
పారిస్: ఆన్‌లైన్, వాణిజ్య ప్రకటనల మార్కెట్‌లో గూగుల్ సంస్థ ప్రదర్శిస్తున్న ఆధిపత్య ధోరణిపై ఫ్రాన్స్ మండిపడింది. గూగుల్‌లో వాణిజ్య ప్రకటనల్ని ఆమోదించడానికి అనుసరించే విధానాలు ఏ మాత్రం పారదర్శకంగా లేవని పేర్కొంటూ దాదాపు రూ. 1,180 కోట్ల జరిమానా విధించింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో యాడ్స్ ఇచ్చే వారందరికీ ఒకే నియమ నిబంధనలు ఉండాలని స్పష్టం చేసింది. ఇప్పటికే ఎన్నో దేశాలు వివిధ కారణాలతో గూగుల్‌కు జరిమానాలు విధించాయి. ఇప్పడు ఆ జాబితాలో ఫ్రాన్స్ కూడా చేరింది.