మనిషిలా ప్రాణం లేకున్నా.. భావోద్వేగాలు పండించడం ఎలాగబ్బా అనుకుంటున్నారా? రజినీకాంత్ రోబో సినిమా తెలుసు కదా! అచ్చం అలానే. నికోలా మనిషి కాదు.. ఆండ్రాయిడ్ కిడ్. ఆండ్రాయిడ్స్(రోబోలను) మనుషులతో ఎమోషనల్‌గా కనెక్ట్ చేయాలన్న ప్రయత్నాలు కొత్తేం కాదు. రియల్ లైఫ్ సిచ్యుయేషన్స్‌లో ప్రత్యేకించి.. వయసు మళ్లిన వాళ్లను చూస్కోవడానికి, ఒంటరి జీవుల బాగోగుల కోసం పనికి వస్తాయని అనుకుంటున్నారు.
అదే సమయంలో కోపం, అసహనం లాంటివి విపరీతాలకు దారి తీసే అవకాశమూ లేకపోలేదన్న ఆందోళన వ్యక్తం అవుతోంది కూడా. ఇదిలా ఉంటే నికోలా అనే ఆండ్రాయిడ్ కిడ్ గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.
నికోలా.. మనిషి కాదు. ఆండ్రాయిడ్ కిడ్. జపాన్ రీసెర్చర్లు రైకెన్ గార్డియన్ రోబో ప్రాజెక్టులో భాగంగా ఈ బచ్చా రోబోను రూపొందించారు. ఈ ఎక్స్‌ప్రెసివ్ హ్యూమనాయిడ్ రోబో ఆరు రకాల ఎమోషన్స్‌ను ప్రదర్శిస్తుంది. సంతోషం, బాధ, భయం, కోపం, ఆశ్చర్యం, అసహ్యం. Nikola ఈ ఎమోషన్స్‌ను అర్టిఫిషియల్ కండరాల కదలిక వల్ల.. భావోద్వేగాల్ని పండించగలుగుతుంది.
సోషల్ సైకాలజీ, సోషల్ న్యూరోసైన్స్ పరిశోధనలకు నికోలా లాంటి రోబోలు అంశాలుగా పనికొస్తాయని రీసెర్చర్లు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నికోలాకు ఇంకా బాడీ సిద్ధం కాలేదు. త్వరలో సిద్ధం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అదే జరిగితే.. ఎక్స్‌ప్రెషన్స్ రోబో కిడ్‌గా నికోలా తొలి ఘనత సాధించినట్లవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment