వెండితెరకు, బుల్లితెరకు ప్రత్యామ్నాయంగా వచ్చిన ఓవర్ ది టాప్ (ఓటీటీ) కంటెంట్ రోజురోజుకి మార్కెట్‌లో దూసుకుపోతుంది. దీంతో రోజుకో కంపెనీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఫలితంగా ఒకప్పుడు ఓటీటీ మార్కెట్‌లో రారాజుగా వెలిగిన నెట్‌ఫ్లిక్స్‌కి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో నెట్‌ఫ్లిక్స్ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది చందాదారులు ఉన్నారు. కొత్త సినిమాలు రిలీజ్ చేయడంతో పాటు సినిమాలనే తలదన్నెలా ఒరిజినల్స్‌ని ప్రేక్షకులను అందిస్తూ మెజారిటీ దేశాల్లో పాగా వేసింది నెట్‌ఫ్లిక్స్. అయితే గత కొంత కాలంగా నెట్‌ఫ్లిక్స్‌కి గడ్డు రోజులు ఎదురవుతున్నాయి.
కొత్తగా వచ్చిన ఓటీటీ యాప్‌లతో నెట్‌ఫ్లిక్స్‌కి తీవ్ర పోటీ ఎదురువుతోంది. ఫలితంగా చందాదారుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు గతేడాది నెట్‌ఫ్లిక్స్ తన చందా ధరలను తగ్గించింది. ఇండియాలో అయితే రూ.199కే బేసిక్ ప్లాన్‌ను అమల్లోకి తేగా అప్పటి వరకు రూ.199గా ఉన్న మొబైల్ ప్లాన్ ధరని రూ. 149కి తగ్గించింది. ఐనప్పటికీ పరిస్థితితో పెద్దగా మార్పు రాలేదు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఇప్పటికే రెండు లక్షల మంది చందాదారులను కోల్పోయింది. దశాబ్ద కాలం తర్వాత భారీ స్థాయిలో చందాదారులను కోల్పోయింది. అంతేకాదు ఈ ఏడాది చివరి నాటికి ఇరవై లక్షల మంది చందాదారులను కోల్పోవచ్చనే అంచనాలు నెలకొన్నాయి.
దీంతో సరికొత్త స్ట్రాటజీ అమలు చేసే యోచనలో ఉంది నెట్‌ఫ్లిక్స్,. ఇప్పటి వరకు అడ్వర్‌టైజ్‌మెంట్ లేకుండా కంటెంట్ ప్రసారం చేయడం నెట్‌ఫ్లిక్స్ ప్రత్యేకతగా ఉంది. కానీ ఆదాయం పడిపోకుండా చందాదారులను కోల్పోకుండా ఉండేందుకు కంటెంట్ మధ్యలో యాడ్స్‌కు చోటివ్వాలనే ప్లాన్‌ను పరిశీలిస్తున్నట్టు నెట్‌ఫ్లిక్స్ సీఈవో రీడ్ హ్యాస్టింగ్స్ తాజాగా ప్రకటించారు. యాడ్స్ ప్రసారానికి మేము వ్యతిరేకమైనప్పటికీ కస్టమర్ల ఛాయిస్‌ను కూడా గౌరవించాలని భావిస్తున్నాం. కాబట్టి రాబోయే ఒకటి రెండేళ్లలో యాడ్స్‌ను ప్రవేశపెడతామంటూ తెలిపారు. ఈ విధానాన్ని ఇప్పటికే డిస్నీ హాట్‌స్టార్, హులు, జీ 5 వంటి సంస్థలు పాటిస్తున్నాయి.
చదవండి: Netflix: యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ భారీ షాక్! అది ఏంటంటే?
Comments
Please login to add a commentAdd a comment