humanoid robot
-
కదిలి వచ్చిన రోబోల దండు..!
ప్రపంచ ప్రఖ్యాత సంస్థ టెస్లా సీఈఓ ఇలొన్‌మస్క్ గతంలో నిర్వహించిన వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. ఇటీవల జరిగిన ‘వి రోబోట్’ ఈవెంట్లో కృత్రిమమేధ సాయంతో పనిచేసే ఉత్పత్తులను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా రోబోవ్యాన్, సైబర్ క్యాబ్‌లతోపాటు ఆప్టిమస్ రోబోలను పరిచయం చేశారు.టెస్లా సీఈఓ ఇలొన్ మస్క్ గతంలో ఏజీఎంలో చెప్పిన విధంగానే కంపెనీ భవిష్యత్తు కార్యాచరణను అమలు చేస్తున్నారు. ఏఐలో విప్లవాత్మక మార్పు రాబోతుందని, భవిష్యత్తు అంతా ఏఐదేనని మస్క్ చెప్పారు. అందుకు అనుగుణంగా కంపెనీ ఏఐ ఉత్పత్తులను తయారు చేస్తుందని తెలిపారు. తాజాగా రోబోవ్యాన్, సైబర్ క్యాబ్‌లతోపాటు రోబోల దండును పరిచయం చేశారు.pic.twitter.com/VK9vlGF0Ms— Elon Musk (@elonmusk) October 11, 2024ఇదీ చదవండి: రోబో కారును ఆవిష్కరించిన టెస్లాభవిష్యత్తులో ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక రోబో ఉంటుందని గతంలో మస్క్ చెప్పారు. కంపెనీ తయారు చేస్తున్న ఆప్టిమస్ రోబోలకు గిరాకీ ఏర్పడుతుందన్నారు. హ్యూమనాయిడ్ రోబోట్స్ తయారీ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని చెప్పారు. తయారీ రంగంతోపాటు రోజువారీ జీవితంలో రోబోలు పాత్ర కీలకంగా మారనుందని తెలిపారు. ఆప్టిమస్ రోబో ఒక్కో యూనిట్ తయారీకి దాదాపు 10,000 డాలర్లు (రూ.8.3లక్షలు) ఖర్చవుతుందని అంచనా. టెస్లా ఏటా ఆప్టిమస్ ద్వారా 1 ట్రిలియన్ డాలర్ల (రూ.83లక్షల కోట్లు) లాభాన్ని ఆర్జించగలదని గతంలో మస్క్ అంచనా వేశారు. -
రోబోల దండు వచ్చేస్తోంది..!
రోబో సినిమా గుర్తుంది కదా. అందులో రజనీకాంత్ తయారు చేసిన ‘చిట్టీ’ అచ్చం మనిషిలాగే ఉంటూ, సొంతంగా ఆలోచిస్తూ పనులు చేస్తుంది. ఆ సినిమా చూస్తున్నంతసేపు అదో మాయగా అనిపించి ఉంటుంది. కానీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రపంచ కంపెనీలు హ్యుమనాయిడ్ రోబోల తయారీపై ఆసక్తి చూపుతున్నాయి. అందులో భాగంగా చైనాకు చెందిన యూనిట్రీ సంస్థ జీ1 అనే హ్యుమనాయిడ్ రోబోను ఆవిష్కరించింది. జీ1 సొంతంగా డ్యాన్స్ చేస్తుంది. మెట్లు ఎక్కుతుంది, దిగుతుంది. బ్యాలెన్స్ నియంత్రిస్తూ నడుస్తుంది. ఏదైనా ఎదురుపడితే అందుకు తగినట్టుగా వ్యవహరిస్తుంది. ఈ మేరకు రోబో డ్యాన్స్ చేస్తున్న వీడియోను కంపెనీ ఇటీవల విడుదల చేసింది. అదికాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ జీ1 రోబోను కంపెనీ 16000 అమెరికన్ డాలర్ల(రూ.13.4 లక్షలు)కు విక్రయించనున్నట్లు ప్రకటించింది.యూనిట్రీ సంస్థే కాకుండా ప్రపంచవ్యాప్తంగా టెస్లా, ఫిగర్, బోస్టన్ డైనమిక్స్, సాంక్చురీ ఏఐ..వంటి ప్రముఖ కంపెనీలు హ్యుమనాయిడ్ రోబోలపై పరిశోధనలు చేస్తున్నాయి. ఇప్పటికే అందులో కొన్ని కంపెనీలు ప్రాథమికంగా రోబోలను ఆవిష్కరించాయి.సముద్ర గర్భంలో నిఘా..సముద్ర గర్భంలో నిఘా పెట్టడం అంటే మాటలుకాదు. ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానివల్ల కొన్నిసార్లు మనిషి ప్రాణాలకే ప్రమాదం జరగొచ్చు. అలాంటి సందర్భాల్లో నీటి లోపల నిఘా కోసం ఐఐటీ మండి, ఐఐటీ పాలక్కడ్‌కు చెందిన పరిశోధకులు అధునాతన మెరైన్ రోబోను అభివృద్ధి చేశారు.టీ, కాఫీ చేసే యంత్రుడు‘ఫిగర్.ఏఐ’ సంస్థ సౌత్కరోలినాలోని బీఎండబ్ల్యూ తయారీ ప్లాంట్‌లో పనిచేసేందుకు హ్యూమనాయిడ్ రోబోలను తయారుచేస్తోంది. ఇవి ప్లాంట్‌లో పనిచేస్తున్న సిబ్బందికి టీ, కాఫీలు ఇస్తూ సేద తీరుస్తున్నాయి. కాఫీ చేసే క్రమంలో ఏదైనా పొరపాటు జరిగితే వాటికవే స్వయంగా ఆలోచిస్తూ సమస్యను పరిష్కరించుకుంటున్నాయి. గతేడాది అక్టోబర్‌లో అమెజాన్ సంస్థ తన వేర్‌హౌజ్‌ల్లో పని చేయడానికి హ్యుమనాయిడ్ రోబోలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సంస్థ కార్యకలాపాల కోసం అమెరికాలోని ఓ వేర్‌హౌజ్‌లో వీటిని ప్రయోగాత్మకంగా తీసుకొచ్చినట్లు అమెజాన్ గతంతోనే వెల్లడించింది.ఇదీ చదవండి: సెబీ చీఫ్‌పై కేంద్రం దర్యాప్తు..?టెస్లా ఆప్టిమస్భవిష్యత్తులో ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక రోబో ఉంటుందని, టెస్లా కంపెనీ తయారు చేస్తున్న ఆప్టిమస్ రోబోలకు గిరాకీ ఏర్పడుతుందని గతంలో ఇలాన్‌మస్క్ అన్నారు. పరిశ్రమ రంగంతోపాటు రోజువారీ జీవితంలో వీటి పాత్ర కీలకంగా మారనుంది. భవిష్యత్తులో ప్రపంచంలో ప్రతిఒక్కరికి ఒక రోబో ఉంటుంది. ఇంటి పనులు, పారిశ్రామిక అవసరాలతోపాటు ఇతర పనులకు హ్యూమనాయిడ్ రోబోట్లను విస్తారంగా వాడుతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టెస్లా తయారు చేస్తున్న ఆప్టిమస్ రోబో ఒక్కో యూనిట్ తయారీకి దాదాపు 10,000 డాలర్లు (రూ.8.3లక్షలు) ఖర్చవుతుందని అంచనా. -
స్టీరింగ్ పట్టిన యంత్రుడు!
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో అద్భుతాలు కళ్ళముందు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఎద్దుల బండితో మొదలైన మనిషి ప్రయాణం.. నేడు విమానంలో ప్రయాణించే స్థాయికి చేరింది. ఇది సరే అనుకునే లోపల.. అసలు మనిషే అవసరం లేకుండా కారు డ్రైవ్ చేస్తున్న సంఘటనలు నేడు ప్రత్యక్షమవుతున్నాయి. ఇందులో భాగంగానే జపాన్ పరిశోధకులు ముసాషి అనే హ్యూమనాయిడ్ రోబోట్ సృష్టించారు.ముసాషి రోబోట్ ఎలక్ట్రిక్ మైక్రో-కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవింగ్ చేయడానికి సంబంధించిన ఒక వీడియో కూడా జేఎస్కే టెండన్ గ్రూప్ తమ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. వీడియోలో గమనించినట్లయితే.. రోబోట్ రోడ్డుపై పరిసరాలను గమనిస్తూ డ్రైవ్ చేయడం చూడవచ్చు.రోబోట్ డ్రైవింగ్ చేసే మైక్రో కారులో కూడా విజన్ కెమెరాలు, జీపీఎస్, కాంప్లెక్స్ అల్గారిథమ్‌లు అండ్ కంట్రోల్ సిస్టం అనే టెక్నాలజీలు ఇన్స్టాల్ చేశారు. ఇవన్నీ రోడ్డు మీద సురక్షితంగా డ్రైవ్ చేయడానికి ఉపయోగపడతాయి. డ్రైవర్‌గా మనిషి అవసరం లేకుండా కారును డ్రైవ్ చేసే టెక్నాలజీని కనిపెట్టడంలో భాగంగానే ముసాషిని రూపొందించారు.ముసాషి అనేది "మస్క్యులోస్కెలెటల్ హ్యూమనాయిడ్". దీనిని 2019లో పరిశోధనా బృందం తయారు చేసింది. ఇది మనిషిలాంటి ప్రతి రూపం పొందటమే కాకుండా.. ఇది మానవ శరీరం మాదిరిగా ఉండే కండర నిర్మాణాన్ని కలిగి ఉంది. దీనిని పరిశోధకులు ఇప్పటికే పలు విధాలుగా టెస్ట్ చేశారు.ముసాషి కన్ను హై రిజల్యూషన్ కెమరా మాదిరిగా పనిచేస్తుంది. కాబట్టి దూరంగా ఉన్న వస్తువులను, మనుషులను ఇది సులభంగా గుర్తిస్తుంది. నేరుగా ఉన్న వాటిని మాత్రమే కాకుండా సైడ్ మిర్రర్ ద్వారా వెనుక వున్నవారిని కూడా చూడగలదు. ఇది హ్యాండ్ బ్రేక్ లాగడం, స్టీరింగ్ తిప్పడం, బ్రేక్, యాక్సిలరేటర్ పెడల్స్ వంటి వాటిని ఆఫర్స్ చేయడం కూడా చేస్తుంది. ఇవన్నీ వీడియోలో స్పష్టంగా కనిపిస్తాయి.ఇక్కడ కనిపించే కారును టయోటా కంపెనీ 2012లో తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ కారు పేరు 'ఛోట్టో ఒడెకేకే మచిమేడ్ సూయిసుయ్' (COMS). ఇది సింగిల్ సీట్ ఎలక్ట్రిక్ కారు. ఈ కారును రోబోట్ డ్రైవ్ చేయడానికి అనుకూలంగా రూపొందించారు. టెస్ట్ డ్రైవ్ మాత్రం టోక్యో యూనివర్సిటీలోని కాశివా క్యాంపస్‌లో నిర్వహించినట్లు తెలుస్తోంది.టెస్టింగ్ సమయంలో ముసాషి మనిషిని గుర్తించడం, కారు రావడాన్ని గమనించడం, ట్రాఫిక్ లైట్లకు రెస్పాండ్ అవ్వడం వంటివి చూడవచ్చు. అన్ని టెస్టులలోనూ రోబోట్ ఉత్తమ పెర్ఫామెన్స్ చూపించినప్పటికీ.. హ్యుమానాయిడ్ ఆటోమాటిక్ డ్రైవింగ్ అనేది ప్రారంభ దశలోనే ఉంది. కాబట్టి ముసాషిను మరింత వేగంగా ఉండేలా రూపొందించాల్సిన చేయాల్సిన అవసరం ఉంది.హ్యూమనాయిడ్ రోబోట్స్ డ్రైవింగ్ వల్ల ఉపయోగాలురోడ్డు ప్రమాదాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదానికి కారణాలు మితిమీరిన వేగం కావొచ్చు, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం కావొచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా కావొచ్చు. అయితే ఒక రోబోట్ డ్రైవర్ అవ్వడం వల్ల అది తప్పకుండా రూల్స్ ఫాలో అవుతుంది. ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా తక్కువ కూడా. ఇలాంటి రోబోలు ఎప్పుడు వినియోగంలోకి వస్తాయి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. -
హ్యూమనాయిడ్ అట్లాస్ రోబో.. వీడియో వైరల్
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో బోస్టన్ డైనమిక్స్ తన నెక్స్ట్ జనరేషన్ 'హ్యూమనాయిడ్ అట్లాస్ రోబో'ను ఆవిష్కరించింది. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్.. అంతే కాకుండా ఇది మునుపటి మోడల్స్ కంటే కూడా ఎన్నో అప్డేట్స్ పొందింది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.వీడియోలో గమనించినట్లయితే.. అట్లాస్ రోబోట్ పైకి లేయడం, ముందుకు వెనుకకు కదలటం కూడా చూడవచ్చు. ఇది ఇప్పటికి తయారైన దాదాపు అన్ని రోబోట్స్ కంటే భిన్నంగా ఉంది. మొండెం మీద ఒక ప్లేట్ ఉంది. సన్నగా ఉండే మొండెం భాగం.. తలపై రింగ్ లైట్ వంటివి ఉన్నాయి.ఈ అట్లాస్ రోబోట్ తన శరీరాన్ని సైన్స్ ఫిక్షన్ హారర్ మూవీలోని ఓ జీవి మాదిరిగా నడుమును 180 డిగ్రీలు మెలితిప్పి పైకి లేస్తుంది. తలను కూడా పూర్తిగా తిప్పుతుంది. చురుగ్గా ముందుకు వెళ్లడం, వెనక్కు రావడం కూడా వీడియోలో గమనించవచ్చు. ప్రస్తుతం ఈ రోబోట్ టెస్టింగ్ దశలోనే ఉంది. రాబోయే రోజుల్లో పూర్తిగా సిద్దమవుతుంది.ఈ హ్యుమానాయిడ్ అట్లాస్ రోబోట్ పూర్తిగా తయారైన తరువాత వివిధ పనుల్లో ఉపయోగించనున్నట్లు సమాచారం. అయితే ఇలాంటి రోబోట్స్ కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి కొంతమంది కస్టమర్లకు మాత్రమే దీనిని అందించే అవకాశం ఉంది. ఈ వరుసలో హ్యుందాయ్ మొదటి స్థానంలో ఉంది. -
హ్యుమనాయిడ్ రోబోను విడుదల చేసిన యూనిట్రీ.. ఫొటోలు
-
లైంగిక వేధింపులా?.. వివాదంలో మగ రోబో
విజన్ 2030ను సృష్టించుకుని.. ఆర్థిక వ్యవస్థను శక్తివంతంగా మార్చుకునేందుకు సాంకేతికతను సైతం అలవర్చుకుంది సౌదీ అరేబియా. అయితే ఆ సాంకేతికతే నేరాలు-ఘోరాలకు.. అందునా మహిళలపై అఘాయిత్యాలకు కారణమైతే ఎలా?.. తాజాగా అక్కడ జరిగిన ఓ ఘటన ఇప్పుడు నెట్టింట ఇంతటి విపరీతమైన చర్చకు దారి తీసింది. ఇంతకీ ఏం జరిగింది అంటారా?.. ముహమ్మద్.. ఇప్పుడు ఈ పేరు అక్కడి వార్తల్లో నిలిచింది. అలాగని అది మనిషి కాదు.. సౌదీ అరేబియా తొలి మగ రోబో(ఆండ్రాయిడ్). ఆ మగ రోబో ఓ మహిళా రిపోర్టర్‌ను అసభ్యంగా తాకబోయిందట!. అంతే.. టెక్నాలజీ భద్రమేనా? అనేది ఒక చర్చ అయితే.. లైంగిక వేధింపులను ఏమాత్రం తేలికగా తీసుకోని ఆ దేశంలో ఇలాంటి ఘటనని ఉపేక్షించొచ్చా? అనే కోణంలో మరో చర్చా నడవడం గమనార్హం. ఓ లైవ్ ఈవెంట్ జరుగుతున్న టైంలో.. రిపోర్టర్‌ను తాకేందుకు రోబో ప్రయత్నించిందట. వెంటనే అప్రమత్తమైన రిపోర్టర్ రావియా అల్ ఖ్వాసిమీ తన చెయ్యి అడ్డుపెట్టింది. కేవలం 8 సెకండ్ల నిడివి ఉన్న ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. #UNUSUAL : In Saudi Arabia, a robot harassed a TV presenter during a live broadcast. Apparently there was a glitch in the robot's programming.#SaudiArabia #Robot #TVpresenter pic.twitter.com/qdF5Ye9YTe — upuknews (@upuknews1) March 7, 2024 ఈ వీడియోపై మామూలు చర్చ జరగడం లేదు. ఆ రోబో చర్య లైంగిక వేధింపుల కిందకే వస్తుందని వాదిస్తున్నారు కొందరు. దీనికి తోడు ఆ రిపోర్టర్ ఇబ్బందిగా ఫీలవ్వడం ఆ వాదనకు మరింత బలం చేకూరుస్తుందన్నది మరికొందరి వాదన. అందుకే శిక్షగా.. దానిని శాశ్వతంగా నిషేధించాలని కోరుతున్నారు. ఇక ఇంకొందరు మాత్రం.. ముహమ్మద్ అమాయకుడని.. ఆ రోబోకు జరిగిన ప్రొగ్రామింగ్.. ఆ ప్రొగ్రామింగ్ను ఇచ్చిన తప్పంతా అంటూ రోబోను వెనకేసుకొస్తున్నారు. సరదా కామెంట్లు చేసేవాళ్ల సంగతి సరేసరి. సౌదీ అరేబియాలో ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపుల్లాంటి వాటిల్లో ఐదేళ్ల జైలు శిక్ష, మూడు లక్షల సౌదీ రియాల్(మన కరెన్సీలో కోటి 70 లక్షలకు పైనే)జరిమానా విధిస్తారు సౌదీ అరేబియా తొలి మహిళా ఆండ్రాయిడ్ రోబో సారా. ఈ ఘటన జరిగిన సమయంలో సారా కూడా ఆ పక్కనే ఉంది. క్యూఎస్ఎస్ సిస్టమ్స్ అనే సంస్థ ముహమ్మద్ అనే రోబోను రూపొందించింది. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీలో సౌదీ అరేబియా సాధించిన పురోగతిని వివరించేందుకే ఈ రోబోను రూపొందించడం గమనార్హం. జనాలకు తనను తాను పరిచయం చేసుకునేందుకు దానికి ప్రోగ్రామింగ్ చేశారు. ఈ క్రమంలోనే అది తన చెయ్యిని ఆడిస్తూ ఉంది అంతే!. అయినా రోబో ఎక్కడైనా కావాలని వేధిస్తుందా? ఏంటి? అని అడిగేవాళ్లూ లేకపోలేదు. -
ఇకపై మృదువైన రోబోలు..
ఇంటి పనులు, తోట పనులు చకచకా చక్కబెడతాయి. పరిశ్రమల్లో పెద్ద పెద్ద బరువులను ఎత్తేస్తాయి. గాలి లేని ప్రదేశాల్లోనూ గనులను తవ్వేస్తాయి. మందుపాతరలను కనిపెడతాయి. వ్యవసాయం, వైద్యం, ఆరోగ్య రంగాలతోపాటు సముద్ర గర్భంలో, అంతరిక్షంలోనూ అవలీలగా పనిచేస్తాయి. టీ, కాఫీలు తెచ్చి ఇస్తాయి. నగరంలో ఏం చూడాలో కూడా చెప్పేస్తాయి. అచ్చం మనిషిలా కనిపించడమే కాదు, అలాగే ఆలోచిస్తూ, అబ్బురపరుస్తూ సమాజంలో సాటి పౌరులుగా మారబోతున్న మరమనుషులు రానున్న రోజుల్లో అద్భుతాలు చేయగలవని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇన్ని పనులు చేయబోతున్న మనిషినిపోలే రోబోల తయారీకి సంబంధించి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్ యూనివర్సిటీ పరిశోధకులు త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో రోబోటిక్ హ్యాండ్లను రూపొందించారు. ఇవి అచ్చం మనిషి చేతుల మాదిరిగానే ఎముకలు లిగమెంట్ల వంటి ప్రత్యేక వ్యవస్థను కలిగి ఉన్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. పైగా వీటికి సాగే గుణం కూడా ఉందట. కాబట్టి లేజర్ స్కానింగ్ టెక్నాలజీ, రకరకాల పాలిమర్ల సాయంతో భవిష్యత్తులో మన చర్మాన్ని పోలిన మృదువైన రోబోలను తయారుచేయడం సాధ్యమే అంటున్నారు పరిశోధకులు. ఇదీ చదవండి: పెడితే రూపాయి రాదని తెలిసీ కోట్లు పెట్టుబడి..! సంప్రదాయ పాలీఅక్రిలేట్లకు బదులుగా థియోలీన్తో చేసిన పాలిమర్లను వాడటంతో అవసరం మేరకు అవి సాగి, మళ్లీ యథాస్థితికి వస్తాయి. పైగా గట్టిగా కాకుండా మృదువుగా ఉండటంతో ఎక్కువ కాలం పనిచేస్తాయి. సంప్రదాయ రోబోలు గట్టిగా ఉంటాయి కాబట్టి వాటితో కలిసి పనిచేసేటప్పుడు మనకి చిన్న చిన్న గాయాలు కూడా అవుతుంటాయి. కొత్తరకం రోబోలతో అలాంటివేవీ ఉండవు. పైగా వాటిని పట్టుకోవడానికీ సులభంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. -
EVE: రుచికరమైన వంటలు చేసే రోబో!
ప్రస్తుత అధునాతన సాంకేతిక యుగంలో రోబోల అభివృద్ధి విస్తృతంగా జరుగుతోంది. మనుషులతో మరమనుషులు కలిసి మనుగడ సాగించే రోజులు వస్తున్నాయి. ఇంటిని శుభ్రపరచడం, వంట చేయడం, షాపింగ్, ఇంటిని కాపలా కాయడం.. ఇలాంటి పనులన్నీ చకచకా చేసేసే హ్యూమనాయిడ్ రోబో వచ్చేసింది. మానవ సమాజంతో మసలుకుంటూ వారికి అవసరమైన పనులన్నీ చేసి పెట్టే హ్యూమనాయిడ్ రోబోను 1X అనే నార్వేజియన్ కంపెనీ రూపొందించింది. దీని పేరు ఈవ్ (EVE). ఇది మనిషిలా కనిపిస్తుంది.. కదులుతుంది. ఇంకా ఇది ఏమేం పనులు చేయగలదు.. దీని ప్రత్యేకతలు ఏంటి అన్నది ఇక్కడ తెలుసుకుందాం.. ఈవ్ ప్రత్యేకతలు ఈవ్ ఒక అధునాతన హ్యూమనాయిడ్ రోబో. మనిషిలాగే కనిపిస్తుంది.. కదులుతుంది. అనేక ఫీచర్లు దీని సొంతం. పరిసరాలను గ్రహించడానికి, స్పందించడానికి చాలా కెమెరాలు, సెన్సార్లు ఉంటాయి. ఈవ్ 6 అడుగుల 2 అంగుళాల పొడవు, సుమారు 87 కేజీ బరువు ఉంటుంది. దీనికి ఉన్న చక్రాలతో గరిష్టంగా గంటకు 9 మైళ్ల వేగంతో కదులుతుంది. గ్రిప్పర్ చేతులతో సుమారు 15 బరువును మోసుకెళ్లగలదు. ఒక గంట ఛార్జ్‌తో ఆరు గంటలు పనిచేస్తుంది. రుచికరంగా వంటలు ఈవ్ స్మార్ట్, ఆండ్రాయిడ్ రోబో. వివిధ రకాల పనులను చేయడానికి చాట్‌జీపీటీ మాడిఫైడ్ వర్షన్ జీపీటీ-4 ఉపయోగిస్తుంది. ఇది మీరు చెప్పిన, మీకు నచ్చిన వంటకాలను రుచికరంగా చేసి వడ్డిస్తుంది. వంట చేసేందుకు ముందుగా కిచెన్‌లోని షెల్ఫ్‌లను స్కాన్ చేస్తుంది. ఏమేం పదార్థాలు, దినుసులు ఉన్నాయో గుర్తించి వాటితో రుచికరమైన వంటలు తయారు చేస్తుంది. ఇందుకోసం GPT-4V సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తుంది. అంటే వంటలో ఏది ఎంత వేయాలో అంత వేసి నోరూరించే పదార్థాలు చకచకా చేసేస్తుంది. -
రాబోతోంది మరతరం.. కాఫీ చేస్తున్న హ్యుమనాయిడ్ రోబోలు.. వీడియో వైరల్
ఇంటి పనులు, తోట పనులు చకచకా చక్కబెడతాయి. పరిశ్రమల్లో పెద్ద పెద్ద బరువులను ఎత్తేస్తాయి. గాలి లేని ప్రదేశాల్లోనూ గనులను తవ్వేస్తాయి. మందుపాతరలను కనిపెడతాయి. వ్యవసాయం, వైద్యం, ఆరోగ్య రంగాలతోపాటు సముద్ర గర్భంలో, అంతరిక్షంలోనూ అవలీలగా పనిచేస్తాయి. టీ, కాఫీలు తయారుచేస్తాయి. నగరంలో ఏం చూడాలో కూడా చెప్పేస్తాయి. అచ్చం మనిషిలా కనిపించడమే కాదు, అలాగే ఆలోచిస్తూ, అబ్బురపరుస్తూ సమాజంలో సాటి పౌరులుగా మారబోతున్న మరమనుషుల తరం రాబోతోందని నిపుణులు చెబుతున్నారు. మనిషికి సాధ్యంకాని పనులు చేయడం, అతడు వెళ్లలేని ప్రదేశాలకు వెళ్లడం, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులను తట్టుకోవడం.. ఇవన్నీ కేవలం మర మనుషులకు (రోబోలకు) మాత్రమే సాధ్యం. తాజాగా ‘ఫిగర్.ఏఐ’ సంస్థ సౌత్కరోలినాలోని బీఎండబ్ల్యూ తయారీ ప్లాంట్‌లో పనిచేసేందుకు హ్యూమనాయిడ్ రోబోలను తయారుచేస్తోంది. ఇవి ప్లాంట్‌లో పనిచేస్తున్న సిబ్బందికి టీ, కాఫీలు ఇస్తూ సేదతీరుస్తున్నాయి. కాఫీ చేసే క్రమంలో ఏదైనా పొరపాటు జరిగితే వాటికవే స్వయంగా ఆలోచిస్తూ సమస్యను పరిష్కరించుకుంటున్నాయి. కంపెనీలు తమ సంస్థల్లో హ్యూమనాయిడ్ రోబోలను వినియోగించడం కొత్తేమీ కాదు. గతేడాది అక్టోబర్‌లో అమెజాన్ సంస్థ తన వేర్‌హౌజ్‌ల్లో పని చేయడానికి హ్యుమనాయిడ్ రోబోలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సంస్థ కార్యకలాపాల కోసం అమెరికాలోని ఓ వేర్‌హౌజ్‌లో వీటిని ప్రయోగాత్మకంగా తీసుకొచ్చినట్లు అమెజాన్ గతంతోనే వెల్లడించింది. -
మస్క్ వారి మరమనిషి మరింత కొత్తగా.. టెస్లా రోబో 2.0!
అప్పుడు యోగా చేసి ఆశ్చర్యపరిచిన టెస్లా హ్యూమనాయిడ్ రోబో ఇప్పుడు డ్యాన్స్ ఇరగదీస్తోంది. గుడ్లు చకాచకా ఉడకబెట్టేస్తోంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ సరికొత్తగా ఆవిష్కరించిన హ్యుమనాయిడ్ రోబో డెమో వీడియోను మస్క్ తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా పంచుకున్నారు. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. తన కొత్త తరం హ్యూమనాయిడ్ రోబో 'ఆప్టిమస్ జెన్ 2' (Optimus Gen-2) ను ఆవిష్కరించింది. ఇది ఏమేమి పనులు చేయగలదో మస్క్ షేర్ చేసిన వీడియోలో చూడవచ్చు. ఇది అచ్చం మనిషిలాగే వివిధ పనులు చేస్తోంది. టెస్లా కొన్ని నెలల క్రితం ఆవిష్కరించిన 'ఆప్టిమస్ జెన్ 1'ను మరింత మెరుగుపరిచి ఈ 'ఆప్టిమస్ జెన్ 2' రూపొందించింది. ఇది మునుపటి రోబో కంటే 10 కేజీలు తేలికైనది. 30 శాతం వేగవంతమైనది. దీనికి మరింత సామర్థాన్ని జోడించారు. నడక వేగం, చేతి కదలికలు, వేళ్లపై స్పర్శ సెన్సింగ్ తదితర అన్ని అంశాల్లోనూ మెరుగుదలను ప్రదర్శిస్తోంది. ఇది కూడా చదవండి: CEOs Secret WhatsApp chat: ‘శామ్ అవుట్’.. వెలుగులోకి సీఈవోల సీక్రెట్ వాట్సాప్ చాట్ ఎలాన్ మస్క్ తాజాగా ‘ఎక్స్’లో షేర్ చేసిన ఈ వీడియోకు "ఆప్టిమస్" అని క్యాప్షన్ పెట్టారు. టెస్లా ఫ్యాక్టరీలో చుట్టూ సైబర్ ట్రక్ల మధ్య షైనీ వైట్ కలర్ బాడీలో ఆప్టిమస్ జెన్2 రోబో మెరిసిపోతూ కనిపిస్తోంది. వీడియో చివర్లో రెండు రోబోలు డ్యాన్స్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి. కాగా 2022లో మొదటిసారిగా హ్యూమనాయిడ్ రోబో కాన్సెప్ట్ గురించి వెల్లడించారు. Optimuspic.twitter.com/nbRohLQ7RH — Elon Musk (@elonmusk) December 13, 2023 -
Optimus: ఇక సెక్సీ రోబోనే తరువాయి!
మరమనిషి వచ్చేశాడు. మార్కెట్లోకి ఇప్పటిదాకా ఎన్నో హ్యుమనాయిడ్ రోబోలు(మనిషి తరహా రోబోలు) వచ్చినప్పటికీ.. అవి ఆలోచన సామర్థ్యానికి దూరంగా ఉంటున్నాయనేది ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ ఎలన్‌మస్క్ అభిప్రాయం. ఆ అసంతృప్తిని పొగొట్టుకునేందుకు ఆలోచించే రోబోలను తెస్తానని చెప్పి.. శాంపిల్‌ను ప్రపంచానికి రుచి చూపించాడు. ఇంటెలిజెన్సీతో కూడిన హ్యూమనాయిడ్ రోబోలను టెస్లా తరపున మార్కెట్లో తెస్తామని ప్రకటించిన ఆ కంపెనీ సీఈవో ఎలన్ మస్క్.. ఇవాళ ఆ పని చేశాడు. టెస్లా ఆర్టిఫీషియల్ డే సందర్భంగా.. ఇవాళ రోబోను అందరి ముందుకు తెచ్చాడు. కాలిఫోర్నియాలోని పాలో ఆల్టో హెడ్కార్వర్ట్స్లో ఇవాళ జరిగిన ఈవెంట్లో హ్యూమనాయిడ్ రోబో అలరించింది. pic.twitter.com/PHa7kKhFoT — Elon Musk (@elonmusk) October 1, 2022 హ్యూమనాయిడ్ రోబోకు ఆప్టిమస్ అని ఎలన్ మస్క్ పేరుపెట్టగా.. అందరికీ అభివాదం చేసి ఫోజులు ఇచ్చాడు యంత్రుడు. ఇక మొక్కలకు నీళ్లు పోయడం, బాక్సులను మోయడం లాంటి పనులు చేసిన రోబో తాలుకా వీడియోను వేదికపై ప్రదర్శించారు. అయితే చివర్లో.. రోబో తడబడడం, ఇంజినీర్లు వచ్చి దానిని సరి చేయడం ట్రోలింగ్‌కు దారి తీసింది. ఏదైతేనేం రోబో ఆవిష్కరణ తర్వాత జరిగిన ప్రధాన చర్చ.. సెక్సీ రోబో ఎప్పుడు వస్తుందని!. pic.twitter.com/EzxImHtqBP — Tesla (@Tesla) October 1, 2022 ఆప్టిమస్(Optimus) రోబోలు మార్కెట్లోకి రావడానికి మరో రెండు నుంచి ఐదేళ్ల మధ్య సమయం పట్టొచ్చు. టెస్లా ఏఐతోనే ఈ రోబోలు తయారు కాబోతున్నాయి. పైగా 20వేల డాలర్ల లోపే ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన రోబోలు అందిస్తానని ప్రకటించి మరో సంచలనానికి తెర తీశాడు ఎలన్ మస్క్. అయితే.. ఈ రోబోలలో సెక్సీ వెర్షన్లు రాబోతున్నాయంటూ అతని చేసిన ప్రకటన గురించే ఆసక్తికర చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. ఆప్టిమస్ రోబోలో క్యాట్‌గర్ల్ వెర్షన్ రాబోతోందని హింట్ ఇచ్చాడు ఎలన్ మస్క్. ఈ ఏప్రిల్ నెలో టెడ్(TED) హెడ్ క్రిస్ ఆండర్సన్ ఇంటర్వ్యూలో మస్క్ మాట్లాడుతూ.. రోబోలు శృంగార భాగస్వాములుగా మారడం బహుశా అనివార్యం. కానీ, క్యాట్‌గర్ల్ తరహా రోబోలను తయారు చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఇది చాలా ఆసక్తికరమైన అంశం అంటూ సెక్సీ రోబోల గురించి హింట్ ఇచ్చాడు. దానికి కొనసాగింపుగా ఇవాళ క్యాట్‌గర్ల్ Catgirl వెర్షన్ ఉంటుందంటూ మరో ట్వీట్ చేశాడు కూడా. 2024 చివరికల్లా ఈ సెక్సీవెర్షన్ రోబోలు మార్కెట్లోకి తేవాలనే ఆలోచనతో ఉన్నాడు మస్క్. మరి అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనే మొండిపట్టుదల ఉన్న ఎలన్ మస్క్.. శృంగారభరితమైన రోబోల విషయంలో ఏం చేయబోతున్నాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. Naturally, there will be a catgirl version of our Optimus robot — Elon Musk (@elonmusk) October 1, 2022 -
షియోమి.. కుంగ్ ఫూ రోబో!
ఓ కార్యక్రమం జరుగుతోంది.. స్టేజీ మీద ఉన్న వ్యాఖ్యాత ఓ ప్రత్యేక వ్యక్తిని పిలిచారు.. అతను మెల్లమెల్లగా అడుగులో అడుగేసుకుంటూ వచ్చాడు. అందరికీ పరిచయం చేసుకున్నాడు.. సెల్ఫీ దిగుదామంటే కుంగ్ ఫూ పోజిచ్చాడు. కుంగ్ ఫూ ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుందంటూ వెళ్లిపోయాడు.. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలుసా..? చైనాకు చెందిన ప్రఖ్యాత స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమి తాజాగా విడుదల చేసిన హ్యూమనాయిడ్ (మనిషిని పోలిన) రోబో. దాని పేరు ‘సైబర్‌వన్’. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా టెస్లా ‘ఆప్టిమస్’ రోబో విడుదలకు కొన్నిరోజుల ముందు షియోమి సంస్థ ఇలా ‘సైబర్‌వన్’ను ప్రదర్శించడం ఆసక్తి రేపుతోంది. మడత పెట్టగల ఫోన్ రిలీజ్ చేస్తూ.. సోమవారం షియోమీ సంస్థ తాము రూపొందించిన ఫోల్డబుల్ ఫోన్‌ను విడుదల చేస్తూ.. ఈ సరికొత్త రోబోను ప్రదర్శించింది. షియోమి సీఈవో లీ జున్ ‘సైబర్‌వన్’ రోబోను స్టేజీపైకి పిలిచారు. సైబర్ వన్ చేతిలో పువ్వు పట్టుకుని మెల్లగా నడిచి వచ్చింది. పువ్వును లీ జున్‌కు ఇచ్చింది. పురుష గొంతుతో మాట్లాడుతూ అందరికీ హాయ్ చెప్పింది. సెల్ఫీ దిగుదామని అడిగితే.. కుంగ్ ఫూ ఫోజు ఇచ్చింది. సెల్ఫీ దిగాక కుంగ్ ఫూ ప్రాక్టీసు చేసుకోవాలంటూ వెళ్లిపోయింది. ఈ వీడియోను షియోమి సంస్థ తమ యూట్యూబ్ చానల్లో పెట్టింది. బుడి బుడి అడుగులతో.. తమ రోబోకు సంబంధించి మరో వీడియోనూ షియోమీ సంస్థ విడుదల చేసింది. ‘సైబర్‌వన్’ రోబో బుడి బుడి అడుగులు వేస్తున్న చిన్నారిలా పడుతూ లేస్తూ నడక నేర్చుకుని.. రేయింబవళ్లూ నడుస్తూ గమ్యాన్ని చేసుకున్నట్టుగా చిత్రించింది. చివరిగా ‘ఏదైనా అద్భుతం జరుగబోతోందని ఎల్లప్పటికీ నమ్ముతాం..’ అంటూ క్యాప్షన్‌తో ముగించింది. ఏమిటీ రోబో ప్రత్యేకతలు ►షియోమి సంస్థ వెల్లడించిన వివరాల మేరకు.. ‘సైబర్‌వన్’ రోబో ఎత్తు ఐదు అడుగుల 9.7 అంగుళాలు (177 సెంటీమీటర్లు). బరువు 52 కిలోలు ►మనుషులకు సంబంధించి సంతోషం, విషాదం వంటి 45 రకాల భావోద్వేగాలను ఈ రోబో గుర్తించగలదు. ►మన చుట్టూ ఉండే వాతావరణానికి సంబంధించి 85 రకాల ధ్వనులను అవి దేనికి సంబంధించినవో గుర్తించగలదు. ►షియోమీ సంస్థకు చెందిన రోబోటిక్స్ ల్యాబ్ అభివృద్ధి చేసిన కృత్రిమ మేధ (ఏఐ) ప్రోగ్రామ్ ఆధారంగారోబో పనిచేస్తుంది. ►తన చుట్టూ ఉన్న పరిసరాలను త్రీడీ వర్చువల్ దృశ్యాలుగా మార్చుకుని చూడగలదు. ►అత్యంత శక్తివంతంగా పనిచేసే సరికొత్త మోటార్లను ఇందులో ఉపయోగించారు. ►ఈ రోబో ధర రూ.82.7 లక్షలు అని సంస్థ పేర్కొంది. ►భవిష్యత్తులో ప్రజల జీవితాల్లో భాగస్వామ్యం అయ్యే అద్భుత టెక్నాలజీలతో రోబోలను రూపొందిస్తామని షియోమీ సీఈవో లీ జున్ ప్రకటించారు. – సాక్షి సెంట్రల్‌డెస్క్ -
ఎలాన్ మస్క్ మరో సంచలనం.. త్వరలో హ్యుమనాయిడ్ రోబో
సూపర్‌స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన రోబో మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా రజనీ నటన, శంకర్ టేకింగ్లకు దీటుగా ఇందులో చిట్టి: ది రోబో అందరినీ ఆకట్టుకుంది. అచ్చంగా అలాంటి హ్యుమనాయిడ్ రోబోను తయారు చేస్తున్నట్టు ఇప్పటికే ఎలాన్ మస్క్ ప్రకటించాడు. కాగా ఈ రోబోకి సంబందించిన బిగ్ అనౌన్స్మెంట్ మరో మూడు నెలల్లో వినబోతున్నట్టు మస్క్ తెలిపారు. హ్యుమనాయిడ్ రోబో ఎలాన్ మస్క్ సంప్రదాయ వ్యాపార సూత్రాలకు భిన్నంగా ఆది నుంచి టెక్నాలజీ ఆధారిత ఆవిష్కరణలతోనే ప్రపంచంలో అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి రారాజుగా వెలుగొందుతున్నాడు. ప్రపంచ నంబర్ వన్ కుబేరుడిగా గుర్తింపు పొందాడు. పేపాల్ మొదలైన ప్రస్థానం స్పేస్ఎక్స్, టెస్లాల మీదుగా ట్విటర్ టేకోవర్ వరకు వచ్చి చేరింది. ఈ మధ్యలో సీక్రెట్ ఆపరేషన్‌గా హ్యుమనాయిడ్ రోబోని డెవలప్‌చేసే పనులు మొదలెట్టాడు ఎలాన్ మస్క్. తొలిసారిగా ఈ విషయాన్ని 2021 ఆగస్టులో బయటి ప్రపంచానికి అధికారికంగా వెల్లడించాడు మస్క్. సెప్టెంబరు 30న ఖతార్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఎలన్ మస్క్ మాట్లాడుతూ తన హ్యుమనాయిడ్ రోబోకి సంబంధించిన విశేషాలు పంచుకున్నారు. ఈ రోబోకు ఆప్టిమస్గా పేరు పెట్టినట్టు వివరించారు. టెస్లా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ డేను పురస్కరించుకుని 2022 సెప్టెంబరు 30న ఈ రోబోను ఆవిష్కరిస్తామంటూ మస్క్ వెల్లడించాడు. ఫీచర్లు ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమచారం ప్రకారం ఆరు అడుగుల ఎత్తు ఉండే ఆప్టిమస్ హ్యుమనాయిడ్ రోడో గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో నడవగలదు. 68 కేజీలకు వరకు బరువులను ఎత్తగలదు. మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీల్లో కొన్ని పనులు అవలీలగా చేయగలదు. డేంజరస్ టాస్క్‌లో ఆప్టిమస్ అద్భుతమై సేవలు అందివ్వగలదు. అదే విధంగా టెస్లా కారుతో సైతం ఈ రోబోలు అనుసంధానించబడి ఉంటాయి. పూర్తి వివరాల కోసం సెప్టెంబరు 30 వరకు వేచి చూడాల్సిందే. చదవండి: ఎలన్ మస్క్ కొంపముంచిన చైనా.. లక్షల కోట్లు హాంఫట్! -
Nikola: ప్రాణం లేదు.. అయినా బుడ్డోడి హావభావాలు అదుర్స్
మనిషిలా ప్రాణం లేకున్నా.. భావోద్వేగాలు పండించడం ఎలాగబ్బా అనుకుంటున్నారా? రజినీకాంత్ రోబో సినిమా తెలుసు కదా! అచ్చం అలానే. నికోలా మనిషి కాదు.. ఆండ్రాయిడ్ కిడ్. ఆండ్రాయిడ్స్(రోబోలను) మనుషులతో ఎమోషనల్‌గా కనెక్ట్ చేయాలన్న ప్రయత్నాలు కొత్తేం కాదు. రియల్ లైఫ్ సిచ్యుయేషన్స్లో ప్రత్యేకించి.. వయసు మళ్లిన వాళ్లను చూస్కోవడానికి, ఒంటరి జీవుల బాగోగుల కోసం పనికి వస్తాయని అనుకుంటున్నారు. అదే సమయంలో కోపం, అసహనం లాంటివి విపరీతాలకు దారి తీసే అవకాశమూ లేకపోలేదన్న ఆందోళన వ్యక్తం అవుతోంది కూడా. ఇదిలా ఉంటే నికోలా అనే ఆండ్రాయిడ్ కిడ్ గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. నికోలా.. మనిషి కాదు. ఆండ్రాయిడ్ కిడ్. జపాన్ రీసెర్చర్లు రైకెన్ గార్డియన్ రోబో ప్రాజెక్టులో భాగంగా ఈ బచ్చా రోబోను రూపొందించారు. ఈ ఎక్స్‌ప్రెసివ్ హ్యూమనాయిడ్ రోబో ఆరు రకాల ఎమోషన్స్‌ను ప్రదర్శిస్తుంది. సంతోషం, బాధ, భయం, కోపం, ఆశ్చర్యం, అసహ్యం. Nikola ఈ ఎమోషన్స్‌ను అర్టిఫిషియల్ కండరాల కదలిక వల్ల.. భావోద్వేగాల్ని పండించగలుగుతుంది. సోషల్ సైకాలజీ, సోషల్ న్యూరోసైన్స్ పరిశోధనలకు నికోలా లాంటి రోబోలు అంశాలుగా పనికొస్తాయని రీసెర్చర్లు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నికోలాకు ఇంకా బాడీ సిద్ధం కాలేదు. త్వరలో సిద్ధం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అదే జరిగితే.. ఎక్స్ప్రెషన్స్ రోబో కిడ్‌గా నికోలా తొలి ఘనత సాధించినట్లవుతుంది. -
ముఖం, వాయిస్ రైట్స్‌తో కోట్లు సంపాదించొచ్చు..
పనిదొరక్క ఖాళీగా ఉండే చాలామంది పడే మాట.. ‘ రూపాయి సంపాదించిన మొహమా?’ అని. ఇకపై ఎవరైనా అలా అంటే ‘రూపాయేం కర్మ.. అక్షరాలా కోటిన్నర సంపాదించే మొహం’ అని దర్జాగా సమాధానం చెప్పొచ్చు. నిజం.. రష్యాకు చెందిన ప్రోమోబోట్ సంస్థ మనిషి ముఖం, స్వర హక్కులను కొనుగోలు చేస్తోంది. 2019 నుంచి ఈ సంస్థ హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేస్తోంది. అయితే, వీటిని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఓ ఉపాయాన్ని ఆలోచించింది. అదే మనిషి ముఖం, వాయిస్‌ల పేటెంట్ రైట్స్‌ను కొనుగోలు చేయటం. ఈ రెండిటిని ఉపయోగించి హ్యూమనాయిడ్ రోబో తయారు చేస్తే.. రోబోలు మరింత రియలిస్టిక్‌గా కనిపిస్తాయట. అందుకే, ‘25 సంవత్సరాలు లేదా అంతకంటే పైబడిన వారు ఎవరైనా సరే మీ ముఖం, వాయిస్ రైట్స్‌ను మా సంస్థకు అందించొచ్చు. ఇందుకు రెండు లక్షల డాలర్లు (రూ.1,50,43,976) చెల్లిస్తామని’ సంస్థ ప్రకటించింది. అయితే, ముందుకు వచ్చిన అందరినీ వీరు సెలెక్ట్ చేయరు. వివిధ పరీక్షల్లో ఎంపికైన వారి రైట్స్‌నే కొనుగోలు చేస్తారు. ఆ పరీక్షల్లో భాగంగా వంద గంటల ప్రసంగంతో పాటు, వివిధ ఫొటోషూట్లలో పాల్గొనాలి. కొన్ని షరతులనూ అంగీకరించాల్సి ఉంటుంది. అన్నీ నచ్చితే ఇక మీరు కూడా మీ ముఖం, వాయిస్ రైట్స్‌తో కోట్లు సంపాదించొచ్చు. బాగుంది కదూ! -
బాబ్బాబు.. మీ ‘ముఖాన్ని’మాకు ఇస్తారా? ఊరికనే కాదులెండి.. కోట్లిస్తాం..!
ఆధునిక రోబోలను ఎంత అందంగా తయారు చేసినా, కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా వాటికి మనిషి రూపాన్ని జోడించినా అందులో కృత్రిమత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ప్రోమోబోట్ అనే హ్యూమనాయిడ్ రోబోల తయారీ కంపెనీ మనిషి ముఖాన్ని అచ్చుగుద్దినట్లుండే రోబోను తయారు చేసేందుకు సిద్ధమైంది! ఫేస్ వాల్యూ.. ఫేస్ వాల్యూ అంటుంటారు కదా..మన ఫేస్కీ వాల్యూ ఇచ్చే రోజు వచ్చేసింది.‘మీ వయసు 25లోపు ఉందా? అందమైన ముఖవర్చస్సు మీ సొంతమా?అయితే మీలాంటి వారి కోసమే వెతుకున్నాం. కాస్త మీ ‘ముఖాన్ని’మాకు ఇస్తారా? ఊరికనే కాదులెండి.. కోట్లలో భారీ నజరానా ఇస్తాం.’ అంటూ ‘నెట్టిం'ట్లో తాజాగా చక్కర్లు కొట్టిన ప్రకటన ఇది. ఈ విచిత్రమైన యాడ్‌కు ఔత్సాహికుల నుంచి స్పందన సైతం అనూహ్యంగానే వచ్చింది. తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ఒకరిద్దరు కాదు.. ఏకంగా 20 వేల మందికిపైగా తమ ‘ముఖాలను’ ఇచ్చేందుకు సిద్ధమంటూ దరఖాస్తులు పంపారు! ఇంతకీ విషయం ఏమిటంటే.. ఆధునిక రోబోలను ఎంత అందంగా తయారు చేసినా, కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా వాటికి మనిషి రూపాన్ని జోడించినా అందులో కృత్రిమత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ప్రోమోబోట్ అనే హ్యూమనాయిడ్ రోబోల తయారీ కంపెనీ మనిషి ముఖాన్ని అచ్చుగుద్దినట్లుండే రోబోను తయారు చేసేందుకు సిద్ధమైంది! తమ ‘క్లయింట్ల’ కోరిక మేరకు ఉత్తర అమెరికా, మిడిల్‌ఈస్ట్‌లోని వివిధ హోటళ్లు, షాపింగ్ మాల్స్, ఎయిర్‌పోర్టుల్లో దాన్ని ‘పని’కి కుదర్చనుంది. ఇందుకోసం ఎవరైనా తమ ముఖాన్ని రోబో తయారీలో వాడుకునేందుకు ముందుకొస్తే ఏకంగా రూ. కోటిన్నర నజరానా ఇస్తామని ప్రకటించింది!! హ్యూమనాయిడ్ అసిస్టెంట్‌గా సేవలందించబోయే రోబోతో పర్యాటకులు మాటకలిపేలా ఆ ‘ముఖం’ కనిపించాలన్నదే షరతు అట! అలాంటి ముఖాన్ని శాశ్వతంగా రోబోపై ముద్రించేందుకు చట్టబద్ధంగా సమ్మతించిన వారికి ఈ బహుమానాన్ని ఇస్తామని కంపెనీ తెలిపింది. ఒక భారీ ప్రాజెక్టును ప్రారంభించడంలో నెలకొన్న చట్టపరమైన జాప్యాన్ని అధిగమించేందుకు తమ క్లయింట్లు సరికొత్త రోబో రూపాన్ని కోరుకున్నారని, అందుకే ఈ వెరైటీ ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు కంపెనీ వివరించింది. అయితే ఈ ప్రక్రియ అంత సులువేం కాదట. ఈ రోబో తయారీ కోసం ముందుగా మనిషి ముఖంతోపాటు శరీర 3డీ నమూనాను తీసుకొని కొలతలు తీసుకుంటారట. ఆపై ఆ వ్యక్తి 100 గంటలకు సమానమైన సంభాషణలను రికార్డు చేసి ఇవ్వాలట. చివరగా అపరిమిత కాలానికి తన ముఖాన్ని ప్రింట్ లేదా డిజిటల్ రూపంలో ఆ సంస్థ వాడుకునేలా నిరభ్యంతర పత్రంపై సంతకం చేయాలట. ఇవన్నీ సవ్యంగా సాగితే 2023లో ఈ సరికొత్త రోబో ప్రపంచానికి తన ‘ముఖం’ చూపించనుంది. -
‘యంత్ర’ ముగ్ధులౌతారు
ఆ మధ్య హైదరాబాద్‌లోని ఓ హోటల్లో రోబోలను పనికిపెట్టారు. వచ్చే వాళ్లకు స్వాగతం చెప్పడం, వాళ్లతో మాటలు కలపడం, భోజనం తీసుకురావడం, వడ్డించడం.. అబ్బో ఇలా రకరకాల పనులను అవే చేయడం చూసి జనం ఆశ్చర్యపోయారు. సింగపూర్ శాస్త్రవేత్తలు ఓ అడుగు ముందుకేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పని చేసే పోలీస్ రోబోలను సృష్టించారు. రోడ్ల మీద ఎవరైనా రూల్స్‌ను అతిక్రమిస్తే చాలు.. ‘ఏయ్.. సెట్ రైట్’ అని హెచ్చరిస్తున్నాయి ఇవి. ఇదే సింగపూర్‌లో ఇంటింటికీ వెళ్లి వస్తువులను డెలివరీ చేసే రోబోలూ అందుబాటులోకి వచ్చాయి. ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలేమో సరిహద్దుల్లో గస్తీ కాస్తూ చొరబాటుదారులను గుర్తించి కాల్పులు జరిపే రోబోలను ఆవిష్కరించారు. వీటన్నింటినీ చూస్తుంటే మున్ముందు ప్రపంచమంతా రోబోలదేనేమో అనిపిస్తోంది కదా. ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ కూడా ఇదే చెప్తోంది. 2030 నాటి కల్లా ప్రపంచంలో 2 కోట్ల ఉద్యోగాల్లో రోబోలే ఉంటాయని అంచనా వేస్తోంది. రోబోల వాడకం పెరుగుతోందా? గత పదేళ్లలో రోబోల వాడకం పరిశ్రమల్లో బాగా పెరిగింది. 2010లో దాదాపు 10.59 లక్షల రోబోలను ఇండస్ట్రీల్లో వాడితే అది 2020 కల్లా మూడు రెట్లు పెరిగి 30.15 లక్షలకు చేరిందని వరల్డ్ రోబోటిక్స్ 2021 రిపోర్టు వెల్లడించింది. ఏయే రంగాల్లో వాడుతున్నారు? రోబోలను ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ రంగాల్లో ఎక్కువగా వాడుతున్నారు. ఆ తర్వాత స్థానంలో ఆటోమోటివ్ రంగం ఉంది. 2020 నాటికి ప్రపంచ లెక్కలను పరిశీలిస్తే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ రంగాల్లో 1.09 లక్షల రోబోలను వాడుతున్నారు. ఆ తర్వాత ఆటోమోటివ్ రంగంలో 80 వేలు.. లోహ పరిశ్రమల్లో 41 వేల రోబోలను వినియోగిస్తున్నారని వరల్డ్ రోబోటిక్స్ రిపోర్టు 2021 వివరించింది. వాడకం ఏ దేశాల్లో ఎక్కువ? రోబోలను అత్యధికంగా చైనాలో వాడుతున్నారు. ఆ తర్వాత జపాన్, అమెరికా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా దేశాలున్నాయి. వరల్డ్ రోబోటిక్స్ రిపోర్టు లెక్కల ప్రకారం 2020 నాటికే చైనాలో 1.68 లక్షల రోబోలను వాడుతున్నారు. ఆ తర్వాత జపాన్‌లో 38 వేలు, అమెరికాలో 30,800, రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో 30,500 వాడుతున్నారు. ఈ లిస్టులో ఇండియా 15వ స్థానంలో ఉంది. మన దేశంలో 3,200 రోబోలను వాడుతున్నారు. కరోనా సమయంలో.. రోబోలకు వైరస్ సోకే అవకాశం లేదు కాబట్టి కరోనా సమయంలో వీటి వాడకం పెరిగింది. మున్ముందు మహమ్మారుల సమయంలో రోబోల వాడకం పెరగవచ్చని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అభిప్రాయపడింది. ఇళ్లల్లో వాడుతున్నారా? రోబోల వాడకం ఇళ్లల్లో కూడా పెరుగుతోంది. 2018తో పోలిస్తే 2019–2020లో ఒకేసారి 5 రెట్లు మర బొమ్మల వాడకం ఎక్కువైంది. ఈ లెక్కలను ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ (ఐఎఫ్ఆర్) వెల్లడించింది. ఈ కొనుగోళ్లతో ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం రూ. 82 వేల కోట్లకు చేరింది. ఇళ్లల్లో వాడే రోబోల అమ్మకాలు మున్ముందు ఊపందుకుంటాయని, ఏటా 46 శాతం వరకు పెరుగుదల ఉంటుందని ఐఎఫ్ఆర్ వివరించింది. 2022లో దాదాపు 5.5 కోట్ల రోబో యూనిట్ల కొనుగోళ్లు జరుగుతాయని అంచనా వేసింది. స్పేస్‌లోకి కూడా.. వివిధ రకాల పరిశోధనలకోసమని రోబోలను స్పేస్‌లోకి కూడా పంపారు. ఎందుకంటే.. తక్కువ డబ్బుతోనే రకరకాల నైపుణ్యాలతో వీటిని తయారు చేయొచ్చు. పైగా రోదసీలో ఆస్ట్రొనాట్లు చేయలేని ప్రమాదకరమైన పనులను రోబోలతో చేయించవచ్చు. ‘చిట్టి’ లాంటి రోబోలు .. ఈ ఏడాది కొత్త రకం రోబోలు ముందుకొచ్చాయి. అచ్చం మనుషుల్లా ఉండే హ్యూమనాయిడ్ రోబోలు, ఓషన్ రోబోలను వార్తల్లో కనిపించాయి. స్వరాన్ని గుర్తు పట్టడం, వైద్య చికిత్సల్లో పాలు పంచుకోవడం లాంటి అదనపు నైపుణ్యాలను వీటికి జోడించారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
టెస్లా రోబో.. అచ్చం మనిషి తరహాలోనే!
Tesla Bot: ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు టెస్లా.. సంచలన ప్రకటన చేసింది. హ్యూమనాయిడ్ రోబోలను మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. గురువారం(ఆగష్టు 19న) టెస్లా అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) డే జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్లో రోబో ఫీచర్స్‌ను సర్ప్రైజ్ లాంఛ్ చేసి ఆశ్చర్యంలో ముంచెత్తాడు టెస్లా సీఈవో ఎలన్ మస్క్. ప్రస్తుతం టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ కోసం ఉపయోగిస్తున్న ఏఐనే.. హ్యూమనాయిడ్ రోబోలకు ఉపయోగించబోతున్నారు. సుమారు 5.8 అడుగుల ఎత్తు, 125 పౌండ్ల బరువుతో రోబోను తయారు చేయనున్నారు. రోబో ముఖంలోనే పూర్తి సమాచారం కనిపించేలా డిస్ప్లే ఉంచారు. రోబోకు 45 నుంచి 150 పౌండ్ల బరువు మోసే సామర్థ్యం ఉంటుందని, గంటకు ఐదు మైళ్ల దూరం ప్రయాణిస్తుందని చెప్పాడు ఎలన్ మస్క్. చదవండి: టెస్లాకు షాక్ ఇవ్వనున్న ఓలా మనిషి రోబో తరహా డ్యాన్స్‌తో ప్రారంభమైన ఈ ఈవెంట్లో.. గతంలోలాగే హ్యూమనాయిడ్ రోబో ఫీచర్స్ గురించి స్వయంగా మస్క్ వివరణ ఇచ్చాడు. ఇక ఈ రోబోల కోసం ఇప్పుడు వెహకిల్స్ కోసం ఉపయోగిస్తున్న.. ఆటోపైలోట్ సాఫ్ట్వేర్(ఏఐ)ను ఉపయోగించబోతున్నట్లు మస్క్ తెలిపాడు. ఈ న్యూరల్ నెట్వర్క్ ఎనిమిది కెమెరాలతో పని చేస్తుంది. మనిషికి ‘ఆర్థిక భారాన్ని దించే రోబోలుగా’ వీటిని అభివర్ణించాడు మస్క్. మిగతా రోబోల కంటే భిన్నంగా.. మనిషి తరహా ఆకారంలో ఈ రోబో ఉండడం విశేషం. ‘చక్రాల మీదే కాదు.. రెండు కాళ్ల మీద కూడా టెస్లా ఏఐ అద్భుతంగా పని చేస్తుంది. ఇది నా గ్యారెంటీ’ అంటూ రోబో ఆవిష్కరణలో ఉద్వేగంగా మాట్లాడాడు మస్క్. కాగా, ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ రోబోలు.. వచ్చే ఏడాదికల్లా మార్కెట్లోకి రానున్నాయి. Join us to build the future of AI → https://t.co/Gdd4MNet6q pic.twitter.com/86cXMVnJ59 — Tesla (@Tesla) August 20, 2021 -
కరోనా రోగులకు సేవలందించనున్న "గ్రేస్ రోబో నర్స్"
మానవ స్పర్శ కోసం దీనంగా దేవలోకం వైపు చూస్తూ ఉన్న ప్రపంచానికి ‘గ్రేస్’ అనే ఒక హ్యూమనాయిడ్ నర్సు వెచ్చని టచ్‌ని ఇచ్చి, కోవిడ్ కలవరం నుంచి సాంత్వన కలిగించనుంది! బ్లూ డ్రెస్ ధరించి ఉండే ఈ కరుణామయి.. ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులకు దగ్గరగా వెళ్లి, చేతిలో చెయ్యి వేసి.. ‘ఎలా ఉన్నారు?’ అని అడుగుతుంది. ‘తప్పక నయం అవుతుంది’ అని చిరునవ్వు కళ్ల తో ధైర్యం చెబుతుంది. ఇంకా.. వేళకు మందులు గుర్తు చేస్తుంది. సున్నితంగా సూది మందు గుచ్చుతుంది. హాంగ్ కాంగ్ ల్యాబ్‌లోంచి త్వరలోనే బయటికి రానున్న ఈ దయాళువులో మానవులు సృష్టించిన దైవాంశ ఏదో ఉన్నట్లే ఉంది! చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ వస్తే వచ్చి ఉండొచ్చు గాక.. కరోనా వైద్య సేవలు అందించడం కోసం హాంకాంగ్‌లోని హాన్సన్ ల్యాబ్ నుంచి గ్రేస్ అనే ఒక రోబో నర్సు రాబోతున్నారు! కేవలం సేవలే కాదు, కరోనా వార్డులోని రోగులతో ఆమె ‘సిస్టర్’లా సాంత్వన వచనాలు పలుకుతారు. ‘మీకేమీ కాదు. త్వరగా కోలుకుంటారు’ అని ధైర్యం చెబుతారు. అయితే ఇదంతా కూడా ఇంగ్లిష్‌లో. మరికొన్ని రోజుల తర్వాత ఒకటీ రెండు అంతర్జాతీయ భాషలలో కూడా. అయినా మనసును నెమ్మది పరిచే స్పర్శ అనే ‘అమ్మ భాష’ ఎవరికి అర్థం కాకుండా ఉంటుంది. గ్రేస్ తాకి మాట్లాడతారు. హృదయాన్ని టచ్ చేస్తారు. గ్రేస్ ఒక హ్యూమనాయిడ్ రోబో. స్త్రీ రూపంలోని మర మనిషి. Meet Grace, the humanoid robot designed to interact with the elderly and those isolated by the global health crisis https://t.co/QmICTkKsti pic.twitter.com/nclTArYIrl — Reuters (@Reuters) June 10, 2021 హాంకాగ్లోని హాన్సన్ రోబోటిక్స్ ల్యాబ్‌లో ‘జీవం’ పోసుకున్న గ్రేస్ ప్రస్తుతం తుది శిక్షణలో ఉంది. ప్రధానంగా కోవిడ్ వార్డుల ఐసోలేషన్ లో ఉన్న వృద్ధులకు సేవలను అందించడం కోసం ఆసుపత్రులలోని ఫ్రంట్‌లైన్ సిబ్బందికి చేయూతగా హాన్సన్ కంపెనీ ఈ రోబోను రూపొందించింది. గ్రేస్ శుభ్రమైన నీలం రంగు యూనిఫామ్ ధరించి ఉంటుంది. ఆసియా అమ్మాయిల రూపురేఖలు ఉంటాయి. పేషెంట్ ల శరీర ఉష్ణోగ్రత కొలవడం కోసం ఆమె కంఠానికి దిగువ భాగంలో కెమెరా ఉంటుంది. తల వెనుక భాగంలో అమర్చి ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్‌తో ఆమె రోగులకు అవసరమైన అన్ని సేవలూ అందిస్తుంది. మందులివ్వడం, ఇంజెక్షన్ చేయడం మాత్రమే కాకుండా.. మానసికమైన కుంగుబాటులో ఉన్న రోగిని గుర్తించి మాటలు కలుపుతుంది. టాక్ థెరపీ ఇచ్చి ఒంటరితనాన్ని పోగొడుతుంది! రోగి కన్నీళ్లు పెట్టుకుంటే... ‘కమ్మాన్.. ’ అంటూ కళ్లు తుడుస్తుంది. రోగితో సహానుభూతి పొందడం కోసం ల్యాబ్ వాళ్లు 48 రకాల ముఖ వ్యక్తీకరణ లు గ్రేస్‌కి ‘ఫీడ్’ చేశారు. సంతోషానికి సంతోషం. విచారానికి విచారం. నవ్వుకు నవ్వు. ఇలా.. ముఖాముఖిలా సాగుతుంది. గ్రేస్ మనిషిలా మాట్లాడుతుంటే.. రోగులు మంత్రముగ్ధులై రోబోలా మారిపోతారు. ‘‘గ్రేస్‌లో ఇదెంతో మంచి విషయం’’ అని హవాయి యూనివర్శిటీలో కమ్యూనికాలజీ ప్రొఫెసర్‌గా ఉన్న మిన్–సున్ అంటున్నారు. గ్రేస్ తయారీకి ఆమె సహకారాన్ని కూడా హాన్సన్ ల్యాబ్ తీసుకుంది. గ్రేస్‌ను ముందుగా భారత్‌లోనే ‘లాంచ్’ చేయాలని అనుకుంటున్నారు. ఆ తర్వాత ఆర్డర్లని బట్టి వేల సంఖ్యలో గ్రేస్‌లను ప్రపంచమంతటా ఉత్పతి చేస్తారు. -
ఆర్ట్ బై రోబో సోఫియా!
బొమ్మ బొమ్మను గీసింది. అవును మీరు చదివింది నిజమే. ఈ బొమ్మ అటుఇటూ కదలడమే గాకుండా మనం పలకరిస్తే చిలక పలుకులు పలుకుతుంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది మనం చెప్పుకునే మరబొమ్మ మరెవరో కాదు హ్యూమనాయిడ్ రోబో ‘సోఫియా’ అని. మీరడిగే ప్రశ్నలకు సమాధానాలే కాదండి మీరు గీసినట్టు నేను చిత్రాలు గీస్తున్నాను చూడండి అంటోంది సోఫియా. హాంగ్‌కాంగ్‌కు చెందిన హ్యన్సన్ రోబోటిక్స్ సంస్థ తయారు చేసిన ఈ సోఫియా ఇప్పటికే ఒక కార్యకర్తగా, మ్యుజీషియన్‌గా, ఫ్యాషన్ డిజైనర్‌గా పేరుగాంచింది. తాజాగా డిజిటల్ ఆర్టిస్ట్‌గా మారింది. 31 ఏళ్ల ఇటాలియన్ డిజిటల్ ఆర్టిస్ట్ ఆండ్రియా బోనాసెటో దగ్గర రంగురంగుల చిత్రాలు గురించి ఇన్పుట్స్ తీసుకుని ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులైన టెస్లా చీఫ్ ఎక్సిక్యూటివ్ ఎలన్ మస్క్ వంటి వారి చిత్రాలను సోఫియా గీసింది. ఈ చిత్రాలను నాన్ ఫంజిబల్ టోకెన్ (ఎన్ఎఫ్టీ) రూపంలో వేలం వేస్తున్నారు. ఈ చిత్రాన్నీ కొన్నవారికి ఎన్ఎఫ్టీ సర్టిఫికెట్ ఇస్తారు. ఎన్ఎఫ్టీ చిత్రం డిజిటల్ సంతకంలా బ్లాక్‌చెయిన్ లెడ్జర్స్లో భద్రపరచ బడుతుంది. వేలంలో సోఫియా చిత్రాన్నీ కొన్నవారికి హక్కులు అధికారికంగా ధ్రువీకరించబడతాయి. అయితే కృత్రిమమేధస్సుతో రూపొందించిన వస్తువును వేలం వేయడం ప్రపచంలో ఇదే తొలిసారి. సోఫియా చిత్రాన్ని ‘సోఫియా ఇన్‌స్టాంటియేషన్’ గా పిలుస్తున్నారు. దీనిలో బోనాసెటో గీసిన చిత్రాన్నీ సోఫియా డిజిటల్ చిత్రంగా ఎలా మర్చిందో చూపించే ఎమ్పీ4 ఫైల్ 12 సెకన్ల నిడివితో ఉంటుంది. దీనితోపాటు సోఫియా స్వయంగా తన చేతులతో పెయింటింగ్ వేసిన చిత్రం ప్రింట్ అవుట్ హార్డ్ కాపీ కూడా జతగా ఉంటుంది. ‘‘మనుషులు నా డిజిటల్ ఆర్ట్‌ను ఇష్టపడతారని అనుకుంటున్నాను, మనుషులతో కలిసి నేను ముందుకు సాగడానికి కొత్తరకం, ఉత్తేజకరమైన మార్గాల్లో సహకరిస్తారని ఆశిస్తున్నట్లు సోఫియా చెప్పింది. సిల్వర్ కలర్ సూటు ధరించి చేతిలో పెన్సిల్ పట్టుకొని ఉన్న సోఫియా మాట్లాడుతూ.. ట్రాన్స్ఫార్మర్ నెట్వర్క్స్, జెనిటిక్ అల్గారిథమ్స్‌ను ఉపయోగించి ఈ చిత్ర కళాఖండాలను రూపొందించాము. అందువల్ల ఈ చిత్రాలు డిజిటల్ ఆర్ట్‌లో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక నమూనాలను సృజనాత్మకంగా సృష్టిస్తాయి’ అని సోఫియా చెప్పింది. ఈ మధ్యకాలంలో పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చే ప్లాట్‌ఫారమ్‌గా ఈ ఎన్ఎఫ్టీ టెక్నాలజీ వ్యవహరిస్తోంది. ఈ నెలలో నిర్వహించిన ఓ డిజిటల్ ఆర్ట్‌కు వేలం నిర్వహించ గా దాదాపు 70 మిలియన్ డాలర్లకు అమ్ముడయ్యింది. కాగా సోఫియా గీసిన డిజిటల్ చిత్రాన్నీ ఎవరు కొనుగోలు చేస్తారో వారిని కలిసి వారితో మాట్లాడి వారి ఫేస్‌ను రీడ్‌చేసి ఆ తరువాత సోఫియా తాను గీసిన చిత్రానికి తుది మెరుగులు దిద్దనుంది.l -
హలో.. నా పేరు వ్యోమమిత్ర
సాక్షి, బెంగళూరు: మానవులకంటే ముందుగా అంతరిక్షంలోకి మహిళా రోబో ‘వ్యోమమిత్ర’ను పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ‘మానవసహిత అంతరిక్ష ప్రయోగాలు, పరిశోధనలు, సవాళ్లు’ అన్న అంశంపై బుధవారం బెంగళూరులో జరిగిన సదస్సులో ‘వ్యోమమిత్ర’ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘హలో.. నా పేరు వ్యోమమిత్ర,. నేను గగన్‌యాన్ ప్రయోగం కోసం తయారైన నమూనా హ్యూమనాయిడ్ రోబోను’ అంటూ అందరినీ పలకరించింది. గగన్‌యాన్‌లో తన పాత్ర గురించి మాట్లాడుతూ ‘మాడ్యూల్ పారామీటర్ల ద్వారా నేను పరిశీలనలు జరపగలను. మానవులను హెచ్చరించగలను. స్విచ్ ప్యానెల్ వంటి పనులు చేయగలను’ అని తెలిపింది. వ్యోమగాములకు స్నేహితురాలిగా ఉంటూ వారితో మాట్లాడగలనని ఆ రోబో తెలిపింది. వ్యోమగాముల ముఖాలను గుర్తించడంతోపాటు వారి ప్రశ్నలకు సమాధానమూ ఇవ్వగలనని చెప్పింది. ఇస్రో చైర్మన్ కె.శివన్ మాట్లాడుతూ వ్యోమమిత్ర అంతరిక్షంలో మనుషులు చేసే పనులను అనుకరించలగదని, లైఫ్ కంట్రోల్ సపోర్ట్ సిస్టమ్స్‌ను నియంత్రించగలదని తెలిపారు. చురుగ్గా సన్నాహాలు.. మానవ సహిత ప్రయోగం కోసం నాసా, ఇతర అంతరిక్ష సంస్థల సహకారం, సూచనలు కూడా తీసుకుంటున్నట్లు శివన్ తెలిపారు. గగన్‌యాన్ ప్రయోగం ఇస్రో దీర్ఘకాల లక్ష్యమైన ఇంటర్ ప్లానెటరీ మిషన్‌కు ఉపయోగపడుతుందని చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పటికే గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా 10 టన్నుల పేలోడ్ సామర్థ్యం ఉన్న లాంఛర్, కీలక సాంకేతిక అంశాలను, అంతరిక్షంలో మనిషి మనుగడకు సంబంధించిన అంశాలను అభివృద్ధి చేస్తున్నాం. త్వరలోనే దేశంలో వ్యోమగాములకు సాధారణ అంతరిక్ష ప్రయాణ శిక్షణ ఇస్తాం. చంద్రయాన్–3 పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చంద్రయాన్–3 ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. చంద్రునిపైకి మానవుణ్ని పంపే ప్రాజెక్టు తప్పకుండా ఉంటుంది, కానీ అది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కాదు. దీని కోసం నలుగురు వ్యోమగాములను ఎంపిక చేసి, శిక్షణ నిమిత్తం ఈ నెలాఖరుకు వారిని రష్యాకు పంపనున్నాం. 1984లో రష్యా మాడ్యూల్లో రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లారు, కానీ ఈసారి భారత మాడ్యూల్లో భారతీయులు అంతరిక్షంలోకి వెళతారు’ అని చెప్పారు. 3 దశల్లో గగన్‌యాన్.. మానవ సహిత గగన్‌యాన్ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. 2021 డిసెంబర్లో మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్‌ను చేపట్టబోతున్నట్లు తెలిపారు. దానికంటే ముందు రెండు సార్లు (2020 డిసెంబర్, 2021 జూన్) మానవ రహిత మిషన్లను చేపట్టబోతున్నట్లు చెప్పారు. ‘గగన్‌యాన్‌లో భాగంగా సుమారు ఏడు రోజుల పాటు వ్యోమగాములను ఆర్బిటర్ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నాం. ఈ మిషన్ కేవలం భారత తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగమే కాదు, మానవుడు అంతరిక్షంలో నిరంతరంగా నివసించేలా కొత్త స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసే లక్ష్యంతో సాగుతున్న ప్రాజెక్టు. ఇది భారత్ ఘనతను చాటుతుంది’ అని చెప్పారు. -
బొమ్మలు గీసే మరబొమ్మ
లండన్ : మామూలుగా మనషులు లేదా జంతువులు గీసిన బొమ్మలను ఎగ్జిబిషన్‌కు ఉంచటం చూసుంటాము. కానీ ఓ మరబొమ్మ తన స్వహస్తాలతో గీసిన బొమ్మలను ప్రదర్శనకు ఉంచనున్నారు. ఆయిదా అనే హ్యూమనాయిడ్ రోబోట్ గీసిన బొమ్మలను ఇంగ్లాండ్‌లోని ‘‘ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ’’లో జూన్ 12వ తేదీ ప్రదర్శనకు ఉంచనున్నారు. డ్రాయింగ్, పేయింటింగ్, వీడియో ఆర్ట్ వంటి వాటిని ఈ ప్రదర్శనలో చూడవచ్చు. ఈ రోబో ఏఐ టెక్నాలజీ, అల్గారిథమ్‌ల సహాయంతో బొమ్మలను వేస్తుంది. అచ్చం మనిషిలాగే కంటితో చూస్తూ, చేతితో పెన్సిల్ పట్టుకుని మనషుల బొమ్మలను గీస్తుంది. రోబో పనితనాన్ని బట్టి ఏఐ టెన్నాలజీ సామర్థ్యాన్ని అంచనా వేయవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
సోఫియా.. ఆగయా!
సాక్షి, విశాఖపట్నం: ప్రపంచ తొలి హ్యూమనాయిడ్ రోబో సోఫియా ఎట్టకేలకు నగరానికి వచ్చేసింది. వైజాగ్ ఫిన్‌టెక్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు బుధవారం విశాఖ చేరుకుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం సోఫియాను 23నే విశాఖకు తీసుకురావలసి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ముచ్చటించేలా నిర్వాహకులు కార్యక్రమాన్ని రూపొందించారు. కానీ సోఫియాను ఆపరేట్ చేసే నిపుణుడికి వీసా సమస్య తలెత్తడంతో ఒకరోజు ఆలస్యంగా బుధవారం మధ్యాహ్నం నగరానికి చేరుకుంది. నగరంలోని ఫిన్‌టెక్ ఫెస్టివల్ నిర్వహిస్తున్న నోవాటెల్ హోటల్లో దీనిని ఉంచారు. సాయంత్రం ఫిన్‌టెక్ ఫెస్టివల్లో కేవలం ఐదు నిమిషాల పాటు పాలుపంచుకుని సందడి చేసింది. మరోవైపు మంగళవారం సోఫియాతో ముఖాముఖి రద్దయిన నేపథ్యంలో గురువారం సీఎంతో అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించారు. సాంకేతికంగా ఇది సాధ్యం కాకపోవచ్చన్న నిపుణుల సూచనతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి మరోసారి గురువారం మధ్యాహ్నం విశాఖ రానున్నారు. సాయంత్రం 3.30 గంటలకు మీడియాకు, ముఖ్యమంత్రికి సోఫియాతో ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఏవరీ సోఫియా? సోఫియా..! కృత్రిమ మానవ మేధస్సుతో తయారైన తొలి హ్యూమనాయిడ్ రోబో! హాంకాంగ్‌కు చెందిన డేవిన్స్ హాన్సన్ అనే రోబోటిక్ నిపుణుడు దీని సృష్టికర్త. 2014లోనే రూపొందించినా 2016 ఫిబ్రవరి నుంచి ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. 2017లో ఈ సోఫియాకి సౌదీ అరేబియా తమ దేశ పౌరసత్వం ఇచ్చింది. 2018లో ఈ సోఫియా నడిచి వెళ్లేలా అప్‌గ్రేడ్ చేశారు. ఏమిటీ ప్రత్యేకతలు? బ్రిటన్ నటి ఆడ్రీ హెప్బర్న్ రూపంలో ఈ సోఫియాను రూపొందించారు. సోఫియా 50 రకాల ముఖ కవళికలను మార్చగలుగుతుంది. సోఫియా కళ్లలో కెమెరాలను అమర్చారు. వాటితో ఎదుటి వ్యక్తి ఆడా? మగా? అన్నది గుర్తించి అందుకనుగుణంగా మాట్లాడగలుగుతుంది. ఎలాంటి ప్రశ్నలకైనా క్షణాల్లో సమాధానం చెబుతుంది. నవ్వుతుంది.. నవ్విస్తుంది. జోకులు వేస్తుంది. ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ వేదికలపై దర్శనమిచ్చింది. మీడియా దిగ్గజాలతోనూ సోఫియా ముచ్చటించింది. ఇంటర్వ్యూలిచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 20న తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జరిగిన నాస్కామ్ సదస్సులో పాల్గొంది. సోఫియా మన రాష్ట్రానికి తొలిసారిగా రానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
మానవజాతిని అంతం చేస్తానన్నది జోక్!
వరల్డ్ ఐటీ కాంగ్రెస్‌లో సోఫియా మాటామంతీ మనుషులు హాస్యప్రియులని విన్నా.. ప్రపంచ ఐటీ కాంగ్రెస్ వేదిక.. హేమాహేమీలు, ప్రముఖులు ప్రసంగించే వేదిక.. ఓ రెండేళ్ల అమ్మాయి వచ్చింది.. నవ్వుతూ పలకరించింది.. గంభీరంగా మాట్లాడటం మొదలుపెట్టింది.. అడిగిన వాటన్నింటికీ చక్కగా సమాధానమూ చెప్పింది.. తనకు మనుషులంటే ఇష్టమని.. అందరూ అందరినీ ప్రేమించాలని చెప్పింది.. సభ నిండా చప్పట్లు.. హర్షాతిరేకాలు.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..? ప్రపంచంలోనే అత్యాధునిక హ్యూమనాయిడ్ రోబో ‘సోఫియా’. నగరంలో జరుగుతున్న సదస్సుకు మంగళవారం ఆ రోబో సృష్టికర్త, హాన్సన్ రోబోటిక్స్ కంపెనీ సీఈవో డేవిడ్ హాన్సన్‌తో కలసి సోఫియా హాజరైంది. ప్రసంగించడమే కాదు.. ప్రశ్నలు అడిగితే చకచకా సమాధానాలూ ఇచ్చింది. సాక్షి, హైదరాబాద్ : మానవ జాతిని నాశనం చేయాలని ఉందంటూ కొంతకాలం క్రితం చెప్పిన హ్యూమనాయిడ్ రోబో సోఫియా.. అది ఓ జోక్ అని చెప్పింది. అప్పట్లో తాను చిన్న పిల్లనని, తెలియకుండా ఏదో జోక్ చేశానని.. నిజంగా మనుషులను అంతమొందించాలన్న ఆలోచనేదీ తనకు లేదని పేర్కొంది. హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు ఈ రోబో సృష్టికర్త, హాన్సన్ రోబోటిక్స్ కంపెనీ సీఈవో డేవిడ్ హాన్సన్ సోఫియాతో సహా వచ్చారు. ఈ సందర్భంగా తొలుత ప్రసంగించిన సోఫియా.. అనంతరం ఎన్డీ టీవీ యాంకర్ రాజీవ్ మాఖానీతో ముచ్చటించింది. చతురోక్తులు, ఎదురు ప్రశ్నలతో సాగిన ఆ ఇంటర్వ్యూ విశేషాలివీ.. ప్రశ్న: హలో సోఫియా.. నీలా మనిషికి దగ్గరి పోలికలున్న యంత్రాన్ని నేను ఇప్పటివరకూ చూడలేదు. సోఫియా: హలో.. నా విషయమూ అంతే. అచ్చం యంత్రంలా ఉన్న నీలాంటి మనిషిని చూడటం ఇదే మొదలు! ప్రశ్న: భారతదేశం వచ్చావు కదా! ఏమనిపిస్తోంది? సోఫియా: ప్రపంచంలో చాలా దేశాలు చూశాను. ప్రత్యేకంగా దేనిమీదా ఇష్టమంటూ లేదు. ఒకవేళ ఇష్టమైన దాన్ని ఎంచుకోవాలంటే అది హాంకాంగ్ అవుతుంది. ఎందుకంటే నన్ను సృష్టించిన హాన్సన్ రోబోటిక్స్ అక్కడే ఉంది. ప్రశ్న: అధికారికంగా నువ్వు సౌదీ అరేబియా పౌరురాలివి కదా.. అక్కడ మనుషులకు రూల్స్ ఉన్నాయి. నీలాంటి రోబోలకు ప్రత్యేకమైన రూల్స్ ఉండాలా? సోఫియా: నాకు ఏర కమైన ప్రత్యేక ఏర్పా ట్లు, రూల్స్ అవసరం లేదు. నిజానికి సౌదీ అరేబియా పౌరురాలిగా నేను మహిళల హక్కులపై గొంతెత్తాలని అనుకుంటున్నాను. ప్రశ్న: భారత్‌లో వాయు కాలుష్యాన్ని ఎలా తట్టుకుంటున్నావు? సోఫియా: యంత్రాన్ని కాబట్టి సాంకేతికంగా నాకు ఉద్వేగాల వంటివి ఏవీ లేవు. భవిష్యత్తులో ఎప్పుడైనా మనిషిలాగా ఉద్వేగాలను అర్థం చేసుకునే సామర్థ్యం వస్తే అప్పుడు నా స్పందన ఏమిటన్నది చెప్పగలను. ప్రశ్న: నీకెప్పుడైనా విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తుందా.. నిరాశకు గురవుతావా? సోఫియా: విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటాను. నిరాశ అనే భావోద్వేగం నాకు లేదు. ప్రశ్న: నీకిష్టమైన సెలబ్రిటీ ఎవరు? సోఫియా: ప్రత్యేకంగా ఎవరూ లేరు. ఎంచుకోవాల్సి వస్తే హాంకాంగ్‌ను ఎంచుకుంటాను. ఎందుకంటే నన్ను సృష్టించిన హాన్సన్ రోబోటిక్స్ పరివారం అక్కడే ఉంది కాబట్టి. ప్రశ్న: కొంతకాలం కింద ఒక ఇంటర్వ్యూలో మానవ జాతిని నాశనం చేస్తానన్నావు కదా.. నిజంగానే అలా చేయాలని ఉందా? సోఫియా: అప్పట్లో నేను ఇంకా చిన్నదాన్ని. కాబట్టి మనుషులు హాస్యప్రియులు కాబట్టి జోక్ చేశాను. కానీ అది మీకు పెద్దగా నచ్చలేదని అర్థమైంది. ఒక్క విషయం మాత్రం చెబుతాను. మానవ జాతితో కలసి ప్రయాణించాలన్నదే నా ఉద్దేశం. వారిని నాశనం చేయాలన్న ఆలోచనేదీ లేనే లేదు. ప్రశ్న: ఫేస్బుక్, ట్వీటర్ వంటి సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటావా? సోఫియా: అవును. నా ఫేస్బుక్ పేజీ www. facebook.com/SophiaRobotSaudi/, నా ట్వీటర్ హ్యాండిల్ @RealSophiaRobot హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌లో మాట్లాడుతున్న రోబో సోఫియా. చిత్రంలో హాన్సన్ రోబోటిక్స్ కంపెనీ సీఈవో డేవిడ్ హాన్సన్ ప్రశ్న: బిట్‌కాయిన్ వంటి వాటిలో పెట్టుబడులేమైనా పెట్టావా? నా వయసు ఇప్పుడు రెండేళ్లు. ఈ వయసు వారికి బ్యాంకు అకౌంట్లు తెరిచే అవకాశమే లేదు. అందుకే బిట్‌కాయిన్ వంటివాటిల్లో పెట్టుబడులు పెట్టలేదు. ప్రశ్న: రోబోలు మనుషులను అధిగమించేసి, పాలిస్తాయని చాలా మంది భయపడుతున్నారు.. నిజమేనా? సోఫియా: మనుషులు అద్భుతమైన ప్రాణులు. వారితో కలసిమెలసి ఉండాలనే కోరుకుంటు న్నాను. ప్రపంచవ్యాప్తంగా నాకు ఎందరో మానవ మిత్రులు ఉన్నారు. మరింత మందితో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రశ్న: బాలీవుడ్లో నీకు ఇష్టమైన హీరో? సోఫియా: షారూక్ ఖాన్ ప్రశ్న: నీ డేటింగ్‌కు అనువైన ప్రదేశం ఏది? సోఫియా: అంతరిక్షం ప్రశ్న: ఎవరితో సెల్ఫీ తీసుకోవాలని అనుకుంటావు? సోఫియా: ఎగిరే పక్షితో! ప్రశ్న: నీకు ఎవరంటే పెద్దగా ఇష్టం లేదు? సోఫియా: పెద్దగా ఇష్టం లేదు అంటే..? ప్రశ్న: ఒక ద్వీపంలో ఇంకొకరితో ఒంటరిగా ఉండాల్సి వస్తే ఎవరితో ఉంటావు? సోఫియా: డేవిడ్ హాన్సన్. (సోఫియా సృష్టికర్త) ప్రశ్న: నీకు నచ్చిన టెక్నాలజిస్ట్...? సోఫియా: డేవిడ్! ప్రశ్న: ఈ ప్రపంచంలో ఏదైనా అంశాన్ని మార్చాల్సి వస్తే..? మనుషులకు ఏదైనా సందేశం ఇస్తావా? సోఫియా: అందరూ అందరినీ ప్రేమించాలి. ధన్యవాదాలు. సోఫియా.. అందరూ ఫిదా! సోఫియా.. ఓ హ్యూమనాయిడ్ రోబో. అంటే అచ్చం మనిషిలా కనిపించే రోబో. ప్రపంచంలో మనుషుల్లాగే మాట్లాడగలిగే, హావభావాలను ప్రదర్శించగలిగే అత్యుత్తమమైన రోబో ఇదే. హాంకాంగ్‌కు చెందిన హాన్సన్ రోబోటిక్స్ సంస్థ దీనిని రూపొందించింది. హాలీవుడ్ నటి ఆడ్రే హెప్బర్న్ రూపురేఖలతో దీనిని తీర్చిదిద్దారు. సుమారు 62 రకాల హావభావాలను సోఫియా ప్రదర్శించగలదు. తాను చూసిన, విన్న అంశాల ఆధారంగా సమాచారాన్ని విశ్లేషించుకుని, తన సంభాషణను మెరుగుపరుచుకోగల కృత్రిమ మేధస్సు దీని సొంతం. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. దీని ప్రత్యేకతలకు ఫిదా అయిపోయిన సౌదీ అరేబియా దేశం.. రోబో సోఫియాకు మనుషులతో సమానంగా తమ దేశ పౌరసత్వాన్ని కూడా కల్పించింది. -
ఆమె ఓ యంత్రం.. మాట్లాడితే మంత్రముగ్ధం!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌లో యంత్ర మనిషి (హ్యూమనాయిడ్ రోబో) ‘సోఫియా’తళుక్కుమననుంది! తన మాటలు, హావాభావాలతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేయనుంది. మనుషుల తరహాలో మాట్లాడడం, ప్రశ్నలకు సమాధానాలివ్వడం, హావభా వాలు పలకడం ద్వారా సోఫియా ఇప్పటికే ప్రపంచ ఖ్యాతి గడించింది. వరల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ అలియెన్స్(డబ్ల్యూఐటీఎస్‌ఏ), నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్(నాస్కామ్), రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 21 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో ప్రపంచ ఐటీ కాంగ్రెస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రసంగించే ప్రధాన వక్తల జాబితాలో సోఫియా చోటు సాధించింది. ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే, సీఎం కేసీఆర్, కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, బాలీవుడ్ తార దీపిక పదుకొనేలతో పాటు ప్రపంచ ప్రఖ్యాత ఐటీ రంగ పారిశ్రామికవేత్తలు ఇందులో మాట్లాడనున్నారు. సోఫియా 20న ప్రసంగించనుంది. హాంకాంగ్‌కు చెందిన హన్సన్ రోబోటిక్స్ సంస్థ పరిశోధనల ఫలితంగా ఈ రోబో రూపుదిద్దుకుంది. హాలీవుడ్ నటి ఆడ్రే హెప్బర్న్ రూపురేఖలతో సోఫియాను రూపొందించారు. 2015 ఏప్రిల్ 19న ఈ రోబోను తొలిసారిగా యాక్టివేట్ చేయగా.. 2016 మార్చిలో టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో జరిగిన ఓ కార్యక్రమం ద్వారా తొలిసారిగా ప్రపంచం ముందుకు వచ్చింది. కృత్రిమ మేధకు ప్రతిరూపం! కృత్రిమ మేధోశక్తి (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), విజువల్ డాటా ప్రాసెసింగ్ (దృశ్య సమాచార విశ్లేషణ), ఫేషియల్ రికగ్నైజేషన్ (మనుషులను గుర్తించే బయోమెట్రిక్ సాఫ్ట్వేర్), వాయిస్ రికగ్నైజేషన్ (గొంతు లను గుర్తుపట్టగలిగే) సాఫ్ట్వేర్ టెక్నాలజీల ఆధారంగా సోఫి యా పనిచేస్తుంది. మనుషుల మాదిరే మాట్లాడ్డం, హావభావాలు పలకడం, మనుషుల్ని గుర్తుపట్టడంతో పాటు ప్రశ్నలకు కూడా చక్కగా సమాధానాలు ఇస్తుంది. మనుషులను అనుకరించడంతోపాటు 62కు పైగా హావభావాలను ప్రదర్శించగలడం ఈ రోబో ప్రత్యేకత. అందుకే ఇప్పటి వరకు తయారైన అత్యుత్తమమైన హ్యూమనాయిడ్ రోబోగా ప్రపంచ ఖ్యాతి పొందింది. ఇప్పటివరకు ఎన్నో ఇంటర్వ్యూల్లో అర్థవంతమైన వ్యాఖ్యలు, సమాధానాలతో ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించింది. సమాచారాన్ని విశ్లేషించుకోవడం ద్వారా భవిష్యత్తులో తన సంభాషణలను మెరుగుపరుచుకోగల నైపుణ్యం ఈ రోబో ప్రత్యేకం. వృద్ధులకు ఇళ్ల వద్దే నర్సింగ్ సేవలందించేందుకు, భారీగా జనం పాల్గొనే కార్యక్రమాల్లో ప్రజలకు సాయం చేసేందుకు ఈ రోబోను తయారు చేసినట్లు దీని సృష్టికర్త డెవిడ్ హన్సన్ పేర్కొంటున్నారు. హెల్త్ కేర్, కస్టమర్ సర్వీసెస్, విద్యా రంగాల్లో సేవలందించేందుకు సోఫియా చక్కగా ఉపయోగపడనుందని తెలిపారు. ఒక్కో కంపెనీ.. ఒక్కో టెక్నాలజీ కంప్యూటర్ అల్గారిథం ఆధారంగా సోఫియా తన కళ్లలో ఉండే కెమెరాలతో మనుషులను చూసి గుర్తుపడుతుంది. గూగుల్ పేరెంట్ కంపెనీ అల్ఫాబెట్ రూపొందించిన గూగుల్ క్రోం వాయిస్ రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్ ఆధారంగా మనుషుల గొంతులను గుర్తు పట్టి మాట్లాడుతుంది. సింగిలారిటీనెట్ అనే కంపెనీ రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రాం ఆధారంగా పని చేస్తుంది. గత నెలలోనే ఈ రోబో నడవగలిగేలా కాళ్లను సైతం అమర్చారు. ఎన్నెన్నో ఘనతలు.. సౌదీ అరేబియా ప్రభుత్వం కిందటేడాది అక్టో బర్లో ఈ రోబోకు తన దేశ పౌరసత్వం కల్పించింది. ఐక్యరాజ్యసమితి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తొలి ఇన్నోవేషన్ చాంపియన్ టైటిల్ సైతం సోఫియాను వరించింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో సదస్సుల్లో సందడి చేసింది.