వీడియో ఆన్ డిమాండ్, ఓవర్ ది టాప్ లేదా ఓటీటీ పేరుతో సినిమా థియేటర్ మన మొబైల్‌లోకి వచ్చింది. ఓటీటీ మార్కెట్‌కి విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చింది నెట్‌ఫ్లిక్స్. ప్రస్తుతం ఆ సంస్థకు ఇండియన్ మార్కెట్ ఎంతకీ కొరుకుడు పడటం లేదు. ఇండియా, ఇక్కడి ప్రజల అభిరుచులు నెట్‌ఫ్లిక్స్ వ్యవస్థాపకులను ఫ్రస్టేషన్‌కి గురి చేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ సంస్థ 2021 ఏడాదికి సంబంధించి చివరి త్రైమాసిక ఫలితాలును ప్రకటించింది. ఈ సందర్భంగా ఆ సంస్థ ఫౌండర్, కో సీఈవో రీడ్ హ్యాస్టింగ్స్ మాట్లాడుతూ.. ఇండియా మార్కెట్ ఫ్రస్టేటింగ్‌గా ఉంది. కానీ మా కంపెనీ ఇక్కడే మరికొన్ని విషయాలు నేర్చుకునేది ఉందంటూ చేసిన ప్రకటన నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
తగ్గిపోయిన చందాదారులు
నెట్‌ఫ్లిక్స్ ఇండియన్ మార్కెట్‌లోకి భారీ ఎత్తున 2015లో ప్రవేశించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతి తక్కువ చందాదారులు చేరిన ఏడాదిగా 2021 నిలిచింది. ఒక్కసారిగా కొత్త చందాదారుల సంఖ్య భారీగా పడిపోయింది. దీంతో 2022 ఏడాదికి సంబంధించి జనవరి నుంచి మార్చి వరకు ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని నెట్‌ఫ్లిక్స్ కుదించింది. ప్రస్తుత త్రైమాసికంలో 4 మిలియన్ల కొత్త చందాదారులను లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పుడది 2.5 మిలియన్లకు పడిపోయింది.
పోటీ పడలేక
ఇండియాలో ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ 206 మిలియన్ డాలర్లుగా ఉంది. 2026 నాటికి ఇది ఏకంగా 226 మిలియన్ డాలర్లకు చేరుకుంటుదని అంచనా. దీంతో మిగిలిన ఓటీటీ కంపెనీలు ఇండియన్ మార్కెట్‌పై ఫోకస్ చేశాయి. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఇప్పటికే డిస్నీ హాట్‌స్టార్ 36 మిలియన్ చందాదారులతో అగ్రస్థానంలో ఉండగా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ 17 మిలియన్ చందాదారులతో రెండో స్థానంలో ఉంది. వీటికి భిన్నంగా నెట్‌ఫ్లిక్స్ 4.5 నుంచి 5 మిలియన్లకే పరిమితమైంది. ఈ తరుణంలో కొత్త చందాదారుల సంఖ్య గణనీయంగా పడిపోవడం నెట్‌ఫ్లిక్స్‌కి మింగుడు పడటం లేదు.
భారీగా పెట్టుబడులు
ఇండియన్ల అభిరుచులకు తగ్గట్టుగా కంటెంట్ రూపొందించేందుకు నెట్‌ఫ్లిక్స్ రూ.3000 కోట్లు పెట్టుబడికి సిద్ధంగా ఉంది. ఐనప్పటికీ వినియోగదారులను ఆకట్టుకోవడంలో వెనకబడింది. దీనికి ప్రధాన కారణం నెట్‌ఫ్లిక్స్ నెలవారీ చందా ధర ఎక్కువగా ఉండటమే అని మార్కెట్ నిపుణులు అంటున్నారు. నెట్‌ఫ్లిక్స్ నెలవారీ బడ్జెట్ ప్లాన్స్‌కే మిగిలిన ఓటీటీలు ఏడాది చందా లభిస్తుందని వారు చెబుతున్నారు. మరోవైపు యూఎస్, యూరప్‌లో ఇటీవల ధరలు పెంచినా.. స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగానే ఇండియాలో రేట్లు పెంచలేదని, పైగా మొబైల్ వెర్షన్‌ని తక్కువ ధరకే అందిస్తున్నామని చెబుతోంది.
చదవండి: భారీగా పెరిగిన నెట్‌ప్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ధరలు! ఎక్కడంటే!
Comments
Please login to add a commentAdd a comment