
న్యూఢిల్లీ: టీవీల్లో జంక్ ఫుడ్‌కు సంబంధించి వ్యాపార ప్రకటనలు నిషేధించే ఆలోచన ప్రస్తుతానికి లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పిల్లలకు సంబంధించిన ప్రకటనలను కట్టడి చేయాలని ఫుడ్ అండ్ బేవరేజెస్ అలయన్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌బీఐఏ) స్వతంత్రంగా నిర్ణయం తీసుకుందని గురువారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్‌వర్ధన్ సింగ్ తెలిపారు.
పిల్లల ఆరోగ్యంపై జంక్ ఫుడ్ ప్రభావం చూపుతోందని అనుబంధ ప్రశ్నల్లో ఎంపీలు ప్రశ్నించగా ఆ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ సమాధానమిస్తూ.. ‘సమస్య పరిష్కారానికి నిపుణుల బృందాన్ని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నియమించింది. కొవ్వులు, చక్కెర, ఉప్పు గల ఆహార పదార్థాలను పిల్లల ఛానళ్లల్లో ప్రసారం చేయకుండా నిషేధించాలని ఆ బృందం నివేదికలో సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment