
సాక్షి, తిరుమల: ఆర్టీసీ బస్ టిక్కెట్ల వెనుక అన్యమతాలకు చెందిన ప్రకటనలు ముద్రించడం పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 18 ప్రకటనలను గత మార్చిలో ముద్రించిన విషయం తెలిసిందే. గత మూడేళ్లుగా ఆర్టీసీలో ఈ ప్రకటనల బాధ్యతను ఓ ప్రైవేటు సంస్థకిచ్చారని తెలిపారు. కాగా, ఈ ప్రకటనలను కొనసాగించిన అధికారుల పై ప్రభుత్వం వేటు వేసింది. దీనికి సంబంధించి నెల్లూరు జోనల్ స్టోర్స్ కంట్రోలర్ జగదీష్‌బాబును సస్పెండ్ చేసింది.