Researchers
-
తక్కువ ఖర్చుతో...పంటభూమిలో విషానికి బ్యాక్టీరియాతో చెక్
రసాయనిక వ్యవసాయం వల్ల కాలుష్య కాసారంగా మారిపోయిన వ్యవసాయ భూములను తక్కువ ఖర్చుతో, సులభంగా, సమర్థవంతంగా శుద్ధి చేసే కొన్ని జాతుల సూక్ష్మజీవుల మిశ్రమాన్ని ముంబై ఐఐటి పరిశోధకులు కనుగొన్నారు. రసాయనిక పురుగుమందుల వల్ల, ఇతరత్రా కాలుష్య కారకాల వల్ల పంట భూములు నాశనమవుతున్న సంగతి తెలిసిందే.విషతుల్య కాలుష్య కారకాలను హరించటంతో పాటు నేలలో ఉన్నప్పటికీ మొక్కలకు అందుబాటులో లేని పోషకాలను అందుబాటులోకి తేవటం ద్వారా పనిలో పనిగా పంట దిగుబడిని కూడా పెంపొందించడానికి ఈ ‘బ్యాక్టీరియా కాక్టెయిల్’ ఉపయోగపడుతున్నదని ముంబై ఐఐటి పరిశోధకులు ప్రకటించారు. ముంబై ఐఐటిలో బయోసైన్సెస్, బయోఇంజినీరింగ్ విభాగం అధిపతి ప్రొఫెసర్ ప్రశాంత్ ఫలే మార్గ దర్శకత్వంలో సందేశ్ పపడే ఈ పరిశోధన చేశారు. మట్టిలోని విషాలను విచ్చిన్నం చేసి తీసివేయటంతో పాటు ఈ బ్యాక్టీరియా అధికోత్పత్తికి దోహదం చేసే గ్రోత్ హార్మోన్ల పెరుగుదలకు ఊతం ఇస్తున్నాయని, అదేసమయంలో హానికారక శిలీంధ్రాలను అరికడుతున్నాయని, తద్వారా పోషకాల లభ్యత పెరుగుతోందని గుర్తించారు. రసాయనిక పురుగుమందులు, తెగుళ్ల మందుల వాడకాన్ని తగ్గించటానికి.. నేలల ఆరోగ్యం, ఉత్పాదకశక్తిని పెంపొందించడానికి ఉపయోడపడుతోందని ప్రొఫెసర్ ప్రశాంత్ ఫలే వెల్లడించారు. రసాయనిక పురుగుమందులు, తెగుళ్ల మందులలోని బెంజీన్ వంటి ఆరోమాటిక్ కాంపౌండ్స్ వల్ల నేలలు కలుషితం కావటం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. ఈ సమ్మేళనాలు విషతుల్యమైనవి. విత్తనం మొలక శాతాన్ని ఇవి తగ్గిస్తాయి. పంట మొక్కల ఎదుగుదలకు, దిగుబడికి ప్రతిబంధకంగా మారుతున్నాయి. ధాన్యాలు, గింజల్లో, మొక్క భాగాల్లో ఈ విషతుల్యమైన సమ్మేళనాలు చేరి΄ోతాయి. కార్బారిల్, నాఫ్తలిన్, బెంజోయేట్, 2,4–డ్రైక్లోరోఫెనాక్సియేసెటిక్ ఆసిడ్, థాలేట్స్‌ను పురుగుమందుల్లో విస్తృతంగా వాడుతున్నారు. సౌందర్యసాధనాలు, దుస్తులు, నిర్మాణ రంగం, ఆహార రంగంలో వాడే ప్రిజర్వేటివ్స్, అద్దకం, పెట్రోలియం, ప్లాస్టిక్ ఉత్పత్తి రంగాల్లో కూడా ఈ విషతుల్యమైన సమ్మేళనాలను వాడుతున్నారు. వీటి వల్ల మట్టి, నీరు, గాలి కలుషితం అవుతున్నాయి. అయితే, ఈ కలుషితాలను తొలగించడానికి ప్రస్తుతం అనుసరిస్తున్న రసాయనిక పద్ధతి లేదా కలుషితమైన మట్టిని తొలగించటం వంటి పద్ధతులు అధిక ఖర్చుతో కూడినవే కాక సమస్యను సమూలంగా పరిష్కరించకుండా తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే కలిగిస్తున్నాయి. ఈ దృష్ట్యా సమస్యాత్మక నేలలను శుద్ధి చేసుకోవటానికి ఐఐటి ముంబై పరిశోధకుల కృషి తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.సహజ పద్ధతిలో శుద్ధిఘాటైన వాసనలతో కూడిన రసాయనిక విషపదార్థాలను చక్కగా విచ్ఛిన్నం చేయటానికి సూడోమోనాస్, అసినెటోబాక్టర్ తదితర జాతుల బ్యాక్టీరియా ఉపయోగపడుతున్నట్లు గుర్తించారు. ఇవి విషతుల్య సమ్మేళనాలను తిని.. హానికరం కాని, విషరహిత సమ్మేళనాలుగా మార్చుతున్నాయి. ఆ క్రమంలో కలుషిత∙పర్యావరణాన్ని ఇవి సహజంగా శుద్ధి చేస్తున్నాయని ఫలే వ్యాఖ్యానించారు.పెరిగిన పోషకాల లభ్యత ఫాస్ఫరస్, పొటాషియం వంటి నీట కరగని స్థూల పోషకాలను ఈ బ్యాక్టీరియా నీట కరిగేలా చేస్తుంది. తద్వారా పంట మొక్కల వేర్లు అదనపు పోషకాలను పీల్చుకునే అవకాశం కల్పిస్తాయి. నిస్సారమైన భూముల్లో పెరిగే పంట ఐరన్‌ను ఎక్కువగా తీసుకోలేకపోతుంటుంది. ఈ సూక్ష్మజీవులు సైడెరోఫోర్స్ అనే పదార్ధాన్ని విడుదల చేయటం ద్వారా ఐరన్‌ను సరిగ్గా తీసుకునేలా చేస్తాయి. అంతేకాకుండా ఇండోల్ అసెటిక్ ఆసిడ్ (ఐఎఎ) అనే గ్రోత్ హార్మోన్‌ను ఈ బ్యాక్టీరియా విడుదల చేసి దిగుబడిని పెంచుతుంది. ఇంకా ప్రొఫెసర్ ఫలే ఇలా అన్నారు.. ‘సూడోమోనాస్, అసెనెటోబాక్టర్ జెనెరకు చెందిన అనేక జాతుల సూక్ష్మజీవుల మిశ్రమాన్ని వాడిన తర్వాత గోధుమ, పెసర పాలకూర, మెంతికూర తదితర పంటల దిగుబడి 40–45% వరకు పెరిగింది. మట్టిలో రసాయనాలను కొన్ని రకాల బ్యాక్టీరియా విచ్ఛిన్నం చేస్తుంటే, మరికొన్ని సూక్ష్మజీవులు మొక్కల పెరుగుదలను పెంపొందించే హార్మోన్ ఉత్పత్తికి, చీడపీడల బెడద నుంచి దీటుగా తట్టుకునేందుకు ఉపయోగపడుతున్నాయని, కలసికట్టుగా పనిచేస్తే కలిగే ప్రయోజనం ఇదే అన్నారు ప్రొ. ఫలే. -
భారత పరిశోధనా రంగంలో కొత్త అధ్యాయం
భారతదేశ పరిశోధనా రంగంలో ఒక కొత్త అధ్యాయం ‘నూతన విద్యా విధానం– 2020’. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రకారం భారతదేశంలోని విద్యా, పరిశోధన రంగాలను బలోపేతం చేయడానికి ఇది కృషి చేస్తుంది. ఈ దిశలోనే ‘వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్’ (ఓఎన్ఓఎస్) పథకం ఒక ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు. భారతదేశ పరిశోధనా రంగాన్ని బలోపేతం చేయడంలో నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 కీలక పాత్ర పోషిస్తోంది. ఈ దిశలో, అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఏఎన్ఆర్ఎఫ్) ఆధ్వర్యంలో ప్రారంభించబడిన ఓఎన్ఓఎస్ దేశవ్యాప్తంగా విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులకు నాణ్యమైన శాస్త్రీయ సమాచారాన్ని అందించే దిశగా పనిచేస్తోంది.భారతీయ విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులకు అంతర్జాతీయ స్థాయి పత్రికలను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇవ్వడం ద్వారా పరిశోధన ప్రమాణాలను మెరుగుపరుస్తోంది. ‘ఆత్మనిర్భర భారత్’ కల సాకారం కావడానికి అవసరమైన దేశీయ పరిశోధనలకు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. దేశంలోని అట్టడుగు స్థాయి విద్యా సంస్థ నుండి ఉన్నత స్థాయి విద్యా సంస్థ వరకు సమాచారాన్ని సమానంగా అందిస్తుంది. ఓఎన్ఓఎస్ కింద 2025 జనవరి 1 నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ జర్నల్స్‌లో ప్రచు రితమైన పరిశోధనా పత్రాలను మన విద్యార్థులు, పరిశోధకులూ పొందనున్నారు. మొదటి దశ కింద 13,400 కంటే ఎక్కువ అంతర్జాతీయ పత్రికలు అందుబాటులో ఉంటాయి. ఈ పథకం కింద, 451 రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, 4,864 కళాశాలలు; అలాగే జాతీయ ప్రాముఖ్యం కలిగిన 172 సంస్థలూ, 6,380 ఉన్నత విద్య, పరిశోధనా సంస్థలూ వీటిని ఉపయోగించుకోనున్నాయి. ఇవి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పబ్లిషర్స్ (ఎల్సెవియర్, స్ప్రింగర్ నేచర్, వైలి తదితర)తో సహా 30 ప్రచురణ సంస్థలు ప్రచురించే అగ్ర జర్నల్స్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాబోయే మూడేళ్లపాటు ఇలా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది.రెండవ, మూడవ దశల్లో ప్రభుత్వ–ప్రైవేట్ నమూనా ద్వారా చొరవను ప్రైవేట్ విద్యా సంస్థలకు విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మూడవ దశలో పబ్లిక్ లైబ్రరీలలో ఏర్పాటు చేసిన యాక్సెస్ పాయింట్ల ద్వారా అంతర్జాతీయ పత్రికలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.మూడు సంవత్సరాల కాలానికి 6,000 కోట్ల రూపాయల వ్యయంతో ఈ కార్యక్రమం సెంట్రల్ సెక్టార్ స్కీమ్‌గా ప్రారంభించబడుతుంది. ప్రపంచంలో జర్మనీ, చెకోస్లోవేకియా వంటి దేశాల్లో ఇప్పటికే ఇటువంటి వ్యవస్థ దిగ్విజయంగా నడుస్తోంది. ఈ పథకం పరిశోధనలు కేంద్రీకృతం కాకుండా అన్ని రాష్ట్రాలలో, అన్ని పరిశోధనా సంస్థలలో, రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయాల్లో ఆవిష్కరణాత్మక పరిశో ధనలను ప్రోత్సహిస్తుంది. పట్టణ – గ్రామీణ పరిశోధనా సంస్థల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గిస్తుంది. అయితే ఈ పథకం అమలులో పలు సవాళ్ళూ ఎదురు కానున్నాయి. ప్రధానంగా, అంతర్జాతీయ పత్రికల చందా ఖర్చులు సంవత్సరానికొకసారి పెరుగుతుండడం కీలక సమస్య. రూ. 6,000 కోట్ల భారీ బడ్జెట్ ఉన్నప్పటికీ, అన్ని ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయి విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థల అవస రాలను తీర్చడం సవాలుగా మారవచ్చు. అలాగే సంపాదకీయ హక్కులు, మేధా సంపత్తి సమస్యలు ముందుకు రావచ్చు. ఈ తరహా అంత ర్జాతీయ ఒప్పందాలు చాలాసార్లు సాంకేతికత, భాష, మరియు అవసరాల ఆధారంగా వివిధ సంస్థలకు అసమాన అనుభవాలను కలిగించ వచ్చు. అనేక స్థాయుల్లో సమాచార కొరత వల్ల పథకం గురించి అవగాహన లేని పరిస్థితి తలెత్తవచ్చు. ప్రత్యేకించి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోవసతుల కొరత వల్ల వనరులను పూర్తిగా ఉపయోగించుకోలేని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. మొత్తం మీద వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ పథకం భారతదేశంలోని విద్య– పరిశోధన రంగాలకు ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. ఈ పథకం ద్వారా భారతదేశం త్వరలోనే ప్రపంచంలోనే అగ్ర పరిశోధనా కేంద్రంగా మారే అవకాశం ఉంది. డా‘‘ రవి కుమార్ చేగోని వ్యాసకర్త తెలంగాణ గ్రంథాలయ సంఘం ప్రధాన కార్యదర్శి -
ప్రపంచంలో తొలి వర్ణమాల ఇదే!
సిరియాలో పురాతత్వ శాస్త్రవేత్తల తవ్వకాల్లో కొత్త వర్ణమాల వెలుగులోకి వచ్చింది. దాదాపు 4,400 సంవత్సరాల క్రితం ఈ లిపిని వినియోగించి ఉంటారని జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాల పరిశోధకుల బృందం ప్రకటించింది. క్రీస్తుపూర్వం 2,400 సంవత్సరంలో పశ్చిమ సిరియాలోని ప్రాచీన పట్టణ ప్రాంతం టెల్ ఉమ్–ఎల్ మర్రా వద్ద జరిపిన తవ్వకాల్లో చేతి వేళ్ల ఆకృతిలో ఉన్న చిన్న మట్టి వస్తువులపై ఈ వర్ణమాలను గుర్తించారు. ఒక సమాధిని తవ్వితీయగా ఇవి లభించాయని చెబుతున్నారు. ఇన్నాళ్లూ నిర్ధారించిన దాని కంటే ఈ లిపి మరో 500 ఏళ్ల క్రితంనాటిదని అంచనావేస్తున్నారు. ఆమ్స్టర్ డ్యామ్ విశ్వవిద్యాలయంతో కలిసి సంయుక్తంగా జాన్ హాప్కిన్స్ వర్సిటీలో పురాతత్వవేత్త, ప్రొఫెసర్ గ్లెన్ స్వార్జ్ నేతృత్వంలో ఈ తవ్వకాలు జరిగాయి. ఈ ప్రాంతంలో 16 ఏళ్ల క్రితమే తొలిసారిగా తవ్వకాలు జరిగాయి. తొలి కంచు యుగంనాటి ఈ సమాధిలో ఆరు అస్తిపంజరాలు, బంగారు, వెండి ఆభరణాలు, వంట పాత్రలు, ఒక బాణం, మృణ్యయ పాత్రలను కనుగొన్నారు. తొలి తరం నాగరికతలు తమలో తాము సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు కొత్త తరహాలో అనుసంధాన విధానాలను అనుసరించేవని ఈ మట్టి వస్తువులపై ఉన్న రాతలను బట్టి అర్థమవుతోందని పరిశోధకులు చెప్పారు. ‘‘ నాటి సమాజాల్లో రాజరికం, అత్యున్నత స్థాయి వర్గాలే కాదు సామాన్యులూ వర్ణమాల ద్వారా రాయగలిగే సామర్థ్యాలను సంతరించుకునే ప్రయత్నాలు చేశారనడానికి ఇవి ప్రబల నిదర్శనాలు’’ అని స్వార్జ్ అన్నారు. ‘‘ వీటిపై ఉన్న లిపి లాంటి అక్షరాలను చూస్తుంటే వేర్వేరు పాత్రల్లో ఏమేం నిల్వచేశారో తెలిసేందుకు ఒక్కో పాత్రపై ‘లేబుల్’లాగా ఈ లిపిని వాడి ఉంటారని అర్థమవుతోంది. ఈ అక్షరాలను మనం తర్జుమా చేయకుండా అసలు ఇవేంటో ఒక నిర్ధారణకు రావడం చాలా కష్టం. కార్భన్–14 డేటింగ్ ద్వారా తెలిసిందేమంటే ఈ రాతలు చరిత్రలో ఇప్పటిదాకా కనుగొన్న వర్ణమాల కంటే పురాతనమైనవని తేలింది. క్రీస్తుపూర్వం 1900 సమీపకాలంలో ఈజిప్ట్, పరిసర ప్రాంతాల్లో తొలిసారిగా వర్ణమాల రూపొందినట్టు ఇన్నాళ్లూ భావించాం. కానీ సిరియాలో వెలుగుచూసిన అక్షరాలను చూస్తుంటే ఎన్నడూ ఊహించని ప్రదేశాల్లోనూ వర్ణమాలకు మూలాలున్నాయని అర్థమవుతోంది’’ అని స్వార్జ్ వ్యాఖ్యానించారు. నవంబర్ 21న జరిగిన అమెరికన్ సొసైటీ ఆఫ్ ఓవర్సీస్ రీసెర్చ్ వార్షిక సమావేశంలో స్వార్జ్ తన పరిశోధన వివరాలను బహిర్గతంచేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మెప్పించలేకపోతున్న ఏఐ.. పరిశోధనలో కీలక విషయాలు
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వినియోగం ఎక్కువవుతోంది. అన్ని రంగాల్లో కృత్రిమ మేధస్సు పనిచేస్తోంది. అయితే ఈ టెక్నాలజీ మార్కెటింగ్ రంగం కొంప ముంచుతోందని పలు నివేదికలు సూచిస్తున్నాయి.ఏఐ అనేది నేడు స్మార్ట్‌ఫోన్, గూగుల్, ఇంటర్నెట్లలో కనిపించే సాధారణ పదం అయిపోతోంది. యాడ్స్ విషయంలో కూడా ఏఐ హవా సాగుతోంది. ఇది తమ ఉత్పత్తుల విక్రయాలను పెంచే అవకాశం ఉందని సంస్థలు కూడా భావిస్తున్నాయి. అయితే వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ (WSU) పరిశోధకుల ఒక అధ్యయనంలో షాకింగ్ విషయాలను వెల్లడించారు. ప్రకటనలలో ఏఐ ఉపయోగించడం వల్ల అమ్మకాలు తగ్గే అవకాశం ఉందని వారు స్పష్టంగా వెల్లడించారు.ఏ రంగంలో ఏఐ ఎలా ఉపయోగపడినా.. అమ్మకాల విషయంలో మాత్రం ఇది అంత నమ్మశక్యంగా లేదని చెబుతున్నారు. దీంతో సేల్స్ గణనీయంగా తగ్గుతాయని తెలుస్తోంది. జర్నల్ ఆఫ్ హాస్పిటాలిటీ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ ఈ విషయాలను వెల్లడించింది.ఏఐ క్రియేట్ చేసిన లేబుల్స్ కస్టమర్లను ఎక్కువ ఆకర్శించలేవు. ఏఐ భావోద్వేగాలను తగ్గిస్తుంది. అమ్మకాల్లో ఎమోషన్ చాలా ప్రధానం, ఏఐ అదే విషయాన్ని స్పష్టంగా వ్యక్తపరచలేకపోతోందని డబ్ల్యూఎస్యూ అసిస్టెంట్ ప్రొఫెసర్ మెసూట్ సిసెక్ వెల్లడించారు.కంపెనీలు తమ మార్కెటింగ్‌లో ఏఐను ఎలా ప్రదర్శించాలో జాగ్రత్తగా పరిశీలించాలని అధ్యయనం సూచిస్తుంది. మార్కెటర్లు ఫీచర్లు లేదా ప్రయోజనాలను వివరించడంపై దృష్టి పెట్టాలి. ఏఐ బజ్వర్డ్లను నివారించాలని సిసెక్ సలహా ఇచ్చారు. -
చైనా ల్యాబ్‌లో మరో ప్రాణాంతక వైరస్?
చైనాలోని హెబీ మెడికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఎబోలా తరహాలోని మరో కొత్త వైరస్‌ను సృష్టించారు. ఎబోలా మాదిరిగానే ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది. మనిషిని కేవలం మూడు రోజుల్లోనే చంపేస్తుంది. వ్యాధికారక ప్రభావాలను అధ్యయనం చేసేందుకే శాస్త్రవేత్తులు ఈ వైరస్ సృష్టించారు. అయితే ఇప్పుడు ఈ వైరస్ ప్రయోజనాలు, ప్రమాదాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ వైరస్ స్వభావం సింథటిక్ అని తెలుస్తోంది. ఈ అధ్యయన నివేదిక సైన్స్ డైరెక్ట్‌లో ప్రచురితమయ్యింది.ఎబోలా వైరస్‌ను ఉపయోగించి సృష్టించిన ఈ కొత్త వైరస్‌పై సాగిస్తున్న పరిశోధన వివాదాస్పదంగా మారింది. అయితే ఈ పరిశోధన ఉద్దేశ్యం వివిధ వ్యాధులను నివారించడం, లక్షణాలను పరిశోధించడం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వైరస్ మనిషి శరీరంపై ఎబోలా లాంటి ప్రభావాన్నే చూపుతుంది. పరిశోధకుల బృందం ఎబోలా వైరస్ నుండి గ్లైకోప్రొటీన్ (జీపీ)ని స్వీకరించేందుకు వెసిక్యులర్ స్టోమాటిటిస్ వైరస్ (వీఎస్వీ)ని ఉపయోగించింది.ఈ వైరస్‌ను శాస్త్రవేత్తలు సిరియన్ హామ్స్టర్స్ (జంతు జాతులు) సమూహంపై పరీక్షించారు. వీటిలో ఐదు మగ, ఐదు ఆడ జాతులున్నాయి. ఈ జంతువులకు ఈ వైరస్‌ను ఇంజెక్ట్ చేయగా, వాటిలో ఎబోలా లాంటి లక్షణాలు కనిపించాయి. మూడు రోజుల్లో అవన్నీ మృతి చెందాయి. ఈ వైరస్ ఇంజక్ట్ చేయగానే కొన్ని జంతువుల కళ్లు దెబ్బతిన్నాయి. ఆప్టిక్ నరాలలోపై తీవ్రమైన ప్రభావం కనిపించింది. కాగా 2014- 2016 మధ్య కాలంలో ఆఫ్రికన్ దేశాలలో ఎబోలా వ్యాప్తి చెందింది. దీనివల్ల వేలాది మంది మృత్యువాత పడ్డారు. Scientists in China have engineered a virus using parts of the deadly Ebola to study the disease and its symptoms. A study detailing the experiment at Hebei Medical University has been published in Science Direct. Researchers noted...#China #ChinaSciencehttps://t.co/VoHWxriE2a— chinaspotlight (@chinaspotlight1) May 25, 2024 -
అంత ఎత్తు ఎలా అయ్యాయి?
హిమాలయాలు ప్రపంచంలోనే ఎత్తైన కొండలని అందరికీ తెలుసు. అందులోని ఎవరెస్టు శిఖరం ప్రపంచంలోనే ఎత్తైనదని అందరూ అనుకుంటారు. అది నిజమా, కాదా అన్న చర్చ ఇప్పుడు మనకు అప్రస్తుతం. ఇంతకు హిమాలయాలు అంత ఎత్తుకు ఏ రకంగా ఎదిగాయి అన్న ప్రశ్నకు కూడా చాలా రోజులుగా ఒక జవాబు ఉంది. అదీ నిజమా, కాదా అన్న సంగతి మామూలు మనుషులకే కాదు పరిశోధకులకు కూడా తెలియదు. అయినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సంగతి ఏమిటంటే ఇప్పటివరకు హిమాలయాలు అంత ఎత్తుకు చేరడానికి గల కారణం గురించి తెలిసిన సంగతులు అంతగా నిజం కాదని! భూమి ఉపరితలం టెక్టానిక్ ప్లేట్స్ అనే విడిభాగాల రూపంలో ఉంది. ఆ భాగాలు కదులుతూ ఉంటాయి. అలా కదిలే ఒక భాగం వచ్చి తగిలినందుకు హిమాలయాలు అంత ఎత్తుకు ఎగిశాయని అందరూ అనుకుంటున్నారు. హిమాలయాలలో అన్నిటికంటే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ ప్రస్తుతం 8,849 మీటర్ల ఎత్తు ఉన్నది. కొత్తగా జరిగిన పరిశోధనల ప్రకారం, హిమాలయాలు కానీ, అందులోని ఎవరెస్టు కానీ అంత ఎత్తుకు చేరడానికి టెక్టానిక్ ప్లేట్లు ఒకదాన్ని ఒకటి గుద్దుకోవడం కారణం కానే కాదనీ, అంతకుముందే అవి దాదాపు అంత ఎత్తుగా ఉన్నాయనీ తెలిసింది. ప్లేట్లు గుద్దుకున్నందుకు హిమాలయాల ఎత్తు పెరగడం నిజమే, కానీ అప్పటికే అవి ఎంతో ఎత్తుగా ఉన్నాయి, అందుకు కారణం ఏమిటి అన్నది ఎవరికీ తెలియదంటున్నారు పరిశోధకులు. ఒక ఖండం ముక్క వచ్చి ఇంకొక ఖండం ముక్కకు తగిలితేనే ఇటువంటి మార్పులు కలుగుతాయని చాలాకాలం వరకు పరిశోధకులు అనుకున్నారు. అప్పుడు మాత్రమే రెండు ముక్కలు తగిలిన ప్రాంతం మరీ ఎత్తుకు చేరుకుంటుందని కూడా అనుకున్నారు. యూఎస్‌లోని ‘బ్రౌన్ విశ్వవిద్యాలయం’లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్న డేనియల్ ఇబారా బృందం వారు ఈ మధ్యన ఈ అంశాన్ని గురించి ఒక వైజ్ఞానిక పత్రాన్ని వెలువరించారు. ‘నేచర్ జియోసైన్సెస్’ అనే ప్రఖ్యాత వైజ్ఞానిక పత్రికలో ఆ పత్రం ప్రచురించబడింది. ఈ పత్రం కారణంగా ఆ రంగంలోనే కొత్త మలుపులు వచ్చాయనీ, పరిశోధన మరొక మార్గంలో సాగుతుందనీ ప్రపంచమంతటా నిపుణులు అంటున్నారు. అమెరికా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందానికి చైనాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ జియో సైన్సెస్’ వారు కూడా ఈ పరిశోధనలో సహకరించారు. ‘సెడిమెంటరీ శిలల’ నిర్మాణాల ఎత్తు గతంలో ఉండిన తీరు గురించి పరీక్షించడానికి వీరంతా కలిసి ఒక కొత్త పద్ధతిని రూపొందించారు. అంగారక శిలలను పరిశీలించడంలో వాడుతున్న ఒక పద్ధతిని ఈ పరిశోధకులు ఇక్కడ కొత్తగా ప్రవేశపెట్టారు. హిమాలయాలలోని శిలల్లో ఉన్న ఐసోటోపుల కొలతలు తీసి వాటి ప్రకారం శిలల కాలం ఎప్పటిది అని వారు నిర్ణయించారు. ఐసోటోపులు అంటే ఒకే రసాయనం తాలూకు వేరువేరు రకాలు. ఈ పద్ధతి గురించి మరింత చెబితే అది చాలా సాంకేతికంగా ఉండవచ్చు. కొండకు వెచ్చని గాలి తగిలి అది పైకి లేచి కొండకు ఆవలి భాగంలోకి ప్రవేశించి చల్లబడుతుంది. అప్పుడది వర్షం గానూ, మంచు గానూ కిందకు రాలుతుంది. గాలి పైకి వెళ్ళిన కొద్దీ అందులోని రసాయనాల తీరు మారుతుంది. ఎక్కువ న్యూట్రాన్లు గల ఆక్సిజన్ వంటి రసాయనాలు, అంటే ఐసోటోపులు బరువుగా ఉండి, మేఘాల నుంచి ముందే కిందకు జారుతాయి. ఇక తేలిక ఐసోటోపులు కొండపై కొమ్ము మీద ఆ తరువాత వచ్చి రాలుతాయి. మూడు సంవత్సరాల పాటు ఈ ఐసోటోపులను పరిశీలించిన తరువాత టెక్టానిక్ ప్లేట్ అంచులో ఉన్న హిమాలయ పర్వతాలు అప్పటికే 3,500 మీటర్ల కన్నా ఎత్తు లేదా ఇంచుమించు అంత ఎత్తులో ఉన్నాయని గమనించారు. అంటే ప్రస్తుతం ఉన్న ఎత్తులో ఇది 60 శాతం కన్నా ఎక్కువన్నమాట. ఈ రకంగా చూస్తే హిమాలయాల చుట్టుపక్కల గల పాతకాలపు వాతావరణ వివరాలు మరొకసారి పరిశీలించవలసిన అవసరం ఉన్నట్టు పరిశోధకులు భావిస్తున్నారు. దక్షిణ టిబెట్‌లోని ప్రాచీన కాలపు శీతోష్ణస్థితి గురించి కొత్త సిద్ధాంతాలు ఈ రకంగా అందుబాటులోకి రానున్నాయి. ఇదే పద్ధతిలో ఆండీస్, సియెరా నెవాడా పర్వతశ్రేణులనూ, అక్కడి ప్రాచీన వాతావరణ పరిస్థితులనూ మరొకసారి విశ్లేషించే అవకాశం కూడా ఉంది. గతంలోని శీతోష్ణస్థితులను గురించి ఉన్న సిద్ధాంతాల తీరు మారనుందనీ, ఆయా ప్రాంతాలలోని గత కాలపు శీతోష్ణస్థితులను గురించిన సిద్ధాంతాలూ, ఆలోచనలూ కొత్తదారి పట్టే పద్ధతి కనబడుతున్నదనీ, అక్కడి జీవవైవిధ్యం గురించి కూడా అవగాహనలు మారుతాయనీ అంటారు ఇబారా. కొన్ని విషయాలు తెలుసుకున్నందుకు తక్షణం ఏ ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ ప్రపంచం, దాని గురించి అవగాహన కలిగించే సైన్సు క్రమంగా మారుతున్నాయని అర్థం కావడం మాత్రం అసలైన నిజం! కె.బి. గోపాలం వ్యాసకర్త సైన్స్ రచయిత -
భారతదేశం రెండు ముక్కలు కానుందా?
హిమాలయ పర్వత శ్రేణికి దిగువన భారత, యురేషియా ఖండాంతర టెక్టోనిక్ ప్లేట్లు పరస్పరం ఢీకొంటున్న కారణంగా హిమాలయాలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు ఏనాడో గుర్తించారు. అయితే ఇండియన్ ప్లేట్లోని కొంత భాగం యురేషియన్ ప్లేట్ కింద జారిపోతున్నందున అది ‘డీలామినేట్’ అవుతున్నదని పరిశోధకులు తాజాగా కనుగొన్నారు. ఈ ప్రక్రియ భారత్‌ను బౌగోళికంగా విభజించే అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సాధారణంగా రెండు టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొన్నప్పుడు, ఒకదాని కిందకు మరొకటి కిందకి జారిపోతుంది. ఈ ప్రక్రియను సబ్డక్షన్ అంటారు. రెండు ఖండాంతర పలకలు సమానంగా ఉన్నందున, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలకు ఏ ప్లేట్ మరొకదానిపై అతివ్యాప్తి చెందుతుందో ఖచ్చితంగా గుర్తించలేరు. ఇండియన్ ప్లేట్లోని దట్టమైన దిగువ భాగం పై భాగానికి దూరంగా ఉంటుంది. వీటిమధ్య నిలువుగా ఏర్పడిన పగులును శాస్త్రవేత్తలు గుర్తించారు. భారత- యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ల మధ్య 60 మిలియన్ సంవత్సరాలకు పైగా జరుగుతున్న ఘర్షణ హిమాలయాలకు ఇప్పుడు మనం చూస్తున్న ఆకృతినిచ్చింది. సముద్రపు పలకల వలె కాకుండా, ఖండాంతర పలకలు మందంగా, తేలికగా ఉంటాయి, అవి భూమిలోని మాంటిల్లోకి సులభంగా ఇమిడిపోవు. భౌగోళిక భౌతిక శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం ఇటీవల టిబెట్ భాభూగం కింది భూకంప తరంగాలను విశ్లేషించింది. ఈ నేపధ్యంలో యురేషియన్ ప్లేట్ దాని కింద జారిపోతున్నందున భారత ప్లేట్ విచ్ఛిన్నమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపింది. ఈ బృదం యురేషియన్ ప్లేట్ మధ్య సరిహద్దు వద్ద పగుళ్లను కూడా కనుగొంది. భూకంప తరంగాలు, హీలియం వాయువులు ఉపరితలంపైకి చొచ్చుకు రావడం ఈ డీలామినేషన్ ప్రక్రియకు సాక్ష్యంగా నిలుస్తున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నూతన పరిశోధనా ఫలితాలు మునుపటి పరికల్పనలను సవాలు చేస్తున్నాయి. భౌగోళిక ప్రక్రియలను మరింతగా గుర్తించేలా చేస్తున్నాయి. ఇన్నాళ్లూ పరిశోధకులు ఖండాలు ఏర్పడటం వెనుక ఇటువంటి ప్రక్రియ ఉంటుందనే దానిపై పరిశోధనలు సాగించలేదు. అయితే ఈ కొత్త అధ్యయనం మరిన్ని నూతన ఆవిష్కరణలకు నాంది పలకనుంది. ఈ పరిశోధన అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ వార్షిక సమావేశంలో సమర్పించారు. ఇది హిమాలయాల ఆవిర్భావాన్ని మరింతగా అర్థం చేసుకోవడంలో సహాయపడనుంది.అలాగే భవిష్యత్తులో ఈ ప్రాంతంలో భూకంప ప్రమాదాలను పసిగట్టేందుకు సహాయకారిగానూ ఉండవచ్చు. -
Amar : మూడు దారులు : రాజకీయ రణరంగంలో భిన్న ధృవాలు
సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ రచించిన "మూడు దారులు" రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు.. పుస్తకం సమకాలీన రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతుందనీ, పరిశోధకులకు చక్కటి గైడ్‌గా, రిఫరెన్స్ మెటీరియల్‌గా పనికొస్తుందని పుస్తక పరిచయ సభలో వక్తలు అభిప్రాయపడ్డారు. విశాఖపట్నంలోని పౌర గ్రంథాలయం సభా మందిరంలో బుధవారం నిర్వహించిన "మూడు దారులు" పుస్తక పరిచయం కార్యక్రమంలో మాట్లాడిన వక్తలు రచయిత అమర్ కృషిని అభినందించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం శాఖ పూర్వ ప్రధాన ఆచార్యులు ప్రొఫెసర్ పి.బాబీ వర్ధన్ సభకు అధ్యక్షత వహించగా, లీడర్ దిన పత్రిక సంపాదకులు, రైటర్స్ అకాడమీ చైర్మన్ వి.వి.రమణమూర్తి పుస్తకంలోని అంశాలను వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.బాలమోహన్ దాస్ ప్రసంగిస్తూ తొలి అధ్యాయంలో రచయిత తెలుగు రాష్ట్రాల పూర్వ చరిత్రను, ఆనాటి రాజకీయాలను వివరించిన తీరు, ముఖ్యమంత్రుల వ్యవహార శైలి సమగ్రంగా పొందుపరిచారని ప్రశంసించారు. డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తనకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా అవకాశం కల్పించారని గుర్తు చేసుకున్న ప్రొఫెసర్ బాల మోహన్ దాస్ వైఎస్ ఆర్ విద్యా విషయాల పట్ల ఎంతో శ్రద్ధ పెట్టేవారనీ, పాలనా వ్యవహారాలలో తమకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చేవారని పేర్కొన్నారు. రాజకీయాలలో నైతిక విలువలకు వైఎస్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారని అన్నారు. మూడు దారులు పుస్తకంలో రచయిత ప్రత్యేకంగా ప్రస్తావించిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, వై.ఎస్.జగన్మోహన రెడ్డి గురించి పుస్తకం చదివిన తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారో తానే స్వయంగా రాండమ్ శాంపిల్ సర్వే చేశానని ఆయన వివరిస్తూ.. వైఎస్ఆర్ కు 87 శాతం, చంద్రబాబు కు 49.5 శాతం, జగన్ కు 78.5 శాతం జనం మద్దతుగా మాట్లాడారని పేర్కొన్నారు. మూడు దారులు పుస్తకం భావితరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని పుస్తకాన్ని సమగ్రంగా సమీక్ష చేసిన లీడర్ దిన పత్రిక ఎడిటర్ రమణమూర్తి అన్నారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు గద్దె దించేందుకు జరిపిన వైస్రాయ్ ఉదంతాన్ని రచయిత కళ్లకు కట్టినట్లు వివరించారనీ, ఎన్నో ఆధారాలతో ఆ కుట్రను పాఠకుల ముందు ఉంచారని పేర్కొన్నారు. చరిత్రను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత పాత్రికేయులపై ఉందని, ఈ పుస్తకం ద్వారా అమర్ నెరవేర్చారన్నారు. పుస్తకంలో ముగ్గురు ముఖ్యమంత్రులను కథా వస్తువుగా అమర్ తీసుకున్నారని, అయితే నాలుగో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూడా దర్శనమిస్తారని తెలిపారు. అధికారం కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్‌ని వెన్నుపోటుకు సైతం వెనుకాడని సంఘటన పుస్తకంలో సాక్షాత్కరిస్తుందన్నారు. ముఖ్యంగా చంద్రబాబు చేసిన ‘వైస్రాయ్ కుట్ర’ పాఠకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుందని తెలిపారు. ఎన్టీఆర్ ఆత్మ ఎలా క్షోభించింది, అడ్డదారిలో చంద్రబాబు పాలన ఎలా కైవసం చేసుకున్నారో తెలుసుకోవచ్చన్నారు. ఈ ఆధారాలతో అమర్ రాయడం విశేషమని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ఆవిర్భావం మొదలు, విలీనం, విభజన వంటి పరిణామాలు, వాటి వెనుక ఉద్యమాలు, రాజకీయాలను రచయిత సాధికారికంగా ఆవిష్కరించారన్నారు. చరిత్రలో వాస్తవిక దృష్టితో రాయడంలో రచయిత సఫలీకృతులయ్యారన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఏయూ జర్నలిజం శాఖ విశ్రాంత ప్రధాన ఆచార్యులు ప్రొఫెసర్ పి.బాబివర్ధన్ మాట్లాడుతూ.. పాత్రికేయులు అమర్ రాసిన మూడు రహదారుల పుస్తకంపై పి.హెచ్.డి చేయవచ్చన్నారు. సాధారణంగా చరిత్రలను, జీవిత కథలను రాస్తూ ఉంటారని, అందుకు భిన్నంగా ముగ్గురు ముఖ్యమంత్రుల పాలనా చరిత్రను తొలిసారిగా రాసి అమర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. పరిశోధనాత్మక జర్నలిజం ప్రాంతీయ భాషలోనే చేయవచ్చని, అందుకు ఉదాహరణ ఈ పుస్తకమే అన్నారు. పాత్రికేయ ప్రముఖులు మంగు రాజగోపాల్ ఆత్మీయ ప్రసంగం చేస్తూ జర్నలిస్టులలో రాసే జర్నలిస్టు అక్షర బాహుబలి అమర్ అన్నారు. జర్నలిస్టులు ఎప్పటికప్పుడు సమాజంలోని రాజకీయ పరిణామాలకు అప్డేట్ అవ్వాలని, వారిలో అమర్ ముందుంటారన్నారు. ముగ్గురు ముఖ్యమంత్రుల పరిపాలన స్వయంగా చూసి అమర్ ఈ పుస్తకం రాశారని తెలిపారు. పుస్తక రచయిత అమర్ మాట్లాడుతూ.. దక్షిణాది వారిని ఉత్తరాది వారు పట్టించుకోరని, మద్రాసీయూలుగా పిలిచే తెలుగువారిని ఆంధ్రులుగా ఎన్టీఆర్ గుర్తింపు తెచ్చారన్నారు. వైఎస్ఆర్, చంద్రబాబు నాయుడు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారని, 1983 వరకు ఓకే పార్టీలో కలిసి ప్రయాణించారని తెలిపారు. 83లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఓడిపోయిన తర్వాత చంద్రబాబు టీడీపీలో చేరి ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. వైఎస్ఆర్, చంద్రబాబు నాయుడు తెలుగు రాజకీయాలను ప్రభావితం చేశారన్నారు. ఈ పుస్తకం ద్వారా వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చానని, ఎవరిని కించపరిచే ఉద్దేశంతో రాయలేదన్నారు. అనంతరం, రచయిత అమర్ ను అతిథులు శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు. పాత్రికేయులు బిఎస్ రామకృష్ణ వందన సమర్పణతో సభ ముగిసింది. -
మగువ కన్నీళ్లకు ఇంత శక్తి ఉందా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
ఎంతవారైనా కాంత దాసులే అంటాడు త్యాగరాజు. ఆడదాని ఓరచూపులో చిత్తుకానీ మగాడు లేడు అంటాడు ఓ సినీ కవి. అవన్నీ నిజమే అనేలా శాస్త్రవేత్తల అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఆడవాళ్ల కంటి నుంచి వచ్చే కన్నీళ్లకు ఉన్న శక్తిని చూసి ఆశ్చర్యపోయారు. దెబ్బకి మగాడిలో ఉన్న దూకుడుతునానికి కళ్లెం పడుతుందని ప్రూవ్ చేసి చూపించారు కూడా. ఈ మేరకు ఇజ్రాయెల్‌లోని వీజ్ మాన్ ఇన్స్టిట్యూట్ ఆప్ సైన్స్ నిర్వహించిన పరిశోధనలో మానవ కన్నీళ్లలో రసాయన సంకేతం ఉందని, మెదడు కార్యకలాపలను ప్రభావితం చేస్తుందని కనుగొన్నారు. స్త్రీల నుంచి వచ్చే కన్నీళ్ల వాసన పురుషుల కోపాన్ని నియంత్రిస్తుందని వెల్లడించారు. అందుకోసం పరిశోధకులు ఆడ ఎలుకలపై పరిశోధన చేశారు. ఆ అధ్యయనంలో ఆడ ఎలుకల కన్నీళ్లు మగ ఎలుకల దాడిని నియంత్రించినట్లు తెలిపారు. అంతేగాదు ఈ మగ ఎలుకలు కూడా తమ కన్నీళ్లతో ఆల్పా అనే జాతి ఎలుకల దాడిని నివారిస్తాయిని పేర్కొన్నారు. అలాగే ఇద్దరు వాలంటీర్ మహిళలపై కూడా ప్రయోగం చేశారు. వాళ్లికి ముందుగానే ఇద్దరు మగావాళ్లతో కొన్ని రకాల గేమ్‌లు ఆడమన్నారు. అలాగే వారి డబ్బులను లాక్కునేలా మోసం చేయమన్నారు. ఆ తర్వాత వెంటనే కన్నీళ్లు పెట్టుకుని క్షమాపణలు చెప్పమన్నారు. ఇలా చేయంగానే సదరు మగవాళ్లలో ప్రతికార చర్యలు నెమ్మదిగా తగ్గిపోయినట్లు గమనించారు. ఈ అధయనంలో ప్రతీకారం తీర్చుకోవాలనే పురుషుల కోరిక 43.7% వరకు తగ్గిపోయిందన్నారు. ఈ పరిశోధనలో పాల్గొన్న సదరు పురుషులను బ్రెయిన్‌ను ఎమ్మారై స్కాన్ చేయగా మహిళ కన్నీళ్ల వాసన వారి మెదడును ప్రభావితం చేసి ఆయా ప్రాంతాల్లో ప్రిఫ్రంటల్ కార్టెక్స్, పూర్వ ఇన్సులాలో చురుకుదనం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ కొన్ని విషయాలను గమనించాలి. శిశువులు పుట్టగానే ఏడుస్తారు. ఇక్కడ వారికి వచ్చే హానిని నియంత్రించడానికి కన్నీళ్లు పెట్టేలా ఏడవడం జరుగుతుందన్నారు. ఇక్కడ శిశువులు నిస్సహాయులు కాబట్టి తమ పట్ల కోపంగా ప్రవర్తించొద్దని ఏడుపు రూపంలో తెలియజేస్తారని, అందుకు తగ్గట్టుగానే మానవ మెదడు ఆటోమెటిక్‌గా కరిగి కోపాన్ని తమాయించుకుంటుంది. ఇదే మాదిరిగా నిజజీవితంలో కొన్ని సందర్భాల్లో ఈ కన్నీళ్లు వాసన ప్రభావంతంగా కనిపించదని కూడా చెప్పారు. గృహహింస, ఆడవాళ్లపై అకృత్యాలు లేదా టార్చర్ పెట్టే నేరగాళ్లలో దూకుడుని ఈ కన్నీళ్ల వాసన పెద్దగా ప్రభావం చేయకలేకపోయిందని అన్నారు ఇక్కడ కాస్త దీన్ని నిశితంగా గమనిస్తే.. వాళ్లది హింసా ప్రవృత్తి. సాధారణంగా సున్నితమైన మనస్సు గలవాళ్లకే మహిళ కన్నీళ్లకు ఇలా ప్రతిస్పందిస్తారని శాస్త్రవేత్తలు ధీమాగా చెబుతున్నారు. ఇక్కడ మహిళ కన్నీళ్ల వాసన మగవాడి కోపానికి కళ్లేం వేయగలిగినప్పుడు, స్త్రీ పట్ల అమానుషింగా ప్రవర్తించే నేరగాళ్ల బ్రెయిన్‌ని ఎందుకు ప్రభావితం చేయలేకపోతుందనేది శాస్త్రవేత్తలకు అర్థంకానీ చిక్కు ప్రశ్న. ఈ మిస్టరీని చేధించగలిగితే మహిళల పట్ల జరిగే ఎన్నో అమానుషాలను సులభంగా నియంత్రించొచ్చని చెప్పింది పరిశోధకుల బృందం. (చదవండి: సర్జరీ చేసే టైంలో పేషెంట్‌పై డాక్టర్ తోడి! వీడియో వైరల్) -
స్మార్ట్‌వాచ్, రిస్ట్ బ్యాండ్లను వినియోగిస్తున్నారా?..ఇదొకసారి చదవండి!
స్మార్ట్‌వాచ్, రిస్ట్‌బ్యాండ్‌ను వినియోగిస్తున్నారా? అయితే, వాటిని రోజులో ఎన్నిసార్లు శుభ్రం చేస్తున్నారు? ఎందుకంటే? మీకెంతో ఇష్టమైన యాపిల్‌వాచ్, ఫిట్‌బిట్ రిస్ట్‌బ్యాండ్‌ల వినియోగించడం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటూ యూనివర్సిటీ పరిశోధకులు నిర్ధారించారు. అమెరికాకు చెందిన ఫ్లోరిడా అంట్లాటిక్ యూనివర్సిటీ (ఎఫ్ఏయూ) పరిశోధకులు ప్లాస్టిక్, రబ్బర్, క్లాత్, లెదర్, గోల్డ్ అండ్ సిల్వర్‌తో తయారు చేసిన రిస్ట్ బ్యాండ్,స్మార్ట్‌వాచ్‌ల పై పరిశోధనలు నిర్వహించారు. ఈ రీసెర్చ్‌లో స్మార్ట్‌వాచ్, రిస్ట్ బ్యాండ్లను ధరించడం బ్యాక్టీరియాను ఆహ్వానించడమేనని గుర్తించారు. 95 శాతం వేరబుల్స్ ప్రమాదకరమైన బ్యాక్టీరియా వ్యాప్తికి కారణమవుతయాని అంశాన్ని వెలుగు చూశారు. తద్వారా ఫివర్, డయేరియా, వ్యాధినిరోదక శక్తి తగ్గడం వంటి అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది. ప్రత్యేకించి రిస్ట్‌బ్యాండ్ ధరించడం వల్ల చర్మ సమస్యలకు దారితీసే స్టెఫిలోకాకస్ ఎస్పీపీ అనే బ్యాక్టీరియాతో స్టాఫ్ ఇన్ఫెక్షన్, 60 శాతం ఈ కొల్లీ, 30 శాతం సూడోమోనాస్ ఎస్పీపీ (Pseudomonas spp)లు వంటి బ్యాక్టీరియాలు ఉన్నాయని పరిశోధనల్లో తేటతెల్లమైంది. సురక్షితంగా ఉండాలంటే ప్లాస్టిక్, రబ్బరు రిస్ట్‌బ్యాండ్‌లలో ఎక్కువ బ్యాక్టీరియా వ్యాప్తి ఎక్కువగా ఉందని, మెటల్, బంగారం, వెండితో తయారు చేసిన రిస్ట్ బ్యాండ్లలో వైరస్ వ్యాప్తి ప్రభావం తక్కువగా ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా రిస్ట్బ్యాండ్లు వినియోగించే స్థానాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని రీసెర్చర్ న్వాడియుటో ఎసియోబు అన్నారు. జిమ్‌కి వెళ్లే వారు సైతం వాచ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అనారోగ్యానికి గురి కాకుండా ఉండేందుకు వారు ధరించే వాచ్‌లను శుభ్రపరిచే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చదవండి👉 ‘ఈ కారు కొంటే మీ ఇంటిని మీరు తగలబెట్టుకున్నట్లే’ -
భళా 'ఏఐ'.. మైండ్ రీడింగ్ టెక్నాలజీలో అద్భుతం!
Mind Reading AI Technology: ప్రపంచం టెక్నాలజీ వైపు పరుగులు పెడుతోంది.. ఈ నేపథ్యంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరింత వేగంగా విస్తరిస్తోంది. దీంతో ఇప్పటికే పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా టెక్ కంపెనీల విషయంలో 'ఏఐ' సంచలనాలు సృష్టిస్తోంది. ఇదిలా ఉండగా ఏఐ మనిషి మైండ్ కూడా చదివేస్తుందనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. తాజాగా సింగపూర్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు మనసును చదవగలిగే సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. దీంతో మనిషి మనసును కూడా ఏఐ చదవగలదని చెబుతున్నారు. ఈ ఆధునిక టెక్నాలజీ మీద పరిశోధన బృందంలో ఒకరైన 'లి రుయిలిన్' కీలక విషయాలు వెల్లడించారు. ప్రతి మనిషికి ఇతరులు ఏమి ఆలోచిస్తున్నారని, దానిని తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది. ఇలాంటి వాటికోసం మైండ్ రీడింగ్ ఏఐ టెక్నాలజీ రూపొంచాలని సంకల్పించి ప్రయోగం ప్రారంభించామని, మొదట్లో తన మెదడుని ఈ టెక్నాలజీ ఆధారంగా పరిశీలించగా అద్భుతమైన ఫలితం వచ్చిందన్నారు. మొత్తం మీద మెదడు ఆలోచనను పసిగట్టే టెక్నాలజీ చాలా అద్భుతం అని వెల్లడించారు. ఇదీ చదవండి: దేశీయ మార్కెట్లో మరో జర్మన్ కారు - ధర రూ. 1.14 కోట్లు MRI స్కాన్ ద్వారా.. మైండ్ రీడింగ్ AI ని అభివృద్ధి చేయడంలో పనిచేస్తున్న పరిశోధకులకు 58 మంది తమ మైండ్ పరిశోధన చేసుకోవచ్చని స్వచ్చందగా ముందుకు వచ్చారు. అందులో లి రుయిలిన్ కూడా ఒకరు కావడం గమనార్హం. ఈ టెక్నాలజీ పూర్తిగా MRI స్కాన్ ద్వారా కొనసాగుతుంది, ఇందులో భాగంగా మెదడుకి సంబంధించి సుమారు 1200 నుంచి 5000 చిత్రాలను తీసి, దానిపై స్టడీ చేసి అసలు విషయం గుర్తించడం జరుగుతుంది. ఇదీ చదవండి: ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఆగండాగండి.. ఇవి చెక్ చేశారా? చాట్ జీపీటీ మనుషుల భాషను అర్థం చేసుకున్నట్లే.. ఏఐ మానవ మెదడుని కూడా అర్థం చేసుకుంటుంది. అంటే మనసులోని ఆలోచనలను చదివి పరిశోధకులకు అందిస్తుందన్నమాట. టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందిందంటే చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. అయితే దీనిని ఎవరైన అనవసర విషయాలకు లేదా తప్పుడు పనులకు ఉపయోగిస్తే పెద్ద ముప్పు వాటిల్లుతుందని నిపుణులు భావిస్తున్నారు. -
జైన విగ్రహాలతో చెరువు తూము
సాక్షి, హైదరాబాద్: అదో చెరువు.. అంతగా సాగునీటి వనరులు లేని ఆ గ్రామంలో ఆ చెరువు నీళ్లే వ్యవసాయానికి ఆధారం.. అందుకోసం పల్లంగా ఉన్న ప్రాంతానికి నీటి నిల్వను చెరువుగా చేసి పక్కాగా కట్టకట్టి నీటి విడుదలకు తూము నిర్మించారు. ఇదంతా వందేళ్ల నాటి సంగతి. ఇప్పుడు ఆ చెరువుతో పనిలేదు. అయితే, తూము నిర్మాణానికి వినియోగించిన రాళ్లు మామూలువి కాదని, అవి ఓ జైన క్షేత్రం శిల్పాలతో కూడిన శిలలని తేలింది. వాన నీరు... చెట్టు నీడన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎన్కేపల్లి గ్రామ చెరువు కట్ట తూము నిర్మాణంలో రాళ్లుగా వినియోగించిన వెయ్యేళ్లనాటి జైన శిల్పాలు ఇప్పుడు వెలుగు చూశాయి. క్రీ.శ. 9–10 శతాబ్దాల నాటి జైన బసది కేంద్రంలో ఉన్న జైన చౌముఖి శిల్పాలను ఈ చెరువు తూములో వినియోగించినట్టు చరిత్ర పరిశోధకులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గుర్తించారు. ఔత్సాహిక పరిశోధకుడు పాములపాటి శ్రీనాథ్‌రెడ్డి ఇటీవల ఎన్కేపల్లి గ్రామానికి వెళ్లారు.ఆ సమయంలో వాన కురుస్తుండటంతో చెట్టునీడన నిలబడి ఉండగా, సమీపంలోని చెరువుకట్టలో శిల్పాలు కనిపించాయి. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు శివనాగిరెడ్డి ఆదివారం ఆ చెరువు వద్దకు వెళ్లి పరిశీలించగా, అవి జౌన చౌముఖి శిల్పాలుగా గుర్తించారు. శిలలపై ఆదినాథ, నేమినాథ, పార్శ్వనాథ, వర్ధమాన మహావీరులు ధ్యానముద్రలో ఉన్నట్టు, పైన కీర్తిముఖాలతో మలిచి ఉన్నట్లు శివనాగిరెడ్డి చెప్పారు. వాటిపై 9–10 శతాబ్దాల నాటి తెలుగు, కన్నడ లిపిలో శాసనాలు కూడా చెక్కి ఉన్నాయన్నారు. ఆ శాసనభాగాలు చెరువుగట్టు గోడలోకి చొచ్చుకుపోయి ఉన్నందున చదవటం వీలు కావటం లేదని, జైన బసదికి చెందిన దానశాసనాలు అయి ఉండే అవకాశం ఉందన్నారు. వాటిని బయటకు తీస్తే స్థానిక చరిత్రకు సంబంధించిన వివరాలు వెలుగుచూసే అవకాశం ఉందని తెలిపారు. ఆ ప్రాంతం జైన కేంద్రం.. మొయినాబాద్ ప్రాంతం ఒకప్పుడు జైన కేంద్రం. సమీపంలోని చిలుకూరు ప్రాంతం రాష్ట్రకూట, వేములవాడ చాళుక్యుల కాలంలో సుప్రసిద్ధ జైన కేంద్రమని పేర్కొంటూ ఇటీవలే ఆ ఊళ్లోని జైన దేవాలయ జాడలను వెలుగులోకి తెచ్చారు. చిలుకూరుకు అతి సమీపంలో ఉన్న ఎన్కేపల్లి గ్రామంలో కూడా జైన బసది కేంద్రం ఉండేదని, దానికి సంబంధించిన చౌముఖి శిల్పాలని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. ఆ జైన బసది, దాని అనుబంధ దేవాలయం ధ్వంసమైన నేపథ్యంలో, వాటి శిథిల శిల్పాలను చెరువు తూముకు వినియోగించి ఉంటారన్నారు. -
షాకింగ్: 100కు పైగా డేంజరస్ యాప్స్, వెంటనే డిలీట్ చేయకపోతే
యాప్స్‌కు సంబంధించి యూజర్లకు మరో షాకింగ్న్యూస్. స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేసి భయంకర వైరస్‌లను ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా డేటాను కొట్టేస్తున్న కేటుగాళ్లపై తాజా పరిశోధన సంచలన విషయాలను వెల్లడించింది. తాజాగా గూగుల్ ప్లే స్టోర్‌లోని 100 కంటే ఎక్కువ యాప్‌లకు సోకిన అత్యంత ప్రమాదకరమైన మాల్వేర్ను పరిశోధకులు గుర్తించారు. గూగుల్ ప్లే స్టోర్ లోని 100 కంటే ఎక్కువ యాప్‌లకు సోకిన ‘స్పిన్ ఓకే’ అనే కొత్త స్పైవేర్‌ను ఇటీవల గుర్తించారు. పైగా ఈ యాప్స్ 400 మిలియన్లకు పైగా డౌన్లోడ్లు నమోదైనాయి, అంటే దాదాపు 40 కోట్ల మంది సైబర్ ముప్పులో పడిపోయినట్టే. రోజువారీ రివార్డ్‌లు, మినీ గేమ్‌లను ద్వారా ఈ ట్రోజన్ మాల్వేర్ నిజమైందిగా కనిపిస్తుందని, వినియోగదారులను ఆకర్షిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ విషయాన్ని గూగుల్‌కి తెలియజేసి. వాటిని తొలగించినప్పటికీ, ఇలాంటి డేంజరస్ యాప్స్‌పై అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తునారు. భవిష్యత్తులో ఇలాంటి యాప్‌లను గుర్తించి, డౌన్లోడ్ చేయొద్దని హెచ్చరించారు. (బుగట్టి రెసిడెన్షియల్ టవర్...నెక్ట్స్ లెవల్: దిమ్మదిరిగే ఫోటోలు) ప్రభావితమైన యాప్‌లు ఇవే నాయిజ్: వీడియో ఎడిటర్ విత్ మ్యూజిక్ జాప్యా: ఫైల్ బదిలీ, షేర్ వీఫ్లై: వీడియో ఎడిటర్&వీడియో మేకర్ ఎంవీ బిట్- ఎంవీ వీడియో స్టేటస్ మేకర్ బియూగో- వీడియో మేకర్&వీడియో ఎడిటర్ క్రేజీ డ్రాప్ క్యాష్‌జైన్ – క్యాష్ రివార్డ్ ఫిజ్జో నావల్ – ఆఫ్‌లైన్ రీడింగ్ క్యాష్ ఈఎం: రివార్డ్స్ టిక్: వాట్ టు ఎర్న్ మాల్వేర్ సోకిన యాప్‌లను ఎలా గుర్తించాలి ♦ యాప్ అనుమతులను చెక్ చేసుకోవాలి.యాక్సెస్ లేదా నెట్వర్క్ కనెక్టివిటీ వంటి వాటిని పరిశీలించాలి. ♦ నకిలీ ఆఫర్లు లేదా రివ్యూస్‌లో అధిక ప్రకటనలుంటే పట్ల జాగ్రత్తగా ఉండాలి. యూజర్ అభిప్రాయానికి, సపోర్ట్‌కు స్పందించే డెవలపర్ల విశ్వసనీయతను గమనించాలి. ♦ ఇన్‌స్టాల్‌ల-టు-రివ్యూల రేషియోను గమనించాలి. ఇన్‌స్టాల్‌ల-టు-రివ్యూల నిష్పత్తి ఎంత; ఎంతమంది యాప్‌ను ఇన్స్టాల్ చేసారనే దానితో పోలిస్తే ఎంతమంది రివ్యూ చేశారనేది చూడాలి. డౌన్లోడ్లకు మించి రివ్యూలుంటే అనుమానించాల్సిందే. ♦ యాప్ డెవలపర్‌ని ఇతర సోషల్‌మీడియా హాండిల్స్, చట్టబద్ధతను చూడాలి. (మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్) ♦ స్పెల్లింగ్ లేదా వ్యాకరణ లోపాలు, అస్పష్టమైన సమాచారం లేదా యాప్ ఫంక్షనాలిటీ వివరాల కొరత గురించి జాగ్రత్తగా గమనించాలి. ♦ పాస్వర్డ్లు లేదా క్రెడిట్ కార్డ్ వివరాల వంటి సున్నితమైన డేటాను అభ్యర్థించే యాప్‌ల జోలికి అసలు వెళ్ల వద్దు. ముఖ్యంగా యాప్‌లను డౌన్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త గా ఉండాలి. యాప్ అనుమానాస్పదంగా అనిపిస్తే, ఇన్స్టాల్ చేయకపోవడమే మంచిది. మరిన్ని బిజినెస్ వార్తలు, అప్డేట్స్ కోసం చదవండి:సాక్షిబిజినెస్ -
గ్లోవ్ ధరిస్తే వాపులు మాయం!
చేతులకు గాయాలై, ఆ గాయాల వల్ల వాపులు కూడా ఏర్పడితే రోజువారీ పనులు చేసుకోవడం కూడా చాలా కష్టమవుతుంది. గాయాల వల్ల ఏర్పడే వాపులు తగ్గించుకోవడానికి పెయిన్ కిల్లర్స్, పెయిన్ బామ్స్ వాడుతుంటాం. చేతి వాపులు తగ్గించుకోవాలంటే, ఇప్పుడు వాటితో పనిలేదు. ఈ ఫొటోలో కనిపిస్తున్న గ్లోవ్‌ను తొడుక్కుంటే చాలు. నొప్పుల నుంచి సత్వర ఉపశమనం లభించడమే కాకుండా, వాపులు కూడా ఇట్టే తగ్గిపోతాయి. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ సిండీ కావో నేతృత్వంలోని పరిశోధకులు ఈ అద్భుతమైన నొప్పినివారక గ్లోవ్‌ను ‘నిట్ డెమా’ పేరుతో ఇటీవల రూపొందించారు. ఒక వేలును మాత్రమే కప్పి ఉంచేలా దీన్ని రూపొందించారు. దీని తయారీకి మామూలు ఊలుతో పాటు, మిశ్రమ లోహాలతో తయారు చేసిన స్ప్రింగులను ఉపయోగించారు. దీన్ని పవర్‌బ్యాంక్‌కు కనెక్ట్ చేసుకుంటే, ఇందులోని మిశ్రమ లోహాల స్ప్రింగులు విద్యుత్తును గ్రహించి, కొద్దిగా వేడెక్కి మర్దన చేయడం మొదలు పెడతాయి. ఫలితంగా నొప్పి, వాపులు తగ్గుతాయి. దీని పనితీరుపై శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు సాగిస్తున్నారు. ఇది త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుందని వారు చెబుతున్నారు. చదవండి: ఫుడ్ పాయిజన్ అయిందా? శొంఠి పొడి, తేనె కలిపి తాగుతున్నారా? అయితే.. -
ఈకల్లో విషం.. తాకితే మరణం.. రెండు రకాల విషపూరిత పక్షులు గుర్తింపు
కిలకిలరావాలతో అలరించే పక్షులంటే ఇష్టపడనివారు ఎవరుంటారు? బుల్లి పిట్టలను ఇంట్లో పెంచుకోవడం చాలామందికి ఒక చక్కటి అభిరుచి. పిట్టలకు ఆహారం, నీరు అందిస్తూ వాటి ఎదుగుదలను చూసి ఆనందిస్తుంటారు. పక్షులంటే మనుషులకు ప్రియనేస్తాలే. కానీ, ముట్టుకుంటే చాలు క్షణాల్లో ప్రాణాలు తీసే భయంకరమైన రెండు రకాల పక్షులను న్యూగినియా అడవుల్లో డెన్మార్క్ పరిశోధకులు గుర్తించారు. అవి వాటి ఈకల్లో విషం దాచుకుంటున్నట్లు కనిపెట్టారు. వాటిని ఇంట్లో పెంచుకోలేం, ఆహారం ఇవ్వలేం. విషపూరిత పక్షుల సమీపంలోకి వెళ్లడం కూడా ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు. ► అడవుల్లో విషపూరిత ఫలాలు, పదార్థాలను ఆరగించి, వాటిని న్యూరోటాక్సిన్లుగా మార్చి, తన రెక్కల్లో నిల్వ చేసుకొనే సామర్థ్యం ఈ పక్షుల్లో అభివృద్ధి చెందింది. ► విష ప్రభావాన్ని తట్టుకొని జీవించే శక్తి సమకూరింది. ► కాలానుగుణంగా వాటి శరీరంలో సంభవించిన జన్యుపరమైన మార్పులే ఇందుకు కారణమని డెన్మార్క్‌లోని నేచురల్ హస్టరీ మ్యూజియం ప్రతినిధి జాన్సన్ చెప్పారు. ► ఇటీవల న్యూగినియా అడవుల్లో పర్యటన సందర్భంగా ఈ పక్షులను గుర్తించామని ఒక ప్రకటనలో వెల్లడించారు. ► తాజాగా గుర్తించిన రెండు రకాల విషపూరిత పక్షులు రిజెంట్ విజ్లర్(పచీసెఫాలా స్లీ్కగెల్లీ), రఫోస్–నేప్డ్ బెల్బర్డ్(అలిడ్రియాస్ రుఫినుచా) అనే పక్షి జాతులకు చెందినవి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఈ జాతులు అధికంగా కనిపిస్తుంటాయి. ► సౌత్, సెంట్రల్ అమెరికాలో ఉండే డార్ట్ కప్పలు (గోల్డెన్ పాయిజన్ ఫ్రాగ్స్) అత్యంత విషపూరితమైనవి చెబుతుంటారు. ఈ కప్పలను తాకితే కొద్దిసేపట్లోనే మరణం సంభవిస్తుంది. ► డార్ట్ కప్పల్లోని విషం లాంటిదే ఈ పక్షుల్లోనూ ఉన్నట్లు పరిశోధకులు కనిపెట్టారు. ► పక్షుల్లో బాట్రాసోటాక్సిన్ అనే విషం అధిక మోతాదులో ఉందని సైంటిస్టులు పేర్కొన్నారు. ► ఇలాంటి విషమే గోల్డెన్ పాయిజన్ కప్పల చర్మంలో ఉంటుంది. ► విషం నిల్వ ఉన్న ఈ పక్షుల ఈకలను తాకితే కండరాల్లో పక్షవాతం లాంటిది ఏర్పడుతుంది. గుండె కొట్టుకోవడం ఆగిపోతోంది. చివరకు మృత్యువు కాటేస్తుంది. ఇదంతా క్షణాల వ్యవధిలోనే జరిగిపోతోంది. ► పక్షుల శరీరంలో సోడియం చానళ్లను క్రమబద్ధం చేసే ప్రాంతాల్లో మ్యుటేషన్స్(మార్పులు) వల్ల వాటిలో విషాన్ని తయారు చేసుకొని నిల్వచేసుకోవడంతోపాటు తట్టుకొనే శక్తి స్వతంత్రంగానే అభివృద్ధి చెందిందని సైంటిస్టులు పేర్కొన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ చేప వయసు 18కోట్ల ఏళ్లు!
కోట్ల ఏళ్ల క్రితం ఎన్నో అరుదైన జీవజాతులు తెలంగాణ ప్రాంతంలో తమ అస్తిత్వాన్ని చాటుకున్నా యి. ఇక్కడ వెలుగు చూస్తున్న అప్పటి జీవ, వృక్ష జాతుల శిలాజాలు (ఫాసిల్స్) ఈ విషయం స్పష్టం చేస్తున్నాయి. ఆర్కియాలజీ (పురావస్తు పరిశోధన), పేలియంటాలజీ (శిలాజాల పరిశోధన) విభాగాల పరిశోధనల్లో ఇవి బహిర్గతమవుతున్నాయి. జురాసిక్ యుగం కన్నా ముందు యుగమైన ట్రయాసిక్ యుగం నాటి శిలాజాలు కూడా తెలంగాణలో దొరుకుతుండటం గమనార్హం. అనేక అరుదైన శిలాజాలను తెలంగాణ తన గర్భంలో దాచుకుందని, అనేక కొత్త అధ్యాయాలకు తెరతీసే అంతటి చరిత్ర ఇక్కడ దాగి ఉందని పరిశోధకులు అంటున్నారు. – సాక్షి, హైదరాబాద్ వేమనపల్లిలో డైనోసార్ వెన్నుపూస శిలాజాలపై 200 ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. గత చరిత్రకు, ప్రస్తుత తరానికి మధ్య జీవపరిణామ అంశాలను, జీవ వైవిధ్యాన్ని, జీవన స్థితిగతులును తెలియజేసేవే శిలాజాలు. సాధారణంగా ప్రిజర్వ్ (బురద, బంక, మంచులో కూరుకుపోయి ఏర్పడిన శిలాజాలు), ట్రేస్, కార్బన్, మోల్డ్స్, టెట్రిఫైడ్ అనే ఐదు రకాల శిలాజాలు ఉంటాయి. దాదాపుగా ఈ ఐదు రకాల శిలాజాలూ తెలంగాణలో లభ్యమయ్యాయి. ప్రస్తుత భూపాలపల్లి జిల్లా కాటారంలో రింకోసారా జాతికి చెందిన 25 కోట్ల సంవత్సరాల నాటి డైనోసార్ శిలాజాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) 2000 సంవత్సరంలో వెలికితీసింది. పెద్దపల్లి, మంచిర్యాల, అసిఫాబాద్ ప్రాంతాల్లో కూడా శిలాజ సంపద ఎక్కువగా ఉంది. మంచిర్యాలలోని వేమనపల్లిలో డైనోసార్ వెన్నుపూస (శిలాజం) బయటపడింది. చెన్నూరు అడవుల్లో ఆకుల శిలాజాలను, ఆసిఫాబాద్ జిల్లాలో షెల్ ఫాసిల్స్‌ను, మరోచోట పిల్లి జాతి (పిల్లి, పులి, చిరుత...)కి చెందిన పాద ముద్రల శిలాజాలను పరిశోధకులు గుర్తించారు. మంచిర్యాలలోని జైపూర్‌లో ఓ క్షీరదానికి సంబంధించిన శిలాజం వెలుగు చూసింది. వేమనపల్లి పరిసర ప్రాంతాల్లో జురాసిక్ యుగం నాటి పాదముద్రలు, గోదావరి పరిసర ప్రాంతాల్లో మైక్రో (సూక్ష్మ) ఫాసిల్స్ విరివిగా ఉన్నాయి. వోల్కనిక్ ఎరా (అగ్ని పర్వతాల నుంచి లావా వెలువడి అధిక శాతం జీవజాలం నశించిన సమయం) కు సంబంధించిన ఆరున్నర కోట్ల ఏళ్లనాటి శిలాజాలు దక్కన్ ప్రాంతంలో ఎక్కువగా బయటపడుతున్నాయి. శిలాజాల కోసం తమిళనాడు, కోల్‌కతా, మహారాష్ట్రలో ప్రత్యేకంగా పార్కులు నిర్మించి భద్రపరుస్తున్నారు. రాష్ట్రంలో కూడా ఫాసిల్ పార్క్ ఏర్పాటు చేస్తే అరుదైన సంపదను సంరక్షించవచ్చని, వీటిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వీలవుతుందని పలువురు పరిశోధకులు సూచిస్తున్నారు. ఫాసిల్ పార్కు ఏర్పాటు చేయాలి.. మన వద్ద 50 కోట్ల ఏళ్ల నాటి శిలాజ సంపద కూడా ఉంది. అయితే వీటి పరిరక్షణ, ఇతర పరిశోధనల విషయంలో అవసరమైనంత మేర కృషి జరగడం లేదు. ఈ మధ్య కాలంలో పలువురు యువ ఔత్సాహికులు శిలాజాలపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల మాదిరి ఇక్కడ కూడా ఫాసిల్ పార్కుల దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. – చక్కిలం వేణుగోపాల్, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, జీఎస్ఐ 2012 నుంచి పరిశోధనలు.. తెలంగాణలో అనేక అరుదైన శిలాజాలు ఉన్నా యి. నేను 2012లో వీటిపై వ్యక్తిగతంగా పరిశోధనలు ప్రారంభించా. ప్రొఫెసర్లు, ఇతర పరిశోధకుల సహకారంతో నైపుణ్యం సాధించా. ఇప్పటివరకు ఆదిమానవుడి రాతి పనిముట్లు, కోట్ల సంవత్సరాల నాటి డైనోసార్ల అవయవాలకు సంబంధించిన శిలాజాలు సేకరించా. నా పరిశోధనల సంబంధిత సమాచారాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్టలోని వర్సిటీల విద్యార్థులకు సెమినార్లు, ప్రదర్శనల ద్వారా తెలియజేస్తున్నా. – సునీల్ సముద్రాల, ఔత్సాహిక పరిశోధకుడు, బేగంపేట, పెద్దపల్లి జిల్లా -
60+ ‘సూపర్’ బ్రెయిన్.. మెదడుకు వృద్ధాప్యం లేదట!
సాక్షి, అమరావతి: వృద్ధాప్యంలో వెంటాడే ఆరోగ్య సమస్యలతో పాటు మెదడు పనితీరు మందగించి జ్ఞాపక శక్తి క్షీణిస్తుందన్న వాదనల్లో నిజం లేదని అమెరికాలోని జార్జి వాషింగ్టన్ మెడికల్ స్కూల్ పరిశోధకులు చెబుతున్నారు. నిజానికి పెద్దల మెదడు ఎంతో ఆచరణాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటుందని, 60 ఏళ్లు దాటిన తర్వాత తీసుకునే నిర్ణయాలు చాలా సృజనాత్మకంగా ఉంటాయంటున్నారు. వీరి మెదడులో కుడి, ఎడమ హెమిస్పియర్స్ చాలా చురుగ్గా ఉండటంతో సృజనాత్మక ఆలోచనలు విస్తరిçస్తున్నట్టు గుర్తించారు. చక్కటి జీవనశైలి, మానసికంగా చురుగ్గా ఉంటే మేధో సామర్థ్యాలు వయసుతో పాటు పెరుగుతాయే కానీ తగ్గవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 60 ఏళ్లు పైబడిన తర్వాత సృజనాత్మక కార్యకలాపాలను ప్రారంభించిన అనేక మందిపై ప్రయోగాలు నిర్వహించి ఈ ఫలితాలను రూపొందించారు. నియంత్రణలో భావోద్వేగాలు.. చిన్నతనంలో ఏదైనా వస్తువు పాడు చేసినప్పుడు మెదడు విపరీతమైన ఒత్తిడికి లోనవుతుంది. యవ్వనంలో అదే పని చేసినప్పుడు కొంత కంగారు పడినా తక్కువ సమయంలోనే స్థిమితపడతారు. 60 ఏళ్లు దాటాక ఎలాంటి భావోద్వేగాలకైనా ఒకేలా స్థిరంగా స్పందిస్తారు. ఇక 70 ఏళ్ల వయసులో మేధో కార్యకలాపాలు గరిష్ట స్థాయికి చేరినట్లు నిర్ధారించారు. ముదిమి వయసులో మెదడులోని మైలిన్ (న్యూరాన్ల మధ్య సంకేతాలను వేగంగా పంపుతుంది) పరిమాణం పెరుగుతుంది. దీంతో సగటు యువకులతో పోలిస్తే 60 ఏళ్లు దాటిన వారిలో మేధో సామర్థ్యాలు 300 శాతం పెరుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు. తొట్రుపాటు లేకుండా.. 60 ఏళ్ల వయసు నుంచి వృద్ధులు నిర్ణయాలు తీసుకునేందుకు మెదడులోని రెండు హెమిస్పియర్స్ను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ‘80–90 ఏళ్ల వయసులో ఒక వ్యక్తి మెదడు తక్కువ శక్తిని వినియోగించుకుని గరిష్ట స్థాయిలో ఆలోచిస్తుంది. అనవసరమైన విషయాలను వదిలేసి అవసరమైన వాటికే స్పందిస్తుంది’అని మాంట్రియల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మోంచి తెలిపారు. అధ్యయనంలో భాగంగా నిర్వహించిన వివిధ రకాల పరీక్షల్లో విజయం సాధించేందుకు యువకులు చాలా గందరగోళానికి గురవగా 60 ఏళ్లు పైబడినవారు ఎలాంటి తొట్రుపాటు లేకుండా సరైన నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. చికాగో నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీలోని ఫీన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు వీరిని ‘సూపర్ ఏజెర్స్గా’అభివర్ణిస్తున్నారు. 80ల్లో ఉన్నవారు మేధోపరంగా చురుగ్గా ఉండేందుకు పెయింటింగ్, డ్యాన్స్, సంగీతం నేర్చుకోవడంతో పాటు స్నేహితులను కలుస్తూ భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించు కోవడంలో ముందున్నారని, వారు అద్భుతాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
వయాగ్రా అంత డేంజరా? ట్యాబ్లెట్ వేసుకుని మందు తాగిన వ్యక్తి 24 గంటల్లోనే..
న్యూఢిల్లీ: వయగ్రా వేసుకుని మద్యం సేవించిన 41 ఏళ్ల వ్యక్తి 24 గంటల్లోనే చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి భారత పరిశోధకులు రూపొందించిన నివేదికలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. అంగ స్తంభన సమస్యతో బాధపడుతున్న ఓ వ్యక్తి రెండు వయగ్రా ట్యాబ్లెట్లు వేసుకుని అదే సమయంలో ఆల్కహాల్ సేవించాడు. ఆ మరునాడే బ్రెయిన్లో తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయాడు. ఆరుగురు సభ్యులతో కూడిన ఢిల్లీ ఎయిమ్స్ పరిశోధకులు దీనిపై కేస్ రిపోర్ట్‌ను గతేడాది సెప్టెంబర్‌లో రూపొందించారు. దీన్ని ఈ వారమే ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. ఈ నివేదిక ప్రచురణకు కూడా ఆమోదం పొందింది. అయితే పూర్తి స్థాయిలో సమీక్షించిన తర్వాత జర్నల్‌లో ప్రచురించనున్నారు. వయగ్రా తీసుకుని మద్యం తాగడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయనే విషయంపై ఈ పరిశోధకులు పరిశోధనలు జరిపారు. ఈ ఘటనలో మరణించిన 41 ఏళ్ల వ్యక్తికి గతంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, అతనికి శస్త్రచికిత్సలు కూడా జరగలేదని గుర్తించారు. ఇతడు చనిపోవడానికి ముందు రోజు తన స్నేహితురాలితో హోటల్లో ఉన్నాడు. రెండు వయాగ్రా ట్యాబ్లెట్లతో పాటు ఆల్కహాల్ సేవించాడు. ఆ మరునాడే తనకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పగా.. ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఆ తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల్లో బ్రెయిన్లో బ్లీడింగ్ కావడం వల్లే అతను చనిపోయినట్లు తేలింది. మెదడులో గడ్డకట్టిన రక్తం 300 గ్రాములు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక తేల్చింది. అలాగే అతని హార్ట్ వాల్స్ గట్టిపడటంతో పాటు, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినట్లు వెల్లడైంది. వైద్యుల సూచన అవసరం.. దీంతో వైద్యుల సూచన లేకుండా వయగ్రా వాడకూడదని పరిశోధకులు హెచ్చరించారు. దీనివల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయనే విషయంపైనా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. చదవండి: ఆ బీజేపీ ఎమ్మెల్యేకు ఈ రేంజ్లో వెల్కం ఏంది నాయనా..? -
సంతాన లోపానికి సగం కారణం పురుషుల్లోని సమస్యలే.. షాకింగ్ విషయాలు
సాక్షి, హైదరాబాద్: మన దేశంలోని పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని ఎనిమిది ప్రత్యేక జన్యువులు ప్రభావితం చేస్తున్నాయని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ ఎనిమిది జన్యువుల్లో జరుగుతున్న మార్పులు వీర్యం ఉత్పత్తిపై ప్రభావం చూపి, పురుషుల్లో వంధ్యత్వానికి కారణమవుతోందని తేల్చారు. ఈ వివరాలను సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయగ్నస్టిక్స్ డైరెక్టర్ డాక్టర్ కె.తంగరాజ్ వెల్లడించారు. సంతానం కలగకపోవడానికి సగం కారణం పురుషుల్లోని సమస్యలేనని.. పిల్లలు పుట్టకపోతే మహిళలను నిందించడం సరికాదని స్పష్టం చేశారు. జన్యుమార్పులు వంధ్యత్వానికి దారితీస్తున్నట్టు వెల్లడైన నేపథ్యంలో.. ఈ సమస్య పరిష్కారం కోసం మెరుగైన పద్ధతుల ఆవిష్కరణకు వీలవుతుందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్‌కుమార్ నందికూరి తెలిపారు. దీర్ఘకాలం నుంచి పరిశోధనలు..: దేశంలోని పురుషుల్లో వంధ్యత్వ సమస్యకు కారణాలను తెలుసుకునేందుకు డాక్టర్ తంగరాజ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం రెండు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తోంది. గతంలోనూ వంధ్యత్వ సమస్య ఉన్న పురుషుల్లో 38శాతం మంది వై క్రోమోజోమ్‌లో తేడాలున్నట్టు వీరు గుర్తించారు. దీనితోపాటు కణాల్లోని మైటోకాండ్రియా, ఆటోసోమల్ జన్యువుల్లో మార్పులు కూడా వంధ్యత్వానికి కారణమవుతున్నట్టు తేల్చారు. తాజా పరిశోధనలో భాగంగా తాము వంధ్యత్వ సమస్య ఉన్న 47మందిలోని జన్యుక్రమాన్ని పరిశీలించామని తెలిపారు. దేశవ్యాప్తంగా మరో 1,500 మంది వంధ్యత్వ పురుషుల్లోని జన్యుమార్పులతో పోల్చి చూశామని.. ఈ క్రమంలో ఎనిమిది ప్రత్యేక జన్యువుల సంగతి తెలిసిందని పరిశోధనలో భాగం వహించిన సీసీఎంబీ పీహెచ్డీ విద్యార్థి, ముంబై నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ శాస్త్రవేత్త సుధాకర్ దిగుమర్తి తెలిపారు. ఈ పరిశోధనలో బెంగళూరు జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్‌తోపాటు సికింద్రాబాద్‌లోని మమత ఫెర్టిలిటీ ఆస్పత్రి, సీడీఎఫ్‌డీ తదితర జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయని వివరించారు. ఈ వివరాలు హ్యూమన్ మాలిక్యులర్ జెనెటిక్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. డాక్టర్ కె.తంగరాజ్ -
టమాట కెచప్ ప్రియులకు చేదువార్త!
టమాట కెచప్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా ఆస్వాదిస్తారు. బయట రెస్టారెంట్లలో, హోటళ్లలో ప్రధానమైనది ఈ కెచప్. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వచ్చాక అందరూ ఈ టమాట సాస్‌లకు అలవాటు పడిపోయారు. ఐతే ఇక ఆ టమటా కెచప్ తయారు చేయడం కష్టమైపోతుందంటున్నారు వాతావరణ పరిశోధకులు. అందుకు వాతావరణ మార్పులే కారణమంటున్నారు. ఈ అధిక ఉష్టోగ్రతలు కారణంగా టమాట పంట ఉండదేమోనని భయపడుతున్నారు కూడా. ఇటీవల అధిక ఉష్ణోగ్రతలు కారణంగా కూరగాయాల ధరలు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. అందులోనూ టమాట ధర ఇటీవల కనివినీ ఎరుగని రీతిలో ఆకాశన్నంటింది. ఇందంతా ఒకత్తెయితే ఇక రాను రాను ఈ ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటే ఇక టమాట ఉత్పత్తి తగిపోతుందని వాతావరణ అధ్యయనం స్పష్టం చేసింది. ఈ మేరకు డెన్మార్క్‌లోని ఆర్హస్ విశ్వవిద్యాలయం నేతృత్వంలోని పరిశోధకుల బృందం పెరుగుతున్న ఉష్ణోగ్రత టమాటల ఉత్పత్తిని ఎలా ప్రభావితం చేస్తుందో ఒక గణిత నమూనాను రూపొందించింది కూడా. ఇప్పటివరకు ఇటలీ, చైనా మరియు కాలిఫోర్నియా టమాట ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాయని పరిశోధకులు బృందం పేర్కొంది. ఇవి ప్రపంచ ఉత్పత్తిలో ఈ దేశాలే అధికంగా సరఫరా చేస్తున్నాయి. ఐతే ఇప్పుడూ ఇవన్నీ గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రమాదంలో ఉన్నాయని అధ్యయనం తెలిపింది. గణిత నమూనా ప్రకారం 2050 నుంచి 2100 మధ్యకాలంలో టమాట పంట సగానికి తగ్గిపోతుందని తెలిపింది. 2050 నాటికి టమాట ఉత్పత్తి ఆరు శాతం క్షీణిస్తుందని పరిశోధన బృందం పేర్కొంది. అంతేకాదు 2040 నుంచి 2069 మధ్య టమాట ఉత్పత్తి ప్రాంతాలలో సుమారు 2.6 డిగ్రీల సెల్సియస్ ఉష్టోగ్రత ఉంటుందని తదుపరి 30 సంవత్సరాలలో 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుదల ఉంటుందని వెల్లడించింది. ఈ ఉష్ణోగ్రత పెరుగుదలను 1980 నుంచి 2009 మధ్య కాలంలో ఉష్ణోగ్రతల పెరుగుదలను బట్టి పరిశోధకులు అంచనావేశారు. పదకొండు అతి పెద్ద సాగు పంటల్లో ఒకటైన ఈ టమాట పంట ప్రస్తుతం 14 మిలియన్ల టన్నుల నుంచి 7 మిలియన్ల టన్నులకు పడిపోతోంది. గతేడాది కూడా మార్చి నుంచి ఏప్రిల్ నెలల్లో పాకిస్తాన్, భారత్ వంటి దేశాల్లో టమాట పంట దారుణంగా పడిపోయింది. ఇలా టమటాల ఉత్పత్తి దారుణంగా పడిపోతే టమాట కెచప్, టమాట పేస్ట్ వంటివి ఇక ఉండవేమో అంటున్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: మంటల్లో వేసినా కాలిపోని పుస్తకం...వేలంలో ఎంత పలికిందంటే..?) -
పంది గుండె మార్పిడి చేయించుకున్న రోగి చనిపోవడానికి కారణం అదే...
Animal virus detected in patient: ఇటీవలే పందిగుండె అమర్చిన వ్యక్తి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే అతను ఎందువల్ల చనిపోయాడు కారణాలేంటి అనే దానిపై వైద్యులు పరిశోధనలు చేయడం మొదలు పెట్టారు. అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ వైద్యులు 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్‌కి గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. పంది గుండెని అమర్చి ప్రపంచ చరిత్రోలోనే ఒక సంచలనాత్మక ప్రయోగానికి నాంది పలికారు. ఆ సర్జరీ కూడా విజయవంతమైంది. ఇది వైద్యశాస్రంలోనే ఒక సరికొత్త అధ్యయనం అని అందరూ ఆనందించేలోపే ఆ వ్యక్తి సర్జరీ జరిగిన రెండు నెలల్లోనే చనిపోయాడు. వైద్యులు కూడా అతన్ని బతికించేందుకు శతవిధాల ప్రయత్నించారు కూడా. అసలు ఎందుకు ఇలా జరిగిందని పరిశోధనలు చేస్తున్న వైద్యులు కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈమేరకు యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ వైద్యులు మాట్లాడుతూ... పంది గుండె లోపన వైరల్ డీఎన్ఏ ఉంది. పోర్సిన్ సైటోమెగలో వైరస్ అని పిలువబడే ఈ బగ్ రకరకాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందనే విషయాన్ని గుర్తించలేకపోయాం. జంతువుల నుంచి మనుషులను అవయవాలను అమర్చినప్పుడూ కొత్త ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవలసి ఉంటుంది. కొన్ని వైరస్లు చాలా గుప్తంగా ఉంటాయి. సర్జరీకి ముందు బెన్నెట్ మానవ గుండె మార్పిడికీ అనర్హుడని, పైగా అతనికి వ్యాధి నిరోధక శక్తి తక్కువని తెలిసే జన్యుమార్పిడి చేసిన పంది గుండెను అమర్చాం. పైగా ఆ వైరస్ భారిన పడకుండా ఉండేలా అతని అత్యంత మెరుగైన చికిత్స కూడా అందించాం. మా బృందం దాత పంది ఆరోగ్యంగా ఉందని, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ పరీక్షలు నిర్వహించి నిర్ధారించింది. అంతేకాదు ఆ పంది అంటువ్యాధులు వ్యాప్తి చేయకుండా నిరోధించేలా పెంచే ప్రత్యేక సదుపాయంలో ఉంది. బెన్నెట్‌కి యాంటీ వైరల్ మందులు, రోగనిరోధక శక్తిని పెంచే చికిత్సలను అందించాం. అని అన్నారు. బెన్నెట్ సర్జరీ తర్వాత నెమ్మదిగా కోలుకోవడం మొదలు పెట్టాడని, ముందు జాగ్రత్త చర్యగా వైరల్ ఇన్ఫెక్టకు సంబంధించిన పరీక్షలు కూడా నిర్వహించామని సర్జరీ చేసిన డాక్టర్ బార్ట్లీ గ్రిఫిత్ తెలిపారు. ఐతే పంది గుండే ఉబ్బిపోయి ద్రవంతో నిడిపోయి పనిచేయడం మానేసిందన్నారు. కానీ ఈ పంది వైరస్ ఎలా మానవ శరీరంపై ప్రభావితం చేస్తుందో స్పష్టం చేయలేదు. (చదవండి: పెనువిషాదం. పంది గుండె అమర్చిన వ్యక్తి కన్నుమూత) -
రక్తంలో తిష్ట వేసిన ప్లాస్టిక్ కణాలు..షాక్‌లో శాస్త్రవేత్తలు!
Microplastic in human blood: ప్లాస్టిక్ వాడొద్దు అంటూ ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు ఎన్నోఏళ్లుగా మొత్తుకుంటున్నారు. కానీ ప్రజలు తమ నిత్య జీవన విధానంలో ఈ ప్లాస్టిక్ వస్తువులకు అలవాటుపడిపోయారు. అంతతేలిగ్గా బయటేపడే అవకాశం తక్కువ. అదీగాక ప్లాస్టిక్ చాలా చౌకగా దొరకడమే కాకుండా సామాన్య మానవునికి సైతం అందుబాటులో ఉంటుంది. ప్లాస్టిక్ పర్యావరణానికి హానికరం అందువల్ల దయచేసి వాడొద్దు అంటూ నినాదాలు చేసి మరీ సహజ పద్ధతుల్లో తయారు చేసినవి మార్కెట్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారు కూడా. ప్రజలు ఇటీవలే వాటిని వాడేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గానీ ఆ ప్లాస్టిక్ వల్ల జరగవల్సిన నష్టం ఎప్పడో మనిషికి జరిగిపోయింది అంటున్నారు డచ్ శాస్త్రవేత్తలు. అసలేం జరిగిందంటే...పది మంది వ్యక్తుల రక్త నమూనాల్లో దాదాపు 8 మంది రక్తంలో మైక్రోప్లాస్టిక్ కణాలను గుర్తించామని డచ్ శాస్త్రవేత్తలు తమ తాజా అధ్యయనాల్లో వెల్లడించారు. తాము పరిశోధనలు చేసిన సుమారు 77 శాతం మందిలో రక్త ప్రవాహంలో మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నాయని తెలిపారు. ప్లాస్టిక్ గాలితో పాటు ఆహారం, పానీయాల ద్వారా కూడా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుందని వ్రిజే యూనివర్సిటీ ఆమ్స్టర్డామ్లోని ఎకోటాక్సికాలజీ అండ్ వాటర్ క్వాలిటీ అండ్ హెల్త్ ప్రొఫెసర్ డిక్ వెథాక్ నివేదికలో తెలిపారు. పైగా పాలీప్రొఫైలిన్, పాలీస్టైరిన్, పాలీమిథైల్ మెథాక్రిలేట్, పాలిథిలిన్ పాలిథిలిన్ టెరెఫ్తాలేట్ (పీఈటీ) వంటి ఐదు రకాల ప్లాస్టిక్‌ల గురించి పరిశోధనాలు చేయడం మెదలు పెట్టారు. అందులో భాగంగా దాదాపు 22 మంది రక్త నమునాలను సేకరించారు. అయితే ఆ పరిశోధనల్లో చాలా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. సుమారు 17 మంది రక్తదాతల రక్తంలో ప్లాస్టిక్ రేణువుల ఉన్నాయని తెలిపారు. ఆ పరిశోధనల్లో కొంతమంది రక్తదాతల్లో గృహోపకరణాలకు వినియోగించే ప్లాస్టిక్ ఉందని, మరికొంతమంది రక్తం క్యారియర్ బ్యాగ్‌లను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే పాలిథిన్‌ని గుర్తించినట్లు తెలిపారు. అంతేకాదు పరీక్షించిన వారిలో 50 శాతం మంది రక్తంలో పాలిథిలిన్ టెరెఫ్తాలేట్, 36 శాతం మంది రక్తప్రవాహంలో పాలీస్టైరిన్ కూడా ఉందని వెల్లడించారు. ఏదీఏమైన మానవుని ఆరోగ్యం ప్రమాదకరమైన స్థితిలోకి చేరకమునుపే ప్లాస్టిక్‌కి సంబంధించిన వస్తువులను పూర్తిగా బ్యాన్ చేయాల్సిందే. (చదవండి: బరువులు ఎత్తడంలో, ఎత్తులను ఎక్కడంలోనూ దిట్ట! -
చీమలు క్యాన్సర్ కణాలను గుర్తించగలవట! ఎలాగో తెలుసా!
Scientists Discover Ants Can Identify Cancerous Cells: ప్రస్తుత వైద్యావిధానంలో సరికొత్త మార్పుల చోటు చేసుకుంటున్నాయి. కేవలం సాంకేతికతను అందిపుచ్చుకుని అత్యాధునిక వైద్యాన్ని అందించడమే కాక తమ చుట్టూ అందుబాటులో ఉన్న వనరులతో తక్కువ ఖర్చుతో సామాన్యులకు సైతం వైద్యం అందించేందుకే శాస్త్రవేత్తల బృందం నిరతరం కృషి చేస్తోంది. అందులో భాగంగానే శాస్త్రవేత్తలు క్యాన్సర్ చికిత్స, త్వరితగతిన గుర్తించు విధానాలపై అధ్యయనాలు చేశారు. తాజా అధ్యయనాల్లో చీమలు అత్యంత సులభంగా మానవుని శరీరంలోని క్యాన్సర్ కణాలను సులభంగా గుర్తించగలవు అని కునుగొన్నాం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎలాగో తెలుసా!. వివరాల్లోకెళ్తే..చీమలు క్యాన్సర్ కణాలను గుర్తించేందుకు వాటి వాసన సామర్థ్యాన్ని ఉపయోగించగలవని శాస్త్రవేత్తల బృందం కనుగొంది. ఈ పరిశోధనలుల చేయడానికి సిల్కీ చీమలు అని పిలిచే ఫార్మికా ఫుస్కా అనే చీమలను వినియోగించింది. వాటికి రివార్డ్ సిస్టమ్ ద్వారా శిక్షణ ఇచ్చింది. నిజానికి అవి తమ వాసన సాయంతోనే ఆహారాన్ని సంపాదించుకునే చీమలు మానవునిలోని క్యాన్సర్ కణాల నంచి ఆరోగ్యకరమైన కణాలను వేరుచేయగలవు అని ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ (సీఎన్ఆర్ఎస్) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ శాస్త్రవేత్త బృందం చాలా సమర్ధవంతంగా క్యాన్సర్‌ని నయం చేసే పద్ధతులను అన్వేషించే క్రమంలోనే ఈ విషయాన్ని కనుగొన్నారు. మానవ క్యాన్సర్ కణాలను గుర్తించడానికి చీమను జీవన సాధనాలుగా ఉపయోగించడం అత్యంత సులభమైనది మాత్రమే కాక తక్కువ శ్రమతో కూడినదని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు ఈ చీమలకు తొలుత చక్కెర ద్రావణంతో వాసనకు సంబంధించిన శిక్షణ ఇవ్వాలి. ఆ తర్వాత అవి క్రమంగా రెండు వేర్వేరు రకాల క్యాన్సర్ కణాలను గుర్తించుకునే స్థాయికి చేరుకుంటాయి. ఇప్పుడు వాటి సామర్థ్యాన్ని మానవుడిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి అంచనా వేయాల్సి ఉందని చ్పెపారు. అయితే ఈ మొదటి అధ్యయనం చీమలు అధిక సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని, చాలా త్వరగా, తక్కువ ఖర్చుతో నేర్చుకోవడమే కాక సమర్థవంతంగా పనిచేస్తాయని తేలిందని అన్నారు. అంతేగాదు ఈ చీమలు మాదక ద్రవ్యాలు, పేలుడు పదార్థాలు లేదా ఇతర వ్యాధులకు సంబంధించిన వాసనలను కూడా పసిగట్టే సామర్థ్యం పై పరిశోధనలు చేస్తున్నారు. అయితే వాటికి మంచి ఘ్రాణ శక్తి కలిగి ఉందని తెలిపారు. పైగా కుక్కుల కంటే చాలా త్వరతిగతిన క్యాన్సర్ కణాల గుర్తింపు శిక్షణను చీమలు తీసుకోంటాయని అన్నారు. (చదవండి: చెర్నోబిల్‌లో ‘అణు’మానాలు.. భయం గుప్పిట్లో యూరప్) -
Nikola: ప్రాణం లేదు.. అయినా బుడ్డోడి హావభావాలు అదుర్స్
మనిషిలా ప్రాణం లేకున్నా.. భావోద్వేగాలు పండించడం ఎలాగబ్బా అనుకుంటున్నారా? రజినీకాంత్ రోబో సినిమా తెలుసు కదా! అచ్చం అలానే. నికోలా మనిషి కాదు.. ఆండ్రాయిడ్ కిడ్. ఆండ్రాయిడ్స్(రోబోలను) మనుషులతో ఎమోషనల్‌గా కనెక్ట్ చేయాలన్న ప్రయత్నాలు కొత్తేం కాదు. రియల్ లైఫ్ సిచ్యుయేషన్స్లో ప్రత్యేకించి.. వయసు మళ్లిన వాళ్లను చూస్కోవడానికి, ఒంటరి జీవుల బాగోగుల కోసం పనికి వస్తాయని అనుకుంటున్నారు. అదే సమయంలో కోపం, అసహనం లాంటివి విపరీతాలకు దారి తీసే అవకాశమూ లేకపోలేదన్న ఆందోళన వ్యక్తం అవుతోంది కూడా. ఇదిలా ఉంటే నికోలా అనే ఆండ్రాయిడ్ కిడ్ గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. నికోలా.. మనిషి కాదు. ఆండ్రాయిడ్ కిడ్. జపాన్ రీసెర్చర్లు రైకెన్ గార్డియన్ రోబో ప్రాజెక్టులో భాగంగా ఈ బచ్చా రోబోను రూపొందించారు. ఈ ఎక్స్‌ప్రెసివ్ హ్యూమనాయిడ్ రోబో ఆరు రకాల ఎమోషన్స్‌ను ప్రదర్శిస్తుంది. సంతోషం, బాధ, భయం, కోపం, ఆశ్చర్యం, అసహ్యం. Nikola ఈ ఎమోషన్స్‌ను అర్టిఫిషియల్ కండరాల కదలిక వల్ల.. భావోద్వేగాల్ని పండించగలుగుతుంది. సోషల్ సైకాలజీ, సోషల్ న్యూరోసైన్స్ పరిశోధనలకు నికోలా లాంటి రోబోలు అంశాలుగా పనికొస్తాయని రీసెర్చర్లు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నికోలాకు ఇంకా బాడీ సిద్ధం కాలేదు. త్వరలో సిద్ధం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అదే జరిగితే.. ఎక్స్ప్రెషన్స్ రోబో కిడ్‌గా నికోలా తొలి ఘనత సాధించినట్లవుతుంది. -
2 వేల ఏళ్లనాటి మమ్మీ కడుపులోని పిండాన్ని గుర్తించిన సైంటిస్టులు!!
Foetus Found In The Abdomen Of An Egyptian Mummy: ఇంతవరకు ఈ జిప్షియన్ మమ్మీలపై శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేశారు. ఇటీవలే మమ్మీలను తాకుకుండానే సరికొత్త సాంకేతికత కూడిన మమ్మఫికేషన్ సాయంతో పరిశోధించడం గురించి విన్నాం. ఆ సాంకేతిక సాయంతో 20 ఏళ్ల నాట్టి ఈజిప్షియన్ మమ్మి కడుపులో భద్రంగా ఉన్న పిండాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. అసలు విషయంలోకెళ్తే...20 వేల ఏళ్లనాటి ఈజిప్షియన్ మమ్మీ పొత్తికడుపులో పిండాన్ని గుర్తించారు. ఈ మేరకు వార్సా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఆ పిండం పై పరిశోధనుల చేశారు. సీటీ ఎక్స్ రే స్కాన్ సాయంతో పుట్టబోయే బిడ్డ అవశేషల ఉనికిని వెల్లడించారు. అంతేకాదు దీన్ని మమ్మీ పిండాన్ని కలిగి ఉన్న తొలి ఎంబాల్డ్ నమూనాగా విశ్వస్తారని చెప్పారు. అయితే 20 ఏళ్ల వయసులో చనిపోయిన ఈ మమ్మీని 'మిస్టిరియస్ లేడీ' అని పిలుస్తారు. అయితే ఆ మహిళ ప్రసవంలో చనిపోలేదని పరిశోధకులు తెలిపారు. అంతేకాదు ఆ మహిళ మరణానికి గల కారణాలు గురించి తెలియలేదని చెప్పారు. పైగా ఆ మమ్మీ సమాధి శిధిలమైపోయిందని తెలిపారు. అయితే ఆ మహిళ గర్భం దాల్చిన 26 నుంచి 30 వారాల పిండంగా నిర్ధారించారు. కానీ మమ్మీలను రసాయన పదార్థాలను పూసి ఉంచడం వల్ల ఆ మమ్మీ కడుపులోని పిండంలోని ఎముకలు నిర్విర్యం అయిపోయాయని చెప్పారు. అయితే ఆ పిండం పై ఉన్న మృదు కణజాలంతో ఆ పిండాకృతిని గుర్తించడం కష్టతరమవుతుందని తెలిపారు. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు మమ్మీఫికేషన్ ప్రక్రియలో మమ్మీ శరీరంలోని అంతర్గత భాగాలను తొలగించే క్రమంలో వారు ఎందుకు పిండాన్ని పొత్తికడుపులోనే వదిలేశారు అనే దాని వీద శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. -
14 ఏళ్లకే అద్భుతం అనిపించిన ట్విన్ బ్రదర్స్.. ఇంతకీ ఏం చేశారంటే..?
ఎందుకు? ఏమిటి? ఎలా....అనే ఆసక్తి వీరిని రకరకాల శాస్త్ర,సాంకేతిక పుస్తకాలు చదివేలా చేసింది. కొత్తగా ఆలోచించేలా చేసింది. కొత్త మార్గంలో వెళ్లేలా చేసింది. చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకునేలా చేసింది... పద్నాలుగేళ్ల వయసులో పిల్లలు ఎలా ఉంటారు? సినిమాలంటే బోలెడు ఇష్టపడతారు. సంగీతం అంటే చెవి కోసుకుంటారు. వీరతాళ్లు మెడలో వేసుకొని వీడియో గేమ్స్ ఆడతారు. అయితే దిల్లీకి చెందిన ట్విన్ బ్రదర్స్ యశ్‌రాజ్ భరద్వాజ్, యువరాజ్ భరద్వాజ్ మాత్రం ఈ వయసులోనే తమ వయసుకు మించిన పనులు చేశారు. అద్భుతం అనిపించుకున్నారు. కాస్త వెనక్కి వెళితే.. అందరు పిల్లలలాగే ఈ కవల సోదరులకు క్రికెట్ అంటే చెప్పలేనంత ఇష్టం. చదువు మీద కంటే ఆట మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టేవాళ్లు. ‘ఇలా అయితే చదువు పూర్తిగా దెబ్బతింటుంది. మీరు కొంతకాలం క్రికెట్‌ను దూరం పెడితే మంచిది’ అని బుజ్జగింపు ధోరణిలో చెప్పాడు తండ్రి. ఇక అంతే...అప్పటి నుంచి క్రికెట్ జోలికి వెళ్లలేదు. చదువే వారి ప్రపంచం అయింది. చదవండి: టీచరమ్మ స్కూలు సేద్యం నేషనల్ జాగ్రఫిక్–డిస్కవరీ చానల్స్ చూడడం ద్వారా ‘ఎందుకు? ఏమిటి? ఎలా?’ అనే జిజ్ఞాస పెరిగింది. తమ పుస్తకాలే కాకుండా పై తరగతి పుస్తకాలు చదివేవారు. సందేహాలు వస్తే సీనియర్లను అడిగేవారు. సైన్స్ ఫిక్షన్‌తో పాటు రిసెర్చ్ పేపర్స్, విజ్ఞానదాయకమైన బ్లాగ్స్ విరివిగా చదివేవారు. ప్రాజెక్ట్ మెనేజ్మెంట్ కన్సల్టెన్సీ, ట్రాన్స్ఫర్మెషన్ కన్సల్టింగ్, స్ట్రాటజిక్ స్టడీస్, ఫ్రాడ్ ఎనాలసిస్, డాటా ఎనాలటిక్స్...ఇలా రకరకాల విషయాల గురించి తెలుసుకోవడం ప్రారంభించారు. రకరకాల జర్నల్స్ చదివి వాటి గురించి చర్చించుకునేవారు. రిసెర్చ్ ఐడియాలను రాసుకునేవారు. ఈ క్రమంలోనే సొంతంగా రిసెర్చ్ పేపర్స్ రాయడం నేర్చుకున్నారు. ఫరీదాబాద్(హరియాణా)లోని ‘మానవ్ రచన ఇంటర్నేషనల్ యూనివర్శిటీలో’ ఇంజనీరింగ్ పూర్తికాకముందే బ్రెయిన్–కంప్యూటర్ ఇంటర్ఫేస్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆల్–ఇన్–వన్ మెడికల్ అసిస్టెన్స్...ఇలా ఎనిమిది అంశాలలో పేటెంట్ పొందారు. ‘క్రికెట్ మానేసినప్పుడు మొదట్లో చాలా బాధ అనిపించింది. అయితే కొత్త విషయాల గురించి తెలుసుకోవడం, కొత్త విషయాల గురించి ఆలోచించడంలో క్రికెట్లో కంటే ఎక్కువ సంతోషం దొరికింది’ అంటాడు యువరాజ్. రకరకాల బహుమతులు, గ్రాంట్స్, ఫెలోషిప్స్ ద్వారా వచ్చిన డబ్బుతో ‘పెటోనిక్ ఇన్ఫోటెక్’ అనే కన్సల్టెన్సీ సర్వీస్‌ను ప్రారంభించారు. ఇది టెక్నాలజీ, ఫైనాన్స్, అగ్రికల్చర్, మాన్యుఫాక్చరింగ్, హెల్త్‌కేర్...మొదలైన రంగాలలో కన్సల్టింగ్ సర్వీస్‌ను అందిస్తుంది. పేరు పొందిన కంపెనీలు కూడా వీరి క్లయింట్స్ జాబితాలో ఉన్నాయి. కోవిడ్ దెబ్బకు పెద్ద పెద్ద కంపెనీలు నష్టాల బాట పట్టాయి. ఇలాంటి క్లిష్ల సమయంలోనూ ‘పెటోనిక్ ఇన్ఫోటెక్’ దెబ్బతినలేదు. ‘ఒక విధంగా చెప్పాలంటే కోవిడ్ మా ముందు ఎన్నో సవాళ్లను పెట్టింది. ఎన్నో ద్వారాలు తెరవడానికి కారణం అయింది. మునపటి కంటే ఎక్కువ శక్తితో పనిచేశాం. ప్రతి చాలెంజ్ ఎగై్జటింగ్‌గా అనిపించింది. ఉద్యోగుల సంఖ్యను పెంచుకోగలిగాము’ అంటాడు యశ్‌రాజ్ భరద్వాజ్.‘హుందాతనం నిండిన మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చాం. చదువే మన ఆస్తి అని ఎప్పుడూ చెబుతుండేవారు నాన్న’ అంటాడు యువరాజ్ భరద్వాజ్. ఈ ఇద్దరిని ఒకేసారి చూస్తే ‘ఎవరు యశ్‌రాజ్?’ ‘ఎవరు యువరాజ్?’ అని వెంటనే పోల్చుకోవడం కష్టం కావచ్చుగానీ ‘ఎవరికి వారు సాటి’ అని మెచ్చుకోవడంలో ఎలాంటి అయోమయానికి తావు లేదు. -
ఒమిక్రాన్‌తో డెల్టాకు చెక్!? పరిశోధనలో కీలక విషయాలు వెల్లడి
Omicron Boost Immunity Against Delta: ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి.. అనేది పాత సామెత! ముందునుంచి ఉన్న చెవులకు కొత్త కొమ్ముల వాడి తగలడం దీనికి కొనసాగింపు! ఈ కథలో ముందునుంచి ఉన్న చెవులు డెల్టా వేరియంట్ కాగా, వెనకొచ్చిన కొమ్ములు ఒమిక్రాన్ వేరియంట్. డెల్టాను మించిన వేగంతో ఆవతరించిన ఒమిక్రాన్ క్రమంగా డెల్టాకే పరోక్ష ప్రమాదకారిగా మారుతోందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ఈ వివరాలేంటో చూద్దాం.. ఒమిక్రాన్ సోకిన వ్యక్తి శరీరంలో ఉత్పన్నమయ్యే యాంటీ బాడీలు భవిష్యత్‌లో డెల్టా వేరియంట్ సోకితే అడ్డుకునేలా సదరు వ్యక్తి శరీరంలో రోగనిరోధకతను పెంచుతాయని దక్షిణాఫ్రికా పరిశోధకులు వెల్లడించారు. డెల్టా వేరియంట్ స్పైక్ ప్రొటీన్‌లో జరిగిన పలు మ్యుటేషన్లతో ఒమిక్రాన్ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే! డెల్టాతో పోలిస్తే దీనికి వేగం, వ్యాప్తి సామర్ధ్యం ఎక్కువని నిరూపితమైంది. అదేవిధంగా శరీరంలో టీకాల వల్ల, గత ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన ఇమ్యూనిటీని కూడా ఒమిక్రాన్ అధిగమిస్తుందని పరిశోధనలు వెల్లడించాయి. అయితే డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వల్ల కలిగే వ్యాధి తీవ్రత తక్కువగా ఉండడం గమనార్హం. దీనివల్లనే ఒమిక్రాన్ ప్రపంచమంతా అత్యధిక వేగంతో వ్యాపించినా, డెల్టా తరహాలో మరణాలు సంభవించడం లేదు. అంటే డెల్టా సోకితే వచ్చిన యాంటీబాడీలు ఒమిక్రాన్‌ను అడ్డుకోలేకపోతున్నాయి. కానీ ఒమిక్రాన్ సోకితే వచ్చే యాంటీబాడీలు మాత్రం అటు డెల్టాను, ఇటు ఒమిక్రాన్‌ను అడ్డుకోగలుగుతున్నాయి. అందుకే కొందరు సైంటిస్టులు ఒమిక్రాన్ దేవుడు ఇచ్చిన ‘‘సహజ వ్యాక్సిన్’’గా అభివర్ణిస్తున్నారు. టీకా చేసే పనులను ( వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉండడం, శరీరంలో ఇమ్యూన్ రెస్పాన్స్‌ను ప్రేరేపించడం) ఈ వేరియంట్ చేస్తోందని భావిస్తున్నారు. ఈ భావనకు తాజా పరిశోధన బలం చేకూరుస్తోంది. ఏమిటీ పరిశోధన ఒమిక్రాన్ వేరియంట్‌ను మరింతగా అవగాహన చేసుకునేందుకు దక్షిణాఫ్రికా పరిశోధకులు ఒక అధ్యయనం జరిపారు. దీని వివరాలను మెడ్‌ఆర్‌ఎక్స్‌ఐవీలో ప్రచురించారు. పరిశోధనలో భాగంగా 15మందిని అధ్యయనం చేశారు. వీరిలో టీకాలు తీసుకున్నవారు మరియు ఇంతవరకు టీకాలు తీసుకోకుండా ఒమిక్రాన్ వేరియంట్ సోకినవారు ఉన్నారు. ఈ రెండు గ్రూపులకు చెందిన వారి రక్తం, ప్లాస్మాల్లో యాంటీబాడీలను విశ్లేషించారు. వీరి శరీరంలో ఉత్పన్నమైన యాంటీబాడీల్లో డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లను అడ్డుకునే సామర్థ్యాన్ని పరిశీలించారు. ఇందుకోసం ‘‘న్యూట్రలైజేషన్’’పరీక్ష నిర్వహించారు. లక్షణాలు కనిపించినప్పుడు, తిరిగి రెండు వారాల తర్వాత మొత్తం రెండు దఫాలు ఈ పరీక్షలు చేశారు. ఒమిక్రాన్ సోకి యాంటీబాడీలు ఉత్పత్తైన వ్యక్తుల్లో ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా న్యూట్రలైజేషన్ 14 రెట్లు అధికంగా పెరిగినట్లు గుర్తించారు. అదేవిధంగా డెల్టాకు వ్యతిరేకంగా న్యూట్రలైజేషన్ 4.4 రెట్లు పెరిగినట్లు గమనించారు. అంటే ఒమిక్రాన్ సోకి వ్యాధి తగ్గిన వారిలో అటు ఒమిక్రాన్, ఇటు డెల్టాకు వ్యతిరేకంగా ఇమ్యూన్ రెస్పాన్స్ పెరుగుతుందని తేల్చారు. అంటే ఒకసారి ఒమిక్రాన్ సోకి తగ్గితే సదరు వ్యక్తికి భవిష్యత్‌లో డెల్టా, ఒమిక్రాన్ సోకే అవకాశాలు బాగా తగ్గవచ్చని పరిశోధకుడు అలెక్స్ సైగల్ అభిప్రాయపడ్డారు. టీకా సైతం ఇదే పనిచేస్తున్నందున ఒమిక్రాన్‌ను కరోనాకు వ్యతిరేకంగా దేవుడిచ్చిన టీకాగా భావించవచ్చన్నది నిపుణుల అంచనా. ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తే కరోనా ఒక సాధారణ జలుబుగా మారిపోయే అవకాశాలున్నాయనేది ప్రస్తుతానికి వినిపించే గుడ్ న్యూస్! విమర్శలు కూడా ఉన్నాయి... సైగల్ చేపట్టిన పరిశోధన వివరాలు ఆశాజనకంగా ఉన్నా, ఈ పరిశోధనపై పలువురు విమర్శలు చేస్తున్నారు. కేవలం 15మంది వాలంటీర్ల అధ్యయనంతో మొత్తం ప్రపంచ మానవాళి ఆరోగ్యాన్ని అంచనా వేయలేమన్నది విమర్శకుల వాదన. డెల్టా కన్నా ఒమిక్రాన్ మంచిదనేందుకు ఈ యాంటీబాడీల పరీక్ష కాకుండా మరే ఆధారాలు దొరకలేదు. ఇప్పటికే శరీరంలో ఉన్న ఇమ్యూనిటీని ఒమిక్రాన్ యాంటీబాడీలు పెంచిఉండొచ్చని కొందరి అంచనా. అలాగే డార్విన్ సిద్ధాంతం ప్రకారం డెల్టాను ఒమిక్రాన్ తరిమేస్తే భవిష్యత్‌లో మరో శక్తివంతమైన వేరియంట్ పుట్టుకురావచ్చు. అందువల్ల కేవలం ఒమిక్రాన్‌తో కరోనా ముగిసిపోకపోవచ్చని పరిశోధకుడు డాక్టర్ పియర్సన్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో మూడు పరిణామాలకు అవకాశం ఉందన్నారు. 1. ఫ్లూ వైరస్లాగా ప్రతి ఏటా ఒక సీజనల్ కరోనా వేరియంట్ పుట్టుకురావడం . 2. డెంగ్యూలాగా పలు కోవిడ్ వేరియంట్లు పుట్టుకొస్తూ కొన్ని సంవత్సరాలకొకమారు ఒక వేరియంట్ విజృంభించడం. 3. తేలికగా నివారించగలిగే ఒకటే వేరియంట్ మిగిలడం.. అనేవి పియర్సన్ అంచనాలు. వీటిలో మూడోది మానవాళికి మంచిదని, కానీ దీనికి ఛాన్సులు తక్కువని ఆయన భావిస్తున్నారు. –నేషనల్ డెస్క్, సాక్షి -
సెనోలిటిక్స్.. వయసుపై యుద్ధం!
జాతస్య హి ధ్రువో మృత్యు... పుట్టిన వాడు గిట్టక తప్పదు! అందరికీ తెలిసిన సత్యం ఇది.కానీ బతికినన్ని రోజులూరోగాలు దరిచేరకుండా ఉంటే?కనీసం వాటితో వచ్చే నొప్పి, సమస్యలు తక్కువగా ఉంటే? ఎంతో బాగుంటుంది కదూ! అన్నీ సవ్యంగా సాగితే త్వరలోనే ఈ అద్భుతం సాకారం కానుంది. సెనోలిటిక్స్... ఈ పదం ఎప్పుడైనా విన్నారా? వయసు మీదపడ్డాక వచ్చే సమస్యలను తగ్గించే మందులను సెనోలిటిక్స్ అని పిలుస్తున్నారు. వయసును జయించేందుకు.. చిరాయువుగా ఉండేందుకు శతాబ్దాలుగా మనిషి ప్రయత్ని స్తున్నప్పటికీ ఈ విషయంలో సాధించింది కొంతే. కానీ 1961లో సెనెసెంట్ కణాలను గుర్తించాక ఈ పరిస్థితిలో మార్పొచ్చింది. ఏమిటీ సెనెసెంట్ కణాలు? సాధారణ పరిభాషలో చెప్పాలంటే సెనెసెంట్ కణాలను వయసైపోయిన కణాలు అనొచ్చు. ఏర్పడ్డ క్షణం నుంచి గిట్టేంత వరకూ శరీర కణాలు నిత్యం విభజితమవుతుంటాయి. అయితే ఒక దశ దాటాక కణాల శక్తి నశించి విడిపోకుండా ఉండిపోతాయి. కాలక్రమంలో ఈ కణాలు శరీరంలో ఎక్కువ అవుతుంటాయి. ప్రతి అవయవం, వ్యవస్థకు చెందిన సెనెసెంట్ కణాలు పోగుబడటం వల్లే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు.. సెనెసెన్స్ దశకు చేరుకున్న కణం తనంతట తాను నశించిపోయే ప్రక్రియను కూడా ప్రారంభిస్తుంది. అప్టోసిస్ అని పిలిచే ఈ ప్రక్రియ సక్రమంగా పనిచేయకపోతే సమస్యలు వస్తాయి. ఈ రెండు సమస్యలను పరిష్కరించ గలిగితే.. అంటే సెనెసెంట్ కణాలు బయటకు వెళ్లిపోయేలా చేసినా.. అప్టోసిస్ సక్రమంగా పనిచేసేలా చేసినా.. వృద్ధాప్య సమస్యలను అధిగమించినట్లే! కేన్సర్‌ను అడ్డుకునేందుకూ... ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన సెనొలిటిక్ మందులు శరీరంలోని సెనెసెంట్ కణాలను సులువుగా తొలగిస్తాయి. అయితే వాటిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నందున వాటి విస్తృత వాడకానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. నిజానికి సెనెసెంట్ కణాలతో ఎప్పుడూ నష్టమే జరగదు. విభజన చేతకానంత దెబ్బతిని ఉంటే కణం పెరగడం ఆగిపోతుంది. కొన్నిసార్లు కేన్సర్ కారక జన్యుమార్పులను కట్టడి చేసేందుకూ కణాలు సెనెసెంట్ దశకు చేరుకుంటాయి. అడ్డూఅదుపు లేకుండా కణాలు విభజితం కావడమే కేన్సర్ అన్నది తెలిసిందే. గాయాల వల్ల దెబ్బతిన్న కణాలు కూడా సెనెసెంట్ దశకు చేరుకుంటాయి. అయితే ఈ క్రమంలో కణాలు తమ చుట్టూ ఉన్న ఇతర కణాలకు నష్టం కలిగించే ప్రొటీన్లు, పదార్థాలను విడుదల చేస్తుంటాయి. ఫలితంగా మంట/వాపు వంటివి ఏర్పడి చివరకు చుట్టూ ఉన్న కణాలు మరణిస్తాయి. కణాలు అప్టోసిస్ను నిరోధించినా, నష్టం కొనసాగినా ఆర్థరైటిస్, మధుమేహం, గుండె జబ్బుల్లాంటివి వస్తాయని అంచనా. తొలగిస్తే ప్రయోజనాలు... 2004లో మేయో క్లినిక్‌కు చెందిన జేమ్స్ కిర్క్ల్యాండ్ సెనెసెంట్ కణాలపై కొన్ని పరిశోధనలు చేపట్టారు. ఆయుష్షును పెంచేందుకు జరిగిన ప్రయోగాల్లో ఎలుకల్లోని సెనెసెంట్ కణాలు మాయమవడాన్ని గుర్తించారు. ఇదే పనిని మందుల సాయంతో ఎలా చేయాలో తెలుసుకునేందుకు జరిపిన ప్రయోగాల కారణంగా డసాటినిబ్, క్యుర్సెటిన్ అనే రెండు మందుల గురించి తెలిసింది. డసాటనిబ్ కేన్సర్ మందు. క్యుర్సెటిన్ అనేది కొన్ని పండ్లు, కాయగూరల్లో సహజసిద్ధంగా లభిస్తుంది. ఈ రెండూ తొలి సెనోలిటిక్ మందులయ్యాయి! ఇవి సెనెసెంట్ కణాలు జీవించి ఉండేందుకు కారణమైన వాటిని లక్ష్యంగా చేసుకొని పనిచేస్తాయని, ఫలితంగా ఈ కణాలు నశించిపోతాయని తెలిసింది. అయితే కొన్ని కణాలు ఈ రెండింటికీ లొంగని నేపథ్యంలో మరిన్ని సెనోలిటిక్ మందుల కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. 2015లో నావిటోక్లాక్స్ అనే మందు రేడియోధార్మికత బారినపడ్డ ఎలుకల్లోనూ సెనెసెంట్ కణాలను నశింపజేస్తున్నట్లు స్పష్టమైంది. దాంతోపాటు సెనెసెంట్ దశకు చేరుకున్న మూలకణాలు మళ్లీ చైతన్యవంతమైనట్లు ఈ ప్రయోగాల తరువాత తెలిసింది. ప్రస్తుతం అల్జీమర్స్, కీళ్లనొప్పులు, మాస్కులర్ డీజనరేషన్, చిన్నతనంలోనే కేన్సర్‌ను ఎదుర్కొని శరీరంలో భారీ మొత్తంలో సెనెసెంట్ కణాలు కలిగి ఉన్న వారిపైనా నావిటోక్లాక్స్ను ఉపయోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేకాదు అంధత్వ నివారణతోపాటు వెన్నెముక గాయాలకు చికిత్సగా ఉపయోగపడే సెనోలిటిక్ మందులపైనా ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ లీచెస్టర్ నేతృత్వంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సెనెసెంట్ కణాలను లక్ష్యంగా చేసుకొని పనిచేసే యాంటీబాడీలను తయారు చేసేందుకు ఈ నెలలోనే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ప్రయోగాలు విజయవంతమైతే ఆడుతూ పాడుతూ వయసును దాటేయవచ్చు. ఆ తరువాత ఏమిటన్నది మాత్రం తెలియకపోవడం కొసమెరుపు! -
ఆ కెమికల్ వల్లే అమెరికాలో ఏటా లక్ష మంది మృతి
న్యూయార్క్: మనం రోజు పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు వాడే ప్లాస్టిక్స్ పరికరాలన్నింటిలో థాలెట్ ఆనే కెమికల్ ఉన్నట్లు న్యూయార్క్ పరిశోధకులు గుర్తించారు. ఆఖరికి పిల్లలు ఆడుకునే బొమ్మలు దగ్గర్నించి మనం నిత్యం వాడే దుస్తులు, షాంపు నుంచి మేకప్ వరకు అన్ని ప్లాస్టిక్‌తోనే రూపోందించినవే కావడంతో అత్యధికంగా థాలెట్ అనే కెమికల్ ఉత్పన్నవతోందని వెల్లడించారు. (చదవండి: ఆ గాయని వస్తువులు మిలియన్ డాలర్లు!) ఇది హర్మోన్ల వ్యవస్థను నాశనం చేసే కారకాలుగా ప్రసిద్ధిమైనవే కాక మొత్తం మానవ వినాళికా గ్రంథి వ్యవస్థనే ప్రభావితం చేస్తుందని హెచ్చరించారు. ఆ ప్లాస్టిక్ వస్తువులు మన నిత్య జీవితంలో ఒక భాగమైపోయాయని అందువల్లే ఈ విషపూరిత రసాయనాలు మన శరీరంలోకి సులభంగా ప్రవేశిస్తున్నాయి అని అన్నారు. దీంతో మధుమేహం, ఊబకాయం, గుండే జబ్బులు అధికమవుతున్నట్లు తాజా అద్యయనాల్లో తెలపారు. న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన గ్రాస్మన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన పరిశోధనలో 55 నుంచి 64 సంవత్సరాల వయస్సు గల ఐదు వేల మంది మూత్రంలో థాలెట్ల సాంద్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు. అంతేకాదు వారు గుండె జబ్బులతో చనిపోయే అవకాశం ఉందని వెల్లడించారు. గుండెజబ్బులకు ప్రధానం కారణం రసాయాలేనని తెలిపారు. అలాగే పురుషులలో టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గిపోవడానికి కారణం ఈ థాలెట్ రసాయనమే కారణం అని చెప్పారు. ఈ థాలెట్ రసాయనం వల్ల అమెరికన్లు రకరకాల వ్యాధుల భారినపడి ఏటా 1,00,000 మంది అమెరికన్లు మరణిస్తున్నారని.. ఫలితంగా ఆర్థికంగా 40 నుంచి 47 బిలియన్ల డాలర్ల వరకు నష్టపోతున్నట్లు న్యూయార్క్ పరిశోధకులు అధ్యయనాల్లో పేర్కొన్నారు. (చదవండి: కూతురు ఆనందం: హే.. నాన్న కూడా నాతో పాటే..!) -
చెమటతో మొబైల్ ఫోన్ ఛార్జింగ్...!
Charging With Finger Strip: మానవ పరిణామ క్రమంలో చక్రం నుంచి మొదలైన ఆవిష్కరణలు ఎన్నో ఇతర ఆవిష్కరణలకు దారితీశాయి. తన మేధ సంపత్తితో అనేక విషయాలను జయించాడు. రాబోయే విపత్తులను తెలుసుకోవడంలో, ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని తన మునివేళ్లపై తెచ్చుకున్నాడు. రకరకాల ఆవిష్కరణలతో సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను కనుగొంటున్నాడు. మానవుడి ఆవిష్కరణలో భాగంగా చెప్పుకోదగిన ఇన్నోవేషన్ మొబైల్ ఫోన్. సాధారణంగా మొబైల్ ఫోన్లు ఎదుర్కోంటున్న ప్రధాన సమస్య ఛార్జింగ్. ఫోన్లలో బ్యాటరీ పూర్తిగా ఐపోతే ఎందుకు పనికిరాదు. కాగా ఛార్జింగ్ సమస్యను కూడా పరిష్కరించడం కోసం సైంటిస్టులు ఇప్పటికే ప్రయత్నాలను మొదలుపెట్టారు.తాజాగా మానవ శరీరం నుంచి వెలువడే చెమటతో మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ చేయవచ్చునని పరిశోధకులు నిరూపించారు. చెమటతో ఛార్జింగ్ చేసే ప్రత్యేక ఆవిష్కరణను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు ఆవిష్కరించారు. పరిశోధకుల ప్రకారం.. చేతి వేళ్లకు ఒక ప్రత్యేకమైన స్ట్రిప్‌ను ఉంచుకోవడం ద్వారా మానవ శరీరం నుంచి వెలువడే చెమటనుపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని పేర్కొన్నారు. 10 గంటల పాటు స్ట్రిప్‌ను ధరించడంతో సుమారు 400 మిల్లీజౌల్స్ వరకు శక్తిని ఉత్పత్తి చేయవచ్చునని పరిశోధనలో తేలింది. ఈ శక్తితో ఒక స్మార్ట్‌వాచ్ 24 గంటలపాటు నడుస్తుందని తెలిపారు. అంతేకాకుండా చేతి వేళ్లకు, మొబైల్ ఫోన్ స్క్రీన్‌పై ప్రత్యేక ఏర్పాటుతో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ చేయవచ్చునని సైంటిస్టులు పేర్కొన్నారు. -
కొలకలూరులో వెయ్యేళ్లనాటి శివలింగాలు
తెనాలి: మధ్యయుగ చరిత్ర, సంస్కృతికి ప్రతీకలైన వెయ్యేళ్ల నాటి అపురూప శిల్పాలను పురావస్తు పరిశోధకులు గుర్తించారు. తెనాలి రూరల్ మండల గ్రామం కొలకలూరు గ్రామంలోని పురాతన అగస్త్యేశ్వరస్వామి దేవాలయం ఆవరణలో అస్తవ్యస్తంగా ఈ విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. పురావస్తు పరిశోధకుడు పాములపాటి శ్రీనాథ్‌రెడ్డి సమాచారంతో ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి శుక్రవారం దేవాలయాన్ని సందర్శించారు. అక్కడి శిల్పాలు వెయ్యేళ్ల నాటివిగా ప్రకటించారు. ♦దేవాలయం ఆవరణలో గుర్తించిన శిల్పాల్లో మహిషాసుర మర్దిని (క్రీ.శ 10వ శతాబ్దం), వెయ్యేళ్లనాటి శివలింగాలు, ఒకే శరీరంతో మూడు నాట్యభంగిమలను ప్రదర్శిస్తున్న నృత్యకారుడు (క్రీ.శ 13వ శతాబ్దం), దేవి విగ్రహం (క్రీ.శ 16వ శతాబ్దం)తోపాటు శివద్వార పాలకులు చెక్కిన ద్వారశాఖలు (క్రీ.శ 14వ శతాబ్ది తలుపు చెక్కలు) ఉన్నాయి. ♦వేంగి చాళుక్య, కాకతీయ, విజయనగర శిల్పకళలకు అద్దంపడుతున్న శిల్పాలను అదే ఆలయ ప్రాంగణంలో ఎత్తైన పీఠాలపై నిలిపి, వాటి వివరాలతో కూడిన పేరు పలకలను బిగించి, భద్రపరచాలని దేవదాయ, పురావస్తుశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ♦వీటితోపాటు అక్కడ క్రీ.శ 1241, 1242, 1318కి చెందిన నాలుగు శాసనాలను గుర్తించారు. వాటిలో అగస్తేశ్యరస్వామి ఆలయ సేవలకు నియమితులైన మహిళల కోసం అమిరినాయుడు రెండు పుట్ల భూమిని దానం చేశారు. ♦కులోత్తుంగ చోళుడి సామంతుడైన కొండపడుమాటి బేతరాజు సేవకుడైన రెంటూరి ఎక్కిటి, అదే దేవాలయ అఖండ దీపానికి 50 ఆవులను దానం చేసినట్టు ఉంది. ♦క్రీ.శ 1318 శాసనాల్లో కాకతీయ ప్రతాపరుద్రుని సకల సేనాధిపతి సోమయ లెంక కుమారుడు పోచులెంక అగస్తేశ్వరుడి సోమవార నిబంధనకు, వీరభ్రదునికి 8 పుట్ల భూమిని, పోచు లెంక కేశవ పెరుమాళ్లుకు శనివార నిబంధనకు 5 తూముల భూమిని దానం చేసినట్టు లిఖించారు. ♦శాసనాల్నింటిలోనూ కొలకలూరు గ్రామం పేరును కొలంకలూరుగా లిఖించడం విశేషం. చదవండి: పత్రికల్లో వార్తలు సేకరించి.. ఇంటెలిజెన్స్ డీఎస్పీనంటూ.. ఆర్‌ఆర్‌ఐలో అక్రమాలు: వారికి ధనార్జనే ధ్యేయం -
361 రోజులు.. 29 వేల కిలోమీటర్లు
సాక్షి, అమరావతి: వలస పక్షుల సుదీర్ఘ ప్రయాణాలు సాధారణ విషయమే. కానీ రెండు అమూర్ డేగలు (అమూర్ ఫాల్కన్స్) ఏకంగా రెండు మహా సముద్రాలను దాటి, పదికిపైగా దేశాలను చుట్టి 29 వేల కిలోమీటర్లు ప్రయాణించి రికార్డు సృష్టించాయి. వాటికి అమర్చిన శాటిలైట్ రేడియో ట్రాన్స్మీటర్ల ద్వారా పరిశోధకులు ఆ పక్షుల రూట్, ప్రయాణించిన దూరాన్ని తెలుసుకున్నారు. ఆర్కిటిక్ టెర్న్ తర్వాత ప్రపంచంలోనే ఎక్కువ దూరం ప్రయాణించిన పక్షులుగా ఇవి ఇప్పుడు గుర్తింపు పొందినట్లు చెబుతున్నారు. అమూర్ డేగల వలస మార్గం, ప్రయాణం గురించి అధ్యయనం చేయడానికి సైబీరియాలోని అమూర్ నుంచి మణిపూర్ వచ్చిన ఐదు పక్షులకు గతేడాది నవంబర్ 2న వైల్డ్ లైఫ్ సొసైటీ ఆఫ్ ఇండియా, మణిపూర్ ఫారెస్ట్ శాఖ సంయుక్తంగా శాటిలైట్ రేడియో ట్రాన్స్మిటర్లు అమర్చింది. వాటికి చ్యులాన్, ఇరాంగ్, బారక్, ఫలాంగ్, పుచింగ్ అని పేర్లు పెట్టారు. బారక్, ఫలాంగ్, ఫుచింగ్‌ల నుంచి సిగ్నల్ రావడం చాలా కాలం క్రితమే ఆగిపోవడంతో అవి చనిపోయినట్లు భావించారు. కానీ చ్యులాన్, ఇరాంగ్ నుంచి నిరంతరం సిగ్నల్స్ వచ్చాయి. ఆడ పక్షి చ్యులాన్ 29 వేల కి.మీ. ప్రయాణించి తన వలస మార్గాన్ని (361 రోజుల్లో) పూర్తిచేసి ఇటీవలే మణిపూర్‌లో తన తాత్కాలిక స్థావరానికి చేరుకుంది. మగ పక్షి ఇరాంగ్ 33 వేల కి.మీ. ప్రయాణించి తర్వాత అక్కడకు చేరింది. డేగల రూట్ ఇదే.. ► చైనా నుంచి బయలుదేరి థాయ్‌లాండ్, మయన్మార్ మీదుగా మన దేశంలోని మణిపూర్‌లోకి వచ్చాక వాటికి జియో ట్యాగ్లు అమర్చారు. వాటి సిగ్నల్ ఆధారంగా బంగాళాఖాతం తీరంలో మన దేశంలోని ఏపీ, కర్ణాటక పలు ప్రాంతాల నుంచి అరేబియా సముద్రం దాటి ఆఫ్రికా ఖండంలోని సోమాలియా, కెన్యా, టాంజానియా, జాంబియా, జింబాబ్వే, బొట్స్వానా మీదుగా దక్షిణాఫ్రికా వెళ్లి అక్కడ శీతాకాల విడిది చేశాయి. మళ్లీ తిరిగి ఇదే రూట్లో మణిపూర్ చేరుకున్నాయి. తర్వాత ఇవి చైనా, రష్యా ప్రాంతానికి వెళ్లిపోయాయి. ► అమూర్ డేగలు నాగాలాండ్ ప్రాంతానికి లక్షల్లో వలస వస్తాయి. శీతాకాలంలో ఆ ప్రాంతంలోని అడవులు, పంటల్లో చెదలు, క్రిమి కీటకాలను ఇవి తినేవి. అయితే స్థానికులు పెద్దఎత్తున వేటాడడంతో వాటి రాక తగ్గిపోయింది. దీనివల్ల పంటలు, అడవులు క్రిమి కీటకాలతో నాశనమవుతున్నట్లు గుర్తించి వేటాడడం నిలిపివేశారు. ► అప్పటి నుంచి మళ్లీ అమూర్ డేగలు వస్తుండడంతో వారికి క్రిమి సంహారక మందులు వాడాల్సిన అవసరం ఉండడంలేదని చెబుతున్నారు. ఇప్పుడు నాగాలాండ్‌కు అమూర్ డేగలు వచ్చే సమయంలో పండుగ నిర్వహిస్తున్నారు. వాటిని చూడ్డానికి పెద్దఎత్తున పర్యాటకులు వస్తున్నారు. గుంపులుగానే ప్రయాణం ► కంటి పాచ్ నల్లగా ఉంటుంది. కంటి చుట్టూ ఆరెంజ్ రంగు వలయం ఆకర్షణీయంగా ఉంటుంది. ► గుండ్రని వంపు గల రెక్కలు ఉంటాయి. అత్యంత స్నేహశీలి. సంధ్యా సమయంలో చాలా చురుగ్గా ఉంటుంది. ► కాళ్లు, పాదాలు.. ఎరుపు, ఆరెంజ్ రంగుల మేళవింపుతో ఉంటాయి. చిన్నపాటి తోక కలిగి ఉంటాయి. ► మధ్య, తూర్పు హిమాలయాల్లో.. దక్షిణ అస్సాం కొండలు, శ్రీలంక,భారతదేశంలోని సముద్రతీరం, మాల్దీవులు, ఈశాన్య ఆసియా,ఆగ్నేయ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ► గుంపులుగా కలిసి వలస వెళ్తాయి. ఒక్కో సారి ఇతర జాతుల పక్షులతో కలిసి కూడా ప్రయాణిస్తాయి. చెట్ల పొదలను ఇష్టపడతాయి. ► గడ్డిభూములు, చిత్తడి నేలలు, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా ఆవాసాలు ఏర్పరచుకుంటాయి. చెట్ల రంధ్రాలు, పాత గూళ్లలో విశ్రాంతి తీసుకుంటాయి. ఎరుపు రంగును చూస్తే ఆందోళనకు గురవుతాయి. మగ డేగ ముదురు బూడిద, ఎరుపు రంగులో ఉంటుంది. రెక్కల వెనుక భాగం తెల్లగా ఉంటుంది. తొడల భాగం గోధుమ వర్ణంలో ఉంటుంది. కడుపు భాగంలో నల్లటి మచ్చలు ఉంటాయి. ఆడ డేగ పై భాగం లేత బూడిద రంగులో ఉంటుంది. నుదుటి భాగం క్రీమ్ కలర్లో ఉంటుంది. ఛాతీ భాగంలో తెలుపు, బూడిద రంగులో పెద్ద మచ్చలు ఉంటాయి. తోక, ఈకలు కొంచెం నలుపు రంగులో ఉంటాయి. పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి అమూర్ డేగలు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి. క్రిములను తిని బతికే పక్షుల్లో అత్యధిక దూరం ప్రయాణించేవి ఇవే. ఆగకుండా నాలుగైదు వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. మన రాష్ట్రం ఈ పక్షుల వలస మార్గం. తిరుపతి, విశాఖలో గతంలో కనిపించాయి. మచిలీపట్నంలోనూ దీన్ని గుర్తించారు. నైరుతి రుతు పవనాలు, సముద్రంలో ఏర్పడే అల్ప పీడనాలను ఉపయోగించుకుని ఇవి ప్రయాణిస్తున్నట్లు ప్రాథమికంగా తేలింది. వీటిపై ఇంకా పరిశోధనలు చేయాల్సి ఉంది. – రాజశేఖర్ బండి,సిటిజన్ సైన్స్ కో–ఆర్డినేటర్, ఐఐఎస్ఈఆర్ -
బూజు జాడ చెప్పే కొత్త యంత్రం!
సాక్షి, హైదరాబాద్: బూజు పట్టిన ఆహారం తింటే ఏమవుతుంది? పలుమార్లు బాత్రూంకు వెళ్లాల్సి రావడం తాత్కాలిక ప్రతి క్రియ కానీ.. తరచూ తిన్నా.. కాలేయం పాడైపోయి ప్రాణాల మీదకు వస్తుందని సైన్స్ చెబుతోంది. బూజులోని అఫ్లాటాక్సిన్లనే విషరసాయనాల వల్ల కొన్నిసార్లు కేన్సర్ బారిన కూడా పడొచ్చు. బూజు లేని ఆహారాన్ని మాత్రమే తినడం ఈ సమస్యలకు పరిష్కారం. కానీ అఫ్లాటాక్సిన్లను గుర్తించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పరిశోధనశాలల్లో మాత్రమే వీలయ్యే పని. మరి తరుణోపాయం ఏంటంటే.. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ‘ప్యూర్ స్కాన్ ఎ.ఐ.’అనే స్టార్టప్ పరిశోధనల పుణ్యమా అని అఫ్లాటాక్సిన్లను గుర్తించేందుకు సరికొత్త యంత్రం అందుబాటులోకి వచ్చింది. 5 అంగుళాల పొడవు, వెడల్పు, ఎత్తు ఉండే ఈ పరికరం అతినీలలోహిత కిరణాల సాయంతో అఫ్లాటాక్సిన్లను గుర్తిస్తుంది. అర నిమిషంలోనే మోతాదును కూడా నిర్ధారిస్తుంది. అఫ్లాటాక్సిన్లు అతినీల లోహిత కిరణాల కాంతిలో ప్రతిదీప్తిని ఇస్తాయి. పరిశీలించాల్సిన ఆహార పదార్థపు ఫొటో లు తీసి వాటిల్లో ప్రతిదీప్తిని ఇస్తున్న ప్రాంతాలను గుర్తించడం.. మెషీన్ లర్నింగ్ పద్ధతుల సాయంతో అఫ్లాటాక్సిన్ల మోతాదును గుర్తించడం ఈ పరికరం పనిచేసే పద్ధతి. తక్కువ ధరకే దొరికే ఈ యంత్రం అత్యంత కచ్చితత్వంతో పని చేస్తుంది కూడా. ఇన్స్పైర్ చాలెంజ్ అవార్డు.. రైతులు, వ్యవసాయం ఎదుర్కొంటు న్న పలు సమస్యలకు బిగ్ డేటా సా యంతో పరిష్కారాలు కనుగొనేందు కు అంతర్జాతీయ మెట్ట ప్రాంత పం టల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్), సీజీఏఐఆర్‌లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఇన్స్పైర్ చాలెంజ్ అవార్డుకు ప్యూర్ స్కాన్ ఎ.ఐ. అభివృద్ధి చేసిన యంత్రం ఎంపికైంది. అవార్డులో భాగంగా దాదాపు రూ.73.63 లక్షలు (లక్ష డాలర్లు) నగదు ఈ కంపెనీకి దక్కనుంది. రైతులకు లాభం అఫ్లాటాక్సిన్లను గుర్తించే పరికరం అందుబాటులో ఉంటే రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. పంట దిగుబడులు వచ్చాక పలు కారణాల వల్ల వాటిల్లో ఈ అఫ్లాటాక్సిన్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఇది కాస్తా ఎగుమతులపై ప్రభావం చూపుతోంది. అఫ్లాటాక్సిన్లను గుర్తించే యంత్రంతో రైతులు విషాలు తక్కువగా ఉన్నవాటిని పొలంలోనే వేరు చేయొచ్చు. దీంతో వారు తమ ఉత్పత్తులకు మెరుగైన ధర పొందొచ్చు. ప్యూర్ స్కాన్ ఎ.ఐ. తయారు చేసిన యంత్రంపై మరికొన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అన్నీ సవ్యంగా సాగితే వచ్చే ఖరీఫ్ నాటికి ఈ యంత్రం అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాం. – డాక్టర్ శ్రీకాంత్, ఇక్రిశాట్ -
చిన్నసైజు తుంపర్లతోనూ కరోనా
సాక్షి, హైదరాబాద్: గాలి లేదా బయటి వాతావరణంలో ఉండిపోయే చిన్న తుంపర్లతోనూ కరోనా వైరస్ వ్యాప్తికి అవకాశాలున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. సిగరెట్ పొగ మాదిరిగా వ్యాప్తి చెందే సూక్ష్మస్థాయిలో ఉండే తుంపర్లు ఒకసారి వెలువడ్డాక ఏవిధంగా ప్రభావం చూపుతున్నాయన్న అంశాన్ని పరిశీలిస్తున్నారు. వైరస్ సోకిన వ్యక్తి నుంచి దగ్గు, తుమ్ము, ముక్కు చీదడం, పాటలు పాడటం, అరవడం,మాట్లాడడం, గాలి పీల్చుకోవడం, వదలడం వంటి చర్యల ద్వారా వివిధ సైజుల్లో తుంపర్లు వెలువడుతున్నాయి. ఈ తుంప ర్లు ఏ సైజులో ఉంటే ఎలా ప్రభావితం చేస్తాయి? ఎంత దూరం, ఎలా పయనిస్తుంది తదితర అంశాలపై పరిశోధకులు దృష్టి కేంద్రీకరించారు. పెద్దసైజు తుంపర్లు ముక్కు,నోరు,కళ్లపై పడినపుడు లేదా గాలిరూపంలో పీల్చుకున్నపుడు ఇతరులకు ఇన్ఫెక్షన్ సోకుతుందని గతంలోనే పరిశోధకులు వెల్లడించారు. అయితే ఇప్పుడు చిన్న సైజు తుంపర్లు, సిగిరెట్‌పొగ మాదిరిగా వ్యాప్తిచెందే తుంపర్లు కొన్ని గంటల వరకు గాలిలోనే ఉండిపోతాయని చెబుతున్నారు. ఇవి గదంతా వ్యాపించడంతో పాటు గాలి, వెలుతురు తక్కువ ఉన్నచోట్ల మరింత అధికమవుతా యంటున్నారు. ‘మీసిల్స్’ మాదిరిగా ఇవి వ్యాపిస్తాయని, ‘ఏరోసొల్స్’గా పిలుస్తున్న ఈ చిన్నసైజు తుంపర్లు ఆరు అడుగులకు మించి వ్యాపించే అవకాశాలు న్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల వ్యక్తుల మధ్య భౌతిక దూరం 6 అడుగుల కంటే ఎక్కువగా ఉంటే మంచిదని వర్జీనియా టెక్ వర్సిటీ పరిశోధకులు లిన్సేమార్ తెలిపారు. ఏరోసొల్స్ పార్టికల్స్ సమీపంలో ఉన్నవారిపై అధిక ప్రభావం చూపుతాయని, అతిదగ్గరగా ఉన్న వారిపై ఎక్కువ ప్రమాదం కలగజేసే అవకాశముంది అని హెచ్చరిస్తున్నారు. సీడీసీ పరిశీలన దగ్గినపుడు, తుమ్మినపుడు వెలువడే పెద్ద సైజు తుంపర్లతోనే వైరస్ సోకుతోందని యూఎస్‌లోని సెంటర్స్‌ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డిప్యూటీ డైరెక్టర్ డా.జె బట్లర్ పేర్కొన్నారు. అయితే ఎక్కువగా ఏరోసొల్స్ కూడా ఇన్ఫెక్షన్లకు దారితీస్తున్నట్టుగా లిన్సేమార్ చెబుతున్నారు. వైరస్ ఉన్న ఒక్క ‘సూపర్ స్ప్రెడర్’నుంచి ఒకేఒక్కసారి కలుసుకున్నపుడే లెక్కకు మించిన సంఖ్యలో ఇతరులకు వ్యాప్తి చెందినట్టు లిన్సేతో పాటు ఇతర పరిశోధకులు కూడా వెల్లడించారు. కొన్ని నెలల క్రితం సామూహిక ప్రార్థనలకు సంబంధించిన రిహార్సల్ నిర్వహించినపుడు కరోనా లక్షణాలున్న వ్యక్తినుంచి 52మందికి అది సోకడమే కాకుండా వారిలో ఇద్దరు మరణించినట్టుగా పరిశోధకులు తెలి పారు. చైనాలోనూ గాలి, వెలుతురు తక్కువ ఉన్న ఓ రెస్టారెంట్ లో ఐదుగురికి కరోనా సోకినట్టు, ఒక బస్సులో ప్రయాణిస్తున్న ఒకవ్యక్తి నుంచి వేర్వేరుచోట్ల కూర్చున్న 23 మంది ప్రయాణికులకు వైరస్ సోకినట్టు వెల్లడించారు. -
కోవిడ్-19 : వైరస్ సోకిన కణాల ఫోటోలివే..
న్యూయార్క్ : కరోనా వైరస్ సోకిన శ్వాసకోశ కణాల ఫోటోలను శాస్త్రవేత్తలు ప్రచురించారు. ఊపిరితిత్తుల లోపల కణాల్లోకి వైరస్ కణాలు ఏ మేరకు చొచ్చుకుపోయి వ్యాధి కారక కణాలను ప్రేరేపించిందీ ఈ చిత్రాల్లో గుర్తించారు. శ్వాసకోశ మార్గంలో ఎంతటి తీవ్రతతో సార్స్-కోవ్-2 ఇన్ఫెక్షన్ వ్యాప్తిస్తుందనేది సులభంగా అర్ధమయ్యేలా పరిశోధకులు ఈ చిత్రాలను విడుదల చేశారు. మావన శ్వాసనాళాల్లో పెద్దసంఖ్యలో వైరస్ కణాలు శరీరమంతటా వ్యాపించడంతో పాటు ఇతరులకూ సంక్రమించేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి ఈ చిత్రాల్లో పరిశోధకులు కళ్లకు కట్టారు. ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు మానవ శ్వాసనాళాల్లో కరోనా వైరస్‌ను ప్రవేశపెట్టి 96 గంటల తర్వాత అత్యంత శక్తివంతమైన స్కానింగ్ ఎలక్ర్టాన్ మైక్రోస్కోపీ ద్వారా పరిశీలించారు. న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ఈ చిత్రాలు ప్రచురితమయ్యాయి. తిరిగి రంగులద్దిన ఈ చిత్రాలు శ్వాసకోశ నాళాల్లో వైరస్‌కు గురైన వెంట్రుకల మాదిరి ఉన్న కణాలను చూపుతున్నాయి. ఈ కణాలు శ్లేష్మంతో పాటు వైరస్‌లను ఊపిరితిత్తుల నుంచి ఇతర భాగాలకు వ్యాపింపచేస్తాయని శాస్త్రవేత్తలు వివరించారు. అధిక శక్తితో కూడిన మాగ్నిఫికేషన్ వాడుతూ మానవ శ్వాసకోశంలో తయారైన కోవిడ్-19 నిర్మాణం, తీవ్రతను పరిశోధకులు వెల్లడించారు. అతిథేయ కణాల్లో శ్వాసకోశ ఉపరితలాలపై పూర్తిగా గూడుకట్టుకుని ఉన్న వైరస్ కణాలివని పరిశోధకులు పేర్కొన్నారు. కోవిడ్-19 సంక్రమణను అడ్డుకునేందుకు మాస్క్‌లు తప్పనిసరిగా వాడాలని ఈ చిత్రాల ద్వారా విస్పష్టంగా వెల్లడవుతోందని పరిశోధకులు స్పష్టం చేశారు. -
యాంటీబాడీలపై శాస్త్రవేత్తల కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : శరీరంలో యాంటీబాడీల ఉనికితో వ్యక్తులు గతంలో కోవిడ్-19 బారినపడిన విషయం తెలిసినా కరోనా వైరస్ నుంచి ఇవి ఎప్పటికీ పూర్తి రక్షణ ఇవ్వలేవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. యాంటీ బాడీల రకాలతో పాటు అవి ఎంత పరిమాణంలో తయారయ్యాయి..ఎంతకాలం మనగలుగుతాయనే వైరుధ్యాలే ఇందుకు కారణమని తెలిపారు. వ్యక్తి శరీరంలో ఉండే యాంటీబాడీలు వ్యాధి పురోగతి గురించి ఏమీ చెప్పవని న్యూఢిల్లీకి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ శాస్త్రవేత్త సత్యజిత్ రథ్ పేర్కొన్నారు. శరీరంలో తటస్థీకరించే యాంటీబాడీస్ (న్యూట్రలైజింగ్), సాధారణ యాంటీబాడీస్ ఉంటాయని, న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ కణాల్లోకి కరోనా వైరస్ రాకను అడ్డుకునే వ్యవస్థను ప్రేరేపిస్తాయని పూణేకు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషన్, రీసెర్చి (ఐఐఎస్ఈఆర్) శాస్త్రవేత్త వినీతా బాల్ తెలిపారు. సాధారణ యాంటీబాడీలు వైరస్ ఉనికికి స్పందించే సంకేతాలు పంపినా, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మాత్రం ఉపయోగపడవని ఆమె వివరించారు. వ్యక్తి శరీరంలో యాంటీబాడీల ఉనికి కేవలం గతంలో కోవిడ్-19 సోకిందని గుర్తించేందుకు ఉపయోగపడినా న్యూట్రలైజింగ్ యాంటీబాడీలు లేకుంటే అవి వ్యాధి నుంచి పూర్తి రక్షణ ఇవ్వని ఇమ్యూనాలజిస్ట్ తెలిపారు. న్యూట్రలైజింగ్ యాంటీబాడీలు తగిన సంఖ్యలో ఎక్కువ కాలం ఉంటేనే తదుపరి వైరస్ దాడిని ఎదుర్కోగలరని వివరించారు. ఏ స్ధాయిలో న్యూట్రలైజింగ్ యాంటీబాడీలు ఉంటే ప్రజారోగ్యాన్ని కాపాడవచ్చనే దానిపై ఏకాభిప్రాయం లేదని చెప్పారు. చదవండి : ఢిల్లీ తెలంగాణ భవన్లో కరోనా కలకలం -
విశాఖ తీరం సురక్షితం
ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో భారత్‌కు ఉన్న సువిశాల సముద్ర తీరం సురక్షిత ప్రాంతం. అందులోనూ కోస్తా తీరం అత్యంత సురక్షితం.. సముద్రాల్లో ఎప్పుడో మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన చీలికతో తీర భద్రతకు ఎలాంటి ముప్పూ వాటిల్లదు భారతదేశం సంవత్సరానికి 2 సెంటీమీటర్లు చొప్పున ఉత్తరం వైపునకు కదులుతోంది. లక్షల ఏళ్ల తరువాత అంటార్కిటికా నుంచి ఇప్పటికి ఇక్కడ వరకు వచ్చాం. వీటిని దీర్ఘకాలిక మార్పులుగానే అభివర్ణిస్తాం. లాంగ్ టెర్మ్ టెక్టానిక్స్, డీప్ సీ టెక్టానిక్స్ అంటారు. రేపో ఎల్లుండో కోస్తా తీర ప్రాంతాల్లో భూకంపాలు, అగ్ని పర్వతలు బద్ధలవుతాయని, సునామీలు వస్తాయని చెప్పడం తప్పు. టెక్టానిక్స్ ప్రకారం అసలు ఎన్ని లక్షల సంవత్సరాలకు అవి సంభవిస్తాయో చెప్పలేం. అసలు వస్తాయో రావో కూడా తెలియని స్థితిలో చేసిన పరిశోధనల్లో ఒక ఫాల్ట్ లైన్‌ను మాత్రమే గుర్తించారు. – సముద్ర అధ్యయన జాతీయ సంస్థ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ) శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పర్యావరణవేత్తలు. గరికపాటి ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎప్పటికైనా విశ్వం అంతరిస్తుందన్న వాదనల్లో ఎంత సత్యం దాగుందో.. సముద్రంలో చీలికల వల్ల ఏదో జరిగిపోతుందన్న ఆందోళనలో కూడా అంతే వాస్తవం ఉందని పలువురు శాస్త్రవేత్తలు, పరిశోధకులు వ్యాఖ్యానిస్తున్నారు. కోస్తా తీరానికి భూకంపాల తాకిడి, సునామీల బెడదా లేదని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొంటున్నారు. సాగర గర్భంలో ఏం జరిగింది? తరువాత ఎలా ఉంటుంది? అనే అంశంపై వివిధ రంగాల శాస్త్రవేత్తలు వెల్లడించిన అధ్యయనాలు ఇలా ఉన్నాయి.. మనిషి జీవితకాలంతో ముడిపెడితే.. అంటార్కిటికా నుంచి ఇండియా, ఇండోనేషియా మొదలైన ప్రాంతాలు విడిపోయినప్పటి నుంచి సముద్ర గర్భంలో టెక్టానిక్స్(కదలికలు) ఏర్పడుతున్నాయి. సుమారు 130 మిలియన్ ఏళ్ల నుంచి సముద్ర గర్భంలో మార్పులు సంభవిస్తున్నాయి. ఇవి సాధారణంగా జరిగే ప్రక్రియలో భాగమే తప్ప వీటి వల్ల ఎలాంటి ముప్పు వాటిల్లదు. ఇవి సముద్రంలో ఒత్తిడి మూలంగా యాక్టివేట్ అవుతుంటాయి. వీటిని మానవ జీవిత కాలంతో ముడిపెట్టి పరిశీలిస్తే లక్షల సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు తూర్పు, పశ్చిమ తీరాల్లో సునామీలు గానీ, భూకంపాలు గానీ ఈ ఫాల్ట్ లైన్స్(చీలికలు) వల్ల వచ్చే అవకాశమే లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తూర్పు, పశ్చిమ కోస్తా తీరాలు సురక్షితం... ► సునామీల ప్రభావం కోస్తా తీరంపై చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే టెక్టానికల్లీ యాక్టివ్ జోన్లకు కోస్తా తీర ప్రాంతం లంబం(పార్లల్) గా ఉండదు. అండమాన్ నికోబార్ దీవులు, సుమత్రా దీవి ప్రాంతం మాత్రం టెక్టానికల్ జోన్లకు లంబంగా ఉండటం వల్ల అక్కడ భూకంపాలు, సునామీలు ఏర్పడుతుంటాయి. ► ఇక కోస్తా తీరం ప్రపంచంలోనే భూకంపాల తీవ్రత తక్కువగా ఉన్న అత్యంత స్థిరమైన ప్రాంతం. తూర్పు కనుమలు లాంటి రాతి నిర్మాణాలు రక్షణ కవచంగా ఉన్నందున భూకంపాలు రావడం అసాధ్యం. ఒకవేళ వచ్చినా రిక్టర్ స్కేల్‌పై 3 కంటే తక్కువ తీవ్రతనే కలిగి ఉంటాయి. ఖండాలు విడిపోయినప్పటి చీలిక... తీరంలో చీలిక ఏర్పడిందదన్న వార్తలపైనా శాస్త్రవేత్తలు స్పష్టత ఇస్తున్నారు. వాస్తవంగా సునామీలు రావాలంటే సముద్ర గర్భంలోని బ్లాకుల్లో కొన్ని పైకి రావడం గానీ, కిందకు వెళ్లడం గానీ జరగాలి. అండమాన్ నికోబార్, జావా తీరంలో జరిగిన సంఘటనలివే. కోస్తా తీరంలో ఇలాంటి పరిస్థితులేవీ కనిపించడంలేదు. సుమారు 200 మిలియన్ల సంవత్సరాల క్రితం ఖండాలు విడిపోయినప్పుడు కృష్ణా గోదావరి బేసిన్లో బ్లాకుల కదలిక జరిగిందే తప్ప ఈ మధ్య ఏర్పడిన చీలిక కాదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. భయపడాల్సిన అవసరం లేదు.. మనుషుల కారణంగా సముద్రంలో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయనే దానిపై ఎన్ఐవో అధ్యయనం చేస్తోంది. డేటా ఎనలైజ్ చేయడం వరకే శాస్త్రవేత్త పని. ఇదే ఫైనల్ అని చెప్పకూడదు. మిలియన్ సంవత్సరాల క్రితం చిన్నపాటి చీలిక ఏర్పడిన మాట వాస్తవమే కానీ తీర భద్రతకు ప్రమాదం ముంచుకొచ్చేస్తోంది అనేంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికిప్పడు ఉత్పన్నమయ్యే సమస్యలేవీ లేవు. – జి. ప్రభాకర్ ఎస్ మూర్తి, సీఎస్ఐఆర్–ఎన్ఐవో చీఫ్ సైంటిస్ట్ అది ఖండాలు ఏర్పడిన నాటిది... కోస్తా తీరంలో సునామీలకు ఆస్కారం లేదు. సముద్ర గర్భంలో కనిపిస్తున్న చీలిక ఖండాలు ఏర్పడినప్పుడు వచ్చిందే తప్ప ఇటీవల పరిణామాలకు ఏర్పడింది కాదు. కోస్తా తీరానికి గానీ, సముద్ర ప్రాంతాలకు గానీ ముప్పు ఏదైనా ఉందంటే అది కేవలం కోతకు గురవడమే. సముద్రంలో ఏదో జరిగిపోతుందనే భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు. – డా.నాగేశ్వరరావు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్ఐ) రిటైర్డ్ డైరెక్టర్, కోస్తా తీర పరిశోధకుడు విశాఖపట్నం సేఫ్.. విశాఖ తీరానికి భద్రత లేదని చెప్పడం సరికాదు. భూకంప కేంద్రాలపై కోస్తా తీరమంతా పరిశోధన చేశాం. పాండిచ్చేరి, ఒంగోలు, విజయనగరంలో నెల్లిమర్ల, కందివలస, నాగావళి ప్రాంతాల్లో భూకంప కేంద్రాలు ఉన్నట్లు గుర్తించాం. ఇవి వీక్ జోన్లు మాత్రమే. భారతదేశం ఉత్తరానికి కదులుతుండడంతో అక్కడ ఒక ఏషియన్ ప్లేట్ తగులుతుంది కాబట్టి ఏర్పడే ఒత్తిడికి వీక్ జోన్స్ అన్నీ యాక్టివేట్ అయి భూకంపాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అది కూడా గుజరాత్లో బూర్జ్లోను, లార్టూరులోను, కొయినా, భద్రచలం, పాండిచేరి, విజయనగరం ప్రాంతాల్లో భూకంప కేంద్రాలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అవి డీప్ సీ టెక్టానిక్స్ కావు. అన్ని తుఫాన్లు మచిలీపట్నం, బంగ్లాదేశ్ వైపు మాత్రమే వస్తుంటాయి. కొండలు ఎక్కువగా ఉండడంతో తుఫాన్ల ప్రభావం విశాఖపై చాలా తక్కువ. – డా.కేఎస్ఆర్ మూర్తి, ఎన్ఐఓ రిటైర్డ్ సెంటిస్ట్ ముంబై అభివృద్ధి ఆగిందా? ప్రపంచంలో అనేక తీర నగరాల మాదిరిగానే ముంబై కూడా 2050 నాటికి పూర్తిగా అరేబియా సముద్రంలో మునిగిపోతుందని న్యూజెర్సీకి చెందిన శాస్త్రవేత్తల స్వతంత్ర సంస్థ క్లైమేట్ సెంట్రల్ దశాబ్దాల క్రితం పేర్కొంది. అలాగని ముంబై అభివృద్ధి ఆగిపోయిందా? 6.5 మిలియన్ సంవత్సరాల నుంచి స్తబ్దుగా ఉన్న చీలిక వల్ల ఉపద్రవం ముంచుకొస్తుందని చెప్పడం వంటివన్నీ ఊహాజనితాలే. వేల ఏళ్ల తర్వాత రాబోయే ప్రమాదాల్ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ఆపలేం కదా. – ఆచార్య కె.విజయ్‌కుమార్, ఏయూ సోషల్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ -
ప్లేట్లెట్లు తగ్గేది ఇందుకే..
సాక్షి, హైదరాబాద్: డెంగీ వచ్చినప్పుడు రక్తంలో ప్లేట్లెట్లు తగ్గిపోయేందుకు కారణమేమిటో గుర్తించామని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ విభాగం శాస్త్రవేత్తలు సోమవారం ప్రకటించారు. వ్యాధికారక వైరస్‌లోని ప్రొటీన్ ఒకటి కణాల్లోని మైటోకాండ్రియా పనితీరును ప్రభావితం చేస్తుండటం వల్ల ప్లేట్లెట్లు తగ్గిపోతున్నట్లు తాము ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నామని డాక్టర్ ఎం. వెంకట రమణ, డాక్టర్ ఎస్. నరేశ్‌బాబులు తెలిపారు. సుమారు 140 దేశాల్లో ప్రభావం చూపగల డెంగీకి ఇప్పటివరకూ సరైన టీకా లేదా మందు లేదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాము డెంగీ కారక వైరస్‌పై పరిశోధనలు చేపట్టామని తెలిపారు. డెంగీ వైరస్‌లో మొత్తం పది వరకూ ప్రొటీన్లు ఉంటే ఇందులోని ఎన్ఎస్–3 ప్రొటీన్ నకళ్ల తయారీలో కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. అంతేకాకుండా ఎన్ఎస్–3 ప్రొటీన్ కణానికి శక్తిని అందించే మైటోకాండ్రియా మ్యాట్రిక్స్‌లోకి ప్రవేశించి జీఆర్పీఈఎల్1 అనే ప్రొటీన్‌ను ముక్కలు చేస్తోందని, ఇది కాస్తా మైటోకాండ్రియా పనితీరుపై ప్రభావం చూపుతున్నట్లు తాము గుర్తించామని వారు వివరించారు. ఈ కారణంగానే రక్తంలోని ప్లేట్లెట్లు తగ్గిపోతున్నాయన్నది తమ అంచనాగా వారు చెప్పారు. జీఆర్పీఈఎల్1 ప్రొటీన్ ఆధారంగా డెంగీకి సమర్థమైన మందులు తయారు చేసేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని అన్నారు. మానవ, జంతు సంబంధిత వైరస్ మైటోకాండ్రియాలోని ప్రొటీన్లతో చర్య జరుపుతున్నట్లు తెలియడం ఇదే మొదటిసారి అని, కరోనా కారక వైరస్‌లోనూ ఇదేమాదిరిగా జరుగుతుండవచ్చని తెలిపారు. పరిశోధన వివరాలు జర్నల్ ఆఫ్ వైరాలజీ సంచికలో ప్రచురితమయ్యాయి. -
కరోనా: ఎంఐటీ సర్వేలో షాకింగ్ వివరాలు
న్యూయార్క్ : భారత్‌లో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. అడ్డూఅదుపూ లేకుండా విస్తరిస్తోన్న మహమ్మారి రాబోయే రోజుల్లో స్వైరవిహారం చేస్తుందనే అంంచనాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.కోవిడ్-19కు వ్యాక్సిన్ రానిపక్షంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి భారత్‌లో రోజుకు 2,87,000 పాజిటివ్ కేసులు వెలుగుచూస్తాయని అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకులు అంచనా వేశారు. ఎంఐటీ పరిశోధకులు హజిర్ రెహ్మాందాద్, టీవై లిమ్, జాన్ స్టెర్‌మన్‌లు ఎస్ఈఐఆర్ (అనుమానిత, రిస్క్, వైరస్, రికవరీ) పద్ధతిలో ఈ విశ్లేషణ చేపట్టారు. అంటువ్యాధుల నిపుణులు శాస్త్రీయంగా ఉపయోగించే నిర్ధిష్ట గణాంక పద్ధతిగా భావించే ఎస్ఈఐఆర్ మోడల్‌ను వీరు అనుసరించి లెక్కగట్టారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాకుంటే 2021 మే నాటికి ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల పాజిటివ్ కేసులు నమోదవుతాయని పరిశోధక బృందం తేల్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరుకు భారత్‌లోనే ప్రతిరోజూ అత్యధిక కేసులు నమోదవుతాయని తర్వాతి స్ధానంలో అమెరికా (రోజుకు 95,000 కేసులు), దక్షిణాఫ్రికా (21,000 కేసులు), ఇరాన్ (17,000 కేసులు)లు నిలుస్తాయని ఎంఐటీ పరిశోధకులు అంచనా వేశారు. ప్రస్తుతం టెస్టింగ్ జరుగుతున్న తీరుతెన్నులు, వాటి వేగం పెరిగే అవకాశం, కాంటాక్ట్ రేటను పరిగణనలోకి తీసుకుని పరిశోధకులు ఈ గణాంకాలను వెల్లడించారు. ఇక కరోనా టెస్టులు ప్రస్తుత స్ధాయిలోనే ఉండి ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వైరస్ సంక్రమించే రేటు స్ధిరంగా ఉంటే కేసుల సంఖ్య, మరణాలు గణనీయంగా తగ్గుతాయని పరిశోధక బృందం పేర్కొంది. అధికారిక కేసుల సంఖ్య కంటే వాస్తవ కేసులు అధికంగా ఉంటాయని, అత్యధికులు వ్యాధిబారిన పడే అనుమానితులేనని స్పష్టం చేసింది. మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో హెర్డ్ ఇమ్యూనిటీని ఎంచుకోవడం సరైందికాదని పరిశోధకులు పేర్కొన్నారు.చదవండి : కోవిడ్-19 అప్డేట్ : 24 గంటల్లో 25,000 కేసులు -
కోవిడ్-19 : ఇలా కూడా వ్యాపిస్తుంది!
న్యూయార్క్ : కోవిడ్-19 వ్యాప్తిపై శాస్త్రవేత్తలు కీలక సమాచారం వెల్లడించారు. గాలిలోని సూక్ష్మ రేణువుల ద్వారా కరోనా వైరస్ ప్రజలకు సంక్రమిస్తుందనేందుకు ఆధారాలున్నాయని వందలాది శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. కరోనా మహమ్మారిపై సిఫార్సులను ఈ మేరకు సవరించాలని వారు డబ్ల్యూహెచ్ఓకు పిలుపు ఇచ్చారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. కరోనా వైరస్ ప్రధానంగా ఈ వ్యాధితో బాధపడే వ్యక్తి దగ్గడం, తుమ్మడం లేదా మాట్లాడినప్పుడు వెలువడే తుంపరల నుంచి వేరొకరికి వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్ఓ చెబుతూవస్తోంది. అయితే గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనేందుకు ఆధారాలున్నాయని పేర్కొంటూ 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు డబ్ల్యూహెచ్ఓకు రాసిన లేఖలో వివరించారు. ఈ అంశాన్ని వచ్చే వారం సైంటిఫిక్ జర్నల్‌లో పరిశోధకులు ప్రచురించనున్నారు. కరోనా పాజిటివ్ వ్యక్తి దగ్గినప్పుడు వెలువడే తుంపరల పరిమాణం ఎక్కువగా ఉంటే అవి గాలి ద్వారా వ్యాప్తి చెందుతూ ప్రజలకు ఈ వ్యాధి సంక్రమిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేసినట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. కాగా వైరస్ గాలి ద్వారా సంక్రమిస్తుందనేందుకు చూపుతున్న ఆధారాలు ఆమోదయోగ్యంగా లేవని డబ్ల్యూహెచ్ఓ వ్యాఖ్యానించింది. కరోనా వైరస్ గాలి ద్వారా సంక్రమించే అవకాశం లేకపోలేదని గత రెండు నెలలుగా తాము పలుమార్లు చెబుతూవచ్చామని అయితే దీనిపై స్పష్టమైన ఆధారాలు ఇంతవరకూ వెల్లడికాలేదని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి డాక్టర్ బెనెడెటా అలెగ్రాంజీ పేర్కొన్నారు. చదవండి : కరోనా: తిరుగుతున్నారు..! -
‘ఏడాది చివరిలో వ్యాక్సిన్’
వాషింగ్టన్ : ఈ ఏడాది చివరికి కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని యూఎస్ ఆర్మీ వ్యాక్సిన్ పరిశోధకులు వెల్లడించారు. సంవత్సరాంతానికి కరోనాను కట్టడి చేసే ఏదో ఒక వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని సైనిక అంటువ్యాధుల పరిశోధన కార్యక్రమం డైరెక్టర్ కల్నల్ వెండీ సమన్స్ జాక్సన్ పేర్కొన్నారు. మరోవైపు కరోనా మహమ్మారి నియంత్రణకు ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్‌ను తీసుకువచ్చేలా ప్రైవేట్ సంస్ధలతో కలిసి ప్రభుత్వం పనిచేస్తోందని అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ వెల్లడించారు. మరోవైపు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆస్ర్టాజెనెకాతో కలిసి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌పై మూడో దశ పరీక్షలకు రంగం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు వ్యాక్సిన్ దిశగా చేస్తున్న ప్రయోగాలు కీలక దశకు చేరుకుంటున్నాయి.ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 60 లక్షలు దాటగా, భారత్‌లో కరోనా కేసులు రెండు లక్షల మార్క్‌ను అధిగమించాయి. చదవండి : ‘కరోనాకు మందు కనిపెట్టా.. అనుమతివ్వండి’ -
కోవిడ్: నిమిషాల్లోనే నిర్ధారణ!
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నిర్ధారణకు బ్రిటన్ పరిశోధకులు సులువైన విధానాన్ని కనుగొన్నారు. నిమిషాల వ్యవధిలోనే కరోనా వైరస్‌ను నిర్ధారించే స్మార్ట్‌ఫోన్ ఆధారిత పోర్టబుల్ కిట్‌ను రూపొందించారు. గొంతు నుంచి సేకరించిన నమూనాతో ఈ కిట్ ద్వారా 50 నిమిషాల్లోనే కోవిడ్-19ను నిర్ధారించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం ల్యాబ్ పరీక్షల ద్వారా కోవిడ్ నిర్ధారణకు 24 నుంచి 48 గంటల సమయం పడుతోంది. అయితే యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా(యూఈఏ)కు చెందిన పరిశోధకులు రూపొందించిన కిట్‌తో తక్కువ సమయంలోనే కోవిడ్‌ను గుర్తించవచ్చు. ఈ కిట్‌ను నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) రెండు వారాల పాటు పరీక్షించనుంది. కొత్తగా రూపొందించిన కిట్ ద్వారా ఒకేసారి 16 నమూనాలను పరీక్షించే వీలుందని పరిశోధకులు వెల్లడించారు. ల్యాబ్ ఆధారిత నిర్ధారణ యంత్రం ద్వారా 384 నమూనాల వరకు పరీక్షించవచ్చని తెలిపారు. స్వీయ నిర్భంద వైద్య సిబ్బంది త్వరగా తిరిగి విధుల్లో చేరేందుకు ఈ కిట్ ఉపయోగపడుతుందన్నారు. తమకు వైరస్ సోకిందో, లేదో తెలుసుకోవడం పాటు తమ ద్వారా కోవిడ్ వ్యాప్తి చెందకుండా చేయడానికి ఈ కిట్ ఉపయోగపడుతుందని వివరించారు. (కోవిడ్: రష్యా కీలక నిర్ణయం) ‘ఎన్హెచ్ఎస్ సిబ్బందికి వేగంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలన్న ఆలోచనతో ఈ కిట్‌ను తయారుచేశాం. వారు ఆరోగ్యంగా ఉంటే ఎక్కువ సమయం వైద్య సేవలు అందించగలుగుతారు. ఒకవేళ వైరస్ సోకిందని తెలిస్తే వారి నుంచి ఇతరులకు వ్యాపించకుండా చేయడానికి వెంటనే వీలు కలుగుతుంది. రెండు వారాల్లో దేశంలోని అన్ని ఆస్పత్రుల్లో ఈ కిట్ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాం. గొంతు నుంచి సేకరించిన నమూనా నుంచి 3 నిమిషాల్లోనే ఆర్ఎన్ఏను వెలికితీసి కోవిడ్-19 నిర్థారిత పరీక్షలు చేస్తాం. తక్కువ నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బంది కూడా ఈ కిట్‌ను ఉపయోగించేలా రూపొందించామ’ని పరిశోధక బృందానికి నేతృత్వం వహించిన జస్టిన్ ఓ గ్రాడీ పేర్కొన్నారు. (కరోనాపై యుద్ధం: భారత్‌పై చైనా ప్రశంసలు) -
‘కరోనా’తో పాటు అన్ని వైరస్‌లకు ఒకే టీకా!
బోస్టన్: చైనాలో పుట్టి సుమారు 30 దేశాలకు వ్యాప్తి చెందిన కోవిడ్-19(కరోనా వైరస్)తోపాటు అన్ని రకాల వైరస్ల నుంచి రక్షణ కల్పించేందుకు ఒక సార్వత్రిక వ్యాక్సిన్ తయారీకి మార్గం సుగమమైంది. ఆర్గోనాట్4 క్లుప్తంగా ఏజీఓ4 అని పిలిచే ఒక ప్రోటీన్ అన్ని వైరస్‌లను ఎదుర్కోగలదని మసాచూసెట్స్ జనరల్ ఆసుపత్రి శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు. అనేక రకాలైన వైరస్ల నుంచి కణాలను రక్షించేందుకు ఏజీఓ4 ఉపయోగపడుతుందని, క్షీరదాల రోగ నిరోధక కణాల విషయంలో ఇది వైరస్‌లకు వ్యతిరేకంగా పోరాడుతుందని ఈ శాస్త్రవేత్త కేట్ ఎల్.జెఫ్రీ తెలిపారు. (చదవండి : ఓ చైనా మహిళ ఆవేదన : ప్రపంచానికి సూటి ప్రశ్న!) -
మందులు కలిపితే కీళ్లనొప్పులు ఫట్?
ఆర్థరైటిస్ సమస్యకు సాల్క్ పరిశోధకులు ఓ వినూత్నమైన కొత్త చికిత్స పద్ధతిని కనుక్కున్నారు. మందులేసుకోవడం లేదా కీళ్లు మార్పించుకోవడం మాత్రమే ఇప్పటివరకూ ఉన్న కీళ్లనొప్పుల పరిష్కారాలు కాగా.. శక్తిమంతమైన రెండు కొత్త మందులను కలిపి వాడటం ద్వారా నొప్పులు తగ్గించడంతోపాటు కీళ్ల మధ్య ఉండే పదార్థాన్ని మళ్లీ పెరిగేలా చేయవచ్చునని వీరు చెబుతున్నారు. ఎలుకలతోపాటు మానవ కార్టిలేజ్ కణాలపై జరిగిన పరిశోధనలు ఇప్పటికే మంచి ఫలితాలిచ్చాయని ప్రొటీన్ అండ సెల్ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం చెబుతోంది. వయసు పెరిగే కొద్దీ కీళ్ల మధ్య ఉండే మృదులాస్థి కణజాలం అరిగిపోయి నొప్పులు వస్తాయన్నది మనకు తెలిసిన విషయమే. ఊబకాయం కూడా ఈ సమస్యకు కొంతవరకూ కారణమవుతోంది.ఆల్ఫా క్లోథో, టీజీఎఫ్‌ఆర్2 అనే రెండు రసాయన మూలకాలు ఈ సమస్యకు పరిష్కారం చూపగలవని ఇప్పటికే గుర్తించగా.. సాల్క్ పరిశోధకులు ఈ రెండింటిని కలిపి ఎలుకలపై ప్రయోగించారు. ఈ రెండు మందులు మృదులాస్థి కణాలు అరిగిపోకుండా చేస్తున్నట్లు గుర్తించారు. టీజీఎఫ్‌ఆర్2 కణాలు ముక్కలైపోకుండా అడ్డుకోవడమే కాకుండా.. వృద్ధి చెందేందుకు ఉపయోగపడుతున్నట్లు పరిశోధనల ద్వారా తెలిసింది. ఆరు వారాల చికిత్స తరువాత ఈ రెండు మందులు కలిపి అందించిన ఎలుకల్లో కీళ్లనొప్పుల తాలూకూ లక్షణాలు గణనీయంగా తగ్గిపోయాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మార్టినెజ్ రెడొండో తెలిపారు. -
దెబ్బతిన్న డీఎన్ఏపై పరిశోధనలు
సాక్షి, సంగారెడ్డి: దెబ్బతిన్న లేదా పాడైన డీఎన్ఏను సరిచేసే (మరమ్మతు) ప్రొటీన్ పనివిధానాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) పరిశోధకులు ఆవిష్కరించారు. ఈ అధ్యయన ఫలితాలు పీర్–రివ్యూ జర్నల్ ‘న్యూక్లియిక్ యాసిడ్ రీసెర్చ్’లో ప్రచురితమైనట్లు ఐఐటీహెచ్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. గువాహటి ఐఐటీ బయో సైన్సెస్ అండ్ బయో ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ అరుణ్‌గోయెల్ సహకారంతో ఈ అధ్యయనాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. జర్నల్‌లో వచ్చిన డాక్యుమెంట్‌ను అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అనింద్యారాయ్, డాక్టర్ అరుణ్‌గోయెల్, మోనిషామోహన్, ఆకుల దీప, అరుణ్ థిల్లాన్‌లు సంయుక్తంగా రచించినట్లు తెలిపారు. శరీరంలో సహజంగా ఉత్పత్తయ్యే కొన్ని రకాల రసాయనాలు డీఎన్ఏకు నష్టాన్ని కలిగిస్తాయని డాక్టర్ అనింద్యారాయ్ వివరించారు. ఈ సమస్యకు సత్వరం చికిత్స చేయకపోతే మరణం వరకు దారితీస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే దెబ్బతిన్న డీఎన్ఏకు చికిత్స చేయడానికి పరిశోధనలు చేపట్టినట్లు వివరించారు. ఈ పరిశోధనలకు భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, సైన్స్ అండ్ రీసెర్చ్ ఇంజనీరింగ్ బోర్డు (ఎస్ఈఆర్బీ) నిధులను సమకూరుస్తున్నట్లు తెలిపారు. డీఎన్ఏకి ఏదైనా నష్టం జరిగితే కేన్సర్ వంటి వ్యాధులకు ఈ మార్పులు దారితీస్తాయన్నారు. -
జంక్‌ఫుడ్‌తో రొమ్ముక్యాన్సర్ ముప్పు!
టీనేజీ పిల్లలు జంక్‌ఫుడ్ అదేపనిగా తింటుంటారు. వారి ఈ అలవాటుతో భవిష్యత్తులో రొమ్ము క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. పిల్లలు తీసుకునే జంక్ఫుడ్స్, కేక్స్, బిస్కెట్ల వంటి పదార్థాల్లోని కొవ్వులు, నూనెల వల్ల వారు పెద్దయ్యాక కొన్ని అనర్థాలు కనిపించే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్‌కు చెందిన అధ్యయనవేత్తలు వెల్లడించారు. అనేక మంది టీనేజీ పిల్లలపై అధ్యయనం చేస్తూ దాదాపు పదేళ్ల పాటు సేకరించిన సమాచారాన్ని విశ్లేషించగా ఈ విషయం తేటతెల్లమైంది. ఆ వయసులో ఉండే అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు తోడుగా ఇక పెద్దయ్యాక ఆల్కహాల్ కూడా జత అయితే రొమ్ముక్యాన్సర్ ముప్పు మరింత పెరుగుతుందని తేలింది. ఈ వివరాలన్నింటినీ అమెరికా అసోసియేషన్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ జర్నల్ అయిన ‘క్యాన్సర్ ఎపిడెమియాలజీ, బయోమార్కర్స్ అండ్ ప్రివెన్షన్’లో పేర్కొన్నారు. -
డెంగీ దోమల్లో వ్యాధి వ్యాప్తిని తగ్గించే ‘వోబాకియా’ బ్యాక్టీరియా!
ఈ సీజన్లో డెంగీ మన తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ఎంతగా గడగడలాడించిందో తెలుసు కదా. ఇక్కడే కాదు... మనలాంటి వేడి వాతావరణం ఉండే ఎన్నో దేశాల్లో డెంగీ వేధిస్తోంది. డెంగీ వ్యాధిని అదుపు చేయడానికి ఒక మార్గాన్ని కనుకున్నారు మలేషియాలోని కౌలాలంపూర్ పరిశోధకులు. అక్కడి పరిశోధకులే కాదు... ఆస్ట్రేలియా, వియత్నాం వంటి దేశాలతో పాటు యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో, మెల్బోర్న్ వంటి విద్యాసంస్థల్లో జరిగిన పరిశోధనల కారణంగా మానవాళికి మేలు చేసే ఒక శుభవార్త లోకానికి తెలిసింది. పరిశోధనశాలల్లో ఉన్న డెంగీని వ్యాప్తి చేసే ఏడిస్ ఈజిపై్ట దోమల్లోకి ‘వొబాకియా (Wolbachia) అనే బ్యాక్టీరియాని ఇంజెక్ట్ చేసి వాటిని బయటి వాతావరణంలోకి విడుదల చేశారు. ఆ బ్యాక్టీరియాతో ఇన్ఫెక్ట్ అయిన తర్వాత అవే దోమల్లో ప్రత్యుత్పత్తి జరిగాక పుట్టిన తర్వాతి తరం దోమల్లో డెంగీని వ్యాప్తి చేసే శక్తి గణనీయంగా తగ్గిపోయినట్లుగా పరిశోధకులు గుర్తించారు. ఈ కారణంగానే ఆ మరుసటి ఏడాది అక్కడ 40 శాతం తక్కువగా డెంగీ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఉష్ణమండల (వాతావరణంలో వేడిమి 36 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న) ప్రాంతాల్లో డెంగీ వ్యాప్తి గణనీయంగా తగ్గడం గుర్తించిన పరిశోధకులు... ఈ పరిశోధన ఫలితాలు ‘కరంట్ బయాలజీ’ అనే జర్నల్‌లో నమోదయ్యాయి. ప్రస్తుతానికి ఈ వొబాకియా పరిశోధనలు డెంగీకి మాత్రమే పరిమితమయ్యాయి. ఇలాంటి హానిచేయని బ్యాక్టీరియాలను ఉపయోగించి మరిన్ని వ్యాధులను అదుపు చేసే విధంగా పరిశోధనలు సాగుతున్నాయి. -
మన మెదడు చిన్నది!
న్యూఢిల్లీ: భారతీయుల మెదడు పరిమాణం చైనీయులు, కొరియన్లు, కాకాసియన్ల కంటే చిన్నదిగా ఉంటుందని శాస్త్రవేత్తలు పరిశోధనాత్మకంగా కనుగొన్నారు. భారతీయుల మెదడు ఆకారం ఇతరుల కంటే భిన్నంగా ఉందని గుర్తించారు. దీనికోసం శాస్త్రవేత్తలు తొలిసారి భారతీయుల బ్రెయిన్ అట్లాస్‌ను రూపొందించారు. దీనిని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటీ) హైదరాబాద్‌కు చెందిన పరిశోధకులు జయంత్రి శివస్వామి, అల్ఫిన్ తొట్టుపట్టు అభివృద్ధి చేశారు. -
రోజూ చూడండి... అప్పుడప్పుడు మాత్రమే వండుకోండి
వంటల కార్యక్రమంపై అధ్యయనవేత్తలు చెబుతున్న జాగ్రత్త చాలామంది వంటల ప్రోగ్రాములను సరదగా చూస్తూ ఉంటారు. కొంతమంది వాటిని ట్రై చేస్తూ కూడా ఉంటారు. అదృష్టమేమిటంటే... చూసేవాళ్ల కంటే ట్రై చేసేవాళ్లు తక్కువ. అంటే ఆ వంటకాలతో నేరుగా ప్రమాదమేమీ ఉండదుగానీ... అదేపనిగా వాటిని నిత్యం తయారు చేస్తూ, తినిపిస్తూ, తింటూ ఉంటే ఇంట్లోవాళ్ల బరువు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు కొందరు అధ్యయనవేత్తలు. అలా చూసిందల్లా వండుకునే అలవాటు ఉంటే మాత్రం కాస్తంత అప్రమత్తంగా ఉండాల్సిందే అంటూ జాగ్రత్త అని చెబుతున్నారు కొందరు పరిశోధకులు. కొన్నాళ్ల కిందట కొందరు అధ్యయనవేత్తలు 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గలవారిని దాదాపు 500 మంది మహిళలను ఎంపిక చేశారు. వాళ్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఆ గ్రూపులకు ‘వ్యూవర్స్’ అండ్ ‘డూవర్స్’ అంటూ పేర్లు కూడా పెట్టారు. అంటే కేవలం వంటల కార్యక్రమాన్ని చూసేవారూ, చూసినవి చేసేవారు అని వర్గీకరించారు. వ్యూవర్స్ వాటిని క్రమం తప్పకుండా చూస్తూ ఆనందిస్తుంటారంతే. కానీ డూవర్‌స మాత్రం ఒక నిర్ణీత వ్యవధి పాటు వాటిని వండుకొని తింటూ కూడా ఉంటారు. ఇలా... చూసి ఆనందించేవారితో పోల్చినప్పుడు, వాటిని ఇంట్లోనూ వండి తినే వారు చాలా కొద్ది సమయంలోనే సగటున దాదాపు 5 కిలోల (పదకొండు పౌండ్లు) బరువు పెరిగినట్లు గమనించారు. ఈ బరువు చాలా ఎక్కువనీ, ఆరోగ్యానికి చెరుపు చేస్తుందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. పైగా చూసినవి, చేసుకుని తినేవారిలో చాలామందికి పొట్టపెరగడం (సెంట్రల్ ఒబేసిటీ) పెరిగిందట. ఇది గుండెజబ్బులు మొదలుకొని ఆరోగ్యానికి అనేక అనర్థాలు తెచ్చిపెడుతుందని తేలిందని ఆ అధ్యయనవేత్తలు హెచ్చరించారు. తమ పరిశోధన ఫలితాలు కొన్నాళ్ల కిందట ‘ఎపిటైట్’ అనే హెల్త్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. వంటప్రోగ్రాములు చూస్తూ ఒకవేళ ఇలా నిత్యం వండుకునే వారెవరైనా ఉంటే... అది అప్పుడప్పుడు మాత్రమే సరదాగా చేయాల్సిన పని అనీ, అంతేగానీ చూసిందల్లా వండి తినకండి అంటూ జాగ్రత్తలు కూడా చెబుతున్నారు. -
తుప్పుకిక ఓటమి తప్పదు...
మామిడి ఆకులను ఎందుకు వాడతారు? గుమ్మానికి తోరణంగా వాడొచ్చు.. యాగాలు, హోమాలు చేస్తూంటే ప్రోక్షణకు పనికొస్తుంది. అంతకుమించి దానివల్ల ఇంకేం ఉపయోగం అంటున్నారా? మీ ఆలోచనలకు కళ్లెం వేయండి. ఎందుకంటే.. ఇకపై ఈ మామిడాకులు ఏటా లక్షల కోట్లు ఆదా చేస్తాయి మరి! ఎలాగంటే.. ఇనుమును అలాగే వదిలిస్తే ఏమవుతుంది? కొంత కాలానికి తుప్పు పడుతుంది. సముద్రంలో ఎప్పుడూ ఉండే పెద్ద పెద్ద నౌకలు మరింత వేగంగా తుప్పుపడతాయి. ఈ తుప్పు వదిలించుకునేందుకు అవుతున్న ఖర్చు ఎంతో తెలుసా? ఏకంగా.. రెండున్నర లక్షల కోట్ల డాలర్లు! అయితే మామిడాకుల నుంచి తీసిన ఓ పదార్థం ఇనుముకు తుప్పు అసలే పట్టనివ్వదని తిరువనంతపురం కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు రుజువు చేశారు. ఈ పదార్థాన్ని వాడటం ద్వారా పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న కృత్రిమ రంగుల వాడకాన్ని నిలిపివేయవచ్చని అంచనా. మామిడాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, తుప్పు తట్టుకునే పాలీఫినాల్స్ ఎక్కువగా ఉంటాయని.. అందుకే తాము వీటిపై పరిశోధనలు ప్రారంభించామని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త నిషాంత్ కె.గోపాలన్ తెలిపారు. ఎథనాల్ సాయంతో ఎండిపోయిన మామిడాకుల నుంచి పాలీఫినాల్స్ వంటి రసాయనాలను తొలుత వేరు చేశామని చెప్పారు. వేర్వేరు సాంద్రతలతో ఈ రసాయనాలను పరిశీలించగా ఇనుము లాంటి లోహాలతో బంధం ఏర్పరచుకున్న పాలీఫినాల్స్ తుప్పును సమర్థంగా అడ్డుకుంటుందని వివరించారు. గరిష్టమైన నిరోధకత కలిగిన పదార్థపు పూత పూసిన ఇనుమును ఉప్పునీటిలో ఉంచి పరీక్షించినప్పుడు తుప్పు పట్టడం 99 శాతం తగ్గిందని చెప్పారు. ఈ పదార్థంపై మరిన్ని పరిశోధనలు, ప్రయోగాలు చేయాల్సి ఉందని గోపాలన్ చెప్పారు. మార్కెట్లో తుప్పును నిరోధించే రసాయనాలు ఎన్నో ఉన్నా వాటి ఖరీదు చాలా ఎక్కు వని.. పైగా వాటితో మానవ ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉంద న్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు తాము మొక్కల రసాయనాలను అన్వేషించామని చెప్పారు. మామిడాకులతో పాటు ఈత/ఖర్జూరపు గింజలు, అల్లం నుంచి వేరు చేసిన రసాయనాలు కూడా తుప్పును తట్టుకోగలవని తమ ప్రయోగాల ద్వారా తెలిసిందని వివరించారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఒక్కసారి బ్యాటింగ్ మొదలుపెడితే..
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్ బ్యాట్ తయారు చేసేందుకు కెనెడాలోని బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. నాణ్యమైన కశ్మీరీ, ఇంగ్లిష్ విల్లోను ఎంపిక చేయడమే కాకుండా.. కంప్యూటర్ మోడలింగ్, సమర్థత పెంచేందుకు పనికొచ్చే అల్గారిథమ్‌లను ఇందులో వాడటం విశేషం. ‘అల్గోబ్యాట్’అని పిలుస్తున్న ఈ కొత్తరకం బ్యాట్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అత్యుత్తమ బ్యాట్‌కు ఏమాత్రం తీసిపోదని.. అందరికీ అందుబాటులోనే ధర ఉంటుందని ఫిల్ ఎవన్స్ అనే శాస్త్రవేత్త అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రొఫెషనల్ క్రికెట్ ఆడేవారు దాదాపు 10 లక్షల మంది ఉన్నారు. విరాట్ క్లోహ్లీ, స్టీవ్ స్మిత్, ఇయాన్మోర్గన్ వంటి ఆటగాళ్ల స్ఫూర్తిగా క్రికెట్లోకి అడుగుపెట్టే పిల్లలకు మంచి బ్యాట్ కొనడం ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో మంచి బ్యాట్ ఖరీదు లక్షల్లో ఉండగా.. తమ ఆల్గోబ్యాట్ ఖరీదు రెండు మూడు వేల కంటే ఎక్కువ ఉండదని ఎవన్స్ తెలిపారు. బ్యాట్ జ్యామితిని మార్చడం ద్వారా బంతి తగిలినప్పుడు అతితక్కువ కంపించడం, తక్కువ శక్తితోనే ఎక్కువ దూరం వెళ్లడం ఈ ఆల్గోబ్యాట్ ప్రత్యేకతలని వివరించారు. ఆల్గోబ్యాట్ డిజైన్‌తో సాధారణ కలపతోనూ అత్యుత్తమమైన బ్యాట్లు తయారు చేయొచ్చని, ఆయా కలప రకానికి తగ్గట్లు డిజైన్ మార్చుకునే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆల్గోబ్యాట్ నమూనాలను పరీక్షిస్తున్నామని.. అన్నీ సవ్యంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత మార్కెట్లోకి ప్రవేశపెడతామని వెల్లడించారు. -
ఆత్మ నుండి... ఆత్మలోకి
మనిషి అనేక ప్రాకృతిక చర్యలను గుర్తించలేడు. ఉదాహరణకు తాను భూమిలో భాగమై ఉండటం వలన భూభ్రమణాన్ని గమనించలేడు. అలాగే, తన శరీరంలో జరిగే చర్యలను గుర్తించలేడు. తనకున్న పరిమితులు, తన దృక్పథంతో మాత్రమే ఆలోచించడం వలన అనేక అపోహలు, నమ్మకాలు కలుగుతాయి. కొన్నింటిని ఇతరుల నుండి స్వీకరించి, కొన్ని స్వతహాగా ఊహించి అనుకూల వాదనలు చేస్తూ ఉంటాడు. ఈ మార్గం సరైంది కాదని తెలుసుకున్న భారతీయ ఆధ్యాత్మిక పరిశోధకులు హేతువు నుండి పరిశోధన మొదలు పెట్టారు. ఏది హేతువో అది ఆత్మ అని నిశ్చయించారు. ఆ ఆత్మ నుండే పదార్థం ఉద్భవిస్తోందని, తిరిగి దానిలోనే లయమైపోతోందని నిర్ధారించారు. ఈ సూత్రాన్ని ఒడిసిపడితే చాలు, అన్నింటికీ సమాధానం దొరికిపోతుంది. మనం మన తల్లిదండ్రుల ద్వారా ఉద్భవించినట్టు అనిపించినా, మన ఈ పరిణామరూపం ఆత్మచేత, ఆత్మ ద్వారా, ఆత్మ నుండి, ఆత్మలోనే జరుగుతుందని గుర్తించ గలుగుతాము. ఈ విధంగా మన ఆలోచనలను హేతుమార్గంలో విస్తృత పరచుకుంటే ఆత్మ అర్థమౌతుంది. అర్థమైన ఆత్మను అంతటా, అన్నింటా దర్శించే ప్రయత్నమే తపస్సు. ఈ తపస్సు నిరంతర ఆలోచనల్లో నిండిపోతే కలిగేదే ఆత్మసందర్శన లేక భగవత్సాక్షాత్కారం.ఆ ఆలోచనలను ఆచరిస్తే కలిగే స్థితే బ్రహ్మస్థితి. అంటే సాధకుడు ‘అహం బ్రహ్మాస్మి’ స్థాయికి చేరుకుంటాడు.’ఈశావాస్యోపనిషత్తు’ చెప్పినట్లుగా బ్రహ్మస్థితిలో ఉన్న సాధకుడికి తన చుట్టూ ఉన్న ఏ జీవీ అల్పమైనదిగానో, అసహ్యకరమైనదిగానో కనిపించదు. అన్నింటా ఈశ్వరుడు కనిపిస్తే ఏహ్యభావమెలా కలుగుతుంది? అలాగే, వస్తువాసనలు నశించిపోతాయి. అందువల్ల అరిషడ్వర్గాలు ఆవిరైపోతాయి.అరిషడ్వర్గాలు నశిస్తే దుఃఖానికి స్థానమెక్కడుంటుంది? దుఃఖమే లేనప్పుడు మనసంతా ఆనందమయమే కదా! ఈ ఆనందం మనకు కలిగే సంతోషాలకు భిన్నమయిందీ, ఉన్నతమయింది. సంతోషం స్వల్పకాలిక మానసిక ప్రతిస్పందన కాగా, ఈ ఆనందం ఎలాంటి మానసిక స్పందనలూలేని స్థిరస్థితి.దీనిలో అలజడులకూ, హెచ్చుతగ్గులకూ స్థానం లేదు. అలా నిశ్చలమై, నిరంతరమై ఉంటుంది. సాధకునికి తనలో, తన చుట్టూ కలిగే పరిణామాలకు సంబంధమే ఉండదు. సాధకుడి పని సాధకునిది.అదే కర్మతో, ప్రతిఫలంతో సంబంధం లేని మోక్షస్థితి. అందరూ ఆశించే పరమాత్మ సన్నిధి. -
పరిశోధకులకు బ్రిటన్ ప్రత్యేక వీసాలు
లండన్: పరిశోధన రంగానికి ఊతమిచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో భారతీయ పరిశోధకులు లాభపడనున్నారు. భారత్ సహా వివిధ దేశాలకు చెందిన ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు, పరిశోధకుల కోసం ప్రత్యేక వీసాల జారీని బ్రిటన్ ప్రారంభించింది. ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభించిన యూకే సైన్స్, రీసెర్చ్, అకాడెమియా కార్యక్రమం(యూకేఆర్ఐ) ప్రస్తుతమున్న టయర్–5(ప్రభుత్వ ఆమోదిత తాత్కాలిక సిబ్బంది మార్పిడి) పథకంతోపాటు అమల్లో ఉంటుంది. కొత్త వీసాతో యూరోపియన్ యూనియన్(ఈయూ)యేతర దేశాల సైంటిస్టులు, పరిశోధకులు బ్రిటన్‌లో రెండేళ్లపాటు ఉండొచ్చు. బ్రిటన్‌లోని 7 పరిశోధన విభాగాలు,ఇన్నోవేటివ్ యూకే, రీసెర్చ్ ఇంగ్ల్లండ్లలో పనిచేసేందుకు చాన్స్ ఉంటుంది.ఈ పరిణామాలు భారత్ వృత్తి నిపుణులు, వ్యాపార వేత్తలకు అనుకూలం. -
బియ్యం గింజ కంటే చిన్ని ‘కంప్యూటర్’
వాషింగ్టన్ : బియ్యం గింజ కంటే చిన్న కంప్యూటర్ మీరెప్పుడైనా చూశారా? అయితే అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించిన ప్రపంచంలో అత్యంత చిన్న కంప్యూటర్ను మీరు చూడాల్సిందేనట. ఇది బియ్యం గింజ కంటే చిన్నదిగా ఉంది. ఈ డివైజ్ కేవలం 0.3 ఎంఎం మాత్రమే. మామూలు డెస్క్‌టాప్‌ల మాదిరిగా కాకుండా.. ఈ మైక్రోడివైజ్ను స్విచ్ఛాప్ చేయగానే దీనిలో ముందు చేస్తున్న ప్రొగ్రామింగ్, డేటా అంతా పోతుంది. అయితే దీన్ని కంప్యూటర్‌గా పిలువాలా? లేదా? అన్నది ఇంకా స్పష్టంగా తెలియదని ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ డేవిడ్ బ్లోవ్ అన్నారు. ఇది మామూలు కంప్యూటర్లతో పోలిస్తే పదింతలు చిన్నదిగా ఉంటుందని తెలిపారు. దీంతో తక్కువ ఖాళీ ఉన్న ప్రాంతాల్లో తేలికగా బిగించవచ్చని పేర్కొన్నారు. దీన్ని మిచిగాన్ మైక్రో మోట్‌గా అభివర్ణించారు. ఐబీఎం కూడా ప్రపంచంలో అత్యంత చిన్న కంప్యూటర్ను తయారు చేసినట్టు మార్చిలో ప్రకటించింది. చిన్న పరిణామాల్లో సరికొత్త డివైజ్‌లను రూపొందిస్తూ.. నూతన ఒరవడికకు పరిశోధకలు ప్రాణం పోస్తున్నారు. ఈ చిన్న కంప్యూటర్ల విజయవంతంతో ఇతర రంగాల్లో పరిశోధనలకు కూడా బార్ల తలుపులు తెరుచుకుంటున్నాయి. కన్నులు, క్యాన్సర్ స్టూడియోలు, ఆయిల్ రిజర్వాయర్ మానిటరింగ్, బయోకెమికల్ ప్రాసెస్ మానిటరింగ్, వంటి వాటిల్లో ఈ చిన్న డివైజ్‌లను వాడుకోవచ్చని మిచిగాన్ యూనివర్సిటీ చెప్పింది. పరిమిత ఫీచర్లనే ఇది కలిగి ఉంది. ఆంకాలజి రీసెర్చ్‌లో ఈ డివైజ్ ఎంతో సాయపడనుందని, క్యాన్సర్ కణాలు పెరుగుతున్న దశలో దీన్ని మౌజ్లోకి చొప్పించాల్సి ఉంటుందని రేడియోలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ యూఎం ప్రొఫెసర్ గ్యారీ లూకర్ అన్నారు. -
పొగతాగితే కాళ్లకూ కష్టమే
న్యూయార్క్: ధూమపానం ఊపిరితిత్తులపై మాత్రమే ప్రభావం చూపుతుందనేది అందరి నమ్మకం. కానీ, అది తప్పని తేలింది. పొగతాగే అలవాటు కాలి కండరాలపైనా దుష్ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో రుజువయింది. ధూమపానం అలవాటు కాలి కండరాల్లో రక్తనాళాల సంఖ్యను తగ్గిస్తుందనీ తద్వారా కండరాలకు ఆక్సిజన్‌తోపాటు పోషకాల లభ్యత తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు. ‘పొగాకుతో కూడిన సిగరెట్లు తాగే వారిలో పెద్ద కండరాలతోపాటు శరీరం అంతటా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ హానిని నివారించేందుకు అవసరమైన విధానాలను రూపొందించాల్సి ఉంది’అని కాలిఫోర్నియా–శాన్‌డియాగో యూనివర్సిటీకి చెందిన ఎలెన్బ్రీన్ అంటున్నారు. ఈ పరిశోధనకు గాను కాలిఫోర్నియా, బ్రెజిల్, జపాన్‌లకు చెందిన నిపుణులు..ఒక ఎలుకను ఎనిమిది వారాలపాటు పొగాకు పొగ ప్రభావం పడేలా చేశారు. ఫలితాలను పరిశీలించగా.. ఆ ఎలుకలోని రక్తనాళాల సంఖ్య తగ్గాయి. ఫలితంగా శరీరంలోని జీవక్రియలు, చురుకుదనం మందగించాయి. వీటివల్ల డయాబెటిస్, ఊపిరితిత్తుల సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని తేల్చారు. అయితే, సిగరెట్లలో ఉండే దాదాపు నాలుగు వేల రకాలైన రసాయనాలు కండరాల క్షీణతపై ఏ మేరకు ప్రభావం చూపుతున్నాయనే అంశం మాత్రం ఈ అధ్యయనంలో వెల్లడికాలేదు. -
వారానికి 10 గ్లాసుల వైన్ తాగుతున్నారా..?
లండన్: మందుబాబులు..మీరు వారానికి 10 గ్లాసుల వైన్ తాగుతున్నారా..? అయితే ఇక మీ జీవితంలో రెండు ఏళ్ల ఆయుషు తగ్గిపోయినట్లేనని అంటున్నారు కేంబ్రిడ్జి యూనివర్సీటీ పరిశోధకులు. ఇటీవలే వారు మద్యంపై వైద్య పరంగా ఓ విస్తృతమైన పరిశోధన చేశారు. వారి అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ వ్యక్తి వారానికి పది లేదా అంత కంటే ఎక్కువ గ్లాసుల వైన్‌ను సేవిస్తే రెండేళ్ల ఆయుషు తగ్గుతుందని యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పరిశోధన కోసం19 దేశాలకు చెందిన దాదాపు ఆరు లక్షల మందిని పరిశీలించామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 40 ఏళ్ల ఓ వ్యక్తి వారానికి 5 పెగ్గుల మద్యాన్ని సేవిస్తే తన జీవిత కాలంలో ఆరు నెలలు నష్టపోతాడని, 10 గ్లాసుల వైన్ తాగితే రెండేళ్లు, 18 గ్లాసులు తాగితే ఐదేళ్ల ఆయుషును కోల్పోతారని యూనివర్సీటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. యూనివర్సీటీ శాస్త్రవేత్త డాక్టర్ ఎంజెలా వుడ్ మాట్లాడుతూ..ఇప్పటికే మద్యం సేవించేవారు తాగడం తగ్గించాలని లేదంటే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మితిమీరిన మద్యం తాగడం వల్ల లివర్ క్యాన్సర్, రక్త పోటు లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. 60 ఏళ్లు దాటిన వారికి మద్యం సేవించడం వల్లే ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు పరిశోధనలో తేలిందన్నారు. -
రెండు వారాలకో భాష అంతం
సాక్షి నాలెడ్జ్ సెంటర్ : ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెండు వారాలకు ఒక భాష కనుమరుగవుతోంది. భారత్‌లో నలభైకి పైగా భాషలు, మాండలికాలు అదే ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాయి. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గదబ, నైకీ అనే గిరిజనతెగల భాషలున్నాయి. పది వేల మంది కంటే తక్కువగా మాట్లాడే భాషలు క్రమంగా కాలగర్భంలో కలిసి పోతాయని పరిశోధకులు చెబుతున్నారు. 50 ఏళ్లలో 220 భాషలు కనుమరుగు... మనదేశంలో 780 భాషలకు పైగా ఉనికిలో ఉండగా, గత 50 ఏళ్లలోనే 220 భాషలు కనబడకుండా పోయాయి. దీనిని బట్టి భారతీయ భాషలు ఎంత వేగంగా అంతరించే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయన్నది స్పష్టమవుతోంది. ఐరాస విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ఆధ్వర్యంలో నిర్వహించిన వర్గీకరణ ప్రకారం భారత్‌లోని 197 భాషలు ఈ కోవలోకే వస్తాయి. వల్నరబుల్, డెఫినెట్లి ఎండేంజర్డ్, సివియర్లీ ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్‌గా ఆ సంస్థ వర్గీకరించింది. వీటిలో బొరొ, మీథీ మాత్రమే భారత్‌లో అధికారికంగా గుర్తించినవి. ఇతర భాషలకు రాత (లిఖిత) వ్యవస్థ లేదు. జనన గణన డైరెక్టరేట్ నివేదిక ప్రకారం...మనదేశంలో 22 షెడ్యూల్డ్ భాషలతో పాటు, లక్షకు పైగా మంది మాట్లాడే వంద నాన్–షెడ్యూల్డ్ భాషలున్నాయి. అయితే యునెస్కో రూపొందించిన కనుమరుగయ్యే ప్రమాదమున్న భాషలు,మాండలికాల జాబితాలో 40 భారతీయ భాషలున్నాయి. ఈ భాషలను పదివేల మంది కంటే తక్కువ మాట్లాడుతున్నారు. అందువల్ల ఈ భాషలు అంతరించే ప్రమాదముందని హోంశాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. యునెస్కో జాబితాలోని 40 భారతీయ భాషలివే ►అండమాన్, నికోబార్ దీవుల్లో మాట్లాడే 11 భాషలు... గ్రేట్ అండమానీస్, జరావా, లామొంగ్సే, లూరో, మ్యుయొట్, ఒంగో, పు, సెనెన్యో, సెంటిలీస్, షోంపెన్, తకహనియిలాంగ్. ►మణిపూర్‌లోని 7 భాషలు...ఐమల్, అక, కొయిరెన్, లామ్‌గంగ్, లాంగ్రాంగ్, పురుమ్, తరావ్. ►హిమాచల్‌ప్రదేశ్‌లోని నాలుగు భాషలు...బఘతి, హందురి, పంగ్వలి, సిర్‌మౌది. ►మండ, పర్జి,పెంజో(ఒడిశా) కొరగ, కురుబ (కర్ణాటక), గదబ, నైకీ (ఆంధ్రప్రదేశ్), కోట, తోడ, (తమిళనాడు), మ్రా, నా (అరుణాచల్‌ప్రదేశ్), తై నోరా, తైరాంగ్ (అసోం), బంగాని (ఉత్తరాఖండ్), బిర్హొర్ (జార్ఖండ్), నిహాలి (మహారాష్ట్ర), రుగ (మేఘాలయ), టొటొ (పశ్చిమ బెంగాల్). భాషల పరిరక్షణ ఏ విధంగా.. సమస్య తీవ్రత నేపథ్యంలో అంపశయ్యపై ఉన్న భాషలను కాపాడుకోవాలి. ఇలాంటి భాషల ఆడియో, వీడియో డాక్యుమెంటేషన్‌తో పాటు వాటిలోని ముఖ్యమైన కథలు చెప్పడం, జానపద,మౌఖిక సాహిత్యం, సంస్కృతి, చరిత్ర వంటి సాంఘిక,సాంస్కృతిక అంశాలను నిక్షిప్తం చేసుకోవాల్సి ఉంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని డిజిటలైజ్ చేయడం ద్వారా ఆయా భాషల వనరులను సంరక్షించుకోవాలి. ఇందుకు అవసరమైన సాఫ్ట్వేర్లు తయారుచేసుకోవాలి. ఈ వనరుల ద్వారా భాషాపరమైన పరికరాలు,పనిముట్లను తయారుచేసుకుని ఈ భాషల వ్యాప్తికి చర్యలు తీసుకోవాలి. ఈ కోవలోని భాషల పదకోషాలు తయారుచేసి, వాటిలోని పదాలను ఏ విధంగా పలకాలన్న దానిపై గ్రంథాలయాల ద్వారా అవగాహన కల్పించాలి. ఆడియో, వీడియో ఉపకరణాల ద్వారా ఇలాంటి భాషలపై విస్తృత ›ప్రచారం చేయాలి. ప్రతీ భాషలో మౌఖిక సాహిత్య భాండాగారం నిక్షిప్తమై ఉన్నందున కనుమరుగయ్యే భాషలపై ఈ విషయంలో ప్రత్యేక దృష్టి నిలపాలి. ప్రస్తుతం చౌకధరలకే స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఆడియో, వీడియోలు రికార్డ్ చేసి, ఫొటోలు తీసుకుని డేటాను తయారుచేసుకునే వీలుంది. -
వైన్‌తో కుంగుబాటు దూరం
లండన్ : పరిమిత మోతాదులో వైన్ తీసుకుంటే కుంగుబాటు దూరమవుతుందని తాజా అథ్యయనంలో వెల్లడైంది. ద్రాక్షలో ఉండే పదార్ధాలు కుంగుబాటుకు గురైన ఎలుకల్లో ప్రశాంతతను చేకూర్చినట్టు ఈ అథ్యయనంలో గుర్తించారు. వైన్‌లో వాడే ద్రాక్ష రసంలో ఉండే కొన్ని పదార్థాలు కణాల వాపును తగ్గించడంతో పాటు మెదడులో ట్రాన్స్మిషన్ సిగ్నల్స్‌ను మెరుగుపరుస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రస్తుతం డిప్రెషన్‌కు అందిస్తున్న చికిత్సలు కేవలం 50 శాతం కేసుల్లోనే తాత్కాలిక రిలీఫ్ ఇస్తున్నాయని తేలిన క్రమంలో తాజా అథ్యయనంలో వెల్లడైన ఫలితాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయని వారంటున్నారు. నేచర్ కమ్యూనికేషన్స్‌లో జర్నల్‌లో అథ్యయన వివరాలు ప్రచురించారు. కాగా డిప్రెషన్ చికిత్సలో మరింత మెరుగైన థెరఫీలు అవసరమని ఈ పరిశోధన చేపట్టిన న్యూయార్క్‌లోని మౌంట్ సినాయ్ హాస్పిటల్ రీసెర్చర్లు పేర్కొన్నారు. -
వాటితో డయాబెటిస్ ముప్పు
లండన్ : శీతల పానీయాలు, డైట్ డ్రింక్స్, రెడీ మీల్స్, సూప్స్ చివరికి కెచప్ వంటి పదార్థాలను తీసుకోవాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాలని తాజా అథ్యయనం హెచ్చరిస్తోంది. డ్రింక్స్‌లో వాడే స్వీటెనర్లతో టైప్ టూ డయాబెటిస్ ముప్పు పొంచిఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వీటిని అతిగా సేవిస్తే శరీరం చక్కెరను హ్యాండిల్ చేయడంలో మార్పులు సంభవించి డయాబెటిస్ ముప్పుకు లోనయ్యే ప్రమాదం ఉందని అథ్యయనం పేర్కొంది. రెండు వారాల పాటు ఎక్కువ మోతాదులో కృత్రిమ స్వీటెనర్లను తీసుకోవడం రోజుకు ఐదు క్యాన్ల డైట్ డ్రింక్ తాగడంతో సమానమని శాస్త్రవేత్తలు నిగ్గుతేల్చారు. ఇలా తీసుకుంటే శరీరం గ్లూకోజ్‌ను స్వీకరించే సామర్థ్యం కోల్పోతుందని వారు హెచ్చరించారు. క్రమంగా ఇది టైప్ టూ డయాబెటిస్ చుట్టుముట్టేందుకు దారితీస్తుందని స్పష్టం చేశారు. యూనివర్సిటీ ఆఫ్ అడిలైడ్‌కు చెందిన ప్రొఫెసర్ రిచర్డ్ యంగ్ నేతృత్వంలోని ఆస్ర్టేలియన్ పరిశోధకుల బృందం 27 మంది ఆరోగ్యవంతమైన వాలంటీర్లపై జరిపిన అథ్యయనంలో ఈ అంశాలు వెలుగుచూశాయి. -
మద్యంతో ఈ రిస్క్ అధికం
లండన్ : మద్యం తరచూ సేవిస్తే డీఎన్ఏ దెబ్బతిని క్యాన్సర్ సోకే రిస్క్ అధికమవుతుందని భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త ఆధ్వర్యంలో సాగిన ఓ అథ్యయనం హెచ్చరించింది. మద్యంతో క్యాన్సర్ ముప్పుపై గతంలో పలు పరిశోధనలు వెల్లడించినా, మద్యం కారణంగా మానవ డీఎన్ఏకు శాశ్వతంగా ఎంతటి నష్టం జరుగుతుందో వెల్లడించేందుకు తాజా అథ్యయనంలో పరిశోధకలు ఎలుకలపై చేసిన ప్రయోగ ఫలితాలను వివరించారు. బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తలు ఎలుకలకు ఆల్కహాల్‌ను ఇచ్చారు. అనంతరం వాటి శరీరంలో ఆల్కహాల్ ప్రవేశించిన అనంతరం రూపొందే హానికారక రసాయనం జన్యువులకు చేసే నష్టాన్ని పరిశీలించేందుకు క్రోమోజోమ్ విశ్లేషణను చేపట్టారు. రక్తకణాల్లోని డీఎన్ఏను ఈ రసాయనం విచ్ఛిన్నం చేస్తూ డీఎన్ఏ సీక్వెన్స్‌లు గతితప్పేలా చేస్తున్నట్టు పరిశోధకులు కనుగొన్నారు. స్టెమ్ సెల్స్‌లో డీఎన్ఏ దెబ్బతినడంతో కొన్ని రకాల క్యాన్సర్లు సోకే ప్రమాదం పొంచి ఉందని అథ్యయన వివరాలు వెల్లడిస్తూ ప్రొఫెసర్ కేతన్ పటేల్ స్పష్టం చేశారు. ఆల్కహాల్‌ను సేవించడంతో డీఎన్ఏ దెబ్బతినే అవకాశం అధికమని తమ అథ్యయనంలో వెల్లడైందని పేర్కొన్నారు. మానవ శరీరంలోని ఆరోగ్యవంతమైన కణాలూ దెబ్బతింటే అవి క్యాన్సర్ డెవలప్ అయ్యేందుకు ఉపకరిస్తాయని చెప్పారు. -
ఈ చెయ్యి చూస్తుంది కూడా!
లండన్: చేతులు లేని వికలాంగుల కోసం బ్రిటన్ బయో–ఇంజనీర్లు చూపున్న చేతిని తయారు చేశారు. మెదడుతో సంకేతాలు పంపగానే ఇది వస్తువును చూసి దానిని అందుకుంటుందట. ఇందుకోసం ఈ బయోనిక్ హ్యాండ్‌కు 99 పిక్సెళ్ల కెమెరాను అమర్చారు. ఇది పక్కనున్న వస్తువును చూసి పసిగట్టి సెకన్ల వ్యవధిలోపే చేతికి సంకేతాలు పంపుతుంది. బయోనిక్ హ్యాండ్‌కు కంప్యూటర్ విజన్ ఉంటుంది కాబట్టి కప్ లేదా బిస్కట్ వంటి పరికరాలను సాధారణ చెయ్యి లాగే అందుకుంటుందని న్యూ కజిల్ యూనివర్సిటీ పరిశోధకుడు కియనుష్ నజర్పూర్ తెలిపారు. కృత్రిమ అవయవాలతో ఇలాంటి పనులు చేయలేమన్నారు. -
అరుదైన కంపించే నక్షత్రం!
వాషింగ్టన్: సూర్యుడి పరిమాణంలో ఉండి కంపించగల ఓ అరుదైన నక్షత్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ భారీ నక్షత్రం ఏడు వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు అమెరికాలోని సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త ఫార్లే ఫెర్రాంటీ తెలిపారు. ఈ నక్షత్రం మూడు వేర్వేరు దిశల్లో కంపించగలదని (సంకోచించడం, వ్యాకోచించడం) చెప్పారు. మన పాలపుంతలో దాదాపు వంద బిలియన్ల కంటే ఎక్కువ నక్షత్రాలు ఉన్నాయని, కానీ ఇలాంటి అరుదైనవి కేవలం ఏడు మాత్రమే ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు. అందులో ప్రస్తుతం కనుగొన్న నక్షత్రం ఒకటి అని తెలిపారు. వక్రంగా ఉండే ఈ నక్షత్రాలు విశ్వం గురించి, దాని మూలాల గురించి మరింత అధ్యయనం చేసేందుకు తోడ్పడతాయి. -
ఆ రక్తమంటే దోమలు పడిచస్తాయట!
న్యూఢిల్లీ: దోమల కారణంగా మానవులకు వచ్చే జబ్బులు చాలానే ఉన్నాయి. అందులో మలేరియా కూడా ఒకటి. మలేరియా గురించిన ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని స్టోక్ హోమ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు బయటపెట్టారు. మలేరియా సోకిన వ్యక్తి రక్తమంటే దోమలు పిచ్చెక్కిపోతాయట. మలేరియా సోకిన వ్యక్తి శరీరంలోని క్రిమి హెచ్ఎమ్బీపీపీ అనే మాలిక్యూల్స్‌ను విడుదల చేస్తుందని తెలిపారు. దాని వల్ల మనుషుల్లోని ఎర్ర రక్తకణాలు కార్బన్ డై ఆక్స్‌డ్ ను అధిక మొత్తంలో విడుదల చేస్తాయని చెప్పారు. ఆ సమయంలో మనిషి శరీరం నుంచి వచ్చే వాసన దోమలను ఆకర్షిస్తుందని తెలిపారు. వ్యక్తి నుంచి దోమలు సేకరించిన రక్తంలో ఉన్న మలేరియా క్రిములు వేరే వ్యక్తిని కుట్టినప్పుడు అతని శరీరంలోకి ప్రవేశిస్తాయని చెప్పారు. తాజా పరిశోధనలతో ప్రమాదకర రసాయనాలను వినియోగించకుండా మలేరియాను నయం చేసేందుకు అవకాశం ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. -
పురాతన ఎమోజీ!
లండన్ : ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఎమోజీ (భావాల ను తెలిపే చిహ్నం)ని పరిశోధకు లు గుర్తించారు. 1635 సంవత్స రానికి చెందిన ఓ చట్టపరమైన దస్త్రాల్లో నవ్వుతున్న మొహంతో ఈ ఎమోజీ ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. స్లోవేకి యాలోకి స్ట్రాజోవ్ పర్వతాలకు పక్కన ఉన్న గ్రామంలో ఓ న్యాయవాది మున్సిపల్ అకౌంట్స్‌ను సమీక్షించి సంతకం చేశారు. ఆ సంతకంలో ఓ వృత్తం గీసి అందులో రెండు చుక్కలు, ఓ గీతను గీశారు. దీన్ని పరిశోధకులు పురాతన ఎమోజీగా గుర్తించారు. దీనికి ముందు 1648లోని ఓ ఎమోజీ పురాతనమైనదిగా గుర్తింపు పొందింది. -
కొండపై కోట.. కోటలో కోనేరు..!
మంగపేట సమీపంలో ప్రాచీన ఆనవాళ్లు సుమారు 30 కిలోమీటర్ల పొడవైన రాతిగోడ గుట్టలపై విశాలమైన చెరువులు సాక్షి, భూపాలపల్లి/మంగపేట: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేట మండలం మల్లూరు సమీపంలోని కొండల్లో భారీ కోట ఒకటి వెలుగు చూసింది. ఇందులో 30 కిలోమీటర్ల పొడవైన ప్రహరీ, నీటి నిల్వల కోసం గొలుసుకట్టు పద్ధతిలో కోనేరులు ఉన్నాయి. ఇటీవల తెలంగాణ సోషల్ మీడియా ఫోరం సభ్యులు ఇక్కడ పర్యటించగా భారీ గోడ కనిపించింది. అనంతరం ‘సాక్షి’ బృందం ఈ గుట్టపై పర్యటించి కోటకు సంబంధించిన ఆనవాళ్ల వివరాలు సేకరించింది. కొండపై అందమైన కోట.. మంగపేట మండలంలోని మల్లూరు నుంచి మణుగూరు వెళ్తుంటే భారీ కొండలు కనిపిస్తాయి. రమణక్కపేటకు సమీపంలో ఎర్రమ్మతల్లి తోగు నుంచి కొండపైకి ఎక్కాలి. 5 కిలోమీటర్ల దూరం పైకి ప్రయాణించిన తర్వాత కొండ అంచు వెంబడి ఐదు మీటర్ల వెడల్పుతో నిర్మించిన రాళ్ల బాట ఎదురవుతుంది. ఈ దారి వెంట ప్రయాణిస్తే ఏడు దర్వాజాల కోటగా పిలుస్తున్న ప్రాంతంలోకి ప్రవేశించవచ్చు. అక్కడ పెద్ద బండరాళ్లతో నిర్మించిన పురాతన రాతిగోడ కనిపిస్తుంది. దాటుకుని లోపలికి వెళ్తే కోనేరుగా భావిస్తున్న భారీ గొయ్యి ఇతర నిర్మాణాలు కనిపిస్తాయి. కోట చుట్టూ నీటి నిల్వలు.. కోటలో నివసించే వారి నీటి అవసరాల కోసం కొండపై జలాశయాలు నిర్మించారు. ప్రహరీ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఐదెకరాల విస్తీర్ణంలో ఎండిపోయిన జలాశయం కనిపించింది. ఈ చెరువు నిండి పొర్లిపోయే నీటిని ఒడిసి పట్టేందుకు దిగువన కిలోమీటరు దూరంలో మరో చిన్న జలాశయం కనిపిస్తుంది. వీటిని స్థానికులు దర్వాజాల కోట పెద్దచెరువు, చిన్నచెరువని పిలుస్తారు. ఈ రెండూ గూగుల్ మ్యాప్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవి కూడా నిండిన తరువాత 15 కిలోమీటర్ల దూరంలో అరిశెలగండిలో నీరు కలుస్తుంది. ఈ గండి నుంచి చివరగా నీళ్లు గోదావరిలో కలుస్తాయి. 7వ శతాబ్దం నాటి కోట, ఆలయం..? మల్లూరులో హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఉంది. హేమచలక్షేత్ర మహత్యం అనే పుస్తకంలో ఈ కోటకు సంబంధించిన పలు విశేషాలు పొందుపరిచారు. సరైన ఆధారాలు లేకపోయినా 7, 8, 9వ శతాబ్దం లేదా ప్రతాపరుద్రుడి కాలంలో నిర్మించి ఉండవచ్చని ఆ పుస్తకంలో అంచనా వేశారు. కాకతీయుల పతనం అనంతరం ఈ కోట నుంచి చీనాబ్ఖాన్ పరిపాలించాడు. విజయనగర సామ్రాజ్యానికి చెందిన కొండమర్సు నేతృత్వంలోని సైనిక పటాలము చీనాబ్ఖాన్పై దాడిచేసి ఈ కోటను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడి వల్ల కోటలో కొంతభాగం ధ్వంసమైంది. కాలక్రమంలో ఈ కోట, ఆలయ ప్రాభవం మరుగున పడిపోయాయి. 18వ శతాబ్దంలో వెలమ దొరల కాలంలో మల్లూరు ఆలయం వెలుగులోకి వచ్చింది. మరింత పరిశోధిస్తే.. ఇప్పటివరకు పరిశోధకులు కోటకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించలేదు. తాము చూసిన ప్రదేశాలు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం రాతిగోడ సుమా రు 30 కి.మీ. ఉంటుందని అంచనా. తెలంగాణ పర్యాటకశాఖ అభివృద్ధి సంస్థ ప్రోత్సాహంతో తెలంగాణ సోషల్ మీడియా ఫోరం చేపట్టిన పర్యటనతో దర్వాజ గుట్టలు వెలుగులోకి వచ్చాయి. హేమాచలం, కోపిరిగుట్ట, ముసలమ్మగుట్ట, దర్వాజాల గుట్టలపై మరిన్ని పరిశోధనలు చేస్తే మరిన్ని అంశాలు వెలుగుచూసే అవకాశముంది. -
టాప్ పాస్వర్డ్.. 123456
వాషింగ్టన్: 2016వ సంవత్సరంలో ప్రపంచంలో అత్యధికులు ఉపయోగించిన పాస్‌వర్డ్స్‌లో ‘123456’ ప్రథమ స్థానంలో నిలిచింది. తరువాతి స్థానాల్లో ‘123456789’, క్వెర్టీ(క్యూడబ్ల్యూఈఆర్టీవై) నిలిచాయి. కోటి సెక్యూరిటీ కోడ్స్‌ను పరిశీలించి పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే, టాప్ 10లోని నాలుగు పాస్‌వర్డ్స్‌లో ఆరు లేదా అంతకు తక్కువ కేరక్టర్లే ఉన్నాయి. టాప్‌టెన్‌లో 123123, 111111, 987654321 కూడా ఉన్నాయి. హ్యాకింగ్ ముప్పు అధికంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి సులభ పాస్వర్డ్స్ పెట్టుకోవడం ఆత్మాహత్యాసదృశ్యమేనని పరిశోధకులు పేర్కొన్నారు. -
అదా విషయం.. అయితే ‘రైట్ రైట్’
మెదడు పరిణామక్రమానికి చేతివాటానికి లింకు మనలో 90 శాతం మంది కుడిచేతివాటం వారే! ఎందుకలా? దీని వెనుక కారణం ఏంటి? మానవ మెదడు పరిణామక్రమానికి ఈ అలవాటుకు ఏమైనా సంబంధం ఉందా? పరిశోధకులు తాజాగా ఈ ప్రశ్నల గుట్టు విప్పారు. మనుషుల్లో అనాదిగా మెజారిటీ ప్రజలు చాలా పనులకు ఎడమచేతిని కాకుండా కుడిచేతినే వాడడానికి గల కారణాలను విశ్లేషించగా ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగుచూశాయి. ఈ అలవాటుకు కారణం మనుషుల చేతుల్లో కాదు వారి పళ్లలో దొరికింది! అంతేకాదు కుడిచేతివాటానికి, మనిషి మెదడు పరిణామ క్రమానికి కూడా దగ్గరి సంబంధం ఉన్నట్టు తేలింది. ఆదిమానవుల పరికరాల ద్వారా.. మన మెదడును నిలువుగా చూస్తే రెండువైపులా రెండు సమ భాగాలుగా కనిపిస్తుంది. ఎడమవైపు భాగం.. భాష, కదలికలకు సంబంధించిన పనులను నియంత్రిస్తే, కుడి భాగం చూపు, దూరం, దగ్గర వంటి అంశాలను నియంత్రిస్తుంది. కానీ మెదడులో ఒకవైపు భాగం.. రెండోవైపు భాగంతో పోలిస్తే అత్యంత క్రియాశీలకంగా ఉంటుంది. ఈ భాగంలోనే క్లిష్టమైన పనులను మెదడు నిర్వర్తిస్తుంది. ఈ కీలక భాగానికి, చేతివాటానికి దగ్గరి సంబంధం ఉందని పరిశోధకులు తేల్చారు. ఆదిమానవులు వాడిన రాతి పరికరాల ద్వారా ఈ అంచనాకు వచ్చారు. ఆఫ్రికాలోని కెన్యాలో 33 లక్షల సంవత్సరాల క్రితం ఆదిమానవులు వాడిన రాతి పరికరాలు దొరికాయి. వాటి తయారీ, వినియోగం విధానాన్ని విశ్లేషించగా.. అవన్నీ కుడిచేతివాటం వారికి అను కూలంగా ఉన్నట్టు తేలింది. అలాగే మెదడులోని క్రియాశీలక భాగానికి కుడిచేతివాటానికి దగ్గరి సంబంధం ఉన్నట్టు గుర్తించారు. పళ్లపై చారికలు.. ఐరోపాలో నియాండర్తల్ దశకు చెందిన కొన్ని మానవ అస్తిపంజరాలపై సైంటిస్టులు పరిశోధనలు చేశారు. ఇందులో నోటి ముందుభాగంలోని ఎడమవైపు పళ్లపై కొన్ని బలమైన గీతలు, చారికలు కన్పించాయి. ఇవి ఎలా ఏర్పడి ఉంటాయన్న దిశగా అధ్యయనం చేశారు. ఏదైనా పరికరాన్ని సాగదీసి నోటిలో బిగించి పట్టుకొని, కుడిచేతితో పని చేస్తున్న సమయంలో పొరపాటున అది తెగి పంటికి తాకడం వల్ల ఆ చారికలు ఏర్పడినట్టు గుర్తించారు. ఈ అంచనాకు వచ్చేందుకు నోటికి రక్షణగా గార్డులు ధరించి కుడిచేతితో పనిచేస్తూ ఇదే తరహా ప్రయోగం చేశారు. ఇందులో సరిగ్గా ఎడమవైపు ఉన్న పళ్లకు దెబ్బ తగిలి చారికలు ఏర్పడ్డాయి. దీంతో అప్పటివారు కుడిచేతి వాటంవారేనని పరిశోధకులు ఓ అంచనాకు వచ్చారు. -
మరణ సమయాన్ని గుర్తించొచ్చు!
న్యూయార్క్: మృతదేహంలోని కొన్ని బ్యాక్టీరియాల ఆధారంగా చనిపోయిన సమయాన్ని కచ్చితంగా తెలిపే నూతన పద్ధతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. మృత దేహంలోని నైక్రోబయోమ్ బ్యాక్టీరియా ను పరీక్షించి మరణించిన సమయాన్ని స్పష్టంగా చెప్పవచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ మేరకు న్యూయార్క్‌లోని సిటీ యూనివర్సిటీ (సీయూఎన్ వై)కి చెందిన పరిశోధకులు మానవుడి దేహంలోని నైక్రోబయోమ్లు, పలు సూక్ష్మజీవులపై పరిశోధన నిర్వహించారు. కుళ్లిపోయిన 21 మృతదేహాల చెవి, నాసికానాళంలోని నమూనాలను సేకరించి మెటాజెనామిక్ డీఎన్ఏ అనుక్రమణం ద్వారా పరిశీలించినట్లు నాథన్ హెచ్ లెంట్స్ అనే శాస్త్రవేత్త చెప్పారు. -
దెయ్యం పామును ఎప్పుడైనా చూశారా?
న్యూయార్క్: సాధారణంగా పాములంటేనే భయపడతాం. అలాంటిది దెయ్యం పాము ఎదురుపడితే...? ఇంకేముందీ.. అది కాటేయకముందే ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఖాయం. ఇంతకీ దెయ్యం పాములు కూడా ఉంటాయా..? ఇదే ప్రశ్న శాస్త్రవేత్తలను అడిగితే.. ఇదిగో ఇక్కడ కనిపించే ఫొటో చూపిస్తూ.. ఇదే దెయ్యం పాము అని చెబుతున్నారు. ఇప్పటికే వేల రకాల పాములను గుర్తించిన శాస్త్రవేత్తలు ఆఫ్రికాలోని మడగాస్కర్ అడవుల్లోగల అంకారానా నేషనల్ పార్కులో ఈ పామును గుర్తించారట. బూడిద రంగులో ఉండి.. మిగతా పాములతో పోలిస్తే భిన్నమైన చారలతో చూడ్డానికి అతి భయంకరంగా ఉందట. దీని శరీరంపై నిలువు చారలుండడం దీని ప్రత్యేకతగా చెబుతున్నారు. దీని కణజాలాన్ని సేకరించడంతోపాటు డీఎన్ఏ పరీక్షలు చేయగా ఇది ప్రత్యేకమైన జాతికి చెందిన పాము అని, ఇలాంటివి సాయంత్రం, రాత్రి వేళల్లో మాత్రమే సంచరిస్తాయని చెప్పారు. ఈ లక్షణం ఉన్నందునే దీనికి ‘గోస్ట్ స్నేక్’(దెయ్యం పాము) అని పేరు పెట్టామంటున్నారు. -
డిప్రెషన్‌ను ప్రతిబింబించే ఇన్‌స్ట్రాగ్రామ్ ఫిల్టర్
ఇన్‌స్ట్రాగ్రామ్ ఫిల్టర్ మీరు గ్రహించిన దానికంటే ఎక్కువగానే మీ మానసిక ఆరోగ్యం గురించి తెలుపుతుందట. ఇన్‌స్ట్రాగ్రామ్ ఫోటోలతో యూజర్ల డిప్రెషన్‌ను విశ్లేషించవ్చని రీసెర్చర్లు కనుగొన్నారు. పోస్టు చేసే ఫోటోల లక్షణాలు ప్రకాశవంతం, రంగు బట్టి ఏ యూజర్లు నిరాశలో ఉన్నారో తెలుసుకోవచ్చని హార్వర్డ్, వెర్మాట్ యూనివర్సిటీ రీసెర్చర్లు తెలిపారు. డిప్రెషన్లో లేనివారు వాలెన్సియా ఫిల్టర్‌ను, డిప్రెషన్లో ఉన్నవారు ఇంక్వెల్ ను మోస్ట్ పాపులర్ ఫిల్టర్లుగా వాడుతున్నట్టు రీసెర్చర్లు కనుగొన్నారు. తక్కువ ప్రకాశవంతంగా, సంతృప్తికరంగా లేని ఫోటోలు, డిప్రెషన్ లెవల్స్ అత్యధిక స్థాయిలో ఉన్నట్టు ప్రతిబింబిస్తున్నాయని వెల్లడించారు. కంప్యూటర్ మాంద్యమంలో 70 శాతం మంది డిప్రెషన్లో ఉన్నట్టు రీసెర్చర్లు గుర్తించారు. 166 ఇన్‌స్ట్రామ్ యూజర్లతో సుమారు 13వేల ఫోటోలపై రీసెర్చుర్లు ఈ అనాలిసిస్ చేపట్టారు. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను గుర్తిండంలో సోషల్ మీడియా చాలా చౌకగా, తేలికగా ఉపయోగపడుతుందని రీసెర్చర్లు తెలిపారు. -
కలకాలం కవలల జీవితం...!
ఒక్కరుగా పుట్టినవాళ్ల కంటే కవల పిల్లలైతే దీర్ఘాయుష్షు ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. వాళ్లు ఆడపిల్లలైనా కూడా మామూలు వాళ్ల కంటే జీవితకాలం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో తెలిసింది. సాధారణంగా కవల పిల్లల మధ్య సామాజిక సంబంధాలు చాలా బలంగా ఉంటాయని, ఇది కూడా అందుకు ఓ కారణం కావచ్చని అంటున్నారు. అందులోనూ.. పోలికలు కలవని వాళ్ల కంటే బాగా కలిసిపోయే కవలలైతే మరింత ఎక్కువ కాలం బతుకుతున్నట్లు తేలిందని పరిశోధనకు నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ప్రొఫెసర్ డేవిడ్ షారో తెలిపారు. డెన్మార్క్‌లో 1870, 1900 సంవత్సరాల మధ్య పుట్టిన 2,932 మంది కవల పిల్లల జీవన స్థితిగతులను పరిశీలించిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు. తర్వాత మొత్తం డేనిష్ ప్రజలు ఏ వయసులో మరణించారో అనే సమాచారంతో దీన్ని పోల్చిచూశారు. బాధలో ఉన్నప్పుడు ఓదార్చేందుకు ఎవరో ఒకరు తోడు ఉండటం.. ఆరోగ్యం బాగోలేనపుడు దగ్గరుండి చూసుకోవడం.. ఇలాంటి వాటివల్ల కవలలు ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా ఉంటారట. ఈ పరిశోధన వివరాలు ప్లస్ వన్ అనే జర్నల్‌లో ప్రచురితం అయ్యాయి. -
పురుషులకే గుండెపోటు ముప్పు ఎక్కువ
వాషింగ్టన్ : అమెరికాలోని ప్రతి తొమ్మిది మంది పురుషుల్లో ఒకరు, అలాగే ప్రతి 30 మంది స్త్రీలలో ఒకరు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్నారని నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. అమెరికాలో ఏటా సుమారు 4.5 లక్షల మంది గుండెపోటుతో మరణిస్తుంటే వారిలో పురుషులే ఎక్కువగా ఉన్నారు. 45 సంవత్సరాల లోపున్న పురుషుల్లో 10.9 శాతం మంది అకస్మాత్తుగా గుండెపోటుకు గురవుతుంటే, అదే వయసున్నా స్త్రీలు కేవలం 2.8 శాతం మందికి మాత్రమే ఆకస్మిక గుండెపోటుకు గురవుతున్నారని పరిశోధనలో వెల్లడైంది. ఎలాంటి గుండె సంబంధిత వ్యాధులు లేని 5,200 మందిపై దశాబ్దం పాటు పరిశోధనలు జరిగాయి. వీరిలో 375 మంది అకస్మాత్తుగా గుండెపోటుతో మృత్యువాత పడుతున్నారు. ప్రధానంగా రక్తపోటు, కొలెస్ట్రాల్, స్మోకింగ్, డయాబెటిస్ వంటివి గుండెపోటుకు ప్రధాన కారణమని వారు తెలిపారు. -
కొత్త మలేరియా వ్యాక్సిన్ కనిపెట్టారు..
మెల్బోర్న్ః మలేరియా నివారణకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కొత్త వ్యాక్సిన్ ను కనిపెట్టారు. ఎర్ర రక్తకణాలను హరించి మలేరియాకు కారణమయ్యే క్రిములను ఎదుర్కొనేందుకు నూతన యాంటీ మలేరియా చికిత్సను అభివృద్ధి చేశారు. వాల్తేర్ అండ్ ఎలీజా హాల్ ఇనిస్టిట్యూట్ కు చెందిన ప్రొఫెసర్ అలాన్ కౌమాన్ నేతృత్వంలో జరిపిన పరిశోధనల్లో, ఎర్ర రక్తకణాల్లోకి కీ ప్రొటీన్లు పంపించడం ద్వారా మలేరియాకు కారణమయ్యే క్రిములు లోపలికి చొచ్చుకొని వెళ్ళలేవని తెలుసుకున్నారు. దోమకాటుద్వారా వ్యాప్తి చెందే మలేరియా వ్యాధి తీవ్రంగా ప్రబలుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా 30 కోట్ల నుంచి 50 కోట్ల మలేరియా కేసులు నమోదవుతున్నాయి. మలేరియా సోకినవారిలో ప్రతియేటా 4.5 లక్షలమంది దాకా చనిపోతున్నారు. అంతేకాక చిన్నపిల్లల్లో పెరుగుదలను కూడ దెబ్బతీసే ఈ వ్యాధి... గర్భిణీలకు మరింత ప్రమాదకరం. అటువంటి వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స చేస్తే అనేకమంది ప్రాణాలు కాపాడవచ్చని అధ్యయనకారులు చెప్తున్నారు. అందుకే ప్రభుత్వాలు మలేరియా నివారణకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. వ్యాక్సిన్లను అందించడమే కాక, పల్లెల్లో, పట్టణాల్లో పరిశుభ్రతపై కూడ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా 5 ఏళ్ళలోపు వయసున్న పిల్లలపై మలేరియా ప్రభావం అధికంగా ఉంటోందని, దోమల్లో గ్రహణ శక్తి పెరగటంతో ఇప్పటికే మార్కెట్లో ఉన్న యాంటీ మలేరియల్ మందులు ప్రభావం తగ్గుతోందని, అందుకే కొత్త పరిశోధనలద్వారా మలేరియా క్రిములను ఎదుర్కొనే మందులను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నట్లు అధ్యయనకారులు చెప్తున్నారు. కౌమాన్ బృందం తాజాగా ఆర్ హెచ్ 5, ఆర్ ఐపీఆర్, సీవై పీఆర్ ఏ మొదలైన మూడు ప్రొటీన్లను కలిపి, ఆరోగ్యంగా ఉన్న మానవ రక్త కణాల్లోకి పంపించడంద్వారా మలేరియాకు కారణమయ్యే క్రిములను ఎదుర్కోవచ్చునని కనుగొన్నారు. ఇలా చేయడంవల్ల మలేరియా క్రిములు ఎర్ర రక్తకణాలను హరించలేకపోయాయని తమ పరిశోధనలద్వారా తెలుసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రొటీన్లతో టీకాలు వంటివి అభివృద్ధి చేసి, వ్యాక్సిన్లుగా ఇవ్వొచ్చని కౌమాన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మలేరియాకు కొత్త వ్యాక్సిన్లను అభివృద్ధి పరిచే పరిశోధనలకు ప్రాధాన్యత పెరిగిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అనేక వ్యాక్సిన్లకు మలేరియా క్రిములు అలవాటు పడిపోయాయని, ఈ పరిస్థితుత్లో కొత్త చికిత్సల అవసరం ఎంతైనా ఉందన్నారు. సెల్ హోస్ట్ అండ్ మైక్రోబ్ జర్నల్ లో కౌమాన్ బృందం.. తమ తాజా పరిశోధనలను నివేదించారు. -
వ్యాధులను కనిపెట్టే ‘ఈ- ముక్కు’
హోస్టన్: శ్వాసని విశ్లేషించి ఆరోగ్య పరిస్థితిని తెలిపే ఈ-ముక్కుని పరిశోధకులు తయారుచేశారు. దీన్ని తయారుచేసిన బృందంలో భారత సంతతికి చెందిన వ్యక్తి కూడా ఉన్నాడు. దీని ఖరీదు కూడా అందరికీ అందుబాటులోనే ఉంటుందంటున్నారు. కొన్ని సెమీకండక్టర్లను ఉపయోగించడం ద్వారా ఇలాంటి పరికరాలు శ్వాసని విశ్లేషించగలవు. కానీ ఇవి బాగా ఖరీదైనవి. వీటిలో సీఎంఓఎస్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను ఉపయోగించడం ద్వారా వీటి ధర భారీగా తగ్గనుందని తెలిపారు. సీఎంఓఎస్ అనేది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను ఉత్పత్తి చేసే ఓ సాంకేతిక పరిజ్ఞానం. దీన్ని స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లలో ఉపయోగిస్తారు. మనకు ఏదైనా వాసన వస్తుందంటే గాలిలో జరిగే రసాయన మార్పులు మనకు తెలుస్తున్నట్లే. ఈ-ముక్కు కూడా అదే పద్ధతిలో పనిచేస్తుంది.ఇది మనకు వచ్చే అనేక వ్యాధులను ముందుగా పసిగట్టగలదు. 2018నాటికి అందుబాటులోకి రానుంది. -
మీ చెయ్యే టచ్ ప్యాడ్ గా మారితే..!
ఇప్పటివరకు టచ్ ప్యాడ్‌ను వస్తువు స్క్రీన్ మీద ఉపయోగిస్తూ వచ్చాం. త్వరలో గాలిలో కూడా టచ్ చేయొచ్చనే విషయాన్ని సైతం విన్నాం. కానీ, మన చేతి మీద టచ్ చేస్తే కదిలే ఆప్షన్లను ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు చూసేయండి. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రజ్ఞులు ఈ తరహా వాచీని తయారుచేశారు. అదేంటి చేతిమీద టచ్ చేయొచ్చని.. వాచీ అంటున్నారు అనుకుంటున్నారా..? ఆ వాచీని చేతికి పెట్టుకుని మీ మరో చేతి వేలికి ఉంగరాన్ని పెట్టుకుని వాచీ పెట్టుకున్న చేతిమీద టచ్ చేస్తే చాలు.. వాచీలో అప్లికేషన్స్ ఓపెన్ అయిపోతాయి. సాధారణ టచ్ ఫోన్ మాదిరిగానే మనం ఆ వాచీని చేతి మీద టచ్ చేస్తూ ఉపయోగించుకోవచ్చు. ఉంగరాన్ని ధరించిన వేలు చర్మాన్ని తాకినపుడు వాచీలో అమర్చి ఉన్న వస్తువులకు తక్కువ, ఎక్కువ ఫ్రీక్వెన్సీ రేంజిలతో తరంగాలు చేరి టచ్ రన్ అవుతుందని పరిశోధకులు వివరించారు. -
పక్షిపిల్ల ఎగరడం ఎలా నేర్చుకుంటుందంటే
న్యూయార్క్: పక్షిపిల్లలు తొలిసారి ఎగిరేందుకు రెక్కలకంటే ముందుగా కాళ్ళను ఉపయోగిస్తాయని పరిశోధకులు తేల్చారు. పక్షిపిల్లలు ఎగరడాన్ని ఎలా నేర్చుకుంటాయన్నదానిపై అమెరికా శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. సాధారణంగా పక్షులు ఎగిరేందుకు పెద్ద రెక్కలు, వాటి శరీర నిర్మాణం ఉపయోగపడుతుంది. కానీ, పక్షిపిల్లలకున్న చిన్నరెక్కలు, వాటి శరీరం ఎగరడానికి సహకరించవు. తమకున్న ఈ పరిమితుల వల్లే పక్షిపిల్లలు ఏటవాలుగా గానీ, పాక్షికంగా గానీ ఎగరలేవ ని శాస్త్రవేత్తలు తెలిపారు. పక్షిపిల్లలు ఎగిరేందుకు ముందుగా డైనోసారస్ అవశేషాలుగా ఉన్నటువంటి కాళ్ల సాయంతో నెమ్మదిగా రెక్కలు అల్లాడించి ముందుగా ఎగిరేందుకు ప్రయత్నిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. -
అలాంటి బాస్‌లతో అనారోగ్యం!
లండన్: పరిమితికి మించి పనిచేయాలని డిమాండ్ చేసే మేనేజర్లు ఉద్యోగుల ఆరోగ్యానికి హాని చేసే అవ కాశముందని సర్వేలో తేలింది. లండన్‌లోని ఈస్ట్ ఆంగ్లియా వర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. ‘ఉద్యోగులపై ఒత్తిడి పెంచితే వారు అనారోగ్యంతో గైర్హజరవుతారు. తొలిసారిగా విధులకు హాజరు కావాలనే ఆరాటం, అనారోగ్యం వల్ల గైర్హాజరీ, ‘మార్పుకు యత్నించే నాయక త్వం’ మధ్య సంబంధాన్ని పరిశీలించారు. తొలిదశలో ఈ నాయకత్వంతో ఉద్యోగుల్లో సానుకూల ఫలితాలొచ్చినా, తర్వాత పరిస్థితులు మారాయి. 155 మంది డెన్మార్క్ పోస్టల్ సిబ్బందిపై అధ్యయనం జరపగా సహోద్యోగులకన్నా 14 రోజులుఅధికంగా పనిచేసిన వారిలో అనారోగ్యాన్ని గుర్తించారు. -
పొగరాయుళ్లకు ఆదాయమూ తక్కువే
లాస్ ఏంజె లెస్: ధూమపానం వల్ల ఆయుష్షుకే కాదు ఆదాయానికీ గండి పడుతోంది. ఇటీవల జరిపిన పరిశోధనల్లో ఈ విషయాలు వెలుగుచూశాయి. పొగతాగని వారితో పోలిస్తే, పొగతాగే వారే తక్కువగా సంపాదిస్తున్నారని అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వెల్లడించారు. శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన 217 మంది నిరుద్యోగులను ఎంచుకొని పరిశోధకులు వారి జీవన స్థితిగతులను తెలుసుకున్నారు. ఇందులో 109 మంది పొగతాగేవారు కాగా, మిగతావారు పొగతాగని వారు. ఏడాది తర్వాత వీరిలో పొగతాగని వారు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగం సంపాదించారు. పొగతాగే వారు, తాగని వారి కంటే గంటకు 5డాలర్లు తక్కువగా సంపాదిస్తున్నట్లు ఈ పరిశోధన లో తేలింది. -
గుండెపోటును నియంత్రించవచ్చు!
పరిశోధకుల్లో భారత సంతతి వ్యక్తి టొరంటో: సాధారణ ఔషధాలతో గుండెపోటును నియంత్రించవచ్చని పరిశోధకులు గుర్తించారు. శాటిన్స్ (కొలెస్ట్రాల్ తగ్గించేవి), యాంటీహైపర్‌టెన్సివ్ (బీపీని తగ్గించే) ఔషధాలు వాడితే గుండెపోటు బారిన పడకుండా ఉండొచ్చని చెప్పారు. శాటిన్స్, యాంటీహైపర్‌టెన్సివ్ మందుల్లో ఏదో ఒకటి వాడినా, లేదా రెండు మందులను వాడినా గుండెపోటును నియంత్రించవచ్చన్నారు. పరిశోధకుల్లో భారత సంతతికి చెందిన వ్యక్తి ఉండటం విశేషం. కెనడాలోని హామిల్టన్ హెల్త్ సెన్సైస్, మెక్‌మాస్టర్ యూనివర్సిటీ పాపులేషన్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన పరిశోధకులు 21 దేశాలకు చెందిన 12వేలకు మందికిపైగా రోగులను అధ్యయనం చేసి ఈ విషయం చెప్పారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా గుండెపోటుతో 1.8 కోట్ల మంది మరణిస్తుండగా, 5 కోట్ల మంది గుండెపోటు బారిన పడుతున్నారు. ఏటా 10 శాతం మంది గుండెపోటు బారిన పడుతుండగా, 20 నుంచి 30 శాతం మంది ఈ ఔషధాలతో ప్రయోజనం పొందుతున్నారన్నారు. -
స్పీడ్ రీడింగ్ వల్ల ప్రయోజనాలు శూన్యమే..!
స్పీడ్ రీడింగ్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయంటూ వివిధ సంస్థలు కోచింగ్ క్లాస్ లు, యాప్ లతో ఊదరకొడుతుంటే... అదంతా వృధా ప్రయాసేనంటున్నారు అధ్యయనకారులు. ఎంతటి సమాచారాన్నయినా స్పీడ్ రీడింగ్ ప్రాక్రిస్ తో గుర్తు పెట్టుకోవచ్చన్న వాదాన్ని వారు తప్పుబడుతున్నారు. స్పీడ్ రీడింగ్ పై జరుగుతున్న ప్రచారానికి అర్థం లేదని, వేగంగా పఠించడం వల్ల విషయాలు గుర్తుండవని, హాయిగా... ప్రశాంతంగా చదివినదే ఎక్కువకాలం గుర్తు పెట్టుకునే అవకాశం ఉంటుందన్నది పరిశోధకుల వాదన. వేగ పఠనంపై అందుబాటులో ఉన్న యాప్ లు, టెక్నిక్ లను అధ్యయనం చేసిన పరిశోధకులు వాటివల్ల ఎటువంటి ప్రయోజనం లేదంటున్నారు. దశాబ్దాల కాలంగా జరిగిన పరిశోధనలను పరిశీలించిన అధ్యయనకారులు స్పీడ్ రీడర్స్ చదివిన విషయాలను గుర్తు పెట్టుకోలేకపోతున్నట్లుగా చెప్తున్నారు. ఈ మెయిల్, సామాజిక మీడియా ప్రపంచంలో స్పీడ్ రీడింగ్ అవసరమౌతుందే తప్పించి దీర్ఘ కాల ప్రయోజనాలకు అవసరం లేదంటున్నారు. అతి పెద్ద పుస్తకాల్లో రాసిన విషయాన్ని అప్పటికప్పుడు చదివి, తక్కువ సమయం గుర్తుపెట్టుకొనేందుకు స్పీడ్ రీడింగ్ షార్ట్ కట్ మెథడ్ అని, విజ్ఞాన శాస్త్రంలో అది ఓ చిన్న ఆధారం మాత్రమే అని పరిశోధనల్లో తేలిందని సైకలాజికల్ సైంటిస్టుల బృందం చెప్తోంది. దశాబ్దాల కాలంగా స్పీడ్ రీడింగ్ కోర్సులు ఉండగా... ఇటీవల కన్జూమర్ మార్కెట్లో స్పీడ్ రీడింగ్ టెక్నాలజీల సంఖ్య భారీగా పెరిగిపోయిందని, శాన్ డియాగోలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా సైకలాజికల్ సైంటిస్ట్ ఎలిజబెత్ స్కాటర్ చెప్తున్నారు. తక్కువ సమయంలో చదవడం వల్ల, విషయాన్ని అర్థం చేసుకోవడం, గుర్తుపెట్టుకోవడం తక్కువగానే ఉంటుందని ఆమె వివరిస్తున్నారు. పఠనం అనేది మనసుకు, కళ్ళకు సంబంధించిన ప్రక్రియ అని, ఎంతో నైపుణ్యం కలిగిన వారు నిమిషానికి సుమారు 200 నుంచి 400 పదాలు చదవగల్గుతారని అంటున్నారు. కంప్యూటర్ లేదా మొబైల్ స్క్రీన్ మధ్యభాగంలో వెంట వెంటనే పదాలు ప్రదర్శించడంద్వారా వేగ పఠనం అలవర్చుకొనేందుకు స్పీడ్ రీడింగ్ టెక్నాలజీలు ప్రోత్సహిస్తున్నాయి. అయితే ఈ ప్రక్రియ సరైనది కాదని, ఇందులో జరిగిపోయిన పదాన్ని తిరిగి చదివేందుకు, వాక్యనిర్మాణానికి అవకాశం లేదని, ఇలా స్పీడ్ గా కదిలిపోయే పదాల్లో పది శాతం పదాలను మాత్రమే కళ్ళు చూడగల్గుతాయని పరిశోధకులు చెప్తున్నారు. మన దృష్టి, సామర్థ్యం కలిపితేనే వ్యాక్య నిర్మాణం జరుగుతుందని అప్పుడే చదవడం వల్ల ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. భాష పట్ల అవగాహన లేకుండా స్పీడ్ గా చదివే సమర్థతను పెంచడం వల్ల ఏమీ లాభం లేదంటున్నారు. అయితే విషయాలపట్ల సమగ్ర అవగాహన ఉండి, వేగంగా చదివేవారికి ఇది వర్తించదంటున్నారు. చదువుతున్న విషయంపై ఆసక్తి అధికంగా ఉండి, ఎక్కువ విషయాన్ని తెలుసుకోవాలన్న ఉత్సుకత ఉన్నవారికి ఈ స్పీడ్ రీడింగ్ ది కొంత ప్రయోజనకరంగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలిందని చెప్తున్నారు. ఆరోగ్యకరమైన పఠనాశక్తి కలిగి ఉండాలంటే మాత్రం విషయంపట్ల అవగాహన అవసరం అని, అది మోతాదు ప్రకారం పెంచుకోవడమే అన్ని రకాలుగా శ్రేయస్కరమని అధ్యయనకారులు తేల్చి చెప్తున్నారు.