టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో బోస్టన్ డైనమిక్స్ తన నెక్స్ట్ జనరేషన్ 'హ్యూమనాయిడ్ అట్లాస్ రోబో'ను ఆవిష్కరించింది. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్.. అంతే కాకుండా ఇది మునుపటి మోడల్స్ కంటే కూడా ఎన్నో అప్డేట్స్ పొందింది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.
వీడియోలో గమనించినట్లయితే.. అట్లాస్ రోబోట్ పైకి లేయడం, ముందుకు వెనుకకు కదలటం కూడా చూడవచ్చు. ఇది ఇప్పటికి తయారైన దాదాపు అన్ని రోబోట్స్ కంటే భిన్నంగా ఉంది. మొండెం మీద ఒక ప్లేట్ ఉంది. సన్నగా ఉండే మొండెం భాగం.. తలపై రింగ్ లైట్ వంటివి ఉన్నాయి.
ఈ అట్లాస్ రోబోట్ తన శరీరాన్ని సైన్స్ ఫిక్షన్ హారర్ మూవీలోని ఓ జీవి మాదిరిగా నడుమును 180 డిగ్రీలు మెలితిప్పి పైకి లేస్తుంది. తలను కూడా పూర్తిగా తిప్పుతుంది. చురుగ్గా ముందుకు వెళ్లడం, వెనక్కు రావడం కూడా వీడియోలో గమనించవచ్చు. ప్రస్తుతం ఈ రోబోట్ టెస్టింగ్ దశలోనే ఉంది. రాబోయే రోజుల్లో పూర్తిగా సిద్దమవుతుంది.
ఈ హ్యుమానాయిడ్ అట్లాస్ రోబోట్ పూర్తిగా తయారైన తరువాత వివిధ పనుల్లో ఉపయోగించనున్నట్లు సమాచారం. అయితే ఇలాంటి రోబోట్స్ కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి కొంతమంది కస్టమర్లకు మాత్రమే దీనిని అందించే అవకాశం ఉంది. ఈ వరుసలో హ్యుందాయ్ మొదటి స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment