
మామూలుగా మనషులు లేదా జంతువులు గీసిన బొమ్మలను..
లండన్ : మామూలుగా మనషులు లేదా జంతువులు గీసిన బొమ్మలను ఎగ్జిబిషన్‌కు ఉంచటం చూసుంటాము. కానీ ఓ మరబొమ్మ తన స్వహస్తాలతో గీసిన బొమ్మలను ప్రదర్శనకు ఉంచనున్నారు. ఆయిదా అనే హ్యూమనాయిడ్ రోబోట్ గీసిన బొమ్మలను ఇంగ్లాండ్‌లోని ‘‘ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ’’లో జూన్ 12వ తేదీ ప్రదర్శనకు ఉంచనున్నారు. డ్రాయింగ్, పేయింటింగ్, వీడియో ఆర్ట్ వంటి వాటిని ఈ ప్రదర్శనలో చూడవచ్చు. ఈ రోబో ఏఐ టెక్నాలజీ, అల్గారిథమ్‌ల సహాయంతో బొమ్మలను వేస్తుంది. అచ్చం మనిషిలాగే కంటితో చూస్తూ, చేతితో పెన్సిల్ పట్టుకుని మనషుల బొమ్మలను గీస్తుంది. రోబో పనితనాన్ని బట్టి ఏఐ టెన్నాలజీ సామర్థ్యాన్ని అంచనా వేయవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
