స్ట్రాటజీ అమలు చేసే యోచనలో ఉంది నెట్‌ఫ్లిక్స్,. ఇప్పటి వరకు అడ్వర్టైజ్మెంట్ లేకుండా కంటెంట్ ప్రసారం చేయడం నెట్‌ఫ్లిక్స్ ప్రత్యేకతగా ఉంది. కానీ ఆదాయం పడిపోకుండా చందాదారులను కోల్పోకుండా ఉండేందుకు కంటెంట్ మధ్యలో యాడ్స్‌కు చోటివ్వాలనే ప్లాన్‌ను పరిశీలిస్తున్నట్టు నెట్‌ఫ్లిక్స్ సీఈవో రీడ్ హ్యాస్టింగ్స్ తాజాగా ప్రకటించారు. యాడ్స్ ప్రసారానికి మేము వ్యతిరేకమైనప్పటికీ కస్టమర్ల ఛాయిస్‌ను కూడా గౌరవించాలని భావిస్తున్నాం. కాబట్టి రాబోయే ఒకటి రెండేళ్లలో యాడ్స్‌ను ప్రవేశపెడతామంటూ తెలిపారు. ఈ విధానాన్ని ఇప్పటికే డిస్నీ హాట్‌స్టార్, హులు, జీ 5 వంటి సంస్థలు పాటిస్తున్నాయి. చదవండి: Netflix: యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ భారీ షాక్! అది ఏంటంటే? -
షాకింగ్ నిర్ణయం..! ఐపీఎల్-2022లో వాటి సప్పుడు ఉండదు..!
మరికొద్ది రోజుల్లో ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. ఈ లీగ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో అత్రుతగా వెయిట్ చేస్తున్నారు. వీరితో పాటుగా పలు కంపెనీలు కూడా వెయిట్ చేస్తున్నాయి. ఎందుకంటే సదరు కంపెనీలు ఐపీఎల్-2022 మ్యాచ్‌లో తమ ప్రకటనలను బ్రాడ్కాస్ట్ చేసేందుకు ఊవిళ్లురుతున్నాయి. అడ్వర్టైజింగ్ విషయంలో ఎంతైనా చెల్లించేందుకు కంపెనీలు రెడీగా ఉన్నాయి. కాగా ఐపీఎల్-2022 నేపథ్యంలో భారత్‌కు చెందిన క్రిప్టోకరెన్సీ ఎక్సేఛేంజ్స్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాయి. ప్రకటనలకు దూరం..! భారత్‌లో క్రిప్టోకరెన్సీ భారీ ఆదరణను పొందాయి. దీన్ని క్యాష్ చేసుకునేందుకు పలు కంపెనీలు క్రిప్టో ఎక్సేఛేంజ్లను నెలకొల్పాయి. ఇండియాలో వజీర్ ఎక్స్, కాయిన్ డీసీఎక్స్, కాయిన్ స్విచ్ కుబేర్ లాంటి క్రిప్టో ఎక్సేఛేంజ్‌లు భారీ ఆదరణను పొందాయి. ఐపీఎల్-2022 నేపథ్యంలో ఈ కంపెనీలకు చెందిన ప్రకటనలు కన్పించవు. ఐపీఎల్-15 ఎడిషన్ అడ్వర్టైజింగ్ స్పాట్స్‌ను బుక్ చేసుకునేందుకు సిద్దంగా లేన్నట్లు సమాచారం. ఆయా కంపెనీలు ప్రకటనలకోసం డబ్బులను వెచ్చించేందుకు రెడీగా లేవని తెలుస్తోంది. ఈ కంపెనీలు 2021లో దాదాపు 90 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. గత ఏడాది ఐపీఎల్ పది సెకన్ల యాడ్‌కు సుమారు రూ. 13 నుంచి 18 లక్షల వరకు ఛార్జ్ చేసినట్లు సమాచారం. కారణాలు అవేనా..? క్రిప్టోకరెన్సీలపై కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో సదరు కంపెనీలు వెనకడుగు వేసినట్లు సమాచారం. 2022-23 బడ్జెట్లో క్రిప్టో కరెన్సీలు, ఇతర డిజిటల్ ఆస్తుల ద్వారా వచ్చేఆదాయంపై 30 శాతం పన్నులను, రూ. 10 వేల కంటే ఎక్కువ వర్చువల్ కరెన్సీల చెల్లింపులపై 1 శాతం టీడీఎస్ విధిస్తామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రిప్టో ఇన్వెస్టర్లకు, ఎక్సేఛేంజ్లకు కొంత మేర నష్టాలను కల్గించే అవకాశం ఉంది. క్రిప్టోమార్కెట్‌ను నియంత్రించేందుకు కేంద్రం తీసుకునే నిర్ణయాలను బట్టి ముందుకుసాగాలని క్రిప్టో ఎక్సేఛేంజ్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ముందుగానే పలు చర్యలను తీసుకోవడం మంచిదని కంపెనీలు భావించినట్లుగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. చదవండి: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..! వచ్చే 6 రోజుల్లో 4 రోజులు బంద్..! -
చూస్తే చాలు కళ్లు చెమరుస్తాయి.. దీపావళి వేళ.. మనసును హత్తుకునేలా
దీపావళి పండగ అంటే సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అంతా ఆనందంగా జరుపుకుంటారు. ముఖ్యంగా బిజినెస్ సెక్టార్లో దీపావళికి ప్రత్యేక స్థానం ఉంది. స్టాక్మార్కెట్లో ప్రత్యేకంగా ముహురత్ ట్రేడింగ్ ఉంటుంది. దాదాపు అన్ని వ్యాపార సంస్థలులు ధమాకా ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అయితే మనసును ఆకట్టుకునేలా యాడ్స్ రూపొందించడం కూడా ఆనవాయితీగా వస్తోంది. అందులో ఈసారి వచ్చిన కొన్ని ప్రకటనలు మనసును హత్తుకునేలా.. గుండె తడిని పెంచేలా.. ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా భావంతో కట్టిపడేసేలా వాటిని రూపొందించారు. పండగ వేళ మీరు వాటిని చూడండి. వీటి తీరే వేరు సాధారణంగా అన్ని యాడ్స్ ఆయా కంపెనీలు తయారు చేసే ప్రొడక్టు గురించి విపరీతంగా ప్రమోట్ చేస్తున్నట్టుగా తయారవుతాయి. కానీ దీపావళి యాడ్స్ అలా కాదు పూర్తిగా భావోద్వేగంగా ఉంటాయి. బ్రాండ్, ప్రొడక్ట్ ప్రమోషన్ అనేది అంతర్లీనంగా ఉంటూ ఎమోషనల్‌గా ఉంటాయి. అందుకే ఏళ్లు గడిచినా సరే వాటిని మరిచిపోవడం కష్టం. సేల్స్‌మేన్ కళ్లలో ఆనందం ఇండియన్ ఆయిల్ యాడ్‌లో .. దీపావళి పండగ సందర్భంగా ఓ స్వీట్ షాప్ కస్టమర్లతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఆ షాప్ యజమాని వచ్చిన కస్టమర్లందరికీ టేస్ట్ చూడమంటూ కలాకాన్ అందిస్తుంటాడు. ఈ షాప్‌లోని సేల్స్‌మేన్ చూస్తుండగానే కాంప్లిమెంటరీ స్వీట్ మొత్తం అయిపోతుంది. చివరకు షాప్ మూసివేసే సమయంలో ఏమైనా స్వీట్ మిగిలి ఉందా అని సేల్స్‌మేన్ వెతుకుతారు. కానీ అక్కడ ఏమీ కనిపించదు. పండగ వేళ బయటంతా బాణాసంచా వెలుతురుతో సందండి నెలకొంటే సేల్స్‌మ్యాన్ ముఖంలో విచారణం నెలకొంటుంది. మనసంతా బాధతో నిండిపోయి ఉంటుంది. Sometimes, the smallest gesture can light up someone's world. This festive season, let's celebrate all such moments and spread good cheer and warmth.#IndianOil #Indane #XTRATEJ #HappyDiwali pic.twitter.com/s7Xkei8vhF — Indian Oil Corp Ltd (@IndianOilcl) November 2, 2021 మనసంతా నిరాశతో గుండె బరువెక్కిపోయిన సేల్స్‌మేన్ కళ్లలో ఆనందం ఎలా వచ్చింది. ఎవరు ఆ సంతోశానికి కారణమనే అంశాలను ఎంతో భావోద్వేగంగా చిత్రీకరించారు. చివర్లో బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే వాయిస్‌తో యాడ్ మరో లెవల్‌కి వెళ్లిపోతుంది. దీపావళి యాడ్స్‌కి స్పెషల్ ట్రెండ్‌ని క్రియేట్‌ని చేసి వాటిలో రెండేళ్ల క్రితం వచ్చిన హెచ్‌పీ ప్రింటర్స్ యాడ్‌కి ప్రత్యేక స్థానం ఉంది. ఓల్డ్ అడ్వెర్టైజ్మెంట్కి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఈసారి కూడా హెచ్‌పీ సంస్థ యాడ్‌ను రెడీ చేసింది. కొన్ని బంధాలకు లేబుళ్లు అక్కర్లేదు అంటూ అమెజాన్ రూపొందించిన యాడ్ తప్పకుండా ఆకట్టుకుంటుంది. దీపావళి రోజున ఇంటి దగ్గర ఉండకుండా బయటకు తీసుకెళ్లిన కొడుకుతో తండ్రి వాదులటతో ప్రారంభమయ్యే ఎల్ అండ్ టీ యాడ్ ఎండింగ్లో ఇచ్చే ట్విస్ట్‌తో మరో లెవల్‌కి చేరుకుంటుంది. వృద్దాప్యంలో చాదస్తం ఎక్కువైన భర్త, అతనితో వేగలేక పోతున్న భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని చెబుతూ ఏయూ బ్యాంక్ రూపొందించిన యాడ్ కూడా ఆకట్టుకుంటుంది. -
ఐపీఎల్లో పది సెకన్ల యాడ్‌కి ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసా?
కరోనా సంక్షోభంతో ఆదాయం పడిపోయిన టెలివిజన్ రంగానికి ఆటలు ఊపిరి పోస్తున్నాయి. ఒకప్పుడు టీవీ యాడ్ రెవెన్యూలో పది శాతంగా ఉన్న స్పోర్ట్స్ వాటా ఇటీవల 20 శాతానికి చేరుకుంది. ముఖ్యంగా టీమిండియాలో క్రికెట్లో విజయాలు సాధిస్తుంటే దానికి తగ్గట్టుగా టీవీల యాడ్ రెవిన్యూ బౌండరీలు దాటేస్తోంది. ఆదుకున్న ఆస్ట్రేలియా పర్యటన కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో ఒక్కసారిగా దేశ ఆర్థిక వ్యవస్థ మందగించింది. వ్యాపారాలు ఒక్కసారిగా తగ్గిపోవడంతో దాని ప్రభావం అడ్వెర్‌టైజ్ రంగంపై పడింది. దీంతో యాడ్ రెవెన్యూ ఆధారంగా నడిచే టెలివిజన్ రంగానికి పెద్ద చిక్కే వచ్చి పడింది. అయితే ఆస్ట్రేలియా టూర్లో టీమిండియా సంచలనం సాధించడం.. ఆ వెంటనే ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాకవడంతో ఒక్కసారిగా యాడ్ రెవెన్యూ పట్టాలెక్కింది. మధ్యలో కరోనా కరోనా సెకండ్ వేవ్ ఇబ్బంది పెట్టినా టోక్యో ఒలింపిక్స్ ఆదుకున్నాయి. పెరిగిన స్పోర్ట్స్ వాటా టీవీ యాడ్ రెవెన్యూలో కరోనా ముందు వరకు స్పోర్ట్స్ వాటా 10 నుంచి 15 శాతం వరకే ఉండేది. అయితే ఫస్ట్ వేవ్ ముగిసిన తర్వాత ఐపీఎల్ ప్రారంభంతో ఒక్కసారిగా యాడ్ రెవెన్యూ వాటా 20 శాతానికి పెరిగిందని ఇంటిగ్రేటెడ్ మీడియా ఆఫ్ అడ్వెర్టైజింగ్ కంపెనీ డీడీబీ గ్రూప్ ఎండీ రామ్ మోహన్ సుందరమ్ తెలిపారు. కరోనాకి ముందు టీవీ యాడ్ రెవెన్యూ రూ. 28,000 కోట్లు ఉండగా ఇందులో క్రీడల వాటా రూ. 2,500 కోట్లుగా ఉండేంది. ఐపీఎల్ తర్వాత ఇది ఏకంగా రూ. 4500 కోట్ల నుంచి రూ. 5,000 కోట్ల వరకు చేరుకుందని ఆయన వెల్లడించారు. అగ్రస్థానం క్రికెట్‌దే టీవీలకు ఆదాయం సంపాదించి పెడుతున్న ఆటల్లో క్రికెట్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్ ద్వారా రూ.300ల నుంచి రూ. 400 కోట్ల ఆదాయం వచ్చింది. త్వరలో జరగబోయే టీ 20 వరల్డ్ కప్ ద్వారానే రూ.1,200 కోట్ల రెవెన్యూ వస్తుందని యాడ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. ఇక ఐపీఎల్ 14 సీజన్ యాడ్ రెవిన్యూ విలువ అయితే ఏకంగా రూ. 2,500 కోట్లుగా ఉంది. క్షణానికి లక్ష ప్రపంచకప్, టోక్యో ఒలింపిక్స్‌లను మించిన డిమాండ్ బుల్లితెరపై ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్‌కి ఉంది. ఇటీవల మధ్యలో ఆగిపోయిన సీజన్ 14కి సంబంధించి కేవలం పది సెకన్ల యాడ్‌కి రూ. 14 లక్షల వంతున ఛార్జ్ చేశాయి టీవీలు. అంటే ఒక్క సెకనుకి లక్షకు పైగానే ధర పలుకుతోంది. అయినా సరే కార్పొరేట్ కంపెనీలు వెనక్కి తగ్గడం లేదు. టీవీలు అడిగినంత సొమ్ము చెల్లించి స్లాట్ బుక్ చేసుకుంటున్నాయి. సినిమాను దాటేసింది ఇండియన్ టెలివిజన్ యాడ్ రెవిన్యూలో ఇప్పటికీ అగ్రస్థానం సీరియల్లే ఆక్రమించాయి. ఆ తర్వాత సినిమాలు, న్యూస్, స్పోర్ట్స్, మ్యూజిక్, కిడ్స్ విభాగాలు ఉండేవి. క్రమంగా సినిమాలను స్పోర్ట్స్ వెనక్కి నెట్టేస్తోంది. పిచ్ మాడిసన్ 2019 రిపోర్టు ప్రకారం యాడ్ రెవెన్యూలో న్యూస్ వాటా 11 శాతం ఉండగా స్పోర్ట్స్ వాటా 10 శాతానికి చేరుకుంది. సినిమాలు 8 శాతానికే పరిమితం అయ్యాయి. మ్యూజిక్, కిడ్స్ 3 శాతం వాటాను కలిగి ఉన్నాయి. చదవండి : Jeff Bezos: ఆసక్తికర ప్రయోగానికి సిద్ధమైన జెఫ్ బెజోస్..! -
ఎలన్ మస్క్ కొత్త ప్లాన్.. ఈసారి అంతరిక్షంలో ఏకంగా..!
మీకు ఒక వ్యాపారం ఉందనుకోండి. వ్యాపారం మరింత బాగా వృద్ధి చెందడం కోసం ఏ చేస్తారు..సింపుల్‌గా అడ్వర్టైజ్మెంట్ల ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యేలా మీ వ్యాపారం గురించి తెలియజేస్తారు. ఒకప్పుడు అడ్వర్టైజ్మెంట్లను కరపత్రాల రూపంలో లేదా న్యూస్పేపర్లో యాడ్స్ రూపంలో ప్రచారం చేసేవారు. మారుతున్న కాలంతో పాటు మానవుడు సాంకేతికంగా ఎంతగానో అభివృద్ధి చెందాడు. నేటి డిజిటల్ కాలంలో సాంకేతికతను ఉపయోగించి అడ్వర్టైజ్మెంట్ రంగంలో కొత్త పుంతలు తొక్కుతూ..డిజిటల్ మార్కెటింగ్ ద్వారా పలు కంపెనీలు, వ్యాపార సంస్థలు అడ్వర్టైజ్ చేస్తున్నాయి. తాజాగా ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ కంపెనీ అడ్వర్టైజింగ్ రంగంలో కొత్త శకానికి నాంది పలకనుంది. ఏకంగా అంతరిక్షంలో అడ్వర్టైజ్ బిల్ బోర్డ్లను ఏర్పాటుచేయనుంది. స్పేస్ఎక్స్ కంపెనీ కెనాడాకు చెందిన స్టార్టప్ జియోమెట్రిక్ ఎనర్జీ కార్పోరేషన్ (జీఈసీ) భాగస్వామ్యంతో క్యూబ్‌శాట్ అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించనుంది. ఈ ఉపగ్రహంతో ఆయా కంపెనీలు లోగోల గురించి లేదా అడ్వర్టైజ్మెంట్లను అంతరిక్షంలో బిల్‌బోర్డ్స్‌పై కన్పించేలా చేయనుంది. క్యూబ్‌శాట్ శాటిలైట్ చూపించే అడ్వర్టైజ్మెంట్లను యూట్యూబ్ ద్వారా ప్రత్యక్షప్రసారం చేయనున్నారు. అందుకోసం క్యూబ్‌సాట్‌కు సపరేటుగా సెల్ఫీ స్టిక్‌ను ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. ఈ శాటిలైట్‌ను ఫాల్కన్-9 రాకెటును ఉపయోగించి త్వరలోనే స్పేస్ ఎక్స్ ప్రయోగించనుంది. ఈ సందర్భంగా జీఈసీ స్టార్టప్ కంపెనీ సీఈవో శామ్యూల్ రీడ్ మాట్లాడుతూ..అంతరిక్షంలో అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలనే కంపెనీలు డాగీకాయిన్ క్రిప్టోకరెన్సీ ఉపయోగించి కూడా ప్రచారం చేసుకోవచ్చునని తెలిపారు. క్యూబ్‌శాట్ ఉపగ్రహంతో అడ్వర్టైజింగ్ రంగంలో పెనుమార్పులు రానున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. -
మోసగించడంలో మనోడిది నయా ట్రెండ్.. ప్రకటనలే పెట్టుబడి
సాక్షి, సిటీబ్యూరో: రియల్ఎస్టేట్ ప్రకటనల ఆధారంగా పలువురిని మోసంచేసిన నిందితుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడు ఖమ్మం జిల్లా చిన్నారానికి చెందిన ఎస్.నాగరాజుగా గుర్తించారు. వివరాలు.. గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన నాగరాజు తీవ్రంగా నష్టపోయాడు. దీంతో ఆ పేరుతోనే మోసాలకు చేయాలని నిర్ణయించుకున్నాడు. 99ఎకర్స్.కామ్, ఓఎల్ఎక్స్ యాప్‌లతో పాటు వివిధ క్లాసిఫైడ్స్‌తో స్థలాల విక్రయం పేరుతో ఉన్న ప్రకటనల్ని చూసేవాడు. వారికి ఫోన్‌చేసి ఆ స్థిరాస్తిని తాను ఖరీదు చేయాలని భావిస్తున్నట్లు చెప్పి బయానాగా కొంత చెల్లించి వాట్సాప్ ద్వారా పత్రాలు షేర్ చేయించుకునే వాడు. ఆపై రియల్ ఎస్టేట్ సంస్థలకు చెందిన బోర్డులపై ఉన్న రియల్టర్ల నెంబర్లు సేకరించి వారికి ఫోన్లు చేసి తానే సదరు స్థలానికి యజమానినంటూ పరిచయం చేసుకునేవాడు. తక్కువ ధరకు విక్రయించేస్తున్నట్లు చెప్పి పత్రాలు షేర్ చేసేవాడు. నిజమేనని నమ్మిన రియల్టర్లు అగ్రిమెంట్ చార్జీలు, అడ్వాన్సులు, ఇతర ఖర్చుల పేరుతో రూ.లక్షల్లో తన బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకునే వాడు. ఇలా వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. తరువాత అసలు యజమానుల్ని సంప్రదించి స్థిరాస్తి ఖరీదు చేయలేకపోతున్నానని చెప్పి వారి పత్రాలను వాట్సాప్ ద్వారా తిప్పిపంపి బయానాగా చెల్లించినదీ వెనక్కు తీసుకునేవాడు. ఇలా చైతన్యపురి, మీర్పేట్లతో పాటు సైబర్ క్రైమ్ ఠాణాలోనూ పది కేసులు నమోదయ్యాయి. దీంతో ఏసీపీ ఎస్.హరినాథ్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ ఎన్.రాము రంగంలోకి దిగారు. సాంకేతికంగా దర్యాప్తు చేసిన అధికారులు నిందితుడు నాగరాజుగా గుర్తించి అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రధాని ‘ఇంటి ప్రకటన’పై రాజకీయ దుమారం
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఇచ్చిన ప్రకటన తీవ్ర దుమారం రేపుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద భారీగా ప్రజలు లబ్ధి పొందుతున్నారని చెబుతూ ఓ ఇంటి ముందు ఒక మహిళ నిలబడి ఉన్న ఫొటోను ప్రకటనగా చేసి ప్రచురించారు. ప్రధాన పత్రికలతో పాటు సోషల్ మీడియాలో ఆ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనపై రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ప్రకటనలో ఉన్న మహిళ పేరు లక్ష్మిదేవి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కత్తాలోని బౌబజార్‌లో మలాంగలో ఆమె నివసిస్తోంది. ‘ఆమె ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా లక్ష్మీదేవికి ఇల్లు వచ్చింది’ అని ప్రకటన వచ్చింది. ఆ ప్రకటనను చూసిన లక్ష్మి షాక్‌కు గురైంది. ఆ ఫొటో ఎవరూ తీసుకున్నారో.. ఎప్పుడు తీసుకున్నారో తెలియదని మీడియాకు చెప్పింది. ఇంకా ఆమె చెప్పిన వివరాలు తెలుసుకుంటే అవాక్కయ్యే పరిస్థితి. లక్ష్మీదేవి ఉండేది అద్దె ఇంట్లో. అది కూడా ఒకే ఒక గది ఉన్న ఇంటిలో కుటుంబసభ్యులు మొత్తం ఆరుగురు ఉంటారు. ఆ ఇంటికి మరుగుదొడ్డి సౌకర్యం కూడా లేదు. ఉంటున్న గదికి నెలకు రూ.500 అద్దెగా చెల్లిస్తున్నారు. బాబుఘాట్‌లో మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి వెళ్లామని.. అప్పుడు ఆ ఫొటో తీసి ఉండొచ్చని లక్ష్మి తెలిపింది. తాను చదువుకోలేదని.. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని పేర్కొంది. తనను బీజేపీ నాయకులు ఎవరు కలవలేదని చెప్పింది. ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ నాయకుడు రాహూల్ గాంధీ కూడా స్పందించి దానికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు. మళ్లీ మళ్లీ అబద్ధాలు చెప్పడానికి కూడా జ్ఞానం ఉండాలి అని ట్వీట్ చేశారు. ఈ అబద్ధపు ప్రచారంపై తృణమూల్ కాంగ్రెస్ కూడా తీవ్రంగా స్పందిస్తోంది. ఇలాంటి తప్పుడు ప్రకటనలు ఇవ్వడాన్ని తృణమూల్ కాంగ్రెస్ తప్పు పట్టింది. बार-बार दोहराने पर भी, झूठ झूठ ही रहता है!#FactCheck pic.twitter.com/yvl6tf7yCW — Rahul Gandhi (@RahulGandhi) March 22, 2021 -
53 వేల కోట్లు నష్టపోయిన జుకర్‌బర్గ్
వాషింగ్టన్: నకిలీ వార్తలు, విద్వేషపూరిత పోస్టుల కట్టడికి సరైన చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో పలు కంపెనీలు ఫేస్‌బుక్‌కు ఇస్తున్న యాడ్స్‌ను నిలిపేశాయి. దీంతో 53 వేల కోట్ల రూపాయల ఫేస్బుక్ సంపద ఒక్క రోజులోనే ఆవిరయ్యింది. (భారత్‌లో గూగుల్ పే బ్యాన్? ఎన్పీసీఐ క్లారిటీ) ఆ సంస్థ షేర్ విలువ శుక్రవారం దాదాపు 8.3 శాతం పతనమైంది. యూనిలీవర్ తో పాటు వెరిజోన్ కమ్యూనికేషన్స్, హెర్షీస్ తదితర సంస్థలు ఫేస్బుక్ ను బాయ్‌కాట్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఇకపై ఆ సంస్థకు యాడ్స్ ఇవ్వబోమని ప్రకటించాయి. మరో అంతర్జాతీయ సంస్థ కొకాకోలా నెల రోజుల పాటు సోషల్ మీడియా సంస్థలకు ఇస్తున్న యాడ్స్‌ను నిలిపేస్తున్నట్లు పేర్కొంది. (యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ డౌన్‌గ్రేడ్) దీంతో ఫేక్ న్యూస్ పై సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ స్పందించారు. అన్ని రకాల ఓటింగ్ సంబంధిత పోస్టులకు కొత్త ఓటరు సమాచారం అనే లింకును జోడిస్తామని చెప్పారు. విద్వేషపూరిత వ్యాఖ్యల పరిధిని సైతం పెంచుతున్నట్లు వెల్లడించారు. ఇకపై రాజకీయ నాయకులు కూడా వీటి నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. -
మందుల ప్రకటనలు ఇక బంద్!
సాక్షి, హైదరాబాద్: టీవీలు, ఇతర ప్రసార మాధ్యమాలు, కరపత్రాలు, ఆడియో, వీడియో తదితర పద్ధతుల్లో ఇచ్చే ఔషధ ప్రకటనల ప్రచారాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం నూతన సవరణ ముసాయిదా బిల్లును రూపొందించింది. ఆ బిల్లును మంగళవారం ప్రజాభిప్రాయం కోసం విడుదల చేసింది. ఇప్పటికే కొన్ని రకాల జబ్బులకు సంబంధించిన మందులను ప్రచారం చేయకూడదన్న నిబంధన ఉండగా, తాజాగా మరికొన్నింటినీ కేంద్రం ప్రకటించింది. మొత్తంగా 78 రకాల జబ్బులకు ఫలానా మందు వాడితే తగ్గుతుందంటూ ప్రకటనలు చేయకూడదని, ఆ మేరకు ముసాయిదా బిల్లులో పేర్కొంది. ఒకవేళ ఎవరైనా ఆ జబ్బులకు మందులను సూచిస్తూ ప్రచారం చేస్తే రెండేళ్ల జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధిస్తామని తెలిపింది. మళ్లీ అదే తప్పు చేస్తే ఐదేళ్ల జైలు, రూ.50 లక్షల వరకు జరిమానా విధించేలా నిబంధనను కేంద్రం ముసాయిదాలో ప్రవేశపెట్టింది. ఈ జబ్బుల జాబితాలో ఎయిడ్స్, క్యాన్సర్, డయాబెటిస్, డిజార్డర్స్, హెర్నియా, హైడ్రోసిల్, బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచడం, లుకేమియా, స్థూలకాయం, పక్షవాతం, పార్కిన్సన్, పైల్స్, గుండె జబ్బులు, లైంగిక సామర్థ్యం, కిడ్నీలో రాళ్లు, లెప్రసీ, ప్లేగ్, న్యుమోనియా, టీబీ, టైఫాయిడ్ ఫీవర్, అపెండిసైటిస్, అంధత్వం, బ్లడ్ పాయిజనింగ్, చెవుడు, స్కిన్ ఫెయిర్‌నెస్, కంటి చూపు పెంపుదల, కామెర్లు, స్పాండిలైటిస్, మహిళలకు వచ్చే కొన్ని రకాల వ్యాధులు, అల్సర్లు తదితర జబ్బులకు మందులు సూచించకూడదని ముసాయిదా తెలిపింది. ఇలాంటి ప్రకటనల వల్ల చాలామంది డాక్టర్లను సంప్రదించకుండానే నే రుగా మందుల షాపుల్లో కొని వాడుతున్నారు. దీంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. దీనికి చెక్ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. -
యూట్యూబ్ డబ్బుతో 25 కోట్ల భవంతి
సాక్షి, న్యూఢిల్లీ: తన పాటలతో, నృత్యాలతో ప్రేక్షకులను అదరకొడుతున్న ప్రముఖ యూట్యూబర్ జోజో సివా. కుప్పలు తెప్పలుగా వచ్చి పడిన డబ్బులతో కొత్త భవంతిని కొనుగోలు చేశారు. ఇంతవరకు అమెరికా, కాలిఫోర్నియాలోని ఓక్స్‌లో తల్లిదండ్రులతో ఉన్న ఇంటిని ఖాళీ చేసి ఇప్పుడు లాస్ ఏంజెలిస్ రాష్ట్రంలోని టార్జానా నగరంలో కొత్తగా నిర్మించిన భవంతిని 25 కోట్లకు కొనుగోలు చేశారు. తన ఇంటిని పరిచయం చేస్తూ ఆమె తీసిన వీడియోను ఆమె గురువారం సోషల్ మీడియాకు విడుదల చేయడంతో అది వైరల్ అవుతోంది. అమెరికాకు చెందిన 16 ఏళ్ల జోజో అనతికాలంలోనే ప్రముఖ యూట్యూబర్‌గా ఎదిగారు. ఆమెకు ఇప్పుడు అందులో కోటిన్నర మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. తద్వారా ఆమెకు యాడ్స్ రూపంలో ఊహించని డబ్బు పచ్చి పడుతోంది. అలా కూడ బెట్టిన డబ్బులో పాతిక కోట్లను వెచ్చించి ఆమె ఈ భవంతిని కొన్నారు. ఆరువేల చదరపు గజాల విస్తీర్ణం గల ప్రాంగణంలో నిర్మించిన ఈ భవంతిలో హాలు, కిచెన్, బెడ్ రూములతోపాటు డైనింగ్ రూమ్, ఫన్ రూమ్, స్నూకర్స్ రూమ్ ఉన్నాయి. ఇంటి వెనకాల పలు సిట్ అవుట్లతోపాటు ఆకర్షణీయమైన స్విమ్మింగ్ ఫూల్ ఉంది. బాస్కెట్ బాల్ కోర్టు అదనపు ఆకర్షణ. కిచెన్‌లో పాప్‌కార్న్ మేకర్, పిజ్జా వారియర్లతోపాటు పలు వంట మిషిన్లు ఉన్నాయి. -
గూగుల్‌కు భారీ జరిమానా
పారిస్: ఆన్లైన్, వాణిజ్య ప్రకటనల మార్కెట్లో గూగుల్ సంస్థ ప్రదర్శిస్తున్న ఆధిపత్య ధోరణిపై ఫ్రాన్స్ మండిపడింది. గూగుల్‌లో వాణిజ్య ప్రకటనల్ని ఆమోదించడానికి అనుసరించే విధానాలు ఏ మాత్రం పారదర్శకంగా లేవని పేర్కొంటూ దాదాపు రూ. 1,180 కోట్ల జరిమానా విధించింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో యాడ్స్ ఇచ్చే వారందరికీ ఒకే నియమ నిబంధనలు ఉండాలని స్పష్టం చేసింది. ఇప్పటికే ఎన్నో దేశాలు వివిధ కారణాలతో గూగుల్‌కు జరిమానాలు విధించాయి. ఇప్పడు ఆ జాబితాలో ఫ్రాన్స్ కూడా చేరింది. -
అన్యమత ప్రకటనలపై ప్రభుత్వం సీరియస్
సాక్షి, తిరుమల: ఆర్టీసీ బస్ టిక్కెట్ల వెనుక అన్యమతాలకు చెందిన ప్రకటనలు ముద్రించడం పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 18 ప్రకటనలను గత మార్చిలో ముద్రించిన విషయం తెలిసిందే. గత మూడేళ్లుగా ఆర్టీసీలో ఈ ప్రకటనల బాధ్యతను ఓ ప్రైవేటు సంస్థకిచ్చారని తెలిపారు. కాగా, ఈ ప్రకటనలను కొనసాగించిన అధికారుల పై ప్రభుత్వం వేటు వేసింది. దీనికి సంబంధించి నెల్లూరు జోనల్ స్టోర్స్ కంట్రోలర్ జగదీష్‌బాబును సస్పెండ్ చేసింది. -
జంక్ ఫుడ్ ప్రకటనల నిషేధ యోచన లేదు
న్యూఢిల్లీ: టీవీల్లో జంక్ ఫుడ్‌కు సంబంధించి వ్యాపార ప్రకటనలు నిషేధించే ఆలోచన ప్రస్తుతానికి లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పిల్లలకు సంబంధించిన ప్రకటనలను కట్టడి చేయాలని ఫుడ్ అండ్ బేవరేజెస్ అలయన్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌బీఐఏ) స్వతంత్రంగా నిర్ణయం తీసుకుందని గురువారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్వర్ధన్ సింగ్ తెలిపారు. పిల్లల ఆరోగ్యంపై జంక్ ఫుడ్ ప్రభావం చూపుతోందని అనుబంధ ప్రశ్నల్లో ఎంపీలు ప్రశ్నించగా ఆ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ సమాధానమిస్తూ.. ‘సమస్య పరిష్కారానికి నిపుణుల బృందాన్ని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నియమించింది. కొవ్వులు, చక్కెర, ఉప్పు గల ఆహార పదార్థాలను పిల్లల ఛానళ్లల్లో ప్రసారం చేయకుండా నిషేధించాలని ఆ బృందం నివేదికలో సూచించింది. -
తప్పుడు ప్రకటనలపై కంపెనీలకు ఏఎస్సీఐ అక్షింతలు
న్యూఢిల్లీ: తప్పుదోవ పట్టించే ప్రకటనలపై అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి (ఏఎస్సీఐ) జులైలో 165 పైచిలుకు ఫిర్యాదులు అందాయి. వీటిలో 116 ప్రకటనల విషయంలో ఆయా సంస్థలు నిబంధనలు ఉల్లంఘించాయని ఏఎస్సీఐ నిర్ధారించింది. ఇందులో ఐటీసీ, గోద్రెజ్ కన్సూ్యమర్, హెచ్‌యూఎల్, ఎయిర్టెల్ వంటి పెద్ద కంపెనీల యాడ్స్ కూడా ఉన్నాయి. ‘క్లాస్మేట్’ బ్రాండ్ నోట్‌బుక్‌లో రాస్తే గుండ్రని రాతకు టీచర్ 2 మార్కులు ఎక్కువ ఇస్తారనే ఐటీసీ యాడ్‌ని తప్పు పడుతూ.. రాతకు.. నోట్బుక్కుకు సంబంధం లేదని సాధారణ నోట్‌బుక్ పేపరుపై కూడా అందంగా రాయొచ్చని ఏఎస్సీఐ వ్యాఖ్యానించింది. అలాగే త్రిఫల, ఆమ్ల, బిభీతకి మూలికల మేళవింపుతో తయారు చేసిన క్లినిక్ ప్లస్ ఉత్పత్తి జుట్టుకు బలాన్నిస్తుందన్న హిందుస్తాన్ యూనిలీవర్ ప్రకటనను కూడా ఆక్షేపించింది. జుట్టు బలానికి, త్రిఫలకి ముడిపెట్టడం తప్పుదోవ పట్టించేదేనని పేర్కొంది. ’’భారతదేశపు అత్యంత ఇంధన పొదుపు గ్రీన్ ఇన్వర్టర్ ఏసీ’’ అన్న గోద్రెజ్ ప్రకటన కూడా తప్పుదోవ పట్టించేదిగానే ఉందని కౌన్సిల్ తప్పుబట్టింది. -
'అన్నింటికి అమ్మేంటి.. ఆ ప్రచారమేంటి?'
మదురై: తమిళనాడులో అమ్మ పేరిట పథకాలు రావడంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల పేర్లకు అమ్మ, పురుచ్చి తలైవి(విప్లవాత్మక నేత) అని చేర్చడం, ఆ పేరిట ప్రకటనలు ప్రచురించడంపట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ పీ రథినం అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. మున్ముందు అలాంటి ప్రకటనలు అలాంటి పనులు చేయకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించాలని అందులో కోరారు. అంతేకాకుండా ప్రజల సొమ్మును ఇలా పథకాల పేరిట వ్యక్తిగత ప్రచారానికి ఉపయోగించకుండా ఉండేలా చూడాలని కోరుతూ కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శికి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని కోరారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ప్రచారం చేసుకునేందుకే పథకాల పేర్లు పెడుతున్నారని, వాటి ప్రకటనల్లో కూడా ఆమె పేరును చేరుస్తూ ప్రజలను ప్రభావితం చేస్తున్నారని తెలిపారు. అమ్మ కాల్ సెంటర్, అమ్మ మైక్రో లోన్స్ స్కీమ్స్ అంటూ ప్రతిరోజు దినపత్రికల్లో వేల కోట్ల రూపాయలను వృధా చేస్తున్నారని కూడా పిటిషనర్ అందులో పేర్కొన్నారు.