
వాషింగ్టన్: నకిలీ వార్తలు, విద్వేషపూరిత పోస్టుల కట్టడికి సరైన చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో పలు కంపెనీలు ఫేస్‌బుక్‌కు ఇస్తున్న యాడ్స్‌ను నిలిపేశాయి. దీంతో 53 వేల కోట్ల రూపాయల ఫేస్బుక్ సంపద ఒక్క రోజులోనే ఆవిరయ్యింది. (భారత్‌లో గూగుల్ పే బ్యాన్? ఎన్‌పీసీఐ క్లారిటీ)
ఆ సంస్థ షేర్ విలువ శుక్రవారం దాదాపు 8.3 శాతం పతనమైంది. యూనిలీవర్ తో పాటు వెరిజోన్ కమ్యూనికేషన్స్, హెర్షీస్ తదితర సంస్థలు ఫేస్బుక్ ను బాయ్‌కాట్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఇకపై ఆ సంస్థకు యాడ్స్ ఇవ్వబోమని ప్రకటించాయి. మరో అంతర్జాతీయ సంస్థ కొకాకోలా నెల రోజుల పాటు సోషల్ మీడియా సంస్థలకు ఇస్తున్న యాడ్స్‌ను నిలిపేస్తున్నట్లు పేర్కొంది. (యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ డౌన్‌గ్రేడ్)
దీంతో ఫేక్ న్యూస్ పై సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ స్పందించారు. అన్ని రకాల ఓటింగ్ సంబంధిత పోస్టులకు కొత్త ఓటరు సమాచారం అనే లింకును జోడిస్తామని చెప్పారు. విద్వేషపూరిత వ్యాఖ్యల పరిధిని సైతం పెంచుతున్నట్లు వెల్లడించారు. ఇకపై రాజకీయ నాయకులు కూడా వీటి నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment